breaking news
East Godavari District News
-
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని,, పెద్దాపురం మండలంలో తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి మంగళవారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు జిల్లా నలుమూల నుంచీ ఆలయానికి చేరుకోవడం ప్రారంభమైంది. వేకువజామున 3.30 నుంచి 4 గంటల వరకూ స్వామి వారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ఆధ్వర్యాన సుప్రభాత సేవ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఉచిత, రూ.20, రూ.50 క్యూలలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించారు. స్వామివారిని ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మ న్ తుమ్మల బాబు దర్శించుకుని, పూజలు చేశారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదాలుగా అందజేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాన్ని పూలతో అలంకరించారు. -
ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు
● నిబంధనలు అతిక్రమిస్తే జైలుకే ● జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ సూచన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సర వేడుకల్లో పాటించాల్సిన నియమ నిబంధనలపై మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీటిని పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యహరించే వారికి జైలు తప్పదని హెచ్చరించారు. ● ప్రభుత్వం నిర్దేశించిన సమయం ముగిసిన వెంటనే మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు విధిగా మూసివేయాలి. ● మద్యం తాగి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. అటువంటి వారికి చట్ట ప్రకారం భారీ జరిమానాలతో పాటు, వారం రోజుల వరకూ జైలు శిక్ష తప్పదు. ● మద్యం తాగిన వారు ఆల్కహాల్ స్థాయి 30 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఉన్నచోటు నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలి. దీనిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తాం. ● బైకులపై విన్యాసాలు, రేసింగ్‌ల వంటివి చేసిన వారిపై రౌడీ షీట్లు తెరుస్తాం. ● రోడ్లపై, ర్యాష్ డ్రైవింగ్, జిగ్‌జాగ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ● మైనర్ బాలబాలికలు తల్లిదండ్రులు లేకుండా రాత్రి వేళ తిరగరాదు. ● రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి వేళ కేక్ కటింగ్‌లు, మందుగుండు సామగ్రి కాల్చడం, ఇతర వేడుకలు పూర్తిగా నిషేధం. ● అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత సరైన కారణం లేకుండా రోడ్లపై తిరగరాదు. ● న్యూ ఇయర్ వేడుకల్లో ఈవెంట్ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఎటువంటి శాంతిభద్రతల సమస్యలూ తలెత్తకుండా బాధ్యత వహించాలి. ● బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకల్లో సౌండ్ సిస్టమ్‌లు, లౌడ్ స్పీకర్ల వినియోగించరాదు. శబ్ద కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తాం. ● మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాం. పోలీసులు, శక్తి టీములు మఫ్టీలో రంగంలోకి దిగుతాయి. ● నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు అన్ని రకాలుగా బందోబస్తు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన రోడ్లు, ముఖ్యమైన జంక్షన్ల వద్ద పికెట్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలతో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. ● న్యూ ఇయర్ వేడుకల ముసుగులో పేకాటలు, కోడిపందేలు, జూదం వంటివి నిర్వహించినా, ఆడినా, అశ్లీల నృత్యాలు నిర్వహించినా ప్రత్యేక బృందాల ద్వారా రైడ్లు నిర్వహిస్తాం. ● పోలీస్ కంట్రోల్ రూము నుంచి సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తాం. -
చంద్రబాబుది స్కాముల ప్రభుత్వం
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబుది స్కాముల ప్రభుత్వమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. 2025 సంవత్సరం చంద్రబాబు స్కాముల మయంగా మారిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాలతో పాటు.. సూపర్ 6, సూపర్ 7 పథకాలంటూ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టారని చెప్పారు. నేడు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశంలోనూ ఒక్కో స్కామ్ వెలుగు చూస్తోందన్నారు. పేదలు కొత్తగా ఒక్క పెన్షన్ మంజూరుకు మాత్రం నోచుకోవడం లేదని, చంద్రబాబు తన వాళ్లకు ప్రభుత్వ ఆస్తులను పంచిపెట్టేసి, అందులో నుంచి కమీషన్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయల భూములను లీజుల పేరిట చౌకగా కట్టబెట్టేస్తున్నారన్నారు. రాజధాని పనుల విలువలు పెంచేసి నిబంధనలకు విరుద్ధంగా తనవారికే కట్టబెట్టి దోచుకుంటున్నారన్నారు. ఆలయ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. బిల్లు కట్టలేదని సాక్షాత్తూ విజయవాడ దుర్గ గుడికే కరెంటు కట్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తోందని వేణు ప్రశ్నించారు. తిరుపతి, సింహాచలం ఆలయాల్లో అమాయక భక్తులు చనిపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శమని దుయ్యబట్టారు. మాట నిలబెట్టుకోలేని వ్యక్తి పాలన ఎలా ఉంటుందో చంద్రబాబును చూస్తే అర్థమవుతుందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతు ప్రాణాలు కోల్పోవడం చంద్రబాబు వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రతి పనిలోనూ చంద్రబాబు స్వార్థం తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండటం లేదని అన్నారు. ప్రజల్లో భయాన్ని సృష్టించి, వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకోవాలని మాత్రమే చూస్తున్నారన్నారు. ఉద్యోగులు ప్రజలకు మాత్రమే జవాబుదారీ, వారు పని చేయాల్సింది ప్రజలకోసమేనని వేణు స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాలకు అభ్యంతరం చెప్పాలని, కానీ, రాష్ట్రంలో వ్యవహారం అందుకు విరుద్ధంగా సాగుతోందని, ఇది ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చారని చెబుతూ, ప్రత్యర్థి నోట ప్రశంస పొందిన వారే నిజమైన పాలన అందించినట్లని, పేరు మార్పు ద్వారా జగన్ పాలన బంగారమని చంద్రబాబే ఒప్పుకున్నట్లయ్యిందని విశ్లేషించారు. 2025 చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలికి.. 2026వ సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో ఆనందాలు తీసుకు రావాలని వేణు ఆకాంక్షిస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా ముఖచిత్రం
జిల్లా కేంద్రం : రాజమహేంద్రవరం విస్తీర్ణం : 2,560.7 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం : 89.9 చదరపు కిలోమీటర్లు రెవెన్యూ డివిజన్లు : 2 మండలాలు : 19 (ఇకపై 22) మున్సిపల్ కార్పొరేషన్ : 1 మున్సిపాలిటీలు : 2 (మండపేటతో కలిపి ఇకపై 3) రెవెన్యూ గ్రామాలు : 272 గ్రామ పంచాయతీలు : 300 ఓటర్లు : 16 లక్షలకు పైగా.. -
కట్టెదుట వైకుంఠం..
● రత్నగిరిపై ఘనంగా ‘ముక్కోటి’ వేడుకలు ● ఉత్తర ద్వారం నుంచి సత్యదేవుడు, అమ్మవారి దర్శనం ● వేకువజాము నుంచే వేచి ఉన్న భక్తులు ● సాయంత్రం వరకూ రద్దీ అన్నవరం: పాల కడలిలో శేషశయ్యపై ఉత్తరాభిముఖంగా తల పెట్టి పవళించిన శ్రీమహావిష్ణువులా సత్యదేవుడు.. ఆయన పాదాలు ఒత్తుతూ శ్రీమహాలక్ష్మిగా అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు.. సర్వాలంకార భూషితులై భక్తులకు దర్శనమిచ్చిన ముక్కోటి ఏకాదశి పర్వదినమైన మంగళవారం.. రత్నగిరి అపర వైకుంఠంలా శోభిల్లింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు వేకువజామున 3 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరారు. స్వామివారి ప్రధానాలయంలో ఉత్తర ద్వారం వద్ద సుగంధభరిత పుష్పాలంకరణతో శోభిల్లుతున్న మండపంలో స్వామి, అమ్మవార్లకు తెల్లవారుజామున 4 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్టుకు స్వర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించి, పంచహారతులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను స్వామి, అమ్మవార్ల ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు 2 గంటల సమయం పట్టింది. ఉత్తర ద్వార దర్శనానంతరం భక్తులు తూర్పు ద్వారం నుంచి ప్రధానాలయంలోకి ప్రవేశించి సత్యదేవుడు, అమ్మవార్లను, దక్షిణ ద్వారం నుంచి వెలుపలకు వచ్చి, దిగువన యంత్రాలయాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగింది. అనంతరం, భక్తులను యథావిధిగా గర్భాలయంలోకి దక్షిణ ద్వారం నుంచి సత్యదేవుని దర్శనానికి అనుమతించారు. కూరగాయలతో ప్రత్యేకంగా వండిన కదంబం ప్రసాదాన్ని స్వామి, అమ్మవార్లకు నివేదించిన అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ఆకట్టుకున్న పుష్పాలంకరణ ముక్కోటి ఏకాదశి సందర్భంగా సత్యదేవుని ప్రధానాలయంలో చేసిన పుష్పాలంకరణ అందరినీ ఆకట్టుకుంది. స్వామివారి ఆలయానికి దారి తీసే ఉత్తరం వైపు మెట్లను రంగురంగుల విద్యుద్దీపాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చిన మండపాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానాలయం, అనివేటి మండపం ముందు సత్యదేవుడు, అమ్మవారి నమూనా విగ్రహాల వద్ద పుష్పాలంకరణ పలువురిని ఆకర్షించింది. ఈ రెండుచోట్లా చాలా మంది భక్తులు ఫొటోలు దిగారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో వెండి రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం 11 గంటలకు పండితుల ప్రత్యేక పూజల అనంతరం, ఈఓ త్రినాథరావు దంపతులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. రథం లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు.స్వామి, అమ్మవార్ల ఉత్తర ద్వార దర్శనానికి వెల్లువెత్తిన భక్తులుఅనివేటి మండపం వద్ద ఆకట్టుకున్న పుష్పాలంకరణ -
జాతీయ స్థాయి హాకీకి ఎంపిక
చాగల్లు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) అండర్–19 జాతీయ స్థాయి హాకీ పోటీలకు చాగల్లు గ్రామానికి చెందిన ఉయ్యూరు శాంతి ఎంపికై ంది. స్థానిక వ్యాయామోపాధ్యాయిని జె.విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. గత నెల 19 నుంచి 22వ తేదీ వరకూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగిన ఎస్జీఎఫ్ఐ అండర్–19 రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో శాంతి అత్యద్భుత ప్రతిభ చూపింది. తద్వారా జనవరి 2 నుంచి 6వ తేదీ వరకూ గ్వాలియర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆమెను ప్రధానోపాధ్యాయులు వాసవి, ఇతర ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్పర్సన్ నందిని, గ్రామస్తులు అభినందించారు. ఏపీఎన్జీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాధవరావు రాజమహేంద్రవరం సిటీ: ఏపీఎన్జీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మీసాల మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు మంగళవారం రాజమహేంద్రవరంలో జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ విజయకృష్ణ. కోశాధికారిగా ఎం.సత్యనారాయణరాజు, సహాధ్యక్షుడిగా త్రినాథ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.ధర్మేంద్ర, ఎస్కే ఖాసిం సాహెబ్, కె.కేదారేశ్వరరావు, షేక్ సత్తార్, జి.ఆశవల్లి, మహిళా ఉపాధ్యక్షురాలిగా వి.కమల, కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా ఎన్వీఎస్ ప్రతాప్, పి.ఆనందరావు, కె.కృష్ణప్రియ, సీహెచ్ ఆంజనేయులు, షఫియా, మహిళా సంయుక్త కార్యదర్శిగా సూర్యకల్పన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఎస్బీవీ రాంప్రసాద్ తెలిపారు, సహాయ ఎన్నికల అధికారిగా సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, పరిశీలకుడిగా షేక్ నాగూర్ షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కార్యదర్శి మాధవరావు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు రామ్మోహనరావు, కార్యదర్శి మూర్తిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలి రాజమహేంద్రవరం సిటీ: చిరకాల డిమాండ్ అయిన ఐదు రోజుల పనిదినాల సాధనకు నిరంతర పోరాటం సాగిస్తామని బ్యాంక్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు తెలిపారు. ఈమేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యాన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంబాల చెరువు బ్రాంచి వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సంఘం నాయకుడు లక్ష్మీపతి మాట్లాడుతూ, పదేళ్లుగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు తమ ప్రథాన డిమాండ్‌ను పెడచెవిన పెడుతున్నాయని ధ్వజమెత్తారు. పాపారావు మాట్లాడుతూ, బ్యాంకుల్లో ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో మిగతా రంగాల మాదిరిగానే బ్యాంకు ఉద్యోగులకు కూడా ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
రత్నగిరి.. వివాదాలే సరి..
● అన్నవరం దేవస్థానానికి చేదు జ్ఞాపకాలు ● కలిసిరాని 2025 ● పెరగని ఆదాయం, కానరాని అభివృద్ధి ● పాత ఈఓ వివాదాస్పద నిర్ణయాలుఅన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి 2025 పెద్దగా కలిసి రాలేదు. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆదాయంలో కానీ, నిర్మాణాలలో కానీ పెద్దగా పురోగతి లేకుండానే ఏడాది జరిగిపోయింది. దీనికి తోడు రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ముఖ్యంగా పాత ఈఓ సుబ్బారావు వైఖరిపై అనేక విమర్శలు వచ్చాయి. ఆయన 2024 డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దేవస్థానంలో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పెరిగింది. ప్రొటోకాల్‌తో సంబంధం లేకుండా సినిమా, టీవీ, జబర్దస్ నటులతో పాటు, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల బంధువులకూ బ్రహ్మరథం పట్టడం, పాలనలో అనుభవ లేమి దేవస్థానాన్ని వివాదాల పాలు చేశాయి. భక్తులకు కొంచెం ఊరట 2025లో దేవస్థానంలో పూర్తి చేసిన ఏకై క నిర్మాణం రూ.కోటితో చేపట్టిన రెండో మెట్లదారి ఒకటే అని చెప్పవచ్చు. మిగిలిన పనులన్నీ భక్తుల రద్దీకి అనుగుణంగా చేసిన ఏర్పాట్లే. దాదాపు పదేళ్లుగా ఇదిగో.. అదిగో అంటూ సాగిన కేంద్ర ‘ప్రసాద్ ’ స్కీం నిర్మాణాలకు ఈ ఏడాది టెండర్లు ఖరారయ్యాయి. సుమారు రూ.20 కోట్ల కేంద్ర నిధులతో అన్నదాన భవనం, భక్తులు వేచి ఉండే భవనం, టాయిలెట్ల బ్లాకుల నిర్మాణాలు జరుగుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారస్ కంపెనీ 2023లో వాగ్దానం చేసిన విశ్రాంతి షెడ్డును.. రెండేళ్ల తరువాత ఈ ఏడాది నిర్మించడం భక్తులకు ఊరట నిచ్చే విషయం. ఆదాయంలోనూ వెనుకంజ శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రాన్ని 2024లోనే కూల్చివేసి నూతన సత్రం నిర్మించాల్సి ఉంది. కానీ దాన్ని కూల్చివేయాలా, వద్దా అనే మీమాంసలోనే 2025 ఏడాది గడిచిపోయింది. చివరకు గత నెలలోనే ఈ సత్రాన్ని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త సత్రం నిర్మాణానికి అనుమతి రావడంతో ఆ పనులు మొదలయ్యాయి. ఆదాయ పరంగా దేవస్థానం పెద్డగా ముందడుగు వేయలేదు. గతేడాది రూ.135 కోట్ల ఆదాయం, రూ.134 కోట్ల వ్యయం ఉంటే, ఈసారి కూడా ఆదాయానికి సమానంగా వ్యయం పెరిగింది. సేవల్లో చివరి ర్యాంకు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు విచ్చేసిన భక్తులకు ఆయా దేవస్థానాలు అందించిన సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. దానిలో అన్నవరం దేవస్థానానికి గత ఫిబ్రవరిలో చివరాఖరు ఏడో ర్యాంకు వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్.. అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం కార్తిక మాసం ఏర్పాట్లను దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ స్వయంగా పర్యవేక్షించడంతో ఏ వివాదాలు లేకుండా జరిగాయి. ఆవు నెయ్యిపై.. స్వామి వారి ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని 2024 ఆగస్టు నుంచి సహకార డైయిరీ నుంచి కొటేషన్లపై కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి టెండర్ పిలవాలని కమిషనర్ ఆదేశాలివ్వగా ఈఓ అమలు చేయలేదు. దీంతో ఈఓపై దేవదాయశాఖ కార్యదర్శి హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నెల ఒకటిన టెండర్ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. సంగం డైయిరీ కేజీ రూ.639.90కు ఆవు నెయ్యి సరఫరా చేయడానికి లోయెస్ట్ టెండర్ కోట్ చేసి దక్కించుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యం అన్నవరం దేవస్థానాన్ని ఏడాది కాలంగా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టారన్న విమర్శలు బలంగా వినిపించాయి. దేవస్థానంలో ఉన్న చిన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను సైతం ప్రజాప్రతినిధులకు చెప్పడం, వారి సూచించిన వారినే నియమించడం జరిగింది. వివాదాస్పదం ఈఓ సుబ్బారావు ఇక్కడ నుంచి బదిలీ అయ్యాక కూడా ఆయన ఇచ్చిన ఉత్తర్వులు వివాదస్పదమయ్యాయి. గో ఆధారిత ఉత్పత్తులు, స్వామివారి పూజలు, వ్రతాలలో వాడిన పత్రి పూలతో చేసినవి అంటూ ఫినాయిల్, కాళ్ల పగుళ్ల నివారణ ఆయిల్ అమ్మకాలు చేస్తుండడం దుమారం రేపింది. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో వాటి విక్రయాలను దేవస్థానం నిలిపివేసింది. అలాగే పాలకొల్లులో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో కానుకలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఆరుగురు పురోహితులను సస్పెండ్ చేయడం సంచలనం రేపింది. ఈఓగా త్రినాథరావు దేవస్థానం ఈఓ (ఫుల్ అడిషనల్ చార్జి)గా ఈ నెల పదో తేదీన రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన దేవస్థానంలో పాలనను గాడిలో పెట్టడంతో పాటు సీతారామసత్రం నిర్మాణం ప్రారంభించడం, మెట్లదారి పెండింగ్ పనులు పూర్తి చేసి దానిని భక్తులకు అందుబాటులోకి తేవడం, ఇంకా దాతల సహకారంతో సత్యగిరిపై భక్తులకు ఉచితంగా వసతి ఇచ్చేందుకు డార్మెట్రీ నిర్మించడం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. 2027 పుష్కరాల కోసం ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పనిచేయాలి.పాలనా వైఫల్యాలు గత ఈఓ పాలనా వైఫల్యాలపై ఈ ఏడాది ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను వసతి సత్రాలలో ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ మార్చిలో ఈఓ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే ఈఓ కుమారుడు దేవస్థానంలో షాడో ఈఓగా వ్యవహరించేవారు. దానిపై వార్త రావడంపై సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దేవస్థానం సిబ్బందిని ఈఓ వేధిస్తున్నారన్న ఆరోపణలపై పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొందరు వలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. దీనిపై కూడా ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీనిపై కూడా వార్త రావడంతో ఆ సమస్య పరిష్కారమైంది. -
అమ్మవార్లను ఆకట్టుకునేలా..
రాయవరం: దేవుడిపై ఉన్న భక్తిని పలువురు వివిధ రకాలుగా ప్రదర్శిస్తుంటారు. దానిలో భాగంగా లొల్ల గ్రామానికి చెందిన సుతాపల్లి శిరీష వినూత్నంగా తన భక్తిని చాటుకున్నారు. చీరపై అష్టోత్తరం, గోవింద నామాలను రాసి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమర్పించారు. ఈ చీరను అమ్మవార్లకు అలంకరించేందుకు వినియోగించాలన్నారు. ఇప్పటి వరకు కాకినాడలోని కన్యకా పరమేశ్వరి, పిఠాపురంలోని పురూహుతికా అమ్మవారు, మండపేటలోని కన్యకా పరమేశ్వరి, లొల్లలోని శివాలయం, కాకినాడలో శ్రీపీఠం.. ఇలా తొమ్మిది ఆలయాల్లో అమ్మవార్లకు లలితా సహస్ర నామాలు రాసిన చీర్లను సమర్పించినట్లు తెలిపారు. రాయవరంలోని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు రెండు చీరలు, శ్రీవారికి పంచెను బహూకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకట రమణ, స్థానిక నేతలు పీఎస్ఆర్, తాడి రామచంద్రారెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, మంతెన అచ్యుత రామరాజు తదితరులు అభినందించారు. -
హైదరాబాదులో హత్య.. కోనసీమలో మృతదేహం
● వీడిన మహిళ అదృశ్యం మిస్టరీ ● ముగ్గురు నిందితుల అరెస్టు మామిడికుదురు: హైదరాబాద్‌లో హత్యకు గురైన ఓ మహిళ మృతదేహాన్ని జిల్లాలో పోలీసులు గుర్తించారు. నాచారం సీఐ కె.ధనుంజయ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మల్లాపూర్ బాబానగర్‌లో సూరెడ్డి సుజాత (65) నివాసం ఉంటోంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు ఆమె ఇంట్లో రెండు నెలల క్రితం అద్దెకు దిగాడు. సుజాత ఒంటరిగా ఉండడం, ఆమె ఒంటిపై బంగారాన్ని చూసిన అంజిబాబుకు దుర్బుద్ధి పుట్టింది. బంగారాన్ని కాజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 19న వంటగదిలో ఉన్న సుజాతపై వెనుక నుంచి దుప్పటి కప్పి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం పెరవలి మండలం ఖండవిల్లికి చెందిన స్నేహితుడు యువరాజు, అనకాపల్లికి చెందిన నూకల దుర్గారావు సహాయంతో ఈనెల 20వ తేదీన ఆ మృతదేహాన్ని అద్దె కారులో తీసుకువచ్చి గోదావరిలో పడేశాడు. కాగా.. సుజాత కనిపించడం లేదంటూ ఈ నెల 24న ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానంతో అంజిబాబును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి సమాచారం మేరకు పెదపట్నం గ్రామంలోని మధ్యలంకలో సుజాత మృతదేహాన్ని గుర్తించారు. బాగా పాడైపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
జనసేన నాయకుడి దాడి కేసుపై విచారణ
రాజోలు: ప్రజా సంఘాల నేతలపై దాడి, కుల దూషణకు పాల్పడిన జనసేన నాయకుడిపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ మంగళవారం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న జరిగిన శివకోటి ముసలమ్మ తల్లి ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చిన పాలపర్తి భవ్యశ్రీ ఇక్కడ మెట్లపై నుంచి పడి మృతి చెందింది. మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో భవ్యశ్రీ కుటుంబానికి మద్దతుగా రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్దకు జిల్లా మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యుడు జనుపల్లి సత్యానందం (నాని), రాజోలు నియోజకవర్గ బహుజన సమాజ్‌వాది పార్టీ ఇన్చార్జి ఆకుమర్తి భూషణం వచ్చారు. అక్కడ వారిపై జనసేన నాయకుడు పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి) దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణాధికారి అయిన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్ద నేరస్థలాన్ని, ఫిర్యాదు దారుడు, కేసులో కొందరు సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. -
క్యాన్సర్ రోగులకు అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నంవిశ): క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. ఆ హాస్పటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆ యూనిట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏపీలోనే తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్ల విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్‌గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్‌ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూర ల్): యుద్ధం అంటే మాంసం కోసం కుక్క ల కొట్లాట వంటిదంటూ కృష్ణుడికి ధర్మ రాజు విన్నవించుకుంటాడని సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఆయన మంగళవారం ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను వివరించా రు. ‘‘తమ తరఫున ద్యూత కార్యం నిర్వహించాల్సింది గా సోదరులు, భార్యతో కలసి కృష్ణ పరమాత్మకు ధర్మ రాజు విన్నవించుకుంటాడు. అయితే, రాజ్యం కోల్పో యి సంపాదించుకునే శాంతి మరణంతో సమానమని అంటాడు. కనీసం ఐదు ఊళ్లు ఇవ్వాలని అడిగాం. కానీ, మేం యుద్ధానికి భయపడ్డామని దుర్యోధనుడు భావించి, దానికి కూడా సిద్ధపడటం లేదు. క్షత్రియ వంశం నాశనం కాకూడదని భావించి, మేము ఐదు ఊళ్లు ఇవ్వాలని అడుగుతున్నాం. కృష్ణా, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించడానికి నీవు తప్ప మరొకరు లేరు’’ అని ధర్మరాజు అంటాడని చెప్పారు. ఈ మాట ల్లో శరణాగతి కనపడుతోందని, ఇలా ప్రతివారూ భగవంతుడిని ప్రార్థించాలని అన్నారు. కర్ణ దుర్యోధనుల ది ఆదర్శ మైత్రి కాదని, అవసరార్థం మైత్రి అని చెప్పారు. ‘‘అర్జునుడిని ఎదు ర్కొంటాడని భావించే కర్ణుడిని దుర్యోధనుడు చేరదీశాడు. అర్జునుడిని నిగ్రహించడానికి రాజాశ్రయం కావాలనే త లంపుతో దుర్యోధనుడి అండ చేరాడు క ర్ణుడు. సినిమాలో చూపినట్లు వీరు ఆద ర్శ స్నేహితులు కారు’’ అని సామవేదం వివరించారు. కులవివక్ష లేని నాటి కాలాన్ని కుల విద్వేషంతో నేడు కొందరు విమర్శిస్తున్నారని, సంజయుడు, విదురుడు ఏ కులానికి చెందిన వారైనా, వారిని ‘రాజర్షి’ అని, మహాప్రాజ్ఞ అని ధృతరాష్ట్రుడు సంబోధించడాన్ని గమనించాలని చెప్పారు. కృష్ణుడు ద్యూత కార్యానికి వస్తున్నాడన్న వార్త సంజయుని ద్వా రా విన్న ధృతరాష్ట్రుడు ‘కళ్లున్న వారు ఎంత అదష్టవంతులు’ అని ఆవేదన చెందుతాడని, పరమాత్మ మీద దృష్టి లేని వారందరూ అంధులేనని సామవేదం అన్నా రు. ‘ధృతరాష్ట్రునిలో రెండు ప్రవృత్తులున్నాయి. అంతఃకరణంలోని జీవుడొకరు, ఇంద్రియాలను అంటిపెట్టుకున్నది మరొకరు. ఇటువంటి స్వభావం అనేక మందిలో ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
నర్సరీ రైతుల సమస్యలు పరిష్కరించాలి
కడియం: నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కీర్తి చేకూరికి సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో ఆమెను అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, పాలకవర్గ సభ్యులు కలిశారు. మొక్కలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేటప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే అంతర్జాతీయ ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయన్నారు. సాయిల్ లెస్ మీడియాపై కోకోపిట్ స్టబిలైజేషన్, టిష్యూకల్చర్ ల్యాబ్ వంటి తదితర అంశాలపై చర్చించారు. కాగా.. తాము వివరించిన పలు అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అయ్యప్ప తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా ఉద్యానశాఖ అధికారి మల్లికార్జున, కడియం ఉద్యానశాఖ అధికారి లావణ్య, అసోసియేషన్ పాలకవర్గం బోడపాటి గోపి, కొండేపూడి నాగు, తాడాల నాగేశ్వరరావు, బాబ్జీ, పిల్లా శ్రీనివాస్, బోడపాటి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ నొడగల బుచ్చిరాజు పాల్గొన్నారు. రమ్యసుధకు జాతీయ ఉత్తమ పరిశోధన అవార్డురంగంపేట: అహ్మదాబాద్ సైన్స్ సిటీలో ఈ నెల 21న ఆల్ ఇండియా రామానుజన్ మ్యాథ్స్ క్లబ్, గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సదస్సులో రంగంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు రమ్యసుధ జాతీయ ఉత్తమ పరిశోధన ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు అయిన ఆమె అనేక పరిశోధనా వ్యాసాలు రాసి, పలు శాసీ్త్రయ ప్రాజెక్టులు తయారు చేసి, పలు ప్రదర్శనలలో ఉత్తమ బహుమతులు పొందుతున్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పదికి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. రమ్యసుధ పరిశోధనలు మన దేశంతో పాటు జపాన్, మలేషియా, నేపాల్ వంటి దేశాల్లో ప్రదర్శింపబడి సందర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కాగా.. రమ్యసుధను రంగంపేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి, ఉపాధ్యాయులు వీసీ జాకబ్, వరలక్ష్మి అభినందించారు. -
సూర్యబలిజల ఐక్యత కోసం వెబ్సైట్
సామర్లకోట: రాష్ట్రంలో ఐదు సంఘాలుగా ఉన్న సూర్యబలిజలను ఒకే తాటిపైకి తీసుకు రావడానికి సూర్యబలిజ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆ సామాజికవర్గ ఐక్య వేదిక నాయకులు అన్నారు. ఈ మేరకు స్థానిక గణపతినగరం వాటర్ ట్యాంకుల వద్ద మంగళవారం రాష్ట్ర సూర్యబలిజ సంఘ నాయకుడు జీవీకే మోహనరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్యబలిజ సంఘ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం.. సూర్యబలిజ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏలూరి సుబ్రహ్మణ్యం, జీవీకే మోహనరావు, వైబ్‌సైట్ రూపకర్త పైడిముక్కల ఆనంద్ మాట్లాడుతూ సూర్యబలిజ కులస్తులకు చంద్రబాబు ఇచ్చిన హామీ 18 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. ఈ వెబ్సైట్లో సూర్యబలిజ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కులస్తుల పేర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రాష్ట్రాల కమిటీల ఎన్నికలను ముఖ్య నాయకులు సమక్షంలో నిర్వహిస్తామన్నారు. సామాజికవర్గీయులందరూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రాష్ట్ర సూర్యబలిజ.కమ్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సంఘ అధికార ప్రతినిధి కాలే వెంకటరత్నం, ప్రముఖులు యండమూరి ఈశ్వరరావు, అల్లు భాస్కరరావు, కాకరపల్లి శ్రీధర్, బి.కామేశ్వరరావు, కాలే సతీష్ ప్రసాద్, పెండ్యాల ధర్మ తదతరులు పాల్గొన్నారు -
● ఇక దగ్గర పంటుగే
● యమడేంజరే మరి● పూత వేసి.. కనువిందు చేసిహెల్మెట్ ధరిస్తారా.. నా దగ్గరకు వస్తావా అంటూ వాహనదారులను యమ ధర్మరాజు వేషధారణలో ఓ కళాకారుడు హెచ్చరిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణపై చేపట్టిన అవగాహన కార్యక్రమం ఆకట్టుకుంది. జిల్లా ఎస్పీ బింధుమాధవ్ ఆదేశాలతో స్థానిక సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాకారులు యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణతో జగ్గంపేట ప్రధాన రోడ్డుపై ప్రజలల్లో ఇలా అవగాహన నింపారు. – జగ్గంపేట మామిడికి పూత వచ్చేసింది.. ఆ చెట్లకు కళ తెచ్చింది.. పాశర్లపూడిబాడవలోని 216 జాతీయ రహదారి పక్కన ఉన్న నిమ్మల అప్పారావు ఇంటి ప్రాంగణంలో మామిడిచెట్టు ఇలా పూత పూసింది. చెట్టుకు ఉన్న ఆకుల కన్నా పూతతో నిండుగా కనిపిస్తోంది. ఆ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరికీ కనువిందు చేస్తోంది. దేశవాళీ రకానికి చెందిన ఈ మామిడి చెట్టు ప్రతి ఏడాది ఇదే విధంగా పూత పూసి కాయలు కాస్తోందని అప్పారావు తెలిపారు. – మామిడికుదురు కోటిపల్లి – ముక్తేశ్వరం మధ్య పంటు ప్రయాణం సోమవారం నుంచి పునః ప్రారంభించారు. ఈ ఏడాది జూలైలో గోదావరికి వరదల కారణంగా మూతపడింది. అప్పటి నుంచి అమలాపురం వెళ్లాల్సిన ప్రయాణికులు సుమారు 54 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో వెళ్లేవారు. పంటు ప్రయాణం ప్రారంభించడంలో కేవలం 15 కిలోమీటర్లు వెళ్తే సరిపోతుందని ఆనందిస్తున్నారు. – కె.గంగవరం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
ముక్కోటికి ముస్తాబైన ‘వాడపల్లి’
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ముక్కోటి ఏకాదశికి సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయాన్ని రంగు రంగుల వుష్పాలు, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. దీనితో క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా స్వామివారి పూజాది కై ంకర్యాలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించనున్నారు. ఆలయ సంప్రదాయం అనుసరించి తొలుత ప్రముఖులకు స్వామి దర్శనం అనంతరం భక్తులకు కల్పించనున్నారు. రాత్రి 7 గంటల వరకూ వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం అదనపు ఏర్పాట్లు చేసినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే మించి భక్తులు తరలి వస్తారనే అంచనాతో అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా భద్రతా పరమైన చర్యలు చేపట్టామన్నారు. 400 మంది సేవకులను నియమించామన్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తులందరికీ తీర్థ, ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం నిరంతరాయంగా అందిస్తామన్నామన్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు -
యువకుడి దుర్మరణం
కడియం: స్థానిక కెనాల్ రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. జేగురుపాడు పరిధి పాములమెట్ట కాలనీకి చెందిన జగతా వీరవెంకట సత్యశివశంకర్ (19) మోటారు సైకిల్‌పై వెళుతూ కారును తప్పించబోయి ఎదురుగా వస్తున్న గ్రావెల్ లోడు లారీని ఢీకొని రోడ్డుపై పడిపోయాడని పోలీసులు తెలిపారు. దీంతో అతని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కడియం ఎస్ఐ ప్రసన్న ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మొబైల్ షాపులో చోరీ శంఖవరం: కత్తిపూడిలోని ఓ మొబైల్ షాపులో చోరీ జరిగినట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆ గ్రామంలోని తవ్వల రాజేష్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో చొరబడి 13 శ్యామ్‌సంగ్ ఫోన్లు దొంగిలించారు. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని బాధితుడు వివరించారు. క్లూస్ టీమ్‌తో వేలు ముద్రలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కరపలో భారీ చోరీ ఫ 31 కాసుల బంగారం అపహరణ కరప: వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి.. ఇంట్లోకెళ్లి బీరువా తెరచి చూస్తే బంగారు ఆభరణాలు, నగదు దోచుకుపోయిన ఘటన కరపలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో సోమవారం ఈ భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువా బద్దలు కొట్టి 31 కాసుల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు అపహరించుకుపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక నీలయ్యతోట వీధిలోని ఒక డాబాలో సలాది వీరవెంకట సత్యనారాయణ (వీరబాబు), అతని భార్య రాణి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరబాబు సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అతని భార్య రాణి ఒక ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరబాబు బయటకు వెళ్లారు. రాణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని స్కూల్‌కు వెళ్లారు. ప్రతి రోజూ ఆమె స్కూలుకెళ్లేటప్పుడు తలుపులకు తాళం వేసి, తన భర్తకు తెలిసేలా మేడ మెట్ల కింద ఒక డబ్బాలో తాళం పెడుతుండడం జరుగుతుంది. వీరబాబు పని నుంచి మధ్యాహ్నం సమయంలో వచ్చాక డబ్బాలోని ఆ తాళం తీసుకోవడం రోజూ జరుగుతూ వస్తోంది. వీరబాబు సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి, డబ్బు అవసరమై బీరువా లాకర్ తెరచి చూసేసరికి అందులోని బంగారు నగలు, రూ.లక్ష నగదు కనిపించలేదు. దీంతో కంగారుపడిన వీరబాబు కుటుంబ సభ్యులతో కలసి కరప పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరప ఎస్ఐ టి.సునీత సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను, పరిసర ప్రాంతాల వారిని పిలిచి వివరాలు అడిగారు. కాకినాడ నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఆ ప్రాంతాల్లో వేలుముద్రలు, ఆధారాలను సేకరించారు. దొంగలు మేడ మెట్ల కింద ఉంచే తాళం తీసుకుని ఇంట్లోకి ప్రవేశించి, బీరువా తెరచి బంగారు ఆభరణాలు, నగదును దోచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అంతా తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కరప పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటా..
● అధికారుల వద్ద ఓ వ్యక్తి నిరసన ● అడ్డుకున్న కలెక్టరేట్ సిబ్బంది బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తన సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని సోమవారం కాకినాడ కలెక్టరేట్లో ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్య పరిష్కరించకుంటే పురుగు మందు తాగుతానని జేబులో నుంచి తీయడంతో అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. కాకినాడ పెద్ద మార్కెట్‌కు చెందిన తాళ్లూరి కృష్ణమోహన్ తన స్థలం కబ్జాకు గురైందని కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో పలుమార్లు ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టరేట్‌కు వచ్చి తన సమస్య పరిష్కరించకుంటే ఇక్కడే చనిపోతానని జేబులో నుంచి పురుగు మందు డబ్బా బయటకు తీయబోగా, అక్కడే ఉన్న సిబ్బంది అతన్ని వారించి జేసీ అపూర్వ భరత్ వద్దకు తీసుకు వెళ్లారు. బాధితుడితో జేసీ మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాకినాడ త్రీ టౌన్ ఎస్ఐ భీష్మ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ విలేకర్లతో మాట్లాడుతూ కాకినాడ టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఒకే వేదికపైకి వక్క రైతులు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని వక్క రైతులు, వ్యాపారులు ఒకే వేదికపైకి వస్తున్నారు. ఇందులో భాగంగా జనవరి 5న మండపేట రూరల్ మండలం ద్వారపూడి సమీపంలో వేములపల్లిలోని భవాని గార్డెన్స్‌లో సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వక్క ఆదర్శ రైతులు దొరయ్యచౌదరి, ఉప్పలపాటి చక్రపాణిలు సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల్లోని వక్క సాగు, విలువ జోడింపు, మార్కెటింగ్‌పై రైతులు – వ్యాపారుల సమ్మేళనం, ఎఫ్‌పీవో ఏర్పాటుపై చర్చించడంతో పాటు పుస్తకావిష్కరణ ఉంటుందన్నారు. కర్ణాటక రాష్ట్రం వక్క సాగుకు పెట్టింది పేరన్నారు. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కూడా వక్క సాగు బాగానే ఉందని, అక్కడ ప్రోత్సాహం కూడా అందుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా, విశాఖ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం తదితర జిల్లాల్లో వక్క సాగు అవుతోందన్నారు. కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర్ పంటగా సాగు చేస్తున్నామని దొరయ్య చౌదరి, చక్రపాణి చెప్పారు. ఎకరానికి మూడు, నాలుగు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, ఇందులో రూ.లక్ష వరకూ మిగిలే అవకాశం ఉందని చెప్పారు. విత్తనం వేసిన ఐదారేళ్ల తర్వాత పంట చేతికి వస్తుందని, దాదాపు 30 ఏళ్లకు పైగా పంట ప్రతి ఏటా చేతికి వస్తుందని తెలిపారు. ఒక రకం విత్తనం అయితే ఆగస్టు నుంచి జనవరి వరకూ, మరో విత్తనం జనవరి నుంచి ఏప్రిల్ వరకు దిగుబడి వస్తుందని అన్నారు. అయితే మన రాష్ట్రంలో వక్క సాగుకు ప్రోత్సాహం, రాయితీలు వంటివి లేవని దొరయ్య చౌదరి, చక్రపాణి అన్నారు. మార్కెటింగ్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నామన్నారు. అందుకే ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకు, అందరినీ సంఘటితం చేస్తున్నామన్నారు. కాసర్ గడ్ సీపీసీ ఆర్ఐ పూర్వ డైరెక్టర్ పి.చౌడప్ప, ఏపీ ఫుడ్ ప్రోసెసింగ్ అండ్ పరిశ్రమల శాఖ కార్యదర్శి చిరంజీవ్ చౌదరి దీనికి హాజరై సూచనలు చేస్తారని వారు చెప్పారు. ఈ అవకాశాన్ని వక్క సాగు, ఔత్సాహిక రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో టి.బాలాజీకుమార్, సీహెచ్ కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు.ఫ వచ్చే నెల 5న వేములపల్లిలో సదస్సు ఫ ఆదర్శ రైతులు దొరయ్యచౌదరి, చక్రపాణి వెల్లడి -
అంతర్వేది ఉత్సవాలకు సమన్వయంతో ఏర్పాట్లు
అమలాపురం రూరల్: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా స్థాయి, దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులతో మూడో విడత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య కల్యాణోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల తాకిడి రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్, పార్కింగ్, శానిటేషన్, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. జనవరి 28న కల్యాణోత్సవం, 29న రథోత్సవం, ఫిబ్రవరి 1న చక్రస్నానం, ఫిబ్రవరి 2న తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. పంచాయతీరాజ్ విభాగం లైటింగ్, బారికేడ్ల ఏర్పాట్లు చేయాలని, ఆర్డబ్ల్యూఎస్ శాఖ తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆర్అండ్బీ శాఖ బస్సులు అంతర్వేది వరకూ చేరుకునేలా రహదారిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రత కోసం బీచ్, దేవాలయం వద్ద రాష్ట్ర విపత్తుల స్పందన దళాలను నియమించాలన్నారు. మూడు క్యూలు ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా, స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలన్నారు. జనవరి 26 నుంచి ఐదు రోజుల పాటు ఆలయానికి సమీప ప్రాంతాల్లో మద్యం షాపులకు సెలవు ప్రకటించాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ ఉత్సవాలకు 1,500 మంది పోలీస్ సిబ్బందిని నియమించి శాంతి భద్రతలకు ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. ఆర్డీఓ కె.మాధవి మాట్లాడుతూ అంతర్వేది ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అన్ని శాఖలు సమన్వయంతో సాగాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి, ఆర్డీఓలు పి.శ్రీకర్ డి.అఖిల, డీఎస్పీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదో మంచి అలవాటు
చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటు ఉంది. ఉద్యోగం వచ్చే వరకూ పర్సనల్ డైరీ రాసేవాడిని. ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించిన డైరీ రాస్తున్నాను. ఇలా రాయడం వల్ల మనం చేసే పనులను సమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరీ రాయడం మంచి అలవాటు. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం గతం నెమరు వేసుకునేలా.. చిన్నతనం నుంచి విద్యార్థులకు డైరీ రాయడం అలవాటు చేయాలి. గత అనుభవాలు నెమరువేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. మర్చిపోయిన విషయాలను డైరీ చూసి తెలుసుకోవచ్చు. ఇది అందరికీ ఉపయుక్తం. నేనూ డైరీ రాస్తుంటాను. – పి.నాగేశ్వరరావు, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ -
సంగతాలెన్నో..
రాయవరం: అనుభవాలను అక్షరాల్లోకి మార్చి, పుటలుగా పేర్చితే.. డైరీ అవుతుంది. మనసు స్పందించే ప్రతి భావాన్ని, సంఘటనను, ప్రతి ఆలోచనను తనలో నిక్షిప్తం చేసుకునే అపురూప పుస్తకం ఈ డైరీ. గుండె పొరల్లో ఒదిగి ఉన్న జ్ఞాపకాలు, కంటి వెనుక కలలను అందంగా తనలో అమర్చుకుంటుందీ హస్త భూషణం. అందుకే ఎన్ని మారినా డైరీ మారలేదు. దాని ప్రాధాన్యం తగ్గలేదు. మరో రెండు రోజుల తర్వాత ‘2025’ గతంలోకి వెళ్లి 2026 సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ గత కాలపు జ్ఞాపకాన్ని దాచి పెట్టడానికి డైరీలు ఉంది. కొత్త ఏడాదికి సరికొత్త రూపంలో డైరీలు స్వాగతం పలుకుతున్నాయి. పాత డైరీలు గత జ్ఞాపకాలను మూటకట్టుకున్నాయి. కొత్త డైరీల్లో రేపటి కోసం కొత్త పేజీలు ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్ నెలాఖరు నుంచే వీటి కొనుగోలు ఆరంభమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నగరాలు, పట్టణాల్లోని పుస్తక విక్రయ శాలలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లో డైరీలు విరివిగా లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.30 నుంచి రూ.వెయ్యి విలువ చేసేవి విక్రయిస్తున్నారు. వీటిని హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రధాన పట్టణాల్లో ఒక్కో షాపు యజమాని రూ.30 వేల నుంచి రూ.50 వేల విలువ చేసే డైరీలను ఇప్పటికే విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. వీటిని తమ స్నేహితులు, బంధువులకు బహుమతులుగా ఇచ్చేందుకు చాలామంది ఉత్సుకత చూపుతున్నారు. వ్యక్తిగతం.. నిక్షిప్తం పర్సనల్ డైరీ అంటే.. ఓ వ్యక్తికి సంబంధించి వ్యక్తిగత అంశాలను అందుకే నిక్షిప్తం చేస్తారు. ప్రతి రోజు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాత్రి వేళ నిద్ర పోయే ముందు ఆ రోజున రాసుకుంటారు. తమ జీవితంలో ఎన్నో ముఖ్య విషయాలు, తీపి జ్ఞాపకాలను అందులో పొందుపర్చుకుంటారు. వాటిని కొంతకాలం తర్వాత తెరిచి చదివి పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవచ్చు. ప్రొఫెషనల్ డైరీలు వృత్తిపరంగా బాధ్యతలు అధికంగా ఉండేవారు, క్రమం తప్పకుండా ఉపయోగించేవి ప్రొఫెషనల్ డైరీలు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ డైరీ ఓ పర్సనల్ ఆసిస్టెంట్‌గా సహకరిస్తుందంటే అందులో అతిశయోక్తి లేదు. దైనందిన వ్యవహారాలను మర్చిపోకుండా సమయానుకూలంగా చేయాల్సిన పనిని చెబుతుంది. ఈ డైరీ రోజువారీ షెడ్యూల్ మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల వివాహాలు, పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, ఊరు ప్రయాణాలతో పాటు సమావేశాల తేదీలను, సమాచారాన్ని అందులో రాసుకోవచ్చు. ప్రణాళికతో కూడిన పనులను చేసేందుకు డైరీ సగటు మానవునికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఫ జ్ఞాపకాలను పేర్చిన పుస్తకం డైరీ ఫ గతాన్ని నిక్షిప్తం చేసే సాధనం ఫ వీటికి తగ్గని ప్రాధాన్యం -
సామర్లకోటకు ‘ఎర్నాకుళం రైలు’ ప్రమాద బాధితులు
సామర్లకోట: టాటానగర్ – ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాద బాధితులను అనకాపల్లి జిల్లా యలమంచిలి నుంచి సోమవారం ఉదయం కాకినాడ జిల్లా సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ రైలులోని రెండు బోగీల్లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగి విజయవాడకు చెందిన ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. ఆ రెండు బోగీల్లో మిగిలిన సుమారు 125 మంది ప్రయాణికులను మూడు బస్సుల్లో సామర్లకోట తీసుకు వచ్చారు. వారిని రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), సీఐ ఎ.కృష్ణభగవాన్ ఆధ్వర్యాన పోలీసులు, రైల్వే అధికారులు, సిబ్బంది విశ్రాంతి గదులకు తరలించారు. అనంతరం, సోమవారం ఉదయం 10.25 గంటలకు ఆ రైలు సామర్లకోట చేరుకుంది. కాకినాడ నుంచి 2, విశాఖపట్నం నుంచి ఒకటి చొప్పున ఏసీ బోగీలు తీసుకువచ్చి ఆ రైలుకు తగిలించి, బస్సుల్లో తీసుకు వచ్చిన ప్రయాణికులను ఎక్కించామని సామర్లకోట స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ తెలిపారు. ఆ ప్రయాణికులకు స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అమలకంటి శ్రీనివాసరావు, కార్యదర్శి బడుగు బాబీ, కోశాధికారి యేలేటి రమేష్‌లు అల్పాహారం, వాటర్ బాటిల్స్ అందించారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ ఆయా శాఖల అధికారులు ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. యలమంచిలిలో ప్రమాదం జరిగిన సమయంలో రైలులోని తన బ్యాగ్ చోరీ అయ్యిందని సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రతీష్ కుమార్ స్థానిక ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫ యలమంచిలి నుంచి ప్రత్యేక బస్సుల్లో రాక ఫ బోగీలుఏర్పాటు చేసి రైలులో తరలింపు -
కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్
నల్లజర్ల: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని, దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్ సీపీ నాయకులు హెచ్చరించారు. నల్లజర్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ హోం మంత్రి తానేటి వనిత, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌లు సోమవారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలిచ్చారని, రప్పారప్పా అన్నారని ఆరోపిస్తూ స్థానిక కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా.. వారిని పోలీసులు అరెస్టు చేసి, నడిరోడ్డుపై నడిపించిన తీరుపై మండిపడ్డారు. చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ దన్నుతో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని, వ్యవస్ధలు దిగజారుతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. ఇటువంటి చర్యలతో న్యాయ వ్యవస్థ బతుకుతుందా అని ప్రశ్నించారు. జంతుబలిని సాకుగా చూపుతున్నారని, నిజానికి ఫ్లెక్సీల ముందు జంతుబలులు, రక్తతర్పణాల సంసృతికి తెర లేపిందే టీడీపీ అని చెప్పారు. గతంలో టీడీపీ కార్యకర్తలు ఇటువంటి పని చేసినప్పుడు ఏ చర్యలూ తీసుకోని ప్రభుత్వం.. ఇప్పుడే కొత్తగా చట్టం తెచ్చినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద పదుల సంఖ్యలో పొట్టేళ్ల తలలు నరికి, రక్తతర్పణం చేశారని గుర్తు చేశారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు గుండాగిరి చేస్తే సహించేది లేదన్నారు. తూర్పు చోడవరంలో కార్యకర్తలు చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. తప్పు చేస్తే చట్ట పరిధిలో కేసులు పెట్టి, అరెస్టు చేసి, కోర్టుకు పంపాలని, అంతే కానీ వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి దేశ ద్రోహులన్నట్టుగా నడిబజార్లో నడిపించి తీసుకువెళ్తారా అని ప్రశ్నించారు. అలా తీసుకెళ్లాలని ఎక్కడ రాసి ఉందో చెప్పాలన్నారు. హోం మంత్రి అనిత వ్యాఖ్యలతో పోలీసులు మరింత అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసు అధికారులకు రాబోయే రోజులలో ఫోర్త్ డిగ్రీ తప్పదని హెచ్చరించారు. మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత మాట్లాడుతూ, జగన్ జన్మదిన వేడుకలు, కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం కావడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోందని, జగన్ కటౌట్ చూస్తేనే ఆ పార్టీ శ్రేణులకు వణుకు పుడుతోందని అన్నారు. ఒక సినీ డైలాగ్‌ను చిన్న పిల్లలు ఫ్లెక్సీపై రాయడాన్ని సాకుగా చూపి, మూడు గ్రామాల్లోని కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా.. వారిని అక్రమంగా నిర్బంధించి, కొట్టి హింసించారని అన్నారు. తద్వారా స్థానిక ఎమ్మెల్యే పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కార్యకర్తలు తట్టుకుని నిలబడుతున్నారని, ఎంత ప్రయత్నించినా తమకు లొంగని వారందరిపై ఏదో ఒక విధంగా తప్పుడు కేసులు పెట్టి, తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే వైఎస్సార్ సీపీ కార్యకర్తలను, నాయకులను బలి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంత్రిభద్రతలున్నాయా అని ఆమె ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టిన వారు ఎదురు ప్రశ్నిస్తే గంజాయి కేసులు పెడతామంటూ హెచ్చరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోలీసులు నడుస్తున్నారని, వారు ప్రజల పక్షాన స్వేచ్ఛగా విధులు నిర్వహించాలని, ఎవరికో బానిసలుగా, తొత్తులుగా పని చేయడం సరి కాదని హితవు పలికారు. అన్యాయానికి గురైన కార్యకర్తలందరికీ అండగా ఉంటామని, వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మూడు మండలాల అధ్యక్షులు వెలగా శ్రీరామ్మూర్తి, కూచిపూడి సతీష్, ప్రతాపనేని వాసుబాబు, నాయకులు బంక అప్పారావు, సాలి వేణు, ముప్పిడి వెంకటరత్నం, తాడిగడప శ్రీనివాసరావు, సయ్యద్ మునాఫ్, యువరాజు, చిన్నీ నాగూ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జనార్దనరావు పాల్గొన్నారు. ‘జై జగన్’ అన్నా వేధిస్తారా? అక్రమ అరెస్టులే కాకుండా నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్తారా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మూల్యం తప్పదు వైఎస్సార్ సీపీ నేతల హెచ్చరిక -
రెవెన్యూ క్లినిక్‌తో అర్జీలకు రియల్ టైమ్ పరిష్కారం
పీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)తో పాటు రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల రెవెన్యూ సమస్యలను రియల్ టైమ్‌లో పరిష్కరించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లో సంబంధిత అధికారులందరూ ఉండి సమస్యలు పరిష్కరించేలా ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక తొలిసారి నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా స్వీకరించిన అర్జీల్లో మూడు రెవెన్యూ ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించామని తెలిపారు. మిగిలిన వాటికి సంబంధించి సమస్య ఏ స్థాయిలో ఉందో గుర్తించి, తగిన ఎండార్స్మెంట్ జారీ చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై రెవెన్యూ సమస్యలు పరిష్కరించడమే ఈ క్లినిక్ ప్రధాన ఉద్దేశమన్నారు. దేవదాయ భూములకు ప్రాపర్టీ రిజిస్టర్లో తప్పనిసరిగా 1బీ రికార్డులు వచ్చేలా తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రికార్డుల సవరణలను సకాలంలో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహించి, పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లూ లేకుండా ఆర్డీఓలు, తహసీల్దార్లు పాసు పుస్తకాల పంపిణీ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో 214, రెవెన్యూ క్లినిక్‌లో 103 చొప్పున అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్ఓ టి.సీతారామ్మూర్తి, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సర్వే అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, 19 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
పోలీసు పీజీఆర్ఎస్కు 30 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 30 ఫిర్యాదులు చేశారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. జాతీయ త్రోబాల్ పోటీకి ఎంపిక తాళ్లపూడి: మండలంలోని ప్రక్కిలంక గ్రామానికి చెందిన యువకుడు ప్రేముల ఫణిభూషణ్ 47వ జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. సామాన్య దళిత కుటుంబానికి చెందిన రమేష్ అబీదా దంపతుల కుమారుడైన ఫణిభూషణ్ తాళ్లపూడి పరసా పద్మ రాజారావు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివాడు. ప్రస్తుతం గుంటూరు ఏపీఆర్డీసీ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాడు. క్రీడలపై ఆసక్తితో త్రోబాల్‌లో నైపుణ్యం సాధించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అదృష్టం దక్కించుకున్నాడు. కోచ్ టీఎస్ఎన్ కుమార్ తనకు మంచి శిక్షణ ఇస్తున్నారని ఫణిభూషణ్ చెప్పాడు. బుధవారం జరిగే తుది పోటీల్లో అర్హత పొందడానికి జరిగే లీగ్ మ్యాచుల్లో ప్రస్తుతం ఆడుతున్న అతడు విజయం సాధించాలని మండలంలోని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. యాగశాల పక్కన మెట్లదారి విస్తరణ అన్నవరం దేవస్థానం చైర్మన్ ఆదేశం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని యాగశాల పక్క నుంచి దిగువకు వెళ్లేందుకు ఉన్న మెట్లను మరింత వెడల్పుగా విస్తరించాలని అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ మెట్ల దారిని సోమవారం ఆయన పరిశీలించారు. కార్తిక మాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, సత్యదేవుని దర్శనానంతరం వారు దిగేందుకు తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న మెట్లు మాత్రమే సరిపోవని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ భావించారు. ఈ మేరకు రావిచెట్టు పక్క నుంచి యాగశాల వద్దకు చేరుకునేలా అదనంగా మెట్లు నిర్మించారు. అక్కడి నుంచి రామాలయ ప్రాంగణంలోకి వెళ్లడం సులువవుతుందని ఆయన భావించారు. అయితే ఈ మెట్లు 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో సరిపోవడం లేదు. గత కార్తిక మాసంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తుల తోపులాట జరిగింది. దీంతో ఈ మెట్లను మరో 10 అడుగుల వెడల్పున విస్తరించాలని చైర్మన్ ఆదేశించారు. అయితే, దీనివలన యాగశాల దక్షిణం వైపు మెట్లు సగం వరకూ పోయే అవకాశముంది. ఈ విషయమై సిద్ధాంతితో మాట్లాడగా.. దక్షిణం వైపు మెట్లు సగం తొలగించి, వాటికి బదులు ఎల్ ఆకారంలో తూర్పునకు మెట్లు నిర్మించి, వాటిని మిగిలిన వాటికి అనుసంధానం చేయాల్సిందిగా సూచించారని ఈఈ రామకృష్ణ తెలిపారు. త్వరలోనే ఈ మెట్ల వెడల్పునకు అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవనున్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీలో జిల్లా జయకేతనం సామర్లకోట: కర్నూలులో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ జరిగిన రారష్ట్‌ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు జయకేతనం ఎగురవేసి, ప్రథమ బహుమతి సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. పశ్చిమ గోదావరితో జరిగిన తుది పోటీలో జిల్లా జట్టు అత్యంత ఉత్తమ ప్రదర్శన చేయడం ద్వారా చాంపింయన్షిఫ సాధించిందన్నారు. జట్టు సభ్యులను అంతర్జాతీయ కోచ్ పోతుల సాయి, ప్రో కబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్, ఉపాధ్యక్షుడు నిమ్మకాయల కిరణ్, అంతర్జాతీయ క్రీడాకారిణి శ్వేత, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాస్, కోశాధికారి తాళ్లూరి వైకుంఠం అభినందించారు. -
ధర్మాధర్మాల విషయంలో ధర్మరాజే ప్రమాణం
● భారతంలో విదుర నీతి, సనత్సుజాతీయం అత్యంత ముఖ్యమైనవి ● మోసంతో విద్య నేర్చుకోవడమే కర్ణుడి శాపానికి కారణం ● సామవేదం షణ్ముఖ శర్మ ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మాధర్మాల విషయంలో ధర్మరాజే ప్రమాణమంటూ ధృతరాష్ట్రునితో సంజయుడు చెబుతాడని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని సోమవారం ఆయన కొనసాగించారు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కురుపాండవుల మధ్య జరిగిన అనేక చర్చోపచర్చలను ఆయన వివరించారు. ‘‘పాండవుల వద్దకు ధృతరాష్ట్రుని తరఫున సందేశాన్ని తీసుకువెళ్లిన సంజయుడు.. తిరిగి వచ్చి, ధర్మరాజు సహనానికి, సమరానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చెబుతాడు. ధర్మరాజు మెత్తటి వాడే కానీ, చేతకాని వాడు కాడు. మనశ్శాంతి కోసం విదురుడిని ఆహ్వానించిన ధృతరాష్ట్రుడు.. జరుగుతున్న పరిణామాల వలన తాను నిద్రకు దూరమయ్యానని అంటాడు. ‘బలవంతుడు దండెత్తి వస్తే తగిన సాధనాలు లేని దుర్బలుడు, సంపద కోల్పోయిన వాడు, కాముకుడు, దొంగ– ఈ నలుగురికీ నిద్ర పట్టదు. నీలో ఈ దోషాలు లేవు కదా?’ అని విదురుడు అడుగుతాడు’’ అని వివరించారు. విదురనీతి, సనత్సుజాతీయం భారతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నవని, విదురనీతిని విద్యార్థి దశ నుంచే బోధించాలని సామవేదం అన్నారు. సామాన్య ప్రజలు, సీ్త్రలు సైతం ధర్మరాజు విజయాన్ని కాంక్షిస్తున్నారని ధృతరాష్ట్రునితో సంజయుడు అంటాడని చెప్పారు. కర్ణుడికి బ్రహ్మాస్త్రం పని చేయదని పరశురాముడు శపించడంలో కుల ప్రస్తావన లేదని, మోసంతో విద్యను నేర్చుకోవాలని కర్ణుడు భావించడమే ఆ శాపానికి కారణమని వివరించారు. ‘‘ఇటు ద్రోణ, కర్ణులు, అటు అర్జునుడనే ముగ్గురిలో ఏ ఒక్కరు మరణించినా శాంతి ఉంటుంది. అర్జునుడు, గాండీవం, కృష్ణుడు అనే మూడు శక్తులున్న చోటే జయం ఉంటుంది. నా కొడుకు నా మాట వినడు. నేనేం చేయాలి’’ అంటూ ధృతరాష్ట్రుడు విలపిస్తాడు. స్మరించగానే ధృతరాష్ట్రుని వద్దకు వ్యాసుడు వచ్చి, కృష్ణ మహిమను వివరిస్తాడు. కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వలోకేశ్వరుడని నీకు తెలిసినట్టు నాకెందుకు తెలియదని వ్యాసుడిని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. నీవు అవిద్యలో ఉన్నవాడివి కనుక తెలుసుకోలేకపోతున్నావని వ్యాసుడు చెబుతాడు’’ అని చెప్పారు. ధృతరాష్ట్రుని మించిన శ్రోత లేడని, ఆసక్తికరంగా వింటాడని, లోపలకు ఎన్ని విషయాలు వెళ్తున్నాయో మనకు తెలీదని సామవేదం అన్నారు. పరమాత్మను తెలుసుకోలేకపోవడానికి అవిద్యయే కారణమని చెప్పారు. -
మున్సిపల్ డీఈ రీకాల్
● రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం ● 17 మంది ఏకగ్రీవ ఆమోదం ● డీసెంట్ తెలిపిన ఏడుగురు కౌన్సిలర్లు రామచంద్రపురం: మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ డీఈనీ రీకాల్ చేస్తూ ఆదివారం కౌన్సిలర్లు తీర్మానం చేశారు. కొంతకాలంగా కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ డీఈ శ్రీకాంత్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత నెలలో జరిగిన సమావేశంలో కూడా సభ్యులు ఆయనను రీకాల్ చేయాలని కోరారు. ఈ మేరకు స్థానిక మంత్రి సుభాష్‌కు, మున్సిపల్ ఆర్డీ, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాలు అందజేశారు. తాజాగా శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టేబుల్ అజెండాగా డీఈ శ్రీకాంత్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానించింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌తో సహా 17 మంది కౌన్సిలర్లు దీనికి మద్దతు తెలపగా ఏడుగురు మాత్రం డీసెంట్ తెలిపారు. సమావేశంలో అజెండాలోని తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ డీఈ శ్రీకాంత్ పట్టణాభివృద్ధికి ఆటంకంగా మారారని, కౌన్సిల్ సభ్యులను అవమానపర్చడం, పనులు పూర్తి చేసినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి నలుగురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవితో సహా 17 మంది సభ్యులు డీఈని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఒక కౌన్సిలర్ వాడిన పదజాలాన్ని తప్పుపడుతూ పలువురు కౌన్సిలర్లు బైఠాయించారు. దీంతో చైర్పర్సన్ వారికి నచ్చచెప్పి అతి కష్టం మీద సమావేశాన్ని అదుపులోకి తీసుకొచ్చి డీఈని సరెండర్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అదే సమయంలో ఏడుగురు కౌన్సిలర్లు డీసెంట్ తెలుపుతూ రాసిన పత్రాన్ని కమిషనర్ రాజుకు అందజేశారు. ఈ అంశంపై వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయి ప్రసాద్ విప్ జారీ చేసినప్పటికీ, ఆ పార్టీ నలుగురు కౌన్సిలర్లు విప్‌ను ధిక్కరించి డీసెంట్పై సంతకాలు చేయడం గమనార్హం. -
విశ్వబ్రాహ్మణులను చట్ట సభలకు పంపాలి
● సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు అమలాపురం టౌన్: విశ్వ బ్రాహ్మణులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఏదో ఒకటి ఇచ్చి చట్ట సభలకు పంపించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక దుడ్డివాని అగ్రహారంలోని విశ్వబ్రాహ్మణ కల్యాణ మండపంలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తమ వర్గానికి రాజకీయ పదవులు వచ్చినపుడే మనకు గుర్తింపు, హోదా వస్తాయని పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక సామాజిక, రాజకీయ రంగాల్లో తమ వర్గం అభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆ దిశగానే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. యువజన నాయకుడు ఆవుపాటి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ సామాజిక వర్గ పెద్దలు, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ కట్టోజు సన్నయ్యదాసు, వరద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు, ఆ వర్గం పెద్దలను సంఘీయులు గజమాలతో సత్కరించారు. అనంతరం వారంతా ఎమ్మెల్యే ఆనందరావు వద్దకు వెళ్లి తమ వర్గీయులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని వినతి ప్రతాన్ని అందించారు. -
గోదావరిలో పడి వృద్ధుడి మృతి
మామిడికుదురు: పెదపట్నంలంక గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక గెడ్డంవారి పేటకు చెందిన గెడ్డం సంజీవరావు (65) స్థానిక గోదావరి వద్దకు బహిర్భూమికి వెళ్లి మృతి చెందాడు. సంజీవరావు కుమారుడు రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన సంజీవరావు కనిపించక పోవడంతో అతని కోసం గాలించగా గోదావరిలో మృతదేహం లభ్యమైందన్నారు. మృతుడు సంజీవరావుకు భార్య గవరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంజీవరావు మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. -
భవితకు భద్రత బీమా..
● ఆరు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు ● విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వైనం ● ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న తపాలా శాఖ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తపాలా శాఖ అందించే బీమా పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ధీమానిస్తున్నాయి. పీఎస్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పేరిట ప్రవేశపెట్టిన పలు రకాల పథకాలు ఎంతోమంది గ్రాడ్యుయేట్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. వీటిని మొదట్లో తపాలా శాఖ ఉద్యోగుల సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి వర్తింపజేశారు. కాలక్రమేణా ఈ పథకాన్ని వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏ వంటి ప్రొఫెషనల్స్‌తో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో నమోదు చేసుకున్న కంపెనీల ఉద్యోగులకూ వర్తింపజేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్లకు పీఎల్ఎస్ఐ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో ఈ పథకాల వైపు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ దీనిని మనీ బ్యాక్ పాలసీ అంటారు. 19 నుంచి 25 ఏళ్ల మధ్య గలవారు ఈ పాలసీకి అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలపరిమితి 15 నుంచి 20 ఏళ్లుగా నిర్ణయించారు. 15 ఏళ్ల పాలసీపై 6, 9, 12 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్ లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీపై 8, 12, 16 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులకు ఏడాదికి ఒకసారి రూ.వెయ్యికి రూ.48 చొప్పున బోనస్ లభిస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 19 నుంచి 55 ఏళ్ల మధ్య గలవారు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లించే వయసును 55, 58, 60 ఏళ్లుగా ఎంచుకునే అవకాశం కల్పించారు. నాలుగేళ్ల తర్వాత రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్లు దాటితే పాలసీ సరెండర్ చేసుకోవచ్చు. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే ఎలాంటి బోనస్‌లు వర్తించవు. ఏటా రూ.వెయ్యికి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారునికి 80 ఏళ్లు దాటినా లేదా మరణించినా వారసులకు బీమా సొమ్ము బోనస్ ప్రయోజనాలను చెల్లిస్తారు. కన్వర్టబుల్ హోల్ లైవ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 19 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాకపోగా కోతలు విధించే నిబంధనలు ఉన్నాయి. ఏటా రూ.వెయ్యికి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది.. ఎండోమెంట్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 18 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. కనీస బీమా రూ.20 వేలు కాగా గరిష్టంగా రూ.50 లక్షలు ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం, పాలసీ సరెండర్‌కు అవకాశం ఉం టుంది. ఐదేళ్లు దాటిన పాలసీల సరెండర్‌పై బోనస్‌లలో కోతలు తప్పవు. ఏటా రూ.వెయ్యికి రూ.52 చొప్పున బోనస్ లభిస్తుంది. జాయింట్ లైఫ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 21 నుంచి 45 ఏళ్ల వయసు గల దంపతులు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాల పరిమితి ఐదు నుంచి 20 ఏళ్లు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీలు సరెండర్‌పై బోనస్‌లలో కోత ఉంటుంది. పాలసీ దారుడి మరణానంతరం ప్రయోజనాలు భాగస్వామి లేదా వారసులకు లభిస్తాయి. ఏటా రూ.వెయ్యికి రూ.52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో దంపతులు బీమా కవరేజి పొడిగించుకోవచ్చు. చిల్డ్రన్ పాలసీ.. పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకోవచ్చు. పిల్లల వయసు ఐదు నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు వయసు ప్రకారం బీమా తీసుకోవచ్చు. పాలసీదారు ( పిల్లల తండ్రి) వయసు 40 ఏళ్లు దాటి ఉండకూడదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాల పరిమితి తీరాక బీమా సొమ్ము బోనస్‌లు వర్తిస్తాయి. రుణ సదుపాయం సరెండర్ సౌకర్యాలు ఈ స్కీమ్‌లో ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనస్‌లు వర్తిస్తాయి. దరఖాస్తు ఇలా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్, పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీని బట్టి వివిధ వైద్య పరీక్షలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పోస్ట్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించి పథకంలో భాగస్వాములు కావచ్చు. -
మహిళల ఆశలు నీరుగార్చారు
చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజా సంక్షేమ పట్ల ముఖ్యంగా మహిళా పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏడాదిన్నర అవుతున్నా అమలు కాలేదు. అనేక కొర్రీలతో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు నేటికీ మెషీన్లు ఇవ్వకపోడం దారుణం. వారు ఈ శిక్షణ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలం అని ఆశించారు. ఆలస్యం కావడంతో వారు వేరే ఉపాధి మార్గాలను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. మహిళల ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. – గూడపాటి రమాదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు, కొత్తపేట మహిళల స్వయం ఉపాధిలో భాగంగా కుట్టు మెషీన్ల ద్వారా జీవనోపాధి పొందుతూ, కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చాం. అయితే ప్రభుత్వంలో కొన్ని బిల్లులు పండింగ్ ఉన్నాయి. అవి క్లియర్ అయ్యాక మెషీన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అర్హులైన అందరికీ మెషీన్లు ఇస్తాం. – ఎ.శ్రీనివాసరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, కాకినాడ -
అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం
● రూ.4.5 లక్షల ఆస్తి నష్టం కడియం: మండలంలోని కడియపులంక పంచాయతీ పరిధిలోని దోసాలమ్మకాలనీలో తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఎల్లంశెట్టి సముద్రుడుకు చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి, ఇంటిని చుట్టుముట్టడంతో ఇల్లు, అందులోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.4.5 లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించిందని వారు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక శకటం అక్కడికి చేరుకుని మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా సిబ్బంది ఆర్పారు. బాధితులను ఆదివారం పలువురు పరామర్శించి సాయం అందజేశారు. కడియపులంక ఉప సర్పంచ్ పాటంశెట్టి రాంజీ రూ.10వేలు, ఏపీఐఐసీ సభ్యుడు మార్గాని సత్యనారాయణ నగదు సాయం అందజేశారు. అలాగే తహసీల్దార్ ఆదేశాల మేరకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను వీఆర్వో జ్యోతి బాధితులకు ఇచ్చారు. ఘనంగా శశి రీ యూనియన్నిడదవోలు: ఉండ్రాజవరం మండలం వేలువెన్ను శశి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం శశి రీ యూనియన్–2025ను ఘనంగా నిర్వహించారు. సుమారు 1200 మంది తల్లిదండ్రులు, 2025 టాపర్స్, ర్యాంక్ హోల్డర్లు, అలుమ్నిలు పాల్గొన్నారు. శశి విద్యార్థుల నృత్యాలు, సంగీతం వంటి సాంస్తృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథి రాజమహేంద్రవరంలోని శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని, బోధన–వైద్య వృత్తులు పవిత్రమైనవన్నారు. గౌరవ అతిధి వరంగల్ ఎమిరిటస్ ప్రొఫెసర్ డి.దినాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2025లో వివిధ విభాగాల్లో టాప్ ర్యాంకులను సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను శశి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బూరుగుపల్లి రవి కుమార్, వైస్ చైర్మన్ లక్ష్మీ సుప్రియ సత్కరించారు. ఈ కార్యక్రమంలో శశి విద్యా సంస్థల డైరెక్టర్ భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సీనియర్ అధ్యాపక బృందం పాల్గొన్నారు. కోడి పందేలు ఆడుతున్న ముగ్గురి అరెస్టు జగ్గంపేట: మండలంలోని గొల్లలగుంట గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరంపై ఎస్సై రఘునాథరావు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో కోడి పందేలు ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5.6 వేలు, వీటితో పాటు 2 పందెం కోళ్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. మండలంలో జూద క్రీడలు ఎక్కడ నిర్వహించినట్టు కనిపించినా, తెలిసినా 94949 33233కి నంబర్‌కు కానీ, 100కు కానీ, 112 నంబర్‌కు కాల్ చేసి కానీ ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజల సహకారంతోనే జూదాలు నిరోధించగలమని తెలిపారు. -
ఇదేం శిక్షణ బాబూ!
● మెషీన్ల పంపిణీ ఏదీ? ● 8 నెలలుగా ఎదురుచూపులు ● ఉమ్మడి జిల్లాలో 11,014 మందికి మొండిచేయి కొత్తపేట: మహిళల స్వయం ఉపాధి కల్పనలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చింది. శిక్షణ అనంతరం ఇవ్వాల్సిన ఉచిత కుట్టు మెషీన్లను మాత్రం ఇవ్వలేదు. అసలు ఇస్తారా? ఇవ్వరా? అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి నుంచి ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించారు. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన కులాల వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖల ద్వారా మండల కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. ఎంపీడీవోలు ఈ కేంద్రాల్లో వసతులను పర్యవేక్షించారు. మూడు నెలల చొప్పున దశల వారీగా అన్ని మండలాల్లో శిక్షణ పూర్తి చేశారు కానీ. శిక్షణ పొందిన మహిళలకు ఇవ్వాల్సిన కుట్టు మెషీన్లను ఆరేడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇవ్వలేదు. హాజరు బాగుంటేనే మెషీన్ మహిళలకు ఉచిత కుట్టు మెషీన్ల పంపిణీ పథకానికి ఆయా గ్రామ సచివాలయాల ద్వారా మూడు వేలకుపైగా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారులు 3 నెలల పాటు కుట్టు శిక్షణ పొందితేనే ధ్రువీకరణ పత్రంతో పాటు, ఉచిత కుట్టు మెషీన్ అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం మెలిక పెట్టింది. ప్రజా ప్రతినిధుల సిఫారసుల నేపథ్యంలో మహిళలకు ఈ శిక్షణ ఇచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంపికై న వారి హాజరు 75 శాతం కచ్చితంగా ఉండాలనడంతో 445 మంది మాత్రమే ఉచిత కుట్టు మెషీన్ పొందేందుకు అర్హత సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంతవరకు ఏమీ లేదు ఉచిత కుట్టు శిక్షణకు మూడు నెలల పాటు హాజరై, 75 శాతం హాజరు పొంది అర్హత సాధించి 6, 7 నెలలు గడుస్తున్నా ధ్రువీకరణ పత్రాలు, ఉచిత కుట్టు మెషీన్ల పంపిణీపై ప్రభుత్వం నేటి వరకూ ఎటువంటి స్పందనా లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా కుట్టు యంత్రాలు ఆందకపోవడంతో రోజూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. ఉచిత కుట్టు మెషీన్లతో పాటు నేరుగా దర్జీ దుకాణాల ఏర్పాటుకు అవసరమైన బ్యాంక్ రుణాలు ఇస్తామని శిక్షణ సమయంలో అధికారులు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న స్వయం ఊపాధి సోపానం రుణాల పైనా చంద్రబాబు సర్కారు నేటీకీ ఏ విధమైన ప్రకటన చేయడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి పాలకులు నాడు ఎన్నికల్లో అన్ని వర్గాలను ముఖ్యంగా మహిళాలోకాన్ని ఉద్దరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు చేసిందేమీ లేదని మహిళలు పెదవి విరుస్తున్నారు. కుట్టు మెషీన్లకు అర్హత పొందిన లబ్ధిదారుల వివరాలు ఇలా.. జిల్లా శిక్షణకు వచ్చిన శిక్షణ దరఖాస్తులు పొందినవారు కోనసీమ 21,908 3,190 తూర్పు గోదావరి 12,118 2,904 కాకినాడ 27,722 4,920 మొత్తం 61,718 11,014 -
‘కోట’ నృత్య కళాకారులకు గిన్నిస్‌లో చోటు
సామర్లకోట: స్థానిక చిన్నారి నృత్య కళాకారులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ ఆర్ట్ ఆకాడమీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఏడు వేల నృత్య కళాకారులతో కూచిపూడి కళా వైభవాన్ని నిర్వహించి ఈ రికార్డు సాధించారు. ఆ బృందంలో సామర్లకోటకు చెందిన 30 మంది చిన్నారులు పాల్గొన్నారు. నాట్యాచార్యుడు బేత సత్యనారాయణ వద్ద వారు నృత్యాన్ని అభ్యసించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి, ప్రముఖుల సమక్షంలో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్స ప్రతినిధులు సర్టిఫికెట్లు అందుకున్నారు. ఆదివారం పట్టణ ప్రముఖులు ఆ చిన్నారులను అభినందించారు. -
నకిలీ వే బిల్లులతో ఇసుక తరలింపు
● రెండు లారీల సీజ్ తాళ్లపూడి: మండలం ప్రక్కిలంకలో ఆదివారం తెల్లవారుజామున జిల్లా గనులు, భూగర్భశాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేశాయి. ఇసుక రీచ్ ఏజెన్సీలు నకిలీ వే బిల్లులతో ఇసుక తరలిస్తున్నట్టు తేలితే ఆ ఏజెన్సీని రద్దు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ డి.ఫణిభూషణ్‌రెడ్డి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఇసుకను తరలిస్తున్న ఏపీ 39 టీక్యూ 0007, ఏపీ 37 టీఈ 6979 నంబర్లు ఉన్న రెండు వాహనాలను తనిఖీ చేసి వే బిల్లులను స్కాన్ చేశారు. ఏపీఎస్ఎంఎస్ పోర్టల్‌లో ఎటువంటి డిస్పాచ్ వివరాలు లేవని గుర్తించి బిల్లులు నకిలీవని గుర్తించి రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అలాగే ప్రక్కిలంక–1 డీసిల్టేషన్ రీచ్‌లో ఇసుక రవాణాకు ఏజెన్సీగా ఎంపికై న ‘ది గణేష్ బోట్స్‌మెన్ – శాండ్ వర్కర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ సంస్థ నకిలీ ఇసుక వే బిల్లులు జారీ చేసినట్లు గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్సై రామకృష్ణకు సూచించారు. అనంతరం సొసైటీకి కేటాయించిన శాండ్ సప్లై పాయింట్ లాగిన్ ఐడీని ఏపీఎస్ఎంఎస్ పోర్టల్‌లో బ్లాక్ చేశారు. ఈ దాడుల్లో జిల్లా మైనింగ్ సర్వేయర్ పట్నాల శ్రీనివాస్, జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై కె.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అటు రంకెలేస్తూ.. ఇటు దౌడు తీస్తూ..
● రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బళ్లు, గుర్రపు స్వారీ పోటీలు ● వివిధ జిల్లాల నుంచి వచ్చిన 67 జతల ఎడ్లు, 23 గుర్రాలు ● సందడిగా మారిన ఏడీబీ రోడ్డు రంగంపేట: మండలం వడిశలేరు సమీపంలో గన్ని వ్యవసాయ క్షేత్రం వద్ద ఆదివారం నిర్వహించిన 7వ రాష్ట్రస్థాయి ఎడ్లబళ్లు, గుర్రాల పోటీలు రసవత్తంరంగా సాగాయి. దివంగత ఆదర్శరైతు గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం ఆయన కుమారుడు, రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సహకారంతో కూటి కోటేశ్వరరావు, బొప్పన బ్రహ్మాజీరావుల నిర్వహణలో ఈ పోటీలు జరిగాయి. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు సాగిన ఈ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు చూడడానికి వచ్చారు. రాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి 67 జతల ఎడ్లు, 23 గుర్రాలు పోటీలకు హాజరు కాగా, సీనియర్స్ 1600 మీటర్ల విభాగంలో 11 జతలు, జూనియర్స్ విభాగం వెయ్యి మీటర్లలో 56 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పోటీల వల్ల వడిశలేరు నుంచి రంగంపేట వరకు గల ఏడీబీ రోడ్డు కోలాహలంగా మారింది. పోలీసు బందోబస్తు నడుమ పోటీలు ప్రశాంతంగా ముగిసాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పోటీలు తిలకించారు. విజేతలు వీరే... సీనియర్స్ విభాగంలో 11 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ను జి.మేడపాడుకి చెందిన మలిరెడ్డి అన్నపూర్ణ, గుమ్మిలేరుకు చెందిన కోరా శృతి చౌదరి ద్వితీయ, తృతీయ బహుమతులుగా బైక్‌లను గెలుచుకున్నారు. మరికొందరు కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. జూనియర్స్ విభాగంలో 56 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ను చౌడవాడకు చెందిన గెడ్డం అప్పారావు, ద్వితీయ బహుమతిని కంకటపాలేనికి చెందిన కొండేటి పద్మ, తృతీయ బహుమతిని బి.కొత్తూరుకు చెందిన మురుకుర్తి శంకరరావు గెలుచుకున్నారు. గుర్రాల పందెం విజేతలు వీరే.. మొదటి బహుమతి రూ.40 వేలను అగ్రహారానికి చెందిన చేమల మణికంఠ, ద్వితీయ బహుమతి రూ.30 వేలను యలమంచిలికి చెందిన ఎల్లపు జగదీష్, తృతీయ బహుమతి రూ.25 వేలను రామన్నపాలేనికి చెందిన చోడమాంచిక విక్రమ్ సాధించారు. నాల్గవ బహుమతి సాధించిన సింగపూర్ సత్యనారాయణకు రూ.20 వేలు, ఐదో బహుమతిని అరకుపాలేనికి చెందిన మోదమాంబ మురుగన్‌కు రూ.15 వేలు, ఆరో బహుమతి సాధించిన సోమలింగంపాలేనికి చెందిన యల్లపు జగదీష్‌కు రూ.10 వేలు, ఏడో బహుమతి సాధించిన కోటనందూరుకు చెందిన శివరాజుకు రూ.10 వేల చొప్పున నగదు అందించారు. విజేతలకు గన్ని కృష్ణ నగదు బహుమతులు అందజేశారు. -
గాడిద పట్ల మార్దవం.. గోవు పట్ల కరకుదనం..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘దుర్యోధనుడి పట్ల మృదువుగా మాట్లాడేవాడు గాడిద పట్ల మార్దవం, గోవు పట్ల కరకుదనం చూపేవాడవుతాడు’ అని ద్రుపదుడు అంటాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను ఆయన ఆదివారం వివరించారు. ‘‘అజ్ఞాతవాసం ముగిశాక బలరామ కృష్ణులు, ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు తదితర ప్రముఖులతో పాండవులు సమావేశయ్యారు. ‘దుర్యోధనునితో సౌమ్యంగా మాట్లాడాలని, శకునితో ద్యూతం ఆడటం ధర్మరాజు తప్పు’ అని బలరాముడు అంటాడు. ద్రుపదుడు ఈ మాటలను అంగీకరించక పై పోలిక తెస్తాడు. ఇందులో గాడిద ఎవరో, గోవు ఎవరో సుస్పష్టం’’ అని సామవేదం అన్నారు. ‘‘ధృతరాష్ట్రుని తరఫున పాండవుల వద్దకు వచ్చిన సంజయుడు యుద్ధం అవాంఛనీయమని చెబుతాడే కానీ, వారి రాజ్యభాగం గురించి మాట్లాడడు. యుద్ధం ధర్మరహితమైనదని అంటాడు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ధర్మసమ్మితమైన భోగాన్ని మాత్రమే కోరుతున్నామని ధర్మరాజు సమాధానం చెబుతాడు. దుర్యోధనుడు ఇతరుల మానాన్ని ధ్వంసం చేయాలనుకుంటాడు. అటువంటి వాడిని మానధనుడని ఎలా అనగలం?’’ అని సామవేదం ప్రశ్నించారు. ‘‘మా రాజ్యాన్ని దుర్యోధనుడు కోరుకుంటున్నాడు. మేము జీవించి ఉండగా మా రాజ్యాన్ని ఇంద్రుడు కూడా సొంతం చేసుకోలేడు. ఇంద్రప్రస్థంలో మా రాజ్యం మాకు ఇవ్వాలి’’ అని ధర్మరాజు స్పష్టం చేస్తాడు. ‘‘దీంతో, సంజయుడు వేదాంతం మాట్లాడతాడు. యుద్ధం చేయడం కన్నా భిక్షాటన మేలని అంటాడు. వేదాంతాన్ని అసందర్భంగా ఎలా అన్వయించుకోవచ్చునో ఈ వృత్తాంతం నుంచి తెలుసుకోవచ్చు’’ అని సామవేదం అన్నారు. -
సనాతన ధర్మ పరిరక్షణతోనే దేశాభివృద్ధి
● సామవేదం షణ్ముఖశర్మ ● బ్రహ్మజోస్యుల స్మారక పురస్కారం ప్రదానంసీతానగరం: భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం అవసరమని, సనాతన ధర్మ పరిరక్షణతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, సీతానగరం సత్యాగ్రహ ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక తొలి పురస్కారాన్ని కుటుంబ సభ్యులు ఆయనకు ప్రదానం చేశారు. సీతానగరం కస్తూర్బాగాంధీ ఆశ్రమంలో ఆదివారం జరిగిన ఈ వేడుకలో సామవేదం మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం బ్రహ్మజోస్యుల చేసిన పోరాటం మరువరానిదని అన్నారు. అటువంటి మహనీయుని పేరిట ఇస్తున్న ఈ పురస్కారాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు. భారతీయ సంస్కృతీ పరిరక్షణకు మరో స్వాతంత్య్ర ఉద్యమం అవసరమన్నారు. భారతీయ సంస్కృతి యుగయుగాలుగా కొనసాగుతూ వస్తోందని, ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలో మనదేశం వెలుగొందిన విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. దేశాభ్యున్నతి దేశ సంస్కృతిలోనే దాగి ఉందన్న విషయం మరచిపోరాదన్నారు. హిందూ మత ప్రతినిధిగా స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యం గురించి విశ్వవేదికపై చాటి చెప్పారని గుర్తు చేశారు. సనాతన ధర్మం బాగుంటే దాని నీడన అన్ని మతాలూ క్షేమంగా ఉంటాయని చెప్పారు. హిందూ అనేది మతం కాదని, ధర్మమని స్పష్టం చేశారు. అందుకే ఇక్కడ మతం అనే మాటకు బదులు హిందూ ధర్మం, హిందూ సంస్కృతి అని అనాలన్నారు. ఇక్కడ ఎప్పుడూ అసహనం లేదన్నారు. క్షేత్రాలు, నదుల గురించి చెప్పి, ఆనాడే వ్యాస భగవానుడు ఐక్యత కలిగించాడని చెప్పారు. భూమిని తల్లిగా చూడాలని మన ధర్మం చెబుతోందని, తల్లిని గౌరవించలేనప్పుడు అది ధర్మమెలా అవుతుందని ప్రశ్నించారు. భరతవర్షం బాగుండాలని దేవతలు కూడా కోరుకుంటారని సామవేదం అన్నారు. సామవేదం షణ్ముఖశర్మకు ఇవ్వడం వలన బ్రహ్మజోస్యుల పురస్కారానికి మరింత విలువ ఏర్పడిందని బెంగళూరుకు సచ్చిదానంద సరస్వతి మహాస్వామీజీ అన్నారు. బ్రహ్మజోస్యుల ఫౌండేషన్ కన్వీనర్ వారణాసి ధర్మసూరి మాట్లాడుతూ, డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం పేరుతో ఫౌండేషన్ పెట్టి, పురస్కారం ఇవ్వాలని నిర్ణయించి, సామవేదం పేరును ప్రతిపాదిస్తే అందరూ ముక్తకంఠంతో ఆమోదించారని అన్నారు. మన సంస్కృతిని నాశనం చేయడానికే మెకాలే విద్యా విధానం ప్రవేశపెట్టారని, ఇప్పటికీ అదే ఆంగ్ల భాషను పట్టుకుని వేళ్లాడుతున్నామని ఆవేదన చెందారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మానసికంగా రాలేదని అన్నారు. డాక్టర్ దోర్భల ప్రభాకరశర్మ మాట్లాడుతూ, మన సంస్కృతి, మన భాష సంస్కృతాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన గేయం ఆలపించడంతో కరతాళధ్వానాలు మిన్నంటాయి. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, శకునాలన్నీ సీతమ్మకు చేరేసరికి శుభకరమైనవిగా మారినట్లు.. పురస్కారాలు సామవేదం వారిని చేరి గౌరవం పెంచుకుంటున్నాయని అన్నారు. సీతానగరం ఆశ్రమం గురించి డాక్టర్ బొంగు రాజారావు వివరించారు. డాక్టర్ సీహెచ్‌వీ రమణీ కుమారి సన్మాన పత్రం చదివారు. సామవేదం వారిపై స్వీయ పద్యాలను కవితా ప్రసాద్ చదివి, సన్మాన సమితి తరఫున సమర్పించారు. డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి స్వాగతం పలికి, ప్రార్థన చేశారు. హైదరాబాద్‌కు చెందిన సామాజిక సేవావేత్త జేవీ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధి సుశీల, ఫౌండేషన్ కన్వీనర్ బ్రహ్మజోస్యుల వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగం.. గడ్డుకాలం
● ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై శీతకన్ను ● ‘తల్లికి వందనం’లో కోతలు ● ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎగనామం ● గురువులకిచ్చిన హామీలు గాలికి..రాజమహేంద్రవరం రూరల్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నేడు సర్కారీ పాఠశాలల అభివృద్ధికి కా నరాని చేయూత.. ప్రభుత్వ చదువులకు కరవవుతున్న ప్రోత్సాహం.. విద్యారంగంలో సంక్షేమానికీ దాదాపు తిలోదకాలు ఇస్తున్న ధోరణి.. మరోవైపు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై విపరీతమైన బోధనేతర భారం.. పదో తరగతి పరీక్షల్లో 87.99 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ఆరో స్థానం సాధించడం మినహా.. ఇతరత్రా అన్ని రూపాల్లోనూ ప్రభుత్వ విద్యారంగం ఈ ఏడాది గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. తల్లికి ‘వంచన’ పేదింటి పిల్లలను బడికి పంపించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం పేరును ‘తల్లికి వందనం’గా మార్చింది. ప్రతి ఇంట్లోను చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రకటించింది. తీరా చూస్తే తొలి ఏడాది ఈ సాయాన్ని ఎగ్గొట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ ఏడాది ఈ పథకాన్ని అమలు చేసినా.. లబ్ధిదారుల్లో.. వారికిచ్చే సాయంలో భారీగా కోత పెట్టారు. జిల్లాలో 1,88,220 మంది విద్యార్థులుండగా, అధికారుల లెక్కల ప్రకారం 1,22,799 మంది తల్లుల ఖాతాల్లో రూ.240 కోట్లు జమ చేశారు. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే కొందరు తల్లులకు రూ.8 వేలు, మరికొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.11 వేల చొప్పున మాత్రమే జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే తల్లుల ఖాతాల్లో వేస్తామంటూ మెలిక పెట్టి, తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామం పెట్టింది. ఉన్నత విద్య భారం పేద విద్యార్థులు ఎటువంటి ఆటంకమూ లేకుండా ఉన్నత విద్య అభ్యసించాలనే ఉన్నతాశయంతో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం దాదాపు పూర్తిగా పక్కన పెట్టేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఏడాదైనా నిధులు విడుదల చేస్తారని ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. కంటితుడుపుగా కొందరు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వాస్తవానికి చాలామంది విద్యార్థులు నిధులు విడుదల కాక మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లించాల్సి వచ్చింది. నాణ్యత లేని ‘విద్యార్థి మిత్ర’ కార్పొరేట్‌కు దీటుగా పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉన్నతాశయంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వినూత్న రీతిలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరచిన రోజున విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, యూనిఫాం, బెల్టు, షూ, సాక్సులు, నాణ్యమైన స్కూల్ బ్యాగ్ వంటివి అందించింది. ఈ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా మార్చింది. తీరా ఆచరణకు వచ్చేసరికి ఆ మహనీయునికే మచ్చ తెచ్చేలా విద్యార్థులకు ఇచ్చే వస్తువుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చింది. స్కూల్ బ్యాగులు రెండు నెలలకే చిరిగిపోయాయి. బూట్లు ఇప్పటికే పాడైపోయాయి. దీంతో, విద్యార్థులు తరగతులకు చెప్పులతోనే హాజరవుతున్నారు. ట్యాబ్‌లు గోవిందా.. విద్యార్థుల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూజ్ కంటెంట్‌తో ట్యాబులు పంపిణీ చేసింది. తద్వారా విద్యార్థులు తరగతిలో పాఠంతో పాటు ఇంటికి వెళ్లాక కూడా ఆ ట్యాబ్‌ల ద్వారా ఆ పాఠాలకు సంబంధించి మరిన్ని విషయాలను లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉండేది. అర్థం కాని విషయాలను కూడా వాటి ద్వారా సులభంగా గ్రహించేవారు. ఈ ట్యాబుల పంపిణీకి చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే.. మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ పథకం పేరును ప్రస్తుత ప్రభుత్వం ‘మన బడి – మన భవిష్యత్తు’గా మార్చింది. నిధులు విదిల్చినప్పటికీ.. పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో ప్రస్తుతం తరగతి గదుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. బోధనేతర భారం మరోవైపు ఉపాధ్యాయులు బోధనేతర భారంతో సతమతమవుతున్నారు. ఫలితంగా విద్యార్థులు చదువులకు దూరమవుతున్న పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. యాప్‌ల భారాన్ని తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. టీచర్లపై హాజరు నమోదు, ఇన్స్పెక్షన్, యూనిఫాం, పరిశుభ్రత, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, సాసా, కర్మయోగి తదితర పలు రకాల యాప్‌ల బాధ్యతలు అప్పగించింది. దీంతో పాటు పేరెంట్స్ – టీచర్స్ కమిటీ సమావేశాలు ఉపాధ్యాయులకు భారంగా మారాయి. ఈ సమావేశాల కోసం గురువులు తమ జేబులోని సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది. హామీల అమలెప్పుడో! ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలును చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది కూడా గాలికొదిలేసింది. 12వ పీఆర్సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసిన సర్కారు.. ఇప్పటి వరకూ కొత్త కమిటీని వేయలేదు. కనీసం ఐఆర్ కూడా ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు డీఏల చెల్లింపుపై కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలైకి సంబంధించి ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మరో డీఏ అంటే మొత్తం నాలుగు డీఏలను ప్రభుత్వం చెల్లించాలని ఉపాధ్యాయులు అంటున్నారు. హుకుంపేట జెడ్పీ హైస్కూలులో నత్తనడకన తరగతి గదుల నిర్మాణం -
అలా ఆటాడుకుంటున్నారు
● జీఎంసీలో వివాదాస్పదంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ● మొత్తం ఖాళీలు 162 ● గత ఏడాది మొదటి నోటిఫికేషన్లో చూపినవి 77 ● రెండో విడతలో 79కి పెంపు ● వేర్వేరు కారణాలతో మొదటి రెండు నోటిఫికేషన్లూ రద్దు ● మూడోసారి పోస్టులు 60కి కుదింపు ● అధికారులు తమతో ఆటలాడుకుంటున్నారని అర్హుల ఆగ్రహంకాకినాడ క్రైం: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల(జీజీహెచ్)లో వివిధ కేడర్లలో పారామెడికల్ సిబ్బంది నియామకానికి చేపట్టిన ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు సంబంధించి 350కి పైగా పారామెడికల్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం జీఎంసీ, కాకినాడ జీజీహెచ్, రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసీ)తో పాటు వివిధ పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివిధ పారామెడికల్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయం ద్వారానే ఉమ్మడి జిల్లా పోస్టుల భర్తీ చేపట్టారు. అన్నిచోట్లా నియామకాలూ పూర్తయ్యాయి. అయితే, రాజమహేంద్రవరం జీఎంసీ, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (జీజీహెచ్) పరిధిలోని 79 పోస్టులను తామే భర్తీ చేసుకుంటామని అధికారులు దాదాపు ఏడాదిన్నర కిందట చెప్పారు. కానీ, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను సంబంధిత అధికారులు ఇప్పటి వరకూ పూర్తి చేయలేదు. ఈ పోస్టులకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్హులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించారా.. ఉమ్మడి జిల్లా ఉద్యోగాల నోటిఫికేషన్ కావడం వల్ల నియామక ప్రక్రియ ఆసాంతం కాకినాడ జిల్లా కలెక్టర్ పరిధిలోకే వస్తుంది. జీఎంసీలో పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకూ మూడుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కొద్ది కాలం ముందు మొదటిసారి ఇచ్చిన నోటిఫికేషన్లో 77 ఖాళీలు చూపించారు. అభ్యర్థుల అభ్యంతరాల పేరుతో దానిని రద్దు చేసి, గత ఏడాది డిసెంబర్లో రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం 79 పోస్టులు చూపారు. అనివార్య కారణాలంటూ దీనినీ రద్దు చేసినట్లు ప్రకటించారు. అయితే, రోస్టర్ నిర్వహణలో లోపం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వంటి కారణాలతోనే రెండో నోటిఫికేషన్ రద్దు చేశారన్నది అభ్యర్థుల వాదన. తాజాగా ఈ నెలలో మూడోసారి ఇచ్చిన నోటిఫికేషన్లో 60 మాత్రమే ఖాళీలున్నాయని తెలిపారు. కొన్ని ఉద్యోగాలకు విద్యార్హతలు నిర్ణయించలేదని, అందువలన మూడో నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య కుదించామని చెబుతున్నారు. అదే నిజమైతే అంతకు ముందు రెండుసార్లు అవే పోస్టులకు నోటిఫికేషన్లు ఎలా ఇచ్చారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మూడుసార్లు వేర్వేరుగా ఖాళీలు చూపుతూ, కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించి మరీ ఆయా నోటిఫికేషన్లపై సంతకాలు చేయించారని ఆరోపిస్తున్నారు. మొత్తం 162 ఖాళీలు రాజమహేంద్రవరం జీజీహెచ్, జీఎంసీలలో మొత్తం 162 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతానివే 79 కాగా, తాజాగా జీజీహెచ్‌లో మరో 83 ఖాళీలు ఏర్పడ్డాయి. రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆస్పత్రి అధికారులు కోరినా జీఎంసీ అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ 162 పోస్టులను గత నెల నాటికే భర్తీ చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించినా ఫలితం లేకపోయింది. కేవలం 60 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. పాతవి 19, కొత్తవి 83 కలిపి మిగిలిన 102 పోస్టులు ఎందుకు భర్తీ చేయకుండా నిలిపివేశారనేది జవాబు లేని ప్రశ్నగానే ఉంది. 11 కేడర్లకు ఎగనామం మొత్తం 21 కేడర్లలో సిబ్బందిని నియమించాల్సి ఉండగా.. 10 కేడర్ల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మిగిలిన 11 కేడర్లలోని కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఎలక్ట్రికల్ హెల్పర్, మార్చురీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సైకియాట్రీ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్టు, క్లినికల్ సైకాలజిస్టు పోస్టులను పక్కన పెట్టేశారు. విద్యార్హతలు నిర్ణయించలేదు ఖాళీలు ఎక్కువగా ఉన్న మాట నిజమే. అన్ని పోస్టుల భర్తీకీ బదులు 60 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చాం. కొన్ని పోస్టులకు విద్యార్హతలు ఇంకా నిర్ణయించలేదు. సూపర్‌స్పెషాలిటీ పోస్టులు ఇవ్వొద్దని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) ఆదేశించారు. అందుకే నోటిఫికేషన్లో ఇవ్వలేదు. అన్నీ నెమ్మదిగా అవుతాయి. కొత్త కాలేజీలకు ఇంకా ఉద్యోగ నియామకాలు జరగలేదు. – డాక్టర్ కేవీ శివప్రసాద్, ప్రిన్సిపాల్, రాజమహేంద్రవరం జీఎంసీ పోస్టులు తగ్గించాలని చెప్పలేదు సూపర్‌స్పెషాలిటీ సహా ఏ పోస్టులూ తగ్గించాలని లేదా పెంచాలని మేం ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదు. భర్తీకి అనుమతి మాత్రమే ఇచ్చాం. ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా అది పూర్తిగా వారి బాధ్యతే. జీఓ ప్రకారం ఎప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేయాలి. పోస్టుల కుదింపునకు గల కారణాలపై రాజమహేంద్రవరం జీఎంసీ అధికారులు మాకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. – డాక్టర్ రఘునందన్ గంభీర, డీఎంఈ నా జీవితంతో ఆడుకున్నారు నిరుద్యోగినైన నా జీవితంతో జీఎంసీ అధికారులు ఆడుకున్నారు. నా వయసు 48 ఏళ్లు. మూడోసారి విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ నాటికి నా వయో పరిమితి ముగిసింది. రెండో నోటిఫికేషన్ సమయానికి వయసు ఉన్నా, అకారణంగా నోటిఫికేషన్ రద్దు చేశారు. నేను మంచి మార్కులతో ఐటీఐ ఎలక్ట్రికల్ ఉత్తీర్ణుడినయ్యాను. మెరిట్‌లోనూ ముందున్నాను. రెండో నోటిఫికేషన్ కొనసాగి ఉంటే, మెరిట్ ఆధారంగా నాకే ఉద్యోగం వచ్చేది. అధికారుల నిర్వాకంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగానికి దూరమయ్యాను. నాకు భార్య, పిల్లలు ఉన్నారు. వారిని పోషించడానికి ఇంటింటికీ కేబుల్ వైర్లు వేస్తూ పూట గడుపుకొంటున్నాను. – పి.అశోక్, అభ్యర్థి, కాకినాడ -
నేటి నుంచి రెవెన్యూ క్లినిక్
రాజమహేంద్రవరం సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అధికంగా వస్తున్న భూ సంబంధిత ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని సోమవారం ప్రారంభిస్తున్నామన్నారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్ఎస్తో పాటు ఈ క్లినిక్ కూడా కొనసాగుతుందని తెలిపారు. ఇకపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓలు ప్రతి సోమవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఆపరేటర్, అవసరమైన రెవెన్యూ రికార్డులతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. నేడు పీజీఆర్ఎస్ కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ కీర్తి తెలిపారు. దీనిని సమర్థంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులు, ప్రత్యేక అవసరాలున్న పౌరులకు వసతులు కల్పించాలని సూచించారు. ప్రజలు 95523 00009 వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్రా యాప్ ద్వారా 36 ప్రభుత్వ శాఖలకు చెందిన 700కు పైగా సేవలను పొందవచ్చని వివరించారు. ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడిగా బాపిరాజు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం సిటీ): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా డిప్యూటీ తహసీల్దార్ గొలుగూరి బాపిరాజు వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఎన్నికలు స్థానిక ఇన్నీసుపేటలోని రెవెన్యూ భవన్లో ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. సహాధ్యక్షుడిగా డిప్యూటీ తహసీల్దార్ ఎం.కాంతి ప్రసాద్, కార్యదర్శిగా డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్ సురేష్‌బాబు, కోశాధికారిగా డిప్యూటీ తహసీల్దార్ ఎస్కే ఎండీ లాల్ అహ్మద్‌తో పాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా కాకినాడ కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం.రామ్మోహన్, పరిశీలనాధికారిగా కపిలేశ్వరపురం డిప్యూటీ తహసీల్దార్ జి.శ్రీనివాస్ వ్యవహరించారు. ఎన్నికై న సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కమిటీ 2028 వరకూ మూడేళ్లపాటు కొనసాగుతుందని రామ్మోహన్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న బాపిరాజు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని విధులకు హాజరయ్యే రెవెన్యూ ఉద్యోగులకు మంచి బస ఏర్పాటుకు రెవెన్యూ భవన్‌ను ఆధునీకరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఇన్సూరెన్స్, కలిసి వచ్చే ఉద్యోగులతో సొసైటీగా ఏర్పడి ఇళ్ల స్థలాల సాధనను ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నామని అన్నారు. ఈ లక్ష్యాలను పుష్కరాల్లోపే సాధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షుడు, డిప్యూటీ తహసీల్దార్ వి.శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం అర్బన్, కొవ్వూరు డివిజన్ అధ్యక్షుడు డిప్యూటీ తహసీల్దార్ కె.రవివిక్రమ్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు బి.కృష్ణశాస్త్రి, మూడు యూనిట్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. లోవలో ఆన్లైన్ సేవలు ప్రారంభం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవ స్థానంలో ఆదివారం నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. aptemples.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి నాడు నిర్వహించే మహాచండీ హోమం, అమ్మవారి తిరు నక్షత్రం స్వాతి సందర్భంగా ని ర్వహించే పంచామృతాభిషేకాలతో పాటు ఊయ ల సేవ, వాహన పూజలు తదితర నిత్య సేవలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఆన్లైన్లో నమోదు చేసుకుని వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశామన్నారు. కాటేజీలు, వసతి గదులు సైతం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు. వేలాదిగా భక్తుల రాక తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు క్యూలో దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.61775, పూజా టికెట్లకు రూ.91960, కేశఖండన శాలకు రూ.3,080, వాహన పూజలకు రూ.4,750, వసతి గదులు, కాటేజీల అద్దెలు రూ.36,020, విరాళాలు రూ.33,867, కలిపి మొత్తం రూ.2,31,452 ఆదాయం సమకూరిందని వివరించారు. -
ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి
అమలాపురం రూరల్: అమలాపురం మండలం వన్నెచింతలపూడికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం దేశం కాని దేశం వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. కేసీఎం అధికారుల చొరవతో అతని మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన ముంగండ రవితేజ (33) ఉపాధి నిమిత్తం ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఖతార్ దేశానికి వెళ్లి హౌస్ కేరింగ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 16న రాత్రి అక్కడ గుండెపోటుతో మరణించాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 17న కలెక్టర్ మహేష్ కుమార్‌ను సంప్రదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్, సిబ్బంది ఎంఎం సఫియా, కడియాల సత్తిబాబు, బద్రి దుర్గా అమ్మాజీలు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరించారు. అనంతరం భారత రాయబార కార్యాలయంతో పాటు ఖతార్‌లోని ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్‌కుమార్, విజయ్ చార్లీ, సోలామాన్, రమణ, శశిలతో నిరంతరం సమన్వయం జరిపారు. అనంతరం మృతదేహాన్ని వన్నెచింతలపూడికి శనివారం చేర్చారు. వ్యక్తి ఆత్మహత్య సామర్లకోట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట సీఐ ఎ.కృష్ణభగవాన్ కథనం ప్రకారం.. స్థానిక గాంధీనగర్‌కు చెందిన సిరికి రవికుమార్ (49) లారీ స్టాండ్ సమీపంలో చెట్టుకు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఆర్థిక ఇబ్బందులు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో సమాచారం మేరకు సీఐ కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కృషి, పట్టుదలతో లక్ష్య సాధన
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని సాధించాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరమని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ఆవరణలో శనివారం ఇన్‌స్పిరిట్–2025 కార్యక్రమాన్ని ఆ విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసవర్మ మాట్లాడుతూ తిరుమల విద్యా సంస్థలు స్థాపించిన అనతికాలంలోనే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేశారన్నారు. ఈ విద్యా సంస్థ దేశానికి ఎంతో మంది ఇంజినీర్లను, వైద్యులను అందించడమే కాకుండా తల్లిదండ్రుల ఆలోచనలకు తగినట్లుగా పిల్లలను తీర్చిదిద్దిందన్నారు. తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరిగిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్–2025 పరీక్షలలో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులైన తమ 667 మంది విద్యార్థులు వివిధ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, బిట్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన కళాశాలల్లో సీట్లు సాధించడం సంతోషదాయకమన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ తాను జన్మించిన కాతేరులో తిరుమల విద్యా సంస్థలు స్థాపించిన నున్న తిరుమలరావు సేవలను కొనియాడారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి లేకుండా చక్కని వాతావరణంలో చదువుకోవాలన్నారు. అనంతరం ఇంజినీరింగ్ సీట్లు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. విద్యా సంస్థల డైరెక్టర్ సరోజినీదేవి, వైస్ చైర్పర్సన్ శ్రీరష్మి, అకడమిక్ డైరెక్టర్ సతీష్‌బాబు, ప్రిన్సిపల్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి
గతంలో మాదిరిగా గంగిరెద్దుల ప్రదర్శనకు ఆదరణ అంతగా ఉండడం లేదు. కుల వృత్తిని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం గంగిరెద్దుల సామాజిక వర్గాన్ని గుర్తించి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ వృత్తిని కొనసాగించగలం. –బొడ్డు రాజు, పసలపూడి, రాయవరం మండలం పండగ సమయంలోనే.. ఒకప్పుడు అన్ని కాలాల్లో గంగిరెద్దుల ఆటను ప్రతి ఒక్కరూ ఆదరించేవారు. ఇప్పుడు కేవలం సంక్రాంతి సమయంలోనే ఆట ఉంటుంది. ఆదరణ తగ్గుతుండడంతో యువత ఈ వృత్తిని స్వీకరించడం లేదు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేందుకు, కూలి పనులకు వెళ్లిపోతున్నారు. –బొడ్డు ప్రకాష్, కందరాడ, పిఠాపురం మండలం ఆర్థికంగా ఆదుకోవాలి గంగిరెడ్ల సామాజిక వర్గం అనాది నుంచి సంచార జాతులుగా ఉంటున్నాం. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లి గంగిరెద్దులను ఆడించుకుని పోషణ పొందుతున్నాం. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకుంటే మా జీవితాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి. –జానపాటి ఏసు, మాధవపట్నం, కాకినాడ రూరల్ ఎస్టీ జాబితాలో చేర్చాలి ఊరూరా తిరుగుతూ ఉంటే సంచార జాతులమైన గంగిరెడ్ల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న గంగిరెడ్ల సామాజిక వర్గానికి కనీసం పక్కా ఇళ్లు లేవు. వృత్తి కూడు పెట్టకపోవడంతో చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. –బొమ్మన పరంజ్యోతి, అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గంగిరెడ్ల సంక్షేమ సంఘం -
అన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష సమర్పణ
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన పథకానికి విశాఖపట్నానికి చెందిన దాత కవికొండల అప్పలనర్సమ్మ తన భర్త, దివంగత వెంకట్రావు పేరుపై శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు రాజోలు: ప్రజా సంఘాల నేతలపై దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన ఘటనలో జనసేన నాయకుడు పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి)పై రాజోలు పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 25న శివకోటి ముసలమ్మ ఆలయ కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి రాజమహేంద్రవరానికి చెందిన బాలిక పాలపర్తి భవ్యశ్రీ మృతి చెందింది. ఈ ఘటనలో నిజ నిర్ధారణ కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చిన జిల్లా మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యుడు జనుపల్లి సత్యానందం (నాని), రాజో లు నియోజకవర్గ బహుజన సమాజ్‌వాది పార్టీ ఇన్చార్జి ఆకుమర్తి భూషణంలపై పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి) దాడి పాల్పడినట్లు చెబుతున్నా రు. మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన తమను బుజ్జి కులం పేరుతో దూషించి, దాడి చేసినట్లు జనుపల్లి సత్యానందం, ఆకుమర్తి భూష ణంలు రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బుజ్జిపై రాజోలు ఎస్సై రాజేష్‌కుమార్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. -
రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
అమలాపురం రూరల్: రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, ప్రజల సంకల్పాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ, పీడీఎస్‌యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ ప్రజా సంఘాలు శనివారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కోకన్వీనర్, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐకేఎంఎస్ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్‌కుమార్, బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అభివృద్ధి ముసుగులో జిల్లాల పునర్విభజన చేయడంతో ప్రజల మధ్య అనేక చీలికలు, అయోమయం, పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. భౌగోళికంగా, చారిత్రకంగా, పరిపాలనా పరంగా శతాబ్దాలుగా కాకినాడ జిల్లాతో అనుసంధానమైన రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గోదావరి నదిని దాటి వెళ్లాల్సిన దూర ప్రాంతంతో అనుసంధానం చేయడం ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవి అందుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. అఖిలపక్ష జేఏసీ గౌరవ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ, ఐఎఫ్టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, నాయకులు నాగరాజు, అలీ, కె.నవీన్, బుల్లి రాజు, పట్టాభి, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు
సామర్లకోట: గొంచాల–అచ్చంపేట రోడ్డులో జరిగిన ప్రమాదంలో పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. నక్కపల్లి యూనియన్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సందీప్‌రాజు కారు అతి వేగంగా రావడంతో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరర చదువుతున్న బెహరా రాజు తీవ్రంగా గాయపడ్డాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తాను ఏమి చేయలేనని సందీప్‌రాజు చెప్పడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దాంతో సీఐ ఎ.కృష్ణభగవాన్ శనివారం రాత్రి ఇరువర్గాలను పిలిచి చర్చలు జరిపారు. బాధితుడి కాలు పూర్తిగా తీసి వేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని, నష్ట పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దానికి కారు యజమానికి చెందిన బంధువులు అంగీకరించక పోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సీఐ సూచించారు. అయితే రాత్రి వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. -
రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలు ప్రారంభం
రావులపాలెం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో శనివారం మాజీ వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఆధ్వర్యంలో దండు సాయిఆకాష్వర్మ మెమెరబుల్ టోర్నమెంట్ 10వ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ సీనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ ఆటలో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవశాత్తూ మరణించిన దండు సాయిఆకాష్ వర్మ ఆసక్తి మేరకు అతని తండ్రి దండు సుబ్రహ్మణ్యేశ్వరవర్మ, సుజాత దంపతులు ఈ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం జగ్గిరెడ్డి టాస్ వేసి తూర్పుగోదావరి– నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్‌ను ప్రారంభించారు. అలాగే క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేశారు. 13 జిల్లాల నుంచి మెన్, ఉమెన్ కేటగిరీల్లో మొత్తం 26 టీమ్‌లు పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ విధానంలో తొలి రోజు పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో పది మ్యాచ్‌లు, మహిళల విభాగంలో నాలుగు మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు క్వార్టర్స్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని నెట్‌బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచులు బొక్కా కరుణాకరం, సబ్బితి మోహనరావు, కొత్తపేట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు. -
డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!
ఫ వైభవాన్ని కోల్పోతున్న గంగిరెద్దులాట ఫ ఇతర వృత్తులకు మళ్లుతున్న నిర్వాహకులు రాయవరం: అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్లు గ్రామాల్లో సందడి చేస్తుంటారు. తలకు పాగా ధరించి, వివిధ రకాల దుస్తులను ధరించి, బూర ఊదుకుంటూ గంగిరెద్దులను తీసుకు వస్తారు. అందంగా అలంకరించిన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికీ వెళ్లి వారి వంశ ప్రతిష్టను కీర్తించే గంగిరెద్దుల వారికి గ్రామాల్లో గంగిరెద్దులాటకు రానురానూ ఆదరణ తగ్గుతోంది. సాధారణ రోజుల్లో గంగిరెద్దులను ఆడిస్తూ గ్రామాల్లో తిరిగినా సంక్రాంతి సమయంలోనే నిర్వాహకులకు ఓ ప్రత్యేకత ఉంటుంది. హరిదాసులతో పాటు డూడూ బసవన్నల రాకతోనే సంక్రాంతి పండగకు పరిపూర్ణత వస్తుందని చెప్పవచ్చు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఇళ్ల ముంగిట్లో ఎక్కడ చూసినా గంగిరెద్దులు దర్శనమిచ్చేవి. వీటి నిర్వాహకులు ప్రతి ఇంటికి వచ్చి సన్నాయితో పాటలు పాడుతూ.. ఇంటి యజమానుల వంశాన్ని కీర్తిస్తూ.. బసవన్నను ఆడిస్తూ యజమానులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. నిర్వాహకులు సన్నాయితో పాడే పాటలకు అనుగుణంగా గంగిరెద్దుతో నాట్యం, విన్యాసాలు చేయిస్తారు. గ్రామాల్లో చిన్న పిల్లలు గంగిరెద్దుల వెంట తిరుగుతూ సెలవు దినాలను ఆనందోత్సాహాలతో గడిపేవారు. ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 15 వేల మంది గంగిరెద్దుల సామాజిక వర్గం వారు ఉన్నారు. వీరు 25 సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అమలాపురం, కొత్తపేట, రాయవరం, పసలపూడి, రాజమహేంద్రవరం, వెదురుమూడి, ముక్కామల, భీమనపల్లి, మురముళ్ల, నీలపల్లి, కాకినాడ, అనపర్తి, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో గంగిరెడ్ల సామాజిక వర్గం వారు జీవిస్తున్నారు. ఈ వృత్తిలో ఆదరణ తగ్గిపోవడంతో ఇతర వృత్తుల్లోకి మరలిపోతున్నారు. కొందరు ఇంకా పక్కా ఇళ్లకు కూడా నోచుకోలేక పోతున్నారు. ఇప్పటికీ మార్కెట్ షెడ్లలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ కొందరు గంగిరెద్దులను తీసుకుని సంక్రాంతికి జిల్లాలోని కందికుప్ప, అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు తరలివెళ్లారు. తగ్గుతున్న ఆదరణ గంగిరెద్దులకు కాలక్రమంలో ఆదరణ తగ్గుతుంది. ఇదే విషయాన్ని గంగిరెద్దుల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గడానికి ఇంటింటికి ఉన్న టీవీలు కూడా ఒక కారణమని అంటున్నారు. టీవీలతోనే పిల్లలు, పెద్దలు కాలక్షేపం చేస్తూ గంగిరెద్దుల ఆటను తనివితీరా ఆస్వాదించ లేకపోతున్నారని, ఆట చూడడానికి కూడా తీరిక ఉండడం లేదని నిర్వాహకులు అంటున్నారు. గతంలో గంగిరెద్దుల ఆటలు జనరంజకంగా ఉండేవి. గంగిరెద్దుల ఆటను చూసిన అనంతరం ఇంటి యజమానుల నుంచి కానుకలు స్వీకరించే ముందు వారిని ఆశీర్వదించేవారు. -
పరుగు పందెంలో బంగారు పతకం
బాలాజీచెరువు: ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ప్రథమ సంవత్సర విద్యార్థిని బి.నాగవిహారిక ప్రతిభ కనబరిచింది. ప్రో స్పోర్ట్స్ 100 ప్లస్ టీం, హైదరాబాద్ డిస్ట్రిక్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో 12 సెకన్లలో పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్‌తో పాటు రూ.30 వేల నగదు సాధించారు. అలాగే గత నెలలో నన్నయ వర్సిటీలో నిర్వహించిన అథ్లెటిక్స్ నన్నయవర్సిటీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాస్టెస్ట్ ఉమెన్ టైటిల్ సాఽధించారు. కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బీఏ విద్యార్థి వి.రేష్మయాదవ్ ప్రతిభ చూపి బంగారు పతకంతో పాటు నొయిడాలో జనవరి 3 నుంచి నిర్వహించే జాతీయ పోటీలకు అర్హత పొందారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సంజీవ్‌కుమార్, పీడీ రమణ, డాక్టర్ పసుపులేటి హరిరామప్రసాద్ అభినందించారు. -
సమాజానికి సాయితత్వం అవసరం
తాళ్లపూడి: నేటి సమాజానికి సాయితత్వం ఎంతో అవసరమని ఆధ్యాత్మిక వేత్తలు అన్నారు. బల్లిపాడులోని కాకర్ల రామయ్య ఫంక్షన్ హాల్లో షిరిడీ సాయి సేవాదళ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత షిరిడీ సాయి భక్త సమ్మేళనం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా సాయి ఆధ్యాత్మిక వేత్తలు అనఘానందస్వామి, కర్లపూడి కృష్ణ, సాయి శ్రీనివాస్, మధు సాయి, ఆదిపూడి సాయిరాం, రమణ మూర్తి తదితరులు సచ్ఛరిత్ర సాధన మార్గాలు, సమర్థ సద్గురుతత్వం, సాయి నామ మహిమలు, నేటి సమాజంలో సాయితత్వం ఆవశ్యకతపై ప్రసంగించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. వచ్చిన భక్తులకు సాయి సచ్చరిత్ర పుస్తకాలు, విభూతి, ప్రసాదాలను పంపిణీ చేశారు. సంస్థ చైర్మన్ సింహాద్రి జనార్దనరావు, ఫౌండర్ కాళ్ల రత్నాజీరావు ఆధ్వర్యంలో తాళ్లపూడి రైస్ మిలర్స్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అల్లూరి విక్రమాదిత్య, అప్పన రాజా, గోకవరపు సూరిబాబు, కొండూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. యూత్ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదుకు కార్యాచరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులను అధిక సంఖ్యలో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సొసైటీల్లో సభ్యులుగా నమోదు చేయించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల జాబితాను సేకరించి, ఆయా విద్యాసంస్థలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, విద్యార్థులను సభ్యులుగా నమోదు చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రతి కళాశాల, పాఠశాలలో ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించి, సభ్యత్వ నమోదుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాకారానికి కృషి చేయాలన్నారు. విద్యా సంస్థల్లో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్న్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యానికి 5న బహిరంగ వేలం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో అక్రమ కేసులలో స్వాధీనం చేసుకున్న 33.85 క్వింటాళ్ల రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని నిబంధనల మేరకు బహిరంగ వేలం విధానంలో విక్రయించనున్నట్లు జేసీ మేఘ స్వరూప్ శనివారం తెలిపారు. 2026 జనవరి 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ వద్ద గల పౌర సరఫరాల కార్యాలయంలో సంబంధిత అధికారుల సమక్షంలో ఆ ప్రక్రియ జరుగుతుందన్నారు. పాల్గొనే ఆసక్తి కలిగినవారు జనవరి 3న పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచిన బియ్యం నమూనాలను పరిశీలించుకోవచ్చన్నారు. అలాగే నిబంధనల ప్రకారం రూ.50 వేలు ధరావత్తు చెల్లించి, నిర్దిష్ట నమూనాలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇప్పటికే 6ఏ కేసులు నమోదై, పెండింగ్‌లో ఉన్న వ్యక్తులు, సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొనడానికి అనర్హులన్నారు. హిందువులందరూ ఏకం కావాలి కరప: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు హిందువులందరకూ ఏకం కావాలని కాకినాడ గీతాశ్రమం స్వామీజీ దివ్యానంద సరస్వతి పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా శనివారం నీలయ్య తోటలోని ఒకలే అవుట్లో మండల సహ కన్వీనర్ కొక్కెరమట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2.50 లక్షల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలన్న ఆశయంలో ఇంత వరకూ 1.50 లక్షల సమ్మేళనాలు జరిగాయన్నారు. హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాపింపజేయాలన్నారు. -
పరుగు పోటీలకు ఎడ్లు, గుర్రాలు సిద్ధం
● వడిశలేరులో నేడు రాష్ట్ర స్థాయి పోటీలు ● విజేతలకు బహుమతులుగా మోటారు సైకిళ్లు రంగంపేట: సంక్రాంతి శోభను ముందుగానే తీసుకువస్తూ వడిశలేరు రాష్ట్ర స్థాయి గ్రామీణ క్రీడా సంబరానికి ముస్తాబైంది. ఆదర్శ రైతు దివంగత గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం, జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో 7వ వార్షిక రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు వంద ఎడ్ల బళ్లు, 50 గుర్రాలు ఈ పోటీల్లో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అటు ఎడ్లు, గుర్రాల పరుగు పోటీలను వేర్వేరు ట్రాక్‌లపై ఒకే సమయంలో నిర్వహించడం ఈసారి ప్రత్యేకత. టైమ్ రికార్డింగ్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా విజేతలను నిర్ణయిస్తారు. బహుమతుల వివరాలు ఎడ్లబళ్ల పోటీలకు సంబంధించి సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతలకు మొత్తం ఆరు మోటారు బైక్‌లు అందజేస్తారు. విజేతలకు మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, ద్వితీయ, తృతీయ బహుమతులుగా హోండా షైన్ ఇవ్వనున్నారు. 3టీ ఇన్నోవేషన్స్ సౌజన్యంతో 75 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నారు. గుర్రాల విభాగంలో మొదటి ఏడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు అందించనున్నారు. మొదటి బహుమతిగా రూ.40 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా 25 వేలు చొప్పున అందిస్తారు. మొత్తం ఏడుగురికి వీటిని అందజేస్తారు. -
కన్నీరే మిగిలింది
సాక్షి, రాజమహేంద్రవరం: కర్షకులకు ఈ ఏడాది కన్నీరు తప్పలేదు.. చంద్రబాబు ప్రభుత్వం నుంచి సహకారం కొరవడటం.. ఆపై విపత్తుల విశ్వరూపం వెరసి.. అన్నదాతలకు ఆక్రందనే మిగిలింది. పంట సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ నిధులకు ఎగనామం పెట్టింది. ఉచిత పంటల బీమాకు మంగళం పాడి రైతుల నెత్తిన ప్రీమియం భారాన్ని మోపింది. పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను ప్రభావంతో నోటికాడ కూడు నీటి పాలైంది. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం అందించిన దాఖలాలు లేవు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) నిర్వీర్యం చేసింది. రబీలో ఎరువుల కొరతతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ధాన్యం కొనుగోలు డబ్బులు సైతం సకాలంలో అందించకుండా కాలయాపన చేసింది. ఇలా అన్నింటా రైతులను నట్టేట ముంచింది. వెరసి 2025 ఏడాది చంద్రబాబు ప్రభుత్వం రైతులకు నిరాశ మిగిల్చింది. అన్నదాతకు మొండిచేయి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా రూ.20 వేలు అందజేస్తామని ప్రకటించి మోసం చేసింది. అధికారం చేపట్టిన తొలి ఏడాది నిధులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. రెండో దశలో 18,511 మంది రైతులకు మొండిచేయి చూపింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మందికి రైతు భరోసా పథకంలో నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుతం వాటి సంఖ్య 1,14,991కు చేరింది. సుమారు 1.10 లక్షల మంది కౌలు రైతులకు నయా పైసా ఇవ్వకుండా కంట తడి పెట్టించింది. గత నాలుగేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేసింది. విద్యుత్ కోతలు వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు ప్రభుత్వం కొన్ని రోజులకే 9 గంటల విద్యుత్ సరఫరాను 7 గంటలకు తగ్గించింది. దీంతో పంట సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీమాకు ఎగనామం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలన్న నిబంధనను తెరపైకి తెచ్చింది. 2024–25 రబీ సీజన్‌కు ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం రైతులే కట్టుకోవాలంటూ ఆదేశాలిచ్చింది. వరి పంట హెక్టారుకు రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. రైతుల భాగస్వామ్యం పేరుతో భారాన్ని మోపింది. ఫలితంగా వేల సంఖ్యలో రైతులు బీమాకు దూరమయ్యారు. ఆర్బీకేల నిర్వీర్యం రైతులకు వ్యవసాయ సేవలు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 367 రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, ఉద్యాన పంటలకు సైతం ఎంతగానో ప్రోత్సాహం అందించింది. అలాంటి వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎరువుల పంపిణీ బాధ్యతను పీఏసీఎస్‌లకు అప్పగించింది. తద్వారా రైతులు ఎరువులు తీసుకునేందుకు అవస్థలు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ధాన్యం సేకరణకు నిబంధనలు ఖరీఫ్ ధాన్యం సేకరణకు నిబంధనలు తీసుకురావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధాన్యం తడిచినా, మొలకెత్తినా, రంగుమారినా కొనుగోలు చేయలేదు. మిల్లర్లకు నచ్చి.. వాళ్లు ఇచ్చే ధరకు విక్రయించుకోండంటూ చేతులేత్తసింది. ముంపునకు గురైన పంటలో తేమ శాతం అధికంగా ఉంటుందని, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉండటంతో తాము మద్దతు ధర ఇచ్చే ప్రసక్తే లేదని మిల్లర్లు, దళారులు స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక రైతులు తక్కువ ధరకు తెగనమ్ముకున్నారు. బస్తాపై రైతులు రూ.400 నష్టపోయారు. అందని మోంథా సాయం మోంథా తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా మోంథా తుపాను నష్టాలపై అధికారులు తుది నివేదిక ప్రభుత్వానికి పంపారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 18 మండలాల పరిధిలో 33,262 మంది రైతులు నష్టపోయినట్లు నివేదిక రూపొందించారు. మొత్తం 16,540 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నష్టపోగా, వాటి విలువ సుమారు రూ.40.96 కోట్లుగా నిర్ధారించారు. 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738.607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ దాదాపు రూ.38.21 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ జరిగి నెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉద్యాన పంటలకు గిట్టుబాటు లేక.. 2025 ఏడాదిలో ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కరువైంది. జిల్లా వ్యాప్తంగా 90 వేల మంది రైతులు ఉద్యాన పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా మామిడి రైతులు తీవ్ర నష్టాలు చవి చూశారు. టన్నుకు రూ.50 వేలు అందాల్సి ఉండగా, కేవలం రూ.17 వేలు మాత్రమే దక్కింది. కొబ్బరిదీ అదే దారి జల్లా వ్యాప్తంగా 8,050 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి ప్రతి నిత్యం దాదాపు 50 లారీల కాయలు ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 175 కాయల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది కుంభమేళా సందర్భంగా ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. వెయ్యి కాయల ధర ఏకంగా రూ.32 వేలు పలికింది. ప్రస్తుతం అది కాస్తా రూ.8 వేలకు పడిపోయింది. ఇలా కొబ్బరి ధరల్లో ఒడిదొడుకులతో రైతులు నానా అవస్థలు పడ్డారు.అరటి రైతుల అవస్థలు జిల్లాలో 7,500 హెక్టార్లలో అరటి తోటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా చక్కెరకేళీ, ఎర్ర చక్కెరకేళీ, అమృతపాణి, కర్పూరం రకాలను ఇక్కడి రైతులు పండిస్తున్నారు. జిల్లా నుంచి నిత్యం సుమారు 40 లారీల్లో అరటి గెలలను వివిధ ప్రాంతాలు, రాష్టాలకు తరలిస్తారు. మే నెలలో 10 టన్నుల లారీ ధర రూ.2 లక్షలు పలికింది. అది కాస్తా ప్రస్తుతం రూ.40 వేలకు పడిపోయింది.ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం ధాన్యం విక్రయించిన 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం.. నెలలు గడిచినా నగదు ఇవ్వలేదు. గత రబీలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు గాను రూ.781.08 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.632.6 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.148.48 కోట్లు చెల్లించేందుకు నెలలు గడిచింది. దీంతో రైతులకు ఆర్థికంగా అవస్థలు తప్పలేదు. వ్యవసాయం ఈ ఏడాది రైతులకు అష్టకష్టాలు చంద్రబాబు ప్రభుత్వ సహకారం కరవు ఆపై విపత్తులతో భారీ నష్టం ఖరీఫ్‌ను ముంచేసిన మోంథా తుపాను నేటికీ అందని నష్టపరిహారం -
పార్థుని సంస్కారం ప్రశంసనీయం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పార్థుని సంస్కారం ప్రశంసనీయమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఆయన శనివారం హిందూ సమాజంలో 31వ రోజు విరాట పర్వ ప్రవచనం ముగించి, ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. పాండవులు తన వద్దనే అజ్ఞాతవాసం ముగించారని తెలుసుకున్న విరాటరాజు అనందభరితుడవుతాడు. తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోవాలని అర్జునుడిని కోరతాడు. అర్జునుడు దానిని అంగీకరించక, ఉత్తరను కోడలిగా చేసుకుంటానని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ‘ఏడాది పాటు ఉత్తరకు నాట్యం నేర్పాను, ఆమె నన్ను ఆచార్యునిగా, తండ్రిగా భావించింది. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే లోకం నా నడవడిని శంకిస్తుంది. ఆమెను కోడలిగా చేసుకుంటే నన్నుగానీ, నీ కుమార్తెను గానీ ఎవరూ శంకించరు. నేనులోకాపవాదుకు భయపడతాను’ అన్న అర్జునుని ఉత్తమ సంస్కారం మనకు ఆదర్శం కావాలని సామవేదం అన్నారు. ఉత్తరాభిమన్యుల వివాహంతో విరాట పర్వం ముగిసింది. సినిమాల్లో చూపినట్లు వివాహానికి ముందు ఉత్తరాభిమన్యులు యుగళగీతాలను పాడుకోలేదని ఆయన అన్నారు. నేడు సామవేదంకు బ్రహ్మజోస్యుల పురస్కారం ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు, గాంధేయవాది, సీతానగరం ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని సామవేదం షణ్ముఖశర్మ అందుకోనున్నారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతానగరం కస్తూర్బా ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుందని భగవత విరించి టీవీ నారాయణరావు వేదికపై వివరాలను వెల్లడించారు. -
పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యమివ్వాలి
● విద్యుత్ ఓసీ ఉద్యోగుల డిమాండ్ ● కాకినాడలో సంఘ వార్షికోత్సవం కాకినాడ రూరల్: పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డలోని జి.కన్వెన్షన్ హాల్లో శనివారం రాష్ట్ర స్థాయిలో సంఘ 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాల వెంకట రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో 2026 సంవత్సర కేలండర్, డైరీలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి హాజరయ్యారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీల ప్రయోజనాల కోసం పోరాటానికి విద్యుత్ సంస్థలో విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ప్రారంభించామన్నారు. ముఖ్యంగా ఓసీలకు ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల వలన అన్యాయం జరుగుతోందన్నారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కంటే సీనియారిటీకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగుల పీఆర్సీ, న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫారం నేషనల్ ప్రెసిడెంట్ ఎం.నాగరాజు, ఓసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి, సౌత్‌జోన్ ఏఐఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నజీర్ డల్, ఈపీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ అప్పలరాజు, కంపెనీ సెక్రటరీ త్వరగా రామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రాంతీయ అధ్యక్షుడు కేవీవీ రమణ, కాకినాడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.సురేష్‌బాబు, జ్యోతుల వీరబాబు, బొజ్జా వాసు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
సమ్మెతో ఇబ్బందులు
లారీల సమ్మెతో ఇబ్బందులు పడుతున్నాం. పని లేక కుటుంబాలను పోషించుకోవడానికి నానాపాట్లూ పడుతున్నాం. ఈ వృత్తినే నమ్ముకుని ఉన్నాం. సమ్మె ఇలాగే కొనసాగితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. – వి.సుబ్బారావు, లారీ డ్రైవర్, తాడేపల్లిగూడెం ఆర్థికంగా నలిగిపోతున్నాం వారం రోజులుగా జరుగుతున్న లారీ ల సమ్మెతో ఏ పనీ లేకుండా పోయింది. ఆర్థికంగా నలిగిపోతున్నాం. లారీ ఓనర్ల డిమాండ్లు న్యాయమైనవే అయినా మాకు మాత్రం ఇబ్బంది కలుగుతోంది. – ఆర్.గణేష్, లారీ డ్రైవర్, విజ్జేశ్వరం -
సానుకూల దృక్పథంతో లక్ష్య సాధన
రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని సాధించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి, టెలికమ్యూనికేషన్ మంత్రి పెమ్మ సాని చంద్రశేఖర్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు తిరుమల విద్యా సంస్థల ఆవరణలో శుక్రవారం మెడ్సినాప్స్–2025 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీనికి తిరులమ విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ నీట్–2025లో ఉత్తీర్ణత సాధించిన తిరుమల విద్యార్థుల్లో 251 మంది వివిధ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. 2011లో 700 మంది విద్యార్థులతో ప్రారంభమైన తిరుమల విద్యా సంస్థలో నేడు 43 వేల మంది విద్యార్థులు ఉండడం వెనుక ఒక కఠోరమైన శ్రమ ఉందన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గతంలో విద్యా సంస్థలు అంటే గుంటూరు, విజయవాడ మాత్రమే అనుకునేవారని, ఇప్పుడు రాజమహేంద్రవరంలో తిరుమల విద్యాసంస్థలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందదాయకమన్నారు. రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు నేర్చుకోవాలన్నారు. హైదరాబాద్ యశోధ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యురాలు కోన లక్ష్మీకుమారి మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఎంతో నిబద్ధతతో పనిచేయాలన్నారు. తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు మాట్లాడుతూ నీట్–2025లో ఆలిండియా 19వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రాజమహేంద్రవరం విద్యార్థి సాధించారన్నారు. అలాగే రాజమహేంద్రవరం క్యాంపస్ నుంచి 188 మంది వైద్య సీట్లు సాధించారన్నారు. వైద్య సీట్లు సాధించిన విద్యార్థులకు స్టెత్‌స్కోప్, జ్ఞాపికలను ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేశారు. అకిరా కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ ఎన్.ప్రభాకరరావు, తిరుమల విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ శ్రీరేష్మి, డైరెక్టర్ సరోజినిదేవి, అకడమిక్ డైరెక్టర్ సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ శ్రీహరి పాల్గొన్నారు. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్ వైద్యులు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్ వైద్యులు ఒక పసివాడి ప్రాణాలు కాపాడారు. ఆ వివరాల్లోకి వెళితే.. పండా విజయదుర్గ అనే మహిళ మూడు రోజుల నుంచి జీజీహెచ్‌లోని న్యూరో మెడిసిన్ విభాగంలో ఫిట్స్‌తో చికిత్స పొందుతుంది. ఆమెకు ఎనిమిది నెలల కుమారుడు. ఆస్పత్రిలో తల్లితో పాటు ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆ చిన్నారి ఆడుకుంటూ అక్కడే ఉన్న మెంతోప్లస్ బామ్ డబ్బా ప్రమాదవశాత్తూ మింగేశాడు. డబ్బా బయటకు రాక ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం గుర్తించిన తల్లి విజయదుర్గ తోటి రోగుల సహాయంతో బాలుడిని కింద అంతస్తులోని అత్యవసర విభాగంలో చేర్చింది. అప్పటికే బాలుడి నోటి నుంచి రక్తం కారడం మొదలైంది. తక్షణమే స్పందించిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మ, సహ వైద్యులు సత్యవాణి, మాణిక్యం, కాంతిమ సహకారంతో అరగంట పాటు శ్రమించి బాలుడి గొంతు నుంచి మెంతోప్లస్ బామ్ డబ్బాను బయటకు తీసి ప్రాణాలు నిలిపారు. వైద్యుల కృషిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అభినందించడంతో పాటు బాలుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
రాతనాల్లా మార్చుకుందామా..
ఫ మంచి దస్తూరితో భవితకు బాట ఫ పదో తరగతిలో మంచి మార్కులకు దోహదం ఫ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు రాయవరం/ ప్రత్తిపాడు: మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు.. కానీ అందుకు తగ్గట్టుగా మార్కులు రావడం లేదు.. మా అమ్మాయి లెక్కలు బాగా చేస్తోంది. సూత్రాలు, ఫార్ములాలు మాత్రం ఎందుకో తప్పుగా కనిపిస్తుంటాయని ఉపాధ్యాయులు తరచూ చెప్పే మాటలివి.. ఇందుకు కారణం చేతిరాతే. ‘రాత బాగుంటే గీత బాగుంటుంది’ అన్న నానుడి పరీక్ష రాసే విద్యార్థికి ‘అక్షరాలా’ సరిపోతుంది. మంచి దస్తూరి ఉంటే మూల్యాంకనం సమయంలో సమాధాన పత్రాలు దిద్దే ఉపాధ్యాయుడికి మంచి భావన కలుగుతుంది. ఆ ప్రభావం మార్కులపై ఉంటుంది. అందుకే పరీక్షల్లో తెలివితో పాటు అక్షరాలు కూడా ఆయుధాలుగా పనిచేస్తాయని ఉపాధ్యాయులు చెబుతారు. ఇవి పాటిస్తే మంచిది ఫ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అంగుళం మార్జిన్ విడిచి పెట్టాలి. ఫ సమాధాన పత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా ఉండాలి. ఫ అక్షరాలు వంకర టింకరగా, గజిబిజిగా ఉంటే మార్కులు తగ్గినట్టే. ఫ పేజీకి 16 నుంచి 20 లైన్లకు మించకుండా రాయాలి. ఫ సమాధానాలు రాసే సమయంలో ప్యాడ్‌పైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయాలి. ఫ రెండు పదాల మధ్య ఒక అక్షరం లేదా ‘0’ పట్టేంత ఖాళీ స్థలం ఉండాలి. రెండు వరుసల మధ్య అర అంగుళం దూరం వదలాలి. ఫ కంటికి పేపరుకు 30–35 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఫ అక్షరాలన్నీ ఒకే సైజులో, ఒకే లైనులో ఉంటేనే రాత అందంగా వస్తుంది. ముందుగా ఫోర్ రూల్, తర్వాత డబుల్ రూల్, అనంతరం సింగిల్ రూల్‌పై ప్రాక్టీస్ చేయాలి. ఫ ఇంగ్లిష్‌లో కర్సివ్, లుసిడా రైటింగ్‌ను ప్రాక్టీస్ చేయాలి. వరుస క్రమంలో కనీసం పది రోజులు తర్ఫీదు తీసుకోవాలి. ఫ మొదటగా లెటరింగ్, తర్వాత వర్డింగ్, అనంతరం సెంటెన్సెస్ రాయడం నేర్చుకోవాలి. ఫ గొలుసుకట్టు రాత ఉండకూడదు. ప్రతి అక్షరం ఒకే పరిమాణంలో రాయాలి. ఫ పెన్నును మామూలుగా పట్టుకోవాలి. బిగుసుగా పట్టుకుంటే వేగంగా రాయలేం. అక్షరాల స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ ప్రాథమిక స్థాయి నుంచే మంచి రాత అలవాటు చేసుకోవాలి. తెల్ల కాగితంపై వరుస తప్పకుండా రాయగలగాలి. సాధనతోనే సాధ్యంప్రతి విద్యార్థికి తెలివి తేటలకు తోడు, సమయ పాలనకు, సహనానికి దస్తూరి ఓ సూచికగా చెప్పవచ్చు. అందుకే మంచి దస్తూరి ఉన్న విద్యార్థులే దాదాపు టాపర్లుగా నిలుస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి దిద్దుబాట్లు, కొట్టివేతలు లేకుండా రెండున్నర గంటల్లో స్పష్టంగా పరీక్ష రాయాలి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి చేతిరాతపై పడింది. ఇందుకు తగిన తర్ఫీదును ఉపాధ్యాయులు ఇస్తూ సాధన చేయిస్తున్నారు. పరీక్ష నెమ్మదిగా రాస్తే సమయం సరిపోదు. వేగంగా రాసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.ఇలా చేయాలంటే ముందుగా ప్రత్యేక తరగతులు, స్లిప్, గ్రాండ్ టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ముత్యాల్లాంటి అక్షరాలు మంచి మార్కులు తెచ్చిపెడతాయి.. విద్యార్థి భవితకు బాటలు వేస్తాయి.. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించడంతో పాటు, మంచి దస్తూరితో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. మనం ఏం రాశామన్నది పేపర్లు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం అయ్యేట్టు ఉంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి.. దీనికోసం మంచి దస్తూరిపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే పదో తరగతి పరీక్షల్లో ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
బాలా.. భళా
ఫ ఆంగ్లంలో 20వ ఎక్కం వరకూ చెబుతున్న ఒకటో తరగతి విద్యార్థి ఫ చిన్న వయసులోనే ప్రతిభ కొత్తపేట: ఒకటో తరగతి బాలుడు.. ఎక్కాలు ఆంగ్లంలో గణగణా చెప్పేస్తున్నాడు.. ఆ చిన్నారి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్నాడని అనుకుంటున్నారా? కాదు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడే.. అతని జ్ఞాపకశక్తి అమోఘమని అందరూ ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్ మేధావి అని ఆకాంక్షిస్తున్నారు.. ఈ బాలుడి పేరు అడపా మోహన్సాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.దుర్గాప్రసాద్ ఎక్కాలు సులభ రీతిలో ఆంగ్లంలో చదవడంపై శిక్షణ ఇచ్చారు. దాని ఫలితంగా మోహన్సాయి అందరి కంటే మించి ఒకటో ఎక్కం నుంచి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు అనర్గళంగా చూడకుండా చెప్పేస్తున్నాడు. ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్ ఆ పాఠశాల సందర్శన సందర్భంగా ఏ ఎక్కం గురించి అడిగినా భయం లేకుండా, తడుముకోకుండా అప్పచెప్పేశాడు. బాలుడి మేథస్సుకు ముచ్చటపడి ఆయన అభినందించారు. నేటి బాల మేథావి అని ఆకాంక్షించారు. ఇదిలాఉంటే అతని తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివిన విద్యాధికులు కాదు.. తండ్రి శ్రీనివాసరావు సాధారణ రైతు కాగా, తల్లి గృహిణి. అతని అన్న రెండో తరగతి చదువుతున్నాడు. జ్ఞాపకశక్తి అమోఘం చిరుప్రాయంలోనే ఇంత మేథస్సు గల మోహన్సాయి గురించి ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్‌ను ‘సాక్షి’ అడగ్గా, ఆయన ఇలా తెలిపారు. ఒకటో తరగతి బాలలు రెండు పదులు, మూడు పదులు వరకూ చెప్తారు. కానీ సాయి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు ఆంగ్లంలో ధారాళంగా చూడకుండా చెబుతున్నాడు. ఇతని జ్ఞాపకశక్తి అద్భుతం, అమోఘమని అన్నారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఒకటో తరగతి విద్యార్థి ఇలా చెప్పడం చూడలేదని చెప్పారు. గత ప్రభుత్వ పునాదికి ఫలితం సాయి అనర్గళంగా ఆంగ్లంలో 20 ఎక్కాలు చెప్పడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియం ఓ కారణంగా చెప్పవచ్చు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలే పునాది అయ్యింది. ‘మనబడి నాడు – నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం ఆప్షన్ అమలు చేయడంతో ఈ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ మీడియం పట్ల మక్కువ చూపారు. మాతృభాష తెలుగుతో పాటు దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు దోహదపడే ఇంగ్లిషును కూడా మాట్లాడగలుగుతున్నారు. నాడు జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలే నేటి ఈ మార్పులకు పునాది అని పలువురు విద్యాధికులు, మేధావులు పేర్కొంటున్నారు. -
సాయి తత్వాన్ని అందరూ తెలుసుకోవాలి
తాళ్లపూడి: సాయి అంటే ఒక కులానికి, ఒక మతానికి చెందిన వారు కాదని, సమస్త జీవులందరిలో ఉన్నారని, ఆ మహనీయుడు పంచిన ప్రేమ, శాంతి, క్షమ గుణాలను అందరూ ఆచరించి సాయి తత్వం తెలుసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. మండలంలోని బల్లిపాడు కాకర్ల రామయ్య ఫంక్షన్ హాలులో హైదరాబాద్‌కు చెందిన శ్రీ షిర్డీ సాయి సేవాదళ్ ఆధ్వర్యాన శుక్రవారం అఖిల భారత శ్రీ షిర్డీ సాయి భక్త సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తొలుత తాళ్లపూడిలోని సాయిబాబా ఆలయం వద్ద పూజలు, అభిషేకాలు నిర్వహించి, బల్లిపాడు వరకూ పల్లకీతో బాబా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన సమ్మేళనంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాయి భక్తులు ఎం.మహీధర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యరెడ్డి, మైనంపాటి ప్రసాద్, పిప్పళ్ల ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. బాబా సంకీర్తనలు, భజనలు, లీలలు, వేదాంత రహస్యాలు, బాబా ప్రవచనాలు, అవతార విశిష్టత, మధ్యాహ్న హారతి, ఉపనిషత్తుల సారం, సాయి తత్త్వం వంటి అంశాల గురించి వివరించారు. సంస్థ చైర్మన్ సింహాద్రి జనార్దనరావు, ఫౌండర్ కాళ్ల రత్నాజీరావు ఆధ్వర్యాన తాళ్లపూడి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో అప్పన రాజా, గోకవరపు సూరిబాబు, మండల రైస్ మిల్లర్ల సంఘం సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
కల్తీ పెట్రోలు కొట్టారంటూ ఆగ్రహం
పెట్రోల్ బంక్‌ను సీజ్ చేసిన అధికారులు జగ్గంపేట: కాట్రావులపల్లి గ్రామంలోని శ్రీజయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్లో కల్తీ పెట్రోల్ కొడుతున్నారంటూ వినియోగదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు పరిశీలించి తేడాలు గుర్తించి బంక్‌ను సీజ్ చేశారు. ఆ వివరాల ప్రకారం.. కాట్రావులపల్లిలో ఆ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోలు కొట్టించుకున్న మోటార్ సైకిళ్లు కొద్దిరోజులుగా మరమ్మతులకు గురవుతున్నాయి. ఒక్కసారిగా చాలా మోటారు సైకిళ్లు పాడవడంతో మెకానిక్‌లు పెట్రోల్‌లో తేడా వల్లే ఇలా జరిగిందని వివరించడంతో సుమారు 28 మంది వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద సాయంత్రం ఆందోళనకు దిగారు. తమ వాహనాల మరమ్మతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో యాజమాన్యానికి, వినియోగదారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాధరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ సమాచారంతో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి సత్యనారాయణ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు, పెట్రోల్ సాంద్రత, నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంద్రతలో చాలా తేడాలు గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం కల్తీ జరిగిందని నిర్ధారణకు వచ్చి బంక్ సీజ్ చేశామని, అలాగే యజమాని కనిగిరి వెంకట రమణమూర్తి, గుమస్తా వాకాడ రమేష్‌పై 6ఏ కేసు నమోదు చేశామని తెలిపారు. కాట్రావులపల్లి పెట్రోల్ బంక్‌ను తాత్కాలికంగా జగ్గంపేటలోని ఎస్ఆర్ బంక్ అప్పగించామని చెప్పారు. జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ, వీఆర్వో కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇదేం యాపారం సామీ..!
● రత్నగిరిపై షాపులో రకరకాల వస్తువుల విక్రయాలు ● టాయిలెట్లకు వాడే ఫినాయిల్, కాళ్ల పగుళ్లకు తైలం కూడా అమ్మకం ● ‘దేవుని నిర్మాల్యాలతో తయారీ’ పేరిట ఎర ● భక్తుల నమ్మకంతో వ్యాపారం ● అలా చేయడం సరైనదో కాదో పరిశీలించకుండానే అనుమతులు అన్నవరం: గో ఆధారిత ఉత్పత్తులు.. సత్యదేవుని నిర్మాల్యంతో (పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రి) తయారు చేసిన ఉత్పత్తులు.. అంటూ భక్తుల నమ్మకంతో రత్నగిరిపై జరుగుతున్న వ్యాపారం చూస్తూంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న భక్తి.. గో ఆరాధన.. పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రికి ఉన్న పవిత్ర భావన.. కొత్త కొత్త ఆలోచనలకు, వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొంత మంది.. గోమయంతో తయారు చేసిన విభూది, దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన అగరువత్తులు, ప్రమిదల వంటి అనేక వస్తువులను వివిధ దేవస్థానాల్లో ఇబ్బడిముబ్బడిగా విక్రయిస్తున్నారు. లాభమే పరమావధిగా భక్తులను దోపిడీ చేస్తున్నారు. రత్నగిరిపై బీజం పడిందిలా.. మూడు నెలల క్రితం ఓ వ్యాపారి అన్నవరం దేవస్థానం అధికారులను కలిసి గో ఆధారిత ఉత్పత్తులు, దేవుని నిర్మాల్యంతో తయారు చేసే వివిధ వస్తువుల విక్రయానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఇతర దేవస్థానాల్లో కూడా తాను ఇదే విధంగా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. ఇదే అదునుగా అన్నవరం దేవస్థానంలోని కొంత మంది ఉద్యోగులు ఆ వ్యాపారితో కుమ్మక్కయ్యారు. తమదైన శైలిలో చక్రం తిప్పి.. ఆ వ్యాపారి ప్రతిపాదనను దేవదాయ శాఖ కమిషనర్‌కు పంపించారు. దేవస్థానంలో పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, బియ్యం, వక్కలను కేజీల లెక్కన కొనుగోలు చేస్తామని, వాటినే తిరిగి ఈ ఉత్పత్తుల తయారీకి వాడతామని ఆ వ్యాపారి చెప్పినట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో, ఈ ఉత్పత్తుల విక్రయాలకు వేలం నిర్వహించాలంటూ కమిషనర్ అనుమతి మంజూరు చేశారు. ఈ ఉత్పత్తుల విక్రయాల్లో ఏడాది అనుభవం ఉన్నవారే వేలంలో పాల్గొనాలంటూ టెండర్ షరతుల్లో పేర్కొన్నారు. ఫలితంగా స్థానిక వ్యాపారులెవరూ ఇందులో పాల్గొనలేదు. దీంతో, నెలకు కేవలం రూ.45 వేల అద్దెకే దేవస్థానంలోని తూర్పు, పశ్చిమ రాజగోపురాల వద్ద రెండు స్టాల్స్ ఏర్పాటుకు ఆ వ్యాపారి వేలం పాడుకున్నారు. అలా ఎలా ఇచ్చారో..! దేవస్థానంలో ప్రతి వ్యాపారానికీ వేలం పాట ద్వారానే అనుమతి మంజూరు చేస్తారు. చిన్నపాటి వ్యాపారానికి కూడా అద్దె రూ.లక్షకు పైబడే ఉంటుంది. అటువంటిది స్వామివారి ఆలయానికి అతి తక్కువ దూరంలో ఈ రెండు స్టాల్స్‌ను కేవలం రూ.45 వేలకే ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అపచారమో కాదో చూడకుండానే.. ఈ స్టాల్స్‌లో విక్రయాలకు అనుమతులిచ్చిన వాటిల్లో దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, ‘కాళ్ల పగుళ్లకు రాసుకునే తైలం’ కూడా ఉన్నాయి. దేవుని నిర్మాల్యంతో ఇటువంటి వస్తువుల తయారీయే తప్పని అనుకుంటే.. వీటి విక్రయాలకు సైతం గత ఈఓ వీర్ల సుబ్బారావు హయాంలో అనుమతివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేవస్థానం ఆవరణలో చెప్పులతోనే నడవకూడదని మైకులో రోజుకు వందసార్లు చెబుతారు. దేవుని పూజలో వాడిన పత్రి, పుష్పాలు, ప్రసాదాలు కింద పడితే వాటిని కాళ్లతో తొక్కడాన్ని అపచారంగానే భక్తులు భావిస్తారు. చెప్పులతో తొక్కడం మరింత అపచారం. అటువంటిది ఈ స్టాల్స్‌లో నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, కాళ్ల పగుళ్ల క్రీమ్ వంటి వాటి విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ జాబితాల్లో పేర్కొన్న మిగిలిన ఉత్పత్తులు ఎక్కడ తయారు చేస్తున్నారు.. తయారీకి సత్యదేవుని నిర్మాల్యమే ఉపయోగిస్తున్నారా వంటి అంశాలను అధికారులెవ్వరూ పరిశీలించిన దాఖలాల్లేవు. ఈఓ ఆరా ఈ స్టాల్స్ అనుమతులను దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం పరిశీలించారు. దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించరాదని ఆదేశించారు.ఆ ఫినాయిల్ బాటిల్స్ మాయం ‘సత్యదేవుని నిర్మాల్య పత్రితో తయారైన ఫినాయిల్’ అంటూ రత్నగిరిపై షాపులో సాగిస్తున్న అమ్మకాలపై ‘సత్యదేవుని సన్నిధిలో మహాపచారం’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆ షాపులో ‘సత్యదేవుని నిర్యాల్య పత్రితో ఫినాయిల్’ అని స్టిక్కర్ అతికించి అమ్ముతున్న బాటిల్స్‌ను తీసేశారు. మిగిలిన ఉత్పత్తులను మాత్రం యథాతథంగా విక్రయిస్తున్నారు. -
జాతీయ మహిళా క్రికెట్‌కు ఎంపిక
దేవరపల్లి: మండల కేంద్రమైన దేవరపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థినులు జాతీయ స్థాయి మహిళా క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కృష్ణా జిల్లా నున్నలో అండర్–17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి. ఇందులో స్థానిక భాష్యం స్కూలు విద్యార్థినులు జి.తస్యశ్రీ, టి.యశశ్రీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్టులో ఆడి ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ పేరయ్య నాయుడు తెలిపారు. 31న పింఛన్ల పంపిణీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను ఈ నెల 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కీర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమయానికి పంపిణీ జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) ధర్మరాజును కేవలం మానవమాత్రుడేనని అనుకోరాదని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా కీచక వధ వృత్తాంతాన్ని శుక్రవారం ఆయన వివరించారు. ‘‘నిండు సభలో కామరోగ పీడితుడైన కీచకుడు.. ద్రౌపదిని కాలితో తన్ని అవమానిస్తాడు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భీముని వద్దకు వెళ్లి ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ‘యుధిష్టిరుని భర్తగా పొందిన సీ్త్ర.. శోకం లేనిదెలా అవుతుంది? – అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః’ అని తీవ్ర దుఃఖంతో అంటుంది. భీముడు సాంత్వనవచనాలతో ఆమెను ఓదార్చి, కీచకుడిని నర్తనశాలకు రాత్రి వేళ రావాల్సిందిగా ఆహ్వానించాలని, వాడిని అక్కడే గుట్టుగా మట్టు పెడతానని చెబుతాడు. ద్రౌపది తన తొందరపాటును నిందించుకుంటూ, ఆవేశంలో, దుఃఖాన్ని తట్టుకోలేక, ధర్మరాజు గురించి పరుషమైన పదాలు పలికానని, ఆ మహానుభావుని దివ్యత్వం తనకు తెలుసునని అంటుంది. ‘ఎవని చరిత్రము ఎల్ల లోకాలకు గురుస్థానంలో నిలచి పూజనీయమవుతుందో, ఎవని కడగంటి చూపు మానిత సంపదలు కలగచేస్తుందో, అట్టి మహానుభావుడు ధర్మరాజును కేవలం మానవమాత్రుడని అనుకోరాదు. కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ అని తన అంతరంగాన్ని వెల్లడిస్తుంది. చక్కగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చిన కీచకుడిని భీముడు గుట్టుగా మట్టు పెడతాడు. అతడి పార్థివ శరీరంతో పాటు ద్రౌపదిని దహనం చేయాలనుకున్న ఉపకీచకులు 105 మందిని భీముడు వధిస్తాడు. హస్తినలో వేగుల ద్వారా కీచకుని మరణ వార్త విన్న దుర్యోధనుడు ఈ పని చేసింది భీముడేనని, కీచకుడు మనసు పడ్డ సైరంధ్రి ద్రౌపది అనే నిర్ణయానికి వస్తాడు. ధర్మరాజు ఉన్న రాజ్యం సుఖశాంతులతో ఉంటుందని భీష్ముడు చెబుతాడు’’ అంటూ సామవేదం వివరించారు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తయిందని అన్నారు. -
‘ఎగ్’నామం పెట్టేందుకా?
బాలాజీచెరువు (కాకినాడ): మధ్యాహ్న భోజన పథకం అపహాస్యం అవుతోంది.. సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలు మధ్యాహ్న భోజనంలో మెనులో భాగంగా ఉడకబెట్టిన గుడ్లను నిర్వాహకులకు పంపిస్తుండగా, ఇందులో రోజుకు 10 నుంచి 20 వరకూ పాడైపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాడైన గుడ్లు వచ్చాయి. వాటిని వారు తినకుండా వదిలేశారు. ఇక్కడ మొత్తం 240 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందులో రోజూ సుమారు పది వరకూ గుడ్లు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు చెబుతున్నా మార్పు ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. స్నేహితుడిపై దాడి: వ్యక్తికి జైలు కాకినాడ లీగల్: స్నేహితుడిపై దాడి చేసిన వ్యక్తికి 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ నిరూప భంజ్ డియో శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తిమ్మాపురానికి చెందిన కొప్పిశెట్టి రాజేష్ అదే ప్రాంతానికి చెందిన జియ్యన శ్రీమన్నారాయణ స్నేహితులు. వారి మధ్య కక్షలు ఉండడంతో శ్రీమన్నారాయణపై రాజేష్ రాయితో దాడి చేశాడు. దీనిపై తిమ్మాపురం పోలీసులు 2022లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో రాజేష్‌పై నేరం రుజువు కావడంతో 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
చంద్రబాబుది ట్రబులింజిన్ సర్కార్
● 18 నెలల్లో ఎంత సంపద సృష్టించారు? ● వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాదని.. కేవలం ట్రబులింజిన్ సర్కార్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల పాలనలో సృష్టించిన సంపద ఎంతో ప్రజలకు చెప్పాలన్నారు. ఇప్పుడు తెస్తున్న లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏ సంక్షేమ పథకానికి ఖర్చు చేస్తున్నారో తెలపాలని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను అధికారుల పైకి నెట్టడం సబబు కాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా మీరు నిధులు, ప్రణాళికలు ఇస్తే అధికారులు వాటిని అమలు చేస్తారన్నారు. వైఫల్యాలన్నీ అధికారుల పైకి నెట్టేసి, తప్పించుకునే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘జగన్ అప్పులు చేసి సంక్షేమం పంచుతున్నారు.. నేను సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తాన’ంటూ చంద్రబాబు చెప్పుకున్నారని వేణు గుర్తు చేశారు. గత 8 నెలల్లో రాష్ట్ర ఆదాయ లోటు 163 శాతం వచ్చిందన్నారు. దీనినిబట్టి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టేనని చెప్పారు. సంపద సృష్టి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో విఫలమయ్యారని, అప్పులు చేయడమే ఆదాయం పెంచడమనుకోవాలా అనేది చంద్రబాబే చెప్పాలని అన్నారు. ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించడం లేదని, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని.. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి విషయంలోనూ చంద్రబాబు వైఫల్యం కనిపిస్తోందని చెప్పారు. వైఎస్ జగన్‌పై చంద్రబాబు అండ్ కో వేసిన నిందలన్నీ అబద్ధాలనే విషయం ప్రజలకు అర్థమవుతోందన్నారు. ప్రతి అంశంలోనూ కుట్ర రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్‌గా మారారన్నారు. నష్టపోయింది ప్రజలు, నష్టపరిచింది టీడీపీ అనే విషయం ప్రజలకు అర్థమైందని, కేంద్రంతో కలసి ఉండి, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలే తప్ప.. వారి కష్టాలు తీర్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. వైఎస్ జగన్‌పై నింద వేస్తే పేదల ఆరోగ్యం బాగు పడుతుందా.. విద్య అందుతుందా.. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందా.. యూరియా సరఫరా జరుగుతుందా అని వేణు ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు బారులు తీరడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయన్నారు.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టేసి, ప్రజలను ఏమార్చాలనే ఏకై క లక్ష్యంతోనే చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని వేణు దుయ్యబట్టారు. -
● మంచి మార్కులకు దోహదం
దస్తూరి అందంగా ఉంటేనే మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్ బాగా చేయడానికి దస్తూరి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏకాగ్రతతో 10 రోజులు సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైన చేతిరాతను సొంతం చేసుకోవచ్చు. వేల మందికి చేతిరాతను తీర్చిదిద్దడంలో తర్ఫీదునిచ్చాను. –కుంచే బాలకృష్ణ, కాలిగ్రాఫర్, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ), జెడ్పీహెచ్ఎస్, తొండవరం ● మెలకువలు నేర్చుకోవాలి చేతిరాతను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని మెలకువలు తప్పనిసరిగా పాటించాలి. పెన్ను పట్టుకునే విధానం కూడా చేతిరాతను మారుస్తుంది. ప్రతి రోజూ కొంత సమయాన్ని చేతిరాతను తీర్చిదిద్దుకునేందుకు కేటాయించాలి. చేతిరాత బాగుంటే తలరాత కూడా మారుతుంది. –టి.గణేశ్వరరావు, హ్యేండ్ రైటింగ్ ఇంప్రూవర్, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), కాండ్రకోట, పెద్దాపురం మండలం ● తప్పుల్లేకుండా రాయాలి ముత్యాల్లాంటి అక్షరాలతో మంచి మార్కులను సంపాదించవచ్చు. చేతిరాత మెరుగుపర్చేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. సమాధానాలు దిద్దేవారికి సులభంగా అర్థమైనప్పుడే మంచి మార్కులకు అవకాశం ఉంటుంది. తక్కువ రాసినా తప్పుల్లేకుండా అందంగా రాయడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. –సీహెచ్ జాన్‌ప్రసాద్, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం, ప్రత్తిపాడు -
క్రీస్తు మార్గం అనుసరణీయం
రాజమహేంద్రవరం రూరల్: మానవాళికి ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని వక్తలు పునరుద్ఘాటించారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ విజయ సారథి నేతృత్వంలో కొంతమూరు క్రీస్తు నిరీక్షణాలయ ప్రాంగణంలో మెగా క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, పార్టీ కొవ్వూరు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ప్రసంగించారు. ‘తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును’ అనే క్రీస్తు బోధన అక్షర సత్యమని మాజీ ఎంపీ ఉండవల్లి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే విషయాన్ని తనకు చెప్పేవారని, ఆయన చెప్పిన మాటలు నేటికీ పాటిస్తున్నానని వెల్లడించారు. కరుణ, దయతో ఏసుక్రీస్తు లోకానికి కొత్త మార్గాన్ని చూపారని, ఆ మార్గం ఆచరణనీయమని వేణు అన్నారు. క్రీస్తు జననం శాంతికి సంకేతమని, తన జీవితం, మరణం ద్వారా లోకానికి సరైన మార్గాన్ని ఏసుప్రభువు చూపారని భరత్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ సంస్థలు సేవా తత్పరతతో సాగుతున్నాయని, ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడాలని జాన్‌వెస్లీ అన్నారు. క్రిస్టియన్ మైనారిటీ శాఖ రూపకల్పనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాంది పలికారని, ఆయన చొరవతోనే క్రైస్తవులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తలారి వెల్లడించారు. సేవకులు, విశ్వాసులతో కలిసి కేక్ కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వక్తలు, ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. -
కాకినాడ టు శబరిమల
ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్ర నగరి: సాధారణంగా అయ్యప్ప భక్తులు పంబ నుంచి, లేకుంటే ఎరిమేలి నుంచి పెద్ద పాదలో గానీ పాదయాత్రగా శబరి కొండపైకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం పరిపాటి. అయితే కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా, తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ రూరల్ రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానిశంకర్ (44) అయ్యప్ప స్వామి మాల ధరించారు. 18 ఏళ్ల క్రితం అర్జున్ స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవాని శంకర్ కన్నిస్వామిగా మాల ధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆపై ఇరువురు సొంతంగా అయ్యప్ప ఆలయాలను నిర్మించి కలసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఇద్దరూ పాదయాత్ర చేసినా కలసి వెళ్లలేదు. మరో 18 ఏళ్లకు వారి ఆశయం నెరవేరింది. ఇద్దరూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఏడాది కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీ శంకర్ 18వ సారి శబరి యాత్ర చేస్తుండగా, అర్జున్ స్వామి 36వ సారి తన యాత్రను కొనసాగిస్తున్నారు. వారు శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ యాత్ర వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోరుతూ ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తున్నామన్నారు. భవానీ శంకర్ నవంబరు 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్ స్వామి డిసెంబరు 4వ తేదీ తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నామని మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు తెలిపారు. వేల కిలోమీటర్ల యాత్రలో.. శబరి కొండకు వీరు చేసే యాత్రలు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. వీరిలో అర్జున్ స్వామి ఏడుసార్లు ఇలా తణుకు నుంచి శబరి కొండకు ఇరుముడితో పాదయాత్ర చేశారు. ఇందులో నాయుడుపేట మీదుగా మూడు సార్లు, సేలం, దిండిగల్ మీదుగా రెండు సార్లు, తిరుత్తణి, అరకోణం మీదుగా రెండు సార్లు పాదయాత్రగా వెళ్లగా, మోటారుసైకిల్ మీదుగా మూడుసార్లు, సైకిల్‌పై ఐదుసార్లు యాత్ర కొనసాగించారు. ప్రస్తుతం 62 సంవత్సరాల వయస్సులో ఇరుముడి ధరించి పాదయాత్ర చేస్తున్న ఈయన భక్తికి పరవశించి అందరూ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. గణపతి గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నానని ఆయన తెలిపారు. ముమ్మిడి భవానీశంకర్ నాలుగు సార్లు పాదయాత్రగా వెళ్లగా, ఒకసారి బైక్‌యాత్ర చేశారు. ప్రస్తుతం ఐదవసారి యాత్ర చేస్తున్నారు. వేలు గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నాని ఆయన తెలిపారు. పెట్రోలు బంకులు, ఆశ్రమాలు, గుళ్ల వద్ద తలదాచుకుంటూ మార్గంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు. -
పైసలిస్తే పర్మిషన్!
● సొంత భూముల్లో ఇసుక తవ్వకాలకు వసూళ్ల పర్వం ● ఎకరానికి రూ.లక్ష కప్పం ● అధికారులు, ఓ ప్రజాప్రతినిధి మిలాఖత్ అయ్యారని ఆరోపణలు ● జిల్లావ్యాప్తంగా 352 ఎకరాల్లో అనుమతులు ● 63,16,943 టన్నుల ఇసుక తీసే అవకాశం ● రైతుల పేరుతో కూటమి నేతలకు లబ్ధి చేకూర్చే ఎత్తుగడ సాక్షి, రాజమహేంద్రవరం: ఇప్పటికే దొరికిన చోటల్లా ఇసుక పిండి.. రూ.కోట్లు కొల్లగొడుతున్న కూటమి నేతలు.. తాజాగా పట్టా భూముల్లో తవ్వకాల పేరుతో భారీ దోపిడీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల అనుమతులు మంజూరు కాగా.. వాటిల్లో తెర వెనుక కూటమి నేతలే ఉన్నట్లు సమాచారం. పొలాల యజమానుల పేర్లతో అనుమతులు తీసుకుని.. యథేచ్ఛగా ఇసుక తవ్వేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. ఈ అవినీతి వ్యవహారాలన్నీ కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతూండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పైగా ప్రజాప్రతినిధులతో కొంతమంది అంటకాగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టారాజ్యంగా అనుమతులు జిల్లావ్యాప్తంగా ఓపెన్ రీచ్‌లు, బోట్స్‌మెన్ సొసైటీ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. జిల్లాలోని ప్రక్కిలంక, సీతానగరం తదితర 15 ప్రాంతాల్లో 352 ఎకరాల సొంత భూముల్లో ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులిచ్చారు. తద్వారా 63,16,943 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వాలన్నది లక్ష్యం. మరికొన్ని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు మరో 38 దరఖాస్తులు అందాయి. వాటికి సైతం అనుమతులు లాంఛనమే కానున్నాయి. ఇదే కనుక జరిగితే భారీ ఇసుక దోపిడీకి తెర లేవనుంది. లక్షల టన్నుల ఇసుక పక్కదారి పట్టే అవకాశం ఉంది. ముడుపు కడితేనే.. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో వసూళ్లకు తెగబడుతున్నారు. రైతుల భూముల్లో ఇసుక తవ్వుకోవాలంటే రెవెన్యూ అధికారులు ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఆ తర్వాతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ భూములు వ్యవసాయానికి పనికిరావని నిర్ధారించాలి. ఆ తర్వాతే అనుమతులు మంజూరు చేస్తారు. ఇక్కడే అక్రమ దందాకు తెర లేపుతున్నారు. ఈ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎకరానికి రూ.లక్ష కప్పం కట్టాల్సింనంటే రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేస్తున్నారు. అడిగినంతా ముడుపు కడితే నిమిషాల వ్యవధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చేస్తున్నారని, లేదంటే కొర్రీలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 352 ఎకరాల్లో అనుమతులు ఇవ్వగా.. ఈ ప్రక్రియలో రూ.కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధి లంచావతారం! పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల అనుమతుల విషయంలో ఓ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి లంచావతారం ఎత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎ కరానికి తనకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర సమర్పించాలని ఆయన హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు ఆవిధంగా ముట్టజెప్పగా.. మరికొందరు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు కొంతమంది కూటమి నేతలు బినామీ పేర్లతో అనుమతులు పొందడం గమనార్హం. దీంతో, వారు తాము కూడా కప్పం కట్టాలా అని సదరు ప్రజాప్రతినిధిని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో, వాళ్ల వరకూ మినహాయింపు ఇచ్చారని, మిగిలిన వారు మాత్రం చెప్పినంతా చెల్లించాల్సిందేనని ఆయన తెగేసి చెప్పారని అంటున్నారు. ఇదే అదునుగా కొంత మంది రెవెన్యూ అధికారులు సైతం దందాకు తెర లేపారు. ప్రజాప్రతినిధులకే కాదని, తమకు సైతం చెల్లించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. తూతూమంత్రంగా.. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులివ్వాలంటే మైనింగ్ అధికారులు తొలుత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. మెజార్టీ ప్రజలు అంగీకరిస్తేనే అనుమతి ఇవ్వాలి. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అభిప్రాయ సేకరణ పేరిట గ్రామంలో నలుగురిని తీసుకొచ్చి అభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ వారితోనే సంతకాలు చేయించేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఇదే విధంగా జరిగినట్లు విమర్శలున్నాయి. ప్రక్కిలంకలో 36 మంది రైతులకు చెందిన భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారు. టన్ను ఇసుకకు రూ.158 చెల్లించేలా నిర్ధారించారు. కేవలం లంకల్లోనే 12,92,400 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వేందుకు అనుమతులు ఇచ్చారు. సీతానగరం తదితర ప్రాంతాల్లో మరిన్నిచోట్ల తవ్వకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రక్కిలంకలో ఇప్పటికే ఇసుక రీచ్ ఉంది. ఇసుక తవ్వకాలు, విక్రయాలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ పట్టా భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం వెనుక మతలబు దాగుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూటమి నేతలకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తాళ్లపూడి మండలం ప్రక్కిలంక ఇసుక ర్యాంప్అవసరానికి మించి.. జిల్లావ్యాప్తంగా అవసరాలకు మించి ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓపెన్ రీచ్‌ల ద్వారా 20 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుంది. బోట్స్‌మెన్ ర్యాంపుల ద్వారా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సమకూరే అవకాశం ఉంది. ఇది చాలదన్నట్లు కొత్తగా పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు అనుమతులు ఇచ్చారు. అదే ఇసుక ప్రజలు, ప్రభుత్వ పనులు, ప్రైవేటు అవసరాలకు సరిపోయింది. అటువంటిది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క మన జిల్లాలోనే కోటి మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వేందుకు ‘పచ్చ’ జెండా ఎందుకు ఊపుతోందనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, ఈ ఇసుకను ఇతర జిల్లాల అవసరాలకు కేటాయిస్తున్నామని అధికారులు చెబుతున్నా రు. ఇతర జిల్లాలకై నా అంత మేర స్టాక్ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి జిల్లాలో ఇసుక అవసరమెంత.. తవ్వుతున్నదెంత.. లక్షల టన్నుల ఇసుక ఎందుకు తవ్వుతున్నారు.. ఇదంతా ఎక్కడికి తరలిస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. -
ఐక్యత లేకనే హిందూ మతంపై దాడులు
● రాధామనోహర్ దాస్ ● వాకలపూడిలో హిందూ సమ్మేళనం కాకినాడ రూరల్: హిందువుల్లో ఐక్యత లేకనే హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని ఆధ్యాత్మికవేత్త రాధామనోహర్ దాస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వాకలపూడిలో గురువారం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోని అన్ని మతాల కన్నా హిందూ మతం చాలా గొప్పదని అన్నారు. దేశంలోని వారు మతం మారినంత మాత్రాన మానవత్వం మరచిపోరాదని కోరారు. భారతదేశానికి జన్మించిన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు నేడు హిందూ మతానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తున్నాయని, వారి పీచం అణచివేయాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వెయ్యి సంవత్సరాలుగా హిందూ మతంపై అనేక దాడులు జరిగాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు దంగేటి సత్యనారాయణ, సాధుల శేషపాన్పు, బిందుశ్రీ తదితరులు కూడా ప్రసంగించారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు, వేద మంత్ర పఠనం నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నాయకులు సుబ్రహ్మణ్యం, రామరాజు, అప్పాజీ తదితరులతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
కోకపై పాశుర భాసురాలు!
● బొమ్మలతో కళాత్మకంగా అల్లిక ● ఉపాధ్యాయిని లీలా పూర్ణిమ ప్రతిభ మామిడికుదురు: కళోపాసన ఆ భగవంతుని ప్రసాదం. చేతిలో కళ ఉండాలే కానీ దానిని వ్యక్తపరిచే ప్రతి చర్యలోనూ ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సందర్భోచితంగా తనలోని కుట్టు కళను అత్యంత సుందరంగా ఆవిష్కరించారు శ్రీఘాకోళపు లీలా పూర్ణిమ. మండలంలోని అప్పనపల్లికి చెందిన ఆమె ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తూ తీరిక సమయంలో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటారు. ధనుర్మాసం సందర్భంగా ఆమె గోదాదేవి తిరుప్పావై పాశురాలను చీరపై అత్యంత సుందరంగా అల్లి ఔరా అనిపించారు. పాశురాలతో పాటు చీరపై గోదాదేవి అమ్మవారి చిత్రం, నెమలి పింఛాలు, వెంకటేశుని నామాలు, వేణువు, కలువ పూలు, శంఖు, చక్రాలను రమణీయంగా కుట్టి తన ప్రతిభను చాటుకున్నారు. పది రోజుల పాటు 30 తిరుప్పావై పాశురాలు, 10 తిరుపుళ్లియ్యెచ్చి (శ్రీరంగనాథుని మేల్కొలుపు శ్లోకం) పాశురాలు, ప్రార్థనా శ్లోకాన్ని చీరపై అల్లారు. 1,493 పదాలను 320 వాక్యాల్లో అల్లినట్టు లీలా పూర్ణిమ తెలిపారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా అక్షరాల మధ్య సమతౌల్యం పాటిస్తూ చీరకు ప్రాణం పోసినట్లు అక్షరాలను, బొమ్మలను తీర్చిదిద్దారు. పవిత్రతను చాటాలన్న లక్ష్యంతో.. సంక్రాంతి పండుగలో వచ్చే ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది. దాని పవిత్రతను ప్రతి ఒక్కరికి చాటాలన్న లక్ష్యంతోనే పాశురాలు (శ్లోకాలు) రాశానని లీలా పూర్ణిమ తెలిపారు. నేటి తరం మరిచిపోతున్న లిపి కళను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నదే తన ఆలోచన అని ఆమె చెప్పారు. భక్తి, సంప్రదాయం, సహనం, సృజనాత్మకతకు ప్రతి రూపంగా ఆమె అల్లిన శ్లోకాలు, బొమ్మలతో కూడిన చీరను అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారికి సమర్పించారు. ఆ చీరను అర్చకులు అమ్మవారికి అలంకరించి నిత్యం ‘తిరుప్పావై’ సేవ నిర్వహిస్తున్నారు. -
ఐటీ పార్క్‌కు అంజుమన్ భూములా?
