రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం తిరుమల క్యాంపస్‌లో తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు పదో తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్‌డ్, జేఈఈ మెయిన్ అండ్ నీట్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్, జేఈఈ మెయిన్ వంటి పరీక్షల ద్వారా ప్రసిద్ధ ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ లాంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలంటే ఏవిధంగా ప్రిపేర్ అవ్వాలి, తల్లిదండ్రుల తమ పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి, అలాగే వారికి ఉన్నత విలువలు ఎలా నేర్పాలో తెలియజేస్తారన్నారు. ఈ సదస్సుకు హాజరవ్వాలంటే ముందుగా తమ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఐఆర్‌యూఎంఏఎల్‌ఏఈడీయూ.సీవోఎం నందు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్టర్ చేసుకోని వారు అదే రోజు ఉదయం 9 గంటల లోపు క్యాంపస్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు.
బాలిక అదృశ్యంపై కేసు
నిడదవోలు రూరల్: పదో తరగతి పరీక్షకు వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. కోరుమామిడి గ్రామానికి చెందిన బాలిక (15) పదో తరగతి పరీక్ష రాసేందుకు గురువారం ఉదయం తాడిమళ్ల జెడ్పీ హైస్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదన్నారు. తల్లి స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బెల్లం ఊట ధ్వంసం
తాళ్లరేవు: కోరంగి మడ అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై గురువారం అటవీ సిబ్బంది, ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి 5 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్.రామచంద్రరావు, ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్ ఆదేశాల మేరకు ఫారెస్ట్, ఎకై ్సజ్ సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి 26 ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వరప్రసాద్ మాట్లాడుతూ మడ అడవులలో ఎవరైనా చట్ట విరుద్ధంగా సారా కాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తండ్రి మందలించాడని ఆత్మహత్య
కొత్తపల్లి: తండ్రి మందలించాడనే కోపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు మాయాపట్నానికి చెందిన మెరుగు సత్తిరాజు (55) తన తండ్రి మందలించాడనే కోపంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కుటుంబ సభ్యులు సత్తిరాజును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
కోళ్ల మేత మెషీన్‌పై పడి వ్యక్తి మృతి
నిడదవోలు రూరల్: కోళ్లఫారంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ, కోళ్ల మేత మెషీన్‌పై పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ నూతంగి సత్యానందం (33) ఎలక్ట్రికల్, ప్లంబింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. కాటకోటేశ్వరం గ్రామంలో కొత్తపల్లి వెంకటేశ్వరరావుకు చెందిన కోళ్లఫారంలో గురువారం మధ్యాహ్నం వాటర్‌షెడ్ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కోళ్ల మేత మెషీన్‌పై పడ్డాడు. ఈ నేపథ్యంలో సత్యానందం తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. భార్య కోట సత్తెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సత్యానందం మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


