breaking news
East Godavari District Latest News
-
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
● ఆంగ్ల భాషపై పట్టుకు స్పెల్‌బీ దోహదం ● ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్పెల్‌బీ సెమీ ఫైనల్స్ ● ఉత్సాహంగా పాల్గొన్న 490 మంది విద్యార్థులురాజమహేంద్రవరం రూరల్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ సెమీ ఫైనల్స్ పరీక్షలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాజమహేంద్రవరంలోని ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 490 మంది విద్యార్థులు నాలుగు కేటగిరీల్లో పరీక్షలు రాశారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్షలు ఎంతగానో దోహదపడతామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్పెల్‌బీ ద్వారా ఆంగ్ల భాషపై మంచి పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగింది. కేటగిరీలుగా విభజించి.. కేటగిరీ–1లో 1, 2 తరగతులకు చెందిన విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతులు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పరీక్షల్లో పాల్గొనడం ద్వారా నూతనోత్తేజం తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. స్పెల్‌బీ నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ (అడ్మిన్) ఎస్.రమేష్‌రెడ్డి, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కోఆర్డినేటర్ వి.రాజేష్, ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ లీజా పర్యవేక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పెల్‌బీకి డ్యూక్స్ వేఫీస్ మెయిన్ స్పాన్సరర్‌గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమహేంద్రవరం) అసోసియేట్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఆదిత్య ఇంటర్నేషనల్ స్కూల్ సహకారం అందించింది. ●భవిష్యత్‌కు బాటలు ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష రాయడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ భాషపై సంపూర్ణ అవగాహన ఏర్పడింది. పోటీ పరీక్షలు అంటే భయం పోయింది. స్పెల్లింగ్, వ్యాకరణంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇది నా భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. – వేగుంట నమస్వి, ఆరో తరగతి, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం ●ఎంతో ఉపయుక్తం ఇంగ్లిష్ భాషలో ఒకాబులరీ పట్ల అవగాహన ముఖ్యం. ఇది ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ద్వారా అవగతం చేసుకున్నాను. పరీక్ష ద్వారా తర్ఫీదు పొందాను. వర్డ్స్, స్పెల్లింగ్స్ పట్ల అవగాహన కలిగింది. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. – గారపాటి రుద్రనాగ్చౌదరి, 9వ తరగతి, లారల్ హైగ్లోబల్ స్కూల్, గాడాల ●ఎంతో ఉత్సాహం వచ్చింది విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ‘సాక్షి ’స్పెల్‌బీ పరీక్ష బాట వేస్తోంది. ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్, ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిని నేర్చుకోవడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. పరీక్ష బాగా రాశాను. దీనివల్ల ఎంతో ఉత్సాహం వచ్చింది. – కాసర ప్రతిభ, 8వ తరగతి, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం ●రాణించేందుకు మంచి అవకాశం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేలా ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ఉంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇదో మంచి మార్గం. ఈ పరీక్షతో అనేక అంశాలు తెలుసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటడానికి మార్గం సుగమమైంది. – పెన్మెత్స సాత్విక, 8వ తరగతి, ఆదిత్య స్కూల్, తాడేపల్లిగూడెం ●సులభంగా నేర్చుకునేందుకు.. ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష రాయడం ద్వారా ఇంగ్లిష్ భాష అంటే భయం పోయింది. పలకడం, రాయడం సులభతరం అయ్యింది. ఇక నుంచి సులభంగా ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ పరీక్ష రాయడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. – కఠారి చరిష్మా, 9వ తరగతి, కోనసీమ విద్యాశ్రమ్, ముక్తేశ్వరం ●థ్యాంక్యూ ‘సాక్షి’... నేను ముందుగా స్పెల్‌బీ నిర్వహిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్ చెబుతున్నా. నాలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ పరీక్ష దోహదపడింది. నేను స్పెల్‌బీ పరీక్ష రాశాను. సెమీ ఫైనల్లో మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. పరీక్ష నా భవిష్యత్తుకు పునాది లాంటిది. – దాట్ల దీక్షిత, 7వ తరగతి, ఆదిత్య నగర్, శ్రీనగర్, కాకినాడ ●అవగాహన పెరిగింది స్పెల్‌బీ పరీక్ష ద్వారా ఇంగ్లిష్‌పై అవగాహన పెరిగింది. గతంలో ఈ భాష అంటే భయంగా ఉండేది. చదవాలన్నా, రాయాలన్నా అయిష్టంగా ఉండేది. స్పెల్‌బీ ద్వారా ఇంగ్లిష్ పదాలను స్పెల్లింగ్‌తో సహా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏ సబ్జెక్టయినా సునాయసంగా చదవగలుగుతున్నా. – ఎన్ఎస్ఎస్ ఆరాధ్య, 8వ తరగతి, దిప్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమహేంద్రవరం ●భవిష్యత్తుకు నిర్దేశంగా.. విద్యార్ధుల భవిష్యత్తును నిర్దేశించడానికి ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ఉపయోపడుతుంది. ఇంగ్లిష్ భాషంటే భయం దూరం చేస్తోంది. పోటీతత్వం అలవాటు పడుతుంది. ఇంగ్లిష్‌లో ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిపై అవగాహన పెరుగుతుంది. ‘సాక్షి’ యాజమాన్యం ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాలి. – డాక్టర్ టీవీ ప్రసాద్, విద్యార్థిని తండ్రి, రాజమహేంద్రవరం ●ఆంగ్లంపై పట్టు సాధించవచ్చు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు స్పెల్‌బీ పరీక్ష దోహదపడుతుంది. సాక్షి స్పెల్‌బీ ద్వారా ఇంగ్లిష్‌లో ఒకాబులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. – డాక్టర్ దీప్తి చిగుళ్లపల్లి, విద్యార్థి తల్లి, రాజమహేంద్రవరం ●విద్యార్థులకు ప్రయోజనం ‘సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న స్పెల్‌బీ పరీక్ష విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ పరీక్షతో స్పెల్లింగ్‌లు, పదాలకు అర్థాలు చెప్పే సామర్థ్యం పెరుగుతుంది. ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గత పదేళ్లుగా ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్షల్లో పాల్గొంటున్నాయి. అలాగే తమ ఆదిత్య విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతోంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి దోహదపడుతుంది. – వి.రాజేష్, కోఆర్డినేటర్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, రాజమహేంద్రవరం -
ముగిసిన వాలీబాల్ పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సహకారంతో కాకినాడ జేఎన్టీయూలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్న్‌మెంట్ ఆదివారం రాత్రితో ముగిసింది. జేఎన్టీయూకే క్రీడా మైదానంతో పాటు రాజీవ్‌గాంఽధీ ఏంబీఏ కళాశాల, ఆదిత్య సూరంపాలెం కళాశాలలో పోటీలు నిర్వహించారు. ఫైనల్స్‌లో చెన్త్నె మద్రాస్ యూనివర్సిటీపై చైన్నె ఎస్ఆర్ఏం యూనివర్సిటీ గెలిచింది. రన్నర్‌గా మద్రాస్ యూనివర్సిటీ నిలవగా, కేరళ కాలికట్ యూనివర్సిటీ తృతీయ, భారతీయర్ యూనివర్సిటీ నాల్గో స్థానంలో నిలిచాయి. అంతర్జా తీయ వాలీబాల్ క్రీడాకారుడు ఎంసీహెచ్ఆర్ కృష్ణంరాజు, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్‌లు విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ శ్రీనివాసరా వు, స్టూడెంట్స్ ఎఫైర్ డైరెక్టర్ కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్యామ్ కుమార్, డాక్టర్ జీపీ రాజు పాల్గొన్నారు. -
వచ్చే నెల 12న బాడీ బిల్డింగ్ పోటీలు
అమలాపురం టౌన్: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా క్రీడాకారుడు, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్ తండ్రి) పేరుతో వచ్చే జనవరి 12న అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో ఉభయ గోదావరి జిల్లాల స్థాయి బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు వెల్లడించారు. అమలాపురంలోని వంటెద్దువారి వీధిలో ఈ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ పోటీల వివరాలను అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరవుతారని అన్నారు. మొత్తం 12 కేటగిరీల్లో పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. విజేతలకు నేషనల్ షీల్డ్‌లు, మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు, క్యాష్ అవార్డులు ప్రదానం చేయనున్నామన్నారు. పోస్టర్ల విడుదల కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నగభేరి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు మట్టపర్తి వెంకట సముద్రం, నార్ని శ్రీను, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో పులి
ఫ మెట్ట ప్రజలను వణికిస్తున్న వైనం ఫ అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు దేవరపల్లి: మెట్ట ప్రాంత ప్రజలను పులి వణికిస్తోంది. రెండు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భీమోలు గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం ఓ పులి, రెండు పిల్లలతో తిరుగుతున్నట్లు చూసినట్లు రైతు కె.రామకృష్ణ చెబుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీ అధికారులు రంగలోకి దిగారు. పులి సంచరిస్తున్నట్టు రైతు చెప్పిన ప్రాంతంలో రెండు రోజులుగా అధికారులు గాలిస్తున్నారు. అటవీ ప్రాంతంలో జంతువు పాదముద్రను గుర్తించారు. అయితే అది పులి పాద ముద్రా? లేక ఏదైనా జంతువుదా అనేది నిర్ధారించాల్సి ఉంది. ఆదివారం జిల్లా అటవీ అధికారి దావీద్‌రాజు నాయుడు, డిప్యూటీ రేంజ్ అధికారి జి.వేణుగోపాల్, సిబ్బంది అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఆరు ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు దావీద్‌రాజు నాయుడు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ పొలాలకు వెళ్లవద్దని సూచించారు. గతేడాది ఇదే పరిస్థితి.. గత ఏడాది కూడా గోపాలపురం నియోజకవర్గంలో ప్రజలకు దాదాపు రెండు నెలలు పులి కంటి మీద కునుకు లేకుండా చేసింది. 2024 ఫిబ్రవరిలో ద్వారకాతిరుమల మండలంలో కొద్ది రోజులు సంచరించిన పులి నల్లజర్ల, దేవరపల్లి మండలాల్లోని పొగాకు తోటల్లోనూ తిరిగింది. రెండు మండలాల్లో పులి తెల్లవారు జామున పొలాలకు వెళ్లిన రైతుల కంట పడడంతో భయంతో వణికిపోయారు. దాని ఆచూకీ కోసం అటవీ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. పొలాల్లో పాదముద్రలను సేకరించి పులి సంచరిస్తున్నట్టు నిర్ధారించారు. ఫిబ్రవరి 3న పులి దేవరపల్లి మండలం యాదవోలు నుంచి గోపాలపురం మండలం వాదాలకుంట, కోమటికుంట, కరిచర్లగూడెం గ్రామాల మీదుగా మాతగమ్మ మెట్టపైకి చేరుకుని సంచరించింది. అక్కడ నుంచి గోపాలపురం మండలం కరగపాడు గ్రామ శివారున గల రిజర్వ్ ఫారెస్ట్‌కు చేరుకుంది. ఫారెస్ట్‌కు సమీపంలో కరగపాడుకు ఆనుకుని ఉన్న రైతు జక్కు అచ్చయ్య మొక్కజొన్న తోటలో పెంచుకుంటున్న పందిపై పులి దాడి చేసింది. ఆ పులి ఆచూకీ కోసం రిజర్వ్ ఫారెస్ట్‌లో పలు ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మళ్లీ ఇప్పుడు పులి జాడలు కనిపించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: జాతీయ జాతీయ రహదారిపై ప్రతిపాడు వద్ద జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఎన్‌హెచ్‌పై నరేంద్రగిరి సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి, రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఆ దారిన వెళ్లే వ్యక్తులు 108కు ఫోన్ చేయడంతో క్షతగాత్రుడిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. ఎరుపు రంగు చొక్కా, సిమెంట్ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94407 96570, 94407 96530 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కోరారు. -
రెండు మోటారు సైకిళ్ల చోరీ
సామర్లకోట: రెండు మోటారు సైకిళ్ల చోరీపై ఆదివారం బాధితులు సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక పెద్దబజార్‌కు చెందిన శ్రీశైలపు బుజ్జి శనివారం స్టేషన్ సెంటర్లోని ఆటో స్టాండ్ వద్ద తన మోటార్ సైకిల్ నిలిపి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి కనిపించ లేదని ఫిర్యాదు చేశాడు. అదే విధంగా జి.మేడపాడు గ్రామానికి చెందిన మాదాసు వెంకటరమణ రైల్వే గేటు వద్ద నిలిపిన మోటార్ సైకిల్ చోరీకి గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శిలాఫలకం ధ్వంసం చేశారని ఫిర్యాదు ముమ్మిడివరం: గత ప్రభుత్వంలో రహదారి నిర్మాణ నిమిత్తం ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని స్థానిక జనసేన నాయకుడు ధ్వంసం చేశారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని గేదెల్లంక ఉత్తరవాహినికి వెళ్లే రహదారి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనివార్య కారణాలతో రోడ్డు నిర్మాణ పనులు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ రోడ్డు నిర్మాణానికి రూ.1.86 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ పనులు మొదలు పెట్టే ఉద్దేశంలో కనీసం గ్రామ సర్పంచ్‌కు గాని, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలికి గాని సమాచారం ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని జేసీబీతో స్థానిక జనసేన నాయకుడు గుద్దటి రమాకేశవ బాలకృష్ణ ధ్వంసం చేశారని అంటున్నారు. అదేవిధంగా పంచాయతీ తీర్మానం లేకుండా అడ్డు వచ్చిన కొబ్బరి చెట్లను తొలగించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ సానబోయిన పల్లయ్య, వైఎస్సార్ సీపీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జంపన శ్రీనివాసరాజు, కోలా వెంకటరత్నం (బాబ్జీ) తదితరులు ఆదివారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మాజీ ఎంపీ కృష్ణమూర్తికి అంతిమ వీడ్కోలు
అమలాపురం టౌన్/ అయినవిల్లి: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి అంతమ యాత్ర అమలాపురంలో ఆదివారం సాయంత్రం విషాద వాతావరణంలో జరిగింది. తొలుత కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి నేరుగా అయినవిల్లి మండలం విలస గ్రామం రావిగుంట చెరువులోని ఆయన స్వగృహానికి తీసుకు వచ్చారు. అక్కడ రాజకీయ ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎంపీ కృష్ణమూర్తి చిరస్మరణీయుడని అన్నారు. చిర్ల జగ్గిరెడ్డితో పాటు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు గన్నవరపు శ్రీనివాసరావు, పినిపే శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరీదేవి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ పాముల దేవీప్రకాష్, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, గిడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీలు చింతా అనురాధ, బుచ్చి మహేశ్వరరావు, మాజీ మంత్రి పరమట వీరరాఘవులు, ఎంపీపీ మార్గాని గంగాధర్‌లు కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫ అనంతరం అంతిమ యాత్రలో భాగంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కొద్దిసేపు ప్రజల సందర్శనార్థం ఆపారు. తర్వాత అమలాపురం నల్ల వంతెన సమీపం కలెక్టరేట్ రోడ్డులోని కృష్ణమూర్తి సొంత గొడౌన్ల వెనుక అంత్యక్రియలు జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణమూర్తి పార్థివ దేహంపై పార్టీ జెండాను వేసి నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ మంత్రి పరమట రాఘవులు, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, వైఎస్సార్ సీపీ నాయకులు డీఎంఆర్ రాజశేఖర్, వంటెద్దు వెంకన్నాయుడు, ఉండ్రు వెంకటేష్, సరెళ్ల రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు ముషిణి రామకృష్ణారావు, దేవరపల్లి రాజేంద్రబాబు, అయితాబత్తుల సుభాషిణి, యార్లగడ్డ రవీంద్ర, జిల్లా దళిత ఐక్య వేదిక నాయకులు డీబీ లోక్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్‌బాబు, పెనుమాల చిట్టాబాబు, నాతి శ్రీను, పెయ్యల శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. ఏ తల్లి కన్న బిడ్డో.. ఫ పెంట కుప్పపై ప్రత్యక్షం ఫ చేరదీసిన మానవత్వం కపిలేశ్వరపురం (మండపేట): ఏ తల్లి కన్న బిడ్డో.. కాన్పు కాగానే పెంట కుప్ప పాలయ్యాడు. జనమంతా చలికి వెచ్చని దుప్పటి మాటున నిద్రలో ఉన్న సమయమది. మంచు కురిసే వేళ ఎముకలు కొరికే చలిలో ఆరుబయట పశువుల పాక పక్కన పెంట కుప్పపై ఓ బిడ్డ కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది. కుక్కలు చుట్టుముట్టినా మృత్యుంజయుడిలా ఊపిరిపోసుకున్న ఆ ఆబిడ్డను మానవత్వం అక్కున చేర్చుకుంది. మండపేట పట్టణంలోని సత్యశ్రీ రోడ్డు కోళ్లఫారం ఎదురుగా గేదెల పాక వద్ద మగ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదలివెళ్లారు. ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్తున్న రైతు ఏడుపును విని ఆ బిడ్డను చూశాడు. చెంతనే ఉన్న కుక్కలను బెదరగొట్టి పిల్లాడిని చేరదీసి పట్టణంలోని సీహెచ్‌సీలో చేర్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో శిశువును పరీక్షించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు నిర్ధారించారు. పట్టణ ఎస్సై ఎన్.రాము ఆదేశాలపై హెచ్‌సీ కాంతారావు ఆసుపత్రిని సందర్శించారు. ఐసీడీఎస్ సీడీపీఓ యు.పూర్ణిమ ఆదేశాలపై సెక్టార్ సూపర్వైజర్ సీహెచ్ నాగశ్రీదేవి, అంగన్వాడీ సీహెచ్ రాణి ఆసుపత్రికి వెళ్లారు. అమలాపురంలోని శిశుగృహ నిర్వాహకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శిశువు సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. మరో బాలికపై అత్యాచారం ముమ్మిడివరం: వరుసగా బాలికలపై అత్యాచారాలు జరుగుతుండడంతో కోనసీమ జిల్లాలో కలకలం రేపుతుంది. నెల రోజుల క్రితం ఐ.పోలవరం మండలం బాణాపురంలో జనసేన నాయకుడు ఓ బాలికపై అత్యాచారం చేయగా, వారం క్రితం ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో పదో తరగతి బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల కిందట ఉప్పలగుప్తం మండలంలో ఓ తండ్రే కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. ఇది మరువక ముందే ముమ్మిడివరంలో ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదు కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ముమ్మిడివరం ఓ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు చిన అగ్రహారానికి చెందిన కాలాడి సతీష్ రెండేళ్లుగా ఆ బాలికను ప్రేమ పేరుతో మోసగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఐ ఎం.మోహన్‌కుమార్ పర్యవేక్షణలో ఎస్సై డి.జ్వాలాసాగర్లు సతీష్‌పై అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. -
నేడు కోటి సంతకాల ర్యాలీ
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ప్రజలు చేసిన కోటి సంతకాల ప్రతులను సోమవారం ఉదయం 10 గంటలకు బొమ్మూరులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కేంద్ర కార్యాలయానికి పంపించనున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదివారం ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీపై ప్రజల్లో చర్చ జరగాలని, జిల్లా మొత్తం హోరెత్తేలా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం దేశంలోని ప్రజలందరి దృష్టికీ వెళ్లాలన్నారు. కోటి సంతకాల ప్రతులున్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తామని, బొమ్మూరు నుంచి కొవ్వూరు వరకూ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో జరిగిందన్నారు. గ్రామాలు, డివిజన్లు, వార్డుల్లో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజలు మద్దతు కూడగట్టామని చెప్పారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. లక్ష్యానికి మించి సంతకాలు సేకరించామన్నారు. జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల సంతకాలు సేకరించామని తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు కళ్లు తెరచి, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే ఆలోచన విరమించుకోవాలని వేణు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ మంత్రి తానేటి వనిత, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస్‌నాయుడు హాజరవుతారని వివరించారు. పార్టీ, వివిధ అనుబంధ విభాగాల నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వేణు కోరారు. బొమ్మూరు నుంచి కొవ్వూరు వరకూ నిర్వహణ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతుల తరలింపు శ్రేణులు రాజమహేంద్రవరానికి భారీగా తరలి రావాలి దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు -
ఉండాల్సిన వారు 27.. ఉన్నది 9 మంది
పెరవలి మండలంలోని కాకరపర్రు కెనాల్‌పై ఉన్న పెరవలి లాకు పరిధిలో 37,357 ఎకరాల సాగు భూమి ఉంది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని నిడదవోలు, ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఏడు మండలాల్లోని 51 గ్రామాలకు దీని ద్వారా సాగు, తాగునీరు అందుతోంది. పెరవలి లాకు పరిధిలో మొత్తం 27 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం ఒక ఏఈ, ఒక గుమస్తా(పర్మినెంట్ ఉద్యోగులు)తో పాటు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 9 మంది లస్కర్లు మాత్రమే ఉన్నారు. ఈ లాకుల పరిధిలోని ఉండ్రాజవరం, రామయ్యగుంట, అజ్జరం, భూపయ్య కాలువ, ఈస్ట్ విప్పర్రు, ఖండవల్లి, పేకేరు కాలువలపై ఏడుగురు డెల్టా లస్కర్లు ఉండాల్సి రాగా మొత్తం ఏడు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. అలాగే, కెనాల్ లస్కర్లు ఐదుగురు ఉండాలి. ఈ పోస్టులు కూడా మొత్తం ఖాళీ. వైరు లస్కర్లు ఇద్దరికి గాను ఒక్కరు మాత్రమే ఉన్నారు. వైర్ సూపరింటెండెంట్, లాకు లస్కర్లు 4, లాకు సూపరింటెండెంట్, గుమస్తాలు 2, వర్క్ ఇన్స్పెక్టర్లు 2, వాచ్‌మన్ 1, ఎవెన్యూ లస్కర్ 1 చొప్పున పోస్టులుండగా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వీరందరి విధులను కేవలం 9 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోనే కానిచ్చేస్తున్నారు. -
పుడమి తల్లికి పచ్చబొట్లు
● రబీ వరి నాట్లకు శ్రీకారం ● బోర్ల కింద ప్రారంభించిన రైతులు ● సాగు విస్తీర్ణం 61,326 హెక్టార్లు ● ఇప్పటి వరకూ 895 హెక్టార్లలో నాట్లు దేవరపల్లి: ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు పూర్తి కాకుండానే రైతులు రబీ వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలోని పలు గ్రామాల్లో.. ముందుగా ఖరీఫ్ కోతలు పూర్తయిన పొలాల్లో.. బోర్లు, కాలువల కింద వారం రోజులుగా వరి ఆకుమడులు ముమ్మరంగా వేస్తున్నారు. రాజానగరం, దేవరపల్లి, నల్లజర్ల, కొవ్వూరు, తాళ్లపూడి చాగల్లు, మండలాల్లో వరి నాట్లు సైతం ప్రారంభించారు. ఈ నెలాఖరుకు నాట్లు ఊపందుకోనున్నాయి. ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో ఖరీఫ్ దిగుబడులు ఆశాజనకంగా లేక పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. సార్వాలో ఎకరాకు 32 నుంచి 38 బస్తాల ధాన్యం దిగుబడి రావలసి ఉండగా, 25 నుంచి 28 బస్తాలు మాత్రమే వచ్చాయి. దీంతో, పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో దాళ్వా పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా వాతావరణం అనుకూలిస్తే దాళ్వాలో ఎకరాకు 55 నుంచి 60 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తుంది. ఈసారి కూడా అలాగే జరిగి, దండిగా దిగుబడులు వచ్చి, నాలుగు డబ్బులు మిగలాలని ఆశ పడుతున్నారు. అధిక దిగుబడులిచ్చే వంగడాలపై మొగ్గు దాళ్వాలో అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే వంగడాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 120 రోజుల పంట కాల పరిమితి వండగాలయిన ఎంటీయూ–1121, ఆర్ఎన్ఆర్–15048, ఎంటీయూ–1156, ఎంటీయూ–1153 రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొంత మంది రైతులు డీసీఎంఎస్, సొసైటీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తూండగా.. ఎక్కువ మంది రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలనే సాగు చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో నారు పోసుకుని, 25వ తేదీలోగా నాట్లు వేస్తే మార్చి నెలాఖరుకు 60 శాతం పంట కోతకు వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తద్వారా మూడో పంట వేసుకునే అవకాశం కూడా ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో రైతులే విత్తనాలు తయారు చేసి, అవసరమైన ఇతర రైతులకు సరఫరా చేస్తున్నారు. నెలాఖరుకు సాగు జోరు ఇప్పటికే ఆకుమడులను రైతులు సిద్ధం చేస్తున్నారు. పొలాలు దమ్ములు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు నాట్లు ఊపందు కుంటాయి. రైతులకు అవసరమైన యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచాం. యూరి యా కొరత ఎక్కడా లేదు. రాజమహేంద్రవరం డివిజన్లో 1,555 మెట్రిక్ టన్నులు, కొవ్వూరు డి విజన్‌లో 3,439 మెట్రిక్ టన్నుల యూరియా సొసైటీ లు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. – ఎస్.మాధవరావు,జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం రబీలో వివిధ పంటల సాగు ప్రణాళిక (హెక్టార్లు) వరి 61,326 మొక్కజొన్న 8,646 పెసర 434 మినుము 771 శనగ 806 వేరుశనగ 241 నువ్వులు 224 పొద్దుతిరుగుడు 187 పొగాకు 5,544 చెరకు 402 జిల్లావ్యాప్తంగా అన్ని పంటలూ కలిపి రబీ సాధారణ సాగు విస్తీర్ణం 78,592 హెక్టార్లు. ఇప్పటి వరకూ 7,302 హెక్టార్లలో ఆయా పంటలు వేశారు. వరి 895, మొక్కజొన్న 2,800, పొగాకు 3,333 హెక్టార్లు, శనగ 254 హెక్టార్లలో వేశారు. -
‘దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వలేదు’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) మయసభలో దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్విందనే మాట పచ్చి అబద్ధమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ చెప్పారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆదివారం ఆయన కొనసాగించారు. ఈ సందర్భంగా శిశుపాల వధ, రాజసూయ యాగ నిర్వహణ, దుర్యోధనుని భంగపాటు తదితర అంశాలను వివరించారు. ‘త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ.. రాజసూయం తరువాత 13 సంవత్సరాల్లో నీ కారణంగా, దుర్యోధనుని అపరాధం చేత, భీమార్జునుల బలము చేత గొప్ప క్షత్రియ వినాశనం జరుగుతుందని ధర్మరాజుకు వ్యాసుడు చెబుతాడు. ఈ మాటలకు ధర్మరాజు తీవ్రంగా కలత చెందాడు. అప్రమత్తుడవై, ఇంద్రియాలపై పట్టు కలిగి ఉండాలని వ్యాసుడు ఆదేశిస్తాడు’ అని చెప్పారు. జ్ఞానం సంఘటనలను మార్చుకోవడానికి కాదని, ప్రతికూల సంఘటనలను సైతం తట్టుకోవడానికేనని అన్నారు. ‘‘వ్యాసుని మాటలు విన్న ధర్మరాజు ‘ఇకపై నేను పరుష వాక్యాలు పలకను, జ్ఞాతులు చెప్పినట్లు ప్రవర్తిస్తాను. ఎవరి పట్లా భేద భావం కలిగి ఉండను. ఇది నా ప్రతిజ్ఞ’ అని తమ్ములకు వివరిస్తాడు. కృష్ణుడు అప్పటికే ద్వారకకు వెళ్లిపోయాడు. రాజలోకం తిరిగి వెళ్లింది. శకుని, దుర్యోధనుడు మాత్రం మరో రెండు రోజులు మయసభలో ఉండాలనుకున్నారు. దుర్యోధనుని భంగపాటు చూసి ద్రౌపది నవ్వినట్లు వ్యాసుడు చెప్పలేదు. భీమసేనుడు, అతని సేవకులు మాత్రమే నవ్వినట్లు వ్యాస భారతం చెబుతోంది’’ అని సామవేదం స్పష్టం చేశారు. ‘‘పాండుసుతుల వైభవాన్ని చూసి అసూయా రోగానికి గురైన దుర్యోధనుడితో శకుని.. ధర్మరాజును ద్యూత క్రీడకు ఆహ్వానించాలని చెబుతాడు. దీంతో, దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి ‘నేను నిప్పులలో దూకుతాను, విషం మింగుతాను’ అని బెదిరిస్తాడు. ద్రౌపది, కృష్ణుడు తనను చూసి నవ్వారని ధృతరాష్ట్రుడికి అబద్ధం చెబుతాడు. ఈ అబద్ధాన్ని పట్టుకొని కొందరు ద్రౌపది నవ్విందంటూ తప్పుడు ప్రచారం చేశారు’’ అని వివరించారు. ‘‘రాజసూయ యాగంలో మరుగుజ్జులు, భిక్షకులు కూడా భోజనం చేశారో లేదో కనుక్కున్న తరువాతనే ద్రౌపది భోజనం చేసేది. ఆమె గృహిణీ ధర్మాన్ని పాటించిన తీరును వ్యాసుడు అనేక సందర్భాల్లో వర్ణించాడు’’ అని చెప్పారు. శిశుపాల వధ వత్తాంతాన్ని వివరిస్తూ, కృష్ణుడు తన దివ్యత్వాన్ని, నారాయణ తత్త్వాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తం చేశాడని, దీనికి విరుద్ధంగా రామావతారంలో రాముడు తన అవతారతత్త్వాన్ని గోప్యంగా ఉంచాడని సామవేదం అన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభకు శుభారంభం పలికారు. -
లక్ష్మీ గణపతి స్వామి సన్నిధిలో న్యాయమూర్తులు
బిక్కవోలు: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత బిక్కవోలులో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని ఆదివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈఓ ఆధ్వర్యాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేడు పీజీఆర్ఎస్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జిల్లా కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. విజయవాడ భవానీ దీక్షల విరమణకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శించుకున్నారు. వారు వచ్చిన టూరిస్టు బస్సులతో దేవస్థానం కళాశాల మైదానం నిండిపోయింది. ఆ భక్తులందరూ నడక దారిన సత్యదేవుని ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా తోడవడంతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రత్నగిరిపై పార్కింగ్ స్థలం కూడా భక్తుల వాహనాలతో నిండిపోయింది. స్వామివారి వ్రత, విశ్రాంతి మండపాలు, క్యూలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు. నేడు సత్యదేవుని మెట్లోత్సవం సత్యదేవుని మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రత్నగిరి దిగువన తొలి పావంచా నుంచి కొండ మీద సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న 450 మెట్లకు భక్తులతో పూజలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు. తొలుత రత్నగిరి పైనుంచి దిగువకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి, గ్రామంలో పల్లకీపై ఊరేగించి, తొలి పావంచా వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం, తొలి మెట్టుకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు పూజలు చేసి, మెట్లోత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొండపై సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న మెట్లకు భక్తులు పసుపు, కుంకుమ రాసి, హారతి ఇచ్చి, నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ మెట్ల మీదుగా స్వామి, అమ్మవార్లను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. -
లస్కర్లను చూసి పుష్కరం
● ఏళ్ల తరబడి భర్తీ కాని పోస్టులు ● జిల్లావ్యాప్తంగా ఉండాల్సిన లస్కర్లు 1,500 మంది ● ఉన్నవారు 600 మంది ● వీరిలో అవుట్ సోర్సింగ్ 550 మంది ● ఏడాదిగా అందని జీతాలు ● సిబ్బంది కొరతతో లాకులు, కాలువలపై పర్యవేక్షణ లోపంపెరవలి: ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా ఖ్యాతికెక్కిన గోదావరి డెల్టాలో కీలకమైన లస్కర్ల వ్యవస్థ తగినంత మంది సిబ్బంది లేక నానాటికీ నీరసించిపోతోంది. ఏయే కాలువల కింద ఏయే పంటలు సాగవుతున్నాయి.. నీటి అవసరం ఎంత.. లాకుల పరిస్థితి ఏమిటి.. నీటి సరఫరా క్రమబద్ధీకరణ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యత లస్కర్లది. అటువంటి లస్కర్ల నియామకాలు ఏళ్ల తరబడి జరగకపోవడంతో కాలువలు, లాకుల స్థితిగతులను పట్టించుకుంటున్న వారే కరువవుతున్నారు. పూర్తి స్థాయిలో లస్కర్లు ఏరీ! జిల్లాలో అన్ని పంటలూ కలిపి మొత్తం సాగు భూమి 3,53,692 ఎకరాలు. ఇందులో 11 మండలాల్లో కాలువల కింద 1,63,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువలపై ఉన్న లాకుల వద్ద సాగునీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించే లస్కర్ల నియామకాలు 12 సంవత్సరాలుగా జరగడం లేదు. జిల్లావ్యాప్తంగా గోదావరి డెల్టా కాలువలపై 22 ప్రధాన లాకులున్నాయి. వీటిపై ఒక్కోచోట 30 మంది చొప్పున మొత్తం 660 మంది లస్కర్లు ఉండాలి. అలాగే, మరో చిన్న లాకులు 172 ఉన్నాయి. ఒక్కో లాకు నుంచి సుమారు 30 వేల నుంచి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. ఇరిగేషన్ వ్యవస్థలో ప్రధాన కాలువ, డెల్టా, ఎవెన్యూ అనే మూడు కేటగిరీలుగా లస్కర్లు ఉంటారు. ప్రధాన కాలువ లస్కర్లు డెల్టాలోని ప్రధాన కాలువలను పర్యవేక్షిస్తూంటారు. ఈ ప్రధాన కాలువలకు అనుసంధానమైన చిన్న కాలువలపై డెల్టా లస్కర్లు విధులు నిర్వహిస్తారు. ఎవెన్యూ లస్కర్లు కాలువ గట్లు, లాకుల వద్ద పిచ్చి మొక్కలు పెరగకుండా.. గట్లు దెబ్బ తినకుండా పర్యవేక్షిస్తారు. ఈ మూడు రకాలూ కలిపి మొత్తం 1,500 మంది లస్కర్లు ఉండాలి. కానీ, అన్ని రకాలూ కలిపి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 600 మంది మాత్రమే పని చేస్తున్నారు. వీరిలో 50 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు కాగా, మిగిలిన 550 మందీ అవుట్ సోర్సింగ్ విధానంలోనే పని చేస్తున్నారు. ప్రస్తుతం 900 మంది లస్కర్లకు కొరత ఉంది. మరోవైపు ఏఈల కొరత కూడా ఇరిగేషన్ వ్యవస్థను వేధిస్తోంది. రెండు మూడు లాకుల బాధ్యతను ఒక్కరే చూడాల్సి వస్తోంది. సిబ్బంది కొరత కారణంగా కాలువలు, లాకులపై పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరగడం లేదు. ముఖ్యంగా లస్కర్లు లేకపోవటంతో ఏలూరు, బ్యాంక్ కెనాల్, కాకరపర్రు, నరసాపురం, అమలాపురం, కాకినాడ, జొన్నాడ తదితర కాలువల నుంచి నీటి ప్రవాహం సక్రమంగా జరగక రైతులు కిబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఆక్రమణలతో పెద్ద కాలువలు పంట కాలువల్లా.. పంట కాలువలు పంట బోదెల్లా మారిపోతున్నాయి. గట్లు కుచించుకుపోతున్నాయి. ఒక్కో లాకు వద్ద 20 నుంచి 30 మంది వరకూ లస్కర్లు పని చేయాల్సి ఉండగా చాలాచోట్ల కనీసం 10 మంది కూడా లేని దుస్థితి నెలకొంది. ఇచ్చేదే తక్కువ.. ఏడాదిగా అదీ లేదు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న లస్కర్లకు నెలకు రూ.5,500 మాత్రమే చెల్లిస్తారు. అది కూడా ఏడాది నుంచి జీతాలు చెల్లించకపోవడంతో వారు నానా ఇబ్బందులూ పడుతున్నారు. వేతనాలు వెంటనే చెల్లించాలి డెల్టాలోని రబీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆయకట్టు చివరి వరకూ నీరు చేరాలంటే లస్కర్ల వ్యవస్థ కీలకం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వ్యవస్థలోని లస్కర్లకు వేతనాలు పెండింగ్‌లో ఉంచటం సరి కాదు. వారికి వెంటనే వేతనాలు విడుదల చేసి, లస్కర్ల పర్యవేక్షణలో రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి. – విప్పరి్త్ వేణుగోపాలరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్ఈ, ధవళేశ్వరం -
అంగరంగు వైభవం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసోత్సవం ప్రారంభానికి ముందు రోజు స్వామివారి మెట్లోత్సవం నిర్వహించడం, ఆ తర్వాత రోజు నుంచి కనుమ పండగ వరకూ సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవారిని గ్రామంలో ఊరేగించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన (సోమవారం) సత్యదేవుని మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ రోజు రత్నగిరి కొండ దిగువన గల తొలి పావంచా నుంచి కొండ మీద సత్యదేవుని ఆలయం వరకూ గల 450 మెట్లకు భక్తులు పూజలు నిర్వహించనున్నారు. దీని కోసం రత్నగిరి మెట్ల మార్గంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి మెట్టుకూ రంగు వేసి ముస్తాబు చేస్తున్నారు. పల్లకీలో ఊరేగింపు సోమవారం ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుగా రత్నగిరి నుంచి కొండ దిగువకు సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువస్తారు. గ్రామంలో వందల మంది భక్తుల నడుమ పల్లకీలో ఊరేగిస్తారు. అనంతరం తొలి పావంచా వద్ద స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే ఉన్న తొలి మెట్టుకు దేవస్థానం అధికారులు, మహిళలు పూజలు చేసి మెట్లోత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి స్వామివారి ఆలయం వరకు గల మెట్లకు భక్తులు పూజలు చేసి హారతి ఇస్తారు. ఆ మెట్ల మీదుగా స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళతారు. 16 నుంచి ధనుర్మాసోత్సవాలు ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ కనుమ పండగ వరకూ ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతి అమ్మవారిని ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి పది గంటల వరకూ అన్నవరం పుర వీధుల్లో పల్లకీలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఆలయానికి చేరుస్తారు. నెల రోజులు జరిగే ధనుర్మాసోత్సవాలకు స్వామివారి పల్లకీ కూడా ఉండేందుకు దేవస్థానం వేద పండితులు, వ్రత పురోహితులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశారు. 30న ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 30వ తేదీ తెల్లవారుజాము ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో ఉండే సత్యదేవుడు, అమ్మవారిని దర్శించేందుకు భక్తులను అనుమతిస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు వెండి రథంపై ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారి ప్రాకార సేవ, అదే రోజు రాత్రి కొండ దిగువన వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. జనవరి 14న భోగి ఉత్సవాలు భోగి పండగ సందర్భంగా జనవరి 14న రత్నగిరి రామాలయం వద్ద భోగి మంట వేస్తారు. పల్లెటూరి వాతావరణం ప్రతిబించించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న కనుమ పండగ సందర్భంగా కొండ దిగువన పురగిరి క్షత్రియుల రామకోవెల వద్ద సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రభోత్సవం నిర్వహిస్తారు. కాగా.. సత్యదేవుని మెట్లోత్సవం, ధనుర్మాసంలో ఊరేగింపు కోసం స్వామివారి వెండి పల్లకీని ముస్తాబు చేస్తున్నారు. వెండి శంఖ, చక్రాలకు కూడా మెరుగు పెట్టి సిద్ధం చేస్తున్నారు. రేపు సత్యదేవుని మెట్లోత్సవం మెట్లకు రంగులు వేసి ముస్తాబు చేసిన దేవస్థానం సిబ్బంది 16 నుంచి ధనుర్మాసోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
పాఠం వింటూ.. ప్రాణం వదిలింది
● తరగతి గదిలో విద్యార్థిని హఠాన్మరణం● కార్డియాక్ అరెస్టుగా భావిస్తున్న వైద్యులు ● రామచంద్రపురంలో ఘటన రాయవరం: తరగతిలో గదిలో పాఠాలు వింటున్న విద్యార్థిని హఠాత్తుగా బెంచీపై నుంచి పడిపోయి మృతి చెందింది. హుషారుగా వెళ్లిన బాలిక.. విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివ రాల్లోకి వెళితే.. పసలపూడి గ్రామానికి నల్లమిల్లి వెంకటరెడ్డి, సుజాత దంపతుల కుమార్తె సిరి (16) రామచంద్రపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఆమె తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు యథావిధిగా వెళ్లిన సిరి మొదటి పిరియడ్ జరుగుతుండగా ఒక్కసారిగా కుడివైపునకు పడిపోయింది. వెంటనే ఉపాధ్యాయుడు, సహ విద్యార్థులు ఆ బాలికకు సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. కార్డియాక్ అరెస్టుతోనే సిరి మృతి చెందిందని వారు భావిస్తున్నారు. -
వేగా జ్యుయలర్స్‌లో అద్భుత ఆఫర్లు
రాజమహేంద్రవరం సిటీ: పండగల సందర్భంగా వేగా జ్యుయలర్స్‌లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు నిర్వాహకులు శనివారం తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని వినియోగదారులకు డిసెంబర్ 15 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయన్నారు. వీటి బ్రౌచర్లను మిరాయ్ సినిమా ఫేమ్ రితిక నాయక్ ఆవిష్కరించారన్నారు. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండగలను వినియోగదారులు మరింత ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సువర్ణవకాశం కల్పించామని తెలిపారు. ఫ్యాషన్ ఆభరణాల నుంచి ప్రాచీన సంప్రదాయ ఆభరణాల వరకూ తమ షోరూమ్‌లలో అందుబాటులో ఉంచామన్నారు. బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం తగ్గింపు ఇస్తున్నామని, పోల్కి ఆభరణాలపై తయారీ, తరుగు చార్జీలు ఉండవన్నారు. వజ్రాభరణాల క్యారట్ ధర కేవలం రూ.49,999 మాత్రమే ఉంటుందన్నారు. -
హుండీ సొమ్ము చోరీచేసిన ఇద్దరి అరెస్ట్
దేవరపల్లి: సంగాయగూడెం గంగానమ్మ ఆలయంలో హుండీ సొమ్ములను దొంగిలించిన ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ దేవత గంగానమ్మ గుడిలోని హుండీని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు బద్దలు కొట్టి, దానిలో నగదును దొంగిలించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెందిన బల్లే దుర్గాపండు, తొర్లపాటి రాజును అరెస్ట్ చేసి కొవ్వూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు.. పిఠాపురం మండలం పి. రాయవరం గ్రామానికి చెందిన శెట్టి సత్యనారాయణ (54) కూలి పనికి వస్తూ జాతీయ రహదారిని దాటుతున్నాడు. అతడిని అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు ఢీకొంది, ఈ ఘటనలో శెట్టి సత్యనారాయణ మృతి చెందాడు. మృతదేహాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం పి.గన్నవరం: నాగుల్లంక గ్రామానికి 18 ఏళ్ల యువతి శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి అదృశ్యమైందని ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. ఆ యువతి ఐదు నెలల పాటు రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసిందని, అనంతరం నెల రోజుల క్రితం మానేసిందన్నారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఇంటి నుంచి అదృశ్యమైందని తెలిపారు. పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ ఆచూకీ తెలియక పోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. -
భీమోలులో పులి సంచారం!
గోపాలపురం: మండలంలోని భీమోలు మెట్టపై పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పులి పాదముద్రలను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. రాజమహేంద్రవరం అటవీ శాఖ రేంజ్ అధికారి ఎన్.దావీదురాజు, డీఆర్ఓ జి.వేణుగోపాల్, ఎఫ్బీఓ వై.శ్రీను ఆ ప్రాంతాన్ని శనివారం సాయంత్రం పరిశీలించారు. దావీదురాజు మాట్లాడుతూ భీమోలు కొండపై వ్యవసాయం చేస్తున్న కె.రామకృష్ణ తన పొలంలో పులి, రెండు పిల్లలు కనిపించాయంటూ ఈ నెల 11న సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు భీమోలు కొండపై సర్వే చేస్తున్నామన్నారు. పులికి సంబంధించి ఎటువంటి జాడలూ కనిపించలేదని, ప్రస్తుతం కొండపై ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామస్తులు, రైతులు, కూలీలు ఒక్కొక్కరిగా కాకుండా ఇద్దరు లేదా ముగ్గురు కలసి సంచరించాలని సూచించారు. -
షటిల్ బ్యాడ్మింటన్‌లో ఆదిత్య రామ్ ప్రతిభ
అమలాపురం టౌన్: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన షటిల్ బ్యా డ్మింటన్ ఇంటర్ యూనివర్సిటీ సెలక్షన్స్‌లో అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బీబీఏ విద్యార్థి బొంత ఆదిత్య రామ్ సౌత్ జోన్ (సౌత్ ఇండియా) పోటీలకు ఎంపికయ్యాడు. విజయవాడ కేఎల్‌యూలో వచ్చే ఏడాది జనవరిలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ పోటీలకు అర్హత సాధించాడు. విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజీలో ఆదిత్య రామ్ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అపురూపం.. రూ.108 నాణెం అమలాపురం టౌన్: సత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం రూ.108 ముఖ విలువతో వెండి నాణేన్ని విడుదల చేసింది. అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ఈ నాణేన్ని సేకరించారు. దీన్ని 40 గ్రాముల బరువుతో 99.90 శాతం శుద్ధ వెండితో తయారు చేశారు. తొలిసారిగా రూ.108 ముఖ విలువతో ఈ నాణేన్ని భారత ప్రభుత్వం ముద్రించింది. దేశ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఉత్తరాది మఠం 41వ పీఠాధిపతిగా సేవ చేసిన సత్య ప్రమోద తీర్థ స్వామీజీ పేరుతో నాణేన్ని ముద్రించారు. నాణేనికి ఒక వైపు రూ.108 ముఖ విలువ, మరో వైపు సత్య ప్రమోద తీర్థ స్వామీజీ చిత్రం కనిపిస్తాయి. డాబా పైనుంచి పడి మహిళ మృతి కొత్తపేట: డాబాపై దుస్తులు ఆరేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి ఓ మహిళ మృతి చెందింది. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గణేష్ నగర్‌కు చెందిన గొల్లపల్లి వెంకటలక్ష్మి (40) శనివారం ఉదయం తన డాబాపై దుస్తులు ఆరవేస్తోంది. ఈ క్రమంలో కాలుజారి కిందపడిపోయింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. -
చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి
కొత్తపేట: స్థానిక మద్దులమెరక గ్రామానికి చెందిన చుట్టుగుళ్ల ఏడుకొండలు (64) అనే కల్లుగీత కార్మికుడు ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుకొండలు చెట్ల నుంచి కల్లు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దానిలో భాగంగా శనివారం గ్రామంలోని తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
పెద్దాపురం (సామర్లకోట): నవోదయ విశ్వవిద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నవోదయ ఆరవ తరగతిలో ప్రవేశానికి 7,140 మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం ఉమ్మడి జిల్లాలో 32 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు నవోదయ ప్రిన్సిపాల్ బి సీతాలక్ష్మీ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 6,034 హాజరయ్యారన్నారు. అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన క్యూ లో నిలబడి దర్శనం చేసుకున్నారు. అర్చకులు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేశారు. భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. కోనసీమ జిల్లా పెదపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి సూర్యావతి కుటుంబం ఇచ్చిన ఆర్థిక సహాయంతో 9,500 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎయిర్‌పోర్టులో డ్రై రన్ కోరుకొండ: విమాన సర్వీసుల రాకపోకలకు ఏర్పడే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత విమానాశ్రయాల అథారిటీ (ఏఏఐ) ఆధ్వర్యంలో శనివారం మధురపూడిలోని విమానాశ్రయంలో డ్రై రన్ నిర్వహించారు. శీతాకాలంలో పొగమంచు కారణంగా ఏర్పడే అవరోధాలను అధిగమించి విమాన సేవలందించడానికి సంసిద్ధంగా ఉండాలని అధికారులకు ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ సూచించారు. ప్రయాణికులకు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. సర్వీసుల రాకపోకల్లో అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఏటీసీ, ఆపరేషన్లు, ఇంజినీరింగ్, ఏఆర్ఎఫ్ఎఫ్ విభా గాలకు చెందిన అధికారులతోపాటు, ఇండిగో, అలయన్స్ ఎయిర్‌లైన్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. స్క్రబ్ టైఫస్పై అపోహలు వద్దు రాజమహేంద్రవరం రూరల్: స్క్రబ్ టైఫస్పై అపోహలు అవసరం లేదని, జిల్లాలో ఆ వ్యాధి వ్యాప్తిలో లేదని, సకాలంలో గుర్తిస్తే నయం అవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కే వేంకటేశ్వరరావు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో ప్రచురితం అవుతున్న వార్తల నేపథ్యంలో ప్రజలకి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు స్క్రబ్ టైఫస్ కేసులు మాత్రమే గుర్తించారని, అవి కూడా సాధారణ ఆరోగ్య పరీక్షలలో భాగంగా నిర్ధారణ అయినవేనని తెలియజేశారు. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించదని, జూనోటిక్ వ్యాధి అని తెలిపారు. పొదలు, గడ్డి ప్రాంతాల్లో నివసించే నల్లి లార్వా (చిగ్గర్ మైట్స్) కాటు ద్వారా మాత్రమే మనుషులకు సంక్రమిస్తుందని తెలిపారు. సాధారణ స్పర్శ, దగ్గు, తుమ్ము, మాట్లాడటం ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని వివరించారు. నేటి నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు రాజమహేంద్రవరం సిటీ: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 20వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె తిలక్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు, విద్యార్థులకు అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామన్నారు. 20వ తేదీన రాజమహేంద్రవరం ఎస్ఈ కార్యాలయంలో బహుమతుల ప్రదానం నిర్వహిస్తామన్నారు. వినియోగదారులకు స్టార్ రేటెడ్ గృహోపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత, నూతన సాంకేతిక విజ్ఞానం అనే అంశంపై నిపుణులతో ఇంజినీరింగ్ కాలేజీల్లో వర్క్ షాపులు నిర్వహిస్తారన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత గురించి వినియోగదారులతో అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. జానపద కళాకారులు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. -
రాజీయే రాజమార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీ పడడమే రాజమార్గమని, ప్రతీ ఒక్కరూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జాతీయ లోక్ అదాలత్ శనివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌కు 46 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులు, ఎకై ్సజ్ విభాగానికి చెందిన డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించామన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. గత మూడు జాతీయ లోక్ అదాలత్‌లలో 10,700 కేసులు పరిష్కరించి రూ.100.99 కోట్ల ్టపరిహారం చెల్లించామన్నారు. నాలుగో జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి జిల్లా పరిధిలో రాత్రి 9 గంటల వరకు 16,873 కేసులు పరిష్కరించగా రూ.27.32 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎంమాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రిశాస్త్రి పాల్గొన్నారు. -
పద్యంలా ఘోషించే గోదావరి!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి తీరం తెలుగు శతక పద్య పఠనంతో, వందేమాతరం గీతాలాపనతో మారు మోగింది. 1,008 మంది విద్యార్థులతో గోదావరి గట్టు చాంబర్ భవనంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు బాల శతక పద్య సహస్రాధిక గళ ధారణ, దశ సహస్ర వందేమాతర గీతాలాపన కార్యక్రమాలు జరిగాయి. మాతృ భాష పరిరక్షణ సమితి పెరవలి, ఆంధ్ర కేసరి యువజన సమితి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 40 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు భారతమాత, తెలుగు తల్లి వేషధారణలతో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి జంధ్యాల పాపాయ్య శాస్త్రి (కరుణశ్రీ) కుమారుడు వెంకట రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 80 ఏళ్లు జీవించిన తన తండ్రి 80 తెలుగు సాహితీ గ్రంథాలను అందించారని ఆయన తెలిపారు. ఎక్కువ శాతం తెలుగు బాల సాహిత్య గ్రంథాలనే అందించిన ఘనత కరుణశ్రీ దే అన్నారు. శాసనమండలి సభ్యులు సోమ వీర్రాజు మాట్లాడుతూ 150 ఏళ్ల వందే మాతర గీతాన్ని వెయ్యి సార్లు ఆలపించడం ఆనందదాయకమన్నారు. నగర ప్రముఖులు తోట సుబ్బారావు, పంతం కొండలరావు, ఇయ్యపు మురళీధర్, లక్కోజు వీరభద్రరావు అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి యువజన సమితి ప్రతినిధులు మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు, తెలుగు ఉపాధ్యాయురాలు డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి తెలుగు శతక పద్య విశిష్టతను వివరించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి కుమారుడు వెంకటరమణకు ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కారం చేశారు. -
'అంబా' అని అరచినా..
సాక్షి, రాజమహేంద్రవరం: మూగజీవాలపై సైతం చంద్రబాబు ప్రభుత్వం పచ్చపాతం రూపుతోంది. అధికారంలోకి వచ్చిన తక్షణమే మూగజీవాలకు ఇంటి ముంగిటకే అందే వైద్య సేవలకు మంగళం పాడారు. తాజాగా మూగజీవాలకు అవసరమైన మందులు అందించకుండా సర్యారు నిర్లక్ష్యం చేస్తోంది. ఏడాదిగా జౌషధాల పంపిణీ నిలిపివేయడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నా మందులు మాత్రం బయటకు రాసిస్తున్నారు. దీంతో పశువుల యజమానులపై ఆర్థిక భారం పడుతోంది.ఇదీ సంగతి..జిల్లా వ్యాప్తంగా 71 పశువైద్యశాలలు ఉన్నాయి. వివిధ రకాల పశువులు 1,23,668 ఉండగా.. 1,03,598 గొర్రెలు, మేకలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం, మందుల పంపిణీ జరుగుతోంది. జిల్లాలో పాడి పరిశ్రమను నమ్ముకుని వేలమంది రైతులు జీవనం సాగిస్తున్నారు. పాలు విక్రయించి బతుకుబండి లాగుతున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పశువులకు వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుందని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వైద్యం కోసం ఆస్పత్రులకు వెళుతుంటే మందుల కొరత వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు.ఏడాదిగా అందని మందులుచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు మందులు సరఫరా చేసిన దాఖలాలు లేవు. ప్రతి మూడు నెలలకోసారి సరిపడా స్టాక్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పాడి పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. మరో నెల రోజులు పాటు మందులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. పశువుల సంఖ్య ఆధారంగా రాష్ట్ర పశువైద్య శాఖ మందులు సరఫరా చేయాల్సి ఉంది. లైవ్‌స్టాక్ యూనిట్లుగా పరిగణించి డైరెక్టరేట్ నుంచే ఏ ప్రాంతానికి ఏ మందులు ఎన్ని అవసరమో ఇండెంట్ పెట్టే ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించారు. ప్రక్రియ పూర్తయి, మందులు క్షేత్రస్థాయి ఆస్పత్రులకు చేరాలంటే మరో నెల రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు రూ.వేలు ఖర్చు చేసి బయట మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పశుపోషకులు ఆవేదన చెందుతున్నారు.సంచార వైద్య సేవలపై అక్కసుపశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. రూ.278 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్‌లు తీసుకురాగా.. తూర్పుగోదావరి జిల్లాకు 16 అంబులెన్సులు కేటాయించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బృహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఫోన్ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందించారు. అంబులెన్స్ సేవలు పొందేందుకు ప్రత్యేకంగా 1962 అనే టోల్ ఫ్రీ నంబర్ సైతం ఏర్పాటు చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువును సమీపంలోని ఏరియా పశువైద్యశాల, వెటర్నరీ పాలీక్లినిక్‌కు తరలించి మరీ వైద్యం అందించారు. తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేర్చేవారు. సేవలు ప్రారంభించిన మూడేళ్లల్లో లక్షల సంఖ్యలో పశువులకు మెరుగైన వైద్యం అందించారు. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న వాహనాలకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళం పాడింది. దీంతో పశుపోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు పశువులను తీసుకొచ్చి వైద్యం చేయించుకునేందుకు పాట్లు పడుతున్నారు.అంబులెన్స్‌లో అధునాతన వసతులుగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అందుబాటులోకి తెచ్చిన పశువుల అంబులెన్స్‌లో అధునాతన వసతులు కల్పించారు. అవసరమైన వైద్య సిబ్బంది నియామకం చేపట్టారు. ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ ఉండేవారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాలను అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం ఉండేది. ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్ర చికిత్స చేసే సౌలభ్యం వాహనాల్లో కల్పించారు.వ్యవస్థల నిర్వీర్యంఅత్యవసర వైద్య సేవలు అందించే వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసింది. తమ డిమాండ్ల సాధన, వేతనాల కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పుడేమో మందులు సకాలంలో సరఫరా చేయకుండా ఇబ్బందులు పెడుతోంది.-రాజమహేంద్రవరంలోని పశు సంవర్ధకశాఖ జిల్లా కార్యాలయంఅత్యవసర మందులకూ కటకటే..పశు వైద్యశాలల్లో మందులు నిండుకున్నాయి. అత్యవసర సమయాల్లో వినియోగించే ఔషధాలు కూడా నిల్వ లేని పరిస్థితి తలెత్తింది. పశువులకు ప్రస్తుతం ఎక్కువగా జీర్ణ సంబంధిత ఇబ్బందులు, నొప్పులు, గర్భ సంబంధ సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలో వైద్యం తప్పనిసరి. మందుల కొరతతో మూగజీవాలు విలవిల్లాడుతున్నాయి.అజీర్తి, ఆమ్లజలగ వ్యాధులు, బికోలై ఇన్ఫెక్షన్, ఫెర్టిలిటీ, బ్యాక్టీరియా, వైరల్ సమస్యలతో అత్యధిక శాతం పశువులను ఆస్పత్రులకు తీసుకొస్తుంటారు. వాటికి చికిత్స చేస్తున్నా వైద్యులు మందులు బయట తెచ్చుకోమని చీటీ రాస్తున్నారు.ఆసుపత్రులకు ప్రతి మూడు నెలకోసారి మందులు సరఫరా చేయాలి. ఏడీ స్థాయి ఉన్నవాటికి రూ.1.50 లక్షలు, వైద్యాధికారి స్థాయి ఉన్న వాటికి రూ.లక్ష బడ్జెట్ ఉండేది. ఇక్కడి నుంచి గ్రామీణ, రైతు సహాయక కేంద్రాలకు అవసరమైన మందులు పంపిణీ చేయాలి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. -
చంద్రబాబు కళ్లు తెరిపించేందుకే కోటి సంతకాలు
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిపక్షాలు ప్రజల గొంతుకై ప్రభుత్వానికి వాస్తవాలు తెలియజేస్తాయని, వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబు నిద్ర నటిస్తున్నారని, ఆయన కళ్లు తెరిపించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల ఉద్యమం చేపట్టారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నా రు. ఈ నెల 15న నిర్వహించనున్న కోటి సంతకాల ర్యాలీ సన్నాహక సమావేశం పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి అధ్యక్షతన బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. వేణు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను చంద్రబాబు అనుయాయులకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. వైద్యం, విద్యను ప్రజలకు దూరం చేస్తున్న ప్రభుత్వానికి కోటి సంతకాలు సేకరించి కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన 4లక్షల 20వేల సంతకాల ప్రతులను సోమవారం జిల్లా కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయ కర్తలు, అనుబంధ సంఘాలు, రాష్ట్ర, మండల, గ్రామస్థాయి ప్రతినిధులతో కలిసి వాహనంపై తాడేపల్లికి తీసుకుని వెళతామన్నారు. వాటిని ఈ నెల 18న పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గవర్నర్‌కు అందజేస్తారన్నారు. ప్రజల నిరసన ఎలా ఉందో? చంద్రబాబుకు చెప్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. 15న వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వ నిర్ణయం తప్పని, ప్రజా శ్రేయస్సుకు విఘాతం కలిగిస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నామని చెల్లుబోయిన వేణు తెలిపారు. ప్రభుత్వ భూమి, భవనాలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే కాకుండా రెండేళ్లపాటు సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా జీవో ఇచ్చారన్నారు. ఇంత దారుణంగా ఎక్కడైనా ఉంటుందా? తన తాబేదారుల ఆస్తులు పెంచుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు వాడుకుంటున్నాడన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేదల ఆస్తులు దోచి పెద్దలకు పెట్టుకున్నాడు. ఇదే తీరు మెడికల్ కళాశాలల అంశంలో తారాస్థాయికి చేరిందన్నారు.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఉద్యమం చేస్తామని వేణు అన్నారు. జగన్ విద్య, వైద్యం ప్రజలకు చేరువ చేశారు పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను కట్టుకుంటూ వస్తే..చంద్రబాబు వాటిని అమ్ముకుంటూ పోతున్నారన్నారు. వైఎస్ జగన్ భవిష్యత్తు తరాలకు మేలు చేసేలా విద్య, వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు మాట్లాడుతూ కోటి సంతకాల ఉద్యమం వైఎస్సార్ సీపీ పోరాటం కాదని, ప్రజా ఉద్యమం అన్నారు. టీడీపీ నేతలే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. అనంతరం 15వ తేదీన వాహ నాలు పార్కు చేసే ప్రాంతాలను పరిశీలించారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు ఆకుల వీర్రాజు, రాష్ట్ర హౌ సింగ్ బోర్డు మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా శ్రీనగేష్, నక్కా రాజబాబు, గొందేశి శ్రీనివాసులరెడ్డి, గుబ్బల తులసీరామ్, అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ, మెనార్టీ సెల్ అధికార ప్రతినిధి మీర్జామౌలాలి, వివిధ విభాగాల అధ్యక్షులు మార్తి లక్ష్మి, విజయసారధి, నేతలు పాల్గొన్నారు.రేపటి ర్యాలీ సన్నాహక సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు -
ప్రమాదం మంచుకొస్తోంది!
పగటి ప్రయాణం ఉత్తమం చుట్టూ కమ్మిన మంచు తెరలతో ఎదుట ఏ వాహనం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ శీతాకాలంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణాలు తగ్గించుకుంటేనే అన్ని విధాలా శ్రేయస్కరం. పగలు ప్రయాణం ఉత్తమం. రాత్రి సమయంలో ముఖ్యంగా తెల్లవారు జామున ప్రయాణించాల్సి వస్తే పూర్తి అప్రమత్తతతో నెమ్మదిగా వెళ్లాలి. – పి.వీరబాబు, సీఐ, అమలాపురం పట్టణం అమలాపురం టౌన్: అంతటా మంచు కమ్మేస్తోంది.. రోడ్డంతా దుప్పటిలా పరుచుకుంటోంది.. పొగ మరింత దట్టంగా వ్యాపిస్తోంది.. ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు అటు అనారోగ్యాలకు, ఇటు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. తెల్లవారు జామున మంచు రోడ్లపై కమ్ముకుని కనీసం ఎదురుగా వచ్చే వాహనాల ఉనికి కూడా తెలీయనంతగా ఉంటోంది. కన్నుమూసి తెరిచే లోపు జరగాల్సిన అనర్థం జరిగిపోతోంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ రోడ్లపై ఇదే పరిస్థితి. శుక్రవారం తెల్లవారు జామున అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ప్రమాదానికి మంచే ప్రధాన కారణం. పొగ మంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ఓ బస్సు పల్టీ కొట్టిన ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారు. శీతాకాలం మొదలయ్యాక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు మంచు వల్లే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనల్లో పలువురు మృత్యువాత పడుతుండగా, మరికొంత మంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. టూరిస్ట్ బస్సులు, వివిధ సరకుల లోడుతో వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలే ఎక్కువగా మంచు బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, హైవేల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనచోదకులు తగిన అప్రమత్తతతో వ్యవహరిస్తూ వాహనాలను నెమ్మదిగా నడిపితే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అప్రమత్తతతో ప్రమాదాలకు చెక్ ఫ మంచు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణ వాహనచోదకులు స్వయం నియంత్రణతోనే సాధ్యమవుతుందని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేస్తోంది. కొన్ని జాగ్రత్తలతో ముందుకు వెళితే సురక్షితంగా గమ్యం చేరవచ్చని సూచిస్తోంది. ఫ అత్యవసరమైతే తప్ప శీతాకాలంలో తెల్లవారు జాము ప్రయాణాలు సాధ్యమైనంత వరకూ మానుకోవాలి. ఎండ వచ్చాక బయలు దేరడం మంచిది. రాత్రి సమయాల్లో రోడ్డు ప్రయాణాలను పగటి పూటకు వాయిదా వేసుకుంటేనే శ్రేయస్కరం. ఫ తెల్లవారు జామున రోడ్లపై వెళ్లే వాహనాల లైట్లు నిరంతరాయంగా వెలుగుతూ ఉంచాలి. అప్పుడే ఎదుటి వాహనాలను గుర్తించేందుకు వీలుంటుంది. రోడ్డు మలుపులు వచ్చినప్పుడు వాహన లైట్లను ఆపుతూ, మళ్లీ వేస్తూ ఉంటే ప్రమాదాలను దూరం చేయవచ్చు. ఫ మంచు సమయంలో వాహనం ప్రయాణిస్తున్నప్పుడు హారన్ మోగిస్తూ ముందుకు సాగాలి. దీనివల్ల ఎదుటి వాహనానికి ఆ శబ్ధం వినిపించి వాహన స్పీడ్‌ను తగ్గించి కొంత అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. ఫ రాత్రంతా వాహనం ప్రయాణించినా ముఖ్యంగా తెల్లవారు జామున ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో వాహనాన్ని నిలిపివేసి మంచు తగ్గాక తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తే మంచిది. ఫ ప్రయాణ సమయంలో ముఖ్యంగా వాహన హెడ్ లైట్లు, సిగ్నల్స్ లైట్లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. వాహనాల బ్రేక్‌లు కూడా చూసుకోవాలి. ఫ అతి వేగం ఎప్పుడూ అనర్ధమే. పొగ మంచులో వెళుతున్నప్పుడు మాత్రం వాహనం నెమ్మదిగా (30 కిలోమీటర్ల లోపు) ఉంటే శ్రేయస్కరం. కొత్తపేట రోడ్డులో కమ్ముకున్న మంచు మాటున వాహనాల సంచారంఈదరపల్లి– ముక్కామల బైపాస్ రోడ్డులో తెల్లవారుజామున మంచులో ప్రయాణం ఫ కమ్ముకుంటున్న మంచుతో ఇబ్బంది ఫ తెల్లవారుజామున ప్రయాణం అవస్థలమయం ఫ అప్రమత్తతతోనే ప్రాణాలు భద్రం -
పంచాయతీ కార్మికుడి దుర్మరణం
రాజానగరం: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో స్థానిక పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఫరిజల్లిపేటకు చెందిన కొత్తపల్లి శ్రీను (43) రాజానగరం పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పనులు ముగించుకుని, సహ కార్మికుడు నీలాపు వీరన్నను డ్యూటీకి పిలిచేందుకు మరో కార్మికుడు చంద్రమళ్ల వీర్రాజుతో కలసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు మీదుగా ప్రయాణించి, అవతలి వైపునకు వెళ్లేందుకు వైఎస్సార్ జంక్షన్లో ఆగి ఉన్నారు. అదే సమయంలో రాజానగరం నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు మలుపు తిరుగుతున్న లారీ ఆ మోటార్‌సైకిల్‌ను ఢీకొని, వెనుక కూర్చున్న శ్రీనును కొద్దిదూరం ఈడ్చుకుపోయింది. తీవ్రంగా గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలిస్తుండగా అప్పటికే మృతి చెందాడు. మోటారు సైకిల్ నడుపుతున్న వీర్రాజు గాయాలతో బయటపడ్డాడు. మృతుడికి భార్య మరియమ్మ, 13 సంవత్సరాల అమ్మాయి ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. వారం రోజుల క్రితం ఇదే జంక్షన్లో బైక్‌పై ఆగివున్న యువ జంట మృత్యువాత పడింది. -
కార్మిక మంత్రికి మా గోడు వినిపించదా?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ మంత్రికి భవన నిర్మాణ కార్మికుల గోడు వినిపించదా అని ఏపీ బిల్డింగ్, కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక పీఆర్ భవన్లో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులకు బతుకు భారమైందని, సొంత ఊర్లో పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.110 కోట్ల భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ కై ్లమ్ ఉన్నాయని, తక్షణమే విడుదల చేయాలని అనేకసార్లు వినతి పత్రం అందజేసినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కార్మికులకు పథకాల అమలు చేయాలంటే నిధులు లేవని కానీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.70 కోట్లు విడుదల చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు తానువ్యతిరేకం కాదని, కానీ భవన నిర్మాణ కార్మికుల కోసం చెల్లిస్తున్న సెస్ నిధులు ఖర్చు చేయకుండా ప్రభుత్వ నిధులు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘాలను, కలిసొచ్చే ఇతర సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాలన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల అమలుపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. సదస్సులో ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు, అమలాపురం యూనియన్ అధ్యక్షుడు బోనం చిన్న, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ బిల్డింగ్, కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ -
జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
● సీఐటీయూ నేతల విజ్ఞప్తి ● నగరంలో రెడ్ మార్చ్రాజమహేంద్రవరం సిటీ: ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకూ విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహాసభల నేపథ్యంలో సీఐటీయూ ఆధ్వర్యాన నగరంలో వివిధ రంగాల కార్మికులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన లేబర్ కోడ్లపై కార్మికులందరూ ఐక్యంగా సమరశంఖం పూరించారని అన్నారు. ిసీఐటీయూ ఆవిర్భవించి 55 సంవత్సరాలు పూర్తయిందన్నారు. కార్మిక హక్కుల సాధనతో పాటు దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ అసువులు బాసిన చరిత్ర కార్మికోద్యమానికి ఉందని చెప్పారు. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రమాదాలను కార్మిక ఉద్యమం ముందుగానే హెచ్చరించిందన్నారు. అయినప్పటికీ పాలకులు తమ స్వార్థం కోసం అమలు చేశారని మండిపడ్డారు. ఫలితంగానే దేశ సంపద కార్పొరేట్ల వద్దకు చేరిపోతోందని చెప్పారు. పారిశ్రమలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, స్కీము వర్కర్ల కోసం చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత పాలకుల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, కార్మికుల ఐక్యతను చాటిచెప్పేలా విశాఖలో సీఐటీయూ మహాసభలు జరగనున్నాయని అన్నారు. ఈ సభల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సభ అనంతరం పెద్ద సంఖ్యలో కార్మికులు అంబేడ్కర్ బొమ్మ సెంటర్, పుష్కర్ ఘాట్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు మీదుగా శ్యామలా సెంటర్ వరకూ భారీ రెడ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ిసీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుందర్‌బాబు, బి.పవన్, జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్, నాయకులు పాల్గొన్నారు. -
ఇదేం బ్యాగోతం?
