సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామ జస్ట్ అలా కిందపడితేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి.. నిజంగా కస్టడీలో ఆయనను ఎవరైనా కొట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ తాజాగా ట్విట్టర్ వేదికగా.. రఘురామకు కాలు, చెయ్యి విరగటంపై స్పందించారు. ఈ సందర్బంగా సునీల్ కుమార్..‘రఘురామ జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా ఆయనను కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?. అది కూడా ఆయన వర్ణించిన అంత దారుణంగా కొడితే?. అబద్ధాలు బయట పడుతున్నాయి.. నిజం దాగదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడి లో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించిన అంత దారుణంగా కొడితే ?
అబద్ధాలు బయట పడుతున్నాయి… నిజం దాగదు pic.twitter.com/sdyw8IA0D7— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) February 27, 2026
ఇక, అంతకుముందు కూడా రఘురామపై సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీబీఐని ట్యాగ్ చేస్తూ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. సునీల్ నాయక్‌నే బెదిరించారంటే ఇక సీబీఐ కేసుల్లోని సాక్షులను కూడా రఘురామ బెదిరిస్తారని అన్నారు. అందుకు అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాక్షులను రక్షించడానికి నిందితుడు రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేయటమే సరైన మార్గం. ఈ విషయాలపై సీబీఐ దృష్టి సారించాలని దర్యాప్తు సంస్థను కోరారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రఘురామపై రూ.947 కోట్లు, రూ.238 కోట్లు ఎగ్గొట్టారనే రెండు కేసులపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.