● చంద్రబాబు సర్కారుపై మైనారిటీ నేతల మండిపాటు ● భూముల పరిరక్షణకు పోరాడతామని వెల్లడిరాజమహేంద్రవరం రూరల్: గుంటూరు జిల్లా చినకాకానిలోని అంజుమన్–ఎ–ఇస్లామియా సంస్థకు చెందిన భూములను చంద్రబాబు ప్రభుత్వం ఐటీ పార్కుకు కట్టబెట్టడం దారుణమని వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ హమీద్ బాషా మండిపడ్డారు. చంద్రబాబు సర్కారు హడావుడిగా మొత్తం సమావేశం ఏర్పాటు చేసి, ఇష్టం లేకపోయినా బలవంతంగా సంతకాలు చేయించి, 82 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్‌కు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంజుమన్–ఎ–ఇస్లామియా సంస్థకు 1915లో దాతలు ఈ భూమి ఇచ్చారని చెప్పారు. ముస్లింల స్కిల్ డెవలప్మెంట్, లైబ్రరీ, ముస్లిం పిల్లల స్కాలర్షిప్లు, వారి విద్యా సంస్థల కోసం ఈ భూమిని ఇచ్చారన్నారు. అటువంటి ఈ భూమిలో 71.53 ఎకరాలు ఐటీ పార్క్‌కు కట్టబెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాజకీయాలను పక్కన పెట్టి ముస్లిం ఆస్తుల పరిరక్షణకు అధికార పార్టీలోని ముగ్గురు మైనారిటీ ఎమ్మెల్యేలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. నేడు ముస్లింలకు అన్యాయం జరుగుతోందని, రేపు క్రిస్టియన్లకు, ఆ తరువాత హిందువుల భూములను చంద్రబాబు సర్కారు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని, అందువలన కులమతాలకు అతీతంగా అందరూ దీనిపై పోరాడాలని అన్నారు. ముస్లిం సంస్థ ఆస్తులను చంద్రబాబు సర్కారు బలవంతంగా లాక్కుంటే ఈ విషయాన్ని రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యాన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. 2029లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐటీ పార్కుకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ భూముల పరిరక్షణకు కార్యాచరణ రూపొందించి, పోరాడతామని హమీద్ బాషా చెప్పారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. దీనికి భిన్నంగా అంజుమన్–ఎ–ఇస్లామియా భూములను ఏపీఐసీసీకి, ఇతరులకు కట్టబెట్టేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని మండిపడ్డారు. దీనిని చంద్రబాబు ప్రభుత్వంలోని మైనారిటీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రి ఫరూక్, సలహాదారు షరీఫ్ అడ్డుకోవాలని కోరారు. భూముల అన్యాక్రాంతాన్ని నిలిపివేసేంత వరకూ పోరాడతామని హెచ్చరించారు. రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ హసీనా మాట్లాడుతూ, అంజుమన్–ఎ–ఇస్లామియా ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. వక్ఫ్ ఆస్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని మైనారిటీ నేతలందరి పైనా ఉందని చెప్పారు. ఈ భూములను ఐటీ పార్కుకు ఇస్తే చంద్రబాబు సర్కారును అల్లా కూడా క్షమించరని స్పష్టం చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎండీ ఆరీఫ్ మాట్లాడుతూ, ముస్లింల సంక్షేమానికి ఉపయోగించాల్సిన అంజుమన్–ఎ–ఇస్లామియా భూములను ఐటీ పార్కుకు ఇచ్చేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నించడం క్షమించరాని నేరమని అన్నారు. దీనిపై ఇచ్చిన జీఓను రద్దు చేసేంత వరకూ పోరాడతామని హెచ్చరించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం సామాజికవర్గం పూర్తి నిరాదరణకు గురైందని అన్నారు. వక్ఫ్ బిల్లుకు ఓటు వేయడం ద్వారా దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది ముస్లింలకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జోనల్ అధ్యక్షుడు హసన్, సీనియర్ నాయకులు నయీమ్ భాయ్, మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే ఇబ్రహీం బాషా, అధికార ప్రతినిధి షట్టర్ బాషా, మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు ఎండీ ఆరిఫ్ ఉల్లాఖాన్, ప్రధాన కార్యదర్శి షబ్బీర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. -
హైటెక్ దాసులు
ఉప్పలగుప్తం: ధనుర్మాసం వస్తూనే వేకువ జామునే శిరస్సున అక్షయ పాత్ర.. మెడలో చామంతుల మాల.. ఓ చేతిన చిడతలు.. మరో చేతిన తంబుర.. పాదాలకు మంజీరాలు.. నోట సుస్వర హరినామ సంకీర్తనలు.. పెద్దపెద్ద అంగలతో ఇంటింటికీ తిరిగి వారిచ్చిన స్వయంపాకాన్ని స్వీకరించి నమస్కరించినవారిని దీవించి వడివడిగా ముందుకు సాగే హరిదాసు ఓ నాటి దృశ్యకావ్యం. తెలుగువారి సంస్కృతిని తరతరాలుగా కొనసాగిస్తూ.. మారిన కాలంతో పోటీ పడి తానూ మారుతూ వాహనధారియై.. దాని హెడ్‌లైట్‌పై అక్షయ పాత్ర.. హ్యాండిల్‌కి మైక్.. దాని నుంచి హరినామ సంకీర్తనలు.. ఇదీ ఆధునిక హరిదాసు జీవన చిత్రం. మున్ముందు ఇంకెంత ఆధునీకత సంతరించుకుంటారో చూడాలి మరి. వీరికీ ఓ ఘన చరిత్ర.. కఠోర దీక్ష.. సంప్రదాయాన్ని ముందు తరాలకు తీసుకువెళ్లాలనే అంకితభావం ఉండడం చెప్పుకోదగ్గ విషయం. వైష్ణవులలో ఓ వర్గం నియమ నిబద్ధతలతో కూడిన మహావిష్ణు దీక్షను భక్తితో స్వీకరిస్తారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరులు పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని కాపాడటానికి అవలంబించే 41 రోజుల కఠోర దీక్ష ఇది. ఈ దీక్షలను కార్తికం, ధనుర్మాసం, మాఘమాసాల్లో సంబంధిత గురువుల వద్ద స్వీకరిస్తారు. ఈ హరిదాసు దీక్షలకు సంబంధించి భద్రాచలంలో ప్రత్యేక శిక్షణ క్షేత్రం ఉంది. దీక్ష ఆరంభం నుంచి విరామం వరకూ వారి తమ పూర్వీకులు తిరిగిన గ్రామాల్లో పీఠం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇల్లిల్లూ హరి నామ కీర్తన చేసుకుంటూ భిక్షాటన చేస్తారు. కటిక నేలపై పడుకుని నిత్యం ఉదయం, సాయంత్రం తల స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసుకుని అక్షయపాత్రకు అభిషేకం చేస్తారు. గ్రామాల్లో తిరుగుతూ సాయంత్రానికి పీఠం వద్దకు చేరుకుంటారు. ఉదయం వేళ అల్పాహారం తీసుకుంటూ సాయంత్రం ఒంటిపూట భోజనం చేస్తుంటారు. నెత్తిన అక్షయపాత్ర పెట్టుకుంటే అది దింపే వరకూ దైవ సంకీర్తన తప్ప వేరే మాట నోటి నుంచి రాకూడదన్నది నియమం. దీక్షాకాలం అనంతరం విష్ణు, శివాలయాల్లో దీక్షను విరమిస్తారు. దీక్షలో స్వీకరించిన భిక్షను తమ అవసరాలకు కొంత మిగుల్చుకుని భధ్రాచలం రాముల వారి కల్యాణంలో జరిగే అన్నదానానికి పంపిస్తారు. సాధారణ సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇంత కఠిన దీక్షను నేటి తరం ఆచరించే శారీరక సామర్థ్యం లేక ఆధునిక వసతులను వినియోగించుకుంటూ సంస్కృతిని ముందు తరాలకు అందజేస్తున్నారు. ఈ పయనంలో భాగంగా మోటారు సైకిళ్లను వారి ఆహార్యానికి అనుగుణంగా మార్పులు చేసుకుని చకచకా సాగిపోతున్నారు. వీరు సుమారు 4, 5 గ్రామాలను ఎంపిక చేసుకుంటారు. ఈ గ్రామాల్లో సంచరిస్తే వచ్చేది రోజకు కేవలం నాలుగైదు కుంచాల బియ్యం మాత్రమే. ప్రస్తుతం మోటారు సైకిల్‌పై తిరగటంతో దాని ఇంధనంతో పాటు ఇతర ఖర్చులకు 3 నుంచి 4 వందలు ఖర్చవుతుంది. ఇంతటి పురాతన సంస్కృతిని ముందు తరాలకు అందిస్తున్న ఈ వృత్తి కళాకారులకు ప్రభుత్వాల పరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. కొంతమంది దృష్టిలో వీరు భక్తులా, లేక ఒక వృత్తినే నమ్ముకున్న వారా అనే సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తుంటారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరి సామాజిక వర్గాలకు చెందిన వీరు బిసీ–డీ కేటగిరీగా పరిగణించబడుతున్నారు. వీరు ఎక్కువగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, కృష్ణ, అనకాపల్లి జిల్లాలో నివసిస్తుంటారు. వీరికి రిజర్వేషన్ కోటాలో తక్కువగా ప్రాధాన్యత ఉండి వారి పిల్లలు విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్నప్పటికీ బీసీ–ఏ గా మార్చాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వారిని బీసీ–ఏగా మార్చడానికి సన్నాహాలు చేసినప్పటికీ కొందరి అభ్యంతరాలతో పిటిషన్లు పెట్టి అడ్డుకున్నారని ఆ సామాజిక వర్గాల వారు ఆవేదన చేస్తున్నారు. మారుతున్న కాలంతో మున్ముందుకు సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగిస్తున్న వైనం ఆదాయాన్ని వదులుకుని ఆచారానికి పెద్దపీట ఎంతటి వారైనా గజ్జెకట్టి అక్షయ పాత్ర పట్టాల్సిందే భక్తి శ్రద్ధలతో.. హరినామ సంకీర్తనతో కఠోర దీక్ష -
అనుమానాస్పద మృతిపై విచారణ
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మల్లయ్య అగ్రహారానికి చెందిన కుడుపూడి సత్యనారాయణ(29) ఈ నెల 22న అర్థరాత్రి ఇంట్లో దుప్పటితో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేళాడుతూ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. చేతులు వెనక్కి కట్టేసి ఉండడంతో పాటు మరి కొన్ని కారణాల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కుటుంబసభ్యులు భావించారు. ఈ అంశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, మృతిపై విచారణ కొనసాగుతోందని సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపారు. సత్యనారాయణకు తల్లిదండ్రులు లేరు. బాబాయి, పిన్నే కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. పెయింటింగ్ పనిచేసే సత్యనారాయణ కుటుంబసభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతిపై లోతైన విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని పోలీసుల్ని కోరుతున్నారు. జాతీయ స్థాయి జు – జుట్సు పోటీల్లో రవి శంకరికి రజతం అమలాపురం టౌన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హాల్ద్వానీలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకూ జరిగిన జాతీయ స్థాయి జు – జుట్సు చాంపియన్ షిప్ –2025 పోటీల్లో అమలాపురానికి చెందిన అడపా రవి శంకరి రజిత పతకాన్ని సాధించింది. అండర్–16 విభాగంలో రవి శంకరి 48 కేజీల ఫైటింగ్ కేటగిరిలో విజేతగా నిలిచి పతకాన్ని కై వసం చేసుకుందని కోచ్‌లు పడాలి అంజి, చిక్కం సురేష్ తెలిపారు. విజేతను అమలాపురం పవర్ కిక్ మార్షల్ ఆర్ట్స్ అకాడమి ప్రతినిధులు అభినందించారు. -
నాన్న ఆదేశాలతో దీక్ష స్వీకరించా
నాపేరు అన్యం రాంబాబు. మాది కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని అముజూరు గ్రామం. నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను. ప్రస్తుతం బట్టల వ్యాపారం చేస్తున్నాను. మా ముత్తాత, మాతాత, మానాన్న ఈ దీక్ష స్వీకరించి కొన్ని గ్రామాల్లో సంచరించారు. మా నాన్నకు మోకాళ్ల గుజ్జు అరిగిపోయి ఆరోగ్యం క్షీణించింది. అందుకే వారసత్వం, సాంప్రదాయం కాపాడటానికి ఆయన ఆదేశాలతో ఈ దీక్షను స్వీకరించి నేను మోటారు సైకిల్‌పై కొనసాగిస్తున్నాను. మా ఈ ఆచారంలో చాలా ఉన్నతమైన ఉద్యోగం చేసుకునే వారు సైతం వారి అవకాశాన్ని బట్టి కనీసం రెండు రోజులైనా ఈ దీక్షను స్వీకరిస్తారు. రేపటి తరంలో నా కుమారుడు సైతం ఏ హోదాలో ఉన్న మా పూర్వీకులు తిరిగిన ప్రాంతాల్లో ఈ దీక్షను ఆచరించాలి. నేను కార్తికమాసంలో దీక్షను తీసుకున్నాను. సుబ్రహ్మణ్య షష్టికి దీక్షను విరమిస్తాను. -
పాటల పల్లకిలో లెక్కల పాఠాలు
● వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్న మా‘స్టార్’ ● రాగాలాపనతో చిక్కుముడులకు విడుపులు ● వి.సావరంలో నాగేశ్వరరావు ప్రతిభ రాయవరం: విద్యార్థికి అర్థమయ్యేలా బోధించడమే గురువు పరమ కర్తవ్యం. అందుకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. రాయవరం మండలం వి.సావరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు శైలి విభిన్నం. పాటతో గణితంలో పీటముడులు విప్పించడం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర ఉన్నతాధికారులను సైతం ఆకట్టుకున్న ఆయన శైలిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం గణితం గజిబిజి కాదంటూ గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై విద్యార్థులు గజిబిజి అవుతుంటారు. వారు అలా అవస్థ పడకుండా ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతి పాఠాన్ని పేరడీ పాటలతో బోధిస్తూ లెక్కను సులువు చేస్తున్నారాయన. రోజా చిత్రంలోని పరువం వానగా.. అన్న పాటను రియల్ నంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్ నంబర్‌గా పాడారు. అలాగే చిన్నారి తల్లి.. చిన్నారి తల్లి అనే పాటను సైన్ ఏ ఫ్లస్ బి ఈజ్ అంటూ పేరడీగా పాడారు. ఇలా ప్రతి గణిత పాఠానికి పేరడీ పాటలు సృష్టించి పిల్లల నోళ్లలో నానుతున్నారు. సోషల్ మీడియాలోనూ సోషల్ మీడియా ద్వారా కూడా నాగేశ్వరరావు తనదైన శైలిలో బోధిస్తున్నారు. ప్రత్యేకంగా ‘పాలెపు నాగేశ్వరరావు’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ఓపెన్ చేసి, దాని ద్వారా గణితం బోధిస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా తన గణిత పాఠాలను అప్లోడ్ చేసి బోధిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి పిలుపు సోషల్ మీడియా ద్వారా గణితాన్ని సులువుగా బోధిస్తున్న తీరును గుర్తించిన సమగ్ర శిక్షా రాష్ట్ర ఉన్నతాధికారులు నాగేశ్వరరావును ప్రత్యేకంగా విజయవాడకు ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా విన్నూత్నంగా బోధిస్తున్న 41 మందిని బెస్ట్ ప్రాక్టీసెస్ వర్క్‌షాప్‌కు ఆహ్వానించగా, జిల్లాలోని మండపేట మండలం నుంచి అమలదాసు కావేరి, ఆలమూరు మండలం చింతలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి వి.వెంకటేశ్వరరావు, రాయవరం మండలం వెదురుపాక నుంచి పి.నాగేశ్వరరావు ఉన్నారు. -
కారుణ్యమూర్తీ.. నిత్యస్ఫూర్తి
ముళ్ల కొరడాల దెబ్బలు తన దేహాన్ని నిలువునా చీలుస్తూ.. సిలువపై రక్తాన్ని ఏరులై పారిస్తున్న అత్యంత బాధాకరమైన సందర్భంలో కూడా.. ‘తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు’ అంటూ కరుణామయుడైన ఏసుక్రీస్తు అన్న మాటలు.. ఆయన అపూర్వ క్షమా గుణానికి నిదర్శనాలు. ప్రేమ, శాంతి, కరుణ వంటి సద్గుణాలను ప్రపంచానికి బో ధించిన ఆ కారుణ్యమూర్తి జనియించిన రోజయిన క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు గురువారం ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. చర్చి ల్లో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. క్రిస్మస్ గీతా లు ఆలపించి, కేక్‌లు కట్ చేశారు. దైవ కుమారుని వా క్కులు నిత్య స్ఫూర్తితో.. మదిమదిలో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు. క్రీస్తు వెలుగును ప్రతిబింబించేలా కొవ్వొత్తులతో ఆరాధనలో పాల్గొన్నారు. -
విరాటపర్వ పారాయణతో శుభ ఫలితాలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రామాయణంలో సుందరకాండ, భాగవతంలో దశమ స్కంధం మాదిరిగానే భారతంలో విరాటపర్వానికి ఓ ప్రత్యేకత ఉందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వేదవ్యాస భారత ప్రవచన ధారలో భాగంగా ఆయన గురువారం విరాటపర్వ విశేషాలను వివరించారు. విరాటపర్వ పారాయణ వలన కరువు కాటకాలు నశిస్తాయని, శుభఫలితాలు చేకూరుతాయని చెప్పారు. భారతాధ్యయనం విరాటపర్వంతో ప్రారంభించాలని వ్యాసుడు ఎక్కడా చెప్పలేదన్నారు. మత్స్యరాజు కొలువులో ప్రవేశించే ముందు.. పాండవులు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటున్న సమయంలో.. ద్రౌపది గురించి ధర్మరాజు అన్న మాటలను నేటి తరం స్మరించుకోవాలని అన్నారు. ‘‘ద్రౌపది మనకు ప్రియమైన భార్య. తల్లిని కొడుకు ఎలా రక్షించాలో ఈమెను మనం అలా రక్షించుకోవాలి. అక్కలా గౌరవించాలి. ఈమె మనకు ప్రాణాల కన్నా ప్రియమైనది’’ అని సోదరులతో ధర్మరాజు అంటాడని వివరించారు. వాల్మీకి వ్యాసాదులు రామాయణ భారతాల్లో భార్యాభర్తల అనుబంధాన్ని ఎంతో పవిత్రంగా వివరించారన్నారు. భార్యకు పాతివ్రత్యధర్మాన్ని చెప్పినట్టుగానే.. భర్తకు కూడా భార్య పట్ల అంతటి బాధ్యత ఉందని చెప్పారు. ‘‘కీచకుని ఆగడాలను ప్రతిఘటించడానికి ద్రౌపది ముందుగా సూర్యారాధన చేసింది. అజ్ఞాతవాసం ప్రారంభించడానికి ముందు దుర్గాదేవిని ధర్మరాజు స్తుతించి, ఆమె అనుగ్రహం పొందుతాడు. వేదమంత్రాలకున్న శక్తి భారత పారాయణకుంది. విరాటుని కొలువులో ప్రవేశించే ముందు పాండవుల పురోహితుడు ధౌమ్యుడు ఉపదేశించిన ధర్మాలను మనం విస్మరించరాదు. రాజు కన్నా ఉన్నతాసనం ఆశించరాదు. రాజు భార్యలతో చెలిమి తగదు. రాజు శత్రువులతో మాట్లాడరాదని పాండవులతో ధౌమ్యుడు చెబుతాడు. ధర్మరాజు తన పేరు కంకుడు అని చెప్పుకోవడంలో అసత్యం లేదు. కంకుడు అనే పదానికి యమధర్మరాజు అనే అర్థం ఉంది. ఆయన యమధర్మరాజు కుమారుడు’’ అని సామవేదం వివరించారు. సభకు శుభారంభం పలికిన భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు పోతనామాత్య విరచిత ‘శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా..’ పద్యాన్ని సంస్కృతానువాదంలో వినిపించి, శ్రోతలను అలరించారు. -
విరి విలాపం
పూలు.. ఎంత అందమైనవో.. ఎంత సుకుమారమైనవో.. అంత సున్నితమైనవి. పాపం పూలు.. ఉదయిస్తూనే స్వామి సేవకో.. దేవి కొప్పులోకో చేర్చి జన్మను సార్థకం చేయమని వేనోళ్ల ప్రార్థిస్తాయి. రేయి గడిస్తే వసి వాడిపోయి.. సుగంధాలు వీడిపోయి.. కళావిహీనమై చెత్తపాలవుతాయి. నాటి జంధ్యాల పాపయ్య శాస్త్రి ఖండకావ్యం పుష్ప విలాపంలో ‘మా కుత్తుకలు కోసి మా ప్రాణం తీయవద్ద’ని ప్రార్థించిన పూలు.. నేడు మమ్మల్ని చరితార్థులను చేయమని దేవుని అభ్యర్థిస్తున్నాయి. మమ్ములనే నమ్ముకుని జీవిస్తున్న వనమాలి జీవితాన్ని మూడు పువ్వులు ఆరు రూకలుగా వర్ధిల్లజేయమని వినమ్రంగా అర్థిస్తున్నాయి. వనంలో మేము.. వ్యాపారంలో మాలి ఎవరూ లాభపడక ఏం ఉపయోగమని ప్రశ్నిస్తున్నాయి. మాకిచ్చిన అల్పాయువును తోటమాలికి పోసి వారి జీవితాన్ని వికసింపజేయమని ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాయి. పెరవలి: మార్కెట్లో పూల ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది మూఢం ముందే రావడంతో శుభ ముహూర్తాలు లేక వినియోగం తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీని వల్ల రైతులకు నష్టం వస్తుంటే పూలతోటలపై ఆధారపడిన కూలీలకు పనులు లేక ఉపాధి కరువై విలవిలలాడుతున్నారు. జిల్లాకు తలమానికంగా ఉన్న కడియం, కాకరపర్రు పూల మార్కెట్లు నేడు కొనుగోలుదారులు లేక కళావిహీనంగా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు విక్రయాలు లేక.. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేక.. కూలీలకు ఉపాధి దొరకక.. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం శుభ మూహుర్తాలు, పండుగలు లేకపోవటం వలన పూల వినియోగం తక్కువగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. 20 రోజుల క్రితం చామంతి కిలో రూ.300, కాగడాలు కిలో రూ.900, కనకాంబరాలు రూ.1200 పలికితే నేడు పూల రకాలు, నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.150కి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్తున్నారు. రైతులు మార్కెట్‌కు పట్టుకువచ్చిన పూలు రెండు మూడు రోజుల వరకు విక్రయాలు జరగకపోవడంతో వ్యాపారుల దగ్గరే రెండు నుంచి మూడు రోజులు నిల్వ ఉండిపోతున్నాయి. నాలుగు రోజులు దాటితో పూలు వసి వాడిపోయి రోడ్డు పక్కన పాడేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించడంతో పూల దిగుబడి చాలా బాగుందని, మార్కెట్లో పూల ధరలు లేకపోవటం వల్ల వారానికి రెండు కోతలు కోయాల్సిన పూలు నేడు ఒక్కకోతే కోస్తున్నామని రైతులు చెప్తున్నారు. తీరా కోసిన తరువాత కనీసం కూలీల ఖర్చులు కూడ రావడం లేదని, దీంతో కోయకుండానే నష్టపోతున్నామని రైతులు చెప్తున్నారు. పూల రైతులు గ్రామాల బాట బట్టి కిలో పూలు సమయాన్ని బట్టి రూ.30 నుంచి రూ.50కి విక్రయిస్తున్నారు. మార్కెట్లకు పూలను తీసుకువెళ్తుంటే వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని.. దీంతో మళ్లీ తామే తమ గ్రామాలకు తీసుకువెళ్లి వచ్చినకాడికి విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పూలసాగు ఇలా.. జిల్లాలో 4897 ఎకరాల్లో పూల సాగు చేస్తుంటే దీనిపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. పూలకు మార్కెట్లో ధరలు పలకకపోవడం వల్ల సగానికి సగం మందికి ఉపాధి కరువైయ్యిందని రైతులు అంటున్నారు. చిరు వ్యాపారులు సైతం తమకు కనీసం కూలి ఖర్చులు రావడం లేదని వాపోతున్నారు. నాడు కళకళ నేడు వెలవెల రైతులు, వ్యాపారులతో కళకళలాడే కాకరపర్రు పూల మార్కెట్ నేడు వెలవెలబోతోంది. శుభమూర్తాలు, పండగలు లేకపోవడంతో పూల వినియోగం భారీగా తగ్గిపోయింది. దీనితో పూలధరలు హఠాత్తుగా తగ్గిపోయి రైతులు విలవిలలాడుతున్నారు. పనులు లేక ఇబ్బంది పూల కోతలు, పూల తోటలకు ఎరువులు, పురుగు మందులు కొట్టే కూలీలకు, దండలు కట్టే కూలీలకు, చిరు వ్యాపారాలు చేసే సైకిల్ వ్యాపారులకు పని అంతంతమాత్రంగా లభించడంలో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యం పూలు కోసే కూలీలకు వారానికి ఒక్కరోజు మాత్రమే పనులు లభిస్తుంటే, పూల దండలు కట్టే మహిళలు పనులు లేక అల్లాడిపోతున్నారు. ధరలు తగ్గటానికి కారణాలు ఈ ఏడాది ఊహించని విధంగా ముందుగానే మూఢం రావడంతో శుభ ముహర్తాలు లేకపోవటం వల్ల ధరలు పతనమయ్యాయి. ఏటా సంక్రాంతి వెళ్లిన తరువాత మార్చి వరకు ముహూర్తాలు ఉండేవి కావు. కానీ ఈ ఏడాది డిసెంబర్లోనే మూఢం రావల్ల వలన ధరలు తగ్గాయి. అదే సమయంలో ఎటువంటి పండగలు లేకపోవడం మరో ఇబ్బంది. దీనితో పూల వినియోగం హఠాత్తుగా పడిపోయింది. కాకరపర్రులో లిల్లీ పూల తోట అన్నవరప్పాడులో ఆటోలో పూలు అమ్ముతున్న రైతు తోటలోనే మగ్గిపోతున్న పూలు పూలధరలు తగ్గడంతో వాటిని కోయకుండా రైతుల చేలల్లోనే వదలేస్తున్నారు. ఎందుకంటే కోయిస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావటం లేదని, దీనితో పూల కోసేకంటే వదిలేయడమే మేలని చెప్తున్నారు. నిత్యం పదిమందితో పూలు కోయించే రైతులు నేడు వారానికి ఒక్కసారి మాత్రమే కోయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు బంతి పూలు ఒక్కకోతకు 10 కూలీలు అవసరం వస్తే వీరికి రోజుకు రూ.350 కూలి ఇవ్వాలి. మార్కెట్లో కిలో పూలు రూ.20 పలుకుతున్నాయి. ఒక్క కోతకు సుమారు 100 కిలోలు కోయిస్తే కూలీలకు రూ.3500, కాఫీ, టిఫిన్లు, సంచులు, రవాణా కలిపి రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. దీనితో పూలకు మార్కెట్లో వంద కిలోలకు రూ.రెండు వేలు వస్తే ఖర్చు రూ.4500 అవుతోందని రైతులు చెప్తున్నారు. అందుకే పూలను కోయకుండా వదలివేస్తున్నామని వాపోతున్నారు. అన్ని రకాల పూల సాగు పరిస్థితీ ఇలానే ఉందని రైతులు అంటున్నారు. మార్కెట్లో ధరలు ఇలా.. పూల మార్కెట్లో 20 రోజుల వ్యవధిలో ధరలు పరిశీలిస్తే సగానికి సగం పడిపోయాయి. పూల రకం 20 రోజుల ప్రస్తుత క్రితం (రూ.) ధర (రూ.) బంతి పూలు 80 20 చామంతి 300 30-50 గులాబీలు 250 140 లిల్లీ పూలు 300 80 కాగడాలు 900 400 కనకాంబరాలు 1200 600 వచ్చింది కూలీలకే సరిపోతోంది ఒక ఎకరంలో కాగడాలు తోట వేశాను. 20 రోజుల క్రితం వరకు కిలో రూ.900కు విక్రయించగా నేడు రూ.400కు పడిపోయింది. కాగడాల కోతకు 10 మంది కూలీలు అవసరం. 10 కిలోలు పూలు కోస్తున్నారు. మర్కెట్‌కు తీసుకువెళ్తే రూ.4 వేలు వస్తోంది, వచ్చిన సొమ్ము కూలీలకే సరిపోతోంది. – మానేపల్లి శ్రీనివాస్, పూల రైతు, కాకరపర్రు కోయకపోతే చేను.. కోస్తే నేను నష్టపోతాం ఒక ఎకరంలో చామంతి తోట వేశాను. పూల దిగుబడి బాగుంది. రోజు విడిచి రోజు కోత కోసే వాడిని కానీ ధరలు పతనం కావడంతో వచ్చిన సొమ్ము కోత ఖర్చులకు కూడ రావటం లేదు. పూలు కోయకపోతే చేను పాడైపోతుంది, కోస్తే జేబులో సొమ్ములు ఇవ్వాల్సి వస్తోంది. ఏం చేయాలో తెలియడం లేదు. – ఇంటి నారాయుడు, చామంతి రైతు, కాకరపర్రు అదనపు పెట్టుబడి వృథా ఈ ఏడాది పూల దిగుబడి చాలా బాగుంది. నాలుగు రూపాయలు వస్తాయనుకున్నాను. కానీ మార్కెట్లో ధర పతనం కావడంతో గిట్టుబాటు కావడం లేదు. ఆదాయం రావాల్సిన సమయంలో అదనపు పెట్టుబడి పెట్టి నష్టాల పాలవుతున్నాం. – గుడాల వెంకటేశ్వరరావు, పూల రైతు కాకరపర్రు విరివిగా పూసినా సిరులు అంతంతే ధరలు లేక మందగించిన వ్యాపారాలు గగ్గోలు పెడుతున్న రైతులు పనులు లేక కూలీలు.. ఉపాధి దొరక్క పనివారు విలవిల జిల్లాలో 4897 ఎకరాల్లో పూల సాగు ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వేల మందిపై ప్రభావం -
జాతీయ పోటీలకు విద్యార్థులు
తొండంగి: జాతీయ స్థాయి పరుగుపందెం పోటీలకు అద్దరిపేట జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి పిక్కి జగదీష్ ఎంపికయ్యాడు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.దుర్గాకుమారి బుధవారం ఈ విషయం తెలిపారు. పెద్దాపురం ఎంఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ రెండు కిలోమీటర్ల పరుగు పందెం పోటీల్లో జగదీష్ రెండో స్థానంలో నిలిచాడన్నారు. జార్ఘండ్‌లో జనవరి 24న జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొండాడని తెలిపారు. కాకినాడ జిల్లా నుంచి జగదీష్ మాత్రమే అర్హత సాధించడం అభినందనీయమన్నారు. అతడు ఇప్పటికే రెండు సార్లు జిల్లా స్థాయి ప్రథమ, రాష్ట్ర స్థాయిలో ద్వితీ య స్థానాల్లో నిలిచాడన్నారు. జగదీష్‌తో పాటు పీఈటీ దుర్గాప్రసాద్‌లను అభినందించారు. బీచ్ వాలీబాల్ పోటీలకు.. చాగల్లు: జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఊనగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని పంతకాని లాస్య ఎంపికై ంది. ఈ విషయాన్ని ఆ పాఠశాల ప్రధానోపాద్యాయులు ఎన్వీ రమణ బుధవారం విలేకరులకు తెలిపారు. బాపట్ల సూర్యలంక బీచ్‌లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలలో స్కూల్ గేమ్స్ అండర్ – 14 బాలికల విభాగంలో లాస్య ద్వితీయ స్థానం సాధించిందన్నారు. కొల్కతాలో ఫిబ్రవరిలో జరిగే జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో పాల్గొంటుందని తెలిపారు. అలాగే వాలీబాల్‌లోనూ లాస్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని తెలిపారు. ఆ బాలికతో పాటు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు కొయ్య గంగాధరరావును అభినందించారు. -
గోదావరి జిల్లాల్లోకి ఆయిల్ అక్రమ రవాణా
● యానాం నుంచి తరలిస్తున్న మాఫియా ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కుడుపూడి, పెట్రోల్ బంకుల యజమానులు అమలాపురం టౌన్: ఉభయ గోదావరి జిల్లాల్లోకి యానాం నుంచి పెట్రోలు, డీజిల్ అక్రమంగా రవాణా జరుగుతోందని, దీని అరికట్టాలంటూ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో పాటు జిల్లా పెట్రోలు బంకుల యాజమానులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీకి సమస్యను వివరించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కుడుపూడి, జిల్లా బంక్ యాజమానులు స్థానిక మీడియాతో మాట్లాడారు. యానానికి వచ్చే పెట్రోలు, డీజిల్ ధర.. ఆంధ్రా ధర కంటే దాదాపు రూ.13 నుంచి రూ.17 వరకూ తక్కువగా ఉంటుందన్నారు. దీనివల్ల అక్కడి నుంచి ఆయిల్‌కు అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కుడుపూడి మాట్లాడుతూ యానానికి దిగుమతి అయిన పెట్రోలు, డీజిల్ నిత్యం ఉభయ గోదావరి జిల్లాలోకి అక్రమంగా రవాణా అవుతోందన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోట్లతో టాక్సుల రూపంలో ఆదాయం తగ్గుతోందన్నారు. ఈ అక్రమ రాకెట్‌ను ఓ మాఫియా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ అక్రమ ఆయిల్ మాఫియా విషయాన్ని తాను శాసన మండలిలో చర్చకు తీసుకుని వస్తానని, కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలకు జిల్లా బంక్‌ల యజమానులతో కలసి త్వరలోనే అక్కడ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. యానాం ఆయిల్స్ అక్రమ రవాణాతో బంక్‌ల నిర్వహణ, వ్యాపారాలు చేయడం కష్టంగా మారిందన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా పెట్రోల్ బంక్‌ల యాజమానుల బృందం ప్రతినిధులు బీవీ తిరుమలరావు, జవ్వాది తాతబాబు, కె.అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం అమలాపురం ఎంపీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎంపీ గంటి హరీష్ మాధుర్‌కు వినతి పత్రం అందజేశారు. -
ముస్లిం సంపదను ఐటీ పార్కుకు ఇస్తారా?
వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిది మీర్జా మౌలా అలీ రాజమహేంద్రవరం రూరల్: ముస్లింల సంపద అంజుమన్–ఏ ఇస్లామియ సంస్థ ఆస్తులను చంద్రబాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం దారుణమని, దానిని వెంటనే విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మీర్జా మౌలా అలీ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 1915వ సంవత్సరంలో అంజుమన్–ఏ ఇస్లామియా సంస్థకు చిన్న కాకానిలో సర్వే నంబర్ 187/1, 201/ఏ,బి, 201/2బి, 202/బి, 203/ఏ,బి, 204/ఏ, సి అండ్ డి, 222/2 ఏ, అండ్ 2బి నంబర్లలోగల 81.23 ఎకరాల భూమిని ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం దాతలు ఇచ్చారని, దానికి సంబంధించి పత్రాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ముస్లింలకు స్కిల్ డెవలప్మెంట్ కోసం, లైబ్రరీ, ముస్లిం పిల్లలకు స్కాలర్ షిప్‌ల కోసం, ముస్లింలకు విధ్యా సంస్థల కోసం ఈ భూమిని అప్పగించారన్నారు. వక్ఫ్ బోర్డుకు ఐటీ శాఖ మంత్రి ఓఎస్డీ, పర్సనల్ పిఏ వక్ఫ్‌బోర్డుకు ఈ 81.23 ఎకరాల భూమిలో 71.57 ఎకరాల భూమిని ఐటీ పార్క్ కోసం ఇవ్వాల్సిందిగా కోరారని, దీంతో రాష్ట్ర వక్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), వక్ఫ్ బోర్డు చైర్మన్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎందుకంత హడావుడిగా వక్ఫ్‌బోర్డు కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. కమిటీకి ఇష్టం లేకపోయినా బలవంతంగా సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసిందని తెలిపారు. దీనికి కలెక్టర్ స్వయంగా పచ్చ మీడియాకు టెండర్లు పిలుస్తూ ప్రకటనలు ఇవ్వడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ భూముల జోలికి రాకుండా ముస్లిం సమాజ అభ్యున్నతికి పాటుపడాలన్నారు. దీని వెనుక ఉన్న వక్ఫ్‌బోర్డు సీఈఓపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలని, కమిటీకి సూత్రధారిగా వ్యవహరిస్తున్న తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై చర్యలు తీసుకుని వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే వైఎస్సార్ సీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
శభాష్ రాజు..
● సైకిల్ మెకానిక్ నిజాయితీ ● రూ.50 వేలున్న పర్సు పోలీసులకు అందజేతజగ్గంపేట: ఒక సైకిల్ మెకానిక్ తనకు దొరికిన పర్సును పోలీసులకు అందజేశాడు. దానిలో రూ.50 వేలు ఉన్నా తీసుకోకుండా తన నిజాయితీని నిరూపించుకున్నాడు. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేటకు చెందిన సైకిల్ మెకానిక్ కడారి రాజు మంగళవారం రాత్రి స్థానిక జేవీఆర్ సెంటర్ మీదుగా వెళుతుండగా ఒక పర్సు దొరికింది. దాన్ని పరిశీలించగా అందులో రూ.50 వేలు, ఏటీఎం, గుర్తింపు కార్డులు ఉన్నాయి. వెంటనే దాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రఘునాథరావుకు అందజేశాడు. పర్సులోని గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ పర్సు.. బోర్వెల్ రాంబాబుదిగా గుర్తించి ఆయనకు సమాచారం అందించారు. రాంబాబు పోలీస్ స్టేషన్‌కు రావడంతో సైకిల్ మెకానిక్ సమక్షంలోనే ఆయనకు నగదు, పర్సు అందజేశారు. నిజాయితీగా పర్సు అందజేసిన రాజును ఎస్సై రఘునాథరావు శాలువా కప్పి సత్కరించారు. సీసీ పుటేజీ కూడా కూడా పరిశీలించి పర్సు యజమాని రాంబాబుగా నిర్ధారణ చేసుకున్నామని ఎస్సై వివరించారు. -
లైంగిక దాడి ఘటనలో నిందితుడి మృతిపై విచారణ
తుని రూరల్: బాలికపై అత్యాచారయత్నం ఘటనలో నిందితుడు తాటిక నారాయణరావు మృతిపై బుధవారం పెద్దాపురం ఆర్డీఓ, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కె.రమణి మేజిస్ట్రేల్ విచారణ నిర్వహించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య అధికారులతో పాటు నారాయణరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాలు, కుటుంబ సభ్యుల వాదనలను నివేదికగా ఉన్నత అధికారులకు సమర్పించనున్నట్టు ఆమె తెలిపారు. కాగా.. బాలికపై లైంగిక దాడి నేరారోపణపై తాటిక నారాయణరావును తుని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి పది గంటలకు తునిలో జడ్జి ముందు హాజరుపర్చేందుకు పోలీసులు తీసుకువెళుతుండగా మార్గం మధ్యలో కోమటి చెరువు వద్ద బహిర్భూమి కోసమని నారాయణరావు వాహనం దిగాడు. ఆ తర్వాత కనిపించలేదు. దీంతో రాత్రంతా వెతికిన పోలీసులు.. మరునాడు గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా నారాయణరావు మృతదేహం లభించింది. -
ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
టొబాకో బోర్డు ఆర్ఎం ప్రసాద్ సీతానగరం: వర్జీనియా పొగాకు సాగుచేస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని టొబాకో బోర్డు రీజనల్ మేనేజర్ జీఎల్కె ప్రసాద్ రైతులకు సూచించారు. బుధవారం రఘుదేవపురంలో పొగాకు పంట నియంత్రణ – ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సులో దేవరపల్లి టొబాకో బోర్డు ఆక్షన్ సూపరింటెండెంట్ పి.హేమస్మితతో కలసి పాల్గొన్నారు. అంతర్జాతీయ ఎగుమతులు అంతంత మాత్రంగా ఉన్నందున వర్జీనియా పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఏఎస్ హేమస్మిత మాట్లాడుతూ బ్లాక్ సోయల్ రైతులు లైట్ సోయల్కు మారడానికి తగిన భూమిలో పంట వేసి ఉండాలని, అలాగే లైట్ సోయల్కు తగిన భూమి అవునా కాదా అనే కమిటీ పరిశీలించిన అనంతరం లైట్ సోయల్కు లైసెన్సుల మార్పునకు చర్యలు తీసుకుంటామన్నారు. -
కోడిగుడ్డు.. ఆల్‌టైమ్ రికార్డు..
● పౌల్ట్రీ ఫామ్● పౌల్ట్రీ వద్ద ఒక గుడ్డు ధర రూ.7.05 ● రిటైల్ మార్కెట్లో రూ.7.50పై మాటే.. ● పౌల్ట్రీ రైతుల ఆనందం ● గతంలో అత్యధిక ధర రూ.6.30 మాత్రమేరాయవరం: కోడిగుడ్డు ధర రోజు రోజుకూ ఎగబాకుతోంది. హోల్‌సేల్‌గా పౌల్ట్రీ వద్ద 100 కోడిగుడ్లు రూ.700 వరకు ఉండగా, రిటైల్ మార్కెట్లో ఒక గుడ్డును రూ.7.50కు విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల మాదిరిగానే కోడిగుడ్డు ధర నిలకడ లేకుండా పెరుగుతోంది. దీంతో ప్రతి రోజూ గుడ్డు తినే వినియోగదారులు రెండు మూడు రోజులకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో రోజుకు దాదాపుగా 1.02 కోట్ల గుడ్ల వినియోగం జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక పౌల్ట్రీలు ఉన్నాయి. ప్రస్తుతం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 4 కోట్ల వరకూ పౌల్ట్రీ కోళ్లను పెంచుతున్నారు. వీటి ద్వారా రోజుకు 85 శాతం అనగా 3.40 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే గుడ్లలో దాదాపు 35 శాతాన్ని జిల్లా ప్రజలు వినియోగిస్తున్నారు. దాదాపు 2.21 కోట్ల కోడిగుడ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం రాష్ట్రాలకు ఉమ్మడి జిల్లాలోని పౌల్ట్రీల నుంచి గుడ్ల ఎగుమతి జరుగుతుంది. ప్రతి రోజు జిల్లాలో 35 నుంచి 40 లారీల ద్వారా కోడిగుడ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కలిసొచ్చిన కాలం ప్రస్తుతం పౌల్ట్రీ రైతులకు కాలం కలిసొచ్చింది. ఇటీవల పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. ముఖ్యంగా కోళ్లకు తెగుళ్లు రావడంతో ఒడిదుడుకులకు గురైంది. ఈ సమస్యలతో దాదాపు 5 కోట్ల వరకు ఉన్న లేయర్ కోళ్ల సంఖ్య 4 కోట్లకు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ యజమానులు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొన్నారు. జిల్లాలో పలు కోళ్ల ఫారాలు కూడా మూతబడ్డాయి. మరింత పెరిగే అవకాశం సాధారణంగా వేసవి కాలంలో, కార్తిక మాసంలో గుడ్ల అమ్మకాలు తగ్గుముఖం పడతాయి. కానీ ఈ కార్తిక మాసం ప్రారంభంలో రిటైల్‌లో ఒక కోడిగుడ్డు ధర రూ.5.44 ఉండగా, రాను రాను పెరుగుతూ నేటికి రూ.7.05కు చేరింది. ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెరగడం కష్టమని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. చికెన్ పిల్లలను పెంచి, గుడ్లు పెట్టే దశకు రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతోంది. అందువలన ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెరగడం సాధ్యమయ్యే పనికాదు. అదే సమయంలో శీతాకాలం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో కోడిగుడ్ల వినియోగం బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం రాష్ట్రాల్లో వినియోగం అధికంగా ఉండడం, దీనికి తోడు మన జిల్లాలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లకు ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ ఉండడంతో కోడిగుడ్ల ధర మరికొంతకాలం నిలకడగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మున్ముంది ఒకకోడిగుడ్డు రిటైల్‌లో రూ.8 వరకూ పలకవచ్చని భావిస్తున్నారు. ఊహించని ధర గతంలో పౌల్ట్రీ యజమానులు ఎన్నడూ ఇంతటి ధరను చూడలేదు. ఇప్పటి వరకు ఆల్‌టైమ్ రికార్డ్ ధర పౌల్ట్రీ వద్ద రూ.6.30 గా ఉంది. ఇప్పుడు ఆ రికార్డు బద్ధలైంది. ప్రస్తుతం పౌల్ట్రీ వద్ద హోల్‌సేల్‌గా 100 కోడిగుడ్లను రూ.750కు విక్రయిస్తున్నారు. సాధారణంగా కోడిగుడ్డు ధర రూ.5 ఉంటేనే పౌల్ట్రీ వ్యాపారం నిలదొక్కుకోగలుగుతుందని పౌల్ట్రీ రైతులుచెబుతున్నారు.ధర పెరగడానికి కారణాలివే.. కోడిగుడ్ల ధర పెరగడానికి పలు కారణాలున్నాయి. కోళ్లకు జబ్బులు రావడంతో లేయర్ కోళ్ల సంఖ్య తగ్గి, గుడ్ల ఉత్పత్తి తగ్గినట్లుగా పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. శీతాకాలంలో సహజంగా గుడ్ల ఉత్పత్తి 10 నుంచి 15 శాతం తగ్గుతుంది. ఇలా ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో సహజంగానే కోడిగుడ్లకు ధర పెరిగింది. దేశ వ్యాప్తంగా కూడా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడం కూడా ప్రస్తుతం ఇక్కడి పౌల్ట్రీ పరిశ్రమకు ఊరటనిచ్చింది. -
క్రీస్తు జననం శాంతికి సంకేతం
జిల్లా ప్రజలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శుభాకాంక్షలు రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్ మైనార్టీ సోదరులు పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్రీస్తు జననం శాంతికి సంకేతమని, తన జీవితం, మరణం ద్వారా లోకానికి సరైన మార్గాన్ని ఏసు ప్రభువు చూపారని తెలిపారు. ప్రేమ, కరుణకు ప్రతీక ఏసు ప్రభువని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ సంస్థలు సేవా తత్పరతతో ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు స్వార్థాన్ని వీడితేనే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని తెలిపారు. సమాజంలో చెడును పక్కన పెట్టి మంచిని పెంపొందించాలని సూచించారు. ఏసుక్రీస్తు బోధనలు సన్మార్గంలో నడిచేలా చేస్తాయని పేర్కొన్నారు. ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమ పూర్వకమైన జీవన మార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త ఏసు ప్రభువు అని అన్నారు. క్రీస్తు జన్మదినం సర్వ మానవాళికి పవిత్రదినం అని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. భార్య దేవుడిచ్చిన మిత్రము సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): గృహస్థునకు భార్య దేవుడిచ్చిన మిత్రము అని ధర్మరాజు యక్షుని ప్రశ్నకు సమాధానం చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన వ్యాస భారతం 28వ రోజు ప్రవచనం కొనసాగించారు. అష్టకష్టాలలో భార్యా వియోగం ఒకటి, పురుషుని జీవితం భార్య మీద ఆధారపడి ఉన్నదని ఆయన వివరించారు. భారతీయ సారస్వతంలో భార్యకు ఉన్నతస్థానం ఉన్నదని ఆయన వివరించారు. యక్షప్రశ్నలు ఒక ఉపనిషత్తుగా స్వీకరించాలన్నారు. కర్ణుని గురించి విశ్లేషణ చేస్తూ, దానవీరశూర కర్ణ అనడం అతిశయోక్తి అని ఆయన అన్నారు. ఇంద్రుడు విప్రుని రూపంలో వచ్చి సహజ కవచ కుండలాలు యాచించినప్పుడు, దానికి ప్రతిగా శక్తిని ఇమ్మని కర్ణుడు అడిగాడు. దానానికి ప్రతిగా కోరడం వ్యాపారమవుతుంది. ఉత్తమ శ్రేణికి చెందిన దానం కాదు. వచ్చిన వాడు ఇంద్రుడేనని కర్ణునికి తెలుసు. కనుక ఇంద్రుడు కర్ణుని మోసం చేశాడనడం సరికాదని సామవేదం అన్నారు. క్షత్రియ కాంత రెండు వరాలు దాటి కోరుకోరాదని ద్రౌపది అంటుంది. మరో సాధ్వి సావిత్రి యమధర్మరాజును నాలుగు వరాలు ఎలా కోరిందని ప్రశ్న తల ఎత్తవచ్చు. యమధర్మరాజు కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, జగత్తును నియంత్రించేవాడు, దైవం. దైవాన్ని రెండు వరాలే కోరాలన్న నియమం లేదు. ద్రౌపది క్షత్రియుడయిన ధృతరాష్ట్రుని వరాలు కోరింది కనుక, రెంటికే పరిమితమైందని అన్నారు. జిల్లాలో 7.75 వేల టన్నుల యూరియా నిల్వలు డీఏఓ మాధవరావు దేవరపల్లి: జిల్లాలో ప్రస్తు తం 7.75 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్టు జిల్లా వ్యవసాయధికారి ఎస్.మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుంచి రాబోవు 8 రోజులకు 2.58 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, అదనంగా సుమారు 5.17 వేల మెట్రిక్ టన్నులను సొసైటీలు, ఆర్ఎస్కేలు, మార్క్‌ఫెడ్ గోదాములు, రిటైల్, హోల్ సేల్ దుకాణాలు, కంపెనీ గోదాములలో రైతులకు అందుబాటులో ఉంచినట్టు ఆయన చెప్పారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని ఆయన చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లించినా, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించినా లైసెన్స్ రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వైఎస్ జగన్ వాలీబాల్ టోర్నీ విజేతగా వైజాగ్ అమలాపురం రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎ.వేమవరం గ్రామంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగిన వైఎస్ జగన్ వాలీబాల్ చాంపియన్ షిప్ విజేతగా వైజాగ్ జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పోటీ పడగా, రన్నర్‌గా మాగం టీమ్ నిలిచింది. విజేతలకు వైఎస్సార్ సీపీ నాయకుడు కుంచే రమణారావు మొదటి బహుమతిగా రూ.25 వేల చెక్కు, ట్రోఫీ బహూకరించారు. రన్నర్‌కు మాజీ ఎంపీ, పార్టీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ రూ.15 వేల చెక్కు ట్రోఫీ అందజేశారు. -
ఈ కుర్చీకో దండం
అన్నవరం: ఒకప్పుడు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పని చేయడానికి దేవదాయ శాఖ అధికారులు పోటీ పడేవారు. ఈ కుర్చీ కోసం ప్రజాప్రతినిధులతో పెద్ద ఎత్తున సిఫారసులు చేయించుకునేవారు. కానీ, నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఈఓ కుర్చీ అంటే.. వద్దు బాబోయ్.. దీనికో దండమని అంటున్నారు. ఏడాది కాలంగా దేవస్థానంలో నెలకొన్న పరిస్థితులు, పరిపాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టిన వి.త్రినాథరావు సైతం తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సంబంధిత శాఖ మంత్రిని వేడుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజమైతే రత్నగిరిపై పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయ జోక్యం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత దేవస్థానం ఈఓగా దేవదాయ శాఖ అధికారుల స్థానంలో గ్రూప్–1 అధికారి, డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును గత ఏడాది డిసెంబర్లో నియమించారు. దేవస్థానంపై ఆయనకు పెద్దగా అవగాహన లేకపోవడానికి తోడు దేవస్థానం పరిపాలన అంతా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టడం, పని చిన్నదైనా, పెద్దదైనా వారు చెప్తే చేయడమే పరిపాలననే విధంగా పరిస్థితులు దిగజారిపోయాయి. అలాగే, ఆయన కుటుంబ సభ్యుల జోక్యం బాగా పెరిగిపోవడం దేవస్థానం సిబ్బందిలో అసంతృప్తికి కారణమైంది. సుబ్బారావు నియామకంపై ఈ ఏడాది మార్చి నాటికే దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, రాజకీయ జోక్యంతో కొనసాగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కాలంలో ఉన్నతాధికారులు తరచూ జోక్యం చేసుకుని, పరిపాలనను చక్కదిద్దాల్సి వచ్చింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అన్నవరం ఐదు, ఆరు, ఏడు ర్యాంకులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈఓ మారినా.. శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలకు ఈఓలుగా నియమించిన డిప్యూటీ కలెక్టర్ల పదవీ కాలాన్ని ఇటీవల మరో ఏడాది పొడిగించారు. అన్నవరం దేవస్థానం ఈఓ సుబ్బారావును మాత్రం రెవెన్యూ విభాగానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) త్రినాథరావును ఇన్చార్జిగా నియమించారు. గతంలో మూడుసార్లు ఈఓగా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన పరిస్థితులను చక్కదిద్దుతారని ఉన్నతాధికారులు భావించారు. కానీ, ఎవ్వరూ చక్కదిద్దలేనంతగా ఇక్కడి పరిస్థితులు దిగజారిపోయాయనే విషయం ఇప్పుడిప్పుడే తేటతెల్లమవుతోంది. ఇక్కడ ఏ పని చేయాలన్నా ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకుంటున్నారు. ప్రతి పనీ తమకు చెప్పిన తర్వాతే చేయాలనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో, ఇక్కడ స్వేచ్ఛగా ఏ పనీ చేయలేమనే నిర్ణయానికి అధికారులు వచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ సీటు ఆశించిన వారందరూ ఇప్పుడు మిన్నకున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఈఓ త్రినాథరావు కూడా తనను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని సంబంధిత మంత్రిని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానం అభివృద్ధి పథంలో పయనించింది. 2021–22 మధ్య కూడా త్రినాథరావు ఇక్కడ ఈఓగా ఉన్నారు. ఆ సమయంలో రత్నగిరి రామాలయం ముందు భక్తుల కోసం దాతల సహకారంతో సుమారు రూ.కోటితో విశ్రాంతి షెడ్డు నిర్మించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపం, ప్రసాద తయారీ భవనం నిర్మించి, ప్రారంభించారు. అలాగే, 2022–23లో కూడా దాతల సహకారంతో వనదుర్గ ఆలయం వద్ద డార్మెట్రీ నిర్మించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఈఓగా ఉన్న సమయంలో కేవలం 8 నెలల్లోనే సత్యగిరి రోడ్డు నుంచి నేరుగా మూడో ఘాట్ రోడ్డు మలుపులోకి చేరేలా ఆదిశంకర మార్గ్ రోడ్డు, కొండ దిగువన టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం 5 విశ్రాంతి షెడ్లు నిర్మించారు. జాతీయ రహదారి వద్ద ఆక్రమణలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని, అందులో సత్యదేవుని నూతన నమూనా ఆలయం, రత్నగిరిపై పార్కింగ్ స్థలాల అభివృద్ధి, సహజ, ప్రకాష్ సదన్ సత్రాల మధ్య నుంచి పశ్చిమ రాజగోపురం సమీపానికి వాహనాలు చేరుకునేలా రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టి పూర్తి చేశారు. శివసదన్ సత్రం కూడా 135 గదులతో త్వరితగతిన నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. దూర ప్రాంతాల భక్తులకు కనిపించేలా విద్యుద్దీపాలతో శంఖచక్ర నామాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ రాజగోపురం ముందు విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి లారెస్ ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, సత్యదేవ అతిథి గృహాన్ని కూల్చేశారు. వివిధ కారణాలతో ఆ షెడ్డు నిర్మాణం ఆలస్యమైనప్పటికీ ఇటీవల పూర్తి చేశారు. సుమారు 45 వ్రత పురోహిత పోస్టులు భర్తీ చేశారు. వ్రత పురోహితుల పారితోషికాన్ని 30 నుంచి 40 శాతానికి పెంచారు. ఆ ఐదేళ్లూ ఎటువంటి వివాదాలూ లేకుండా దేవస్థానం పరిపాలన సాఫీగా సాగిపోయింది. ఫ రత్నగిరిపై మితిమీరిన రాజకీయ జోక్యం ఫ ఏ పనైనా తమకు చెప్పి చేయాల్సిందే నంటున్న ప్రజాప్రతినిధులు ఫ బెంబేలెత్తిపోతున్న అధికారులు ఫ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన ఈఓ ఫ మళ్లీ డిప్యూటీ కలెక్టర్‌నే నియమిస్తారంటూ ప్రచారం -
భంగపాటు చేయాలని భంగపడిన దుష్టచతుష్టయం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వనవాసం చేస్తున్న పాండు సుతులకు ఘోష యాత్ర మిషతో భంగపాటు కలిగించాలని వచ్చిన ధార్తరాష్ట్రులు భంగపాటుకు గురయ్యారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారతంపై ప్రవచనాన్ని స్థానిక హిందూ సమాజంలో మంగళవారం ఆయన కొనసాగించారు. ‘‘గంధర్వుని చేతిలో దుర్యోధనుడు బందీ అయినప్పుడు.. కావలసిన కార్యాన్ని గంధర్వులే సరి చేశారని భీముడు ఆనందిస్తాడు. అతడిని ధర్మరాజు వారిస్తాడు. ‘ఇతరులతో విభేదాలు వస్తే మనం 105 మంది సోదరులం. ఇతర సందర్భాల్లో వారు వంద మంది, మనం ఐదుగురం. వెంటనే దుర్యోధనుడిని విడిపించు’ అని అర్జునుడిని ఆదేశిస్తాడు. తిరిగి వచ్చిన దుర్యోధనుడిని భీష్ముడు మందలిస్తాడు. ‘నీవు నమ్ముకున్న కర్ణుడు గంధర్వులతో జరిగిన పోరులో పలాయనవాదం చిత్తగించాడు. పాండవుల పరాక్రమంలో కర్ణుడు పావు భాగానికి సరిపోడు’ అని అంటాడ’’ని వివరించారు. భీష్ముడు దుష్టచతుష్టయాన్ని మందలించలేదని వచ్చే విమర్శల్లో సత్యం లేదని సామవేదం చెప్పారు. ‘‘తమ వద్దకు వచ్చిన దూర్వాస మహర్షిని దుర్యోధనుడుఅన్ని విధాలా సహనంతో సేవించాడు. ఆయన అర్థరాత్రీ, అపరాత్రీ వచ్చి భోజనం కావాలని ఆదేశించినా, చక్కని అన్నపానీయాలను అందించేవాడు. సంతృప్తి చెందిన దూర్వాసుడు వరం కోరుకోవాలని దుర్యోధనుడిని అడుగుతాడు. ‘మీరు పాండవుల వద్దకు వెళ్లి, సేవలు అందుకుని వారిని కూడా తరింపజేయాలి. ద్రౌపది కూడా భుజించిన తరువాత భోజనం పెట్టాల్సిందిగా వారిని ఆదేశించాలి’ అని దుర్యోధనుడు కోరుతాడు. వేలాది శిష్యులతో దూర్వాసుడు పాండుసుతుల వద్దకు వెళ్తాడు. ద్రౌపది భుజించిన తరువాత వెళ్లి, తనకూ, తనతో వచ్చిన వేలాది మంది శిష్యులకు భోజనం సిద్ధం చేయాలని కోరుతాడు. స్నానానికి వెళ్లిన దూర్వాసుడు, ఆయన శిష్యగణాలకు కృష్ణుని అనుగ్రహంతో మృష్టాన్న భోజనం చేసిన తృప్తి కలిగి, ధర్మరాజుకు చెప్పకుండా వెళ్లిపోతారు’’ అని కథా భాగాన్ని వివరించారు. హరి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే వచ్చే ప్రమాదాలు దూర్వాసునికి అంబరీషుని ద్వారా గతంలోనే అవగాహనకు వచ్చిందని చెప్పారు. అనంతరం, పాండవులకు మార్కండేయ మహర్షి రామకథ వివరిస్తాడని, పురాణాలు రామకథతో పవిత్రమవుతాయని, భాగవతంలో కూడా రామకథ కనిపిస్తుందని సామవేదం చెప్పారు. నలదమయంతుల కథ, సీతారాముల కథ, సావిత్రీసత్యవంతుల కథలతో కూడిన భారత కథా శ్రవణం ద్వారా యజ్ఞఫలం లభిస్తుందని అన్నారు. -
● వెలుగులు నింపిన రోజు
మానవ హృదయాల్లో అంధకారాన్ని పారదోలి వెలుగులు నింపిన రోజు క్రిస్మస్. ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువు సుగుణాలైన పరిశుద్ధత, పవిత్రత, తగ్గింపు స్వభావం, ప్రేమ, దయ, త్యాగం అలవరచుకుని ఆచరించటమే నిజమైన క్రిస్మస్. – రెవరెండ్ పాస్టర్ వల్లభనేని రాంబాబు, ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ నిడదవోలు నియోజకవర్గ రీజినల్ చైర్మన్ ● దైవ, మానవ సంబంధాల పునరుద్ధరణే.. మానవ చరిత్రకు మరో మలుపు క్రిస్మస్. దేవ కుమారుడు మానవునిగా జన్మించడం దైవ, మానవ సంబంధాల పునరుద్ధరణకు నాంది. క్రీస్తు జననంతో పాపాంధకారంలో ఉన్న మానవాళికి విమోచన, నిత్య జీవం లభించాయి. – రెవరెండ్ పాస్టర్ పి.శ్యామ్‌పాల్, సమిశ్రగూడెం ● దేవునికి ఇష్టులుగా జీవించాలి పరిశుద్ధ గ్రంథంలో రాసినట్లు క్రైస్తవ విశ్వాసులు దేవునిపై పరిపూర్ణ భయభక్తులతో, ఆయనకు ఇష్టులుగా జీవించాలి. శాంతి సమాధానాలు పొందాలి. అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. – రెవరెండ్ పాస్టర్ ఎస్వీ డానియోల్, నిడదవోలు -
రైతులకే మొదటి ప్రాధాన్యం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వ్యవసాయ రంగంలో రైతులకే తమ మొదటి ప్రాధాన్యమని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యాన రాజమహేంద్రవరంలోని నిర్కా సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాణిజ్యం తరహాలో వ్యవసాయం చేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. కేవీకే అధిపతి వీఎస్‌జీఆర్ నాయుడు మాట్లాడుతూ, ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ జీ రామ్ జీ) ద్వారా ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 125కు పెంచారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, గిడ్డంగులు, మార్కెట్ సౌకర్యాల వంటి శాశ్వత ఆస్తులను సృష్టించేందుకు, జల సంరక్షణ పనులకు ఈ చట్టం పెద్దపీట వేసిందన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే నాట్లు, కోతల సమయాల్లో ఉపాధి హామీ పనులకు బ్రేక్ వేయడం ద్వారా రైతులకు కూలీల కొరత లేకుండా చేసేందుకు ఈ చట్టం దోహదపడుతుందన్నారు. నిర్దిష్ట సమయంలో హామీ ఇచ్చిన పని దినాలు కల్పించకుంటే కూలీలకు నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు మాట్లాడుతూ, అధిక మోతాదులో రసాయనిక ఎరువుల వాడకం వలన జరిగే నష్టాలను రైతులకు వివరించారు. వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరి ఎగుమతిదారుల సదస్సు కూడా నిర్వహించారు. వివిధ కాలాల్లో ఎగుమతికి గిరాకీ ఉన్న వరి రకాల గురించి మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. వివిధ సంస్థల ప్రతినిధులు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాధవరావును, అమలాపురానికి చెందిన రైతు సోమరాజును అభ్యుదయ రైతుగా ఎంపిక చేసి సత్కరించారు. కార్యక్రమంలో డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త నరసింహారావు, ఏపీసీఎంఎఫ్ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ బి.తాతారావు, కేవీకే అధికారులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 100 మంది రైతులు పాల్గొన్నారు. ఫ నిర్కా డైరెక్టర్ శేషుమాధవ్ ఫ ఘనంగా జాతీయ రైతుల దినోత్సవం -
క్రీస్తు మందిరం.. నూత్న శోభితం
నిడదవోలు: ప్రేమ, శాంతి, క్షమ, దయ, త్యాగం వంటి సద్గుణాలనే ప్రపంచ మానవాళికి తన సందేశంగా ఇచ్చిన కరుణామయుడైన క్రీస్తు జన్మదినం.. క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు సిద్ధమయ్యారు. తమ ఇళ్లతో పాటు చర్చిలు, ప్రార్థనా మందిరాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపతోరణాలతో అలంకరించారు. క్రిస్మస్ ట్రీలు, ఇతర అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. పాలస్తీనా దేశంలోని బేత్లెహేము గ్రామంలోని పశువుల పాకలో ఆ దైవ కుమారుడు జనియించిన వృత్తాంతాన్ని కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీస్తు జాడను చూపిన నక్షత్రానికి సూచికగా విశ్వాసుల ఇళ్లు, చర్చిల వద్ద విద్యుద్దీపాలతో ఏర్పాటు చేసిన స్టార్లు ఇప్పటికే కొత్త కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆ మహనీయుని బోధను అనుసరించి.. దీన జనులకు కొంత మంది నూతన వస్త్రాలు, కానుకలు, ఆహార పదార్థాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. క్రీస్తు జననాన్ని వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సామూహికంగా స్తుతి ఆరాధనలు చేయనున్నారు. కేరల్స్ ఏసుక్రీస్తు జనన వర్తమానాన్ని ప్రకటిస్తూ ఆయా క్రైస్తవ సంఘాల ఆధ్వర్యాన క్రిస్మస్ వేడుకలకు ముందు సంఘ కాపరితో పాటు యువజనులు రాత్రి వేళ ఇంటింటికీ తిరిగి కేరల్స్ నిర్వహిస్తారు. సంగీత వాయిద్యాలతో క్రీస్తు స్తుతి గీతాలు ఆలపిస్తూ ఆయా ఇళ్లను సందర్శిస్తారు. కేరల్స్ వలన క్రైస్తవుల్లో ప్రేమ, ఐక్యత పెంపొందుతాయి. క్రిస్మస్ ట్రీ ఆధునిక జర్మనీ ఆవిర్భవించాక క్రిస్మస్ ట్రీ ప్రాచుర్యంలోకి వచ్చింది. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ మొదటిసారి ఎవర్గ్రీన్ అనే చెట్టును కొవ్వొత్తులతో అలంకరించినట్లు చెబుతారు. ట్రీ వర్షిప్ అనేది యూరోపియన్లలో అతి సాధారణం. నిత్య జీవానికి సంకేతంగా క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. ఈజిప్షియన్లు, చైనీయులు, హీబ్రూస్ ఈ ట్రీని అలంకరించేవారు. ఈ సంప్రదాయం 20వ శతాబ్దంలో చర్చిలకు, కాలక్రమేణ అన్ని దేశాలకూ, 1982లో వాటికన్ సిటీలోని కేథలిక్ చర్చిలకు విస్తరించింది. ఈ ట్రీలో త్రికోణ ఆకారంలోని అగ్రభాగం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ ఐక్యరూపానికి ప్రతీకగా చెబుతారు. పైన అలంకరించిన నక్షత్రం క్రీస్తు జననానికి సూచన. అపవాదుని పారదోలేదిగా భావిస్తూ క్రైస్తవులు క్రిస్మస్ దినాల్లో ఇళ్లు, చర్చిల్లో ఈ ట్రీలు అలంకరిస్తారు. క్రిస్మస్ సంరంభం ఆరంభమైతే చాలు.. ఎర్రని రంగు దుస్తులు.. తెల్లని పండు జుట్టు, గెడ్డం, మీసాలతో క్రిస్మస్ తాత (శాంటాక్లాజ్) అనేకచోట్ల ప్రత్యక్షమవుతాడు. అతడిని చూస్తే చాలు.. పిల్లలు తెగ సంబరపడిపోతూంటారు. ఈ క్రిస్మస్ తాత ఎలా వచ్చాడంటే.. గ్రీకు బిషప్ సెయింట్ నికోలస్ స్ఫూర్తితో శాంటాక్లాజ్ పాత్ర రూపుదిద్దుకుంది. 1823లో అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో శాంటాక్లాజ్ వర్ణనపై రచించిన ‘ఏ విజిట్ ఫర్ సెయింట్ నికోలస్’ కవిత ఆధారంగా థామస్ నేస్ట్ అనే రాజకీయ, వ్యంగ్య చిత్రకారుడు శాంటాక్లాజ్ ఊహాచిత్రం గీశారు. ఈ చిత్రాన్ని కోకాకోలా కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారానికి వినియోగించుకుంది. ఆ క్రమంలో శాంటాక్లాజ్ వస్త్రధారణ ఇప్పుడున్న ఎరుపు, తెలుపు రంగుల్లోకి మారింది. క్రిస్మస్ రోజు రాత్రి వేళ.. దుప్పులతో నడిచే రథంపై ఆకాశ మార్గాన క్రిస్మస్ తాత వస్తాడని, మంచి ప్రవర్తన ఉన్న పిల్లలకు ఎన్నో బహుమతులు తెస్తాడని, చెడు ప్రవర్తన ఉన్న పిల్లలకు బొగ్గు మాత్రమే ఇస్తాడని తల్లిదండ్రులు చెబుతూంటారు. దీనిని విశ్వసిస్తూ పిల్లలు మంచి ప్రవర్తన కనబరుస్తారు. దీనిని గుర్తు చేసేలా క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ తాత అలంకరణలో ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. క్రీస్తు ప్రేమను ప్రదర్శిస్తూ.. కానుకలు పంచుతూ పిల్లలను, పెద్దలను అలరిస్తాడు. ఫ జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ సంరంభం ఫ వేడుకలకు ముస్తాబైన చర్చిలు ఫ పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలు ఫ ఆకట్టుకుంటున్న విద్దుద్దీపాలంకరణలు -
వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, సాధికార సంస్థ (మహిళా ప్రాంగణం) లో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ కోర్సు లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ (ఇన్చార్జి) పి.విమల ఒక ప్రకటనలో తెలిపారు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ (8వ తరగతి ఆపైన), బ్యూటీషియన్ (10వ తరగతి), డేటా ఎంట్రీ ఆపరేటర్ (10వ తరగతి) కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే, షార్ట్ టర్మ్ కోర్సులైన టైలరింగ్ బేసిక్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మిల్లెట్స్ స్నాక్స్ మేకింగ్ (8వ తరగతి) అందిస్తున్నామన్నారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తామన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల్లోపు ఆసక్తి కలిగిన మహిళలు ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రం, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువపత్రం, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు బొమ్మూరు మహిళా ప్రాంగణంలో ఇస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 83339 21340 నంబర్లో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బ్యూటీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల దరఖాస్తులను ఈ నెల 31లోగా.. టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మిల్లెట్స్ స్నాక్స్ మేకింగ్ కోర్సుల దరఖాస్తులను జనవరి 5లోగా మహిళా ప్రాంగణంలో అందజేయాలని విమల సూచించారు. పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆఫీస్ సబార్డినేట్, అనస్తీషియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు, జనరల్ డ్యూటీ, స్టోర్, ల్యాబ్ అటెండెంట్లు, ఈసీజీ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఈ నెల 26 ఉదయం 10 గంటల నుంచి జనవరి 9వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో వ్యక్తిగతంగా మాత్రమే సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈస్ట్‌గోదావరి.ఏపీ.జీఓవీ.ఇన్, జీఎంసీరాజమహేంద్రవరం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏపీఎన్జీవోనూతన కార్యవర్గ ఎన్నిక ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఏపీఎన్జీవో సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఆ సంఘం కార్యాలయంలో మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. రాజమహేంద్రవరం యూనిట్ అధ్యక్షుడిగా పిచ్చుక అనిల్ కుమార్ (మున్సిపల్), కార్యదర్శిగా ఆర్.రాజేష్ (ఖజానా శాఖ), కోశాధికారిగా ప్రతాప్ (పంచాయతీరాజ్), సహాధ్యక్షుడిగా యర్రంశెట్టి సత్యమూర్తి (పంచాయతీరాజ్), ఉపాధ్యక్షులుగా ఎం.సత్యనారాయణరాజు (రిజిస్ట్రేషన్స్), డి.చటర్జీ (మెడికల్), రాఘవరావు (పబ్లిక్ హెల్త్), జి.కుమార్ (సెంట్రల్ జైలు) ఎన్నికయ్యారు. వీరితో పాటు మహిళా ఉపాధ్యక్షులుగా ఎం.సత్యవతి (మెడికల్), కార్యనిర్వాహక కార్యదర్శిగా జె.వెంకట్రావు (అగ్రికల్చర్), సంయుక్త కార్యదర్శులుగా డి.జగ్గారావు (వార్డ్ సచివాలయం), రోజారాణి (శిశు సంక్షేమం), ఎస్కే సహానా (ఖజానా శాఖ), వి.రత్నకుమార్ (కమర్షియల్ ట్యాక్స్), టి.శ్రీనివాస్ (విద్య), మహిళా సంయుక్త కార్యదర్శిగా పి.కామేశ్వరి (మున్సిపల్) ఎన్నికయ్యారు. డ్రమ్ సీడర్‌తో వరి విత్తనాలు వేయాలి పెరవలి: డ్రమ్ సీడర్ ద్వారా జిల్లావ్యాప్తంగా 3,500 ఎకరాల్లో రబీ వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సేంద్రియ వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సాకా రామకృష్ణ తెలిపారు. మండలంలోని కాపవరంలో డ్రమ్ సీడర్ ద్వారా రైతులతో మంగళవారం విత్తనాలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రమ్ సీడర్‌తో విత్తనాలు వేస్తే ఎక్కువ కుదుళ్లు ఏర్పడి, దిగుబడి పెరుగుతుందని, కూలీల ఖర్చు తగ్గు తుందని చెప్పారు. ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతాయన్నారు. డ్రమ్ సీడర్‌తో విత్తనాలు వేసే రైతులు కృషి ట్రాక్టర్‌కు రోటోవేటర్‌ను అమర్చి దమ్ము చేసి, నేలను చదును చేయాలని సూచించారు. నీరు పల్చగా ఉంచి, కోర వచ్చిన విత్తనాలను డ్రమ్ముల్లో వేసి నాటాలన్నారు. డ్రమ్ సీడర్లోని నాలుగు డ్రమ్ములుంటాయని, ఒక్కొక్క దానిలో కిలో చొప్పున విత్తనా లు వేస్తే, 10 నుంచి 12 సెంటీమీటర్ల ఎడంతో పడతాయని చెప్పారు. డ్రమ్ సీడర్ లాగినప్పుడు లైనుకు లైనుకు మధ్య 22 సెంటీమీటర్ల వ్యత్యా సం ఉంటుందన్నారు. ఎకరానికి 20 కిలోల విత్తనాలు ఆదా అవుతాయని తెలిపారు. పైగా, ఈ చేలు బాగా దుబ్బు చేసి, వారం ముందే కోతకు వస్తాయని, చీడపీడల సమస్య తక్కువగా ఉండి, దిగుబడి 3 నుంచి 5 బస్తాలు ఎక్కువ గా వస్తుందని, వివరించారు. ఎకరానికి ఖర్చు రూ.5 వేల వరకూ తగ్గుతుందని రామకృష్ణ చెప్పారు. 23ఎన్డిడి41: కాపవరంలో డ్రమ్ సీడర్‌ను లాగుతున్న రైతు -
ఉషోరుమంటూ..
యానాం: పర్యాటక ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల ఖర్చుతో చేపట్టిన నిర్మాణాలకు నిర్లక్ష్యపు గ్రహణం పట్టింది. వాటి నిర్వహణ లేకపోవడంతో అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఎన్నో ఆశలతో వాటిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. యానాం పట్టణంలో బొటానికల్ గార్డెన్, దానిలో నిర్మించిన మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో ఈ కోవలోకే వస్తాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ నిర్మాణాలు ఇప్పుడు పనిచేయడం లేదు. బొటానికల్ గార్డెన్ నిత్యం తెరిచే ఉంటుంది. మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షోలను ఏటా సంక్రాంతి పండగ సమయంలో మూడు రోజుల పాటు ప్రదర్శించేవారు. ప్రస్తుతంగా గార్డెన్ అధ్వానంగా మారింది. మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షోకు సంబంధించిన యంత్రాలు నిర్వహణ లేక మూలన పడ్డాయి. రూ.8 కోట్లతో నిర్మాణం బొటానికల్ గార్డెన్‌ను 2013లో సుమారు రూ.8 కోట్ల పర్యాటక శాఖ నిధులతో నిర్మించారు. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ఉపకరించేలా దాన్ని తీర్చిదిద్దాలని భావించారు. కానీ కేవలం ఒక భవంతిని నిర్మించి వదిలేశారు. గార్డెన్లో మొక్కలను మాత్రం ఏర్పాటు చేయలేదు. దాన్ని 2016లో సీఎం రంగసామి ప్రారంభించారు. అనంతరం మళ్లీ అదే స్థలంలో రూ.2 కోట్ల నిధులతో మ్యూజికల్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. దానికి అనుసంధానంగా లేజర్ షోకు కూడా ఏర్పాట్లు చేశారు. 2019 జనవరిలో సౌండ్ అండ్ లైట్ షోను అప్పటి సీఎం నారాయణసామి ప్రారంభించారు. అప్పటి నుంచి కొంత కాలం పనిచేసిన తర్వాత మానేసింది. నిర్వహణ గాలికి.. మ్యూజికల్ ఫౌంటెయిన్‌కు సంబంధించిన యంత్రాలు, మోటార్లను సంబంధిత పీడబ్ల్యూడీ యంత్రాంగం నిర్వహణ చేయాల్సి ఉంది. ఎప్పటికప్పుడు ఆ యంత్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ రెండేళ్లుగా వాటిపై అధికారులు దృష్టి సారించలేదు. దీంతో యంత్రాలు పనిచేయని స్థితిలోకి వచ్చాయి. అక్కడ నీరు కూడా రంగు మారి అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. బొటానికల్ గార్డెన్ ప్రాంతం సంబంధిత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుంది. దాని నిర్వహణ బాధ్యత అంతా వారిదే. అయితే సంబంధిత అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బొటానికల్ గార్డెన్లో మొక్కలు, పచ్చదనం సైతం లేకుండా కళావిహీనంగా మారింది. పర్యాటకులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. దీంతో అక్కడకు వచ్చిన వారందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈసారి నిరాశే.. ప్రతి ఏటా సంక్రాంతి పండగ సమయంలో మూడు రోజుల పాటు మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో ప్రదర్శిస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం ప్రదర్శనలు లేకుండా చేశారు. మ్యూజికల్ పౌంటెయిన్కు సంబంధించి యంత్రాలను సకాలంలో బాగు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్రాంతికి లేజర్ షో లేనట్టే మూలన పడిన మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహణ లేక పనిచేయని యంత్రాలు అధ్వానంగా మారిన యానాం బొటానికల్ గార్డెన్ పర్యాటకులకు నిరాశ -
ఉమ్మడి జిల్లా ఖోఖో జట్టు ఎంపిక
సామర్లకోట: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి జిల్లా పురుషుల జట్టును మంగళవారం ఎంపిక చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని సుమారు 52 మంది క్రీడాకారులకు ఐదు రోజుల పాటు పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూల్లో శిక్షణ ఇచ్చారు. వారిలో ఉత్తమ ప్రతిభ చూపిన 15 మంది క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వారికి వెన్నా వెంకటేష్ సహకారంతో జెర్సీలు అందజేశారు. గుడివాడలో ఈ నెల 25, 26 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వెంకటేష్ తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులను డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అభినందించారు. చదువు భారం.. బాలికల అదృశ్యంమలికిపురం: చదువుకోవడం భారంగా మారిందని భావించిన రాజోలుకు చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థినులు మంగళవారం అదృశ్యం అయ్యారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు గాలించి, నాలుగు గంటల్లోనే వారి ఆచూకీ కనుగొన్నారు. ఆ వివరాలను మలికిపురం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ విలేకరులకు తెలిపారు. రాజోలు చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులకు చదవుకోవడం భారంగా మారింది. ఇంట్లో చెప్పినా బలవంతంగా కాలేజీకి పంపుతుండడంతో పారిపోవాలని అనుకున్నారు. రాజమహేంద్రవరం వెళ్లి దుస్తుల దుకాణంలో పనిచేసుకుంటూ బతకాలని వెళ్లిపోయారు. వారి సెల్ఫోన్ల ఆధారంగా పోలీసులు ఆ బాలికలను గుర్తించారు. వారి తల్లిదండ్రులు విదేశాలలో ఉండడంతో ఇక్కడి బంధువులకు వీరి బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సమావేశంలో సీఐ టీవీ నగేష్ కుమార్, రాజోలు, మలికిపురం ఎస్సైలు రాజశేఖర్, పీవీవీఎస్ సురేష్ పాల్గొన్నారు. నల్లజర్లలో చోరీదేవరపల్లి: నల్లజర్లలోని ఒక ఇంట్లో దొంగలు పడి బంగారం ఆభరణాలు, నగదును దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల సెంటర్లో మెడికల్ షాపు మురళీకి చెందిన రెండు పోర్షన్ల ఇల్లు ఉంది. వాటిలో వల్లూరి శ్రీలక్ష్మి, వట్టికూటి వెంకటేశ్వరరావు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వారందరూ సోమవారం రాత్రి 8 గంటలకు తమ పోర్షన్లకు తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం 6 గంటలకు తిరిగి వచ్చే సరికి, తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా వెంకటేశ్వరరావు బీరువాలో 6.50 కాసుల బంగారం ఆభరణాలు, రూ.30 వేల నగదు, వెండి, శ్రీలక్ష్మి పోర్షన్లో సీసీ కెమెరాలు, డీవీఆర్ బాక్సు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం వచ్చి వేలిముద్రలను సేకరించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. పాల ట్యాంకర్ ఢీకొని యువకుడి మృతిరాజానగరం: పాల ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. జాతీయ రహదారిపై జీఎస్ఎల్ పెట్రోలు బంకు సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం పెదపాడుకు చెందిన పైలా సత్య షణ్ముఖసాయి (22) మోటారు సైకిల్‌పై రాజమహేంద్రవరం వైపు వెళుతున్నాడు. అతడిని వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో షణ్ముఖ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్‌కు ఐదేళ్ల జైలు, జరిమానావిశాఖ లీగల్: ప్రభుత్వ సంస్థను మోసం చేసి, ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరించిన బ్యాంకు మేనేజర్‌తో పాటు మరో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ నగరంలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పి.విజయదుర్గ మంగళవారం సంచలన తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు నిందితులు ఒక్కొక్కరూ రూ.1,10,000 జరిమానా చెల్లించాలని, ఒకవేళ చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో స్పష్టం చేశారు. ఇదే కేసులో ప్రమేయం ఉన్న మరో నలుగురికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.45,000 జరిమానా విధించారు. సీబీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన చాగంటి చలపతిరావు, అసిస్టెంట్ మేనేజర్ పూడూరు సుబ్బారావు 2010–2011 కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. లకిడేపల్లిలో చేపల చెరువుల సాగు పేరుతో ఎటువంటి నిర్దిష్టమైన తనిఖీలు, సరైన పత్రాలు లేకుండానే ప్రైవేటు వ్యక్తులకు మూడు దఫాలుగా భారీగా రుణాలు మంజూరు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టకుండానే కేవలం కాగితాలపైనే రుణాలను చూపి నిందితులు సత్తి సత్యనారాయణరెడ్డి, టి.శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి లక్షల రూపాయల బ్యాంకు నిధులను స్వాహా చేశారు. అలాగే లక్ష్మీప్రసన్న సీఫుడ్స్ పేరుతో మేడపాటి కనకదుర్గ ప్రసాద్, అతని భార్య ఝాన్సీ లక్ష్మీరాణి, చర్ల శ్రీ లక్ష్మీదేవి కూడా మరో నకిలీ ప్రాజెక్టును సృష్టించి బ్యాంకును మోసగించారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ శిక్షలు ఖరారు చేశారు. -
బాహుబలి ఆనప
సాధారణంగా ఆనపకాయ 3 నుంచి 6 కేజీల వరకు బరువు ఉంటుంది. కానీ ఏకంగా 15 కేజీలు ఉంటే ఆశ్చర్యమే కదా. గంగలకుర్రుకు చెందిన అభ్యుదయ రైతు చిట్టావఝుల బాబూరావు కొబ్బరి తోటలో అంతర పంటలతో పాటు కూరపాదులు, తీగపాదులను సాగు చేస్తున్నారు. దేశవాళీ రకం ఆనపకాయ విత్తనాలను నాటారు. పూర్తిగా జీవమృతాన్ని వినియోగించి సాగు చేయడంతో ఆనప కాయ సుమారు 15 కేజీలు దాటి కాసింది. దీనితో పాటు పాదుకు మరో 6 ఆనప కాయలు 12 కేజీలు తూగాయి. – అంబాజీపేట గంగలకుర్రులో కాసిన 15 కేజీల ఆనపకాయ -
మహిళా దొంగల ముఠా అరెస్టు
జగ్గంపేట: జ్యుయలరీ షాపులో 350 గ్రాముల వెండి పట్టీలను చోరీ చేసిన ఐదుగురు మహిళలను జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గోకవరం రోడ్డులోని కార్తికేయ జ్యుయలరీ షాపునకు ఈ నెల 9వ తేదీన 8 మంది మహిళలు వచ్చారు. వెండి పట్టీలు కొనుగోలు చేస్తున్నట్టు నటించి 350 గ్రాముల 8 జతల పట్టీలను చోరీ చేశారు. దీనిపై షాపు యజమాని ఫిర్యాదు మేరకు ఎస్సై రఘునందనరావు ఆధ్వర్యంలో పోలీసులు కృపారావు, జయరామ్ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, ఇతర మార్గాల ద్వారా ఆ మహిళల ఆచూకీ గుర్తించారు. వారిలో కావిడి మహాలక్ష్మి (పాలకోడేరు), కావిడి చిన్న ధనమ్మ (పాలకొల్లు), కావిడి పార్వతి (నాగేంద్రపురం), కావడి భవాని (నాగేంద్రపురం), చుక్క నరసమ్మ (దర్శిపర్రు)లను జగ్గంపేట శివారు సత్తెమ్మతల్లి గుడి వద్ద అరెస్ట్ చేశారు. శ్యామల, రత్నం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరందరూ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు. -
రొయ్య పిల్లల సీడ్ వివాదంపై సమావేశం
అమలాపురం రూరల్: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రొయ్య పిల్లల సీడ్ సేకరణలో సరిహద్దుపరంగా నెలకొన్న వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆ జిల్లాల జాయింట్ కలెక్టర్లు వై.మేఘ స్వరూప్, టి.నిషాంతి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో జలవనరులు, మత్స్య, సర్వే శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీలు మాట్లాడుతూ 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదంపై శాఖల వారీగా సమీక్షించాలన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం మత్స్యకార సహకార సంఘాల ప్రతినిధులు.. లీజు దరఖాస్తు అంశంపై కోర్టును ఆశ్రయించారన్నారు. ధవళేశ్వరం వద్ద 70 గేట్లను ధవళేశ్వరం మత్స్యకారులకు, బొబ్బర్లంక వద్ద 43 గేట్లను బొబ్బర్లంక మత్స్యకారులకు గతంలో లీజుకు ఇవ్వడం జరిగేదన్నారు. కాటన్ బ్యారేజీ వద్ద ఏ ప్రాంతం ఏ జిల్లా పరిధిలో ఉందో సరిహద్దులు కచ్చితంగా నిర్ధారించాలన్నారు. -
ఆవుదూడపై కుక్కల దాడి
అమలాపురం టౌన్: సుమారు ఐదు నెలల వయసున్న జెర్సీ ఆవుదూడపై కుక్కలు దాడి చేశాయి. ఏకంగా ఆ దూడ ఎడమ చెవిని పూర్తిగా తినేశాయి. అలాగే దాని శరీరంపై పలు చోట్ల తీవ్రంగా గాయాలు చేశాయి. ఇలా పాణప్రాయస్థితిలో ఉన్న ఆవు దూడను గుర్తు తెలియని వ్యక్తులు అమలాపురంలోని ప్రాంతీయ పశువైద్యశాల వద్ద మంగళవారం ఉదయం వదిలేసి వెళ్లిపోయారు. ఆస్పత్రి ప్రధాన వైద్యుడు, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్.విజయరెడ్డి తీవ్రంగా గాయపడిన ఆ ఆవుదూడకు తక్షణమే వైద్యం అందించారు. అనంతరం కోలుకుంటున్న దూడను ప్రస్తుతానికి అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు రైతు మారి భేతాళస్వామి సంరక్షణలో ఉంచారు. ఆవుదూడకు చెందిన సంబంధిత రైతు.. అమలాపురం ప్రాంతీయ పశువైద్యశాలను సంప్రదించాలని డాక్టర్ విజయరెడ్డి కోరారు. భర్త మృతి చెందిన వారానికే భార్య కన్నుమూతకడియం: భర్త మృతి చెందిన వారం రోజులకే భార్య కూడా మృతి చెందిన ఘటన బుర్రిలంకలో జరిగింది. గ్రామానికి చెందిన శివరామ నర్సరీ రైతు, శివరామ ఫ్లవర్ మర్చంట్స్ వ్యవస్థాపకుడు పాటంశెట్టి రామారావు (98) ఈ నెల 15న వృద్ధాప్యంతో కన్ను మూశారు. ఆయన దశదిన కార్యక్రమాలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భర్త మరణించిన నాటి నుంచి తీవ్ర దుఖంలో కూరుకుపోయిన ఆయన భార్య వెంకటలక్ష్మి (90) మంగళవారం ఉన్నట్టుండి ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారం వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ కన్నుమూయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్కె.గంగవరం: కోటిపల్లి శివారు ఏటిగట్టు వద్ద గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను కె.గంగవరం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై జి.సోమేంద్ర మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కోటిపల్లి శివారు ఏటిగట్టు రహదారి వద్ద గంజాయిని రవాణా చేస్తున్నారనే సమాచారంతో ఎస్సై, సిబ్బంది అక్కడకు వెళ్లారు. వీరి వాహనాన్ని చూసి పారిపోతున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారిలో బ్రహ్మపూరి గ్రామానికి చెందిన కుమార స్వామి నుంచి 50 గ్రాముల గంజాయి, మోటారు సైకిల్, యానానికి చెందిన వెంకట కార్తిక్ నుంచి 130 గ్రాముల గంజాయి, రూ.2500 స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
హత్య కేసు నిందితుల అరెస్ట్
రాజోలు: ఏడేళ్ల క్రితం హత్య చేసి పారిపోయిన ఇద్దరు నిందితులను మంగళవారం రాజోలు పోలీస్‌లు అరెస్ట్ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ నరేష్ కుమార్, ఎస్సై రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొదలాడ గ్రామంలో కొప్పాడి శ్రీనివాస్ ఇంటి ముందు ఆరబెట్టిన దుప్పటి 2018 ఏప్రిల్ 4న మాయమైంది. దాన్ని అదే గ్రామానికి చెందిన కామాడి వీర రాఘవులు తీశాడని, అతడిని బ్రాందీషాపులో శ్రీనివాస్ నిలదీశాడు. అలాగే రాఘవులును అక్కడే ఉన్న జగతాని పల్లంరాజు, కొప్పాడి శ్రీను (శ్రీనివాస్ స్నేహితులు) గట్టిగా పట్టుకున్నారు. అనంతరం రాఘవులు తలపై బీరు బాటిల్‌తో కొప్పాడి శ్రీనివాస్ బలంగా కొట్టాడు. దీంతో గాయాల పాలైన రాఘవులును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి నిందితులైన కొప్పాడి శ్రీనివాస్, జగతాని పల్లంరాజు, కొప్పాడి శ్రీను పరారయ్యారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గడిపారు. ఈ ముగ్గురిలో జగతాని పల్లం రాజు చనిపోయాడు. ఏడేళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రాజోలు కోర్టులో హాజరుపర్చారు. -
వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంపై గ్రామసభ
ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి కంచి స్వామీజీ సలహాలు, సూచనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్లు ఆలయ అర్చకుడు యనమండ్ర సత్య సీతారామశర్మ తెలిపారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు అధ్యక్షతన ఆలయ ఆవరణలో మంగళవారం గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని కోరారు. స్వామి, అమ్మవార్ల మూల విరాట్‌ను కదిలించకుండా నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్, ఈవో వి.సత్యనారాయణ మాట్లాడుతూ పునర్నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు ఆహ్వానించామన్నారు. అలాగే 2026 ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సాహంగా ముగిసిన టీచర్స్ గేమ్స్కొత్తపేట: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జెడ్పీ బాలికోన్నత పాఠశాలల క్రీడా మైదానాల్లో రెండు రోజులు జరిగిన జిల్లా స్థాయి టీచర్స్ గేమ్స్ మంగళవారం సాయంత్రం ముగిశాయి. మహిళల త్రోబాల్‌లో పి.గన్నవరం మండలం, పురుషుల క్రికెట్లో ఉప్పలగుప్తం మండలం విజేతలుగా నిలిచాయి. ఈ సందర్భంగా సాయంత్రం డీవైఈఓ పి.రామ లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఎంపీపీ గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గూడపాటి రామాదేవి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మిద్దే ఆదినారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రికెట్ విజేతలకు మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ వీరవల్లి శ్రీనివాస్ తన తల్లి జ్ఞాపకార్థం ట్రోపీలు సమకూర్చారు. అక్కిరెడ్డి సూర్యనారాయణ, కోలా సురేష్, తొత్తుపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం కొపెల్ల భాస్కరశాస్త్రి షీల్డ్‌లు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్, జిల్లా సమగ్ర శిక్షా కోఆర్డినేటర్ డిప్యూటీ కలెక్టర్ జి.మమ్మీ పాల్గొన్నారు. -
తొమ్మిది నెలల గర్భిణికి న్యూరో సర్జరీ
● విజయవంతంగా నిర్వహించిన కాకినాడ వైద్యులు ● తల్లీబిడ్డా క్షేమం కాకినాడ రూరల్: రాజోలుకు చెందిన తొమ్మిది నెలల గర్భిణికి అత్యంత క్లిష్టమైన న్యూరో సర్జరీని కాకినాడ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఆ మహిళకు 12 ఏళ్ల వయసులో తీవ్రమైన జ్వరం రావడంతో మెదడులో నీరు చేరే (హైడ్రోసెఫలస్) సమస్య ఏర్పడింది. మెదడులో చేరిన నీటిని కడుపు భాగానికి మళ్లించేందుకు వీపీషెంట్ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు సమస్య నుంచి అప్పట్లో ఉపశమనం కలిగించారు. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి. ప్రసవానికి రోజులు దగ్గరపడుతుండగా మెదడుపై ఒత్తిడి పెరగడంతో అప్పటి సమస్య తిరిగి తలెత్తింది. తీవ్రమైన వాంతులు, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలతో ఆమె మెడికవర్ ఆస్పత్రిలో చేరింది. స్కాన్ ద్వారా మెదడులో నీటి ఒత్తిడి పెరిగినట్టు వైద్యులు గుర్తించారు. ప్రసవంతో తల్లీబిడ్డలను కాపాడేందుకు, మెదడుకు శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు అన్ని విభాగాల నుంచి ప్రణాళికతో ముందుకు సాగడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ వివరాలను మెడికల్ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గైనకాలజిస్టు డాక్టర్ శ్రావణి సాక్షి, న్యూరో సర్జన్ చందు లింగోలు వెల్లడించారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ శుభాకరరావు మాట్లాడుతూ 24 గంటల పాటు వైద్యులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండడంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేయగలిగామని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారన్నారు. సమావేశంలో వైద్యుడు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ స్థలాల్లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, పక్కా ఇల్లు నిర్మించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టీయూ, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి), ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వభరత్‌కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ పెద్దాపురం ఒకటో వార్డు పరిధిలో గల ప్రభుత్వ స్థలంలో 30 ఏళ్ల క్రితం ఇల్లు లేని నిరుపేదలు పూరిగుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు. ఆ కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరదలు వచ్చిన, ఏలూరు కాలువ నీరు వదిలిన ఆ కాలనీ ముంపుకు గురవుతుందన్నారు. సర్వే నంబర్ 579లో గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారులకు ఇంటి రుణాలు మంజూరు చేయాలని, వారికి రోడ్లు డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.300 మంది శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు శ్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి శ్మశాన వాటికకు స్థలం కొనుగోలు చేసి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, జిల్లా నాయకులు కే రామలింగేశ్వర రావు, ఎల్లే సత్తిబాబు ఏఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కుంచ అంజిబాబు, అధ్యక్షుడు మడికి సత్యం, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి) నాయకులు రెడ్డి దుర్గాదేవి, యమునా, శిరీష, దమ్మ సీత పాల్గొన్నారు. -
రెండు తాటాకిళ్లు దగ్ధం
రూ.5 లక్షల ఆస్తినష్టం పి.గన్నవరం: మండలంలోని పోతవరం శివారు మాతావారిపేటలో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరొక డాబా ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. మొత్తం ఐదు కుటుంబాల వారు నిరాశ్రయులు కాగా, రూ.5 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. మాతా చంద్రరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ మంటలు పక్కనే ఉన్న మాతా శ్రీరాములు ఇంటికి వ్యాపించి, అతడి ఇల్లు కూడా అగ్నికి ఆహూతైంది. పక్కనే ఉన్న మాతా వెంకట్రావుకు చెందిన డాబా ఇల్లు దెబ్బతింది. అర్ధరాత్రి ఇళ్లల్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో బాధితులంతా కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రమాదం నుంచి బయట పడ్డారు. చంద్రరావు ఇంట్లో నివసిస్తున్న అతడి కుమారులు శ్రీనుబాబు, రాంబాబు కుటుంబాలవారు కూడా నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోని సామాన్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, విద్యార్థుల సర్టిఫికెట్లు సర్వం కాలిపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. చంద్రరావు కోడలు పద్మ ఇటీవల కువైట్ నుంచి వచ్చింది. ఆమె ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్న రూ.90 వేలు, బంగారు వస్తువులు కాలిపోవడంతో బోరున విలపించింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు విలపించారు. అమలాపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాలకు రెవెన్యూ అధికారులు బియ్యం పంపిణీ చేశారు. సర్పంచ్ వడలి కొండయ్య, వీఆర్వో పద్మావతి సహాయక చర్యలు చేపట్టారు. తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఆర్ఐ వెన్నపు డాంగే, గిడ్డి ఆనంద్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
గ్రావెల్ అక్రమ తవ్వకాలపై అధికారుల దాడులు
రెండు పొక్లెయిన్లు, లారీ సీజ్ గోకవరం: మండలంలోని రంపయర్రంపాలెం, గంగంపాలెం గ్రామాల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలపై జిల్లా మైన్స్‌శాఖ అధికారి డి.ఫణిభూషణ్‌రెడ్డి సోమవారం దాడులు నిర్వహించారు. రంపయర్రంపాలెంలో సర్వే నంబర్ 471లో బి.అర్జునుడికి చెందిన భూమిలో, గంగంపాలెంలో సర్వేనంబర్ 96/2లో కనిశెట్టి అచ్చియ్యమ్మకు చెందిన భూమిలో గ్రావెల్ అక్రమంగా తవ్వుతున్నట్టు ఆయన గుర్తించారు. ఆయా భూముల్లో గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్న రెండు జేసీబీలను, లారీని సీజ్ చేశారు. రంపయర్రంపాలెంలో 1,104 క్యూబిక్ మీటర్లు, గంగంపాలెంలో 5,769 క్యూబిక్ మీటర్లు మేర గ్రావెల్ అక్రమంగా తవ్వినట్టు నిర్ధారించామన్నారు. ఆయన వెంట మైన్స్‌శాఖ సర్వేయర్ పి.శ్రీనివాస్, ఆయా గ్రామాల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి తొండంగి: మండలంలోని ఏ.వి.నగరంలో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అనుమానాస్పద స్థితిలో మృతి కేసు నమోదు చేసినట్టు తొండంగి ఎస్సై జగన్మోహన్రావు సోమవారం తెలిపారు. ఏ.వి.నగరం గ్రామానికి చెందిన నరాల పాపారావుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె కత్తిపూడిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఏ.వి.నగరం గ్రామంలోని తన ఇంటి నుంచి అదే గ్రామంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఇంటి దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అదే గ్రామానికి చెందిన తాటిపర్తి వసంతు పాపారావు సమాచారం అందించాడు. ఘటనా స్ధలానికి వెళ్లి చూడగా కుమార్తె ఉరివేసుకుని వేలాడుతూ మృతిచెంది ఉంది. కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. బైక్ దొంగలకు 12 నెలల జైలు గండేపల్లి: బైక్ దొంగలకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన తోట వినయ్ (లోఫర్), ఐసెట్టి దివాకర్ (బన్నీ) కలిసి మండలంలోని సూరంపాలెంకు చెందిన వెలుగుల బాలాజీ జూలై 11న తన కూతురిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కాలేజీలో దింపేందుకు వెళ్లి మోటార్ సైకిల్‌ను పార్క్‌చేసి కాలేజీలోకి వెళ్లి వచ్చే సరికి బైక్ మాయమైందన్నారు. ఎసై యూవి శివ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్‌చేసి కోర్టుకు తరలించగా పెద్దాపురం జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎల్ దేవి రత్నకుమారి ఒక్కొక్కరికి 12 నెలలు చొప్పున జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్టు తెలిపారు. -
ఉప్పాడలో ఫుడ్ పాయిజన్
● ఎనిమిది మంది మత్స్యకారులకు అస్వస్థత ● పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులు పిఠాపురం: చేపల ప్యాకింగ్ పనికి వెళ్లిన కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఫుడ్ పాయిజన్ అయిన బిర్యాని తినడంతో సోమవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పిఠాపురం ప్రభుత్వాసునత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైదద్యులు తెలిపారు. బాధితుల కథనం ప్రకారం కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన మత్స్యకారులు వంక కాలేబు, ఓసిపల్లి సంతోష్, పల్లెటి స్టాలిన్, ఉమ్మిడి జాన్, గోశల పీటర్ పాల్, రాచపల్లి ప్రసాద్, గోశల ప్రసాద్, కోడా నాగేంద్ర ఆదివారం తాళ్లరేవు మండలం భైరవపాలెం తీర ప్రాంతానికి చేపల ప్యాకింగ్ పనికి వెళ్లారు. తాళ్లరేవులో ఒక బిర్యానీ హోటల్ వద్ద ఎనిమిది మంది బిర్యానీ కొనుక్కుని ప్యాకింగ్ పూర్తయ్యాక దానిని తిన్నారు. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్నాక బిర్యానీ తిన్న ఎనిమిది మందికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి రావడంతో వారందరిని కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరికి మినహా మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ గీత ఫుడ్ పాయిజన్ అవ్వడంతో అస్వస్థతకు గురైన బాధితులను మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యురాలు వంగా గీతావిశ్వనాఽథ్ పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు అంతా అండగా ఉంటామని ఆమె బాధితులకు ఽభరోసా కల్పించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని అవసరమైన సహకారం అందించాలని పిఠాపురం, కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, ఆనాల సుదర్శన్లకు ఆమె సూచించారు. ఆమె వెంట మత్స్యకార నాయకుడు ఉప్పాడ ఎంపీటీసీ మేరుగు ఎల్లాజీ కొత్తెం దత్తుడు తదితరులు ఉన్నారు. -
ఆరుగురు వ్రత పురోహితుల సస్పెన్షన్
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వ్రతవిభాగంలో పనిచేస్తున్న ఆరుగురు వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈఓ వీ త్రినాధరావు సోమవారం ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం అన్నవరం దేవస్థానం సామూహిక సత్యదేవుని వ్రతాలు నిర్వహించింది. ఇందుకు ఆరుగురు రెగ్యులర్ వ్రత పురోహితులు, ముగ్గురు అదనపు పురోహితులు, వ్రత సామగ్రి, సత్యదేవుని ప్రచార రథంతో బయల్దేరి వెళ్లారు. ఈ వ్రతాలలో 300 జంటలు పాల్గొనగా మరో వేయి మంది భక్తులు తిలకించినట్టు అధికారులు తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు వ్రతాలు నిర్వహించిన అనంతరం వ్రతకథ చెప్పిన మొదటి శ్రేణి వ్రతపురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రత దక్షిణగా భక్తులు వస్త్రదానం కింద రూ.501, అన్నదానం కింద రూ.251 ఇవ్వాలని మైకు ద్వారా డిమాండ్ చేసినట్టు దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ కే రామచంద్రమోహన్లకు సంబంధిత వీడియోలను సాక్ష్యాలుగా చూపుతూ కొందరు ఫిర్యాదు చేశారు. వాటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈఓ త్రినాథ్‌రావును ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఆదేశించారు. దీనిపై ఈఓ ఆ వ్రతాల నిర్వహణకు వెళ్లిన గుమస్తా బీఎస్ఎన్ రాజును విచారించగా వ్రతాలనంతరం భక్తుల నుంచి దానాలు రూపంలో కానుకలు డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, తాను వారించినా వినలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ఆధారంగా స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు మంధా శ్రీరామ్మూర్తి, ప్రయాగ ఆంజనేయులు, తొయ్యేటి వేంకట నరసింహ హరిహర సుబ్రహ్మణ్యం, మొదటి శ్రేణి పురోహితులు మల్లాది గురుమూర్తి, పాలంకి సోమేశ్వరరావు, మూడో గ్రేడ్ పురోహితుడు మొక్కరాల సతీష్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. గుమస్తా బీఎస్ఎన్ రాజుకు మెమో ఇచ్చారు. ఈ వ్రత పురోహితులు కొందరు గతంలో ఇదే విధమైన ఆరోపణలతో సస్పెండ్ అయి మళ్లీ విధుల్లోకి వచ్చారు. దేవస్థానంలో పరిస్థితులు చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
చెడు అలవాట్లతో బీబీఏ విద్యార్థి ఆత్మహత్య
అమలాపురం టౌన్: అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఎదురుగా గల మెట్ల కాలనీకి చెందిన బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కొప్పన దీపక్ రాజన్ (18) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీబీఏ చదువుతున్న దీపక్ రాజన్ చెడు అలవాట్లకు బానిసై ఈ అఘాయిత్యం చేసుకున్నాడని పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు. తండ్రి మరణించడంతో అతని తల్లి అతి గారాబంగా పెంచింది. తరచూ డబ్బు కోసం తల్లిని బెదిరించడం, ఇచ్చిన డబ్బుతో మద్యం తాగడం అతనికి అలవాటుగా మారింది. కాకినాడకు చెందిన తన మామయ్య ఇటీవల చనిపోవడంతో అతని తల్లి అక్కడికి వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి మద్యం సేవించి ఇంటికి చేరుకున్న దీపక్ రాజన్ తన తండ్రి గతంలో చనిపోయాడు, ఇప్పుడు మామయ్య చనిపోయాడు. నేనూ చనిపోతానని ఇంట్లో ఉన్న తన తాతాయ్యకు చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గంట సమయం దాటాక అనుమానం వచ్చి తాతాయ్య చూసేసరికి గదిలో దీపక్ రాజన్ ఉరి వేసుకుని వేలాడుతుండడాన్ని గమనించాడు. పోస్టుమార్టం కోసం విద్యార్థి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
గణిత మేధావి రామానుజన్
కె.పెదపూడిలో 1729 ఆకృతిలో కూర్చున్న విద్యార్థులు అంబాజీపేట: దేశానికి గణిత మేధావిగా శ్రీనివాస రామానుజన్ ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించారని హైస్కూలు హెచ్.ఎం, సీహెచ్.వేణుగోపాలకృష్ణ అన్నారు. కె.పెదపూడి జెడ్పీ హైస్కూల్లో గణిత దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్‌కు ఎంతో ఇష్టమైన సంఖ్య 1729 అని దీనిని రెండు ఘనముల మొత్తంగా రాయగల చిన్న సంఖ్య కావటంతో దీనిని ‘రామానుజన్ సంఖ్య‘ అంటారని వివరించారు. విద్యార్థులు రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన 1729 ఆకృతి పలువురిని అలరించింది. -
ఆర్డీవో, డీఎస్పీ ఆఫీసులు కొనసాగించాలని వినతి
అమలాపురం రూరల్: రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, రామచంద్రపురం రెవెన్యూ సబ్ డివిజన్‌ను తరలించడం కూడదని, దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌కు పలువురు నాయకులు వినతిపత్రాలు అందించారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలిపే ప్రతిపాదన ఉందని దీనివల్ల రామచంద్రపురం నియోజకవర్గంలో కేవలం రెండు మండలాలు మాత్రమే ఉంటాయి. ఫలితంగా 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, సబ్ డివిజనల్ ఆఫీస్‌లు పొరుగు నియోజకవర్గాలకు తరలిస్తారు. వీటిని కొనసాగించాలని రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోర్టినేటర్ పిల్లి సూర్యప్రకాష్, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పెమ్మిరెడ్డి మురళి, అమలాపురం పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, అఖిల పక్ష నాయకుడు సలాది సతీష్నాయుడుకలెక్టర్ను కలిసి వినిత పత్రం అందిచారు. ఈ ఆఫీస్‌ను మూసివేస్తే రైతులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, కూలీలు, సాధారణ ప్రజలకు కష్టాలు ఏర్పడతారయని అందువల్ల, వాటిని యథాతథంగా కొనసాగించాలని వారు కోరారు. -
కంద పంటకు ఇదే అనువైన కాలం
పెరవలి: రాష్ట్రంలో కంద పంటను పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 10వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, ఉండ్రాజవరం, చాగల్లు మండలాల్లో సుమారు 400 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కంద పంట వేసే రైతులకు ఇదే సరైన సమయం కావడంతో రైతులు కందను నాటే విధానం, సాగు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, ఆశించే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొవ్వూరు ఉద్యావన శాఖ అధికారి డి.సుధీర్ కుమార్ వివరించారు. కంద నాటే సమయం ఆసన్నమవ్వడంతో రైతులు ఈ విధంగా సాగు చేపట్టాలని సూచించారు. నేల తయారీ నీటి వసతి కలిగి నీరు బయటకుపోయే సదుపాయం గల సారవంతమైన నేలలను ఎన్నుకోవాలి. ఈ పంట వేయడానికి దుక్కు లోతుగా దున్నాలి. ఆఖరి దుక్కులో 10 టన్నుల చివికిన పశువుల ఎరువును, 24కిలోల భాస్వరం ఎరువులను వేసి దుక్కి దున్నాలి. నాటే సమయం ఏడాదిలో రెండుసార్లు ఈ పంటను వేయవచ్చు. మే, జూన్ నెలల్లోను నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తనాన్ని నాటవచ్చు. విత్తనం నీడలో రెండుమూడు నెలలు ఆరబెట్టిన దుంపలనే విత్తనంగా ఉపయోగించాలి. విత్తన దుంపలు 500 నుండి 750గ్రాములు బరువు కలిగినవి వినియోగిస్తే వీటిని ముక్కలుగా కోసి వాడవచ్చు. ముక్కలుగా కోసేటప్పుడు దుంపకన్ను(మొలక భాగం) ప్రతీ ముక్కలోకి వచ్చే విధంగా కోయాలి. విత్తన దుంపలను కోసిన తరువాత వెంటనే నాటాలి. ఎకరానికి 6టన్నుల విత్తనం వాడాలి. నాటడం విత్తనదుంపలను 60 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. దుంపలను భూమికి లోతుగా నాటి వెంటనే తడిపెట్టాలి. ఎరువుల యాజమాన్యం విత్తనం నాటిన 40, 80, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని, పొటాష్, యూరియాను 217 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 179 కిలోలను 3 సమాన భాగాలుగా చేసి పైన తెలిపిన రోజుల్లో అందించాలి. ఇనుప ధాతువు లోపం కంద పంటకు నీటితడులు సక్రమంగా ఇవ్వని చేలల్లో ఇనుపధాతువు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతువు లోపం ఉన్న మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి తెలుపుగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేధి, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. జింక్ ధాతువు లోపం జింక్ ధాతువు లోపం ఉంటే కందమొక్కల ఆకుల ఈనెల మధ్య పసుపువర్ణంగా మారి ఆకు ముగ్గిపోయి ఎండిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల జింక్‌సల్ఫేట్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి ఆకంతా వ్యాపించి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు సోకడం వలన పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును పిచికారీ చేయాలి. కాండం లేక మొదలు కుళ్లు తెగులు ఈ తెగులు మొక్క మొదలు వద్ద కాండాన్ని ఆశించడంతో కాండం కుళ్లిపోయి చనిపోతుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొదలుకు నీరు వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి కాండం మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మొజాయిక్ తెగులు ఇది వైరస్ తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి ఆకులపై తెలుపు, పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను, ముడుచుకుపోయినట్లుగా ఉంటాయి. ఈ తెగులు విత్తన దుంపల ద్వారాను, పేనుబంక పురుగు ద్వారాను వ్యాపిస్తుంది. దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్‌డెమటాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి ఆకులు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.అన్నవరప్పాడులో చేలో పరచిన విత్తనం కందఅన్నవరప్పాడులో విత్తనం కందను నాటుతున్న కూలీలు -
రాజ్యలాభం కన్నా ధర్మలాభం గొప్పది
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘రాజ్యలాభం కన్నా ధర్మమార్గం గొప్పది. ధర్మానికి తపస్సే మార్గమని కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెబుతాడు’ అని సామవేదం షణ్ముఖశర్మ తెలిపారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాసభారతం ప్రవచనాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ‘‘తీర్థయాత్రలు ముగించుకు వచ్చిన పాండవుల వద్దకు కృష్ణుడు వచ్చి ధర్మజ, భీములకు నమస్కరిస్తాడు. వారిద్దరూ వయసులో కృష్ణునికన్నా పెద్దలు. అర్జునుడిని ఆత్మీయంగా కౌగిలించుకుంటాడు. కృష్ణునికి నకుల సహదేవులు నమస్కరించారు. ధర్మరాజుతో కృష్ణుడు మాట్లాడుతూ, వనవాస సమయంలో నీలో ఎటువంటి సుగుణాలున్నాయో, రాజుగా ఉన్న సమయంలో కూడా అవే ఉన్నాయి. నీవు కర్మలను కామ్య దృష్టితో చేయవు’’ అని అంటాడని వివరించారు. సాధకుని దృష్టి ధర్మరాజుపై, లక్ష్యం కృష్ణునిపై ఉండాలని అన్నారు. ‘‘అనంతరం వారి వద్దకు మార్కండేయ మహర్షి వస్తాడు. ఆయన తపస్సా్ాధ్యయ సంపన్నుడు. జరామరణాలు లేనివాడు. వేల సంవత్సరాల వయసున్నా, పాతికేళ్ల యువకునిలా ఉండేవాడని వ్యాసుడు వర్ణించాడు. ప్రళయ కాలంలో సృష్టి అంతా జలమయమైన సమయంలో కూడా ఆయన అదే శరీరంతో ఉన్నారు’’ అని చెప్పారు. శకుని ప్రోద్బలంతో కౌరవులు ఘోష యాత్రకు ప్రయాణమవుతారన్నారు. గ్రంథావిష్కరణ విశ్రాంత ఓఎన్జీసీ అధికారి, ప్రముఖ సాహితీవేత్త కవితా ప్రసాద్ రచించిన సౌందర్యలహరి పద్య సంపుటిని ప్రవచనానంతరం షణ్ముఖశర్మ ఆవిష్కరించారు. శంకరభగవత్పాదులు అందించిన సౌందర్యలహరి శ్లోకాలను మధ్యాక్కర ఛందస్సులో కవితా ప్రసాద్ అనువదించిన తీరు అభినందనీయమని అన్నారు. ఆదిశంకరుల శ్లోకాలకు రచయిత ప్రామాణికమైన అనువాదాన్ని అందించారని చెప్పారు. -
ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లు తమ 9 నెలల శిక్షణను చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో పూర్తి చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ సూచించారు. ఈ శిక్షణను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎటువంటి నెగెటివ్ ఆలో చనలూ లేకుండా శిక్షణ పూర్తి చేయాలని అన్నారు. దురలవాట్ల జోలికి పోవద్దని, సమాజంలో ఉన్న కష్టాలను తెలుసుకుని, మానవత్వంతో స్పందించి, సహా యం చేయాలని సూచించారు. నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపడంలో ఏపీఎస్పీ పాత్ర కీలకమన్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో తన అనుభవాలను వివరించారు. పోలీసు శిక్షణ కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా, నైతికంగా బాధ్యతాయుతమైన సిబ్బందిని తయారు చేసే ప్రక్రియని చెప్పారు. శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే పోలీస్ కానిస్టేబుల్‌గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారని స్పష్టం చేశారు. అడిషనల్ ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, ట్రైనింగ్ అడిషనల్ కమాండెంట్ వీవీవీ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ టి.నాగ శ్రీనివాస్, ఆర్ఐలు కె.నరసింహరావు, జల్లు శ్రీనివాసరావు, బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశఋ విశ్వనాథం, డీటీసీ ఇన్స్పెక్టర్ ఆర్.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రాజెక్టు: ఫ్లోటింగ్ హౌస్
విద్యార్థిని: అపర్ణాలక్ష్మి, 9వ తరగతి, డాక్టర్ ఎస్ఆర్కే హైస్కూలు, కొవ్వూరు వివరం: సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఉవ్వెత్తున అలలు, వరదలు వచ్చిన సమయంలో ఇళ్లు కోతకు గురవుతాయి. అటువంటి చోట్ల ఫ్లోటింగ్ హౌస్‌లు నిర్మిస్తే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. వరదలు, అలలు వచ్చిన సమయంలో ఈ హౌస్ 3 సెంటీమీటర్ల ఎత్తుకు లేస్తుంది. దీనివలన ఇంటికి ఎటువంటి నష్టమూ ఉండదు. పాస్కల్ సూత్రం, నీటి సాంద్రతపై ఆధారపడి ఇది పని చేస్తుంది. ప్రాజెక్టు: యానిమల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ విద్యార్థినులు: ఎస్.అనన్య, టి.విజయదుర్గ, జెడ్పీ హైస్కూల్, కొంతమూరు వివరం: మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా హెల్త్ మానిటరింగ్ చేయవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా జంతువుల హార్ట్ బీట్, శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకుని, రోగాల బారి నుంచి కాపాడవచ్చు. -
అబ్బురం.. సైన్స్ సంబరం
రాజమహేంద్రవరం రూరల్: చిట్టి మెదళ్లు గట్టి ఆలోచనలే చేశాయి. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు రూపమిచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయుల తోడ్పాటుతో రూపొందించిన ప్రాజెక్టులను.. బొమ్మూరులోని శ్రీ సత్యసాయి గురుకులంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించారు. అందరినీ అబ్బురపరిచారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ప్రారంభించి, ఆయా ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఈ ప్రదర్శన దోహదపడుతుందని అన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల మేధస్సు మరింత వికసిస్తుందని చెప్పారు. డీఈఓ కంది వాసుదేవరావు మాట్లాడుతూ, విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథంతో ప్రాజెక్టులు తయారు చేసి, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీవైఈఓ బి.దిలీప్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్‌ఎస్ నెహ్రూ, గురుకులం కరస్పాండెంట్ శ్యాంసుందర్, ప్రిన్సిపాల్ గుర్రయ్య, రూరల్ ఎంఈఓ తులసీదాస్, డీసీఈబీ కార్యదర్శి దేవా అనిత, సీఎంఓ శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం సహాయ కార్యదర్శి కోలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలి విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ అన్నారు. సాయంత్రం జరిగిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా ఎదగాలని అన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించి, సూచనలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు గ్రూపు ఫ సస్టెయినబుల్ అగ్రికల్చర్ విభాగంలో క్రాప్ మెయింటెయినింగ్ సిస్టమ్ (కె.నవీన, కె.గీతికశ్రీ, 9వ తరగతి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం, గోపాలపురం) ఫ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్ విభాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఎండీఎం (సీహెచ్ గురుసాయిరామ్, సీహెచ్ రియాజ్, 7వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రేగులగుంట). ఫ గ్రీన్ ఎనర్జీ విభాగంలో ఈ–వేస్ట్ కన్వర్ట్ టు ఎనర్జీ (డి.కీర్తన, కె.సత్య, 8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పురుషోత్తపల్లి) ఫ రీక్రియేషనల్ మేథమెటికల్ మోడలింగ్ విభాగంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్స్పైర్డ్ బై మ్యాథ్స్ (జి.భాస్కరి, ఎం.సీత, 8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రంగంపేట) ఫ హెల్త్ అండ్ హైజీన్ విభాగంలో హెల్త్ అండ్ హైజీన్ (కె.వర్షిత్ కుమార్, ఎస్.సిద్ధార్థ, జెడ్పీ హైస్కూల్, రామచంద్రపురం) ఫ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్స్ (ఆర్.సంపత్, డి.జోసఫ్ చరణ్, 9వ తరగతి, లూథరన్ ఎయిడెడ్ హైస్కూల్, రాజమహేంద్రవరం) ఫ ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగంలో స్టూడెంట్ ఫ్రెండ్లీ పెన్ (బి.పల్లవి, ఎం.దీక్షిత, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రంగంపేట) వ్యక్తిగత విభాగం ఫ ఇంజినీరింగ్ టెక్నాలజీ విభాగంలో ఇన్ఫినెట్ (కె.పూర్ణ వసుధ, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రంగంపేట) ఫ వుమెన్ సేఫ్టీ హ్యాండ్ బెల్ట్ (ఎస్.సుమశ్రీసాయి, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, ఉండ్రాజవరం) టీచర్ విభాగం ఫ ఫిజిక్స్‌లో ఎ ఇన్నోవేటివ్ ఫిజిక్స్ ఎగ్జిబిట్స్ (కేఎస్ఆర్ ఆంజనేయులు, జెడ్పీ హైస్కూల్, పురుషోత్తపల్లి) ఫ ఎన్విరాన్మెంట్ సైన్స్ విభాగంలో ఎకో బ్రిక్స్ (బీబీ విజయకుమారి, ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజమహేంద్రవరం) ఫ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో 209 ప్రాజెక్టులు ఫ ఆలోచింపజేసిన నమూనాలు ఫ ప్రతిభ చూపిన విద్యార్థులు -
ప్రాజెక్టు: వైర్లెస్ చార్జింగ్ వెహికల్
విద్యార్థినులు: బి.ప్రశాంతి, కె.కీర్తి, కె.గీతికశ్రీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం, గోపాలపురం వివరం: ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫార్ములా ప్రకారం వైర్లెస్ చార్జింగ్ సిస్టమ్ పని చేస్తుంది. డైరెక్ట్ కరెంట్(డీసీ)ను ఆల్టర్నేటివ్ కరెంట్(ఏసీ)గా మార్చి ఎంత కావాలంటే అంత సరఫరా చేస్తారు. వాహనాలను ఒక ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకుని రాగానే వైరింగ్ అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా చార్జి అయిపోతాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూండగా.. సోలార్ ప్యానల్ వినియోగించుకుని వైర్ లేకుండా చార్జ్ చేసుకోవచ్చని వినూత్నంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. -
జాతీయ స్థాయి సెపక్‌తక్రాలో కాంస్యం
దేవరపల్లి: రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకూ జరిగిన 69వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో రాష్ట్ర బాలికల జట్టు అండర్–17 విభాగంలో ద్వితీయ స్థానంతో కాంస్య పతకం గెలుచుకుంది. జట్టు కోచ్‌గా దేవరపల్లి మండలం దుద్దుకూరు జెడ్పీ హైస్కూలు పీడీ ఆచంట వెంకటేశ్వరరావు, మేనేజర్‌గా బి.సంధ్య వ్యవహరించారు. ఈ జట్టులో వి.కావ్య, కె.లావణ్య (కృష్ణా), పి.మధురశ్రీ (పశ్చిమ గోదావరి), జి.రమ్య (తూర్పు గోదావరి), జి.చైతన్య కుమారి (అనంతపూర్) పాల్గొని అద్భుత ప్రతిభను కనబరిచారని కోచ్ వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ జట్టులోని మధురశ్రీ దేవరపల్లి మండలం చిన్నాయగూడేనికి చెందిన క్రీడాకారిణి కావడం విశేషం. పీజీఆర్ఎస్కు 240 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 240 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, అర్జీలను ఆర్థిక సంబంధిత, ఆర్థికేతరమైనవిగా విభజించామన్నారు. ఆర్థిక సంబంధిత అర్జీల పరిష్కారంలో కొంత ఆలస్యం జరిగి నా సహించవచ్చని, అయితే ఆర్థికేతరమైనవి మా త్రం తప్పనిసరిగా గడువులోపే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల్లో గతంలో వచ్చిన అర్జీలు ఎందుకు పెండింగ్‌లో ఉన్నా యో సంబంధిత అధికారులను ఆరా తీశారు. సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి క్షేత్ర స్థాయిలో పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 37 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 37 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. డిజిటల్ భద్రతపై వర్క్షాప్కంబాలచెరువు (రాజమహేంద్రవరం): డిజిటల్ భద్రత, ఆన్లైన్ మోసాలు, మహిళలపై నేరాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంశాలపై సీఐడీ కార్యాలయంలో సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐడీ అదనపు ఎస్పీ ఆస్మా ఫరీన్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయని అన్నారు. ఉద్యోగులు, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికలపై నేరాల నియంత్రణకు సంబంధిత చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటే విధి నిర్వహణ మరింత సులభమవుతుందని చెప్పారు. బెట్టింగ్, లోన్ యాప్‌ల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.కల్యాణ్ చక్రవర్తి వివరించారు. ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై అమరా వతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ ట్రైనర్ సానబోయిన ఆశ్రిత్ కుమార్ అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై నేరాలు, పోక్సో చట్టం అమలు అంశాలపై జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పేరిచర్ల సూర్య ప్రభావతి మాట్లాడారు. ఒత్తిడి తగ్గింపు, సమ య నిర్వహణ అంశాలపై ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు చెందిన సైకాలజిస్ట్ ఎం.గోపాలకృష్ణ వివరించారు. సీఐడీ రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అద్దేపల్లి ప్రభుకు సాహితీ వేదిక పురస్కారం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అనేక సంవత్సరాలుగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘రాజమండ్రి సాహితీ వేదిక’ కాకినాడకు చెందిన రచయిత అద్దేపల్లి ప్రభుకు 2025 సంవత్సరానికి ‘సాహితీ వేదిక పురస్కారం’ ప్రకటించింది. ఈ నెల 25న స్థానిక గౌతమీ గ్రంథాలయంలో జరిగే సంస్థ వార్షిక సమావేశంలో ప్రభుకు పురస్కారంతో పాటు రూ.20 వేల నగదు అందజేస్తున్నట్లు నిర్వాహకురాలు కుప్పిలి పద్మ తెలిపారు. క్లిష్టమైన వర్తమానాన్ని తన కథల్లో, కవితల్లో ఆవిష్కరిస్తూ, తెలుగు సాహిత్యానికి చేర్పునిస్తున్నందుకు గాను ఆయనకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు వివరించారు. ప్రభు ఇప్పటికే ఆవాహన, పారిపోలేం, పిట్ట లేని లోకం, పర్యావరణ ప్రయాణాలు, దుఃఖపు ఎరుక కవితా సంపుటాలను, ‘సీమేన్’ కథా సంపుటిని ప్రచురించారు. -
పార్లమెంటరీ కార్యాలయంలో..
రాజమహేంద్రవరం తిలక్ రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యాన కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన జగన్ నిజమైన సంక్షేమాన్ని ప్రజలకు అందించారని ఈ సందర్భంగా గూడూరి అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పోలు విజయలక్ష్మి, మానే దొరబాబు, ముప్పన ప్రభాకర్ చౌదరి, మార్తి లక్ష్మి, మారిమ నాగేశ్వరరావు, న్యాయవాది సాదిక్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన ఆశ్రయ ఫౌండేషన్ వద్ద రోగులకు భోజనాలు ఏర్పాటు చేశారు. పెద్దేవంలో 50 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఒరిగేటి అశోక్ ఆధ్వర్యాన ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు వృద్ధులు, వితంతువులకు దుప్పట్లు, పండ్లు పంచారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. -
రజకులను ఎస్సీల్లో చేర్చాలి
● రజకులకు రక్షణ చట్టం చేయాలి ● పలువురు వక్తలు డిమాండ్ ● ముమ్మిడివరంలో రజక ఆకాంక్ష సభముమ్మిడివరం: వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మాదిరిగా రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, వారి రక్షణకు చట్టం చేయాలని జిల్లా రజకులు ఆకాంక్ష సభ–4 సమావేశం తీర్మానించింది. ముమ్మిడివరం డీఎల్ఎఫ్ సంక్షన్ హాలులో ఆదివారం ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సి.సావిత్రి అధ్యక్షతన ఈ సభ నిర్వహించారు. సభలో వక్తలు మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన రజకులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జీవో 27 ప్రకారం ధోబి పోస్టులను రజకుల తోనే భర్తీ చేయాలని తీర్మానించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్మే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రజకుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామన్నారు. మరో ముఖ్య అతిథి శాసన మండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలోని మురికిని వదల గొట్టడానికి రజకులంతా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత ముమ్మిడివరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రజకులు భారీ ర్యాలీ చేశారు. -
కవులు అభ్యుదయ రచనలు చేయాలి
● శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ● ఘనంగా జాతీయ శతాధిక కవి సమ్మేళనం అమలాపురం టౌన్: సామాజిక చైతన్యంతో, అభ్యుదయ భావాలతో కవిత్వం రాయాలని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కవులకు పిలుపునిచ్చారు. శ్రీశ్రీ కళా వేదిక జిల్లా శాఖ. కోనసీమ రచయితల సంఘం, జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం వడ్డిగూడెంలోని వేమన కోనసీమ రెడ్డి జన సమైక్య కమ్యూనిటీ హాలులో ఆదివారం జరిగిన 160వ జాతీయ శతాధిక కవి సమ్మేళనానికి డాక్టర్ ప్రతాప్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. కవి సమ్మేళనంతో పాటు, పాటల స్వర వేదిక కూడా రస రమ్యంగా జరిగింది. రాజమహేంద్రవరం కమాండర్ ఏపీ ఎస్పీఎఫ్ ఎస్పీ డాక్టర్ కొండా నరసింహారావు దంతపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి శంఖారావంతో సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కత్తిమండ సేవలను నరసింహారావు కొనియాడారు. మరో ముఖ్య అతిథి నిడదవోలు శ్రీశ్రీ కళా వేదిక ప్రతినిధి అరవెల్లి నరేంద్ర 160 సమ్మేళనాలు నిర్వహించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 126 మంది కవులు హాజరై తమ కవితా గానాలను వినిపించారు. అలాగే 30 మంది వివిధ కళలకు చెందిన కళాకారులు పాల్గొని తమ కళలను ప్రదర్శించారు. తొలుత మహా కవులు శ్రీశ్రీ, బోయి భీమన్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా అధ్యక్షుడు, కవి నల్లా నరసింహమూర్తి రచించిన నడక విజయం పుస్తకాన్ని డాక్టర్ నరసింహరావు దంపతులు ఆవిష్కరించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన కవి డాక్టర్ ఆర్.మణి భూషణం రచించిన చందనోత్సవం ఏఐ గీతాన్ని నల్లా నరసింహమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవులను వేదిక తరఫున సత్కరించారు. అలాగే డాక్టర్ ప్రతాప్, వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.పార్థసారధి, ఎస్పీ డాక్టర్ నరసింహరావు దంపతులను కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, వేదిక జాతీయ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. సభకు వ్యాఖ్యాతగా బాలార్జున సత్యనారాయణ వ్యవహరించారు. ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ సబ్బెళ్ల మహాలక్ష్మి సమ్మేళనం వివరాలను నివేదించారు. -
జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
సామర్లకోట: స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని డీఎన్ఆర్ కల్యాణ మండపంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక కరాటే కోచ్ డి.శంకర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీల్లో 10 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ మొదటి వైస్ గవర్నర్ చిట్టినీడి శ్రీనివాసరావు, కరాటే ఇండియా చీఫ్ మల్లికార్జునగౌడ్ ఈ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్, జిల్లా చైర్మన్ చిత్తూలూరి వీర్రాజు, క్లబ్ అధ్యక్షుడు డాక్టరు అమలకంటి శ్రీనివాసరావు, కార్యదర్శి బడుబు బాబీ, కోశాధికారి ఏలేటి రమేష్ పాల్గొన్నారు. -
లోవరాజు మృతదేహం లభ్యం
గుర్రపు డెక్కలో చిక్కుకుని తేలిన వైనం సామర్లకోట: గోదావరి కాలువలో గుర్రపు డెక్క తొలగిస్తూ గల్లంతైన చేవూరి లోవరాజు (40) మృతదేహం ఆదివారం గుర్రపు డెక్కలో చిక్కుకుని తేలింది. శుక్రవారం లోవరాజు గుర్రపుడెక్క తీస్తున్న సమయంలో గల్లంతు అయిన విషయం తెలిసిందే. నీటి పంపిణీ దారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుర్రపుడెక్క తొలగింపు పనుల్లో ఎటువంటి జాగ్రత్త చర్యలూ తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నీటి మట్టం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతుని కుటుంబ సభ్యులకు పట్టణ వైఎస్సార్ సీపీ మాజీ అధ్యక్షుడు మద్దాలి శ్రీను ఆర్థిక సహాయం అందజేశారు. -
ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతం
ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతమైన అందం గణితం. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ శాస్త్రం ప్రేరేపిస్తుంది. గణితం ప్రత్యేక భాషగా పిల్లలకు సరైన ఉదాహరణలతో పరిచయం చేయాలి. నిత్య జీవిత సమస్యలకు గణితాన్ని అన్వయించి బోధించాలి. పజిల్స్, అబాకస్, బోర్డులు, పూసల చట్రం వంటి బోధన విధానంతో గణితంపై భయాన్ని పోగొట్టి ఆసక్తి కలిగేలా చేయాలి. – ఎం.నాగ సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, గణిత ఫోరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
వీధి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
ధవళేశ్వరం: వీధి కుక్కల దాడిలో ధవళేశ్వరం సంజయ్‌నగర్ కాలనీకి చెందిన మూడేళ్ల బాలుడు కడలి జతిన్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం జతిన్ కుటుంబం ఊరు వెళ్లేందుకు బయలుదేరారు. తొలుత జతిన్ ఇంటి బయటకు వచ్చి నిలబడ్డాడు. సమీపంలో ఉన్న వీధి కుక్క జతిన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు బాలుడిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన జతిన్‌ను తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్య సేవలకు రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జతిన్ తండ్రి కడలి శివ స్థానిక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు లేఖన
అంబాజీపేట: జాతీయ వినియోదారుల రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు గంగలకుర్రు అగ్రహారం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని దొంగ లేఖన మహాలక్ష్మి ఎంపికై నట్లు హెచ్ఎం అక్కిరాజు శేషసాయి తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో ఈ నెల 20న జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన (ఆంగ్లం) పోటీల్లో లేఖన ప్రతిభ కబర్చి ప్రథమ స్థానంలో నిలిచి రూ.5 వేలు నగదు బహుమతి గెలుపొందిందన్నారు. మంగళవారం విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలో ఆమె పాల్గొననుందని ఆయన తెలిపారు. లేఖన మహాలక్ష్మిని ఎంఈఓలు కాండ్రేగుల వెంకటేశ్వరరావు, మోకా ప్రకాష్, సర్పంచ్ దొంగ నాగేశ్వరరావు, ఎంపీటీసీ విత్తనాల దుర్గాభవాని, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్, ఎస్ఎంసీ చైర్మన్ తొత్తరమూడి గోవింద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. -
నేడు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని శ్రీ సత్యసాయి గురుకులంలో సోమవారం జరగనున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. ఈ ప్రదర్శన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ప్రదర్శనను తిలకించడానికి జిల్లాలోని విద్యార్థులను సంబంధిత ప్రధానోపాధ్యాయులు సరైన రక్షణతో తీసుకురావాలని సూచించారు. మొత్తం 290 ఎగ్జిబిట్లను ఇందులో ప్రదర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు డీవైఈఓ దిలీప్‌కుమార్, రూరల్ ఎంఈఓ తులసీదాస్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్‌ఎస్ నెహ్రూ, పలువురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, సత్యసాయి గురుకులం ప్రిన్సిపాల్ గుర్రయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ధోరణితో ప్రభుత్వ విద్య బలహీనం తాళ్లపూడి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణ ధోరణులతో ప్రభుత్వ విద్య రోజు రోజుకూ బలహీనపడుతోందని, ఈ విధానాలను తిప్పికొట్టాలని ఉపాధ్యాయులకు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి పిలుపునిచ్చారు. మండలంలోని బల్లిపాడులోని కార్ల రామయ్య ఫంక్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాలుగో జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని, యూటీఎఫ్, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) జెండాలను ఆవిష్కరించారు. పలు ఉద్యమ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం వలన పేద ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు. పలువురు నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వ ధోరణుల వల్ల రానున్న రోజుల్లో ప్రభుత్వ బడులు ఏమైపోతాయోననే ఆందోళన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్, నాయకులు షరీఫ్, డి.మనోజ్, ఎన్.అరుణ కుమారి తదితరులతో పాటు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 98 శాతం మందికి పోలియో చుక్కలు రాజమహేంద్రవరం రూరల్: పల్స్‌పోలియో చుక్కల మందు కార్యక్రమం ఆదివారం విజయవంతంగా జరిగిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కె.వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని కంబాలపేట, ఆనంద్ నగర్, క్వారీ మార్కెట్ వద్ద ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా 1,89,550 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కల మందు వేయాలన్నది లక్ష్యం కాగా.. ఒక్క రోజులో 1,85,759 మందికి (98 శాతం) వేశామని తెలిపారు. మిగిలిన పిల్లల ఇళ్లకు వైద్య సిబ్బంది సోమ, మంగళవారాల్లో వెళ్లి పోలియో చుక్కల మందు వేస్తారని వెంకటేశ్వరరావు వివరించారు. -
జననేతకు జేజేలు
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు.. సంక్షేమ ప్రదాత.. పేదల బాంధవుడు.. విద్యార్థులకు మావయ్యగా.. పింఛనర్లకు పెద్ద కొడుకుగా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిగా.. రాజకీయాల్లో సమున్నత విలువలకు పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జననేత జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని జేజేలు పలికారు. కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరాలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ తదితర రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ ప్రియతమ నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ ప్రదాత జగన్ రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన వైఎస్ జగన్ పుట్టిన రోజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్‌కే దక్కుతుందని అన్నారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరచుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఉప్పులూరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు గొందేశి శ్రీనివాసరెడ్డి, నక్కా రాజబాబు, గిరిజాల బాబు, నక్కా శ్రీనగేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఫ జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్న ప్రజలు ఫ విస్తృతంగా సేవా కార్యక్రమాలు -
రాజమండ్రి సిటీలో రక్తదానం
ఇచ్చిన మాటకు కట్టుబడే నిజమైన నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. రాజమండ్రి సిటీలో నాయకులు, కార్యకర్తల కోలాహలం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ధన్వంతరి బ్లడ్ బ్యాంక్‌లో యువజన విభాగం సిటీ అధ్యక్షుడు బిల్డర్ చిన్నా ఆధ్వర్యాన సుమారు 100 మంది రక్తదానం చేసి, జననేత పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. ఇందులో భరత్‌రామ్ స్వయంగా రక్తదానం చేశారు. కోటగుమ్మం వద్ద ఉమ, మిత్ర బృందం ఆధ్వర్యాన కేక్ కట్ చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మోరంపూడి జంక్షన్ వద్ద 40 అడుగుల జననేత ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన భరత్.. అనంతరం కేక్ కట్ చేసి, పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
సందడి చేసిన చాంపియన్
● 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించిన హీరో రోషన్ ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): చారిత్రక ఘటనల ఆధారంగా తెరకెక్కిన చాంపియన్ చిత్ర బృందం ఆదివారం నగరంలో సందడి చేసింది. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోందని హీరో రోషన్ వెల్లడించారు. చిత్ర ప్రమోషన్లలో భాగం రాజమహేంద్రవరం వచ్చిన రోషన్, హీరోయిన్ అనశ్వర రాజన్ స్థానిక ప్రసాదిత్య మాల్లో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం 1948లో బైరాన్ పల్లె అనే గ్రామంలో జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటన చోటు చేసుకుందని, ఆ ఘటన ఆధారంగా చాంపియన్ చిత్రాన్ని దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారని తెలిపారు. పుట్ బాల్ క్రీడ బ్రాక్ డ్రాప్ లో, యాక్షన్, అద్భుతమైన రొమాంటిక్ లవ్ స్టోరీతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన అన్నారు. మిక్కీ జె మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారన్నారు. కొరియోగ్రాఫర్లు మంచి నృత్యరీతులు సమకూర్చారని తెలిపారు. వైజయంతి వంటి పెద్ద బ్యానర్లో ఇంత పెద్ద సినిమా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌కు మంచి హైప్ వచ్చిందని సినిమా అంతకు మించి ఉంటుందన్నారు. హీరోయిన్ అనశ్వర రాజన్ అద్భుతంగా నటించిందని, ఈ చిత్రం తర్వాత తనకు తెలుగులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. కథ ఎంపిక నుంచి అన్ని విషయాలలో తన తండ్రి శ్రీకాంత్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. ట్రైలర్ రిలీజ్‌కు రామ్ చరణ్ రావడం ఆనందంగా ఉందన్నారు. మరో రెండు చిత్రాలు ఒకే అయ్యాయని త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. హీరోయిన్ అనశ్వర రాజన్ మాట్లాడుతూ తెలుగులో తన తొలి చిత్రమే వైజయంతి వంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో పనిచేయడం తన అదృష్టం అన్నారు. ఛాంపియన్ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అభిమానులతో ఫొటోలు దిగారు. హీరో, హీరోయిన్లకు గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. -
అనపర్తి
నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తల కోలాహలం నడుమ.. అనపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు కేక్‌ను మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కేక్ కట్ చేశారు. రామవరంలో గ్రామ శాఖ ఆధ్వర్యాన పార్టీ నేతలు కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో వస్త్ర, అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెదపూడి మండలం జి.మామిడాడలో యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
చోరీలు, చైన్ స్నాచింగ్‌లలో ఆరితేరారు
● పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులు ● అంతర్రాష్ట్ర స్థాయిలో కేసులు నమోదు ● 4 కేసుల్లో రూ.35.5 లక్షల సొత్తు రికవరీఅమలాపురం టౌన్: అమలాపురం టౌన్, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట పోలీస్ స్టేషన్ల పరిధుల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితులు ముగ్గురు పోలీసులకు చిక్కారు. అమలాపురం టౌన్లో చోరీకి పాల్పడిన దొంగ 70 కేసుల్లో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర నేరగాడు. కొత్తపేటలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ మరో అంతర్రాష్ట దొంగ, రావులపాలెం, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ల పరిధుల్లో పలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితుడు పోలీసులకు వేర్వేరుగా దొరికిపోయారు. వీరి నుంచి ఆ నాలుగు పోలీస్ స్టేసన్ల సీఐలు, ఎస్సైలు మొత్తం రూ.35.5 లక్షల సొత్తును రికవరీ చేశారు. ఎస్పీ రాహుల్ మీనా స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ‘అమలాపురం’ అంతర్రాష్ట దొంగ 70 చోరీలు: అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన పతివాడ లోవరాజు (31) అంతర్రాష్ట దొంగ. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రెండు చోరీలు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, తెలంగాణ రాష్ట్రం హయత్‌నగర్‌లో ఒక చోరీకి పాల్పడ్డాడు. అతడి నుంచి 185 గ్రాముల బంగారం, 1750 గ్రాముల వెండి, ఒక బైక్‌ను మొత్తం రూ. 25 లక్షల సొత్తును రికవరీ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 70 చోరీ కేసులు అతనిపై ఉన్నాయి. తాళాలు వేసి ఇళ్లను తలుపులను ఐరెన్ రాడ్‌తో బద్దలు కొట్టడంలో అతడు దిట్ట. చైన్ స్నాచర్ నుంచి రూ.6 లక్షల రికవరీ: రావులపాలెం, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ల పరిధుల్లో రోడ్లపై నడిచి వెళుతున్న మహిళల మెడల్లో బంగారు నగలను పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతలం కొండేపాడుకు చెందిన చైన్ స్నాచర్ కవురు మూర్తి (24)ని అరెస్ట్ చేశారు. రావులపాలెం, ఆత్రేయపురం పోలీసులు ఇతడిని వేర్వురుగా అరెస్ట్‌లు చూపారు. అతడి నుంచి 49.800 గ్రాముల బంగారు నగలు, ఒక బైక్‌ను మొత్తం రూ. 6 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. కొత్తపేటలో మరొకరి అరెస్టు కొత్తపేట బ్యాంక్ కాలనీలో ఓ ఇంట్లో పట్టపగలు చోరీకి పాల్పడ్డ అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన గంటి గౌతమ్ అంతర్రాష్ట్ర దొంగ. అతడు కూడా ఇంటి తాళాలను పగలగొట్టడంతో ఆరితేరాడు. అతడి నుంచి 39 గ్రాముల బంగారంతో మొత్తం రూ4.5 లక్షల సొత్తును రికవరీ చేశారు. పోలీసులకు అభినందన, రివార్డులు ఈ చోరీ కేసుల్లో దొంగలను చాకచక్యంగా పట్టుకుని రూ.35 లక్షలకు పైగా సొత్తు రికవరీ చేసిన పోలీసు అధికారులను ఎస్పీ మీనా అభినందించారు. అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, అమలాపురం టౌన్, రావులపాలెం రూరల్, క్రైమ్ సీఐలు పి.వీరబాబు, విద్యాసాగర్, ఎం.గజేంద్రకుమార్, కొత్తపేట, ఆత్రేయపురం ఎస్సైలు సురేంద్ర, రాము, క్రైమ్ ఏఎస్ఐ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
లెక్క లెక్కకో కిక్కు!
రాయవరం: భవిష్యత్తుకు బాటలు వేసే గణితం మనిషి జీవితంలో ఓ అంతర్భాగం. లెక్కలు లేనిదే జీవితంలో ఏ వ్యవహారమూ గడవదు. రెండొకట్ల రెండు అనే ఎక్కాల ప్రారంభం నుంచే లెక్కలపై ఆసక్తి కలిగేలా బోధిస్తే ఏ విద్యార్థీ లెక్కలంటే భయపడరని గణిత మేధావులు సూచిస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీ తమిళనాడుకు చెందిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర ఫోరమ్‌లు కూడా ఆ శాస్త్రం అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం. సర్వ శాస్త్రానాం గణితం ప్రధానం సర్వశాస్త్రానాం గణితం ప్రధానం అన్నది అక్షర సత్యం. గణిత శాస్త్రానికి పుట్టిల్లుగా భారతదేశాన్ని పేర్కొంటారు. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు తదితర శాస్త్రవేత్తలు అనేక గణిత భావనలు ప్రవేశపెట్టారు. ‘సున్న’, ‘దశాంశమానం’, ‘రుణ సంఖ్యలు’ కనుగొన్నది భారతీయులే కావడం గమనార్హం. సమయం, డబ్బు, చేసే పని, వినోదం, విజ్ఞానం, చివరకు తినే ఆహారం ఇలా ఎన్నో ప్రక్రియలలో గణితం తన వంతు పాత్ర పోషిస్తుంది. గణితం వల్ల విద్యార్థుల్లో తార్కిక ఆలోచన పెరుగుతుంది. లెక్కలు బుర్ర పాడు చేసేవి అన్నట్టు కాకుండా పదును పెట్టేవి అనే ఆలోచనతో చదివితే జీవితంలో ఎంతో ముందుకు దూసుకుపోవచ్చని గణిత ఉపాధ్యాయులు చెప్తుంటారు. ఒక ఫార్ములా ప్రకారం మెదడు ఉపయోగించి సమాధానాలు రాస్తే గణితంలో అత్యధిక మార్కులు సాధించవచ్చని పలువురు నిరూపించారు. అందుకే గణితాన్ని క్వీన్ ఆఫ్ సైన్స్‌గా పరిగణిస్తున్నారు. గణితాభివృద్ధికి మ్యాథ్స్ ఫోరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల నైపుణ్యాలను గణితంలో మెరుగు పరచడానికి గణిత ఉపాధ్యయుల (స్కూల్ అసిస్టెంట్) సంకల్పంతో 2016 అక్టోబరు 2న రాష్ట్ర స్థాయి మ్యాథ్స్ ఫోరమ్ ప్రారంభించారు. అదే ఏడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మ్యాథ్స్ ఫోరం 1,200 మంది గణిత ఉపాధ్యాయులతో ప్రారంభించిన ఈ ఫోరం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గణిత ఉపాధ్యాయులను ఏకం చేసింది. ఈ ఫోరం సేకరించిన నిధులతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, మెటీరియల్ అందజేయడంతో పాటు విద్యార్థులకు క్విజ్, వీడియో కాంపిటీషన్స్, వక్తృత్వం, టీఎల్ఎం తయారీలో పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులకు పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్, టీఎల్ఎం, మహిళా గణిత టీచర్లకు గణిత రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15 నుంచి 22 వరకు గణిత వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. లెక్కలంటే లంకణాలు చేసినట్టు డీలా పడిపోతారు విద్యార్థులు. పదో తరగతి ఎప్పుడు దాటేస్తామా.. ఈ లెక్కల బాధలు ఎప్పుడు తప్పుతాయా అని ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో కొంతమంది లెక్కలతో జిమ్మిక్కులు చేసేస్తుంటారు. స్టెప్ బై స్టెప్ చక్కగా వేసేస్తూ నూటికి నూరు మార్కులు కొట్టేస్తుంటారు. అదెలా అని ఇంకొందరు నోరెళ్లబెడుతుంటారు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే లెక్కల చిక్కులు ఇట్టే తీసేయవచ్చని.. అసలు లెక్కలంత సులభమైన సబ్జెక్టు లేనేలేదని లెక్కల మాస్టర్లు చెప్తుంటారు. ఆ మాటకొస్తే లెక్కల చిక్కుముళ్లు తీసి సరిచేసినపుడడల్లా వచ్చే ఆ కిక్కే వేరని.. మరో లెక్కకూడా సరిచేసేయాలనే ఉత్సాహం మరింత రెట్టింపవుతుంటుందని లెక్కల వీరులు చెప్తుంటారు.కీమో థెరపీలోనూ హార్డీ–రామానుజన్ నంబర్ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిన్న వయసులోనే గణితంపై అనేక వ్యాసాలు సూత్రీకరించారు. ఆయన కనుగొన్న సంఖ్య 1729 ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. దీని ఆధారంగానే క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన చికిత్స కూడా సాధ్యమైనదని గణిత మేధావులు పేర్కొంటారు. కణాల పెరుగుదల ఎంత వేగంగా జరుగుతుంది, ఎలా చేస్తే ఆ విలువను తగ్గించవచ్చనే దానికి ఈ సంఖ్య ఆధారమైంది. ఇది కీమో థెరపీలోనూ కీలకమైంది. గణిత మేధావికి ఘన నివాళి 1729 ఆకృతిలో విద్యార్థులు రాయవరం: మండలం వి.సావరం ఎంపీయూపీ స్కూలులో రామానుజన్ పుట్టిన రోజును ఆదివారం ఘనంగా నిర్వహించారు. గణిత ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు, హెచ్ఎం లోవప్రసాద్, ఉపాధ్యాయులు పంపన వెంకటరమణ, రామలక్ష్మి రామానుజన్ గొప్పదనాన్ని కొనియాడారు. అనంతరం విద్యార్థులు ఇలా రామానుజన్ సంఖ్య 1729 ఆకృతిలో కూర్చుని ఘన నివాళులర్పించారు. ఏమిటీ ఈ సంఖ్య ప్రత్యేకం? రామానుజన్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో హార్డీ 1729 నంబరు గల కారులో రాగా తన కారు నంబరు అన్‌లక్కీ అని రామానుజన్తో చెబుతాడు. తీవ్ర అనారోగ్యంగా ఉన్న సమయంలో కూడా రామానుజన్ రెండు ఘనాల మొత్తంగా, రెండు రకాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య అని 1729 గొప్పదనాన్ని వివరించాడు. ఒకటి నుంచి 1728 వరకు ఏ సంఖ్యను రెండు ఘనాల మొత్తంగా రాయడానికి వీలులేదని రామానుజన్ మొట్టమొదటిగా ప్రపంచానికి తెలిపాడు. అందుకే ఈ సంఖ్య రామానుజన్ సంఖ్యగా ప్రఖ్యాతి పొందింది. 1729 రెండు ఘనాలుగా, రెండు క్యూబ్‌లుగా రాసిన అతి చిన్న కనిష్ఠ సంఖ్య. దీన్ని 10క్యూబ్+9క్యూబ్ = 12క్యూబ్+1క్యూబ్‌గా రాస్తారు. ట్రిక్కు తెలిస్తే ఎంత పెద్ద లెక్కకై నా ఇట్టే పరిష్కారం గాబరా అవసరం లేని సులువైన శాస్త్రం గణితం ఆసక్తి కలిగేలా చెప్పడంలోనే గురువు నేర్పరితనం ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం -
భారతం సమగ్ర వేదవాజ్మయం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) భారతం సమగ్ర వేదవాజ్ఞ్మయమని, విజ్ఞాన సర్వస్వమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాసభారత ప్రవచన యజ్ఞాన్ని స్థానిక హిందూ సమాజంలో ఆయన ఆదివారం కొనసాగించారు. భారతంలోని కథలు, ఉపదేశాలు, ఉపాఖ్యానాలు, పాత్రల మధ్య కానవచ్చే సంవాదాల్లో విస్తారమైన ధర్మబోధ ఉంటుందని చెప్పారు. ధర్మం లేనప్పుడు జ్ఞానం వికసించదన్నారు. ‘భారతంలో ముఖ్యంగా మూడు విచారధారలు కనపడతాయి. జీవవిచారం– నేను ఎవరు అనే ప్రశ్న. ధర్మవిచారం– ఏది ధర్మం అనే ప్రశ్న, బ్రహ్మవిచారం– బ్రహ్మం అంటే ఏమిటి? ఈ మూడు విభాగాలకు సంబంధించిన రహస్యాలకు భారతం పరిష్కారం చూపుతుంది’ అని అన్నారు. ‘బ్రాహ్మణుడంటే ఎవరు అని ధర్మరాజును నహుషుడు అడుగుతాడు. సత్యం, దానం, క్షమ, శీలం, క్రూరత్వం లేకపోవడం, తపస్సు, దయ ఇత్యాది లక్షణాలు కలవాడే బ్రాహ్మణుడని ధర్మరాజు సమాధానం చెబుతాడు’ అని వివరించారు. వేదాలు, పురాణాలతో పాటు భారతంలో అనేక సందర్భాల్లో సరస్వతీ నది ప్రస్తావన కనబడుతుందని, అనేక పరిశోధనలు ఈ ప్రాచీన నది ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. పాశ్చాత్యులు కుట్రలతో ఈ పరిశోధనలను అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దివ్యాస్త్రాలతో తిరిగి వచ్చిన అర్జునుడు తన సోదరులను, ద్రౌపదిని కలుసుకుంటాడు. దివ్యాస్త్రాలను ప్రదర్శన కోసం వినియోగించరాదని, అల్పులపై ప్రయోగించరాదని అతడికి నారదుడు హితోపదేశం చేస్తాడు. అలాగే, క్రోధం పాపహేతువని, దీనిని నియంత్రించుకోవాలని భీముడికి కుబేరుడు చెబుతాడు’ అని సామవేదం చెప్పారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, సౌగంధికా పుష్పాలను తీసుకురావడానికి వెళ్లిన భీముడి ద్వారా మనకు హనుమద్దర్శనం జరిగిందని, ఇక రామ దర్శనమే తరువాయని అన్నారు. -
‘భారత్ బాగుంటే ప్రపంచం బాగుంటుంది’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘కలి ప్రభావం వలన మనలో విద్వేషాలు పెరుగుతున్నాయి. నలదమయంతుల చరిత్రను వినడం వలన కలి ప్రభావం నశించి, విద్వేషాలు అంతరించిపోతాయి. భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారతంపై 24వ రోజు ప్రవచనాన్ని ఆయన శనివారం కొనసాగించారు. ‘నాకన్నా భాగ్యహీనుడెవరైనా ఉన్నారా అని ధర్మరాజు అడిగినప్పుడు బృహదశ్వుడు అనే మహర్షి నలదమయంతుల చరిత్రను వివరిస్తాడు. నిన్ను నీ తమ్ములు సేవిస్తూనే ఉన్నారు. భార్య చెంతనే ఉంది. అన్నపానాలకు లోటు లేకుండా సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర ఉంది. మహర్షులందరూ నీ చెంతకు వస్తూనే ఉన్నారు. ఇక నీ కష్టం ఏపాటిదని ధర్మరాజుతో మహర్షి సాంత్వన వచనాలు పలుకుతాడు. కష్టాలకు మనం కుంగిపోరాదు. ధర్మ మార్గం తప్పరాదు. ఇదే మనకు నలదమయంతుల చరిత్ర అందించే నీతి’ అని సామవేదం వివరించారు. కర్కోటకుడు అనే సర్పరాజు, దమయంతి, నలుడు, రాజర్షి అయిన ఋతుపర్ణుడు అనే వారిని కీర్తిస్తే, కలి దోషం మనల్ని బాధించదని అన్నారు. ‘దివ్య వృత్తాంతాలను తరచూ వినాలని, సాధనా పథంలో శ్రవణ భాగ్యాన్ని మించిన మార్గం లేదని చెప్పారు. ‘బృహదశ్వుడు అస్త్రవిద్యను ధర్మరాజుకు బోధించాడు. ఆ విద్యతో ధర్మరాజు.. శకునితో ద్యూతమాడి తన రాజ్యాన్ని తిరిగి పొందగలడు. కానీ ధర్మరాజు ఆ పని చేయలేదు. అలా చేస్తే యుద్ధం రాదు. రాకపోతే కృష్ణుని అవతార లక్ష్యం నెరవేరదు’ అని చెప్పారు. వనవాస సమయంలో సైతం పాండవులు నిత్యనైమిత్తికాలను విస్మరించలేదని, పితృ కార్యాలు మానలేదని సామవేదం అన్నారు. రేపు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని శ్రీ సత్యసాయి గురుకులంలో సోమవారం జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. గురుకులంలో కమిటీ సభ్యులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ముందుగా ఇచ్చిన ఏడు అంశాల నుంచి మండలంలో ప్రథమ స్థానం పొందిన ప్రదర్శనను మాత్రమే జిల్లా స్థాయికి తీసుకుని రావాలని సూచించారు. విద్యార్థి వ్యక్తిగత ప్రదర్శనలో మొదటి, ద్వితీయ స్థానం ఇద్దరినీ జిల్లా స్థాయికి పంపాలన్నారు. ఉపాధ్యాయ ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ స్థానం పొందిన వారు కూడా హాజరవ్వాలన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సత్యసాయి గురుకులంలో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించి, తమకు కేటాయించిన ప్రదేశంలో ఉంచి వెళ్లాలన్నారు. మండల స్థాయి విజేతలందరూ తప్పకుండా జిల్లా స్థాయి ప్రదర్శనకు హాజరు కావాలన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి గ్రూపు విభాగంలో 7, విద్యార్థి వ్యక్తిగత విభాగం నుంచి 2, ఉపాధ్యాయ వ్యక్తిగత విభాగం నుంచి 2 చొప్పున ప్రాజెక్టులను ఎంపిక చేస్తామని వాసుదేవరావు తెలిపారు.నేడు పల్స్‌పోలియో రాజమహేంద్రవరం రూరల్: జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో చుక్కల మందు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులు 1,89,550 మంది ఉన్నారు. వీరిలో 3,274 మందికి వారు నివసించే ప్రాంతం, అనారోగ్య పరిస్థితులను బట్టి పోలియో సోకే అవకాశాలున్నాయని గుర్తించారు. మొత్తం చిన్నారులకు వ్యాక్సిన్ వేసేందుకు 1,084 పల్స్ పోలియో కేంద్రాలు, 62 ట్రాన్సిట్ టీములు, 62 మొబైల్ టీములు ఏర్పాటు చేశారు. పారా మెడికల్ సిబ్బందితో పాటు అంగన్వాడీ, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సహకారంతో వంద శాతం పిల్లలకు చుక్కలు మందు వేయనున్నారు. గోదావరి లంకలు, ఇటుక బట్టీలు, ఊరికి దూరంగా కాలువ గట్లు, వలస కార్మికులు, సంచార జాతుల వంటి వారు ఉంటున్న 472 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు. వీరితో పాటు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో 62 మొబైల్ టీమ్‌ల ద్వారా ప్రతి చిన్నారికి పల్స్‌పోలియో వ్యాక్సిన్ వేస్తారు. దీనికోసం అన్ని శాఖలతో కలిపి 4,782 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాకు 2,31,250 డోసుల వ్యాక్సిన్ వచ్చింది. ఆదివారం పోలియో బూత్‌ల ద్వారా వ్యాక్సిన్ వేసిన చిన్నారుల గోళ్లపై సిబ్బంది సిరా గుర్తు పెడతారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరుగుతూ గుర్తించి, వ్యాక్సిన్ వేస్తారు. -
ఊరు మారింది
చాగల్లు: మండలంలోని ఊనగట్ల గ్రామం మూడు గ్రామాలకు వ్యాపార కేంద్రం. జనాభా 7,500. ఓటర్లు 5,300 మంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ గ్రామం అధ్వానంగా, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. శిథిలావస్థలో ఉన్న పంచాయతీ భవనం, జెడ్పీ స్కూల్లో తరగతి గదుల కొరత, ఆరోగ్య ఉపకేంద్రం లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైద్యానికి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊనగట్ల గ్రామం పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు చేరాయి. ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు సమకూర్చారు. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే చేర్చారు. నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి చేపట్టారు. ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించారు. 33 పథకాల ద్వారా ఏకంగా రూ.51.07 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ప్రతి ఏటా ఏదో ఒక పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. దీంతో, ప్రజల వద్ద పుష్కలంగా డబ్బులుండేవి. వేడినీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టు.. జనం కష్టపడి సంపాదించుకున్న దానికి ప్రభుత్వం అందించే సొమ్ము తోడయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
రూపురేఖలు మారబడి
దేవరపల్లి: దాదాపు 56 ఏళ్ల కిందట దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పాఠశాలను ఎన్నో ఏళ్లుగా పట్టించుకున్న వారే లేరు. ప్రహరీ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేది. పాడుబడిన తరగతి గదులు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఈ పాఠశాల రూపురేఖలు మారాయి. దీని అభివృద్ధికి 2022–23లో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.19 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో శిథిల భవనాల మరమ్మతులు, ప్రాంగణం లెవెలింగ్, ప్రహరీ నిర్మాణం, ప్రధాన ద్వారం ఏర్పాటు, విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల వంటివి ఏర్పాటు చేశారు. అంతకు ముందు పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒకే వాష్ రూమ్ ఉండేది. అటువంటిది నాడు–నేడు కార్యక్రమంలో బాలికలకు 7, బాలురకు 6 చొప్పున వాష్ రూములు టైల్స్‌తో నిర్మించి, రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించారు. అప్పటి వరకూ యూపీ స్కూల్‌గా ఉండగా.. దీనిని జెడ్పీ హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ పాఠశాలలో పదో తరగతి అడ్మిషన్లు జరగనున్నాయి. పాఠశాల బాగుంది నాడు–నేడు కార్యక్రమానికి ముందు పాఠశాల అధ్వానంగా ఉండేది. శిథిలమై, పెచ్చులూడిన భవనాలతో, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు పాఠశాల ఎంతో బాగుంది. ఆటలకు అనువుగా ఉంది. – మల్లుల ఈశ్వర్ సత్య, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం -
థ్యాంక్యూ జగనన్నా..
మాది నిరుపేద కుటుంబం. మా తల్లిదండ్రులు, చెల్లి, నాన్నమ్మ కలిసుంటాం. మా తండ్రి దివ్యాంగుడైనప్పటికీ నిత్యం సైకిల్‌పై అన్ని ఊళ్లూ తిరుగుతూ, ఆకుకూరలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. మా అమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబ భారాన్ని పంచుకునేది. ఐదేళ్ల క్రితం నాన్న వీర్రాజుకు పక్షవాతం రావడంతో మా కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చదువు మధ్యలోనే ఆపేస్తానేమో అనుకున్న సమయంలో 2019లో జగనన్న ప్రభుత్వం ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో చదువు సాగించగలిగాను. విద్యా దీవెన రూ.30 వేలు, వసతి దీవెన రూ.15 వేలు రావడంతో 2023లో బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశాను. అనంతరం, కొవ్వూరులో జరిగిన సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి సమావేశంలో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. జగనన్న నా కుటుంబ పరిస్థితి విని చలించిపోయి, ఇంటి స్థలం కేటాయించారు. డిగ్రీ పూర్తయిన తరువాత ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రాజమహేంద్రవరంలోని రాష్ట్ర జీఎస్టీ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. జనవరిలో చేరాను. నెలకు రూ.16,400 జీతం వస్తుంది. ఇంటి వద్దే ఉంటున్న మా నాన్నకు రూ.3 వేల పింఛన్ వచ్చేది. ప్రస్తుతం రూ.6 వేలు వస్తోంది. మా అమ్మ సంధ్యకు మాటలు రావు. ఆమెకు కూడా రూ.3 వేలు పింఛన్ వచ్చింది. నాన్నమ్మకు రూ.4 వేల వృద్ధాప్య పింఛన్ వస్తుంది. ఇప్పటి వరకూ మా కుటుంబానికి పింఛన్ రూపంలో రూ.4 లక్షల వరకూ లబ్ధి చేకూరింది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం విలువ రూ.4 లక్షల వరకూ ఉంటుంది. నాడు జగనన్న ప్రభుత్వం పెద్ద దిక్కుగా మారడంతో మా జీవితాలు పూర్తిగా మారాయి. మా ఆర్ధిక పరిస్థితి కుదుటబడింది. సాధారణ పేద కుటుంబమైన మాకు ఇంత పెద్ద మొత్తంలో లబ్ధి జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. థాంక్యూ జగనన్నా. – తిగిరిపల్లి దివ్య, పెద్దేవం, తాళ్లపూడి మండలం – తాళ్లపూడి -
కనిపించని సంక్షేమం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, పింఛన్లు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఒక్క సంక్షేమ పథకమూ సక్రమంగా అమలు చేయలేదు. అన్నదాత సుఖీభవను అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో అందించలేదు. గ్రామంలో కొత్త ఫించన్లు నేటికి మంజూరు చేయలేదు. పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు కూడా ఇంతవరకూ మంజూరు చేయలేదు. జగనన్న కాలనీల్లో అంతర్గత రహదారులు, డ్రైన్లు నిర్మించకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. – మెరిపో సూర్యచంద్రం, ఊనగట్ల, చాగల్లు మండలం -
నవరత్నాలు నిలబెట్టాయ్..
నిడదవోలు మండలం కంసాలిపాలేనికి చెందిన సూరవరపు నాగలక్ష్మిది పేద రైతు కుటుంబం. ఎర్రకాలువ ఉధృతమైతే పంట నీట మునిగేది. దీంతో, పంట చేతికి అందక, అప్పుల బాధ భరించలేక భర్త నాగేశ్వరరావు 2009లో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని పోషించుకోవడం నాగలక్ష్మికి కష్టంగా మారింది. ఇంటి వద్దే చిన్న కిరాణా షాపు పెట్టుకుని వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. గత ప్రభుత్వాలు చాలా కాలం వితంతు పింఛన్ కూడా మంజూరు చేయలేదు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆ కుటుంబ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. భర్త చనిపోయి కష్టాలు వెక్కిరించిన ఆ కుటుంబాన్ని నవరత్నాల పథకాలు నిలబెట్టాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో నాగలక్ష్మి కుటుంబానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఏకంగా రూ.3,92,500 మేర లబ్ధి చేకూరింది. 2021లో వచ్చిన ఎర్ర కాలువ వరదకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.34 వేలు, ఇన్పుట్ సబ్సిడీ రూ.12 వేలు, రైతు భరోసా ద్వారా ఐదేళ్లలో రూ.13,500 చొప్పున రూ.67,500 ఇచ్చారు. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.72,048 డ్వాక్రా రుణమాఫీ జరిగింది. నాగలక్ష్మి డ్వాక్రా రుణం తీసుకుని పెద్ద కుమార్తె పెళ్లి చేసింది. మరో కుమార్తె సత్య శ్రావణికి ఏటా అమ్మ ఒడితో పాటు ట్యాబ్ అందజేశారు. కొడుకు సాయికృష్ణ పీజీ చదవడంతో జగనన్న విద్యాదీవెన అందుకున్నారు. – నిడదవోలు రూరల్ -
ఐహెచ్ఆర్సీ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ థామస్
నియామక పత్రం అందచేసిన జాతీయ అధ్యక్షుడు సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్(ఐహెచ్ఆర్సీ) భారతదేశ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ అరుల్ థామస్ సెల్వనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజానందన్ విజ్ఞాన్ ఢిల్లీలో అందచేశారు. కొన్నేళ్లుగా మానవ హక్కులకు సంబంధించి డాక్టర్ థామస్ విశేషమైన సేవలను అందిస్తున్నారు. ఐహెచ్ఆర్సీ తరఫున ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవ హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇందుకు గాను ఇండియన్ చాప్టర్ (దేశ) ఉపాధ్యక్షుడిగా డాక్టర్ థామస్‌ను నియమించారు. ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందని డాక్టర్ థామస్ పేర్కొన్నారు. -
వైఎస్సార్ సీపీ హయాంలో గ్రామాభివృద్ధి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి కృషి చేశాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గ్రామానికి రూ.51.07 కోట్ల లబ్ధి చేకూర్చాం. రూ.1.30 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేశాం. ప్రస్తుతం పథకాలేవీ అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – మట్టా వెంకట్రావు, సర్పంచ్, ఊనగట్ల రూ.2.20 కోట్లతో పేదలకు ఇంటి స్థలాలు జగన్ ప్రభుత్వం హయంలో మా గ్రామంలో రూ.80 లక్షలతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ భవన నిర్మాణాలు చేపట్టాం. రూ.2.20 కోట్లు వెచ్చించి పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాం. 204 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికాం. రూ.1.03 కోట్లతో ఊనగట్ల – అమ్ముగుంట రోడ్డు పనులు నిర్వహించాం. రూ.50 లక్షలతో ఊనగట్ల – కలవలపల్లి రోడ్డు నిర్మాణం చేపట్టాం. – ఆత్కూరి గోపీచంద్, ఎంపీటీసీ, ఊనగట్ల -
వీసీని కులం పేరుతో దూషిస్తారా?
● 8వ తరగతి పాస్ కాని మీకు ఆ స్థాయి ఉందా? ● వర్సిటీలో రాజకీయ కార్యకలాపాలేంటి? ● ఎమ్మెల్యే బత్తుల దంపతులపై వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా ఫైర్ సాక్షి, రాజమహేంద్రవరం: ‘కనీసం ఎనిమిదో తరగతి కూడా పాస్ కాని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన భార్య అత్యున్నత విద్యావంతులైన నన్నయ వర్సిటీ వీసీ కులాన్ని కించపరుస్తూ మాట్లాడటం దారుణం. ప్రతిష్టాత్మకమైన వర్సిటీలో అనుచితంగా వ్యవహరించడం సమంజసం కాదు.’ అని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు పలికారు. రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ కార్తికేయ అపార్ట్మెంట్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీలో రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు, రంగులు ప్రదర్శించకూడదనే కనీస ఇంగిత జ్ఞానం ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోందని దుయ్యబట్టారు. అర్ధరాత్రి యూనివర్సిటీలోకి చొరబడి నాయకుల ఫ్లెక్సీలు, గ్లాస్, సైకిల్ గుర్తులు ఉన్న బ్యానర్లు కట్టడం ఏంటని ప్రశ్నించారు. అలా కట్టడం తప్పని చెప్పిన పాపానికి ఎమ్మెల్యే, ఆయన సతీమణి వర్సిటీ వీసీపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. వీసీని వివిధ రకాలుగా దూషించారన్నారు. ఎమ్మెల్యే సతీమణి చర్యలను అడ్డుకున్న వీసీ అటెండర్ చరణ్‌పై దారుణంగా దాడి చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుల సంకల్పంతోనే విశ్వవిద్యాలయం ఏర్పాటైందని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ పునాదిరాళ్లు, శిలాఫలకాల ఆనవాళ్లను కనిపించనీయకుండా అధికార పార్టీ వ్యక్తులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాము ఎలాంటి ఆందోళన చేయకుండా వినతి పత్రం ఇచ్చామన్నారు. ఏ హోదాలో ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి వర్సిటీకి వెళ్లి వీసీని ప్రశ్నించారో స్పష్టం చేయాలన్నారు. ఎమ్మెల్యే ప్రచార పిచ్చితోనే గొడవ జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో విద్యారంగం భ్రష్టు పట్టిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీసీలను భయపెట్టి, ఒత్తిడి చేయించి మరీ రాజీనామాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే అభివృద్ధి విశ్వవిద్యాలయంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగినదేనిని పేర్కొన్నారు. కూటమి పాలన వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇప్పటి వరకూ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. విద్యారంగాన్ని బలోపేతం చేయాలని మాత్రమే ఆలోచించామని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఘోరాలు దారుణాలు చూస్తున్నామని, నాయకుడు ఏ రకంగా ముందుకు వెళ్తాడో అదే మార్గాన్ని వారి అనుచరులు కూడా అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నన్నయ యూనివర్సిటీలో జరిగిన గొడవ చూస్తే అర్థమవుతుందని వెల్లడించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
మహానేతకు అపూర్వ గౌరవం
● డాక్టర్ వైఎస్సార్ స్మృతి మందిరం నిర్మించి మాట నిలబెట్టుకున్న మల్లాడి ● రేపు ప్రారంభోత్సవం ● తరలిరానున్న నాయకులు, అభిమానులు యానాం: ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నియోజకవర్గానికి చేసిన మేలుకు కృతజ్ఞతగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సొంత నిధులతో నిర్మించిన వైఎస్సార్ స్మృతి మందిరం నేడు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. పట్టణ పరిధిలో యర్రాగార్డెన్స్లో మల్లాడి నివాసం ఎదుటే రూ.లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసి రెండస్తుల్లో నిర్మించారు. ఆదివారం ఈ భవనాన్ని ప్రారంభించనున్న సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ నెల 21 నాటికి 36 ఏళ్లు అవుతోందని, దానిని పురస్కరించుకుని మహానేత రాజశేఖరరెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన పేరున నిర్మించిన ఈ మందిరాన్ని, గో నిలయాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ మందిరంలో మహిళలు, పురుషులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేలా నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహానేతతో తనకున్న అనుబంధంపై రాజన్న స్మృతిలో అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. వైఎస్సార్ దూరమై 16 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆయన స్మృతులు యానాం నిండా ఉన్నాయన్నారు. యానాంకు సాగు, తాగునీటి కొరత లేకుండా శాశ్వత పరిష్కారం, సాగునీటిని 19 నుంచి 30 క్యూసెక్కులకు పెంచడం, మంచినీటి నిల్వ కోసం ఏపీ రైతుల నుంచి సేకరించిన 52.5 ఎకరాల భూమిని యానాంకు కేటాయిండం, ధవళేశ్వరం వద్ద పంప్‌హౌస్ నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు, అక్కడి నుంచి యానాం వరకు 80 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్‌లైన్ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. యానం–ద్రాక్షారామ రోడ్డును బైపాస్ నాలుగు రోడ్లు జంక్షన్ వరకు యానాం ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. సీఎస్సార్ నిధులను సైతం ఆంధ్రాకు 70 శాతం, యానాంకు 30 శాతం కేటాయించారన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం, వైఎస్సార్ ఫ్రెంచి లింకింగ్ చానల్, వైఎస్సార్ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు, వైఎస్సార్ కాలనీ వంటివి ఉన్నాయన్నారు. పుదుచ్చేరి క్యాబినెట్లో తనకు మంత్రి పదవి ఇచ్చేలా అఽధిష్టానాన్ని ఒప్పించడంతో అప్పటిలో తొలిసారిగా తాను మంత్రిగా ప్రమాణం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. మందిరంలో వైఎస్సార్ విగ్రహం


