డిప్యూటీ ఎమ్మార్వో సంధ్య ప్రేమ వివాహం.. వరుడి దారుణ హత్య | Deputy MRO Sandhya Love Marriage Incident In East Godavari | Sakshi
Sakshi News home page

డిప్యూటీ ఎమ్మార్వో సంధ్య ప్రేమ వివాహం.. వరుడి దారుణ హత్య

Feb 27 2026 8:47 AM | Updated on Feb 27 2026 10:22 AM

Deputy MRO Sandhya Love Marriage Incident In East Godavari

సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారపూడి శివారు వేములపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంధ్య దారుణ హత్యకు గురైంది. కులాంతర వివాహం చేసుకున్న కోపంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె భర్తను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జెడ్‌ మేడపాడకు చెందిన సంధ్య డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే, సంధ్య.. వేములపల్లి కి చెందిన బట్టల వ్యాపారి సూర్య ప్రకాష్ రావును ప్రేమించింది. ఈ క్రమంలో వీరిద్దరూ అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, పెళ్లి అయిన కొన్ని గంటలకే  అర్ధరాత్రి వేములపల్లిలో సూర్య ప్రకాష్ రావుపై సంధ్య అన్నదమ్ములు విచక్షణ రహితంగా దాడి చేశారు.

తమ చెల్లెలు సంధ్య కులాంతర వివాహం చేసుకున్న కోపంతో సూర్య ప్రకాష్‌ను రాళ్లతో కొట్టి చంపారు. రాళ్ల దాడి కారణంగా సూర్య ప్రకాష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement