పీపీ.. పీపీపై కూపీ | - | Sakshi
Sakshi News home page

పీపీ.. పీపీపై కూపీ

Feb 27 2026 7:34 AM | Updated on Feb 27 2026 7:34 AM

పీపీ.

పీపీ.. పీపీపై కూపీ

తాళ్లపూడి: ఉగాది నాటికి అంటే 15 రోజుల్లో పోశియ్య ఇంటి పనులు పూర్తి చేసి అప్పగిస్తామని జిల్లా హౌసింగ్‌ పీడీ నాతి బుజ్జి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మలకపల్లికి వచ్చిన సమయంలో చర్మకారుడు సమండ్ర పోశియ్య(పోశిబాబు)కు ఇచ్చిన హామీ నెరవేరలేదని వివరిస్తూ ‘పీపీ.. పీపీ.. ఢాంఢాం’ అనే శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు తక్షణం స్పందించారు. పోశియ్య ఇల్లు బాగు చేయించడంతో పాటు, చెప్పుల కొట్టు పెట్టుకోవడానికి సాయమందిస్తామని అప్పట్లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరలేదనే పోశియ్య ఆవేదనకు సాక్షి అక్షర రూపమిచ్చింది. దీంతో గురువారం హౌసింగ్‌ పీడీ నాతి బుజ్జి, కొవ్వూరు హౌసింగ్‌ ఈఈ వేణుగోపాలరావు, ఇతర శాఖల అధికారులు పోశియ్య ఇంటిని పరిశీలించారు. పోశియ్యను అడిగి ఇప్పటి వరకు చేసిన పనులు, ఇంకా ఏం చేయాలన్న వివరాలు తెలుసుకున్నారు. తన పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి అన్ని పనులు చేయించి పెడతానని చెప్పారని పోశియ్య అన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరారు. అయితే గ్రామంలో కొట్టు పెట్టుకోవడానికి ఇప్పటి వరకు స్థలం చూపించలేదని తెలిపారు. సరకులు, బడ్డీ కొట్టు సిద్ధంగా ఉందని చెప్పారు. జిల్లా హౌసింగ్‌ పీడీ బుజ్జి మాట్లాడుతూ ఇప్పటి వరకు పోశియ్య ఇంటికి ప్లాస్టింగ్‌, ఇంటి ఎలివేషన్‌, కబోర్డులు, బాత్‌రూం నిర్మాణం తదితర పనులు చేశామన్నారు. ఫ్లోరింగ్‌కు టైల్స్‌, కిచెన్‌లో కిటికి, ఇంటి వద్ద పరిసరాల లెవలింగ్‌, బాత్‌రూంకు ప్లాస్టింగ్‌, పైకప్పు వంటి పనులు కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఉగాది నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ.2.60 లక్షలు ఖర్చు చేశామని, మరో రూ.20 వేలు ఉపాధి హమీ ద్వారా ఖాతాలో వేశామన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. చెప్పులు దుకాణం పెట్టుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.లక్ష చెక్కు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే పోశియ్య సరకులు, కొట్టు కొనుగోలు చేశారని, కొట్టు పెట్టుకోవడానికి రెవెన్యూ అధికారులు స్థలం గుర్తిస్తారని తెలిపారు. హౌసింగ్‌, డీఆర్‌డీఏ డ్వామా, రెవెన్యూ అధికారులు కలిసి పనిచేస్తారని పీడీ తెలిపారు. మొత్తంగా రూ.5 లక్షల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇన్‌చార్జి ఏఈ దాదాసాహెబ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

‘సాక్షి’ కథనానికి తక్షణ స్పందన

చర్మకారుడు పోశియ్యతో మాట్లాడిన

హౌసింగ్‌ పీడీ, ఇతర అధికారులు

ఉగాది నాటికి ఇంటి పనులు

పూర్తిచేసి ఇస్తామని ప్రకటన

పీపీ.. పీపీపై కూపీ1
1/2

పీపీ.. పీపీపై కూపీ

పీపీ.. పీపీపై కూపీ2
2/2

పీపీ.. పీపీపై కూపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement