కాంగ్రెస్‌, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయి: కేటీఆర్‌ | BRS Working President KTR Slams Congress And BJP | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయి: కేటీఆర్‌

Feb 27 2026 4:07 PM | Updated on Feb 27 2026 4:16 PM

BRS Working President KTR Slams Congress And BJP

హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ కేసులో చివరికి న్యాయమే గెలిచిందన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌,.  ఢిల్లీ లిక్కర్‌ కేసు సాకుతో కేజ్రీవాల్‌ సర్కారు కూల్చారని,  ఆ కేసు వల్ల బీఆర్‌ఎస్‌ నష్టపోయిందన్నారు కేటీఆర్‌. ఈ కేసులో కాంగ్రెస్‌, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయమన్నారు. రాజకీయ కుట్రలో భాగమే ఈ కేసు అని తేలిపోయిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

ఫామ్‌హౌజ్‌కు కేటీఆర్‌ బయల్దేరి వెళ్లనున్నారు. ఎర్రవల్లి  ఫామ్‌హౌజ్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో..కేటీఆర్‌ భేటీ కానున్నారు.తాజా పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించనున్నారు కేటీఆర్‌. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌తో పాటు కవితకు క్లీన్‌చిట్‌ అంశాలను చర్చించే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి:

లిక్కర్‌ కేసులో క్లీన్‌చిట్‌.. కవిత స్పందన ఇదే

లిక్కర్‌ కేసులో కే​‍జ్రీవాల్‌కు ‍క్లీన్‌ చిట్‌, మాజీ సీఎం భావోద్వేగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement