సమర్థంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

సమర్థంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు

Apr 3 2026 7:50 AM | Updated on Apr 3 2026 7:50 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బడ్జెట్‌ అవుట్‌ రీచ్‌ 2026–27 కార్యక్రమం సందర్భంగా జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2026 – 27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో జిల్లాకు రూ.3,832.08 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.2,163.30 కోట్ల కేటాయింపులు జరిగినట్లు తెలిపారు. కలెక్టర్‌ కీర్తి, జాయింట్‌ కలెక్టర్‌ వై. మేఘ స్వరూప్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాహుల్‌ మీనా, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement