కుట్రలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు: లక్ష్మీపార్వతి | YSRCP Leader Lakshmi Parvathi Fires On Chandrababu Conspiracy Over Tirumala Laddu Ghee Issue, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

కుట్రలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు: లక్ష్మీపార్వతి

Feb 27 2026 2:41 PM | Updated on Feb 27 2026 3:38 PM

Ysrcp Leader Lakshmi Parvathi Fires On Chandrababu Conspiracy

సాక్షి, తాడేపల్లి: కుట్రలకు కేంద్రం, పాపాలకు కేంద్ర బిందువు చంద్రబాబు అంటూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిస్సిగ్గు రాజకీయాలు చంద్రబాబుకే చెల్లు అని దుయ్యబట్టారు. ‘‘చేసిన పాపాలు పండాయి.. ఇక శిక్ష అనుభవించటమే తరువాయి.. చంద్రబాబుకు దేవునిపై ఏమాత్రం భక్తి లేదు. దేవుడ్ని నమ్మనని 1995లోనే చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తి కాబట్టే తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు.

‘‘వైఎస్ జగన్ మీద దారుణమైన విమర్శలు చేశారు. దొంగదారిలో ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు జీవితం అంతా అత్యంత వివాదాస్పదమే. యూనివర్సిటీలో కూడా రెడ్డి, కమ్మల మధ్య గొడవలు పెట్టారు. తన అవసరాలకు ఎవర్నయినా, ఎలాగైనా వాడతారు. ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో పార్టీని వాడుకుంటున్నారు. మోదీని తీవ్రంగా విమర్శలు చేసి మళ్లీ ఆయన చెంతకే చేరారు. కాంగ్రెస్‌ని విమర్శలు చేసి మళ్లీ అదే పార్టీకి చేరారు.

..అతి పేదరికంలో పుట్టిన చంద్రబాబుకు డబ్బు మీద విపరీతమై ఆశ ఉంది. లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదు. ఏ మమకారం లేని చంద్రబాబు తన భార్యను కూడా రాజకీయాలకు వాడుకున్నారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్లు సంపాదించారు. ఎన్నిసార్లు సీఎం అయినా ఏపీకి ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా?

..ఎవరో తెచ్చిన ప్రాజెక్టును తానే తెచ్చానని గొప్పగా చెప్పుకుంటారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతులు. హెరిటేజ్ సంస్థలోని వాటాదారులను కూడా బలవంతంగా బయటకు పంపారు. కుట్రలకు కేరాఫ్ అడ్రెస్ చంద్రబాబు. ఆయన చదువుకునే సమయంలో పరీక్షలను కూడా వేరే వారితో రాయించి పాస్ అయ్యారు. ఆయన చెప్పుకునే వయసు కూడా కరెక్టు కాదు. షూ లేకుండా దేవుని పూజలు ఎప్పడైనా చేశారా?. దేవుడ్ని రాజకీయాల్లోకి తెచ్చిన చంద్రబాబు కఠినమైన శిక్ష అనుభవిస్తారు. రాయలసీమ లిఫ్టును ఆపేసి ఆ ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. లడ్డూలో కల్తీ నెయ్యి వెనుక హెరిటేజ్ ఉందని తేలింది.

ఎలా ముంచావో అందరికి తెలుసు.. హేరిటేజ్ బాగోతాన్ని బయటపెట్టిన లక్ష్మి పార్వతి

..అసెంబ్లీలోనూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు. చంద్రబాబు చేసే ఆరోపణలు చూస్తుంటే ఆయనకు మైండ్‌ పని చేయటం లేదని అర్థం అవుతోంది. అందుకే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై ఆరోపణలు చేస్తున్నారు. సుబ్బారెడ్డి భార్య మీద కూడా ఆరోపణలు చేశారంటే చంద్రబాబు అంత నీచుడు మరొకరు లేరు. హిందూ, క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్‌ని హతమార్చి ఆయన కుటుంబాన్ని సైతం కనుమరుగు చేసిన నీచుడు చంద్రబాబు’’ అంటూ లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement