రైతుకు అరుదైన పురస్కారం
రాజవొమ్మంగి: మండలంలోని కిండ్రకాలనీకి చెందిన రైతు గంపా నాగరాజుకు అరుదైన పురస్కారం దక్కింది. ఈ రైతు గ్రాండ్ నైన్ అనే అరటి సాగులో మంచి ఫలితాలు సాధించడంతో ఈ అవార్డు అందుకున్నారు. పంత్‌నగర్ (ఉత్తరాఖండ్) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన అఖిల భారత పండ్ల సమన్వయ పథకం వార్షిక గ్రూప్ మీటింగ్‌లో నాగరాజుకు ఈ గౌరవం దక్కింది. ప్రాజెక్టు కోఆర్డినేటర్లు డాక్టర్ ఘోష్, ప్రకాష్ పాటిల్ తదితరులు నాగరాజును సత్కరించి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతు టిష్యూ కల్చర్ అరటి సాగులో సాంకేతిక సలహాలు ఇస్తూ, తనను ప్రోత్సహించిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన వన పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన్ని మండలంలోని రైతులు అభినందించారు.


