అధ్వాన ఏటిగట్టుపై అవస్థలు | - | Sakshi
Sakshi News home page

అధ్వాన ఏటిగట్టుపై అవస్థలు

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

రామేశ్వరం నుంచి గుడిమూల శివాలయం వరకూ ఉన్న ఏటిగట్టు మార్గం పూర్తి అధ్వానంగా ఉంది. ఈ మార్గంలో అంతర్వేది క్షేత్రానికి వాహనాలపై వెళ్లే భక్తులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు

– డి.మార్టిన్‌, సఖినేటిపల్లి

ఈ మార్గం చాలా దగ్గర

సఖినేటిపల్లి బోను సెంటర్‌ నుంచి రామేశ్వరం మీదుగా ఏటిగట్టు వెంబడి అంతర్వేదికి ఉన్న మార్గం చాలా దగ్గర. అయితే మధ్యలో అధ్వానంగా మారిన 4 కిలోమీటర్ల రోడ్డును బాగు చేస్తే మంచింది. ఇప్పుడు చుట్టూ తిరిగి మరో 4 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది.

– కోన ప్రభాకర్‌రావు, గుడిమూల

ప్రతిపాదనలు పంపించాం

సఖినేటిపల్లి బోను సెంటర్‌ నుంచి అంతర్వేది వరకూ ఏటిగట్టు వెడల్పు, రెండు వరుసల రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాం. రామేశ్వరం సరిహద్దు నుంచి గుడిమూల శివాలయం వరకూ ఎన్‌ఆర్‌జీఎస్‌లో పెట్టాం. అలాగే బోను వద్ద నుంచి అంతర్వేది వరకూ ఏటిగట్టు వెడల్పునకు కూడా అవసరమైన చోట్ల పనులకు పుష్కర గ్రాంటులో పెడుతున్నాం. నిధులు మంజూరైన పనులు మొదలు పెడతాం.

–సురేష్‌, ఆర్‌అండ్‌బీ, జేఈ, రాజోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement