లడ్డూపై చర్చ.. కూటమి సర్కార్‌ పారిపోయింది: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు | AP Assembly Session On 27th Feb Live Updates | Sakshi
Sakshi News home page

లడ్డూపై చర్చ.. కూటమి సర్కార్‌ పారిపోయింది: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు

Feb 27 2026 10:08 AM | Updated on Feb 27 2026 2:56 PM

AP Assembly Session On 27th Feb Live Updates

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌..

అసెంబ్లీ మీడియా పాయింట్..

ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ కామెంట్స్‌..

  • తిరుమల లడ్డుపై చర్చ జరగకుండా స్టేట్‌మెంట్లు ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది
  • ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయో వినే ఓపిక లేదా మీకు?
  • మా అభిప్రాయం చెప్పనివ్వకుండా మా గొంతు నొక్కొద్దు
  • బుధవారం నాడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి.

ఎమ్మెల్సీ కుంభారవి కామెంట్స్‌..

  • చంద్రబాబు లడ్డు అపవిత్రంగా మారిపోయిందని ఆరోపణలు చేశారు
  • ఇలా మాట్లాడటం చాలా దురదృష్టం..
  • రాష్ట్ర ప్రజలకు నిజ నిజాలు తెలపాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీపై ఉంది
  • చంద్రబాబు శ్రీవారి లడ్డులో పంది కొవ్వు కలిసిందని విష ప్రచారం చేశారు
  • చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ నివేదికతో డిఫెన్స్‌లో పడింది.
  • సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రి పయ్యావుల కేశవ్‌ వ్యవహరిస్తున్నారు.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు
  • ఇందాపూర్, వైష్ణవి సంస్థలకు హెరిటేజ్‌కు ఉన్న సంబంధాలు ఏంటి
  • 350 రూపాయలు ఉన్న నెయ్యిని.. 650కి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు
  • మండలిలో మేము ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేక తోక ముడిచింది

 

ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కామెంట్స్‌..

  • శాసన మండలిలో లడ్డు గురించి స్వల్పకాలిక చర్చపై కూటమి ప్రభుత్వం భయపడింది
  • స్వామి వారి కీర్తిని.. ప్రతిష్టను రాజకీయం చేసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు
  • తిరుమల వెంకన్నను అవమానించిన నాయకుడు చంద్రబాబు
  • హిందువులను రెచ్చగొట్టి వైఎస్‌ జగన్‌కు దూరం చేయాలని చంద్రబాబు చూశారు
  • నోటితో కూడా మాటలు రాని విధంగా విష ప్రచారం చేశారు
  • సిట్ రిపోర్టు వచ్చాక.. కొత్త కెమికల్ అని హడావిడి చేశారు
  • దేవదేవుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది చంద్రబాబు.
  • రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకోవడం మానేయండి..
  • ఇప్పటికైనా స్వామి వారికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
  • హెరిటేజ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి..
  • శాసనమండలిలో లడ్డుపై చర్చ జరిగే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు

ఎమ్మెల్సీ  అప్పిరెడ్డి కామెంట్స్

  • ఈరోజు శాసనమండలిలో కూటమి నేతల తీరు ప్రజాస్వామ్యం తలదించుకునేలా ఉంది
  • తిరుమల తిరుపతి లడ్డు అంశంలో ఇందాపూర్‌, హెరిటేజ్ బంధాలు బయటపడ్డాయి
  • చంద్రబాబు మాట్లాడిన మాటలు హిందువులు కూడా మాట్లాడటానికి ఇష్టపడరు
  • చంద్రబాబు తన స్థాయి దిగజార్చుకుని మాట్లాడారు
  • నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి.. దౌర్భాగ్యంగా మాట్లాడారు
  • రాజకీయ స్వలాభం కోసం వైఎస్సార్‌సీపీపై బురద వేయాలని ఆలోచనతో చంద్రబాబు మాట్లాడారు..
  • చంద్రబాబు రాజకీయ కోణంలోనే కాకుండా ఆర్థిక ప్రయోజనాల ఉద్దేశించి మాట్లాడారు.
  • ఇందాపూర్‌ను ముందుంచి హెరిటేజ్‌కు కోట్లాది రూపాయలు దోచి పెట్టేందుకు చేసిన కుట్ర ఇది.
  • కూటమి తప్పుడు ప్రచారంలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
  • కూటమి సర్కార్‌కు ధైర్యం ఉంటే ఎందుకు చర్చించడం లేదు. 
  • మండలిలో మూడు గంటలుగా మేము నిరసనలు తెలిపాం.
  • కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలు. 
     

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన 

  • అసెంబ్లీ..
  • అసెంబ్లీ ఆవరణలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
  • లడ్డుపై చర్చ జరుపనందుకు ఎమ్మెల్సీల నిరసన
  • రోడ్డు మీద బైఠాయించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన 

మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన..

  • లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం పలాయనం..
  • చర్చకు అంగీకరించని ప్రభుత్వం.. అట్టుడుకుతున్న శాసన మండలి.
  • చర్చకోసం సభలోనే ధర్నాకు దిగిన వైఎస్సార్‌సీపీ.
  • చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్‌సీపీ సభ్యుల పట్టు. 
     

 

బీఏసీ మీటింగ్‌ బాయ్‌కాట్‌..

  • శాసనమండలి..
  • బీఏసీ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్‌సీపీ సభ్యులు.
  • లడ్డు ప్రసాదంపై చర్చ జరపాలని ఆందోళన కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు.

మీడియా పాయింట్..

ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి కామెంట్స్‌..

  • మంత్రి సభను ఆపించారు..
  • చైర్మన్‌కి తెలియకుండా మంత్రి స్టేట్‌మెంట్ చదువుతామని అన్నారు..
  • ఐదు రోజులుగా వాయిదా తీర్మానం ఇస్తున్నాం..
  • చర్చకి వస్తామని చెప్పారు..
  • చర్చకి మాత్రం రాలేదు..
  • చర్చకు కూటమి నేతలు భయపడుతున్నారు.
  • చర్చకి వచ్చే వరకు పట్టుబడతాం.

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్‌..

  • ప్రభుత్వం చర్చకి భయపడుతుంది..
  • చర్చకి వస్తామని చెప్పి వాయిదా వేయించారు..
  • టీడీపీలో అక్రమాలు బయట పడతాయని పారిపోతున్నారు..
  • హెరిటెజ్, ఇందాపూర్, వైష్ణవి మధ్య సంబంధాలు బయట పడతాయని భయపడుతున్నారు
  • తన స్వార్థ ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డుపై కామెంట్స్ చేసారు..
  • చర్చ సాగే మా పోరాటం కొనసాగుతుంది..
  • బడ్జెట్‌పై కూడా చర్చ జరగాలి..


ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి కామెంట్స్‌..

  • నిజాలు బయటకి వస్తాయని వాయిదా వేశారు..
  • ఇందాపూర్, హెరిటెజ్‌పై సంబంధం బయట పడుతుంది అని భయపడ్డారు..
  • రాయలసీమ ఎత్తిపోతలని కూటమి ఆపేసింది..
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి
     

సభలో గందరగోళం మధ్య మండలి వాయిదా.. 

  • వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్‌.
  • అధికార పక్షం సభలో​ చర్చను అడ్డుకోవడం సరికాదన్న చైర్మన్‌.
  • మండలిలో లడ్డూపై చర్చను దారి మళ్లించే ప్రయత్నం.
  • అవసరమైతే 4, 5 తేదీల్లో చర్చిద్దామన్న మంత్రి అచ్చెన్నాయుడు. 
  • లడ్డూపై చర్చించేందుకు భయమెందుకు? అని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ 
  • సభ వాయిదా పడినా సభలోనే ఆందోళన కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీ సభ్యులు
     

మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం..

  • లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కర్షన్ సందర్భంగా సభ పునః ప్రారంభం అయినప్పుడు ప్రశ్నోత్తరాలు మళ్ళీ మొదలు పెట్టాలనటం సరికాదు.
  • మంత్రి పయ్యావుల కేశవ్ నాపై మాట్లాడిన వ్యాఖ్యలు అవాస్తవం..
  • నేను సంతకం చేశానని ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ కాదు.. అంటూ ఆగ్రహం 
  • అధికార, ప్రతిపక్షాలు సభ సజావుగా జరగటానికి సహకరించాలి..
  • మీరు రాజకీయాలు చేసుకోండి.. కానీ, కుర్చీని అవమానించవద్దు. 

 

👉శాసన మండలి సమావేశాలు ప్రారంభం.. 
అసెంబ్లీ

  • అసెంబ్లీ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ధర్నా
  • అసెంబ్లీ బయట రోడ్డుపై ధర్నా చేసున్న ఎమ్మెల్సీ లు
  • తిరుమల లడ్డుపై చర్చ చేపట్టాలని ధర్నా
  • మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
  • తిరుపతి లడ్డు ప్రసాదం అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం
  • వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం


చర్చ కొనసాగించాలి: బొత్స

  • శాసన మండలి
  • తిరుమల లడ్డు పై చర్చ కొనసాగించాలన్న ప్రతిపక్ష నాయకుడు బొత్స
  • సభలో చర్చ ప్రారంభించిన తరువాత వాయిదా పడిన కారణంగా..
  • ఈరోజు కూడా చర్చ కొనసాగించాలని నిన్న మండలి చైర్మన్‌కు, సెక్రటరీ జనరల్‌కు బొత్స విజ్ఞప్తి
     

Advertisement
 
Advertisement
Advertisement