సాక్షి, రాజమహేంద్రవరం: ‘నాసిరకానికి కాదేదీ అనర్హం’ అన్న చందంగా మారింది చంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థులకు అందించిన కిట్ల పరిస్థితి. పాఠశాలలు పూర్తయ్యేంత వరకూ ఉండాల్సిన స్కూల్ బ్యాగులు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. అందించిన రెండు నెలలకే జిప్పులు ఊడిపోయాయి. బ్యాగులు చిరిగిపోతోంది. పోనీ కుట్టించుకుని వాడుకుందామన్నా మళ్లీ రోజుల వ్యవధిలో చిరిగిపోతోంది. చేసేది లేక.. విద్యార్థుల తల్లిదండ్రులు సొంత డబ్బులతో బ్యాగులు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 98,853 బ్యాగులు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో జిల్లావ్యాప్తంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో కిట్లు పంపిణీ చేశారు. ఒక్కో కిట్‌కు రూ.2,366 చొప్పున జిల్లావ్యాప్తంగా రూ.22.32 కోట్లు వెచ్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకూ చదివే 98,853 మంది విద్యార్థులకు బ్యాగులు అందించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అసలు ‘బ్యాగో’తం ఇక్కడే బహిర్గతమైంది. ఇక్కడా కక్కుర్తే.. విద్యార్థులకు నాసిరకం బ్యాగులు ఇచ్చి, చంద్రబాబు సర్కారు కక్కుర్తి చూపిందనే విమర్శలు వస్తున్నాయి. ఇచ్చిన రెండు నెలలకే ఇవి పాడైపోయాయి. జిప్పులు పూర్తిగా ఊడిపోయాయి. బ్యాగులు చిరిగిపోయాయి. దీంతో, వాటిని వీపునకు తగిలించుకుని పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేసిన బ్యాగులు కనీసం రెండు నెలలు కూడా ఉండకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కువ పుస్తకాలు పెడితే బ్యాగ్ మొత్తం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాగుల్లో 70 శాతం ఇలాగే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. బ్యాగులపై ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేవిధమైన అభిప్రాయాలు చెప్పారు. అలాగే, తల్లిదండ్రుల సమావేశాల్లో సైతం ఉపాధ్యాయులను, విద్యా శాఖ అధికారులను నిలదీశారు. ఇచ్చిన నెలల వ్యవధిలోనే బ్యాగులు పాడైపోవడమేమిటని ప్రశ్నించారు. దీంతో, నీళ్లు నమిలిన అధికారులు పాడైన బ్యాగ్‌ల స్థానంలో కొత్తవి ఇస్తామని చెప్పారు. ఆవిధంగా కొంత మందికి మాత్రమే ఇచ్చి.. మిగిలిన వారికి పంగనామాలు పెట్టారు. సర్కారు వారి ఈ ఘనకార్యంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడింది. చేసేది లేక చిరిగిపోయిన బ్యాగుల స్థానంలో సొంత డబ్బులతో కొత్తవి కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ కొత్త బ్యాగులే దర్శనమిస్తున్నాయి. కిట్లలోనూ అయోమయమే.. ప్రభుత్వం అందించిన విద్యార్థి మిత్ర కిట్లలోనూ కనికట్టే చూపారు. బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉండగా.. బూట్ల సైజు చాలా మంది విద్యార్థులకు సరిపోవడం లేదు. ఒక తరగతి విద్యార్థికి ఇవ్వాల్సినవి మరో తరగతి విద్యార్థికి ఇచ్చారు. కిట్‌లో ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు లేదన్న ఆరోపణలున్నాయి. డిక్షనరీలు, యూనిఫాం, సాక్సులు ఇవ్వలేదు. దీంతో, వాటిని కూడా తల్లిదండ్రులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో నాణ్యమైన కానుక గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘జగనన్న విద్యా కానుక’ పేరిట విద్యార్థులకు నాణ్యమైన బ్యాగ్‌లు, బూట్లు, యూనిఫామ్ అందించేది. ఏటా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే రోజునే 1,31,1194 మంది విద్యార్థులకు ఈ కానుక అందించేవారు. విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగుల పంపిణీ మూడు నెలలకే మూలకు.. జిప్పులు ఊడిపోయి, చిరిగిపోయిన వైనం 70 శాతం బ్యాగులది ఇదే దుస్థితి 20 రోజులకే చిరిగిపోయాయి చంద్రబాబు ప్రభుత్వం అందించిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చిన 20 రోజులకే జిప్పులు ఊడిపోవడం, దారాలు రావడం గమనించాం. బ్యాగు పీచులుగా ఊడిపోయింది. నాలుగైదుసార్లు కుట్టించినా.. ఉండటం లేదు. చేసేది లేక తల్లిదండ్రులు మార్కెట్లో కొనుగోలు చేసి విద్యార్థులకు ఇచ్చి పంపుతున్నారు. గతంలో ఇచ్చిన బ్యాగులు ఎంతో నాణ్యంగా ఉండేవి. విద్యార్థులకు ఇచ్చే బ్యాగుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం కక్కుర్తి చూపడం దారుణం. – మానుకొండ చంద్రబాబు, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
వ్యక్తి ఆత్మహత్య
రౌతులపూడి: ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన అల్లం రమేష్ (32) రాజవరం శివారున రౌతులపూడి నుంచి కోటనందూరు వెళ్లే రహదారి పక్కన ఉన్న మామిడితోటలో చెట్టుకు శుక్రవారం ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి అల్లం నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రౌతులపూడి ఎస్ఐ వెంకేటేశ్వరరావు తన సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రమేష్‌కు భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 15 మందికి జైలు కాకినాడ లీగల్: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో ఒకరికి పది రోజులు, ఒకరికి నాలుగు రోజులు, 8 మందికి మూడు రోజులు, ఐదుగురికి రెండు రోజుల చొప్పున శిక్ష విధిస్తూ కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మీకుమారి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. శుక్రవారం కోర్టులో 15 మందిని హాజరుపర్చగా వారికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కుదిరిన ఎంఓయూ భువనేశ్వర్: ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని సెంచూరియన్ యూనివర్సిటీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రాయోగిక ఫోరెన్సిక్ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి బలమైన వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్‌ను ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. -
అన్నింటా మహిళల ముందంజ
కాకినాడ రూరల్: అన్ని రంగాల్లో మహిళలు ముందంజ వేస్తున్నారని, ముఖ్యంగా పాఠశాలల నుంచి కళాశాలల వరకూ బాలికలు, యువతుల విద్యాభ్యాసం పెరిగిందని నన్నయ యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని నన్నయ ఎంఎస్ఎన్ పీజీ సెంటర్లో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. పీజీ సెంటర్ ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ ఆధ్యర్యంలో జరిగిన సదస్సును వీసీ ప్రారంభించారు. 55 శాతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని వీసీ అన్నారు. సదస్సుకు వచ్చిన వివిధ కళాశాలల విద్యార్థులకు శ్రీలంకకు చెందిన డాక్టర్ జేఎస్ రోహన్, అల్గిరీయాకు చెందిన డాక్టర్ నావెల్ ఆన్లైన్ ద్వారా భౌగోళిక మార్పులు, సమకాలీన సామాజిక దృక్కోణాలు, ప్రదర్శనలపై వివరించారు. ఎథియోపియా నుంచి హాజరైన ప్రొఫెసర్లు టెస్సెమా గేబ్రే కీమిసో, టెస్ఫాహున్ టెగెర్న్ సోర్సా తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ప్రొఫెసర్లు రమేష్, జ్యోతి పలు సూచనలు అందించారు. మాణిక్‌రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ మాణిక్యరెడ్డి, లయన్ గరికపాటి నమశ్శివాయలు వీసీ ప్రశాంతిశ్రీని సన్మానించి, మహాత్మా గాంధీ సేవారత్న పురస్కారాన్ని అందజేశారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. ఆంగ్ల విభాగాధిపతి ఎం.పోచయ్య, రాధామాధవి, డాక్టర్ శ్రీదేవి, మనోజ్దేవా తదితరులు పాల్గొన్నారు. -
వేతనాలు పెంచాలి
● యాప్‌ల భారం తగ్గించాలి ● అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు, ఆయాలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరావు మాట్లాడుతూ, పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణం రూ.26 వేల కనీస వేతనాన్ని అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాప్‌ల పేరుతో పెంచిన పని భారాన్ని తగ్గించాలని, అన్నీ కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేయడాన్ని నిలుపు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం అనంతరం అంగన్వాడీ చిన్నారులకు స్నాక్స్ ఇవ్వడం లేదని, దీనిని తక్షణం పునరుద్ధరించి వారికి మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు బడ్జెట్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు అనేక హామీలిచ్చి, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం తప్ప, అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా అంగన్వాడీల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏకబిగిన 42 రోజుల సమ్మె చేసిన అనుభవం అంగన్వాడీలకు ఉందని గుర్తు చేశారు. వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, మినీ కేంద్రాల కార్యకర్తలు దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాణిక్యాంబ, బేబీ రాణి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, ఉపాధ్యక్షుడు టి.అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం: ఫీడర్ లెవెల్ సోలారైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు ఈ నెలాఖరులోగా సిద్ధం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. స్థానిక సాగర్‌నగర్‌లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, ఫీడర్ లెవెల్ సోలారైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్ఆర్ఈ, ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్‌క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో కలసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈపీడీసీఎల్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సీఎండీ పృథ్వీతేజ్ వివరించారు. నెలకు 10 మెగావాట్ల చొప్పున జరుగుతున్న ఇన్స్టలేషన్లను రోజుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి పెంచేలా పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. విజయానంద్ మాట్లాడుతూ, ఈపీడీసీఎల్ పరిధిలో 2 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చే ఏడాది మార్చిలోగా సమ్మతి తీసుకొని, వారి ఇళ్లపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 400 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ పనులను పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద ఫీడర్ సోలారైజేషన్లో సంస్థ పరిధిలోని 8 జిల్లాల్లో 220 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. సమావేశంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు విజయ కె.ఎస్.రామసుందర రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్.ప్రభాకర రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎంలు ఎల్.దైవప్రసాద్, వి.విజయలలిత, బి.అశోక్ కుమార్, పి.శ్రీనివాస్, ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. -
పంటలో కలుపుకోవద్దు
ఐ.పోలవరం: రబీ సాగు ఆరంభంలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. చేలల్లో అంతర తామర (ిపిస్టియా స్ట్రేటియోట్స్) కలుపు ముప్పుగా మారింది. దీని తొలగింపు రైతులకు వ్యయప్రయాశలతో కూడుకున్న అంశమైంది. ఒకసారి తొలగించిన పంట అవశేషాలు మిగిలిపోవడంతో సాగు ఉన్నంత కాలం తరచూ వస్తుండడంతో రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. జిల్లాలో రబీ వరి సాగు మొదలైంది. ఈ సారి సుమారు 1.65 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని అంచనా. ఖరీఫ్ దెబ్బతినడంతో రైతులు రబీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్‌తో పోల్చుకుంటే 45 బస్తాల (బస్తా 75 కేజీలు) నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని రైతులు భావిస్తున్నారు. ఖరీఫ్ కోతలు జరిగిన ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్లలో రైతులు రబీ సాగు ప్రారంభించారు. నారుమడులు వేసి నాట్ల కోసం మురగ దమ్ములు మొదలు పెట్టారు. ఖరీఫ్‌కు దూరంగా ఉన్న ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో రైతులు ముందుగానే రబీకి సిద్ధమవుతున్నారు. సాగు ఆరంభంలోనే అంతర తామర (పిస్టియా స్ట్రేటియోట్స్) కలుపు రైతులకు ముప్పుగా మారింది. పిస్టియా రకం జాతి తామరలో చిన్న పువ్వుగా ఉంటోంది. ఇది కాలువలు, చేలల్లో త్వరగా విస్తరిస్తోంది. బురద నేల అధికంగా ఉన్నచోట్ల ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాల్లో ఇది ఎక్కువగా వస్తోంది. మరీ ముఖ్యంగా ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, అమలాపురం, మామిడికుదురు, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం మండలాల్లో రైతులకు ముప్పుగా మారింది. మురుగునీటి కాలువల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉన్నచోట్ల ఇది కనిపిస్తోంది. కాలువల ద్వారా చేలల్లోకి వస్తోంది. దమ్ములు చేసిన వారం రోజుల్లో చేలు అంతా విస్తరిస్తోంది. చేలల్లో దీనిని తొలగించేందుకు కూలీలకు రెండు, మూడు రోజులు సమయం పడుతోంది. ఎకరాకు అదనంగా రూ.మూడు వేల వరకూ ఖర్చవుతోంది. ఒకసారి తొలగించినా మళ్లీ మళ్లీ వస్తోందని రైతులు వాపోతున్నారు. సాగు ఆరంభంలో రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోందని చెబుతున్నారు. జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాల్లోని పంట కాలువలు, పంట బోదెలలో పెద్ద ఎత్తున పిస్టియా కలుపు మొక్కలు చేరాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మురుగునీటి కాలువల్లో కనీసం గుర్రపుడెక్క, తూడు వంటివి తొలగించకపోవడంతో వాటితోపాటు పిస్టియా కలుపు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. దీని ద్వారా చేలల్లోకి వచ్చి చేరుతోంది. చేలకు నష్టం ఫ పిస్టియా కలుపు వల్ల పంటకు నష్టం అధికంగా ఉంది. మొదట్లోనే నాట్లు వేసేందుకు ఇబ్బందిగా మారుతోంది. తరువాత వరి మొక్కల మధ్యలో చేరి చేనంతా అల్లుకుపోతోంది. దీనివల్ల చేలలకు అందించే ఎరువుల సారాన్ని ఇదే ఎక్కువగా పీల్చి వేయడం వల్ల వరి మొక్కలకు అందాల్సిన సారం అందుకుండా పోతోంది. ఫ చేలకు చేసే మందుల పిచికారీ వరి మొక్కల వేర్లకు అందకుండా పోతోంది. పురుగు మందుల సారాన్ని కూడా ఇది పూర్తిగా సేకరిస్తోంది. దీనివల్ల ఇది చనిపోదు కాని, చేలకు పట్టిన పురుగు, తెగుళ్లు తగ్గకుండా చేస్తోంది. పిస్టియా తొలగింపు ఖర్చుతో కూడుకున్న అంశమైతే.. తొలగించకుంటే పంటకు నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. మెష్‌లు కట్టడం ద్వారా అరికట్టొచ్చు వరి చేలల్లో అంతర తామర, పిల్లడుగు, గుర్రపుడెక్క వంటి కలుపు నివారణకు ఎకరాకు 400 గ్రాముల 2, 4–డి సోడియం సాల్ట్ 80 శాతం డబ్ల్యూపీని పిచికారీ చేయాలి. లేకుంటే 400 గ్రాముల 2,4–డి అమైన్ సాల్ట్, లేదా 50 గ్రాముల ఇథాక్సి సల్ఫూయూరాన్ 15 శాతం డబ్ల్యూడీజీ లేదా 8 గ్రాముల మెట్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమురూన్ ఇథైల్ 20 శాతం డబ్ల్యూపీని పిచికారీ చేయాలి. చేలకు నీరు పెట్టే సమయంలో తూరలకు చిన్న మెష్‌లు కట్టడం ద్వారా పిస్టియా పువ్వు రాకుండా అడ్డుకునే అవకాశముంది. –ఎం.వాణి, మండల వ్యవసాయ అధికారి, ఐ.పోలవరం ఫ సాగుకు ముప్పుగా పిస్టియా ఫ తొలగింపునకు అదనపు భారం -
భారతాధ్యయనంతో పంచభూతాల అనుగ్రహం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): భారతాధ్యయనంతో పంచభూతాల అనుగ్రహం కలుగుతుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ‘ఖాండవ వనదహన సమయంలో భారతంలో అనే అగ్ని స్తుతులు కనబడతాయి. ఇవి వేదాల్లోని అగ్నిసూక్త మంత్రాల వంటివే. అగ్ని స్తుతి అత్యంత విశేషమైనది. సర్వదేవతలూ అగ్ని స్వరూపులే. వేదాల్లోని అగ్నిసూక్తం అందరూ చదవలేరు. కానీ, భారతంలోని అగ్నిస్తుతి శ్లోకాలు తప్పులు లేకుండా అందరూ చదవవచ్చు. దీనివలన పంచభూతాలు శాంతిస్తాయి. వాటి అనుగ్రహం కలుగుతుంది’ అని అన్నారు. భారత కథలోకి వెళ్తూ.. ‘ద్వారకకు వెళ్తున్న శ్రీకృష్ణుడిని పాండవులు కొంత దూరం అనుసరించారు. ధర్మరాజు రథసారథి అయ్యాడు. అర్జునుడు రథంలో మాధవునికి వింజామరలు వీచాడు. రథంతో పాటు పాండవుల హృదయాలు కూడా కృష్ణుని అనుసరించి వెళ్లాయి’ అని చెప్పారు. ప్రవచనాలు ప్రారంభించిన పదహారో రోజు కావడంతో.. సభా పర్వంలోకి ప్రవేశించడాన్ని 16 రోజుల పండగగా అభివర్ణించారు. ‘మయుడు ధర్మరాజుకు నిర్మించిన దివ్యమైన సభకు త్రిలోక సంచారి నారదుడు వచ్చి, అనేక రాజధర్మాలు చెప్పాడు. రామాయణంలో తనను అయోధ్యకు తీసుకువెళ్లడానికి వచ్చిన భరతునికి శ్రీరాముడు చెప్పిన రాజధర్మాలతో నారదుడు చెప్పిన ధర్మాలు సరితూగుతాయి. వ్యాసునికి వాల్మీకి అంటే మహాప్రీతి. నారదుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మ సభలను వర్ణించాడు’ అని సామవేదం వివరించారు. దేవలోకంలో ఉన్న పాండురాజు రాజసూయ యాగం చేయాలని తన ద్వారా సందేశం పంపాడని ధర్మరాజుకు నారదుడు చెబుతాడన్నారు. కానీ, ఈ యాగం వలన గొప్ప ప్రజాక్షయం జరుగుతుందని చెప్పారు. యమసభను వర్ణిస్తూ, యముడు సహజంగా సౌమ్యుడు, శాంతస్వరూపుడు, పాపుల పాలిట భయంకరుడని అన్నారు. ధర్మరాజు పాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని, రాజసూయ యాగం చేయాలంటూ ధర్మరాజును ఎందరో ప్రోత్సహించారని దీనికి సంకల్పం చేయాలని మంత్రులు, హితైషులు సూచించారని తెలిపారు. ‘ఎందరు చెప్పినా, ధర్మరాజుకు కృష్ణుడు చెప్తేనే తృప్తి. ఆయన ఆదేశం మేరకు నడుచుకోవాలని నిర్ణయించాడు. వేగంగా వెళ్లి కృష్ణుని వేగంగా తీసుకురావడానికి పంపాడు. లోకంలో ఎందరో ఎన్నో రకాల సలహాలు ఇస్తూంటారు. కానీ, నాకు ఏది మంచిదో అదే నీవు ఉపదేశిస్తావని ధర్మరాజు కృష్ణునితో అంటాడు. రాజసూయ యాగం చేయడానికి పగవారు ఉండరాదని చెబుతాడు. చివరకు కృష్ణుని సలహాపై ఆ యాగం చేయడానికి ధర్మరాజు సిద్ధపడ్డాడు’ అని సామవేదం చెప్పారు. -
బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28న రావులపాలెం సమీపంలోని ఈతకోట గ్రామంలో నిర్వహించే బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడలో బీసీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు నివాసంలో శుక్రవారం బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ జరిగింది. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రిజర్వేషన్లను పెంచి ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలన్నారు. సమగ్ర కులగణన చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించాలన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాకిరెడ్డి భాస్కర్ గణేష్‌బాబు మాట్లాడుతూ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. సమావేశంలో యనమదల రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, మట్టపర్తి సూర్యచంద్రరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు, రాయుడు సుధాకరరావు, పంపన రామకృష్ణ, బీసీ చైతన్య వేదిక నాయకులు పెంకే రాజు, పెంకే శివ, పెంకే వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
రానూ.. రాజమండ్రి రాను
● లోకేష్ పర్యటన మూడుసార్లు వాయిదా ● స్థానిక టీడీపీ నేతలపై మితిమీరిన అవినీతి ఆరోపణలు ● అందుకే ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని చర్చ ● విదేశీ పెట్టుబడుల కోసం వెళ్లారంటూ టీడీపీ కవరింగ్సాక్షి, రాజమహేంద్రవరం: ‘రానూ బొంబాయికి రాను’ అనే పాట మాదిరిగానే.. సీఎం చంద్రబాబు తనయుడు, రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘రానూ రాజమండ్రి రాను’ అంటున్నట్టున్నారు. ఆయన రాజమహేంద్రవరం పర్యటన పదేపదే వాయిదా పడటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని టీడీపీ నేతలపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నందువల్లనే ఇక్కడకు వచ్చేందుకు ఆయన విముఖత చూపుతున్నారా.. నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన తంతుపై ఇతర నాయకులు నిలదీస్తారని భావిస్తున్నారా.. ఈ విషయం ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారా.. ఇందులో భాగంగానే ఆయన రాజమహేంద్రవరం పర్యటన విరమించుకున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇప్పటికే ఆయన పర్యటన మూడుసార్లు వాయిదా పడింది. ఇకనైనా వస్తారా.. మిన్నకుండిపోతారా.. అనే మీమాంస ఆ పార్టీ శ్రేణల్లో నెలకొంది. ముచ్చటగా మూడుసార్లు చారిత్రక రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో నిర్మించిన ప్రవేశ ద్వారం, నూతన భవనాల ప్రారంభోత్సవానికి లోకేష్ వస్తారని కొన్నాళ్ల కిందట విస్తృత ప్రచారం చేశారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి సైతం ఏర్పాటు చేశారు. ఇదిగో రేపు వచ్చేస్తారంటూ ఎమ్మెల్యే, టీడీపీ నేతలు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టేశారు. వారి హడావుడిపై నీళ్లు జల్లినట్టుగా లోకేష్ పర్యటన ఒక్కసారిగా వాయిదా పడింది. రెండు రోజుల అనంతరం మళ్లీ రేపు వచ్చేస్తారంటూ హడావుడి చేశారు. అప్పుడు కూడా ఆయన డుమ్మా కొట్టారు. మూడోసారి కచ్చితంగా వస్తారంటూ మరోసారి ప్రచారం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రవేశ ద్వారం లోగోను సైతం వస్త్రంతో కప్పేశారు. లోకేష్ వచ్చి ప్రారంభించిన అనంతరం దానిని తీయాలనుకున్నారు. కానీ, షరా మామూలుగానే ఆయన ముఖం చాటేశారు. ఇలా ప్రతిసారీ వస్తారని ఆశించడం.. భంగపాటు ఎదురవడం పరిపాటిగా మారింది. గడచిన రెండు నెలలుగా లోకేష్ నగర పర్యటన మూడుసార్లు వాయిదా పడింది. దీనికి నగర టీడీపీలో నెలకొన్న పరిస్థితులే కారణమన్న చర్చ జరుగుతోంది. అవినీతే కారణమా? రాష్ట్ర అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల కోసం పర్యటిస్తున్న కారణంగానే లోకేష్ రాజమహేంద్రవరం రాలేకపోతున్నారని టీడీపీ శ్రేణులు కవరింగ్ ఇస్తున్నాయి. అయితే దీని వెనుక వేరే విషయం ఉందని కూడా పలువురు అంటున్నారు. ముఖ్యంగా స్థానిక టీడీపీ నేతలపై అవినీతి, అక్రమాలు, ఆడియో టేపుల్లో బహిరంగంగా దొరికిపోవడం వంటి కారణాలున్నాయనే ఆరోపణలున్నాయి. నగర పర్యటనకు వస్తే.. నేతల అవినీతి ఆరోపణలపై నిలదీస్తారనే ఉద్దేశంతోనే లోకేష్ ఇక్కడకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. వరుస ఆరోపణలు ● లిక్కర్ వ్యవహారంలో అధికారులకు మామూళ్లు ఇవ్వాలంటూ టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఓ మద్యం దుకాణం నిర్వాహకుడితో జరిపిన సంభాషణ ఆడియో సంభాషణలు బహిర్గతమవడం తీవ్ర దుమారం రేపింది. ● ఇది జరిగిన కొద్ది రోజులకే అదే మద్యం వ్యవహారంలో జరిగిన సంభాషణకు సంబంధించి టీడీపీలో మరో కీలక నేత కిలపర్తి శ్రీనివాస్ ఆడియో సంభాషణలు సైతం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపాయి. ● అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసినవని, తమ వాయిస్ కాదని టీడీపీ నేతలు వివరణ ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు. ● ఆ ఆడియో సంభాషణలను బయట పెట్టింది సైతం మరో టీడీపీ నాయకుడే కావడం గమనార్హం. ● దేవదాయ, ధర్మాదాయ శాఖలో ఇటీవల చేపట్టిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ల నియామకం సైతం వివాదాస్పదంగా మారింది. నగరంలో పేకాట క్లబ్బుల నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నేతను ప్రముఖ దేవస్థానం చైర్మన్‌గా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● స్థానిక శ్రీరామ్ నగర్‌లోని ఓ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చెయ్యి విరగ్గొట్టిన కేసులో ఉన్న వ్యక్తిని మరో ముఖ్యమైన దేవస్థానం చైర్మన్‌గా నియమించారు. ● గతంలో రౌడీ షీటర్‌గా ఉన్న టీడీపీ సిటీ మాజీ అధ్యక్షుడికి ప్రముఖ సత్రం చైర్మన్ పదవి కట్టబెట్టారు. ● ఇంకా పలు ట్రస్ట్ బోర్డులకు డైరెక్టర్లుగా సైతం వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని నియమించారనే ఆరోపణలున్నాయి. ● ఇలా పవిత్రమైన ఆలయాల చైర్మన్, ఇతర పదవులను నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి కట్టబెట్టడంపై భక్తులు, ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ● నామినేటెడ్ నియామకాలు, మద్యం, ఇసుకలో టీడీపీ నేతలు పాల్పడుతున్న అవినీతి ఆరోపణలపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందజేసినట్లు తెలిసింది. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ల నేరారోపణలపై సైతం స్పష్టమైన నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. నోరు మెదపని బీజేపీ ఆలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని గట్టిగా వాదించే బీజేపీ నేతలు సైతం ఈ నియామకాలపై నోరు మెదపకపోవడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కొందరు బీజేపీ నేతలు సైతం పదవులు పొందినట్లు సమాచారం. ఈ విషయాలు తెలియకుండానే బీజేపీ నేతలు ట్రస్ట్ బోర్డ్ పదవులు తీసుకున్నారా.. లేక తెలిసి కూడా కూటమిలో భాగం కాబట్టి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా.. అనే విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలే లోకేష్ పర్యటన రద్దుకు కారణమని ప్రతిపక్షం సైతం ఆరోపించడం రాజమహేంద్రవరంలో చర్చనీయాంశంగా మారింది. లోకేష్ పర్యటన ఈ కారణాలతోనే వాయిదా పడుతోందా.. లేక వ్యూహాత్మకమా అనే చర్చ నడుస్తోంది. -
నూతన సత్రం నిర్మాణానికి అడుగులు
● సీతారామ సత్రం కూల్చివేత ప్రారంభం ● అక్కడే తొలి దశలో 105 గదులతో మరో సత్రం నిర్మాణం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో శిధిలావస్థకు చేరిన శ్రీ సీతారామ సత్రం కూల్చివేత పనులు ఎట్టకేలకు ప్రారంభించారు. ఈ నెలాఖరుకల్లా ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రత్నగిరిపై సుమారు 38 సంవత్సరాల క్రితం 100 గదులతో సీతారామ సత్రాన్ని నిర్మించారు. దీనిని ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో నిర్మించడంతో వివాహాలకు కూడా వీలుగా ఉండేది. ఒక్క ముహూర్తంలోనే ఇక్కడ దాదాపు 30, 40 వివాహాలు జరిగేవి. ఇది రెండేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరింది. తాత్కాలిక మరమ్మతులు చేసి, భక్తులకు గదులు అద్దెకు ఇచ్చేవారు. అద్దె రూ.200 మాత్రమే కావడంతో పేద, మధ్య తరగతి భక్తులు ఎక్కువగా ఇక్కడ బస చేసేవారు. అయితే, సత్రం పరిస్థితి చూసి ఆందోళనకు గురయ్యేవారు. 2023 నవంబర్‌లో దేవస్థానం ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈ సత్రం శిథిలావస్థకు చేరిన విషయం గమనించారు. దీని ఫిట్‌నెస్‌పై నివేదిక ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులను అప్పట్లోనే కోరారు. వారు పరిశీలించి, ఈ సత్రం శిథిలావస్థకు చేరినందున కూల్చివేయాలని నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా సీతారామ సత్రం కూల్చివేసి, ఆ వ్యర్థాలను తొలగించేందుకు టెండర్ పిలిచి ఖరారు చేశారు. అలాగే, ఆ స్థలంలోని సగ భాగంలో ఎ–బ్లాక్ పేరిట 105 గదులతో నూతన సత్రం నిర్మించేందుకు గత ఏడాది మే నెలలో రూ.8.82 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. దీనిని 19.80 శాతం తక్కువగా రూ.7.07 కోట్లకు డీడీ గిరి కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఆ తరువాత గత ఏడాది నవంబర్‌లో రామచంద్ర మోహన్ విజయవాడకు బదిలీ అయ్యారు. సలహాదారు సూచనతో.. ఇదిలా ఉండగా గత ఫిబ్రవరిలో దేవదాయ శాఖ సలహాదారు కొండలరావు సీతారామ సత్రాన్ని పరిశీలించి, మరమ్మతులు చేస్తే సరిపోతుందని సిఫారసు చేశారు. దీంతో, గందరగోళం తలెత్తింది. సలహాదారు సూచనల ప్రకారం సత్రం మరమ్మతులకు సుమారు రూ.2 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే, ఆ తరువాత కూడా సత్రం కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై జూన్ 26న ‘సత్యదేవా చూడవయ్యా’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్పందించారు. సత్రాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని జేఎన్టీయూ–కాకినాడ ప్రొఫెసర్లను కోరారు. ఆ మేరకు సీతారామ సత్రం గదులు, శ్లాబ్, గోడలను గత ఆగస్టు 13న జేఎన్టీయూకే ప్రొఫెసర్లు వి.రవీంద్ర, జి.ఏసురత్నం పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేసినా ఉపయోగం ఉండదని, కూల్చివేయాలని నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఈ సత్రాన్ని కూల్చివేసి, కొత్త సత్రం నిర్మాణానికి గతంలో కాంట్రాక్ట్ పొందిన సంస్థను కోరారు. కార్తిక మాసంలోనే ఈ సత్రాన్ని కూల్చివేయాలని అనుకున్నా.. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వాయిదా వేశారు. ప్రస్తుతం రద్దీ తక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుని సత్రాన్ని కూల్చివేస్తున్నారు. 18 నెలల్లో పూర్తి చేస్తాం దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సీతారామ సత్రం కూల్చివేత పనులు దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా కూల్చివేత పూర్తవుతుంది. అనంతరం మంచి ముహూర్తంలో నూతన సత్రం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. అనంతరం, మూడంతస్తుల్లో 105 గదులతో నూతన సత్రం నిర్మిస్తాం. దీనిని 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
వైఫల్యాలను మహాత్ములు అవకాశాలుగా మలచుకుంటారు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవ రం రూరల్): వైఫల్యాలను సై తం మహాత్ములు అవకాశాలుగా మలచుకుంటారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశ ర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవ చనాన్ని గురువారం ఆయన కొ నసాగించారు. ‘శిథిలమై, గొప్ప కోటలు, ఇతర రక్షణ మార్గాలు లేని ఖాండవప్రస్థాన్ని ఏలుకోమని ధర్మరాజుకు ధృతరాష్ట్రుడు సూచిస్తాడు. అయితే, పాండవు లు ఖాండవప్రస్థాన్ని కృష్ణునితో కలసి వెళ్లి, విశ్వకర్మతో సుందర నగరాన్ని నిర్మించుకున్నారు’ అని చె ప్పారు. హస్తినకు వచ్చిన ద్రౌపదిని చూసి గాంధారి ఆమె తన పుత్రుల పాలిట మృత్యుదేవతగా కనిపిస్తున్నట్లు భావించినదన్నారు. పాండవుల కోసం విశ్వకర్మ నిర్మించిన అద్భుతమైన నగరం ‘ఇంద్రప్రస్థం’గా పే రొందిందని, వాణిజ్యవేత్తలు, వివిధ భాషలకు చెంది న ప్రజలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారని చె ప్పారు. ‘అంత్య కాలంలో కూడా నీవే మాకు గతి’ అంటూ కృష్ణుని పాండవులు ప్రార్థించారని, ‘నిన్ను స్మరింపజేసే విపత్తులు ఎన్ని కలిగినా చింత లేదంటూ కృష్ణుని కుంతి ప్రార్థించిందని అన్నారు. ‘విష్ణుని విస్మరించడమే విపత్తు. స్మరించడమే సంపద’ అని వ్యాసుడు చెప్పాడన్నారు. ‘వంద మంది కౌరవులు, ధృతరాష్ట్రు డు తదితర అనేక మంది శత్రువులున్న ధర్మరాజును అజాత శత్రువుగా ఎలా అంటారని కొందరు అడుగు తారు. ధర్మరాజు పట్ల ఎందరో వైరి భావం కలిగి ఉండవచ్చు. కానీ, ఆయనకు ఎవరి పట్లా శత్రు భావం లేదు. అందుకే ఆయన అజాతశత్రువు’ అని వివరించా రు. సోదరుల మధ్య ఏర్పాటు చేసుకున్న నియమానికి భంగం కలగడంతో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడని, వాటిని పరిశీలిస్తే, కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, గంగ నుంచి కావేరి వరకూ అఖండ భారతం ఒకటేనని, ఒకే ధర్మం ఉండేదని తెలిపారు. వేదాల్లానే ఆగమాలు కూడా ప్రాచీనమని, మన దేశంలో ఆలయ వ్యవస్థ అనాదిగా ఉన్నదేనని చెప్పారు. ఆర్య, ద్రావిడ తేడాలు కొందరు కుహనా చరిత్రకారుల కల్పితాలేనన్నారు. సుభద్రార్జునుల వివాహం, ఖాండవ వన దహనం, వరుణుడు, అగ్నిదేవుడి నుంచి కృష్ణార్జునులు దివ్యాయుధాలు పొందిన వైనాన్ని సామవేదం వివరించారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగతవచనాలు పలుకుతూ, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహా పురుష సంశ్రయం దుర్లభమంటూ పెద్దలు చెబుతారని, భారత ప్రవచనాలు వినడంలో ఈ మూడూ ఉన్నాయని అన్నారు. -
ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
● జిల్లాలో 7,599 మెట్రిక్ టన్నుల యూరియా ● జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు దేవరపల్లి: జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించినా, మళ్లించినా, ఎక్కువ ధరకు విక్రయించినా డీలర్ల లైసెన్సులు రద్దు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు హెచ్చరించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రబీ పంటలకు అవసరమైన ఎరువులను సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద సిద్ధంగా ఉంచామని తెలిపారు. జిల్లాలో 59 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక రూపొందించామన్నారు. అక్టోబర్ 1 నాటికి 34 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయని చెప్పారు. అకోబర్ 1 నుంచి ఈ నెల 1 వరకూ జిల్లాకు మొత్తం 26.9 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇప్పటికే 17.9 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామని వివరించారు. ఇప్పటి వరకూ 13.1 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, ఈ నెలాఖరుకు మరో 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా రానుందని తెలిపారు. రానున్న 21 రోజులకు 61 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ప్రస్తుతం 89 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని చెప్పారు. నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంఆర్పీ ప్రకారమే ఎరువులకు ధర చెల్లించాలని, డీలర్ నుంచి తప్పనిసరిగా రశీదు పొందాలని రైతులకు మాధవరావు సూచించారు. నేటి నుంచి ఢిల్లీ విమానం కోరుకొండ: ఢిల్లీ – రాజమహేంద్రవరం మధ్య నడిచే ఇండిగో విమాన సర్వీసు శుక్రవారం నుంచి యథాతథంగా అందుబాటులోకి వస్తుందని రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మిగిలిన సర్వీసులన్నీ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీకి ఇండిగో సర్వీసులు 9 ఉన్నాయి. వీటితో పాటు ముంబై – రాజమండ్రి విమానం వీక్లీ సర్వీసుగా ఉందన్నారు. అలాగే, అలయన్స్ సంస్థకు చెందిన విమానం తిరుపతికి వీక్లీ సర్వీసుగా నడుస్తోందని శ్రీకాంత్ తెలిపారు. వేతనాలు చెల్లించాలని జేసీకి వినతి తాళ్లపూడి: తమకు గౌరవ వేతనం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ తాళ్లపూడి మండల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్కు గురువారం వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించడం లేదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి పరశురామారావు, గజ్జరం, వేగేశ్వరపురం ఎంపీటీసీ సభ్యులు గుంటు చిన్నబ్బాయి, లక్ష్మణరావు పాల్గొన్నారు. దీనిపై జేసీ మేఘాస్వరూప్ తక్షణం స్పందించారు. వివరాలు అడిగి తెలుసుకుని, వేతనాలు త్వరగా వచ్చేలా చూడాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్కాకినాడ క్రైం: వైద్య, ఆరోగ్య శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వివిధ కేడర్లకు చెందిన 35 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ 3, ఆడియో మెట్రీషియన్ 4, టీబీ హెల్త్ విజిటర్ 5, ఫార్మసిస్ట్ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్ 3, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ 3, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ 2, పబ్లిక్ అండ్ ప్రైవేట్ మిక్స్ కో ఆర్డినేటర్ ఫర్ టీబీ 1, అకౌంటెంట్ 2, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కౌన్సిలర్ 1, ఎల్జీఎస్ 8 పోస్టులను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పరిధిలో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నామని వివరించారు. దరఖాస్తు డౌన్లోడ్, ఇతర వివరాలకు ఆయా జిల్లాల అభ్యర్థులు eastgodavari.ap.gov.in, kakinada. ap.gov.in, konaseema.ap.gov.in వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకూ కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో దరఖాస్తులు అందించాలని తెలిపారు. -
కోనసీమపై చలి పంజా..
● కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నమోదు ● గజగజలాడుతున్న జిల్లా ప్రజలు ● ఉదయం 8 దాటినా వీడని మంచు తెరలు ఐ.పోలవరం: చలి పులి పంజాకు కోనసీమ ప్రజలు గజగజలాడుతున్నారు. జిల్లాలో గురువారం 27 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి. నాలుగు రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున మూడు డిగ్రీల చొప్పున పడిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి వస్తున్న చలి గాలులతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాత్రి 8 గంటలకే పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 8 గంటలు దాటినా మంచు తెరలు వీడడం లేదు. మరోవైపు ఈ వాతావరణం శీతల రోగాలకు, వ్యాధులకు కారణమవుతోంది. దట్టంగా కమ్ముకుంటున్న మంచులో తిరుగుతున్న వారు జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సాధ్యమైనంత వరకూ మంచులో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పొద్దు పొడవక ముందే పనులకు వెళ్లాల్సిన వారు ముందున్న దారి కనపడక తమ వాహనాలను అత్యంత నెమ్మదిగా నడుపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ వాతావరణం వల్ల ఖరీఫ్ కోతలు, రబీ సాగు నారుమడులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఉదయం 9 గంటలైతే తప్ప వరి చేలల్లో పనులకు కూలీలు ఉపక్రమించడం లేదు. ఈ పరిస్థితి రైతులకు కాస్త ఇబ్బందిగా మారుతోంది. ఉదయం పూట దట్టంగా కమ్ముకుంటున్న మంచులో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాకింగ్ చేయడం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఉదయం నడిచే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తెల్లవారు జామున వాకింగ్ మంచిదే అయినా సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా మంచులో తిరగొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చలి వాతావరణంతో గుండె సమస్యలు పెరుగుతాయని, గుండైపె ఒత్తిడి పెంచి, గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. దీనితో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా రావచ్చు. పలువురికి ఆస్తమా లేదా బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మంచులో నడకకు వెళ్లేవారు వెచ్చని దుస్తులు ధరించాలని, వీలైతే, సూర్యరశ్మి భూమికి తాకే సమయంలో నడవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మంచులోనే మార్నింగ్ వాక్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● మోటారు సైకిల్‌ను ఢీకొన్న కారు ● మరొకరికి తీవ్రగాయాలు జగ్గంపేట: జగ్గంపేట మండలం రామవరం వద్ద ముందు వెళ్తున్న మోటారు సైకిల్‌ను వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్సై రఘునాథరావు అందించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం గ్రామానికి చెందిన దొండపాటి శ్రీను, అతని తాత బొల్లం నూకరాజు (64) ఎక్స్ఎల్ వాహనంపై జగ్గంపేట వస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన వేమూరి మురళీకృష్ణ (60), తన కోడలు బొల్లిన శ్రీదేవి (35)ని తీసుకుని తన కోడలు పుట్టిల్లు రాజానగరం మండలం నందరాడ గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జగ్గంపేట మండలం రామవరం వద్ద బొప్పిడి సిరామిక్స్ సమీపంలో ఎక్స్ఎల్ను బలంగా ఢీకొంది. దీనితో నూకరాజు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్ తుక్కుతుక్కు కాగా కారు కూడా ముందుబాగం బాగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న బొల్లిన శ్రీదేవి (35)కి, మురళికృష్ణకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని రాజమహేంద్రవరం లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ఆసుపత్రిలో బొల్లిన శ్రీదేవి మృతి చెందినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏపీ ఎన్జీవో జిల్లా కార్యవర్గం
అమలాపురం టౌన్: ఏపీ ఎన్జీవో సంఘం కోనసీమ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక ఏవీఆర్ నగర్‌లోని జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. కార్యవర్గంలోని 17 పోస్టులకు సంబంధించి ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా బి.సత్యనారాయణరెడ్డి వ్యవహరించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా ఎం.వెంకటేశ్వర్లు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎన్.రామారావు, కార్యదర్శిగా కోలా పీవీఎన్‌బీ కృష్ణ, ఉపాధ్యక్షులుగా జె.మల్లికార్జునుడు, సీహెచ్ చిట్టిబాబు, సీహెచ్ సూర్యారావు, టి.ఏసుబాబు, ఆర్వీ నరసింహరాజు, మహిళా ఉపాధ్యక్షురాలిగా కె.లోవలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా ఎంవీ సీతారామరాజు, బి.రామకృష్ణ, జి.వెంకటేశ్వరరావు, ఎస్వీ రామారావు, డి.పృథ్వీరాజ్, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎస్. కృష్ణవేణి, కోశాధికారిగా జి.సురేష్‌సింగ్ ఎన్నికయ్యారు. ఎన్నికలకు అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా పి.రమేష్, అబ్జర్వర్‌గా టి.జానకి వ్యవహరించారు. కార్యవర్గాన్ని ఉమ్మడి జిల్లా సంఘం పూర్వ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు. -
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
రాజానగరం: సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయ భాస్కరరావు అన్నారు. అమరావతిలోని ఏపీ స్పేస్ అకాడమీ (ఏపీఎస్ఏ), ఆదికవి నన్నయ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్ (ఏఎస్‌టీసీ) సహకారంతో ‘విశ్వంపై జిజ్ఞాసను పెంపొందించడం – అంతరిక్ష సంస్కృతికి ఉత్ప్రేరకం’ అనే అంశంపై వర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విజయ భాస్కరరావు మాట్లాడుతూ, రానున్న 25 ఏళ్లలో దేశ వనరులు, సవాళ్లు, భూమిపై రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలను వివరించారు. వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, కొత్త ఆలోచనలను అన్వేషించే వేదికను యువ అభ్యాసకులకు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. స్సేస్ అకాడమీ ఉపాధ్యక్షుడు, ఇస్రో అసోసియేట్ డైరెక్టర్ వి.శేషగిరిరావు మాట్లాడుతూ, స్పేస్ టెక్నాలజీలో విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. ఏపీ స్పేస్ అకాడమీ కార్యనిర్వాహక కార్యదర్శి కేవీ రమణ, రిజిస్ట్రార్ కేవీ స్వామి, ప్రిన్సిపాల్ పి.విజయనిర్మల, కో ఆర్డినేటర్ ఎస్.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
కొండలను కొల్లగొట్టి కాసుల పంట
గోపాలపురం: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సంపాదనే ధ్యేయంగా కొందరు దళారులు మండలంలోని పోలవరం కుడి ప్రధాన కాలువ, తాడిపూడి, చింతలపూడి కాలువ గట్లు కొల్లగొట్టి మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, కొవ్వూరుపాడు, గోపాలపురం, చిట్యాల, చెరుకుమిల్లి, రాజంపాలెం, గంగోలు, యర్రవరం గ్రామాలలో ఉన్న పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి సుమారు 70 శాతం మట్టిని అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నారు. వారికి స్థానిక నాయకుల అండదండలు ఉండడంతో జేసీబీలతో రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. తాడిపూడి, చింతలపూడి కాలువ గట్లు ఇప్పటికే మాయమైపోయాయి. కాలువ తవ్వకాల సమయంలో రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం పొందిన రైతులు మిగులు భూములపై కన్నేసి ఆ భూమిలోని మట్టిని విక్రయించి చదును చేసి పంటలు సాగు చేస్తున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం సేకరించిన భూమిని ఎటువంటి ఆధారాలు లేకుండా మళ్లీ సాగులోకి తెస్తున్నారు. కొవ్వూరుపాడు, గోపాలపురం, గుడ్డిగూడెం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ కొండలను సైతం అక్రమార్కులు తవ్వేసి ఇళ్లకు, ఎత్తు పల్లాల నేలల చదునుకు మట్టిని విక్రయిస్తున్నారు. కొండలు పిండి చేస్తున్నారు రాత్రీపగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తూ కొండలను పిండి చేస్తున్నారు. మట్టి ట్రాక్టర్ ఇంటి వద్ద వేయాలంటే దూరాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ. 1500కు విక్రయిస్తున్నారు. భవిష్యత్తులో మట్టి దొకడం కష్టంగా ఉంటుంది. కొండలు పిండి చేస్తున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అఽధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలి. – సరంగి మోసియ్య, చిట్యాల ఆగని మట్టి అక్రమ తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారులు స్థానిక నాయకుల అండతో రేయింబవళ్లు మట్టి తరలింపు గోపాలపురం మండలంలో విడ్డూరం -
భారీగా గంజాయి పట్టివేత
● 24,690 కిలోల సరకు స్వాధీనం ● విలువ రూ.13,29,500 ● ఏడుగురి అరెస్టు కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 16వ నంబర్ జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తన సిబ్బందితో బూరుగుపూడి గ్రామ శివారున మాటు వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి కాకినాడ జిల్లా పెద్దాపురం వైపు మూడు మోటార్ సైకిళ్లపై వెళ్తున్న ఏడుగురు అనుమానితులను తనిఖీ చేశారు. వారి నుంచి 17 ప్యాకెట్లలో ఉంచి తరలిస్తున్న రూ.13,29,500 విలువ చేసే 24,690 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అల్లూరి జిల్లా హకుంపేటకు చెందిన జోగ్ నకుల్‌సింగ్, పంజా దుర్గాప్రసాద్, పెద్దాపురానికి చెందిన పంచదార స్వామి, వనపర్తి రాజేష్, సప్పా అశోక్, లంక శ్రీకల్యాణ్, గొంపు అప్పారావులుగా గుర్తించారు. గంజాయి తరలింపులో ప్రధాన సూత్రధారిగా ఉన్న నకుల్సింగ్ను ఏ1గా, జంపా దుర్గాప్రసాద్ ఏ2, పంచదార స్వామి ఏ3, వనపర్తి రాజేష్ ఏ4గా పేర్కొన్నారు. గతంతో వీరిపై ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. ఏ5 సప్పా అశోక్‌పై హత్య కేసు ఉంది. నిందితులపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. వారి నుంచి మూడు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టించిన ఈగల్ టీమ్‌ను, ఎస్సైని, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకర్ల సమావేశంలో సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై సతీష్ కూడా పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంపియన్స్ జీఎస్ఎల్
రాజానగరం: స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్, డెంటల్ కాలేజీలకు నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడా పోటీలు (పురుషులు) 2025లో ‘ఓవరాల్ చాంపియన్ షిప్’ను స్థానిక జీఎస్ఎల్ క్రీడాకారులు కై వసం చేసుకున్నారు. రెండు దశలలో జరిగిన ఈ పోటీలు గురువారం సాయంత్రంతో ముగిశాయి. ఫుట్‌బాల్, చెస్, బ్యాడ్మింటన్ పోటీలలో జీఎస్ఎల్ విద్యార్థులు విజేతలుగా నిలువగా, కబడ్డీ, లాన్ టెన్నిస్‌లలో విజయవాడకు చెందిన ఎస్ఎమ్సి జట్లు ఆధిపత్యం చూపాయి. అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం ద్వారా ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్న విజతలకు జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు షీల్డ్ అందజేశారు. -
పిచ్చి కుక్క దాడిలో 21 మందికి గాయాలు
పి.గన్నవరం: మండలంలోని ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, పి.గన్నవరం పరిసర గ్రామాల్లో రెండు రోజలుగా ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తోంది. కనిపించిన వారిని కరుస్తూ పారిపోతుండటంతో ప్రజలు భయాందోన చెందుతున్నారు. బుధవారం 14 మందిని, గురువారం ఏడుగురిని గాయ పరచింది. దీంతో వారంతా పి.గన్నవరం సీహెచ్‌సీకి వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఇంకా ఆస్పత్రిలో నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్క పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, సిబ్బంది హెచ్చరించారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి తుని: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. అన్నవరం రైల్వేస్టేషన్, యార్డ్ రైల్వేగేటు మధ్య సుమారు 40 ఏళ్ల వ్యక్తి రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 94906 19020 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
మొసళ్ల ఆచూకీ కోసం గాలింపు
అయినవిల్లి: మండలంలోని అయినవిల్లిలంక పంచాయతీ పరిధిలో కోటిపల్లి భాగ వద్ద ఇటుకబట్టీల కోసం తవ్విన గోతుల్లో మొసళ్లు ఉన్నాయని తెలుసుకున్న అమలాపురం అటవీ రెంజ్ అధికారి ఈశ్వరరావు బృందం గురువారం ఆ పరిసరాలను గాలించారు. పరిసరాల్లోని నీటి గుంటల వద్ద మొసళ్ల పాదముద్రలు సేకరించారు. అయితే ఒకటే మొసలి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానిక రైతులకు, వ్యవసాయ కార్మికులకు వారి ఫోన్ నంబర్లు ఇచ్చి మొసలి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. మొసలి రాత్రి వేళల్లో వేగంగా సంచరిస్తుందని, ఒక చోట నుంచి మరో చోటుకు వేగంగా కదులుతోందన్నారు. ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష కడియం: బాలుడి మృతి కేసులో కడియం మండలం జేగురుపాడుకు చెందిన రాయి వెంకన్న, నల్లి శేఖర్‌లకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల చొప్పున జరిమానా విధించినట్టు కడియం ఇన్స్పెక్టర్ ఎ.వేంకటేశ్వరరావు తెలిపారు. 2018 సెప్టెంబర్ ఏడో తేదీన మోటారు సైకిల్లో పెట్రోల్ తీసి దొంగతనం చేస్తున్నాడని సంతోష్‌కుమార్ అనే బాలుడిని వీరు కొట్టారు. దీంతో బాలుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి సీఐ ఎం.సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి గంధం సునీత 14 మంది సాక్షులను విచారించి, నిందితులకు కేసు ఖరారు చేసినట్టు వెంకటేశ్వరరావు వివరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పీపీలు కె.రాధాకృష్ణ, రాజులు, రాచపల్లి ప్రసాద్ వ్యవహరించారన్నారు. కోర్టు కానిస్టేబుల్ కె.శ్రీనివాస్ సాక్షులను కోర్టు ముందు హాజరు పరిచారని ఇన్స్పెక్టర్ వివరించారు. మహిళపై కత్తులతో దాడి పిఠాపురం: పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పిఠాపురం–సామర్లకోట రోడ్డులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సునీత రాత్రి విధులు ముగించుకుని హైవే మీదుగా స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఆమె సీతయ్య గారి తోట శివారు నరసింగపురం రోడ్డు మీదుగా వస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెంబడించి కత్తులతో దాడి చేసినట్టు చెబుతున్నారు. దాడిలో సునీత శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి. గాయపడ్డ సునీత గట్టిగా అరవడంతో దుండగులు పరారయ్యారు. రక్తపు గాయాలతో ఉన్న సునీతను స్థానికులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. సదరు ఘటనపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. 17 నుంచి అభిషేక వేళల మార్పు సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసం సందర్భంగా 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకూ స్వామివారి ఆర్జిత అభిషేకం వేకువ జామున 4.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ గురువారం పేర్కొన్నారు. ఇంత వరకూ ఈ అభిషేకాన్ని 5.30 గంటలకు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా 16వ తేదీన ఆర్జిత సేవగా స్వామివారి శాంతికల్యాణం జరుగునున్నట్టు ఏసీ ప్రసాద్ అన్నారు. ఈ సేవలకు ఆలయ వెబ్సైటు నుంచి గాని, ఆలయం వద్ద కౌంటర్ నుంచి కానీ టిక్కెట్లు పొందవచ్చునని ఆయన అన్నారు. -
నమ్మకం.. నిజాయతీలదే విజయం
కపిలేశ్వరపురం: స్థానిక ఎంపీపీగా తాతపూడి ఎంపీటీసీ సభ్యురాలు జిత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నిక నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి పర్యవేక్షణలో ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా, టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి మారిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. కోరంకు సరిపడ 10 మందికి మించి సభ్యులు ఉండడంతో ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీ స్థానానికి వెంకటలక్ష్మిని కేదారిలంక ఎంపీటీసీ సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు ప్రతిపాదించగా నేలటూరు ఎంపీటీసీ సభ్యురాలు రుద్రాక్షుల వీరగౌరీ కుమారి బలపరిచారు. దీంతో వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా గెలుపొందినట్టు జేసీ నిషాంతి, ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ధ్రువీకరణ పత్రం అందజేశారు. నూతన ఎంపీపీ వెంకటలక్ష్మికి ఎంపీడీఓ హెచ్.భానోజీరావు, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ జి.రాజేంద్రప్రసాద్, సిబ్బంది, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, సహచరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రలోభాలకు లొంగక.. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం. ప్రజా జీవితంలోకి వచ్చాక వ్యక్తిగత ఇష్టాలు, ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే మిన్న అంటూ జీవించాల్సి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగకుండా గెలుపు అవకాశాన్ని ఇచ్చిన పార్టీ బాటలో నడచి, చేయిపట్టి నడిపించిన నాయకుడి నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. మండల పరిషత్ ఎన్నికల్లో అదే జరిగింది. వైఎస్సార్ సీపీకి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నమ్మకానికి 12 మంది ఎంపీటీసీ సభ్యులు కట్టుబడి నిలబడ్డారు. దీంతో టీడీపీ ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి మళ్లిన ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అంతిమంగా నిజాయతీ మరోసారి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. మండలంలో 19 మంది ఎంపీటీసీ స్థానాలుండగా గత పరిషత్ ఎన్నికల్లో 15 వైఎస్సార్ సీపీ, రెండు టీడీపీ, మరో రెండు జనసేన గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు ప్రలోభాలకు లొంగినప్పటికీ మిగిలిన 12 మంది నిజాయతీగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. ఓటింగ్‌లో ఎంపీపీ జిత్తుక వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు రుద్రాక్షుల వీరగౌరీ కుమారి, పెందుర్తి శిరీష, పలివెల మధు, గుణ్ణం భాను ప్రసాద్, అడ్డాల శ్రీనివాస్, మేడిశెట్టి దుర్గారావు, మేడిశెట్టి సత్యవేణి, ఉమ్మిడిశెట్టి వీరవేణి, గొల్లపల్లి సోనియా, యర్రంశెట్టి నాగేశ్వరరావు, సాకా శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం తనతో సహా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులంతా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మండల పరిషత్‌లో ఉన్న సుమారు 70 లక్షల నిధులను మండలంలోని 19 గ్రామాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తీర్మానాలు చేశాం. వివిధ దశల్లో ఎమ్మెల్యే వేగుళ్ల ప్రోద్బలంతో అవన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికీ తామంతా పరిషత్ నిధులను పార్టీలకు అతీతంగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – జిత్తుక వెంకటలక్ష్మి, ఎంపీపీ సభ్యులకు కృతజ్ఞతలు ఎమ్మెల్సీ తోట కపిలేశ్వరపురం ఎంపీపీ ఎన్నికలో నిజాయతీగా నిలబడిన వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభినందించారు. అప్పట్లో రెండున్నరేళ్ల తర్వాత మరో బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని సభ్యులు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగడం, టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం, సభ్యులను ప్రలోభాలకు గురి చేయడం తదితర కారణాలతో వారు కుదుర్చుకున్న ఒప్పందం అమలు ఆలస్యమైందన్నారు. ఒప్పందానికి కట్టుబడి మేడిశెట్టి సత్యవేణి రాజీనామా చేయడం, జిత్తుక వెంకటలక్ష్మి ఎన్నికకు 12 మంది సభ్యులు ఏకతాటిపై నిలవడం వైఎస్సార్ సీపీ పట్ల, తన పట్ల ఎంపీటీసీ సభ్యులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 2024లో చంద్రబాబు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది రోజులు తర్వాత మాట్లాడుతూ ఇతర పార్టీల వారిని టీడీపీలోకి చేర్చుకోబోమని, ఎవరైనా రాదలిస్తే తమ పదవులకు రాజీనామా చేసి చేరవచ్చని ప్రగల్బాలు పలికారన్నారు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులను టీడీపీలోకి చేర్చుకున్నారని, వారంతా వారి వారి పదవులకు రాజీనామా చేయించి చేర్చుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేని నేత అని ఆయన చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగుళ్ల తీరు సైతం అలానే ఉందన్నారు. నియోజకవర్గంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లను ఎమ్మెల్యే వేగుళ్ల ప్రలోభాలకు గురి చేస్తూ నిస్సిగ్గుగా టీడీపీలో చేర్చుకున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని, నిజాయతీ, అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే వేగుళ్ల తెలుసుకోవాలని ఎమ్మెల్సీ తోట అన్నారు. కపిలేశ్వరపురం ఎంపీపీగా విజయలక్ష్మి ఏకగ్రీవం అండగా నిలచిన 12 మంది వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ప్రలోభాలకు లొంగని వైనం ఎన్నికను పర్యవేక్షించిన జేసీ నిశాంతి -
వాడపల్లి క్షేత్రంలో టెండర్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వివిధ సామగ్రి సరఫరా, పాత సామగ్రి తీసుకువెళ్లేందుకు ఏడాది కాలానికి గురువారం వేలం, టెండర్లు నిర్వహించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. గృహ సంకల్పం కింద ఇటుకల పాటను దొడ్డ లక్ష్మణరావు రూ.59,09,999కు దక్కించుకున్నారు. గతంలో ఈ టెండరు ద్వారా రూ.35,66,999 రాగా ఈ సారి రూ. 23,43,000 ఆదాయం పెరిగింది. దేవస్థానం పచ్చి గో గ్రాసం అమ్ముకునే హక్కును అడపా వరప్రసాద్ రూ.10,09,999కు దక్కించుకున్నారు. గత ఏడాది దీనికి రూ.1.25 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.8,84,999 అదనంగా ఆదాయం వచ్చింది. గుమ్మటాలుకు సంబంధించి గత శిస్తు రూ.2,14,999 ఆదాయం రాగా ప్రస్తుతం రూ.75,333 వచ్చింది. ఆ విధంగా ఈసారి రూ 1,39,666 ఆదాయం తగ్గింది. 26 షాపులకు పాట పెట్టగా అందులో ఐదు మాత్రమే వేలానికి వెళ్లాయి. వాటిని రూ.50,709కు పొందారు. గత ఏడాది కంటే ఈసారి రూ.5,300 ఆదాయం పెరిగింది. ఆలయంలో సెక్యూరిటీ సేవలు శ్రీస్కంధ బౌన్సర్లు రూ.వెయ్యికి, శ్రీకృష్ణప్రసాద్ రూ.369కి టెండరు పొందారు. కార్యక్రమంలో గ్రేడ్ – 3 ఈఓ ఎం.సత్యనారాయణ, దేవస్థానం సిబ్బంది తధితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌కు 46 బెంచ్‌లు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఈ నెల 13న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు 46 బెంచ్‌లు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడ దగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, యాక్సిడెంట్, బ్యాంకు, ప్రీ లిటిగేషన్ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. హై కోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలనా కేసులు కూడా ఇక్కడ పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు 18 వేల 35 కేసులను రాజీ చేయడానికి గుర్తించినట్టు తెలిపారు. న్యాయసేవ ప్రజల ముంగిటకు చేరాలన్న లక్ష్యంతో స్నేహపూర్వక న్యాయ పరిష్కారాలను అందించడం లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమన్నారు. -
సత్యదేవుని దర్శనానికి మరో సుపథం
అన్నవరం: సత్యదేవుని రత్నగిరికి వెళ్లేందుకు మొదటి ఘాట్‌రోడ్ వద్ద టోల్గేట్ నుంచి స్వామివారి ఆలయం సమీపం వరకు రూ.90 లక్షలతో నిర్మించిన రెండో మెట్లదారి పనులు పూర్తయ్యాయి. సుమారు 450 నున్నటి మెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పూర్వపు ఈఓ, ప్రస్తుత కమిషనర్ రామచంద్రమోహన్ చొరవతో 2010 సంవత్సరంలో ఆలయ ఈఓగా పనిచేసిన ప్రస్తుత దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ మెట్ల దారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం కళాశాల మైదానంలో టూరిస్ట్ బస్సులు, ఇతర వాహనాలను నిలిపి అక్కడ నుంచి కాలినడకన ఆలయానికి వెళ్లే భక్తులు సుమారు అర కిలోమీటరు దూరంలోని తొలి పావంచా వద్దకు నడిచి వెళ్లి అక్కడ నుంచి స్వామివారి ఆలయానికి 400 మెట్లు ఎక్కి వెళ్లాల్సి వచ్చేది. భక్తులకు ప్రయాసతో కూడిన వ్యవహారం. ఈ మేరకు వారికి మార్గం సుగమం అయ్యేలా మెట్ల దారి నిర్మాణానికి ఆయన నడుం కట్టారు. అన్నవరం దేవస్థానం నుంచి ఆయన 2012లో బదిలీ కావడంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. 2023లో మళ్లీ ఆలయ ఈఓగా రామచంద్రమోహన్ రావడంతో మెట్ల దారి నిర్మాణానికి టెండర్లు పిలచి ఖరారు చేసి 2025 ఏప్రిల్‌లో పనులు ప్రారంభించారు. రెండు మలుపులు, 410 మెట్లు ఈ మెట్ల దారిని రెండు మలుపులతో 410 మెట్లతో నిర్మించారు. మొదటి ఘాట్‌రోడ్ టోల్గేట్ నుంచి ఇది ప్రారంభమై రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల మధ్య రోడ్డులో ముగుస్తుంది. అక్కడి నుంచి సత్యదేవుని ఆలయం 200 మీటర్ల దూరం మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. మెషీన్‌తో కట్ చేసిన రాళ్లతో.. రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన అధునాతన మెషీన్‌తో కట్ చేసిన గ్రానైట్, మార్బుల్ రాళ్లను ఈ నిర్మాణానికి వినియోగించారు. మొదటి మెట్ల దారికి ఉపయోగించిన రాళ్లను 50 ఏళ్ల క్రితం శిల్పులు చేతితో చెక్కగా పలకల్లా అమర్చారు. సంతృప్తిగా నిర్మాణం కాగా, గత నవంబర్‌లో ఆలయానికి వచ్చిన రామచంద్రమోహన్ మెట్ల నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మార్గం మధ్యలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ల్యాండింగ్ వద్ద విశ్రాంతి షెడ్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని, అలాగే మెట్లకు ఇరువైపులా పిట్టగోడ నిర్మించాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తయ్యాక ఈ దారిని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. రత్నగిరికి రెండో మెట్లదారి సిద్ధం మొదటి ఘాట్ రోడ్ నుంచి ఆలయం వరకు మార్గం సుగమం రూ.90 లక్షల వ్యయంతో 410 మెట్ల నిర్మాణం ఆర్చి, పిట్టగోడలు పూర్తయ్యాక ప్రారంభం ఆర్చి, పిట్టగోడ నిర్మాణానికి టెండర్లు మెట్లదారికి ఇరువైపులా పిట్టగోడ నిర్మాణంతో పాటు ప్రారంభంలో ఆర్చి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నాం. ఆ పనులను వచ్చే ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. – వి.రామకృష్ణ, ఈఈ, అన్నవరం దేవస్థానం -
సందడిగా ‘శ్రీ ప్రకాష్ సినర్జీ’ వార్షికోత్సవం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ 11వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం స్కూల్ ప్రాంగణంలోని సీతా నరసింహక్షేత్ర ఆడిటోరియంలో బ్లిట్జ్–25 పేరుతో వేడుకలు నిర్వహించారు. విలువలే ప్రధానం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది. యోగా, జిమ్నాస్టిక్స్, త్వైకాండో, కలరీయపట్టు, కర్రసాము వంటి వాటిని ప్రదర్శించి అందరినీ అలరించారు. ముఖ్యంగా బుర్రకథ కళారూపాలు ఆకట్టుకున్నాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫారిన్ ట్రేడ్ కళాశాల విభాగాధిపతి డాక్టర్ వడ్లమూడి రవీంద్ర సారథి మాట్లాడుతూ శ్రీ ప్రకాష్ స్కూల్లో చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ వెల్లంకి సుమలత మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నత విలువలను పెంచుతున్న శ్రీ ప్రకాష్ స్కూల్‌కు మంచి ఆదరణ ఉందన్నారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ ప్రకాష్ మాట్లాడుతూ చదువుతో పాటు కళలు, సంస్కృతి, ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తూ విద్యాబోధన సాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, సినర్జీ ప్రిన్సిపాల్ ఎం.శ్రీదేవి, ప్లస్ వన్, టూ కో ఆర్డినేటర్ కె.విశ్వనాథ్, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
21న పల్స్ పోలియో
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు ఆనం కళాకేంద్రంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి.శ్రీదేవి మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి సిబ్బందికి పలు సూచనలిచ్చామన్నారు. జిల్లాలో మొత్తం 1,89,550 మంది పిల్లలు లక్ష్యంగా గుర్తించగా, దీనికి 1,084 పోలియో బూత్‌లు, 62 ట్రాన్సిట్, 53 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 4,566 మంది సభ్యులు, 116 మంది సూపర్వైజర్లు, 10 మంది మానిటరింగ్ అధికారులను నియమించామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు సీ్త్ర–శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, పురపాలక తదితర శాఖలు, వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ప్రయాణంలో ఉన్న వారికి ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, బస్స్టేషన్లలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సంధ్య, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వి.షమ్మి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొరతకు కట్టడి
● పశుగ్రాసం కొరతకు పరిష్కారం ● అందుబాటులోకి స్ట్రా బేలర్ యంత్రం ● ఎండుగడ్డిని కట్టలుగా కడుతున్న వైనం ● రైతులకు అదనపు ఆదాయం రైతునేస్తాలు ఎండుగడ్డి సేకరణకు అందుబాటులోకి వచ్చిన స్ట్రా బేలర్ యంత్రాలు రైతు నేస్తాలుగా మారాయి. దీనివల్ల వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో మాదిరిగా పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టే విధానాన్ని వదిలేశారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు పశుగ్రాసం కొరత రాకుండా చేసే అవకాశం ఏర్పడింది. ట్రాక్టర్ ఉపకరణ పనిముట్లు మాదిరిగానే ఈ స్ట్రాబేలర్ యంత్రం కూడా మార్కెట్లో లభ్యమవుతోంది. – సీహెచ్‌కేవీ చౌదరి, వ్యవసాయశాఖ ఏడీ, ఆలమూరు స్ట్రా బేలర్ సాయంతో మోపులుగా కట్టిన ఎండుగడ్డి ఆలమూరు: వ్యవసాయంలో అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల పని సులభం కావడంతో పాటు కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతోంది. ఇలాంటి వాటిలో గడ్డి సేకరణ యంత్రం (స్ట్రా బేలర్) ఒకటి. ఇప్పటి వరకూ పాడి రైతులను వేధించిన పశుగ్రాసం సమస్యకు దీని ద్వారా చెక్ పడింది. వరి పంట కోతకు ప్రస్తుతం మెషీన్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన గడ్డిని కట్టలుగా కట్టడానికి స్ట్రా బేలర్ ఉపయోగపడుతుంది. లాభదాయకం యంత్రాలతో పంటను కోసిన వరి పొలాల్లో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని గతంలో రైతులు తగులబెట్టేవారు. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరగడంతో పాటు భూసారం తగ్గిపోయే పరిస్థితి ఉత్పన్నమయ్యేది. ఈ స్ట్రాబేలర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఎండుగడ్డి కొరత సమస్యకు పరిష్కారం లభించింది. ట్రాక్టర్‌కు దమ్ము చక్రాలు అమర్చే విధంగానే స్ట్రా బేలర్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా గడ్డి సేకరణ జరపడంతో ఇటు పాడి రైతులకు, అటు కొనుగోలు దారులకు లాభదాయకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో.. ఇటీవల పొలాల్లో వ్యర్థంగా పడి ఉన్న ఎండుగడ్డిని స్ట్రా బేలర్ సాయంతో మోపులుగా కట్టి తీసుకువెళుతున్నారు. దీనివల్ల పాడి రైతులకు, గో సంరంక్షణ కేంద్రాలకు, డెయిరీ ఫాంలకు, పేపర్ మిల్లులకు ఎండుగడ్డి సేకరణ మార్గం సుగమమైంది. అలాగే ట్రాక్టర్ యజమానులు ఈ యంత్రాలను కొనుగోలు చేసి మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 250 వరకూ స్ట్రా బేలర్ యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాడి ఉమ్మడి జిల్లాలో సాగు చేసిన 4.69 లక్షల ఎకరాల్లో సుమారు 80 శాతం మేర వరి కోత యంత్రాలతో కోసిన గడ్డిని స్ట్రా బేలర్ యంత్రాలతోనే ఒబ్బిడి చేసుకున్నారు. అదనపు ఆదాయం స్ట్రా బేలర్ యంత్రంతో సేకరించే పొలంలో ఎకరాకు దాదాపు 1.5 టన్నుల గడ్డి లభిస్తుంది. ఒక్కో గడ్డి మోపు సుమారు 20 కేజీలు ఉంటుంది. ఇలా ఎకరాకు దాదాపు 75 వరకూ గడ్డి మోపులు లభిస్తున్నాయి. ఒక్కొక్క గడ్డిమోపునకు రూ.35 చొప్పున పలకడంతో ఎకరాకు రూ.2,625 ఆదాయం లభిస్తుంది. గతంలో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని ఈ స్ట్రా బేలర్ యంత్రంతో ఒబ్బిడి చేసుకుని రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. గతంలో రైతులు ఎండుగడ్డి కోసం కూలీలలో వరి పంటను కోయించేవారు. ప్రయోజనాలివే.. ● పొలాల్లో నిరుపయోగంగా ఉన్న గడ్డిని తగులబెట్టకుండా ఉంచుతున్నారు. దీనివల్ల భూసారం బాగుంటుంది. భూమిలో పోషక విలువలు పెరిగేందుకు, అధిక దిగుబడికి దోహద పడుతుంది. ● వరికోత యంత్రంతో పంటను కోయించిన రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ● ఎండుగడ్డి సేకరణ సులభతరం కావడంతో కూలీల కొరతను అధిగమించవచ్చు. గడ్డివాములను సులువుగా వేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ● అగ్ని ప్రమాదాల నివారణకు, కాలుష్య నియంత్రణకు దోహదపడుతుంది. పశుగ్రాసం కొరత అధిగమించడంతో పాటు వాయు కాలుష్యాన్ని నివారించొచ్చు. -
సమర సంతకం!
సాక్షి, రాజమహేంద్రవరం: వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై విద్యార్థులు, ప్రజలు, అన్ని వర్గాలవారూ సమర సంతకాలు చేశారు. వైఎస్సార్ సీపీ పిలుపునకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించి కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి చేయందించాయి. లక్షలాది సంతకాలు సేకరించి చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టింది. పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని హెచ్చరించింది. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సంతకాల ప్రతులను అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు పార్టీ జిల్లా కార్యాలయానికి ప్రత్యేక బాక్సుల్లో భారీ ర్యాలీగా తీసుకువచ్చారు. రెండు రోజుల అనంతరం వాటిని గవర్నర్ కార్యాలయానికి తరలించనున్నారు. కార్యక్రమంలో పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్రకార్యదర్శులు చందన నాగేశ్వర్, నక్కా శ్రీనగేష్, నక్కా రాజబాబు, గిరజాల బాబు, అద్దంకి ముక్తేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యాలయానికి సంతకాల ప్రతులు జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలలో లక్ష్యం మేరకు సంతకాలు సేకరించారు. ఆ ప్రతులను ప్రత్యేక బాక్సులలో ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలతో రాజమహేంద్రవరంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నినదించారు. సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయంలో భద్రపరిచారు. 17న గవర్నర్ వద్దకు జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను ఈ నెల 15వ తేదీన జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించి, అదే రోజు జిల్లాలోని పార్టీ శ్రేణులు సమావేశమైన సంతకాల ప్రతులతో ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ర్యాలీలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి విజవాడకు తీసుకువెళ్తారు. 17వ తేదీన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరి కొంత మంది ప్రముఖ నేతలు గవర్నర్‌ను కలసి సంతకాల ప్రతులను అందజేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో జిల్లా నేతలు తలమునకలవుతున్నారు. జిల్లాలో ఇలా... జిల్లా వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 60 వేల సంతకాలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 4.2 లక్షల సంతకాలు సేకరించాలని భావించారు. అన్ని నియోజకవర్గాల్లో లక్ష్య సాధనకు కృషి చేశారు. ఇప్పటి వరకు 4,05,129 సంతకాలు చేపట్టారు. ● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 70 వేల సంతకాలు సేకరించారు. లక్ష్యానికి మించి సంతకాలు నమోదయ్యాయి. సంతకాల ప్రతులను మాజీ మంత్రి పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రదర్శించారు. ● రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో 45 వేల సంతకాలు సేకరించారు. మరో రెండు రోజుల్లో 50 వేలు సేకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సంతకాల ప్రతులను భరత్, పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి పంపారు. ● రాజానగరం నియోజకవర్గంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో లక్ష్యానికి అనుగుణంగా 60 వేల సంతకాలు పూర్తి చేశారు. ఆ ప్రతులను జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ నేతలు ప్రదర్శించి అనంతరం బాక్సుల్లో ప్యాక్ చేసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనంతరం రాజానగరంలోని పార్టీ కార్యాలయం నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి భారీ ర్యాలీగా తీసుకువచ్చారు. ● పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా సంతకాలు సేకరించారు. లక్ష్యాన్ని అధిగమించి 60,129 సంతకాలు పూర్తి చేశారు. అనంతరం జిల్లా కార్యాలయానికి తరలించారు. ● కొవ్వూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నేతృత్వంలో 55 వేల సంతకాలు చేయించారు. సంతకాల పత్రాలను పెట్టెల్లో కొవ్వూరు పార్టీ కార్యాలయంలో ప్రదర్శించి అనంతరం ర్యాలీగా బయలు దేరి రాజమహేంద్రవరంలోని జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుకు అప్పగించారు. ● గోపాలపురంలో మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 55 వేల సంతకాలు సేకరించారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల నుంచి రాజమహేంద్రవరం జిల్లా పార్టీ కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. ● నిడదవోలులో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ముగిసింది. లక్ష్యానికి అనుగుణంగా 60 వేల సంతకాలు పూర్తి చేశారు. సంతకాల ప్రతులను బాక్సుల్లో పెట్టి జిల్లా కార్యాలయానికి తరలించారు. రాజానగరంలో ప్రతులు చూపుతున్న పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులునిడదవోలులో సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయానికి తరలిస్తున్న మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడుఅవిశ్రాంత కృషిప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటి సంతకాలు సేకరించాలన్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు గత అక్టోబర్ పదో తేదీన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణకు ముందుకు కదిలారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు అందించారు. పోస్టర్లు ఆవిష్కరించారు. ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేరించారు. బుధవారంతో ఈ కార్యక్రమం ముగిసింది. వైఎస్సార్ సీపీ ఆందోళనలకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై తమ ఆగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి వినిపించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ, ప్రజలు, విద్యార్థుల గర్జన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునకు విశేష స్పందన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ జిల్లా వ్యాప్తంగా సంతకాలు, భారీ ర్యాలీలు అన్ని నియోజకవర్గాల నుంచి జిల్లా కార్యాలయానికి ప్రతులు రెండు రోజుల్లో గవర్నర్‌కు అందించనున్న నేతలు -
సరదాగా చోరీ.. ప్రవృత్తిగా మారి..
● బైక్‌లను చోరీ చేస్తున్న యువకుడు ● అరెస్టు చేసిన పోలీసులు ● రూ.17.40 లక్షల విలువైన మోటారు సైకిళ్లు స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సరదాగా తిరిగేందుకు బైక్‌ను దొంగతనం చేసిన ఆ యువకుడు.. ఆ తర్వాత బైకుల చోరీయే తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. చివరకు రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెడుతున్నాడు. రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, త్రీటౌన్ సీఐ వి.అప్పారావు ఈ వివరాలు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన సబ్బు వీరబాబు చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగాడు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న ఓ హోటల్లో నైట్‌బాయ్‌గా పనిచేసేవాడు. పగటి సమయాల్లో వెల్డింగ్ పనులు చేసేవాడు. అతడికి బైక్ లేకపోవడంతో ఏదో విధంగా బైక్ సంపాదించాలని పథకం వేశాడు. పుష్కర్ ఘాట్ వద్ద పార్కింగ్ చేసిన బైక్‌పై అతడి కన్ను పడింది. తన వద్ద ఉన్న పాత తాళంతో ప్రయత్నించగా లాక్ వచ్చేయడంతో అది తీసుకుని ఉడాయించాడు. అనంతరం నగరంలో పలు ప్రాంతాల్లో మోటార్ బైకులను చోరీ చేశాడు. వాటిని తనకు పరిచయమున్న భీమవరానికి చెందిన కోసూరి పవన్ కుమార్, గోకవరం మండలం అచ్యుతాపురానికి చెందిన జార్గాని అప్పన్నలకు తక్కువ ధరకు విక్రయించేవాడు. అలా వచ్చిన సొమ్ములతో జల్సాలు చేసేవాడు. పోలీసుల ప్రత్యేక నిఘా నగరంలో బైక్ చోరీలు ఎక్కువ కావడంతో ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు త్రీటౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీనిలో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా పట్టుబడిన సబ్బు వీరబాబును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాల చిట్టా బయట పెట్టాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతడు పుష్కర్ ఘాట్, కోటగుమ్మం, మల్లయ్యపేట, సుబ్రహ్యణ్య మైదానం, లాలాచెరువు రోడ్డు, ఇస్కాన్ గుడి, ఆత్రేయపురం మండలం వాడపల్లి వరిసర ప్రాంతాలలో చోరీ చేసిన 29 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.17.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందుతుడి నుంచి వాహనాలను కొనుగోలు చేసిన వారిపైనా కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వి.అప్పారావు ఎస్సై ఎండీ జుబేరు, హెడ్ కానిస్టేబుళ్లు వి.కృష్ణ, ఎన్.వెంకటరామయ్య, ఎస్.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు బి.విజయ్‌కుమార్, కె.పవన్ కుమార్, ఆర్.సుబ్రహ్మణ్యంలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
సాయి ప్రతిభ.. రికార్డుల మోత
తుని: సృజనాత్మకతతో పాటు కృషి, పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని ఈ తుని యువకుడు నిరూపించాడు. ఇప్పటికే అతి చిన్న వాషింగ్ మెషీన్ తయారు చేసి గిన్నిస్ రికార్డు సాధించిన అతడు.. అదే స్ఫూర్తితో కుండలు తయారు చేయడానికి ఉపయోగించే అతి చిన్న మోటార్ వీల్‌ను రూపొందించాడు. దీంతో మరోమారు గిన్నీస్ రికార్డు సాధించాడు. తుని పట్టణానికి చెందిన తిరుమలనీడి సాయి కుండల తయారు చేసే అతి చిన్న మోటార్ వీల్‌ను (ద స్మాలెస్ట్ మోటరైజ్డ్ పోటరీ వీల్) రూపొందించాడు. ఈ మేరకు మంగళవారం అతడికి గిన్నీస్ వరల్డ్ బుక్ సంస్థ వరల్డ్ రికార్డు ధ్రువపత్రంతో పాటు లేటెస్ట్ వెర్షన్ గిన్నీస్ బుక్‌ను పంపించింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సాయి చిన్నప్పటి నుంచి సైన్స్‌పై మక్కువతో ప్రాజెక్టులు రూపొందించేవాడు. ఈ నేపథ్యంలో అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించిన గిన్నీస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు. అతి చిన్న మోటార్ వీల్‌ను తయారు చేసి తాజాగా రెండోసారి ఈ ఘటన సాధించాడు. -
అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు
● మరో ఇద్దరిపై కేసు నమోదు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్ ముమ్మిడివరం: ముమ్మిడివరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మోర్త గిరిబాబుతో పాటు మరో ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ నిందితులను మీడియా ముందు హాజరు పర్చి, కేసు వివరాలు వెల్లడించారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రుకు చెందిన బాలిక ఐదో తరగతి నుంచీ ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో చదువుకుంటోంది. ఆమె తల్లి జీవనోపాధి కోసం కువైట్‌లో ఉంటుండగా, తండ్రి కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆ బాలిక నాయనమ్మ ఇంటి వద్ద ఉంటూ గురుకులంలో చదువుకుంటోంది. ఈ క్రమంలో బాలికతో బాబాయి వరసయ్యే అదే గ్రామానికి చెందిన మోకా గిరిబాబు పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 3న గురుకుల పాఠశాలలో ఉన్న ఆ బాలికను వైద్య చికిత్స కోసం బయటకు తీసుకు వెళుతున్నానని పాఠశాల యాజమాన్యంతో చెప్పగా, వారు నిరాకరించారు. దీంతో గిరిబాబు సమీప బంధువైన మేడేపల్లి అర్చనాదేవి ఆ పాఠశాలకు వెళ్లి ఆ బాలికకు మేనత్తనంటూ మాయమాటలు చెప్పి బయటకు తీసుకు వచ్చింది. గతంలో బాలిక తండ్రితో గిరిబాబు పలు పర్యాయాలు గురుకుల పాఠశాలకు రావడం, ఆ బాలిక కూడా గిరిబాబును బాబాయి అనడంతో యాజమాన్యం నమ్మి, బయటకు పంపించింది. అధిక సొమ్ములు ముట్టజెప్పి.. గిరిబాబు ఆ బాలికతో పాటు అర్చనాదేవిని మోటారు సైకిల్‌పై ముమ్మిడివరం వరకూ తీసుకువచ్చాడు. అక్కడ అర్చనాదేవిని దించి బాలికను గౌరీపట్నం తీసుకువెళ్లాడు. అదే రోజు సాయంత్రం అమలాపురం చేరుకుని స్థానిక గణపతి లాడ్జిలో రిసెప్షనిస్టు నాగవరపు వెంకట రమణకు అధిక సొమ్ములు ముట్టజెప్పి గది తీసుకున్నాడు. ఆ రాత్రి బాలికపై రెండుసార్లు అత్యాచారం చేశారు. మరుసటి రోజు బాలికను గురుకుల పాఠశాల వద్ద వదిలేశాడు. పాఠశాల ప్రిన్సిపాల్ డి.శారద ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్, ఎస్సై డి.జ్వాలా సాగర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితుడు గిరిబాబుపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అతడికి సహకరించిన అర్చనాదేవి, నాగవరపు వెంకట రమణలను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. కాగా.. బాలిక నాయనమ్మ ఇంటి సమీపంలోనే గిరిబాబు ఉంటున్నాడు. బాలిక తండ్రితో ఉన్న పరిచయంతో లోబర్చుకున్నాడు. సెలవుల సమయంలో ఇంటి వద్ద ఉన్న ఆ బాలికపై పలు పర్యాయాలు అత్యాచారం చేశాడు. -
ఫెర్రీ.. వర్రీ..
● సఖినేటిపల్లి రేవులో పంటు ఫిట్‌నెస్‌పై సర్వత్రా ఆందోళన ● ఇటీవల నది మధ్యలో నిలిచిన వైనం ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ సఖినేటిపల్లి: నర్సాపురం – సఖినేటిపల్లి మధ్యలోని వశిష్ట గోదావరిలో పంటుపై ప్రజలు, విద్యార్థులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇది అక్కడి వారందరూ సాధారణ విషయమే. అయితే ఇటీవల నది మధ్యలో పంటు నిలిచిపోయిన ఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పంటు ఫిట్నెస్పైనా సందేహాలు తలెత్తుతున్నాయి. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రమాదం తప్పిందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అటు ఉమ్మడి పశ్చిమ, ఇటు తూర్పు గోదావరి జిల్లాల ఉన్నతాధికారులు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాధవాయిపాలెం ఫెర్రీగా సఖినేటిపల్లి – నర్సాపురంలో రేవు గుర్తింపు పొందింది. నది మధ్యలో.. నర్సాపురం వైపు నుంచి సఖినేటిపల్లి వైపునకు సుమారు 80 మంది ప్రయాణికులు, 20 వాహనాలతో బయలుదేరిన పంటులో ఇంజిన్ సమస్య తలెత్తింది. దీనికి తోడు సముద్ర ఆటుపోట్ల కారణంగా గోదావరిలోకి వచ్చే కెరటాల ధాటికి నదిలో దిశ మారింది. ఈ నేపథ్యంలో అరగంట పాటు నిలిచిన పంటుపై ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ తరుణంలో నిర్వాహకులు ఆ పంటుకు ఇదే రేవులో ప్రయాణికులతో వస్తున్న మరో పంటుకు తాడును కట్టి సఖినేటిపల్లి వైపు గోదావరి ఒడ్డుకు చేర్చారు. పర్యవేక్షణ కరవు వేలంలో రేవు పాట దక్కించుకున్న నిర్వాహకులు ప్రయాణికుల రాకపోకలకు ఏర్పాటు చేయబోయే పంటులను ఆ శాఖ అధికారులు పరిశీలన చేసి సర్టిఫికెట్ ఇస్తారు. ఈ క్రమంలో సెక్యూరిటీ మెజర్స్ పరిశీలనకు కాకినాడలోని ఏపీ మారిటైమ్ బోర్డు (ఓడల రేవులు, సముద్ర మౌలిక సదుపాయాల నిర్వహణ) అధికారులు ఇందుకు అథారిటీ ఉంటారు. నర్సాపురం ఎంపీడీవో పర్యవేక్షణలో రేవు నిర్వహణ కొనసాగుతుంది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇటీవల ఇంజిన్ మొరాయించి నది మధ్యలో పంటు నిలిచిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు ఏవీ! సఖినేటిపల్లి రేవులో ప్రయాణికుల నుంచి సాలీనా సుమారు రూ.3 కోట్ల వరకూ పాటదారులు వసూలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రేవులో వేలం ద్వారా ఖరారవుతున్న పాట మొత్తంలో ఎక్కువ శాతం ఆదాయం ఇచ్చేది రాజోలు దీవివాసులే. కానీ పాటదారులు కనీస సౌకర్యాలు, జాగ్రత్తలు తీసుకోకపోవడం శోఛనీయమని స్థానికులు విమర్శిస్తున్నారు. పెత్తనమంతా పశ్చిమదే రేవుపై పెత్తనమంతా పశ్చిమ గోదావరి జిల్లా అధికారులదే. దీంతో రేవు పాట ద్వారా వచ్చే ఆదాయంలో వాటాలకు మాత్రమే తూర్పు జెడ్పీ, సఖినేటిపల్లి మండల పరిషత్, సఖినేటిపల్లిలంక (రేవు ఉన్న ప్రాంతం) పరిమితం అయింది. కూతవేటు దూరం సాగర సంగమానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ రేవులో సముద్రం ఆటుపోటులకు గోదావరి వైపునకు పోటెత్తే కెరటాలు ఽప్రభావం రేవులో అధికంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కెరటాలు దాటికి పంటు అదుపు తప్పి దిశ మారడం జరిగి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఉన్న రేవులో అధికారుల ఉదాసీన వైఖరి, రేవు పాటదారుల నిర్లక్ష్యం తగదని ప్రయాణికులు పేర్కొన్నారు. నిత్యం వేల సంఖ్యలో నిత్యం వేల సంఖ్యలో ఈ రేవు నుంచి నర్సాపురంతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తారు. రోడ్డు మార్గంలో నర్సాపురం వెళ్లడానికి చించినాడ మీదుగా చుట్టూతిరిగి సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అయితే సఖినేటిపల్లి రేవులో పంటు మీదుగా అరగంటలో నర్సాపురం చేరుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఇక్కడి రేవును ఆశ్రయించడం పరిపాటి. నిర్వహణ లోపం నిత్యం వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రేవులో పంటు నది మధ్యలో నిలిచిపోయిన ఘటనలో నిర్వహణ లోపం కచ్చితంగా కనబడుతోంది. అలాగే పంటు ఫిట్‌నెస్‌పై ప్రతి ఒక్కరికీ అనుమానం ఉంది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. – బళ్ల నోబుల్ ప్రభాకర్, పరిషత్ కో ఆప్షన్ మెంబర్, సఖినేటిపల్లి అజమాయిషీ ఉండాలి రేవులో పంటు ఫిట్నెస్, నిర్వహణపై ఉన్నత అధికారుల అజమాయిషీ కచ్చితంగా ఉండాలి. నిత్యం ప్రయాణికులతో పాటు చదువు కోసం విద్యార్థులు రేవు మీదుగా నర్సాపురానికి రాకపోకలు సాగిస్తుంటారు. వారి భద్రతపై ఉదాసీన వైఖరి తగదు. – తాడి సహదేవ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి, వీవీ మెరక -
కాకినాడలో వ్యక్తి దారుణ హత్య
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన కీర్తి సత్యనారాయణ (45) స్థానిక సంత చెరువు జంక్షన్‌లోని దుర్గ గుడి మలుపులో చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. దుమ్ములపేటకు చెందిన అత్తిలి రంగా అనే ఆటో డ్రైవర్ మంగళవారం సత్యనారాయణ వద్దకు వచ్చి ఘర్షణ పడ్డాడు. నిన్న రాత్రి తన తల్లిని ఎందుకు దూషించావని ప్రశ్నించాడు. ఈ విషయంపై ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. అంతలోనే రంగా అక్కడే ఉన్న చెప్పులు కుట్టేందుకు వాడే కత్తితో సత్యనారాయణ గుండెల్లో పొడిచాడు. వెంటనే సత్యనారాయణ రక్త మోడుతూ కాకినాడ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తనపై జరిగిన దాడి గురించి చెబుతుండగా ముందుగా ఆసుపత్రికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో తాను సహజీవనం చేస్తున్న మేరీ అనే మహిళ సాయంతో కాకినాడ జీజీహెచ్‌కు ఆటోలో వెళుతుండగా మార్గం మధ్యలో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి వెళ్లే సరికి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ బిందుమాధవ్, ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్‌తో కలిసి పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడికి కుటుంబం లేదు. కొన్నాళ్ల క్రితం రేచర్లపేటకు చెందిన మేరీతో పరిచయం ఏర్పడింది. ఆమె చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవితం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో సత్యనారాయణ కూడా ఆమెతో కలిసి కాగితాలు ఏరుకుంటూ, చెప్పులు కుడుతూ ఆమె కు దగ్గరయ్యాడు. ఈ పరిచయం ఇరువు రి మధ్య సహజీవనానికి దారి తీసింది. నిందితుడు రంగాను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. -
ఎట్టకేలకు నూతన ఈఓ
అన్నవరం దేవస్థానం అన్నవరం: దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం.హరి జవహర్లాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఈఓగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును తిరిగి ఆయన మాతృ శాఖ రెవెన్యూలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సుబ్బారావు గత ఏడాది డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన డిప్యూటేషన్ ఈ నెల 13తో పూర్తి కానుంది. నాలుగు రోజులు ముందుగానే ఆయనకు స్థానచలనం కలిగింది. నూతన ఈఓ త్రినాథరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పోస్టులో ఆయన నియమితులవడం ఇది నాలుగోసారి. 2019లో జనవరి నుంచి మార్చి వరకూ.. ఆ తరువాత అదే సంవత్సరం ఆగస్టు నుంచి 2022 వరకూ, తిరిగి 2024 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14 వరకూ త్రినాథరావు అన్నవరం దేవస్థానం ఈవోగా పని చేశారు. ఫలించని ప్రయత్నాలు కాణిపాకం, శ్రీశైలం దేవస్థానం ఈఓలుగా గత ఏడాది నియమితులైన డిప్యూటీ కలెక్టర్లను మరో ఏడాది కొనసాగిస్తూ ప్రభుత్వం గత నెల 29న ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరో ఏడాది కొనసాగేందుకు ప్రస్తుత ఈఓ సుబ్బారావు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే, ఆయనను సిఫారసు చేసేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముందుకు రాలేదు. కనీసం నాలుగు నెలలైనా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన వ్యక్తిగతంగా కోరినా ప్రయోజనం లేకపోయిందని అంటున్నారు. ఏడాది కాలంగా దేవస్థానాన్ని ప్రజాప్రతినిధుల చేతిలో పెట్టారన్న విమర్శలు.. పలు వివాదాల నేపథ్యంలో ఆయనను కొనసాగించేందుకు ఉన్నతాధికారులు విముఖత చూపారని చెబుతున్నారు. అన్నవరం దేవస్థానం ఈఓలుగా గతంలో డిప్యూటీ కలెక్టర్లు ఎన్వీ శేషగిరిబాబు, ఎస్.సత్యనారాయణ, ప్రసాదం వెంకటేశ్వర్లు, కాకర్ల నాగేశ్వరరావు, జితేంద్ర పని చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. వివాదాస్పద నిర్ణయాలు గడచిన ఏడాది కాలంగా అన్నవరం దేవస్థానం ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారింది. వీటిపై ‘సాక్షి’లో పలు కథనాలు వచ్చాయి. ఫ దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను సత్రాల్లోని ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ ఈఓ సుబ్బారావు ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ ఈఓ కుమారుని వ్యవహార శైలిపై ఏప్రిల్ 16న ‘చినబాబొచ్చారు బహుపరాక్!’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనం దేవదాయ శాఖలో తీవ్ర సంచలనం రేపింది. ఫ తమను ఈఓ వేధిస్తున్నారంటూ పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపింది. ఈ విషయాన్ని ‘నీ కొలువుకు సెలవు స్వామీ’ శీర్షికన ప్రచురించిన కథనంతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఫ ఈ అంశాలపై విచారణకు దేవదాయ, ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్‌ను కమిషనర్ కె.రామచంద్ర మోహన్ నియమించారు. ఆయన ఏప్రిల్ 23న అన్నవరం వచ్చి, సిబ్బందిని విచారించారు. ఈఓ తమను ఏవిధంగా ఇబ్బంది పెట్టారో సిబ్బంది ఆయన వద్ద ఏకరవు పెట్టారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ చంద్రకుమార్ ఏప్రిల్ 26న కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ‘సాక్షి’ కథనాలు వాస్తవమేనని నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా అప్పట్లోనే సుబ్బారావును బదిలీ చేస్తారని అనుకున్నారు. అయితే, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసులతో ఆయన బదిలీ నిలిచిందని అంటారు. ఫ సిబ్బందితో సఖ్యతగా ఉండాలని, చిన్న చిన్న విషయాలకు కూడా వారితో గొడవ పడొద్దని ఈఓకు సూచిస్తూ జూలై నెలలో కమిషనర్ ఒక మెమో జారీ చేశారు. ఒక ఈఓకు కమిషనర్ మెమో ఇవ్వడం అన్నవరం దేవస్థానం చరిత్రలో అదే ప్రథమం. ఫ పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా ఏ ఒక్కసారీ సకాలంలో జీతాలు ఇవ్వలేదు. దీనిపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించిన అనంతరం స్పందించి, నెలాఖరున చెల్లించారు. దీనినిని కూడా పాలనా వైఫల్యంగా ఉన్నతాధికారులు భావించారు. ఫ రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో అన్నవరం గత ఫిబ్రవరిలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో, జిల్లా కలెక్టర్ దేవస్థానంలో తనిఖీలు చేసి, పరిస్థితి చక్కదిద్దారు. ఆ తరువాతి నెలలో ఒకటో స్థానం వచ్చినా తిరిగి ఐదు, ఆరు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత నెలలో కూడా ఆరో ర్యాంకు రావడంతో కలెక్టర్ మళ్లీ సమీక్షించి, పలు ఆదేశాలిచ్చారు. ఫ సత్యదేవుని ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని గత ఏడాది ఆగస్టు నుంచి సహకార డెయిరీల ద్వారా కొటేషన్‌పై కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది జూన్ నుంచి టెండర్ ద్వారా మాత్రమే నెయ్యి కొనుగోలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ గత నెలాఖరు వరకూ కూడా కొటేషన్ పైనే కొనుగోలు చేయడంతో ఈఓపై దేవదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా త్రినాథరావు ఫ ఈ పోస్టులో నాలుగోసారి ఆయన నియామకం ఫ నేడు బాధ్యతల స్వీకరణ ఫ ప్రస్తుత ఈఓ సుబ్బారావు కొనసాగింపునకు నో ఫ 4 రోజుల్లో ముగియనున్న ఆయన డిప్యూటేషన్ ఫ మాతృ శాఖ రెవెన్యూకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు -
సెటిల్మెంట్లకు దూరంగా ఉండాలి
నిడదవోలు: పోలీసు స్టేషన్లలో ఎటువంటి సెటిల్మెంట్లూ ఉండకూడదని, వాటికి దూరంగా ఉండాలని, ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి, అవినీతికి పాల్పడే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్, నిడదవోలు సర్కిల్ కార్యాలయాల్లో మంగళవారం ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించి, రికార్డులు పరిశీలించారు. క్రైం రేటు, కేసుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, నిడదవోలు ప్రాంతంలో చోరీ కేసులు అధికంగా ఉన్నాయని, దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు విడిచి, ఊరికి వెళ్లే సమయంలో పోలీసులను ఆశ్రయించి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) కెమెరాలను తమ ఇంట్లో అమర్చుకోవాలని సూచించారు. దీని ద్వారా దొంగతనాలను అరికట్టడం సులభమవుతుందన్నారు. దీనిపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి రకరకాల యాప్‌లు, ఫోన్ ద్వారా వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. పండగల నేపథ్యంలో పేకాట, కోడిపందాలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో పోలీసు విభాగంలో మ్యాన్‌పవర్ తగ్గుతుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని చెప్పారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులకు న్యాయం చేసేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలన్నారు. బాధితుల ఫిర్యాదు, ఎఫ్ఐఆర్లో ఉన్న ఫోన్ నంబర్ల ద్వారా ఆయా కేసుల విచారణ అప్డేట్ను బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. నిడదవోలు పట్టణంలతో రాత్రి దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు మరింతగా పెంచాలని సూచించారు. పెరవలి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిడదవోలులో గంజాయి విక్రయదారులందరినీ అరెస్టు చేశామన్నారు. నిడదవోలులో ఒకరిపై పీడీ యాక్ట్ కూడా పెట్టామని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ డి.దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్, ఎస్సైలు జగన్మోహన్రాావు, ఎల్.బాలాజీ సుందరరావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.ఫ అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఫ ఎస్పీ నరసింహ కిషోర్ -
క్రీడలతో విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో నమ్మకం, ధైర్యం కలిగించడంలో, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి అన్నారు. స్థానిక దానవాయిపేటలోని ఎస్‌కేవీటీ స్కూలులో మంగళవారం నిర్వహించిన సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. సాయంత్రం జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారులతో ప్రతిజ్ఞ చేయించి, క్రీడా మైదానంలో వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని అన్నారు. వారికి తగిన అవకాశాలు, సరైన వేదిక కలిగిస్తే ఎటువంటి విజయాలనైనా అందుకుంటారని అన్నారు. క్రీడలతో పాటు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, అవకాశాలు అందుకుని రాణించడం ద్వారా చిన్నారుల ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని చెప్పారు. విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, ఎస్ఎస్ఏ పీడీ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం
రాజమహేంద్రవరం రూరల్: వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) డైరెక్టర్ వై.మేఘాస్వరూప్ అన్నారు. బొమ్మూరులోని ఆర్టీఐహెచ్లో స్టార్టప్ ఆలోచనలు కలిగిన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మూడు రోజులపాటు నిర్వహించే స్పార్క్ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశోధక విద్యార్థులు, స్టార్టప్‌లపై ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తొలి రోజు సమస్య నిర్వచనం, కస్టమర్ సెగ్మెంట్ల గుర్తింపు, ప్రాక్టికల్ సొల్యూషన్లపై బ్రెయిన్ స్టార్మింగ్ అంశాలపై చర్చ జరిగింది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కులపై విఠల్ కుమార్, ఐడియా జనరేషన్‌పై ఎడ్జ్ వన్ ఇంటర్నేషనల్‌కు చెందిన శ్రీరామ్ కుమార్ రామదేవ్ ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి టి.సూర్యప్రకాశ్, ఆర్టీఐహెచ్ రీజినల్ సెంటర్ పరిధిలోని తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి స్టార్టప్ ప్రతినిధులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు వద్దుసీతానగరం: వరునికి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లు నిండకుండా వివాహాలు చేస్తే బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ జి.క్రాంతిలాల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డి.చిట్టిబాబు ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన బాల్యవివాహ నిరోధక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నైతిక విలువలు లేని పెద్దల చేతిలో పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్ల వరకూ చదువుకున్న విద్యార్థిని వివాహ జీవితం, బాల్యంలో ప్రేమ పేరుతో జులాయిలను పెళ్లి చేసుకున్న యువతుల జీవితం గురించి కథల రూపంలో వివరించారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వాలని కోరారు. తోటి బాలురతో అతి చనువు వల్ల అపార్థాలు కలిగి జీవితాలు నాశనమవుతాయని, విచక్షణతో, బాధ్యతతో కుటుంబానికి విలువనిస్తూ చదువుకుని, ఆదర్శ సమాజాన్ని నెలకొల్పాలని క్రాంతిలాల్ పిలుపునిచ్చారు. విద్యార్థులతో రాజకీయ శాస్త్ర అధ్యాపకుడు వెంకటేష్ బాల్య వివాహ రహిత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కె.పెదలక్ష్మి, అధ్యాపకులు నాగేశ్వరరావు, ఎం.సుధామయి, వాణి, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ‘నన్నయ’లో ముగిసిన జాతీయ వర్క్షాప్రాజానగరం: ఆదికవి నడయాడిన నేలపై జాతీ య స్థాయి వర్క్‌షాప్ నిర్వహించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి అన్నారు. ‘భారతీయ భాషలలో ఏకరూ ప శాసీ్త్రయ సాంకేతిక పదజాలం’ అనే అంశంపై వర్సిటీలో నిర్వహించిన రెండు రోజుల నేషనల్ వర్క్‌షాప్ మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో తానా సాహితీ వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ, అందరికీ నిర్భయంగా మాతృభాషలోనే విద్యా బోధన జరిగేలా ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. భారతీయ సంస్కృతి అకడమిక్స్ కో ఆర్డినేటర్ కె.గిరిధరరావు మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాల రూపకల్పన జరగాలన్నారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య డి.జ్యోతిర్మయి, తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్డీ విల్సన్, భారతీయ భాషా సమితి నిపుణుడు ఆచార్య ఆర్ఎస్ సర్రాజు, కో ఆర్డినేటర్ తలారి వాసు పాల్గొన్నారు. -
చోరీ సొత్తు రికవరీ
తుని: రైల్వే ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి రైల్వే పోలీసులు చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తుని జీఆర్పీ సబ్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. తుని రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై అనుమానిత వ్యక్తులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అతడు రైళ్లలో చోరీలు చేస్తున్నట్టు తెలిపింది. అతడి నుంచి రూ.52 వేలు, సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు. -
గిరిజనుల హక్కులను కాపాడాలి
సామర్లకోట: గిరిజనుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని ఎంపీడీఓలకు మంగళవారం ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు వారి హక్కులపై అవగాహన కల్పించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరు 24వ తేదీలోపు గిరిజనులకు పెసా చట్టంపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఈ మేరకు స్థానిక శిక్షణా కేంద్రంలో సీఈఓలు, డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు టీఓటీలుగా శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ నెల 12 నుంచి 14 వరకు డిప్యూటీ ఎంపీడీలకు, ఈ నెల 15 నుంచి 17 వరకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి పంపాలన్నారు. ఈ నెల 24న విశాఖపట్నంలో జాతీయ పెసా దినోత్సవం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పెసా కోర్సు డైరెక్టర్ డి.చిన్నబ్బులు, అసిస్టెంట్ కోర్సు డైరెక్టర్ కేఆర్ నిహారిక, ఫ్యాకల్టీలు కె.సుశీల, ఎం.రాజ్ కుమార్, ఎన్ఎన్ రాజ్‌కుమార్, ఎ.విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా
పెరవలి: ఏటిగట్టుపై మలుపు తిరుగుతున్న ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. దానిలోని 40 మంది విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉండ్రాజవరం మండలం తాటిపర్రు గ్రామానికి చెందిన జ్యోతి కాన్వెంట్ బస్సు మంగళవారం పెరవలి మండలం తీపర్రులో గోదావరి ఏట్టుగట్టుపై మలుపు తిరుగుతోంది. ఆ సమయంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా లంకలోకి బోల్తా పడింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు పరుగున అక్కడకు వెళ్లి, బస్సు అద్దాలను పగులకొట్టి, విద్యార్థులకు బయటకు తీశారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఆయా ర్యాలి వెంకట పద్మావతికి తీవ్ర గాయాలు కావడంతో సొమ్మసిల్లిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొందరు పిల్లలకు స్వల్ప గాయాలు కావటంతో తల్లితండ్రులు, స్థానికులు సపర్యలు చేశారు. పెరవలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్, స్కూల్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా.. దాదాపు నెల రోజులుగా బస్సు సమయానికి రావడం లేదని, ఎందుకుని ప్రశ్నిస్తే బస్సు రేపేరుకు వచ్చిందంటూ డ్రైవర్ వెంకట రమణ చెప్పేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. -
అద్దె ఇల్లు కావాలంటూ పుస్తెల తాడు చోరీ
జగ్గంపేట: ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు యువకులు యజమానురాలిపై దాడి చేసి బంగారు పుస్తెల తాడు దోచుకుపోయా రు. జగ్గంపేట శ్రీరామ్‌నగర్‌లో పులవర్తి సూపర్ బజారు పక్కనే ఉన్న పైడిపల్లి శ్రీమన్నారాయణ ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీమన్నారాయణ ఇంటి ముందు ఉన్న టూలెట్ బోర్డును చూసి మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు అక్కడకు వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని అడగడంతో వారిద్దినీ శ్రీమన్నారాయణ భార్య సుబ్బలక్ష్మి అద్దెకు ఇచ్చే పోర్షన్లోకి తీసుకువెళ్లింది. వెంటనే ఆ ఇద్దరు యువకులు కత్తితో ఆమె బెదిరించి, మత్తు మందు స్ప్రే చేశారు. ఆమె మెడలోని మూడు కాసుల విలువైన నల్లపూసలు, పుస్తెల తాడు లాక్కుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎస్సై రఘునాథరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ పుటేజీలో దొంగతనం రికార్డు అయ్యిందన్నారు. అలాగే స్థానికంగా ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
హత్యకు పాత కక్షలే కారణం
పోలీసుల అదుపులో నిందితుడు గండేపల్లి, జగ్గంపేట: హత్య కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ నెల 5న కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. 2024లో జరిగిన ఘర్షణలో కాకర అప్పారావుపై కుళ్ల రాజాబాబు దాడి చేయడంతో అప్పటి నుంచి వారి మధ్య కక్షలు కొనసాగుతున్నారు. భూపాలపట్నంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం రాత్రి అప్పారావు ఒంటరిగా కనిపించడంతో కుళ్ల రాజాబాబు అతని తమ్ముడు కుళ్ల నాగేశ్వరరావుతో కలసి అక్కడకు వెళ్లగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సమీపంలోని ఇనుప రాడ్లతో అప్పారావుపై దాడి చేసి హతమార్చి రాడ్లను అక్కడే వదిలి వారు పరారయ్యారు. ప్రధాన నిందితుడు రాజాబాబును సోమవారం ఉదయం హైవేలో బూరుగుపూడి నుంచి జగ్గంపేట వెళ్లే మార్గంలో రామవరం వద్ద అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. అతన్ని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు కుళ్ల నాగేశ్వరరావు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఏఎస్సై చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కోటసత్తెమ్మ నిండుగా.. కనుల పండువగా..
● వైభవంగా ముగిసిన అమ్మవారి తిరునాళ్లు ● అలరించిన బాణసంచా వెలుగులు నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. ఐదు రోజులుగా నిర్వహిస్తున్న తిరునాళ్లు సోమవారం రాత్రి వైభవంగా ముగిశాయి. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ పర్యవేక్షణలో ఆలయం వద్ద ఉదయం చండీపారాయణ, సాయంత్రం హోమాలు, ఊయలసేవ నిర్వహించారు. ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ కోటసత్తెమ్మకు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూల గరగలు ఆకట్టుకున్నాయి. విలస గ్రామానికి చెందిన మానేపల్లి సత్యనారాయణ సన్నాయి మేళం, గరగ నృత్యాలు, నందన డ్యాన్స్ ఆకాడమీ తణుకు వారి కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. కేరళ చందామేళం, కాళికా డ్యాన్స్, కోలాట కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం భారీగా బాణసంచా కాల్చడంతో ఆలయ పరిసరాలు వెలుగులు విరజిమ్మాయి. అమ్మవారిని దర్శించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి గరగలు ఎత్తుకున్నారు. -
● సంధ్యా సమయం.. ఆధ్యాత్మిక సోయగం
సాయం సంధ్యా సమయాన.. ఆ వేంకటేశుని క్షేత్రాన కనువిందు చేసే దృశ్య కావ్యం ఆవిష్కృతమైంది.. అందరినీ మంత్రముగ్ధులను చేసింది.. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం వద్ద సోమవారం సాయంత్రం సూర్యుడు అస్తమించే వేళలో ఆకాశం కొత్త అందాన్ని సంతరించుకుంది. సూర్యుడి చుట్టూ స్వర్ణ ఛాయ, అందులో వెంకన్న క్షేత్ర రాజగోపురం ఆకట్టుకుంది. దీనిని పలువురు భక్తులు తమ కెమెరాల్లో బంధించారు. –కొత్తపేట -
తండ్రి మందలించాడని విద్యార్థి అదృశ్యం
పిఠాపురం: సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నావంటూ తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి అదృశ్యమైనట్లు గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం చేబ్రోలు హరేరామనగర్కు చెందిన జాగు సత్యనారాయణ కుమారుడు ప్రదీప్ (17) అదే గ్రామంలో ఒక ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఈ నెల 6న ఇంటి వద్ద సెల్ ఫోన్ చూస్తున్న కుమారుడిని తండ్రి చూసి ఎప్పుడూ సెల్ ఫోన్‌తోనే ఉంటే ఎలా అంటూ మందలించారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రదీప్ రెండు రోజులైనా తిరిగి రాలేదు. అన్ని చోట్లా గాలించినా ఫలితం లేకపోవడంతో సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఆచూకీ ఎవరికై నా తెలిస్తే వెంటనే గొల్లప్రోలు పోలీసులు సెల్ నంబర్ 91548 75379కు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు. భోజన హాలు విస్తరించేందుకు చర్యలు అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని అన్నదాన భవనంపై షెడ్డు నిర్మించడం సాధ్యం కావడం లేదని జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌కు అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. అయితే అన్నదానంలో ఎక్కువ మందికి భోజనం పెట్టేందుకు భోజన హాలును మరింత విస్తరించే ఏర్పాట్లు చేస్తామని వివరించారు. కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్‌ను ఈఓ సోమవారం కలిశారు. గత శుక్రవారం జిల్లా కలెక్టర్ అన్నవరం దేవస్థానానికి విచ్చేసినప్పుడు అన్నదాన పథకం భవనంపై మరో షెడ్డు వేసి ఎక్కువ మందికి భోజనాలు పెట్టాలని ఆదేశించారు. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం షెడ్డు వేయడం కుదరదని కలెక్టర్‌కు వివరించగా, ఆయన అంగీకరించారని అధికారులు తెలిపారు. కాగా, దేవస్థానంలో అవస రం ఉన్నచోట 20 టాయిలెట్స్ ఏర్పాటు చేయా లని కలెక్టర్ ఆదేశించారు. తమ వద్ద అసెంబుల్డ్ చేసుకునేందుకు వీలుగా తయారు చేసిన 20 టా యిలెట్స్ ఉన్నాయని, వాటిని పంపిస్తామని వాటి కి అయ్యే ఖర్చు చెల్లించాలని కలెక్టర్ తెలిపారు. దానికి దేవస్థానం అధికారులు అంగీకరించారు. శబరిమలకు సైకిల్ యాత్ర సామర్లకోట: కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శబరిమలకు అయ్యప్ప మాలధారులు సోమవారం సైకిల్ యాత్రగా బయలు దేరారు. సామర్లకోట మండలం మాధవపట్నం నుంచి బొందల దుర్గాప్రసాద్, వాసంశెట్టి దుర్గాప్రసాద్, వాసంశెట్టి లోవబాబు, మేడిశెట్టి భరత్‌కుమార్‌లు సైకిళ్లపై శబరిమలకు పయనమయ్యారు. వీరికి గ్రామానికి చెందిన పిల్లి పురుషోత్తం స్వామి శుభాకాంక్షలు తెలిపి వీడ్కోలు పలికారు. సుమారు 1,300 కిలోమీటర్ల ఈ యాత్రలో రోజుకు 40 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ, జనవరి 8 నాటికి శబరిమల చేరుకుంటామని స్వాములు తెలిపారు. కాపవరంలో చోరీ రామచంద్రపురం రూరల్: మండలంలోని కాపవరం గ్రామంలో ఇంటి తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ సోమవారం విలేకరులకు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కాపవరం గ్రామానికి చెందిన పిల్లి శ్రీనివాస్ ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని రూ.10 వేలు, అర కాసు బంగారు లక్ష్మీదేవి రూపులతో కూడిన నల్లపూసల దండ, 10 తులాల వెండి పట్టీలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సీలింగ్ భూములు పంచాలని ధర్నా
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజానగరం మండలంలోని జి.యర్రపాలెం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 330/4లో4.43 సెంట్ల భూమిని సీలింగ్, ప్రభుత్వ బంజరు భూములను పంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ధ ధర్నా నిర్వహించారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏ భూమీ లేని నిరుపేదలకు ఈ భూమిని పంచాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేటులకు కారుచౌకగా భూములను పంచిపెడుతోందన్నారు. వేల ఎకరాలను ఎకరానికి కేవలం 90 పైసలకు దోచిపెడుతున్న చంద్రబాబు పేదలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రవికుమార్, సత్యనారాయణ, రైతు కూలీ సంఘ నాయకులు పాల్గొన్నారు. హాస్టల్లో మౌలిక సదుపాయాల కోసం... సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద గల బాలుర వసతి గృహం–1లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ సోమవారం కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో వార్డెన్, కుక్, కమాటి, వాచ్‌మన్, హెల్పర్స్‌ని నియమించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిందని, కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఏర్పాటు చేయలేదన్నారు. -
సీటొస్తే నవోదయమే
ఫ ఉజ్వల భవిత, ఉన్నత ప్రమాణాలకు బాట ఫ 13న నవోదయ ప్రవేశ పరీక్ష ఫ 32 కేంద్రాల్లో నిర్వహణ, 7,140 మంది హాజరు రాయవరం: ఉన్నత ప్రమాణాలతో విద్య.. క్రీడల్లో ప్రత్యేక తర్ఫీదు.. సాహస కృత్యాలు.. వివిధ అంశాల్లో అధునాతన శిక్షణ.. పౌష్టికాహారంతో బోధన అందించే కేంద్రాలుగా జవహర్ నవోదయ విద్యాలయాలు నిలుస్తున్నాయి. ఇందులో ప్రవేశాల కోసం ఏటా వేలాది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఒకసారి ఆరో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకూ విలువలతో కూడిన ఉచిత విద్య లభిస్తుంది. నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13వ తేదీ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను ఈ నెల 13న నిర్వహించనున్నారు. 80 సీట్లకు 7,140 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. కరోనా నేపథ్యంలో 2021లో 5,371 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, 2022లో 10,741 మంది, 2023లో 8,779 మంది, 2024లో 8,506 మంది, 2025లో 8,971 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది గతేడాది కంటే 1,831 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. పరీక్షల అనంతరం విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను మూల్యాంకనం నిమిత్తం ఢిల్లీకి పంపిస్తారు. అక్కడే విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో 12, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లాలో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల్లో అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓలు, ఇన్విజిలేటర్ల నియామకం చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 80 ప్రశ్నలు.. 100 మార్కులు ప్రశ్నపత్రంలో 80 ప్రశ్నలకు వంద మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీలో 40 ప్రశ్నలకు 50 మార్కులు, గణితంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు, భాషా పరిజ్ఞానంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయించారు. విద్యార్థులు ఉదయం 10.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 10.45 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుంది. ఆలస్యంగా కేంద్రానికి చేరుకుంటే పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులకు సూచనలివీ.. విద్యార్థులు రెండు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక హాల్ టికెట్‌ను ఇన్విజిలేటరుకు అందించాలి. ఏదో ఒక గుర్తింపు కార్డును విద్యార్థి వెంట తీసుకు వెళ్లాలి. బ్లూ లేదా బ్లాక్ పెన్నుతోనే పరీక్ష రాయాలి. పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులు పాఠశాల యూనిఫామ్, లేదా సివిల్ డ్రస్‌లో హాజరు కావచ్చు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురాకూడదు. సిబ్బంది నియామకం పూర్తి నవోదయ ప్రవేశ పరీక్షను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం పూర్తి చేశాం. ఇప్పటికే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల తో పరీక్షను సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహించే విషయంపై చర్చించాం. పరీక్ష కేంద్రాల సీఎస్, డీవో, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి చేశాం. ఈ నెల 11న సీఎస్, డీవోలకు శిక్షణనివ్వనున్నాం. సెంటర్ లెవల్ అబ్జర్వర్లను నియమించి శిక్షణ ఇస్తున్నాం. –బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురం పారదర్శకంగా నిర్వహిస్తాం.. నవోదయ ప్రవేశ పరీక్షను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు డీఈఓలకు ఆదేశాలిచ్చాం. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. –జి.నాగమణి, పాఠశాల విద్యాశాఖ, ఆర్జేడీ, కాకినాడ జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలు, హాజరయ్యే విద్యార్థులు జిల్లా పరీక్ష దరఖాస్తు చేసిన కేంద్రాలు విద్యార్థులు కోనసీమ 15 3,046 తూర్పు 05 1,014 గోదావరి కాకినాడ 12 3,080 మొత్తం 32 7,140 -
చేప పిల్లలను మింగేశారు
● మత్స్యకారుల సంతకాలు ఫోర్జరీ చేశారు ● మత్స్యకారుల సంఘ నాయకుల ఆరోపణ ధవళేశ్వరం: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరంలో గోదావరిలో విడుదల చేసినట్లు చెబుతున్న చేప పిల్లలను వదలకుండా ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను జిల్లా మత్స్యశాఖ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నార ని ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకారుల కులా ల సమాఖ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కరుకు ఇ మ్మానియేల్ ఆరోపించారు. ధవళేశ్వరం బోట్మెన్, ఫిషర్మెన్ సొసైటీ నాయకులతో కలిసి సోమవా రం విలేకరులతో మాట్లాడారు. నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్య్సకారుల దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే సమక్షంలో చేపపిల్లలను మత్స్యశాఖ అధికారులు గోదావరిలో విడుదల చేశారన్నారు. మొత్తం 52లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారని, వాస్తవానికి కేవలం 30వేల చేపపిల్లలను మత్రమే విడుదల చేశారన్నారు. మత్య్సకారుల జీవనోపాధి పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన గోదావరిలో చేపపిల్లల విడుదలను చేపట్టకుండా విడుదల చేసినట్లు రికార్డులు సృష్టించారని ఆరోపించారు. రికార్డులలో మత్స్యకారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారన్నారు. సమగ్ర విచారణ చేపట్టి చేప పిల్లలను మింగేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధవళేశ్వరం బోట్మెన్, ఫిషర్మెన్ కో–ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు మెరుగ సత్తిబాబు, ఉపాధ్యక్షుడు సావదాల కామేశ్వరరావు, కార్యదర్శి కరుకు హరిప్రసాద్, కోశాధికారి బొడ్డు శ్రీను డిమాండ్ చేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
మంత్రి బంధువులమంటూ బెదింపులు
ఫ భూముల కబ్జా యత్నంపై తల్లీ కుమార్తె ఆవేదన ఫ న్యాయం చేయాలని మంత్రి సుభాష్ కాళ్లు పట్టుకున్న వైనం అమలాపురం రూరల్: మంత్రి బంధువులమంటూ బెదిరిస్తూ తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాళ్లు పట్టుకుని తల్లీకుమార్తె ప్రాధేయపడ్డారు. ఆస్తి వివాదంలో తమకు న్యాయం చేయాలని గుత్తుల పుణ్యవతి, మట్టపర్తి లక్ష్మీప్రసన్న మొరపెట్టుకున్నారు. సోమవారం అమలాపురం భట్నవిల్లిలో ఓ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ రాగా, ఆయన కాళ్లు పట్టుకుని ఆ తల్లీ కుమార్తె ఏడ్చిన దృశ్యాలు అందిరినీ కలచివేశాయి. తన భర్త గుత్తుల వెంకట్రావు జీవించి ఉండగానే తనకు, కూతురు లకీ్‌ష్మ్‌ప్రసన్న పేరున కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని ఒక సర్వే నంబర్లో 1–42 ఎకరాలు, మరో సర్వే నంబర్లో 51 సెంట్ల భూములు రాయించి ఇచ్చారని అని పుణ్యవతి తెలిపారు. కానీ మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో పెంచుకున్న కూతురు, ఆమె భర్త కలసి ఈ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని పుణ్యవతి, లకీ్‌ష్మ్‌ప్రసన్న ఆరోపిస్తున్నారు. కొత్తపాలెం రికార్డుల్లో నకిలీ పన్ను పత్రాలు సృష్టించి, తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు వాపోయారు. తమ కొబ్బరి తోటలో దింపు తిస్తుండగా అడ్డుకుని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారని బాధితులు మంత్రికి వివరించారు. దాడులు చేసిన కుడిపూడి వెంకటరత్నం, వెంకటేష్, బొక్క లోకేష్, బాలకృష్ణ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఫిర్యాదు చేసినా న్యాయం దొరకలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. -
కోటి గర్జన
● మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జనం ఆగ్రహం ● కోటి సంతకాల సేకరణకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం ● జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన ● స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు ● ఇప్పటికే తూర్పులో 3.52 లక్షల సంతకాల సేకరణ ● వేగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, మేధావుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉద్యమంలా ప్రారంభమైన సేకరణ ఉప్పెనలా మారింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలివస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటి సంతకాల సేకరణలో భాగస్వాములవుతున్నారు. లక్ష్యానికి మించి సంతకాలు అవుతున్నాయి. అలా మొదలైంది... ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా ‘కోటి సంతకాలు సేకరించాలన్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు గత అక్టోబర్ నెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణకు నాంది పలికారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు అందించే కార్యక్రమాలు చేపట్టారు. పోస్టర్ల ఆవిష్కరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ ఆందోళనలకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరైన తమ గళాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి వినిపించారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా లెక్కచేయకుండా ఆందోళన బాట పట్టారు. అధికారులకు వినతి పత్రాలు అందించేందుకు సైతం నలుగురిని మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం అనుమతించింది. ఇలా ప్రజా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎంత ప్రయత్నించినా.. ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు లెక్క చేయకుండా శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వెరసి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. రెండు నెలలుగా అవిశ్రాంత పోరాటం వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు, ప్రజలు, విద్యార్థులు రెండు నెలలుగా అలుపెరుగని ఉద్యమం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వచ్చింది. చంద్రబాబు విధానాలపై నిరసన స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒకేసారి 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో ఐదు కళాశాలల నిర్మాణ పనులు పూర్తయి.. 750 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. మరో 12 మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్ని పూర్తి కావచ్చాయి. అప్పట్లో వీటి నిర్మాణం కోసం రూ.8,500 కోట్లు వెచ్చించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్ జగన్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. పేదలకు వైద్య విద్య అందకుండా చేస్తోంది. ఇందులో భాగంగా అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాలల నిర్మాణాలను గాలికి వదిలేసింది. పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. వైఎస్ జగన్‌పై ఉన్న అక్కసుతో మెడికల్ కళాశాలలన్నింటినీ కార్పొరేట్ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో వైద్య విద్యపై పేద, మధ్య తరగతి విద్యార్థులు పెట్టుకున్న ఆశలను గల్లంతు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమం సాగుతోందిలా... వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం నిర్విరామంగా సాగుతోంది. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ప్రతి రోజూ సంతకాలు సేకరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 3.60 లక్షల సంతకాలు సేకరించారు. ● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 60,000 సంతకాలు సేకరించారు. డిజిటలైజేషన్ ప్రక్రియ సైతం చివరి దశలో ఉంది. ● రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 45 వేలకు పైగా సంతకాలు సేకరించారు. ● రాజానగరం : నియోజకవర్గంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో సంతకాల సేకరణ ఉత్సాహంగా సాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 60,000 సంతకాలు పూర్తి చేశారు. ● అనపర్తి : వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు. నియోజకవర్గంలో 60,000 సంతకాలు పూర్తి చేశారు. ● గోపాలపురం: మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఉత్సాహంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 42,000 సంతకాలు సేకరించారు. ● కొవ్వూరు: వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ నిరంతరాయంగా జరుగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 45,000కు పైగా సంతకాల సేకరణ పూర్తయింది. ● నిడదవోలు: వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40,000కు పైగా సంతకాలు సేకరించారు. వైద్యం, విద్య వ్యాపారం కాకూడదు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను దూరం చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలు విలవిల్లాడుతున్న తరుణంలో.. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంకల్పించారు. వైద్యం వ్యాపారం కాకూడదని భావించి నిర్మాణ పనులు ప్రారంభించారు. కళాశాలలన్నీ అందుబాటులోకి వస్తే ఏడాదికి ఒక్కో కళాశాలకు 150 మంది వైద్యులు తయారవుతారు. పదేళ్లలో 23 వేలకు పైగా వైద్యులు రాష్ట్రంలో తయారైతే వైద్య రగంలో చారిత్రాత్మక మార్పులు వస్తాయి. – మార్గాని భరత్‌రామ్, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ అన్ని వర్గాల నుంచీ మద్దతు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఎదురైంది. నిరసనగా వైఎస్సార్ సీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణకు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. జిల్లావ్యాప్తంగా నిర్విరామంగా కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల లక్ష్యాలు పూర్తయ్యాయి. మిగిలినవి సైతం పూర్తి చేస్తాం. సంతకాలు సేకరించిన పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలిస్తాం. అనంతరం జిల్లా స్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తాం. భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి అక్కడి నుంచి విజయవాడ బయలుదేరుతాం. 17న మాజీ సీఎం జగన్‌తో పాటు మరికొంత మంది నేతలు గవర్నర్‌ను కలిసి సంతకాల ప్రతులు అందించనున్నారు. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమం వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చే వరకూ ఉద్యమాలు నిర్వహిస్తాం. ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రెండు నెలల పాటు కార్యక్రమం నిర్విరామంగా సాగింది. అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, మేధావుల నుంచి మద్దతు లభించింది. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఇప్పటికే వైద్యం ఖరీదైంది. మరింత ఖరీదు కాకూడదంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు అన్నీ అందుబాటులోకి రావాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి. లేదంటే చరిత్రలో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసిన ఘనత మూటగట్టుకుంటుంది. –జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే -
మాదిగలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలి
ఫ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, మాదిగ నేతల డిమాండ్ ఫ 11న ఆత్మీయ కలయికకు సన్నాహాలు అమలాపురం టౌన్: మాదిగలు చట్టసభల్లోకి వెళ్లేందుకు అన్ని రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తోనే అమలాపురం పట్టణం కొంకాపల్లి శ్రీసత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 11న జిల్లా స్థాయి మాదిగల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాదిగ నేతలు వెల్లడించారు. స్థానిక ప్రీతి రెసిడెన్సీ సమావేశ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, మాదిగ నేతలు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర నిర్వహించినప్పుడు మాదిగలను చట్టసభలకు పంపిస్తానని ఇచ్చిన హామీని తాను అధికారంలోకి వచ్చాక తనతోపాటు నందిగం సురేష్‌ను ఎమ్మెల్సీ, ఎంపీలను చేసి చట్టసభలకు పంపించారని ఇజ్రాయిల్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే కాకుండా ఇప్పుడు కూడా మాదిగలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారని అన్నారు. మాదిగలకు చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చి జగన్ మాదిరిగా చరిత్రలో మిగిలిపోతారో... లేక చరిత్ర హీనులుగా నిలుస్తారో తేల్చుకోవాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్‌గా ఒక ఎంపీ స్థానం, మూడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయని, వీటిలో రెండు స్థానాలు మాదిగలకు కేటాయించాలని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా 11న నిర్వహించే ఆత్మీయ కలయికకు జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి సైతం మాదిగ నాయకులు, వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారని చెప్పారు. అందరూ ఆత్మీయంగా కలసి తమ జాతి ఐక్యతను చాటనున్నామన్నారు. అనంతరం ఆత్మీయ కలయిక కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో మాదిగ నాయకులు యార్లగడ్డ రవీంద్ర, మడికి శ్రీరాములు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు దంసూరి, సవరపు భైరవమూర్తి, నూతికుర్తి సత్యనారాయణ, ఆకుమర్తి మోహన్, మంద రామకృష్ణ, ఖండవల్లి ఏసయ్య, గంపల ప్రసాద్, పెదపూడి శ్రీను, నేదునూరి నతానియేలు, కొమరవీర రాఘవులు, కాప నాగరాజు పాల్గొన్నారు. -
213 అర్జీల స్వీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజలు క్షేత్ర స్థాయిలో అర్జీలు సమర్పించేందుకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కీర్తి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 213 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసంబంధిత సమస్యలు, రేషన్ సరఫరా, రోడ్లు, శానిటేషన్ వంటి అంశాలపై ప్రజలు ఎక్కువగా ఫిర్యాదులు చేశారనీ, ఆయా శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జ్యూట్‌బ్యాగ్‌ల తయారీలో ఉచిత శిక్షణఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక ఆల్కాట్‌తోటలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 10వ తేదీ నుంచి జ్యూట్‌బ్యాగ్‌ల తయారీలో ఉచిత శిక్షణ ఇస్తామని సంస్థ డైరెక్టర్ టి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలపరిమి తి 14రోజులు మాత్రమేనన్నారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పదవ తరగతిమార్కుల జాబితా జిరాక్సు 2కాపీలు, 4 ఫొటోలు తీసుకురావాలన్నా రు. శిక్షణ, వసతి, భోజనం పూర్తిగా ఉచితమన్నా రు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్, బ్యాంక్ రుణం ఇస్తారని ఆయన తెలిపారు. ఆసక్తి గల 19 నుంచి 45సంవత్సరాల వయస్సు కలిగిన మహిళలు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, రైల్వేస్టేషన్ రోడ్డు, ఆల్కాట్‌తోట, రాజమహేంద్రవరంలో సంప్రదించాలన్నారు. వివరాల కు 0883–2420242, 2428807, 9700765159 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. టిడ్కో ఇళ్ల రుణాలను కట్టలేం – మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా సామర్లకోట: 2024 ఎన్నికలలో చంద్రబాబునాయుడు ఇంటి లోన్లు రద్దు చేసి, టిడ్కో ఇళ్లు ఇస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, రుణాలు కట్టలేమని మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యకు వినతి పత్రం అందజేశారు. రూ.500 కట్టిన వారికి ఉచితంగా ఇచ్చిన విధంగానే రూ.50వేలు, రూ.లక్ష కట్టిన వారికి ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇవ్వాలని, రుణాలు కట్టలేమని నినాదాలు చేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టిడ్కో హౌస్ డబుల్ బెడ్ రూమ్ ప్లాటుకు(430 చదరపు అడుగులకి) రూ.లక్ష, 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్ రూముకు రూ.50వేలు కట్టామని తెలిపారు. రూ.500 కట్టిన వారికి బ్యాంకు లోన్ రద్దు చేశారని చెప్పారు. ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అవుతున్నా అనేక మందికి ప్లాట్లు స్వాధీనం చేయలేదన్నారు. అప్పు చేసి కట్టిన సొమ్ముకు వడ్డీలు, ఇంటికి అద్దెలు చెల్లించవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.500 చెల్లించిన వారికి ఉచితంగా ఇళ్లు ఇచ్చారని, తమకు ఇళ్లను స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు ఎ దుర్గలక్ష్మి, ఎ ఈశ్వరీ, డి లక్ష్మీ, కె రాజకుమారి, సత్యవతి నాయకత్వం వహించారు. -
మాతృభాష పరిరక్షణకు శ్రద్ధ తీసుకోవాలి
● మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ● ‘నన్నయ’లో ప్రారంభమైననేషనల్ వర్క్‌షాప్ రాజానగరం: మాతృభాష పరిరక్షణకు పౌరులతోపాటు ప్రభుత్వాలు కూడా శ్రద్ధ తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సూచించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ‘భారతీయ భాషలలో ఏకరూప శాసీ్త్రయ సాంకేతిక పదజాలం’ అనే అంశంపై రెండురోజులపాటు నిర్వహించే నేషనల్ వర్క్‌షాప్‌ని దీపారాధనతో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేడు దేశంలో అనేక ఉన్నత స్థానాలలో ఉన్న వారంతా ఒకప్పుడు మాతృభాషలో చదువుకున్న వారేననే విషయాన్ని మరువరాదన్నారు. అమ్మ అనే పిలుపులో ఉండే మాధుర్యం మమ్మీ, డాడీ పదాలలో ఉండవన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృభాషలలోనే చదువుకున్నారన్నారు. మాతృభాషను గౌరవిస్తూ, సోదర భాషలను అవసరాల మేరకు ఉపయోగించుకోవాలన్నారు. మాతృభాషలో మాట్లాడటం నామోషీగా భావించే విష సంస్కృతికి అంతా దూరంగా ఉండాలని హితవు పలికారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భాషలో ప్రామాణిక పదాల వినియోగం ఉండాలన్నారు. ఆత్రేయపురం పూతరేకు, తాపేశ్వరం కాజా వంటి వాటిని నేటీకి ఆ విధంగానే పిలుస్తున్నామని, వాటికి ఇంకా ఇంగ్లిష్ పేర్లు పెట్టకపోవడం ఆనందించదగిన పరిణామంగా పేర్కొన్నారు. భాష ఒక జీవనది వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ భాష అనేది ఒక జీవనది వంటిదని, తరాలతోపాటు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగినట్లుగా ముందుకు సాగుతుందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, భావజాలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సందర్భంగా కొంతమంది రచయితలు రచించిన మూడు పుస్తకాలను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. భారతీయ భాషా సమితి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (న్యూఢిల్లీ) సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్‌గా డాక్టర్ తలారి వాసు వ్యవహరించగా, తెలుగు – సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్డీ విల్సన్, తానా పూర్వాధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్, భారతీయ భాషా సమితి అకడమిక్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.గిరిధరరావు, డాక్టర్ కేవీఎన్డీ వరప్రసాద్, పాల్గొన్నారు. -
నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది
సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మఅల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): లక్క ఇంటిలో పంచపాండవులు కుంతితో సహా దహనమయ్యారన్న వార్త విని ధృతరాష్ట్రుడు బిగ్గరగా ఏడిచాడు. సహజంగా ఏడిచేవాడి ఏడుపు కన్నా, నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ వ్యాఖ్యానించారు. వేదవ్యాస భారతంపై ఆయన హిందూ సమాజంలో సోమవారం 12వ రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. ధృతరాష్ట్రుడు వారణాశికి పాండవులను పంపడానికి గల కారణాలను ఆయన వివరించారు. అర్జునుడు భీముని తోడుగా తీసుకుని రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ధర్మరాజు యశస్సు నింగినంటుతోంది, పాండు సుతుల విజయగాథలను ప్రజలు వేనోళ్లా ప్రశంసించడం ఆయనకు కంటగింపయింది. అసూయతో రగిలిపోయాడు. ఆ సందర్భంగా కణికుడు అనే మంత్రిని పిలిపించి, తాను యుధిష్టరునితో సంధి చేసుకోవాలా, సంగ్రామానికి సిద్ధపడాలా అని ప్రశ్నిస్తాడు. కణికుడు రాజనీతిని ఉపదేశిస్తాడు–శత్రువును ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించరాదు. తన కన్నా బలవంతుడయితే, అతనిని కానుకలతో మంచి చేసుకోవాలి, వినయశీలుడిలా శత్రువు వద్ద నటించాలి, అదను చూసి దెబ్బతీయాలి. శత్రువు తన కన్నా బలహీనుడయి శరణుజొచ్చినా, ఉపేక్షించరాదని కణికుడు చెబుతాడు. దుర్యోధనాదుల ఆలోచనలకు ఆమోదం తెలిపి, పాండవులను వారణావత నగరానికి పంపుతాడని సామవేదం అన్నారు. కౌరవుల కుటిల నీతిని పసిగట్టిన విదురుడు సంకేత పదాలతో ధర్మరాజును అప్రమత్తం చేస్తాడు. కార్చిచ్చు అడవిని దహనం చేసినా, కలుగులోని ఎలుకకు అపాయం ఉండదని, రాత్రివేళ సైతం పాండుసుతులు అప్రమత్తులయి, పరిసరాలను గమనించాలని హితవు చెబుతాడు. సుయోధనుడు పురోచనుడు అనే విశ్వాసపాత్రుడిని పిలిచి, లక్కయింటిని నిర్మించమని, అదను చూసి నిప్పు పెట్టమని ఆదేశిస్తాడు. అయితే పురోచనుడి ఆలోచనను పసిగట్టిన పాండవులు ఒక రాత్రివేళ లక్క ఇంటికి తామే నిప్పు అంటించి, కలుగు మార్గం ద్వారా అడవుల్లోకి వెడతారని సామవేదం వివరించారు. ‘దుర్యోధనుడు’, ‘దుశ్శాసనుడు’ వంటి చెడు పేర్లను వ్యాసుడు ఎంత పక్షపాతి అయినా, ఎలా పెట్టాడని కొందరు అడుగుతారు. ఆ పదాలకు సరి అయిన అర్థాలను తెలుసుకోవాలి, దుర్భేద్యము అన్న పదం లాగే, దుర్యోధనుడు అంటే ఓడించడానికి వీలు పడని పరాక్రమం కలవాడని, దుశ్శాసనుడు అంటే శాసించడానికి వీలు పడని వాడనీ అర్థమని సామవేదం అన్నారు విదురుడు ఇంగితజ్ఞుడు, లాక్షాగృహ దహనంలో పాండుసుతులు అగ్నిపాలు కాకుండా విలువైన సూచనలు ఇవ్వడమే కాకుండా, సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక విశ్వాసపాత్రుడిని పంపాడని ఆయన అన్నారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ నారాయణరావు సభకు స్వాగతం పలికారు. -
ఈ విధులు.. సారా టార్చర్
కాకినాడ క్రైం: పొరుగు జిల్లాల నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్న ఎకై ్సజ్ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భార్యాబిడ్డలను, కుటుంబాన్ని వదిలి.. ఊరు కాని ఊరు వచ్చి.. 15 రోజుల చొప్పున ఇక్కడే ఉంటూ వారు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల పక్కనే కడుపాకలి తీర్చుకుంటూ.. స్నేహితుల గదుల్లోనే తల దాచుకుంటూ సర్దుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు తమపై పెత్తనం చేయడమే తప్ప కనీస వసతులైనా కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు. కనీసం భోజనమైనా పెట్టకపోవడం.. నిలువ నీడయినా కల్పించకపోవడం.. డ్యూటీ అడ్వాన్సులు సైతం చెల్లించకపోవడంతో రెండు నెలలుగా టార్చర్ అనుభవిస్తున్నామని వాపోతున్నారు. 40 మంది సిబ్బంది కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో సారా తయారీ, క్రయ విక్రయాలు మితిమీరి సాగుతున్నాయంటూ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ కొద్ది రోజుల క్రితం నివేదిక అందించింది. దీంతో, ఈ రెండు జిల్లాల్లో సారా తయారీ, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పొరుగు జిల్లాల నుంచి సమర్ధులైన ఎకై ్సజ్ సిబ్బందిని కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో నియమించాలని రాష్ట్ర ఎకై ్సజ్, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 40 మంది సిబ్బందిని కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో నియమించారు. వీరిలో ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వీరు ప్రతి 15 రోజులకో బ్యాచ్ చొప్పున రెండు జిల్లాల్లోనూ పని చేస్తున్నారు. సారా తయారీ, రవాణా, అమ్మకాలపై సమాచారం అందిన వెంటనే అధికారుల ఆదేశాల మేరకు వీరు రంగంలోకి దిగుతున్నారు. పలుచోట్ల సారా తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. సారా తయారీకి వినియోగించే బెల్లపు ఊటను, సారా డెన్లను ధ్వంసం చేయడం, తయారీ, రవాణా, అమ్మకందార్లకు అరదండాలు బిగించడం వంటి విధులు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆదేశాలు బుట్టదాఖలు! ఇదిలా ఉండగా రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్‌బాబు మూడు నెలల క్రితం రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్న అడిషనల్, జాయింట్, డెప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో నియమించిన 40 మంది సిబ్బందికి నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయాలని ఆ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. తద్వారా వారి విధి నిర్వహణ, వసతి, రోజువారీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలూ లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, ఏకంగా కమిషనర్ ఆదేశాలే బుట్టదాఖలైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆదేశాల అమలును ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నెలలో 15 రోజుల పాటు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉంటూ పడరాని పాట్లు పడుతున్నా అధికారులు కనీసంగా కూడా స్పందించడం లేదని ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది వాపోతున్నారు. వసతి సంగతి దేవుడెరుగు.. కనీసం డ్యూటీ అడ్వాన్సులు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. అంతే కాకుండా, ఈ రెండు జిల్లాల్లోనూ ఆ శాఖ ఉన్నతాధికారులు అజమాయిషీ ధోరణితో వ్యవహరిస్తూ తమకు ప్రత్యక్ష నరకం చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకూ డ్యూటీ ప్రయోజనాలేవీ ఇవ్వకపోగా, 15 రోజులు గడిచిన తర్వాత రిలీవ్ చేయాల్సి ఉన్నా, ఆ ఊసే లేకుండా బలవంతంగా విధుల్లో కొనసాగిస్తున్నారని అంటున్నారు. దీనిపై తాము అడుగుతున్నా స్పందించడం లేదని, ఎప్పటికో స్పందించినా తాము చెప్పేంత వరకూ రిలీవ్ చెయ్యొద్దంటూ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నారని వాపోతున్నారు. ఆ డబ్బులేమయ్యాయో! క్షేత్ర స్థాయి సిబ్బందికి నయా పైసా కూడా ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్న అధికారులు వారికి నిబంధనల ప్రకారం జరగాల్సిన చెల్లింపులకు చెల్లు చీటీ రాసేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో మద్యం దుకాణాల కేటాయింపులు జరిగాయి. దీనికోసం వేలం పాటలు నిర్వహించారు. ప్రతి దరఖాస్తుకు రూ.5 లక్షల చొప్పున ఎకై ్సజ్ శాఖ నాన్ రిఫండబుల్ రుసుం వసూలు చేసింది. ఇందులో దరఖాస్తుకు రూ.10 వేల చొప్పున ఆయా జిల్లాల ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారుల ఆధ్వర్యాన ఎకై ్సజ్ ఫండ్ పోగేశారు. సారా నివారణకు అమలు చేస్తున్న నవోదయ 2.0 కార్యక్రమం కోసం ప్రిన్సిపాల్ కమిషనర్ చొరవతో ఈ ప్రత్యేక ఫండ్ ఏర్పాటైంది. ఈ నిధులను సారా నివారణకు చేపట్టే ఏ చర్యకై నా వినియోగించవచ్చని ఆదేశిస్తూ, వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర కమిషనర్‌కు అప్పగించారు. అయితే, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఈ నిధులు ఏమయ్యాయోనన్న ఆ శాఖలో చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నిధులే కనుక ఉండి ఉంటే తమకు డ్యూటీ అడ్వాన్సులే ఇచ్చి ఉండేవారు కదా అనే అభిప్రాయం సిబ్బందిలో వ్యక్తమవుతోంది. నిధుల లెక్కలపై ఉన్నతాధికారులు ఆరా తీసి పక్కదారి పడితే చర్యలు తీసుకోవాలని, ఖాతాలోనే ఉంటే తమకు చెల్లింపులు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు. ఫ సారా నియంత్రణకు 4 జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది ఫ డెప్యూటేషన్‌పై డ్యూటీలు వేసిన ప్రభుత్వం ఫ కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో విధులు ఫ ఆహారం, నిలువ నీడకు కానరాని ఏర్పాట్లు ఫ డ్యూటీ అడ్వాన్సులూ లేక ఇక్కట్లు ఫ 2 నెలలుగా ప్రత్యక్ష నరకం చూస్తున్నామని ఆవేదన -
హింసా ప్రవృత్తి ఉన్నవారికి అస్త్రవిద్య నేర్పరాదు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): హింసా ప్రవృత్తి ఉన్నవారికి అస్త్రవిద్య నేర్పకూడదని, అది ప్రపంచానికి ప్రమాద హేతువుగా మారవచ్చని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాసభారత ప్రవచనాన్ని ఆదివారం ఆయన కొనసాగించారు. ‘ద్రోణుడు పక్షపాతి కాడు, ధర్మజ్ఞుడు. అస్త్రాలు మంత్రస్వరూపాలు. అవి నేర్చుకోవడానికి కొన్ని వ్రతాలుంటాయి. నేర్చుకోవడానికి ఉపనయనాది సంస్కారాలు ఉండాలి’ అని చెప్పారు. ఏకలవ్యుడు నిషాదుడని, పశుపక్ష్యాదులను వేటాడటమే వృత్తిగా కలవాడని చెప్పారు. తనను చూసి మొరిగిన కుక్కపై ఏడు బాణాలు ప్రయోగించి, అది మూతి తెరవకుండా చేశాడని, ఉత్తముడు తను నేర్చుకున్న విద్యను శునకాదులపై ప్రయోగించరాదని చెప్పారు. రాజోచితమైన విద్యను బోయవానికి నేర్పడానికి ద్రోణాచార్యుడు తిరస్కరించడంలో కులవివక్ష లేదని, ఎవరో ఒకరు ప్రభుత్వ సంస్థకు వచ్చి తనకు క్షిపణుల ప్రయోగం, అణువిద్య నేర్పమంటే నేర్పుతారా? అని సామవేదం ప్రశ్నించారు. మంత్రం సిద్ధించిన తరువాతనే అస్త్రవిద్య పని చేస్తుందన్నారు. గురుముఖతః నేర్చుకున్న విద్య మాత్రమే ఫలప్రదమవుతుందని, దొంగచాటుగా నేర్చుకుంటే అది బ్రహ్మస్తేయమనే పాపంగా పరిణమిస్తుందని చెప్పారు. కురుపాండవులకు అస్త్రవిద్య నేర్పడానికి స్థాపించిన విద్యాలయం నేటి డెహ్రాడూన్ ప్రాంతంలో ఉన్నట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయన్నారు. కానీ, విదేశీయులు ఈ గడ్డ మీద ముందుగా పేర్లు మార్చారని చెప్పారు. మార్చినవి పేర్లే కదా అని కొందరు ఉదారవాదులు అంటున్నారని, అయితే, వాటినే ఎందుకు మార్చారంటూ వారిని మనం ప్రశ్నించాలని అన్నారు. ధనం కోసమే ఒక సాధనంగా విద్యను భావించడంతో క్షీణదశ ప్రారంభమైందని, కానీ, విద్య కోసమే విద్య అని భావించినది మహర్షుల కాలమని చెప్పారు. విద్యార్థుల్లో స్పర్థలుండాలే తప్ప ద్వేషభావం తగదని హితవు పలికారు. భారతం చదవడం ఒక యోగమని, తెలుసుకోవడం ఒక మహాయోగమని సామవేదం అన్నారు. -
టార్గెట్ ఫినిష్.. ఇక కొనేదే.. లే
సీతానగరం: రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామని మంత్రులు గొప్పగా ప్రకటిస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సీతానగరం మండలం వంగలపూడి రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే) వద్ద రైతులకు ఎదురైన అనుభవమే దీనికి తాజా ఉదాహరణ. పలువురు రైతులు ఆర్‌ఎస్‌కేకు వెళ్లి తమ వద్ద అమ్మకానికి ధాన్యం సిద్ధంగా ఉందని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ (వీఏఏ) దృష్టికి తీసుకెళ్లారు. అయితే, తమకిచ్చిన టార్గెట్ అయిపోయిందని, ఇకపై ధాన్యం కొనుగోలు చేయలేమని వీఏఏ బదులిచ్చారు. ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్ వచ్చేంత వరకూ ఇకపై ధాన్యం కొనుగోలు చేయడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో, రైతులు హతాశులయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించి, మద్దతు ధర వస్తుందనే ఉద్దేశంతో ధాన్యం ఆరబెట్టి సిద్ధం చేశామని, తీరా అమ్ముదామని వస్తే టార్గెట్ అయిపోయిందంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందిన కాడికి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, పెట్టుబడి పెట్టామని, వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుకు ప్రైవేటు వ్యాపారులు ముందుకు రావడం లేదని చెప్పారు. ఆరబెట్టిన ధాన్యం అలాగే ఉందని, టార్పాలిన్లు కప్పి, జాగ్రత్త చేసి ఉంచామని తెలిపారు. మండలానికి 15,836 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఇచ్చారని, ఇప్పటికే 14,304 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని మండల వ్యసాయాధికారి ఎ.గౌరీదేవి చెప్పారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ద్వారా కొనుగోలు టార్గెట్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు తాను కూడా మరో 11,660 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లిఖిత పూర్వకంగా అనుమతి కోరామని చెప్పారు. రెండు రోజుల్లో మండలానికి కొత్త టార్గెట్ వస్తుందని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. -
రబీకి కన్నీరేనా..!
అందుబాటులో ఉన్న జలాలు (టీఎంసీలు) సీలేరు జలాశయం 43.91 పోలవరం ప్రాజెక్టు 20.00 గోదావరి సహజ జలాలు 9.45 మొత్తం 73.36 రబీకి అవసరమైన నీరు 93.26 కొరత 19.90 నీటి ఆవశ్యకత ఇలా.. నెల రోజులు నీటి విడుదల మొత్తం (క్యూసెక్కుల్లో) (టీఎంసీలు) డిసెంబర్ 31 6,000 16.07 జనవరి 31 9,000 24.10 ఫిబ్రవరి 28 9,000 21.77 మార్చి 31 9,000 24.10 తాగునీటికి 7.22 సాక్షి, రాజమహేంద్రవరం: రబీ సాగుకు నీటి కొరత తప్పదా.. గోదావరిలో నీటి లభ్యత తగ్గుముఖం పట్ట డం ఆందోళన కలిగిస్తోందా.. అంటే అవుననే సమా ధానం వస్తోంది సాగునీటి నిపుణుల నుంచి. ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశలో ఉంది. రబీ సాగు దిశగా అడుగులు పడుతున్నాయి. నారుమళ్లు సిద్ధం చేసుకునే పనిలో రైతులు తలమునకలవుతున్నారు. ఈ తరుణంలో సాగునీరు సక్రమంగా అందుతుందా లేదా అనే మీమాంస గోదావరి డెల్టా రైతుల్లో నెలకొంది. ఖరీఫ్ సాగులో తీవ్రంగా నష్టపోయామని, రబీ అయినా సవ్యంగా సాగుతుందో లేదోనని సందేహపడుతున్నారు. పొదుపుపై ఫోకస్ ఎద్దడి నుంచి రబీ సాగు గట్టెక్కేందుకు ప్రతి ఒక్కరూ నీటి పొదుపు పాటించాలని అధికారులు కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో మురుగు కాలువలకు అడ్డుకట్టలు వేయాలని, ఆయిల్ ఇంజిన్ల ద్వారా శివారు ప్రాంతాలకు సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. కోనసీమ జిల్లాలోని సెంట్రల్ డెల్టాలో సాగునీటి కష్టాల నివారణకు రూ.2.5 కోట్లతో ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. అలాగే, పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు జిల్లా నుంచి రూ.56,199, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. క్షేత్ర స్థాయిలో నీటి పొదుపు చర్యల పర్యవేక్షణకు గోదావరి మూడు డెల్టాల్లో 610 మంది తాత్కాలిక లస్కర్లను నియమించారు. రబీకి పోల‘వరం’ పోలవరం ప్రాజెక్టుపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ గోదావరి డెల్టా రైతులకు వరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు గేట్లను గత ప్రభుత్వ హయాంలోనే బిగించారు. ఫలితంగా పోలవరం నుంచి 20 టీఎంసీల నీరు రబీ సాగుకు అందుబాటులోకి వస్తోంది. అంతే కాకుండా గత ప్రభుత్వ హయాంలో నీటి నిర్వహణ, పొదుపు చర్యలు పకడ్బందీగా జరగడంతో సాగునీటి కొరత తలెత్తిన దాఖలాలే లేవు. రైతులు సైతం ఆనందంగా సాగుకు సమాయత్తమయ్యేవారు. చివరి ఎకరా వరకూ నీరివ్వాలి సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పక్కాగా అమలు చేయాలి. రైతుకు సహాయం చేయడంలో ఎలాంటి వెనుకడుగూ వేయకూడదు. రబీ సాగునీటి చర్యలు ముందస్తుగా చేపట్టాలి. ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేయాలి. డ్రెయిన్లపై అడ్డుకట్టలు వేసే పనులు వేగవంతం చేయాలి. లస్కర్లు 24 గంటలూ కాలువల మీద ఉండేలా చూసుకోవాలి. ఎగువన పోలవరం ప్రాజెక్టుకు గేట్లు బిగించే కార్యక్రమం గత ప్రభుత్వంలో పూర్తవడంతో ప్రస్తుతం పోలవరం నుంచి నీరు వాడుకునే వెసులుబాటు కలుగుతోంది. నీటి కొరతకు ఆస్కారం లేకుండా సీలేరు ద్వారా అవసరమైన నీటిని సేకరించి, చివరి ఆయకట్టు వరకూ చేరేలా చర్యలు తీసుకోవాలి. – విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్, రిటైర్డ్ ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్, ధవళేశ్వరం ఫ గోదావరిలో తగ్గిన నీటి లభ్యత ఫ ఈ సీజన్లో 93.26 టీఎంసీల ఆవశ్యకత ఫ అందుబాటులో 73.36 టీఎంసీలు ఫ కొరత 19.90 టీఎంసీలు ఫ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 8.96 లక్షల ఎకరాల ఆయకట్టు సీలేరు పైనే ఆశలు ఏటా గోదావరి డెల్టాలో రబీకి సీలేరు జలాలే కల్పతరువుగా మారుతున్నాయి. ఈసారి సైతం అదే పరిస్థితి తలెత్తుతోంది. సీలేరు జలాశయంలో సుమారు 70 టీఎంసీల నీరు అందుబాటులో ఉండవచ్చని అంచనా వేశారు. దీని నుంచి ప్రతి రోజూ 4,200 క్యూసెక్కుల సాగునీరు అందుతుందని జల వనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రబీ సాగు దృష్ట్యా ఇప్పటికే 43.91 టీఎంసీల నీటిని గోదావరి డెల్టాకు విడుదల చేసేందుకు సీలేరు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇవి కాకుండా నీటి కొరతను ఎదుర్కొనేందుకు మరో 19.90 టీఎంసీలు సీలేరు ద్వారా తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే, ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రానికి నీటిని అందించే డొంకరాయి పవర్ కెనాల్‌కు రెండు నెలల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ ప్రకటించారు. దీంతో, రానున్న రెండు నెలలూ సీలేరు నుంచి అనుకున్న స్థాయిలో నీరు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కొరత ఉన్న 19.90 టీఎంసీల జలాలు ఎలా అందుబాటులోకి వస్తాయనే మీమాంస నెలకొంది. నీటి లభ్యతపై ఆందోళన గోదావరి డెల్టా పరిధిలోని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8,96,507 లక్షల ఎకరాలకు రబీ సాగునీరు అందించాలని అధికారులు నిర్ధారించారు. మొత్తం 93.26 టీఎంసీల నీరు అవసరమని లెక్క తేల్చగా.. ఇందులో సాగునీరు 86.04 టీఎంసీలు, పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు 7.22 టీఎంసీలు అవసరమని చెబుతున్నారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ నెలలోనే గోదావరిలో నీరు తగ్గుముఖం పట్టింది. అక్కడక్కడ ముఖ్యంగా ధవళేశ్వరం ఆనకట్ట ఎగువన ఇప్పటి నుంచే భారీ ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. ఆనకట్టకు కేవలం 500 మీటర్ల దూరంలోనే నదిలో పలుచోట్ల రెండు మూడడుగుల లోతున మాత్రమే నీరుంటోంది. రోడ్డు కం రైల్వే వంతెన వద్ద నీరు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో, రబీ సాగుకు చాలినంత నీటి లభ్యత ఉండదేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఇప్పుడు ఇండిగో.. రేపు వైద్య కళాశాలలు
రాజమహేంద్రవరం రూరల్: విమానాల రద్దు ద్వారా ప్రయాణికులను ఎన్నో కష్టాల పాలు చేసిన ఇండిగో సంస్థ మాదిరిగానే.. వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తలెత్తనున్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేటు గుత్తాధిపత్యం వస్తే ప్రభుత్వ నిర్ణయాలను కూడా వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితిని ఇండిగో విషయంలో చూస్తున్నామన్నారు. ఆయనేమన్నారంటే.. ఫ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలను ఇండిగో సంస్థ అమలు చేయకపోవడంతో ప్రయాణికులు ఐదు రోజులుగా ఇబ్బందులు పడ్డారు. చివరకు ప్రభుత్వమే వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం లొంగిపోవడమే దీనికి ప్రధాన కారణంగా ప్రజలు భావిస్తున్నారు. ఫ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖను రాష్ట్ర మంత్రి నిర్వహిస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి మీడియా చర్చల్లో చెప్పడం విడ్డూరం. ఫ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుని ప్రైవేటీకరిస్తే, ఆ ప్రైవేటు సంస్థలే ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితులు ఎదురవుతున్నాయనే విషయాన్ని ఇండిగో ఉదంతంతో అందరూ గమనించాలి. ఫ ఇది చూసిన తరువాతైనా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తక్షణం నిలుపు చేయాల్సిన అవసరముంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం అన్నింటినీ అమ్మేయాలనుకోవడం దారుణం. ఫ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రతిపక్షాలపై నిందలు వేసి కాలం గడిపేద్దామనుకోవడం చెల్లదనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ఫ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకొచ్చి 18 నెలలు గడుస్తోంది. రోజూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిందించడమే పరమావధిగా ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. పత్రికలు, టీవీల్లో పదేపదే అబద్ధాలు చెప్పి, నమ్మించే ప్రయత్నం చేస్తూ, జగన్‌పై విషయం చిమ్ముతూ, ప్రజల్లో చెడు అభిప్రాయం కల్పించాలన్న దురుద్దేశమే కనిపిస్తోంది. ఫ చంద్రబాబు అబద్ధాలను ప్రజల ముందుంచేందుకు తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. ఫ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే భవిష్యత్తులో ఇదే పరిస్థితి అందరికీ ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీనిని ఇప్పుడే నివారించాలి. ప్రభుత్వమే అన్నీ చేస్తూండగా.. ప్రై‘వేటు’ ఎందుకు? వైద్య పరంగా ప్రజలు దోపిడీకి గురి కాకుండా ఉండాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలి. స్థలం ఇచ్చి, భవనం కట్టి, ఉద్యోగులకు జీతాలివ్వడం సహా అన్నీ ప్రభుత్వమే చేస్తూంటే ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రజలు అధికారం ఇచ్చినది ఇష్టారీతిన పాలన చేయడానికి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రజలను, జగన్‌ను విడదీయాలనుకోవడం చంద్రబాబు అండ్ కోది భ్రమే అవుతుంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, మద్యం, తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబు చేసింది తప్పుడు ప్రచారమేననే విషయం వెలుగులోకొస్తోంది. ఫ ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు ఫ విమానాల రద్దే దీనికి నిదర్శనం ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు -
సర్వం బుగ్గి
ఫ నాలుగు పూరిళ్లు దగ్ధం ఫ రూ.20 లక్షల ఆస్తి నష్టం ప్రత్తిపాడు రూరల్: పెద్దిపాలెం గ్రామంలోని నూకాలమ్మ తల్లి గుడి వెనుక శనివారం తెల్లవారుజామున మూడు ఇళ్లు పూర్తిగా, ఒక ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రాళ్ల అప్పారావు ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించేలోపే ఆ మంటలు రాళ్ల రాజు, రాళ్ల ఆనందరావు, నైనపు గోవింద్, అప్పలనర్సమ్మ ఇళ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లు పూర్తిగా, ఒక ఇల్లు పాక్షికంగా కాలిపోయాయి. ఇళ్లలో విలువైన గృహోపకరణలు, వంట సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. నిరుపేద కుటుంబాలు కావడంతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా ఇళ్లపై నుంచి వెళ్తున్న సర్వీస్ వైర్లను తొలగించాలని విద్యుత్ డీఈ, ఏఈలను కోరారు. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆ కుటుంబాలకు రూ.ఐదు వేల చొప్పున నగదు, బియ్యాన్ని అందజేశారు. ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బెహరా దొరబాబు, పార్టీ మండల కన్వీనర్ రామిశెట్టి బులిరామకృష్ణ, వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీను, నాయకులు మాకా చంటిబాబు, విత్తనాల నాగేశ్వరరావు, దేవర రాధాకృష్ణ, లొండ బాబు, దేవ లక్ష్మణ్, ఏనుగు జాన్ తదితరులు ఉన్నారు. -
ఇక్కట్ల సాగరం..
ఫ కానరాని పర్యాటక అభివృద్ధి ఫ బీచ్‌లో మౌలిక వసతులు కరవు ఫ సేద తీరేందుకు షెల్టర్లు లేక ఇబ్బంది సఖినేటిపల్లి: ఎగసిపడే అలలు.. కనువిందు చేసే ఇసుక తిన్నెలు.. మరోపక్క ఆధ్యాత్మిక పరవళ్లు.. ప్రకృతి సోయగం నడుమ సాగర తీరాన ఆ హాయి వర్ణనాతీతం.. అలాంటి చోట పర్యాటక అభివృద్ధి కానరాకుంది.. అంతర్వేది బీచ్‌కు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు, భక్తులు వస్తుంటాయి. ఇక్కడకు జిల్లా నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తాయి. అలాంటి చోట సౌకర్యాల కల్పనకు పర్యాటక శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడకు వేలాదిగా భక్తులు వస్తుంటారు. స్వామివారి కల్యాణోత్సవాల సమయంలో లక్షల్లో భక్తజనం వస్తుంది. ఈ ఆలయానికి అతి సమీపంలో ఈ బీచ్ ఉంటోంది. అందుకే ఆధ్యాత్మికంగా, ఆహ్లాదం కోసం ఇక్కడి వచ్చేవారు వేలాదిగా ఉంటారు. ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్వేది బీచ్‌పై పర్యాటక శాఖ ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. పర్వదినాల్లో లక్షల్లో, సాధారణ రోజుల్లో వేలల్లో వచ్చే సందర్శకులకు తగ్గట్టు సౌకర్యాలు లేక ఇబ్బంది ఎదురవుతోంది. గూడు పోయి.. శిథిలాలు మిగిలాయి అంతర్వేది బీచ్‌లో గతంలో సరుగుడు తోటలకు చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన హట్లు అధికారుల ఆలనా పాలన లేక పూర్తిగా కనుమరుగయ్యాయి. తీరానికి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటక శాఖ ద్వారా విడుదలైన నిధులతో 2018లో ఈ పనులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా బీచ్‌లో దాత పెన్మెత్స సత్యనారాయణరాజు ఉచితంగా ఇచ్చిన ఇరవై సెంట్ల స్థలంలో పర్యాటక నిధులతో అప్పట్లో జమ్ముగడ్డి, తాటిపట్టెలతో కూడిన హట్స్, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హట్స్ చివికిపోయి ఆ ప్రాంతంలో తాటిపట్టెలు, దూలాలు మిగిలాయి. ఇసుకపైనే కూర్చుని.. కార్తిక మాసం, ఇతర పర్వదినాల్లో బీచ్‌లో సరదాగా గడపడానికి, వెంట తెచ్చుకునే భోజన పదార్థాలు తినడానికి వసతులు లేక పర్యాటకులు పడుతున్న వెతలు వర్ణనాతీతం. బీచ్‌లో పిల్లాపాపలతో సేద తీరేందుకు షెల్టర్లు లేక, తాగడానికి గుక్కెడు నీరు లేక వెనుతిరిగే పరిస్థితి నెలకొంది. ఇసుకపైనే కూర్చొని, అరచేతిలోనే ఆకులు పెట్టుకుని భోజనంచేసే పరిస్థితులు ఉన్నాయి. ● కనీసం నీడ లేక.. అంతర్వేది బీచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేవు. పిల్లాపాపలతో వస్తున్న వారు సేద తీరేందుకు నీడ లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా షెల్టర్లు, తాగునీటి వసతి కల్పించాలి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అంతర్వేదికి ప్రాధాన్యం ఉంది. దానిని కాపాడే చర్యలు అవసరం. –రావి దుర్గ ఆలేంద్రమణి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, అంతర్వేది అద్దె గదులు కష్టమే.. సుదూర ప్రాంతాల నుంచి అంతర్వేదికి వచ్చి ఒకటి, రెండు రోజులు గడుపుదామనుకునే వారికి వసతి గదులు అద్దెకు తీసుకోవడం కష్టమే. దేవస్థానానికి తగిన సంఖ్యలో వసతి గదులు లేకపోవడం, క్షేత్రంలో ప్రైవేట్ వసతి గదులు ఆశ్రయించడం ఆర్థికంగా భారంగా మారుతోంది. ప్రైవేటు వ్యక్తులు గది ఒక్కంటికి రోజుకు సాధారణ రోజుల్లో రూ.1,500, పర్వదినాల్లో రూ.2 వేలు డిమాండ్ చేస్తుండడం వారికి పెనుభారంగా పరిణమిస్తోంది. పర్యాటక శాఖ ఈ ఇబ్బందులు తీర్చేందుకు తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. సందర్శనీయ స్థలాలు అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం అనంతరం భక్తులు, పర్యాటకులకు ప్రముఖమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. అశ్వరూడాంబికా, వశిష్ట ఆశ్రమం, సాగర సంగమం, లైట్‌హౌస్ సమీపంలో మడ అడవులు ఉన్నాయి. అయితే వీటి సందర్శనకు సరైన సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. బీచ్, సాగర సంగమం వద్దకు అనేమంది వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ప్రధానంగా బీచ్‌లో షెల్టర్లు, మౌలిక వసతులు లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. ఏటా కార్తిక, మాఘ మాసాల్లో సుమారు 5 లక్షల వరకూ, సాధారణ రోజుల్లో 15 వేల మంది బీచ్‌ను సందర్శిస్తారు. వెనుతిరుగుతున్న పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి ఉత్సాహంగా బీచ్‌కు సందర్శకులు వస్తున్నారు. ఇక్కడి పరిస్థితి చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమంది అయితే బాబోయ్ అంటూ వెనుతిరుగుతున్నారు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు తినేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అంతర్వేది బీచ్‌లో సౌకర్యాలు మెరుగుపర్చితే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. –ఉండపల్లి వరలక్ష్మి, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు, కేశవదాసుపాలెం -
● బాక్స్ బద్దలు..
అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులు తమకు కలిగే ఇబ్బందులపై అధికారులకు ఫిర్యాదు చేయడానికి పెట్టిన ఫిర్యాదుల పెట్టె ఇది. దీనిని పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేశారు. ఈ పెట్టె తలుపు విరిగిపోయి లోపలకు పోయింది. ఇందులో వేసిన ఫిర్యాదులు, సలహాలు, సూచనల పేపర్లు కింద పడిపోతున్నాయి. విశేషమేమిటంటే దీనికో తాళం వేశారు. స్పందన దేవుడెరుగు.. ముందు ఫిర్యాదు పెట్టైనెనా మార్చండని భక్తులు అంటున్నారు. –అన్నవరం ● సంగోతి తెలుసా! కడియం హైస్కూల్ సమీపంలో గోతులతో జనం నరకం చూస్తున్నారు. ఇటుగా వెళ్తున్న ఓ యువకుడు రోడ్డుపై ఉన్న గోతులను పూడ్చేందుకు తన ఇంటి వద్ద నుంచి కాంక్రీట్‌ను మోటారు సైకిల్‌పై తీసుకువచ్చి భారీ గోతులు పూడ్చడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. సదరు యువకుడిపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురిసింది. అదే సమయంలో కడియం వయా వీరవరం నుంచి దుళ్ల రోడ్డులో ప్రయాణం నరకంలా మారిందని ప్రభుత్వాన్ని జనం విమర్శిస్తున్నాయి. –కడియం ● అపురూపం.. ఆ నాణెం ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా విడుదలైన రూ.150 వెండి నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముంబయి టంకశాల ఈ వెండి నాణేన్ని విడుదల చేసింది. నాణెంపై ఓ వైపు ముఖ విలువ, రెండో వైపు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రాన్ని ముద్రించారు. –అమలాపురం టౌన్ -
అక్రమంగా తరలిస్తున్న డీజిల్ స్వాధీనం
తాళ్లరేవు: పుదుచ్చేరి ప్రాంతం యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 2,700 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలను సీజ్ చేసినట్లు కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జాతీయ రహదారి 216లోని జైభీమ్‌పేట వద్ద నిర్వహించిన తనిఖీల్లో 700 లీటర్ల డీజిల్‌ను తరలిస్తున్న గూడ్స్ ఆటోను సీజ్‌చేసి, కాకినాడకు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఓ వ్యాన్‌లో 2 వేల లీటర్ల డీజిల్‌ను తరలిస్తున్న యానాంకు చెందిన వ్యక్తిపై మరో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వాడవాడల నుంచి వాడపల్లికి..ఫ అన్ని దారులూ వెంకన్న క్షేత్రానికే.. ఫ భక్తజనంతో పోటెత్తిన కోనసీమ తిరుమల కొత్తపేట: కోనసీమ తిరుమలగా, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం శనివారం కిటకిటలాడింది. ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వాడవాడల నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. శుక్రవారం రాత్రి నుంచే భక్తులు కాలినడకన బయలుదేరారు. అన్ని దారులూ వాడపల్లి క్షేత్రానికే అన్నట్టు ఒకపక్క రావులపాలెం మీదుగా, మరోపక్క ధవళేశ్వరం, విజ్జేశ్వరం బ్యారేజ్‌ల మీదుగా వాహనాలు తరలివచ్చాయి. ఏడు శనివారాలు – ఏడు ప్రదక్షిణల నోము ఆచరిస్తున్న వారితో ఆ క్షేత్రం నిండిపోయింది. గోవింద నామస్మరణ మార్మోగింది. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. పూర్ణాలంకరణలోని స్వామివారిని దర్శించుకుని పులకించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఏర్పాట్లను ఈఓ చక్రధరరావు పర్యవేక్షించారు. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న మాఢ వీధుల్లో భక్తులతో కలసిపోయి వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఉచిత వైద్య శిబిరాలు, తలనీలాలు సమర్పించే చోట, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులను చేరుస్తున్న వాహనాల సేవలను, అన్నప్రసాదం తయారు శాలను పరిశీలించారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము పోలీస్ సిబ్బందితో పాటు, ప్రత్యేక ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా క్రమబద్ధీకరించారు. -
అదుపుతప్పిన వ్యాన్
రాంగ్ రూట్లో వెళ్లి లారీని ఢీకొన్న వైనం గండేపల్లి: వాహన రాకపోకలతో రద్దీగా ఉండే హైవేపై ఐషర్ మినీ వ్యాన్ హడలెత్తించింది. ఒక్కసారిగా రాంగ్ రూట్లోకి వేగంగా వెళ్లి ప్రమాదానికి కారణమైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఐషర్ వ్యాన్ గండేపల్లికి వచ్చేసరికి డివైడర్ వద్ద రాంగ్ రూట్లోకి మారిపోయి వేగంగా ప్రయాణిస్తూ లారీని ఢీకొంది. ఈ సంఘటనలో లారీ, ఐషర్ క్యాబిన్లు ఇరుక్కుపోవడంతో హైవే క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఐషర్ వ్యాన్ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ఎండీ హపీజ్, క్లీనర్ నిమైలను బయటకు తీయించి చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌కు బ్రేక్‌లు ఫెయిల్ అయినట్టు డ్రైవర్ చెబుతుండగా, డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేశారు. ముందుగా ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ లారీని రోడ్డుపై నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. రేపు బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక అంబాజీపేట: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్–17 బాలుర క్రికెట్ జట్టును అంబాజీపేట జెడ్పీ హైస్కూల్లో ఆదివారం ఎంపిక చేయనున్నట్లు డీఈఓ షేక్ సలీం బాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రీడలో పాల్గొనే విద్యార్థులు ఉదయం 9 గంటల్లోపు స్థానిక హైస్కూల్‌కు చేరుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఎస్జీఎఫ్ కార్యదర్శులు కొండేపూడి ఈశ్వరరావు– 93469 20718, ఎఎస్‌ఎస్ రమాదేవి 94400 94984 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
సహకార ఉద్యోగుల ఉద్యమ బాట
8 డిమాండ్ల సాధనకు ఆందోళనలు అమలాపురం టౌన్: జిల్లాలోని సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐక్య వేదిక పేరిట రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జేఏసీ) ద్వారా శనివారం నుంచి ఈ నెల, వచ్చే జనవరి నెలల్లో చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు తేదీల వారీగా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అమలాపురంలోని కళా వెంకట్రావు సహకార యూనియన్ల సంఘం శనివారం సమావేశమై ఇప్పటికే రూపొందించిన నిరసనల ప్రణాళిక అమలుపై చర్చించింది. దీనికి రాష్ట్ర సహకార ఉద్యోగ సంఘాల యూనియన్ గౌరవాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకట్రాయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై ఆందోళన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల సహకార ఉద్యోగుల యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలపై ఎన్నో ఆందోళనలు చేపట్టాయని రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామయ్య గుర్తు చేశారు. సహకార ఉద్యోగులకు ఉన్న రెండు రాష్ట్ర యూనియన్లు ఒకే తాటిపైకి వచ్చి జేఏసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యాయన్నారు. జీవో 36ను వెంటనే అమలు చేయాలని, వేతన సవరణ తక్షణమే చేపట్టాలని, గ్రాడ్యూటీ యాక్ట్ ప్రకారం అమలు చేయాలని, సంఘాల లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ విరమణ వయసు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అమలాపురంలోని జిల్లా సహకార కార్యాలయంలో సీఎస్ఓ ఎ.రాధాకృష్ణారావుకు అందించారు. సమావేశంలో జిల్లా యూనియన్ అధ్యక్షుడు వై.రామచంద్రరావు, రాష్ట్ర కోశాధికారి పి.సత్యనారాయణ, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శులు కుంపట్ల అయ్యప్పనాయుడు, మట్టపర్తి జయరామ్, జిల్లా ఉపాధ్యక్షుడు మేడిచర్ల రామలింగేశ్వరరావు, జిల్లా కోశాధికారి బొబ్బ సుబ్రహ్మణ్యచౌదరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమాల ప్రణాళిక ఇలా.. సహకార ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం విధులకు హాజరయ్యారు. 8న డీసీసీబీ బ్రాంచ్‌ల వద్ద సహకార ఉద్యోగుల ధర్నాలు, 16న జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతి పత్రాల సమర్పణ ఉంటుంది. 22న డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతి పత్రాల సమర్పణ, 29న సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా చేస్తారు. జనవరి 5 నుంచి విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించి రోజుకో జిల్లా ఉద్యోగులచే రిలే నిరాహార దీక్షలు ఉంటాయి. -
పుష్కర కాలువలో పడి వ్యక్తి మృతి
ప్రత్తిపాడు రూరల్: కాలువలో పశువులను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాచపల్లిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం ఒమ్మంగికి చెందిన దొండపాటి సింహాచలం తన పశువులను రాచల్లి అడ్డురోడ్డు వద్ద పుష్కర కాలువలోకి మళ్లించాడు. కాలువలో పశువులను కడుగుతుండగా సింహాచలానికి ఫిట్స్ రావడంతో నీటిలో పడిపోయాడు. దీనిని గుర్తించిన స్థానికులు ఆయన్ని ఒడ్డుకు చేర్చి సపర్యలు చేశారు. అతడిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
యువకుడి దుర్మరణం
నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పుల్లలపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లికి చెందిన శాయలి శివరామకృష్ణ (20) ఏలూరులో సీఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదివే స్నేహితుడి బంధువు దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన అంకెం సుబ్రహ్మణ్యం, శ్రీదుర్గ దంపతులు ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భీమడోలు బస్టాండ్‌కు వచ్చేసరికి రాత్రి కావడంతో వారిని యాదవోలులో దించమని స్నేహితుడు కోరాడు. శివరామకృష్ణ తన బైక్‌పై భీమడోలు వచ్చి వారిద్దరినీ తీసుకు వెళుతుండగా పుల్లలపాడు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శివరామకృష్ణ తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సుబ్రహ్మణ్యం, శ్రీదుర్గలను హైవే పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై మోహనరావు తెలిపారు. -
మహనీయుడు అంబేడ్కర్
రాజమహేంద్రవరం రూరల్: దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆ మహనీయుని చిత్రపటానికి వేణు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనా విధానాలు వేల సంవత్సరాలు మనలో ఉంటాయన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగిస్తే.. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్ మాజీ ఎంపీపీ రేలంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ ఆలోచనకే పవన్ ఆలోచనగా కలరింగ్
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ) కార్యాలయాలను ప్రారంభిస్తూ, అవి తన ఆలోచన నుంచి పుట్టాయంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రబుత్వం ప్రారంభించిన డీఎల్డీఓ కార్యాలయాలను డీడీఓ కార్యాలయాలుగా మార్చారే తప్ప ఇందులో కొత్తదనం గాని, విధివిధానాలు గాని, ఆర్థిక వనరులు సమకూర్చడం గాని లేవని అన్నారు. అబద్ధపు మాటలతో ప్రజలను చంద్రబాబు సర్కార్ ఏవిధంగా ఏమార్చుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. వాస్తవానికి ఎంపీడీఓలకు 33 ఏళ్లుగా ఉద్యోగోన్నతులు లేవని, దీంతో, వారికి ప్రమోషన్లు కల్పించేందుకు గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 2020 సెప్టెంబరు 30న డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీఎల్డీఓ) వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చొరవ చూపి గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం చేసుకునేలా డీఎల్డీఓ పోస్టులను ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక డీఎల్డీఓ కార్యాలయం ఏర్పాటు చేసిందని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని తెలిపారు. ప్రజావసరాలు తీర్చడానికి వారికి చేరువగా వైఎస్ జగన్ పాలన సాగిందన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన డీడీఓ కార్యాలయాలన్నింటినీ గ్రామ సచివాలయాల భవనాల పై అంతస్తుల్లోనే ఏర్పాటు చేశారని చెప్పారు. గతంలో గ్రామ సచివాలయాలు నిర్మిస్తూంటే పంచాయతీలుండగా ఇవెందుకని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అన్నారని గుర్తు చేశారు. వాస్తవానికి నోడల్ వ్యవస్థను తీసుకువచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను చంద్రబాబే నిర్వీర్యం చేశారని అన్నారు. తద్వారా సర్పంచ్ల అధికారాలను సైతం హరించారన్నారు. డీఎల్డీఓ వంటి గొప్ప వ్యవస్థను జగన్ తీసుకుని వస్తే.. దానిపై విషం చిమ్మి, ఇప్పుడు మళ్లీ దానినే పవన్ ప్రారంభించి, తన ఆలోచనగానే కలరింగ్ ఇవ్వడమేమిటని వేణు ప్రశ్నించారు. ప్రజల మనసులో ఉండాలనుకుంటే వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్ కూడా పాల్గొన్నారు. ఫ డిప్యూటీ సీఎంపై మాజీ మంత్రి వేణు విమర్శ ఫ డీఎల్డీఓనే డీడీఓగా మార్చారంతే.. ఫ ఈ వ్యవస్థ తెచ్చింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని స్పష్టీకరణ -
కోటసత్తెమ్మకు ఘనంగా సారె
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా మూడో రోజైన శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నిడదవోలు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమ్మవారికి చీర, సారె, వివిధ రకాల స్వీట్లు, పండ్లు సమర్పించారు. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్ పర్యవేక్షణలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజలు, హోమాలు, చండీ పారాయణ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయం తాళ్లపూడి: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవడం ఖాయమని, మళ్లీ జగన్మోహన్రెడ్డి సీఎం అవుతారని, రాష్ట్రానికి మేలు జరుగుతుందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. కొవ్వూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు మద్దిపాటి సురేష్ శనివారం తలారి వెంకట్రావు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. సురేష్‌కు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వనించారు. పార్టీ పటిష్టానికి కృషి చేయాలని తలారి సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కోడూరి రామకృష్ణ, జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కంఠమణి రమేష్, పట్టణ కన్వీనర్ చిట్లూరి అన్నవరం, జిల్లా కార్యదర్శి జుట్టా ఏడుకొండలు, నాయకులు మారిశెట్టి సత్తిబాబు, వీరమళ్లు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పీజీ కోర్సులకు రేపటి నుంచి స్పాట్ అడ్మిషన్లు రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంతో పాటు కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలో పీజీ కోర్సులలో ప్రవేశానికి సోమవారం నుంచి శుక్రవారం వరకూ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఎంఏ, ఎంకామ్, ఎంపీఈడీ, ఎమ్మెస్సీ కోర్సులకు ఈ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఏపీ పీజీ సెట్లో అర్హత సాధించలేని వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. సోమ, మంగళవారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సైన్స్, 10, 11 తేదీల్లో ఆర్ట్స్, కామర్స్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు. అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు అరటి పండ్లతో అందంగా అలంకరించారు. స్వామివారిని చూసిన భక్తులు తన్మయులయ్యారు. దాతల ఆర్థిక సాయంతో 10 వేల మందికి అన్న సమారాధన నిర్వహించారు. స్వామివారి పుష్పాలంకరణ, ప్రసాదానికి కూడా దాతలు సహకారం అందించారని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. -
ధర్మదేవత, యమధర్మరాజు ఒక్కరే..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మ దేవత, యమధర్మరాజు ఒక్కరేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ స్పష్టం చేశారు. వ్యాస భారత ప్రవచనాన్ని హిందూ సమాజంలో శనివారం ఆయన కొనసాగించారు. ‘భార్యతో కలిస్తే ముని శాపం వలన పాండురాజుకు మృత్యువు కలుగుతుంది. సంతానహీనునికి సద్గతులు కలగవు. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రం అనేక ఆపద్ధర్మాలను పేర్కొంది. భర్త అనుమతితో కుంతి తాను దుర్వాసుని వర ప్రభావంతో పొందిన మంత్రాలను ఉపాసించి సంతానవతి అయింది. ధర్మం, బలం, ఐశ్వర్యం, సౌందర్యం తదితర అంశాలలో ధర్మానిదే ప్రథమ స్థానం. అధర్మంతో ఏదీ సాధించలేరు కనుక, పాండురాజు ఆదేశంపై కుంతి ధర్మదేవతను ఉపాసించి, యుధిష్ఠిరుని తొలి సంతానంగా అందుకుంది. పాండురాజు ఆదేశం పైనే వాయుదేవుని ఉపాసించి భీముని, ఇంద్రుని ఉపాసించి అర్జునుని సంతానంగా పొందించి. మాద్రి అశ్వనీ దేవతలను ఉపాసించి నకుల సహదేవులను సంతానంగా అందుకుంది. ధృతరాష్ట్ర సంతానంగా మొదట దుర్యోధనుడు జన్మించినప్పుడు అనేక వైపరీత్యాలు గోచరించాయి. గాడిదలు, నక్కలు, గెద్దలు వికృతంగా అరిచాయి. ధృతరాష్ట్రుని హితైషులందరూ పెద్ద కొడుకును విడిచిపెడితే, మిగతా 99 మంది సుఖంగా జీవిస్తారని, లేకపోతే వంశ నాశనమవుతుందని హెచ్చరించారు. కులం బాగు కోసం అవసరమైతే ఒకడిని వదిలేయాలి. గ్రామం బాగు కోసం అవసరమైతే కులాన్ని వదిలేయాలి. దేశ క్షేమం కోసం గ్రామాన్ని, అలాగే తన క్షేమం కోసం అవసరమైతే యావత్తు పృథ్విని వదిలేయాలని హితవు చెప్పినా ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు’ అని సామవేదం వివరించారు. ఈ సందర్భంగా మహాపతివ్రత గాంధారిని గురించి ఆయన కొన్ని ఆసక్తికరమైన అంశాలను వివరించారు. తన భర్త చూడలేని లోకాన్ని చూడటం ఇష్టం లేక ఆమె కళ్లకు గంతలు కట్టుకున్నదన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ధృతరాష్ట్రునికి చూపు లేదన్న దోషాన్ని ఎంచకూడదనే ఆమె కళ్లకు గంతలు కట్టుకున్నదన్నారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖులు పురాణవైర గ్రంథాల్లో భారత కాలాన్ని, చారిత్రక వాస్తవాలను వెల్లడించారని, హిందూ మతం శాసీ్త్రయమైనదని, ఖగోళ గమనాన్ని అనుసరించి భారత కాలగణనం జరిగిందని చెప్పారు. పాశ్చాత్య ఉపాసకులైన పాలకుల చేతిలో చరిత్ర వక్రీకరణకు గురి కావడం మన దురదృష్టమని సామవేదం ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇలాగే కొనసాగితే..
కోళ్ల ఫామ్‌లతో ఇప్పటి వరకూ నష్టాల బాట పట్టాం. ప్రస్తుతం గుడ్డు ధర పెరగటంతో గత నష్టాలను పూడ్చుకునే పనిలో ఉన్నాం. ధర ఇలాగే కొనసాగితే గత నష్టాల నుంచి బయట పడతాం. – భూపతిరాజు వరాహ నరసింహరాజు, ఖండవల్లి, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా ఆర్థికంగా కోలుకుంటాం గత 15 ఏళ్లుగా కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నాను. ఏడాది కాలంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఆర్థికంగా నలిగిపోయాం. ప్రస్తుతం గుడ్డు ధర రూ.6.50 పలుకుతోంది. ఈ ధరలు మరో 3 నెలలుంటే గత నష్టాల నుంచి బయట పడి, ఆర్థికంగా కోలుకుంటాం. – మండా తాతారెడ్డి, కోళ్ల రైతు, పిట్టల వేమవరం, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా -
చెల్లించిన సొమ్ముకే ఇళ్లు స్వాధీనం చేయాలి
సామర్లకోట: ఇప్పటికే చెల్లించిన సొమ్ముతోనే టిడ్కో ఇళ్లు వెంటనే స్వాధీనం చేయాలని, రుణ వాయిదాలు చెల్లించలేని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉప్పువారి సత్రం, జగ్గమ్మగారిపేటలోని టిడ్కో గృహ సముదాయం వద్ద వారు శనివారం ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు తమ ఇళ్ల వద్దకు వచ్చి రుణాలు చెల్లించవద్దంటూ చెప్పారని అన్నారు. తీరా ఇప్పుడు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, వారం రోజుల్లో రుణ వాయిదాలు చెల్లించకపోతే ఇళ్లు స్వాధీనం చేసుకుంటామంటూ మున్సిపల్ అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రూ.500 చెల్లించిన వారికి ఉచితంగా ఇచ్చారని, ఈ నేపథ్యంలో రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించిన వారికి వెంటనే ఇళ్లు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేకుండా నిర్మించడంతో టిడ్కో ఇళ్లలో వర్షపు నీరు దిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం లబ్ధిదారుల ఎంపిక సమయంలో జి+1 పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, జి+3 నిర్మాణాలు చేశారని ఆరోపించారు. తమ వాటా చెల్లించిన అనేక మందికి ఇప్పటికీ ఇళ్లు స్వాధీనం చేయలేదన్నారు. అలాగే, బ్యాంకు రుణాలు మంజూరు చేసిన ఇళ్లు కూడా స్వాధీనం చేయలేదని చెప్పారు. దీనివలన లబ్ధిదారులు అప్పులకు వడ్డీలతో పాటు బయట ఇళ్ల అద్దె కూడా చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. బ్యాంకు అధికారులు 20 ఏళ్ల పాటు నెలకు రూ.4,200 నుంచి రూ.4,900 వరకూ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. 20 ఏళ్ల పాటు బ్యాంకుకు వాయిదాలు చెల్లిస్తూ ఉంటే కూలి పని చేసుకునే వారు ఏం తినాలని ప్రశ్నించారు. ఇప్పటికే తమ సమస్యను టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా స్పందన లేదని అన్నారు. తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నాకు సిద్ధమని హెచ్చరించారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తారనే ఆశతోనే చంద్రబాబుకు ఓట్లు వేశామని, అయితే ఆయన వలన తమకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రూ.లక్ష చెల్లించి పదేళ్లయిందని, దీనికి వడ్డీగా రూ.4 లక్షల వరకూ చెల్లించామని వాపోయారు. ధర్నాకు కె.వరలక్ష్మి, దగ్గు పద్మ, దుర్గాలక్ష్మి, కందుకూరి కిరణ్‌కుమార్ తదితరులు నాయకత్వం వహించారు.ఫ రుణాలు చెల్లించవద్దని గతంలో టీడీపీ నాయకులే చెప్పారు ఫ ఇప్పుడు బ్యాంకులు, అధికారుల బెదిరింపు తగదు ఫ అప్పులు చెల్లించలేమని లబ్ధిదారుల ఆవేదన ఫ టిడ్కో గృహ సముదాయం వద్ద ధర్నా -
పోలీసు శాఖలో హోంగార్డులు అంతర్భాగం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పోలీసు శాఖలో హోం గార్డులు అంతర్భాగమని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన హోంగార్డ్స్ రైజింగ్ డే పరేడ్‌కు ఎస్పీ హాజరయ్యారు. పరేడ్ కమాండర్ ఆర్ఐ పీవీ అప్పారావు ఆధ్వర్యాన హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం, ఎస్పీ మాట్లాడుతూ, హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తున్నారని, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సేవా ధృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. ఉత్తమ పనితీరు కనబరిచిన బీఎస్ఎస్ ఉపేంద్ర పవన్, పి.వెంకట రమణ, వీజీ చౌదరి, జీఎస్ఎస్ ప్రకాష్, జి.ప్రవీణ్ కుమార్, సీహెచ్‌వీ సుబ్రహ్మణ్యంలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఇద్దరు రిటైర్డ్ హోంగార్డులకు, జిల్లా యూనిట్ హోంగార్డులు ఒక రోజు జీతాన్ని చెక్కు రూపంలో అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, చెంచిరెడ్డి, జోనల్ డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తునిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం
తుని రూరల్: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 36వ షోరూమ్‌ను తుని పట్టణంలో సినీ నటి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ ఐశ్వర్య రాజేష్, బుల్లిరాజు సంయుక్తంగా ప్రారంభించారు. శుక్రవారం తుని వచ్చిన వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్‌ను, వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ ఇక్కడి అభిమానుల ఆదరాభిమానాలు చేస్తుంటే ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పార్టు– 2 షూటింగ్‌ను తునిలో చేయాలని దర్శక, నిర్మాతలను కోరతామన్నారు. 16 సంవత్సరాల్లో 36 షోరూమ్‌లు ఏర్పాటు చేసి నాణ్యత గల, నూతన డిజైన్లతో వస్త్ర ప్రియులను ఆకట్టుకుంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యజమాన్యం ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. అనంతరం సినిమాల్లో డైలాగులతో అభిమానులను అలరించారు. అభిమానుల కేరింతల నడుమ గోదారి గట్టుమీద రామచిలకవే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తునిలో షోరూమ్ ప్రారంభించడం ద్వారా 36వ మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉందని షోరూమ్ చైర్పర్సన్, డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు అన్నారు. వచ్చే పర్వదినాలను రంజింపజేసే షాపింగ్ అనుభూతిని తమ సరికొత్త షోరూమ్ అందజేస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ సీర్ణ రాజమౌళి అన్నారు. రానున్న క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు అనువైన వైరెటీలు అందుబాటులో ఉంచినట్టు మరో డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు అన్నారు. పెద్ద సంఖ్యలో వస్త్ర ప్రియులు, అభిమానులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి ఆందోళనలు
రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సంఘ కోశాధికారి పెంకే సత్యనారాయణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. జనవరి 1 వరకూ నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నల్లబ్యాడ్జీలతో నిరసన, 8న డీసీసీబీ బ్యాంచ్ల ఎదుట సహకార సంఘాల ఉద్యోగులతో ధర్నా, 16న రాష్ట్రంలోని అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతి పత్రాలు అందజేయడం, 22న రాష్ట్రంలో అన్ని డీసీసీడీ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసన, 29న రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా, ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించడం చేస్తామన్నారు. జనవరి 5 నుంచి విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా 2019లో ప్రభుత్వం ఇచ్చిన జీఓ 36ను ఇప్పటికై నా అమలు చేయాలని ఆందోళనలకు సిద్ధమైనట్లు సత్యనారాయణ తెలిపారు. -
టిడ్కో ఇళ్లకు ప్రైవేట్ ఫైనాన్స్ వద్దు
సామర్లకోట: స్థానిక టిడ్కో సముదాయంలో నివాసం ఉంటున్న అనేక మందికి ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా రుణాలు ఇప్పించడానికి ఏర్పాట్లు చేయడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు సామర్లకోట మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తమకు ఆ రుణాలు వద్దంటూ మున్సిపల్ కమిషనర్‌ను చుట్టుముట్టారు. స్థానిక ఉప్పువారి సత్రం ఎదురుగా సుమారు 1,056 టిడ్కో గృహాలను నిర్మించారు. ఇందులో 350 మంది లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు మంజూరు కాలేదు. వారికి రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్స్ ఒప్పందం చేశారు. అయితే ప్రైవేట్ ఫైనాన్స్ వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని, దానికి ఒప్పుకొనేది లేదంటూ లబ్ధిదారులు ఆందోళన చేశారు. అలాగే బ్యాంకుల నుంచి రూ.లక్ష, రూ.50 వేల ప్లాట్లకు సంబంధించి బ్యాంకు అధికారులు వాయిదాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, అనేక మందికి ప్లాట్లు అప్పగించకుండా వాయిదాలు ఏవిధంగా చెల్లిస్తామని ప్రశ్నించారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఎ.శ్రీవిద్య మాట్లాడుతూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రద్దు చేసే అవకాశం లేదని, అలాగే ప్రైవేట్ ఫైనాన్స్‌కు 27 మంది ముందుకు వచ్చారని తెలిపారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతామని వివరించారు. -
ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ విడుదల
రాయవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా నిర్వహించే పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆ విద్యాపీఠం డైరెక్టర్ ఆర్.నరసింహారావు శుక్రవారం విడుదల చేశారు. పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ను గత నెలలోనే విడుదల చేయగా, పరీక్ష ఫీజును అపరాధ రుసుం లేకుండా ఈ నెల 10వ తేదీలోగా చెల్లించాలి. ఈ నెల 11, 12 తేదీల్లో సబ్జెక్టుకు రూ.25 అపరాధ రుసుంతో చెల్లించవచ్చు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సబ్జెక్టుకు రూ.50 అపరాధ రుసుంతో చెల్లించడానికి అవకాశముంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓపెన్ స్కూల్లో పదో తరగతి ప్రవేశానికి 4,314 మంది, ఇంటర్లో చేరేందుకు 12,220 మంది అడ్మిషన్ ఫీజు చెల్లించారు. వీరంతా పరీక్ష ఫీజును చెల్లించాలి. రెగ్యులర్ పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా అదే సమయంలో పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులకు మార్చి 16 నుంచి 28 వరకూ, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 2 నుంచి 13వ తేదీ వరకు జరుపుతారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉంటాయి. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిశీలన
కాకినాడ లీగల్: కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులను స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర ఐజీ బీఆర్ అంబేద్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం, కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించానన్నారు. దస్తావేజుల్లో వివరాలను ఆన్లైన్లో ఉన్న వివరాలతో పరిశీలించారు. స్కాన్ చేసిన పాత దస్తావేజు రికార్డుల పరిశీలన ఎంత వరకూ వచ్చిందని ఆయన అడిగారు. ఆ దస్తావేజులను పరిశీలిస్తున్నామని జిల్లా రిజిస్ట్రార్ జేఎన్‌యూ జయలక్ష్మి తెలిపారు. విద్యుత్ అంతరాయం సమయంలో ఇన్వర్టర్లు పనిచేయక పోవడంతో స్లాట్ బుకింగ్ ముగిసిపోయి క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారని అంబేద్కర్‌ను విలేకరులు అడగ్గా, ఆ సమయానికి స్లాట్ బుకింగ్ ముగిసిపోకుండా త్వరలో సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేస్తామని బదులిచ్చారు. కార్యక్రమంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ సీహెచ్ జానకీదేవి, కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు–1, 2 ఆర్వీ రామారావు, ఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచూ విద్యుత్ అంతరాయంతో ఇన్వర్టర్లు పని చేయకపోతే ముందుగా ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఇబ్బందులు వస్తున్నాయి. స్లాట్ బుకింగ్ ముగిసిపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయని విలేకరులు ఆ శాఖ డీఐజీని అడిగారు. దీనిపై జానకీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని, వాటికి టెండర్ ద్వారా ఇన్వర్టర్లు, కంప్యూటర్లు, స్కానర్లు త్వరలో వస్తాయన్నారు. క్రయవిక్రయదారులు సమస్యలపై విలేకరులు అడగ్గా, సమాధానం చెప్పడానికి అసహనం వ్యక్తం చేశారు. -
ఆగకొండ అధిరోహిస్తూ..
● ట్రెక్కింగ్ వీరుడిగా కాకినాడ యువకుడు ● ఎవరెస్ట్ అధిరోహణే లక్ష్యంగా అడుగులు కాకినాడ రూరల్: సాహసయాత్రల ప్రపంచంలో కాకినాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి దవులూరి కృష్ణ కుమార్ (25) దూసుకుపోతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న అతను తీరిక దొరికినప్పుడల్లా హిమాలయ పర్వత శిఖరాలను అధిరోహిస్తూ తన బలమైన లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు సాగుతున్నాడు. కృష్ణకుమార్ బీటెక్ పూర్తి చేయగా, అతని తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి బీవీ స్వామి, తల్లి రాజరాజేశ్వరి గృహిణి. ట్రెక్కింగ్‌పై మక్కువ పెంచుకున్న కృష్ణకుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూనే, తాను ప్రేమించిన ఈ సాహస క్రీడ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తూ.. అసాధ్యమైన ట్రెక్కింగ్ మార్గాలను విశ్వాసంతో పూర్తి చేసుకుంటున్నాడు. దేశంలోని హిమాలయ పర్వతాలు కాశ్మీర్ గ్రేట్ లేక్స్, రూపిన్ పాస్, బ్రహ్మ హాల్, హంత పాస్ రెండు సార్లు పూర్తి చేశారు. పర్వతారోహణ ద్వారా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లక్ష్యంగా.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (ఈబీసీ)ను అధిరోహించే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందుకు కసరత్తు ప్రారంభించిన ఆయన త్వరలో లక్ష్యం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 2022లో కేథార్నాథ్ గుడికి వెళ్లినప్పుడు ఒక్కరోజులో 25 వేల మీటర్ల ఎత్తయిన ప్రదేశం ఎక్కడం, మరుసటి రోజు దిగడంతో అప్పటి నుంచే పర్వతాలు అధిరోహించాలనే కోరిక కృష్ణకుమార్లో బలంగా పుట్టింది. అప్పటి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించాడు. కృష్ణకుమార్ లక్ష్య సాధనకు ఆయన తల్లిదండ్రులు బీవీ స్వామి, రాజరాజేశ్వరితో పాటు కాకినాడకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి మంతా కామేశ్వరరావు, శ్రీహరి దంపతులు ప్రోత్సాహంతో పాటు ఆర్థిక తోడ్పాటు అందజేస్తున్నారు. ఎవరెస్ట్ కల నెరవేర్చుకుంటా.. పర్వతారోహణ సాహసంతో కూడికున్నది. ప్రకృతి ఒడిలో అందాలతో కనువిందు చేసే హిమాలయ పర్వతాలు ట్రెక్కింగ్ చేశాను. ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతం అధిరోహించడం కల. ఈ పర్వతం 28 వేల అడుగుల ఎత్తు. అంత సాహసం చేయలేం. ఎవరెస్ట్ బేస్ 22 వేల అడుగులు. దానిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. రెండేళ్లలో సాధించేలా ప్రణాళిక వేసుకున్నాను. – దవులూరి కృష్ణకుమార్, కాకినాడ -
సీఐటీయూ జాతీయ మహాసభలకు సన్నాహాలు
బోట్‌క్లబ్ (కాకినాడ): విశాఖపట్నంలో సీఐటీ యూ 18వ జాతీయ మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి నాలుగో తేదీ వరకూ జరుగుతా యని ఆ యూనియన్ నాయకులు తెలిపారు. స్థా నిక కలెక్టరేట్ వద్ద మహాసభల పోస్టర్‌ను మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ శుక్రవారం ఆవిష్కరించారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత, స్కీం వర్కర్ల సమస్యలు, కనీస వేతనం రూ.26 వేలు సాధించేందుకు తీర్మానాలు చేయనున్నట్లు వివరించారు. కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను తిప్పికొట్టేందుకు చర్చించనున్నట్లు వెల్లడించారు. జనవరి 4న విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో జరిగే భారీ బహిరంగ సభకు కాకినాడ జిల్లా నుంచి కార్మిక వర్గం తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సంఘ వర్కింగ్ కమిటీ సభ్యుడు పలివెల వీరబాబు, నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, టి.రాజా, శ్రీనివాస్, శేఖర్, భారతీప్రియ, మేడిశెట్టి రాంబాబు పాల్గొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ : రూ.3,11,500 సొత్తు స్వాధీనం తుని రూరల్: తుని రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పై అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.3,11,500 సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. శుక్రవారం కాకినాడ లైన్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో తుని ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాసరావు, హెచ్‌సీ పి.శ్రీనివాసరావు తమ సిబ్బంది, రాజమహేంద్రవరం ఆర్పీఎఫ్ క్రైం ఎస్సై సతీష్, ఏఎస్సై గోవిందరావులు రైళ్లలో నేరాలు అదుపునకు ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్‌పై తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన గుత్తుల వీరబాబు, పాయకరావుపేట మండలం మంగరం గ్రామానికి చెందిన సేనాపతుల మనీష్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరస్తులుగా గుర్తించి విచారించి మోటార్‌సైకిల్, 13.5 గ్రాముల బంగారు నగలు, మూడు సెల్ ఫోన్లు, రూ.40,500 నగదు మొత్తం రూ.3,11,500 సొత్తును రికవరీ చేసినట్టు జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. నేరాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. -
అత్యంత సూక్ష్మమైనది ధర్మాధర్మ వివేచన
ఆల్కాట్ గార్డెన్స్ (రాజమహేంద్రవరం రూరల్) : సత్పురుషుల ధర్మాధర్మ వివేచన అత్యంత సూక్ష్మమైనదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో తొమ్మిదో రోజు వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుని పుట్టుకలను వివరించారు. ‘విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు సంతానరహితులుగా కన్నుమూశారు. నాటి శిక్షాస్మృతిననుసరించి రాచరిక పాలన అనువంశికంగా వచ్చేది. రాజు లేకపోతే అరాచకం వ్యాప్తి చెందుతుంది. ధర్మం నశిస్తుంది. ఈ కారణం చేతనే అంబిక, అంబాలికలకు సంతానం ప్రసాదించాలని భీష్ముడిని సత్యవతి అడుగుతుంది. అందుకు భీష్ముడు అంగీకరించకపోవడంతో ఆమె స్మరణ మాత్రం చేత వ్యాసుని రప్పించి, తన కోడళ్లకు సంతానం ప్రసాదించాలని కోరుతుంది. ఒక సంవత్సరం పాటు వారిద్దరు ఒక వ్రతం పాటిస్తే, తాను సంతానాన్ని ప్రసాదిస్తానని వ్యాసుడు అన్నాడు. సత్యవతి వెంటనే ఈ పని కావాలని ఆదేశిస్తుంది. అంబికను కలవాలని ఏకాంత మందిరంలోకి వ్యాసుడు వెళ్లినప్పుడు ఆమె భయంతో కళ్లు మూసుకుంటుంది. అసహ్యంతో కాదని మనం గుర్తించాలి. పది వేల ఏనుగుల బలం కలవాడు, విద్వాంసుడు, రాజర్షి అయిన కుమారుడు ధృతరాష్ట్రుడు జన్మించాడు. కానీ, మాతృదోషం వలన అంధునిగా పుట్టాడు. అంబాలిక వద్దకు వెళ్తే, ఆమె వ్యాసుని చూసి తెల్లబోయింది. ఫలితంగా పాండు వర్ణంతో పాండురాజు పుడతాడు. ఈ సందర్భంగా కొందరు అనువాదకులు పాండురోగంతో పుట్టాడని వర్ణించడం ఘోరమైన తప్పిదం. రోగి రాజు కాలేడు. పాండురాజు ఎటువంటి రోగంతోనూ పుట్టలేదు. అంబాలిక తన దాసిని అలంకరించి పంపినప్పుడు, ఆ దాసి సంతోషంతో వ్యాసుని సేవించినందున ధర్మజ్ఞుడయిన విదురుడు జన్మించాడు. ధర్మశాస్త్రాల పట్ల సరైన అవగాహన లేనివారు, జనరంజకత్వం కోసం రచనలు చేసేవారు భారతం పట్ల కువ్యాఖ్యానాలు చేయడం పరిపాటి అయింది. వాడిదే కులం, వీడిదే కులం అని సినీ రచనలు చేసేవారు తీవ్రమైన దోషానికి పాల్పడుతున్నారు’ అని సామవేదం అన్నారు. మనుధర్మ స్మృతి, ఆపస్తంభ సూత్రాలను అనుసరించి అనేక ధర్మరహస్యాలను ఆయన వివరించారు. ‘పరాశరుని ద్వారా సత్యవతికి జన్మించిన వ్యాసుడు విప్రుడయ్యాడు. వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు పుట్టిన వారు క్షత్రియులయ్యారు. ఇక్కడ ధర్మశాస్త్రాలు బీజ ప్రాధాన్యం, క్షేత్ర పాధాన్యం అనే రెండు అంశాలు పేర్కొంటున్నాయి. వీటి ప్రకారం ప్రకారం వ్యాసుడు విప్రుడు, ఆయన ద్వారా అంబిక, అంబాలికలకు జన్మించిన వారు క్షత్రియులు అయ్యారు’ అని సామవేదం చెప్పారు. -
‘ఉచితా’నికి కొత్త బస్సులు కొనాలి
నిడదవోలు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఆర్టీసీలో వెంటనే 3 వేల బస్సులు కొనాలని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ జోనల్ కార్యదర్శి వైఎస్ రావు డిమాండ్ చేశారు. పట్టణంలోని షాదీఖానాలో యూనియన్ నిడదవోలు డిపో అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం అన్ని కేటగిరీల్లో ఉన్న 10 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగులకు పని ఒతిడ్తి తగ్గించాలని, డివిజన్ స్థాయి సీనియారిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బస్సులు, సిబ్బందిని పెంచకుండా ఉచిత బస్సు పథకం నిర్వహణ చాలా కష్టమవుతోందని చెప్పారు. సీ్త్రశక్తి బస్సులలో డ్యూటీలకు వెళ్లాలంటేనే కండక్టర్లు, డ్రైవర్లు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని రావు అన్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జి.చిరంజీవి మాట్లాడుతూ, నిడదవోలు డిపోలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జోనల్ సంయుక్త కార్యదర్శి ఎస్కే మీరా, జిల్లా కార్యవర్గ సభ్యులు ముస్తఫా, ఎంఎస్ ప్రసాద్, బి.అప్పారావు, పీఎస్ మన్యం, రామకృష్ణ, నారాయణ, ఎస్.సత్తిబాబు, మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులు ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని పార్టీ అనుబంధ విభాగాల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుత్తుల మురళీధర్ (రాజమండ్రి సిటీ) బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కాటం రజనీకాంత్‌ను ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, గారా చంటిబాబును ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా, హసీనా బేగాన్ని మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, వట్టికూటి కృష్ణవేణిని రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా నియమించారు. అప్పారి జయప్రకాష్(రాజమహేంద్రవరం రూరల్)ను వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా జక్కుల మహేష్, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడిగా యలమంచిలి నాగరాజు, ఇంటలెక్చువల్స్ ఫోరమ్ అధ్యక్షుడిగా అల్లు జయరాజ్, లీగల్ సెల్ అధ్యక్షుడిగా కంఠస్ఫూర్తి శ్రీనివాసరాజు; వైఎస్సార్ టీఎఫ్ గోపాలపురం, కొవ్వూరు, రాజానగరం, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల అధ్యక్షులుగా గోతమ్ సత్యలక్ష్మి, ధర్మగిరి, అనకాపల్లి ఆర్కేఎస్ శివప్రసాద్, పతివాడ రమేష్‌బాబు నియమితులయ్యారు. లావాదేవీలు జరగని ఖాతాల్లో సొమ్ము పొందవచ్చు అమలాపురం రూరల్: మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పదేళ్ల పైబడి నిరుపయోగంగా ఉన్న బ్యాంక్ ఖాతాల్లో ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్లో ఉన్న సొమ్మును తిరిగి హక్కుదారులు పొందవచ్చని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ అశోక్ నాగరాజన్ తెలిపారు. శుక్రవారం అమలాపురం కలెక్టర్ గోదావరి భవన్లో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్ కంపెనీ ప్రతినిధులతో ఎల్డీఎం కేశవవర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రజలు మర్చిపోయిన లేదా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేలా సహాయం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవవర్మ మాట్లాడుతూ లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్ము ఇచ్చే ప్రయత్నం చేయాలని కేంద్రం ఆదేశించిందన్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 4,70,690 నిరుపయోగంగా ఉన్న బ్యాంకు ఖాతాల్లో రూ 82.66 కోట్ల మేర నిధులు ఉన్నట్లు గుర్తించామన్నారు. -
మెగా పీటీఎం.. విద్యార్థులకు నీరసం
కడియం: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ – టీచర్స్ మీట్ (పీటీఎం) కారణంగా శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులకు భోజనాలు ఆలస్యం చేశారు. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థులు భోజనం చేస్తారు. అటువంటిది 2 గంటలకు కానీ పెట్టకపోవడంతో వారు ఆకలితో అలమటించిపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రావడం ఆలస్యం కావడంతో పాటు, ఆయా పాఠశాలల్లో తగిన విధంగా సమయ పాలన పాటించలేదని తెలుస్తోంది. దీంతో, అప్పటి వరకూ విద్యార్థులు నీరసంగా వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ తల్లిదండ్రులు అతి తక్కువగానే హాజరయ్యారు. దుళ్ల హైస్కూల్లో జరిగిన సమావేశంలో కడియం ఇన్స్పెక్టర్ ఎ.వెంకటేశ్వరరావు పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. కడియంలో ఎస్సై ప్రసన్న మాట్లాడుతూ, బాల్య వివాహాలను అరికట్టాలని అన్నారు. కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, తహసీల్దార్ సునీల్, ఎంపీడీఓ రమేష్, విద్యాశాఖాధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఫ మధ్యాహ్నం 2 గంటలకు భోజనాలు ఫ ప్రజాప్రతినిధులు, అధికారుల రాకలో జాప్యమే కారణం -
రైతులందరికీ యూరియా అందుతుంది
బిక్కవోలు: మండలంలోని ఊలపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో శుక్రవారం ప్రచురించిన ‘యూరియా కోసం బారులు’ వార్తకు వ్యవసాయ అధికారులు స్పందించారు. అనపర్తి సహాయ వ్యవసాయ సంచాలకుడు డీవీ కృష్ణ, రాజమహేంద్రవరం సహాయ పౌర సరఫరాల అధికారి ఎం.నాగాంజనేయులు, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎన్.శామ్యూల్ జాన్ తదితరులు ఆ సొసైటీకి శుక్రవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ, ఊలపల్లి గ్రామంలో పంట కాలం పూర్తయ్యేలోగా మూడు దఫాలుగా వేయడానికి 260 టన్నుల యూరియా అవసరమవుతుందని చెప్పారు. ఇప్పటి వరకూ 40 టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. రైతులకు ఎకరానికి ఒక బస్తా యూరియా ఇవ్వాలని సొసైటీ పాలకవర్గం నిర్ణయించి, ఆ మేరకు పంపిణీ మొదలు పెట్టిందన్నారు. ప్రతి రైతూ ఈ–పోస్ యంత్రంలో వేలిముద్రలు వేసి, యూరియా తీసుకోవాల్సి వస్తూండటంతో కొంత ఆలస్యం జరిగిందని చెప్పారు. యూరియాకు ఎటువంటి ఇబ్బందులూ లేవని, రైతులు సంయమనం పాటించాలని కోరారు. ఈ నెల రెండో వారం నుంచి అన్ని సొసైటీల్లోనూ అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
సాగు.. ముమ్మరం
అనుమతి మేరకు సాగు చేయాలి బోర్డు అనుమతించిన మేరకే రైతులు పంట సాగు చేయాలి. పరిమితికి మించి ఉత్పత్తి చేయరాదు. బాడవ భూములు, సైలెన్ భూముల్లో సాగు నిషిద్ధం. మరో రెండు వారాల్లో నాట్లు పూర్తి కానున్నాయి. వేసిన నాట్లు ఆశాజనకంగా ఉన్నాయి. పంట నియంత్రణ పాటించి నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి. – జీఎల్‌కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరందేవరపల్లి: మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న వర్జీనియా పొగాకు సాగు ముమ్మరంగా జరుగుతోంది. 2025–26 పంట కాలానికి బోర్డు బ్యారన్ల రిజిస్టేషన్ చేయడంతో రైతులు సాగు చేపట్టారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఏడాది దాదాపు నెల రోజులు ఆలస్యంగా పొగాకు నాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరు వరకూ నాట్లు వేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరి పంట వేసిన బాడవ భూములు, నల్లరేగడి, సైలెన్ భూముల్లో పొగాకు నాట్లు వేయవద్దని బోర్డు అధికారులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు. బాడవ, నల్లరేగడి భూముల్లో పొగాకు సాగు చేస్తున్నారు. 2024–25 పంట కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో కొరత ఏర్పడడంతో మన పొగాకుకు మంచి డిమాండ్ వచ్చింది. కిలో గరిష్ట ధర రూ.453 పలికి, రికార్డు సృష్టించడంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. దీంతో, 2025–26 పంట కాలానికి సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచనున్నారు. కొంత మంది జీడిమామిడి తోటలు తొలగించి మరీ పొగాకు సాగు చేస్తున్నారు. బ్యారన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి బ్యాంకులు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలు ఇస్తున్నాయి. మోంథా తుపానుకు ముందు వేసిన తోటల్లో సంక్రాంతికి రెలుపులు జరుగుతాయని రైతులు తెలిపారు. 38.59 మిలియన్ కిలోలకే అనుమతి టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకూ 49,629 ఎకరాల్లో పొగాకు నాట్లు వేశారు. మొత్తం 9,991 మంది రైతులు 11,290 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బోర్డు 38.59 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చింది. 2024–25 పంట కాలంలో 12,879 మంది రైతులు, 14,994 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించుకుని 26,336 హెక్టార్లలో పంట సాగు చేశారు. అప్పట్లో 61.27 మిలియన్ కిలోలకు మాత్రమే అనుమతి ఇవ్వగా, 83.88 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగింది. వేలం కేంద్రాల వారీగా పొగాకు నాట్ల వివరాలు (ఎకరాలు) వేలం కేంద్రం వేసిన బ్యారన్ల నాట్లు రిజిస్ట్రేషన్లు దేవరపల్లి 8,405 2,153 జంగారెడ్డిగూడెం–1 11,017 2,231 జంగారెడ్డిగూడెం–2 6,137 2,014 కొయ్యలగూడెం 12,400 2,588 గోపాలపురం 10,640 2,301 ·˘ gZÆý‡$V> Ð]lÈj°Ä¶æ* ´÷V>MýS$ ¯ér$Ï˘ ·˘ 48,599 GMýSÆ>ÌZÏ ç³NÇ¢ ·˘ 11,290 »êÅÆý‡¯]lÏ Çh{õÜtçÙ¯ŒS ·˘ OÆð‡™èl$Ë$ 9,991 Ð]l$…¨ -
చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో నిరుద్యోగులు, రైతులు, విద్యా రంగానికి కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కావడం లేదని అన్నారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని చెప్పారని, ఏడాదిన్నర అవుతున్నా ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. దీనికోసం బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్లు కట్టిస్తానని చెప్పి, నిర్మించిన ఇళ్లను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని, దీనివలన పూర్తయిన ఇళ్లు కూడా లబ్ధిదారులకు అందని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కనీసం ఇప్పటికే కట్టిన టిడ్కో ఇళ్లనైనా వెంటనే పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లపై కూటమి ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన నాయకులు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై రూ.12 వేల కోట్ల పైచిలుకు భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. రాత్రి 10 గంటల తర్వాత ఫ్యాన్ తిరిగిందన్న కారణానికే అదనపు బిల్లులు విధించడం ప్రజలపై అదనపు భారం మోపడమేనని మండిపడ్డారు. రోజుకు 14 గంటల పని వంటి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం కొత్త బానిసత్వపు వైఖరి అని ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు దీర్ఘకాల పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తున్నారని ఆవేదన చెందారు. అంతర్జాతీయ కార్మిక చట్టాల ఉల్లంఘనకు గానీ, కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించే వ్యవస్థకు గానీ సీపీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. పెట్టుబడుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ లోకేష్‌పై విమర్శలు గుప్పించారు. విదేశీ పర్యటనలు చేస్తూ, పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నా, రాష్ట్రంలో ఒక్క పెద్ద పరిశ్రమయినా ప్రారంభమైందా? ఒక్క కొత్త ప్రాజెక్టు వచ్చిన ఆధారం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. గ్రామ గ్రామానా నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పోరాటాలు చేయాలని, తద్వారా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలు జనవరి 18న ఖమ్మంలో జరుగుతాయన్నారు. పార్టీ శతాబ్దిక పోరాట గాథలు, కార్మిక, రైతు ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునేలా నిర్వహించే ఈ ఉత్సవాలకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు వి.కొండలరావు, పి.లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రజా సమస్యలపై పోరాడాలి ఫ సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు తరలి రావాలి ఫ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు -
కరుణించవమ్మా.. కాపాడవమ్మా..
సారె తీసుకువస్తున్న మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ, వేద పండితులు సారె తెస్తున్న నంగాలమ్మ ఆలయ కమిటీ సభ్యులునిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు రెండో రోజైన శుక్రవారం ఘనంగా జరిగాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ఈఓ ఆర్వీ చందన, నిడదవోలు గ్రామ దేవత నంగాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు ఆధ్వర్యాన కోటసత్తెమ్మ తల్లికి చీర, సారె సమర్పించారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్ పర్యవేక్షణలో కోటసత్తెమ్మ అమ్మవారిని ప్రధానార్చకుడు అప్పారావుశర్మ ప్రత్యేకంగా అలంకరించి, కుంకుమ పూజలు, హోమాలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తమను కరుణించి, కాపాడాలని వేడుకున్నారు. – నిడదవోలు రూరల్ -
రైతుకు ఇచ్చిన భరోసా ఏమిటి?
·˘ ^èl…{§ýl»êº$ ç³Æý‡År¯]l™ø ప్రజాధనం దుర్వినియోగమే.. ·˘ Ð]l*i çßZ… Ð]l$…{† ™é¯ólsìæ Ð]l°™èl ÑÐ]l$Æý‡Ø దేవరపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లజర్ల పర్యటన వల్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప, రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత విమర్శించారు. యర్నగూడెంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా రైతులకు ఇచ్చిన భరోసా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె ఏమన్నారంటే.. ఫ మోంథా తుపాను బాధిత రైతులను కనీసం పట్టించుకోలేదు. దెబ్బ తిన్న పంటలకు పరిహారం ఎప్పుడిస్తారో చెప్పాలి. తుపాను బాధిత రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, ఆదుకోవాలి. ఫ వరికి కనీస మద్దతు ధర ఇస్తామనే హామీయే లేదు. కష్టాల్లో ఉన్న అన్నదాతకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. వరి సాగుతో దేశానికే అన్నపూర్ణగా నిలిచిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంటగా వరికి బదులు ఉద్యాన సాగు చేసుకోవాలని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. ఏడెనిమిది నెలల్లో చేతికొచ్చే ఉద్యాన పంటలు ఎక్కడున్నాయో చెప్పాలి. ఆయిల్‌పామ్, కోకో, కొబ్బరి వంటి పంటలు సాగు చేసుకోవాలని చంద్రబాబు అంటున్నారు. ఉద్యాన పంటలు వేసిన పొలాలు వరి సాగుకు పనికొస్తాయా? మెట్ట ప్రాంతంలో సాగు చేస్తున్న పంటలపై చంద్రబాబుకు కనీస అవగాహన లేదనే విషయం దీనిని బట్టి తెలుస్తోంది. ఫ యూరియా కొరతపై ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తే యూరియా వాడి పండించిన వరి అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు చెప్పారు. మరి చిరుధాన్యాల పంటల సాగుకు ప్రభుత్వం కల్పించిన భరోసా ఏముంది? ఫ గోదావరి జలాలను వంశధారకు అనుసంధానం చేయడం వల్ల గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం లేదు. ఫ రైతు సమావేశంలో రైతులకు కనీసం యంత్రాలు, ఇన్పుట్ సబ్సిడీలు అందించకుండా సీఎం మొక్కుబడిగా పర్యటించారు. ఫ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న ఎర్ర కాలువ, తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువల అభివృద్ధి, ఏటా వేలాది ఎకరాలను ముంచెత్తుతున్న కొవ్వాడ కాలువల గురించి చంద్రబాబు ఒక్క మాట కూడా చెప్పకపోవడం బాధాకరం. ఫ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధేమీ లేదు. ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గత సంక్రాంతికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామన్న చంద్రబాబు హామీ అమలు కాలేదు. మళ్లీ వచ్చే సంక్రాంతి నాటికి మరమ్మతులు చేస్తానని నల్లజర్ల సమావేశంలో ప్రకటించి ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారు. 16 నెలల్లో జరగని రోడ్ల మ రమ్మతులు 50 రోజుల్లో ఎలా పూర్తవుతాయి? ఫ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.23 వేలు పలకగా, ప్రస్తుతం రూ.19,600 ఉంది. కౌలు రైతులకు ఈ ధర గిట్టుబాటు కావడం లేదు. ఫ ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టి రైతులపై భారం మోపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి విపత్తులు సంభవించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించింది. -
షో చేసి వెళ్లారు
అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంతో ఎలాంటి మేలూ జరగలేదు. వాళ్ల వద్దకు వస్తే ఎక్కడ నిలదీస్తారోనని ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. తమకు అనుకూలమైన రైతుల వద్దకు వచ్చి షో చేసి వెళ్లిపోయారు. గ్రామ శివారులో ఎవరికీ తెలియకుండా ఇద్దరు రైతులను కలిసి సీఎం సందేశ పత్రాలు ఇచ్చి వెళ్లిపోయారు. మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఈ–క్రాప్ సక్రమంగా చేయలేదు. ధాన్యం కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. – పరిమి సోమరాజు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్యం తాగిస్తే రోగాలు రావా? ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో గిట్టుబాటు ధర కోసం 1994లో రైతులు ధర్నా చేస్తున్న సమయంలో ఇద్దరు రైతులను పోలీసులు కాల్చి చంపారు. ఆ అప్రతిష్టను చంద్రబాబు మూటగట్టుకున్నారు. వరి పండిస్తే షుగర్, క్యాన్సర్ వస్తాయని ఆయనంటున్నారు. కానీ, ఇంటింటికీ మద్యం అందిస్తున్నారు. అది తాగితే క్యాన్సర్, షుగర్ రావా? రాగులు పండించాలని ఉచిత సలహా ఇస్తున్నారు. పుష్కలంగా నీరున్న ప్రాంతంలో వరి పండించి, ప్రజలకు మేలు చేయాలని చూస్తూంటే.. వద్దని చెప్పడం తగదు. రైతన్నా మీకోసం పేరుతో ఎలాంటి సభలూ పెట్టలేదు. – బూరుగుపల్లి సుబ్బారావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
కోటసత్తెమ్మ తిరునాళ్లు వైభవంగా ప్రారంభం
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో తిరునాళ్లు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ దంపతులు ఉదయం కలశ స్థాపన చేసి, ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, మహాన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకాలు, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, నిర్వహించారు. ఉదయం చండీ పారాయణ, సాయంత్రం హోమం చేసినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. అమ్మవారికి ప్రధానార్చకుడు అప్పారావుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు మెగా పీటీఎం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్ – టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,570 పాఠశాలల్లో ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 93,399 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 1,44,355 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, ఎస్ఎంసీ సభ్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువజంట మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక నరేంద్రపురం జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో యువజంట మృతి చెందింది. నానమ్మ, మనవరాలికి తీవ్ర గాయాలయ్యాయి. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని నందరాడకు చెందిన జుత్తుక లీలాప్రసాద్ (22), సౌమ్య (20) ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడు నెలల పాప కూడా ఉంది. లాలాచెరువు సమీపంలోని బర్మా కాలనీలో నివాసం ఉంటున్న వారు ఆధార్ కార్డు అప్డేషన్ కోసం స్కూటీపై రాజానగరం వెళ్లి, తిరుగు ప్రయాణంలో నందరాడ వెళ్లేందుకు నరేంద్రపురం జంక్షన్ దాటుతుండగా ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న లారీ పై జంక్షన్లో వేరొక స్కూటీని ఢీకొంది. దీంతో కంగారుపడిన లారీ డ్రైవర్ స్టీరింగ్‌ను ఎడమ వైపు (నరేంద్రపురం వైపు) తిప్పడంతో అప్పుడే జంక్షన్ దాటుతున్న ఈ యువజంట స్కూటీని ఢీకొని, వారి పైనుంచి దూసుకుపోయింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముందుగా ఢీ కొన్న స్కూటీపై ప్రయాణిస్తున్న కోరుకొండ మండలం గాదరాడకు చెందిన నానమ్మ బొడ్డు వెంకటలక్ష్మి, మనవరాలు సూర్యకుమారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంటి పాపను అనాథను చేశారు ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆనందగా జీవిస్తున్న లీలాప్రసాద్, సౌమ్యలను మృత్యువు లారీ రూపంలో వచ్చి కబళించి వేసింది. వారి అన్యోన్యతకు ప్రతిరూపంగా పుట్టిన మూడు నెలల పాపను అనాథగా మిగిల్చింది అంటూ ఆ యువజంట బంధువులు రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలను కదిలించి వేసింది. పాపను ఇంటి వద్దనే వదిలేసి, ఆధార్ అప్డేషన్ కోసం రాజానగరం వచ్చి, ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి లీలాప్రసాద్, సౌమ్య బంధువులు పరుగున వచ్చి, రక్తంతో మాంసం ముద్దగా మారిపోయిన ఆ మృతదేహాలను చూసి, గుండెలవిసేలా రోదించారు. నానమ్మ, మనవరాలికి తీవ్ర గాయాలు -
నిలదీస్తారని భయం.. తూతూమంత్రం
సాక్షి, రాజమహేంద్రవరం: చేతికంది వస్తున్న పంట నోటికందుతుందనుకుంటుని ఆశ పడుతున్న తరుణంలో.. అధిక వర్షాలు.. ఆపై మోంథా తుపాను బీభత్సం.. తీవ్ర పంట నష్టాలు.. తడిసిన ధాన్యం.. కొనుగోళ్లకు సవాలక్ష నిబంధనలు.. గత్యంతరం లేక దళారులకే అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్న దుస్థితి.. తాజాగా దిత్వా తుపాను.. నయాపైసా కూడా అందని పరిహారం.. ఉచిత పంటల బీమా ఎత్తివేత.. ఇతర పంటలకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఇలా అన్నదాతలు పుట్టెడు కష్టాల్లో ఉన్న తరుణంలో.. ‘రైతన్నా మీకోసం’ పేరిట సర్కారు వారు చేపట్టిన కార్యక్రమం జిల్లాలో తూతూమంత్రంగా ముగిసిపోయింది. సమస్యలపై రైతులు ఎక్కడ తమను నిలదీస్తారోననే భయంతో కూటమి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో మొక్కుబడిగానే పాల్గొన్నారు. దీంతో, వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం సీఎం సందేశ పత్రాలు రైతులకు ఇచ్చేందుకు మాత్రమే పరిమితమైంది. రైతుల సమస్యలు విన్న, పరిష్కరించిన దాఖలాలు లేకుండా పోయింది. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు, రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) పరిధిలో గత నెల 24 నుంచి 30వ తేదీ వరకూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకుని, పరిష్కార మార్గాలు చూపాలి. అయితే ‘అనుకున్నదొకటి.. అయినది ఒక్కటి’ అన్న చందంగా ఈ కార్యక్రమం మారింది. రైతుల ఇళ్ల వద్దకు ప్రజాప్రతినిధులు వెళ్లకుండానే ముగిసిపోయింది. అధికారులు కూడా అక్కడక్కడ రైతుల ఇళ్లకు మొక్కుబడిగా వెళ్లి, సీఎం సందేశ పత్రాలు పంపిణీ చేయడం, కాసేపు అక్కడే కూర్చొని నాలుగు మాటలు చెప్పడం.. వెనుదిరగడంతో సరిపెట్టారు. కేవలం ప్రచారార్భాటం తప్ప.. ఈ కార్యక్రమంతో తమకు ఒరిగిందేమీ లేదని రైతులు విమర్శిస్తున్నారు. అందుకే ముఖం చాటేశారు అక్టోబర్ నెలాఖరులో మోంథా తుపాను విధ్వంసంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. వారిని ఆదుకోవాల్సి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. మరోవైపు హామీ ఇచ్చిన మేరకు అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేదు. నిబంధనల పేరుతో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేయకపోవడం.. ఈ–క్రాప్ సక్రమంగా చేయకపోవడం వంటి చర్యలతో చంద్రబాబు ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో తమను రైతులు నిలదీస్తారనే భయంతో అధికార కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రైతన్నా మీకోసం కార్యక్రమానికి ముఖం చాటేశారు. కేవలం తమకు అనుకూలమని భావించిన రైతుల వద్దకు వెళ్లి, వారికి ఏదో చేసేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి దుకాణం సర్దేశారు. చంద్రబాబు సర్కారుపై డబ్బా కొట్టడానికే పరిమితమయ్యారు. కొన్నిచోట్ల తమ వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులకు రైతులు తమ కష్టాలు చెప్పుకోగా.. వారు చూద్దాం అని దాటవేత ధోరణి అవలంబించారు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ మధ్య విభేదాలతో ఎవ్వరూ ఈ కార్యక్రమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. పరిహారం అందక.. జిల్లావ్యాప్తంగా మోంథా తుపాను ప్రభావంతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.40.96 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ మేరకు అధికారులు నివేదిక పంపించి నెల దాటుతున్నా.. నేటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. దీనిపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారి వద్దకు వెళ్తే ఎక్కడ నిలదీస్తారోననే ఆందోళనతో ప్రజాప్రతినిధులు ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెనుకడుగు వేశారు. ‘అన్నదాత సుఖీభవ’లోనూ మోసం అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చారు. తీరా చూస్తే ఏడాదిన్నర కాలంలో కేంద్రంతో కలిపి ఇప్పటి వరకూ ఇచ్చింది. రూ.14 వేలు మాత్రమే. అది కూడా చాలా మంది రైతులకు ముఖ్యంగా కౌలు రైతులకు ఎగ్గొట్టారు. దీనిపై రైతులు నిలదీస్తారనే భయంతో కూడా కూటమి నేతలు ఈ కార్యక్రమానికి ముఖం చాటేశారు. నేతలు పాల్గొన్నారిలా.. ఫ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకటి రెండు రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని, తరువాత మిన్నకుండిపోయారు. పొలం ఎక్కడుంటే అక్కడే ఎరువులు ఇస్తామంటున్నారని.. పొలం ఎక్కడున్నా.. తాము నివసిస్తున్న ప్రాంతంలోనే ఎరువులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ సందర్భంగా రైతులు విన్నవించారు. ఫ అనపర్తి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తమకు అనుకూలమైన, టీడీపీ, జనసేన సానుభూతిపరులున్న పాలమూరు గ్రామంలో రైతుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఫ నిడదవోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో నేతలెవరూ రాకపోవడంతో ఈ కార్యక్రమం తూతూమంత్రంగా సాగింది. ఫ గోపాలపురం, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో సైతం నేతలు నామ్ కే వాస్తే అన్న చందంగా పాల్గొని, మిన్నకుండిపోయారు. ·˘ hÌêÏ ÐéÅç³¢…V> పుట్టెడు కష్టాల్లో కర్షకులు ·˘ {ç³Õ²Ýë¢Æý‡¯ól B…§øâýæ¯]l™ø OÆð‡™èl$ÌS ఇళ్లకు వెళ్లని కూటమి నేతలు ·˘ A¯]l$MýS*ÌS…V> E…yól ÐéÇMóS MýSÆý‡ç³{™éË$ ç³…_ Ñ$¯]l²MýS$¯]l² OÐðl¯]l… ·˘ Ððl¬MýS$PºyìlV> "OÆð‡™èl¯é² Ò$MøçÜ…' -
అక్కాతమ్ముళ్లు.. ప్రతిభలో ఘనులు
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు గ్రామానికి చెందిన అక్కాతమ్ముళ్లు పుల్లా సాయి అమృత, పుల్లా సాయి దీపక్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు వివరాలను కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా శివపురానికి చెందిన విద్యారంభ గురుకుల్ నిర్వాహకులు శ్రీమంజునాథ పూజార్ వెల్లడించారు. తాము నిర్వహించిన ఆన్లైన్ శిక్షణలో కళ్లకు గంతలతో వివిధ పనులు చేయడంలో వీరు శిక్షణ పొందారన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని పుల్లా సాయిదీపక్ జంగా బ్లాక్స్‌తో టాలెస్ట్ టవర్ రూపొందించాడన్నారు. సాయి అమృత స్మాల్ కళ్లకు గంతలతోనే 5.10 అడుగుల పేపర్ కప్పుల పిరమిడ్ రూపొందించిందన్నారు. ఈ కేటగిరీలో వీరిదే అత్యుత్తమ ప్రదర్శన కావడంతో ఇంటర్నేషనల్ బుక్ఆఫ్ రికార్డ్స్‌లో వీరి పేర్లు నమోదు చేశారన్నారు. ఈ మేరకు సంబంధిత సంస్థ జారీ చేసిన సర్టిఫికెట్లను, పతకాలను సాయి దీపక్, సాయిఅమృతలకు శ్రీమంజునాథ పూజార్ అందజేశారు. స్క్రబ్ టైఫస్పై ఆందోళన వద్దురాజమహేంద్రవరం రూరల్: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన చికిత్స అందుబాటులో ఉందని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ వ్యాధి సుత్సుగాముషి అనే కీటకం కుడితే సోకుతుందని, కుట్టిన ప్రదేశంలో ఎర్రటి మచ్చ కనిపిస్తుందన్నారు. పొలాలు, తోటలు, గుబురు చెట్లు ఉన్న ప్రదేశాలకు వెళ్లే వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. పొడవు చేతులు గల షర్టులు, ప్యాంట్లు వేసుకోవడం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం ద్వారా కీటకం కుడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని సూచించారు. జ్వరం, అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించాలన్నారు. వెండి పుష్పమాల సమర్పణరాజోలు: కడలి గ్రామంలో కొలువైన చెన్నకేశవస్వామికి ఆ గ్రామానికి చెందిన కాశీభట్ల లక్ష్మీకన్యాకుమారి రూ.38 వేలు విలువ చేసే 200 గ్రాముల వెండి పుష్పమాలను బుధవారం సమర్పించారు. దీన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి టి.నాగవిష్ణుకు అందజేశారు. కడలి గ్రామానికి చెందిన కాశీభట్ల రామశాస్త్రి సతీమణి లక్ష్మీ కన్యాకుమారి ఆ గ్రామ బ్రాహ్మణ ఆడపడుచుల తరఫున వెండి పుష్పమాల సమర్పించారని ఈఓ తెలిపారు. ఆటోను ఢీకొన్న ట్రాక్టర్ శంఖవరం: ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నెల్లిపూడికి చెందిన సైపిరెడ్డి సత్తిబాబుకు చెందిన ట్రాక్టర్ జి.కొత్తపల్లి నుంచి నెల్లిపూడి కర్రల లోడు తీసుకువస్తోంది. ఆ సమయంలో శంఖవరం నుంచి జి.కొత్తపల్లి వస్తున్న ఆటోను అర్జున్ బొమ్మ సమీపంలో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అచ్చంపేటకు చెందిన బొట్టా నాగయమ్మ, బొట్టా భవానికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
5,003 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం
జగ్గంపేట: మండలంలోని ఇర్రిపాక గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం సివిల్ సప్లయీస్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గోరింట గ్రామానికి చెందిన కోరుకొండ అచ్యుతరావు ఏపీ 39 యూవై 5549 అనే వాహనంలో రేషన్ బియ్యాన్ని ఇర్రిపాక మీదుగా జగ్గంపేట పరిసరాల్లోని చేపల చెరువులకు తీసుకువెళుతున్నాడు. ఇర్రిపాక గ్రామంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అధికారులు ఆ వ్యాన్‌లో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఆ బియ్యాన్ని జగ్గంపేట ఎంఎస్ఓ పాయింట్ వద్ద కాటా వేయగా వంద బస్తాల్లో 5,003 కేజీల ఉన్నట్టు నిర్ధారించారు. అవి మన్యం తేజ అనే వ్యక్తికి చెందిన బియ్యమని వ్యాన్ డ్రైవర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో అచ్యుతరావు, మన్యం తేజ, వ్యాన్ యజమాని గనిశెట్టి రాజులపై కేసులు నమోదు చేశారు. వ్యాన్, బియ్యం విలువ రూ.9 లక్షల వరకూ ఉంటుందని అంచనా. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ టి.గోపాలకృష్ణ, జగ్గంపేట ఎంఎస్ఓ జీఎం కృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆటపాట్లు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై నిర్లక్ష్యపు నీడలు అలముకున్నాయి. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా.. నిధుల విడుదల విషయంలో వెనుకాడుతోంది. ముఖ్యంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) పోటీల నిర్వహణకు నిధుల కొరత వేధిస్తోంది. అండర్ 14, 17, 19 తదితర అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. క్రీడాకారుల ఇబ్బందులు ఎస్జీఎఫ్ఐ పోటీల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో రూ.7 కోట్ల బడ్జెట్ కేటాయించినా, దాని నుంచి నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణ, అలాగే వివిధ రాష్ట్ర, జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపేందుకు నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ – 19 విభాగంలో క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపించడానికి రవాణా ఖర్చులుగా రూ.8 లక్షలు మాత్రమే కేటాయించారు. వీటితోనే వారికి క్రీడా దుస్తులు, రవాణా ఖర్చులు అందించాలి. అండర్ – 19లో దాదాపు 100 జట్లను బాలురు, బాలికల విభాగంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం అండర్–19 కార్యదర్శి మారడంతో పాత అకౌంట్లోనే ప్రభుత్వం కేటాయించిన డబ్బులు జమ అయ్యింది. ప్రస్తుతం క్రీడాకారులు తమ సొంత ఖర్చుతోనే పోటీలకు హాజరవుతున్నారు. సొంత ఖర్చులతో.. ఈ ఏడాది జిల్లాలో అండర్ – 19 విభాగంలో జిమ్నాస్టిక్స్, రోలర్ స్కేటింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. వీటితో పాటు దాదాపు 48 క్రీడాంశాల్లో బాలురు, బాలికల జట్లను జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు నిర్వాహకులు ఎంపిక చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న క్రీడాకారులు ఎక్కువ మంది ఈ విభాగంలో ఎంపికయ్యారు. వారందరూ సొంత ఖర్చులతో పోటీలకు హాజరయ్యేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూనియర్ కళాశాలల నుంచి ఎంపికై న క్రీడాకారులకు కళాశాల స్పెషల్ ఫీజు నుంచి రవాణా ఖర్చులు అందించాలని ఆదేశాలు ఉన్నా.. చాలా కళాశాలల్లో నిధులు అందించడం లేదనే వాదన వినిపిస్తోంది. అండర్ 14, 17 విభాగాల్లో... ఈ ఏడాది అండర్ 14, 17 విభాగాల్లో జిల్లాలో స్వ్కాష్, జుడో, జిమ్నాస్టిక్స్, ఖోఖో, రోలర్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కాకినాడ జిల్లాకు రూ.8 లక్షలు మాత్రమే అడ్వాన్సుగా చెల్లించారు. వీటిని సుమారు 200 (అండర్ 14, 17 బాలురు, బాలికల విభాగాలు) మంది క్రీడాకారులను (జిల్లా జట్లు) రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపేందుకు, క్రీడా దుస్తులు, బూట్లు, ట్రాక్ షూట్ అందించేందుకు వినియోగించారు. ఎస్జీఎఫ్ఐ పోటీల నిర్వహణకు అరకొర నిధులు నిర్వాహకుల అవస్థలు సొంత ఖర్చులతో క్రీడాకారుల పయనం దాతల సాయంతో భోజనాలు చంద్రబాబు పాలనలో క్రీడలకు దుస్థితిటికెట్లు చూపిస్తే డబ్బులు ఇస్తాం ఈ ఏడాది అండర్ 19 క్రీడాకారుల ఎంపికలను పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఎంపికై న క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందిస్తున్నాం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు హాజరయ్యే క్రీడాకారుల కోసం రూ.8 లక్షలు కేటాయించారు. కానీ అవి పాత అకౌంట్లో ఉండిపోవడంతో క్రీడాకారులు సొంత ఖర్చులతో పోటీలకు హాజరవుతున్నారు. వారు తమ ప్రయాణ టిక్కెట్లను తీసుకువచ్చి చూపిస్తే, వారికి డబ్బులు చెల్లిస్తాం. – వెంకటరెడ్డి, అండర్–19 కార్యదర్శి నిధులు కేటాయిస్తే మంచిది వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్జీఎఫ్ఐ రాష్ట్ర శాఖ నిధులు కేటాయించాలి. దాని వల్ల నిర్వాహకులకు భారం లేకుండా ఉంటుంది. కనీసం టోర్నమెంట్‌కు అయ్యే ఖర్చులో 50 శాతం నిధులు అయినా ముందుగా చెల్లిస్తే మంచిది. – శ్రీనివాస్, ఎస్జీఎఫ్ఐ అండర్ 14, 17 కార్యదర్శి, కాకినాడ జిల్లా -
దాతలే ఆధారం
రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు నిధులు కేటాయించక పోవడంతో పోటీల నిర్వహణకు దాతలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు దాదాపు రూ1.50 లక్షల నుంచి రూ.4 లక్షలు వరకూ ఖర్చవుతుంది. క్రీడాకారులకు అందించే పతకాలు, ట్రోఫీలను కూడా నిర్వాహకులే తమ సొంత ఖర్చులతో కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక భోజనాలను దాతల సహకారంతో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో రూ.7 కోట్ల బడ్టెట్ ఉన్నా జిల్లాల వారీగా అరకొర నిధుల కేటాయింపుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
ప్రశ్నలు వేసి.. సామర్థ్యం పరీక్షించి..
రాయవరం: దేశ భవిష్యత్తు తరగతి నాలుగు గోడల మధ్య తీర్చిదిద్దబడుతుంది. విద్యార్థుల భవిష్యత్తును పాఠశాల విద్య నిర్ణయిస్తుంది. పాఠశాలలో తరగతి వారీగా విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలను తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్ సర్వే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చురుగ్గా సాగుతోంది. పాఠశాల విద్యలో పునాది అభ్యసనం మెరుగు పర్చేందుకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ (ఎఫ్ఎల్ఎన్)ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు గత నెల 24 నుంచి సర్వే చేపట్టారు. దీని ఫలితాల ఆధారంగా వంద రోజుల ప్రణాళికను అమలు చేయనున్నారు. 3,224 పాఠశాలల్లో.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోని 61 మండలాల పరిధిలో 263 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 3,224 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో 1,03,641 మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదు తరగతి వరకూ చదువుతున్నారు. విద్యార్థుల్లో అభ్యసనా ఫలితాలు (లెర్నింగ్ అవుట్ కమ్స్) ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవడమే ఈ సర్వే లక్ష్యం. చేస్తున్నారిలా.. ప్రధానంగా తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థతో పాటుగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రైౖవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఛాత్రోపాధ్యాయులు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. సంబంధిత కాంప్లెక్స్ సీఆర్ఎంటీలు ఛాత్రోపాధ్యాయులకు సర్వేలో మార్గదర్శకత్వం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు ఈ సర్వేను మానిటరింగ్ చేస్తున్నారు. వేర్వేరు ప్రశ్నలు సర్వేలో భాగంగా విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అసెస్మెంట్ చేసే సమయంలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు ఇన్వాల్వ్ కాకుండా సర్వే చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి వేర్వేరు ప్రశ్నలు ఉంటున్నాయి. తెలుగులో చిత్రాలు, అక్షరాలు, పదాల గుర్తింపు, పేరాగ్రాఫ్ చదవడం వంటి ప్రశ్నల ఆధారంగా పరీక్షిస్తున్నారు. అలాగే గణితంలో చతుర్విద ప్రక్రియల మీద ప్రశ్నలు ఉంటున్నాయి. ఒకటి, రెండు తరగతులకు 35, అలాగే 3,4,5 తరగతులకు 42 ప్రశ్నల వంతున వేసి సమాధానాలను లీప్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. సర్వే అనంతరం విద్యార్థుల అభ్యసనా ఫలితాల మేరకు వంద రోజుల ప్రణాళిక అమలు చేసే అవకాశముంది. రాష్ట్రస్థాయిలో ఎస్సీఈఆర్టీ సర్వేను పర్యవేక్షిస్తోంది.సామర్థ్యాలు తెలుసుకునేందుకు.. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల లెర్నింగ్ అవుట్ కమ్స్ (అభ్యసనా సామర్థ్యాలు) తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నాం. దీని ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి యాక్షన్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుంది. – జి.నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టరు, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ఉమ్మడి జిల్లాలో ఎఫ్ఎల్ఎన్ సర్వే ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు అభ్యసనా సామర్థ్యం పరిశీలన వెనుకబడిన వారి గుర్తింపునకు చర్యలుజిల్లాల వారీగా వివరాలు జిల్లా స్కూల్ కాంప్లెక్స్‌లు పాఠశాలలు విద్యార్థులు కోనసీమ 87 1,377 30,881 తూర్పుగోదావరి 75 813 30,490 కాకినాడ 101 1,034 42,270 -
కోటసత్తెమ్మ తిరునాళ్లకు వేళాయె
నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో కొలువైన కోటసత్తెమ్మ అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. శక్తి స్వరూపిణి అయిన కోటసత్తెమ్మపై భక్తులకు అపారమైన భక్తి. అమ్మవారిని కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఏటా ఇక్కడ దేవీ నవరాత్ర మహోత్సవాలతో పాటు డిసెంబర్ నెలలో అమ్మవారి ‘తిరునాళ్లు’ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ ఏడాది తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ చరిత్ర ఇదీ.. తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. అమ్మవారు ‘శంఖచక్రగధ అభయ హస్తయజ్ఞోప వీత ధారిణిగా ఏక శిలావిగ్రహంతో దర్శనమిస్తారు. ఈ ఆలయ క్షేత్రంలో గతంలో కోట ఉండేదని కాలక్రమంలో అది అంతరించిందని భక్తులు చెబుతారు. కోటసత్తెమ్మ విగ్రహం 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్యుల నాటిది. నాటి నిరవద్యపురాన్ని (నిడదవోలు)పాలించిన కాకతీయరాజు వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలందుకుని కాలక్రమంలో కనుమరుగైన అమ్మవారి విగ్రహం 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామమూర్తి శాస్త్రి పొలం దున్నుతుండగా బయటపడింది. ఈ భూమి యజమాని రామమూర్తి శాస్త్రికి ఒకరోజు వచ్చిన కలను అనుసరించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని భక్తుల పాలిట పుణ్యస్థలంగా పేరుగాంచింది. ఇవీ కార్యక్రమాలు కోటసత్తెమ్మ అమ్మవారి ‘తిరునాళ్లు గురువారం నుంచి 8 తేదీ వరకు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తిచేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం విద్యుత్తు దీపాలంకరణలు, భారీ సెట్టింగులతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. గురువారం ఉదయం ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, ఛైర్మన్ దేవులపల్లి రవిశంకర్ దంపతులు కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభించి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేస్తారు. ప్రతి రోజు అమ్మవారికి సహస్ర నామ పూజలతో పాటు ఉదయం చండీపారాయణం, సాయంత్రం హోమాలు నిర్వహిస్తారు. 5న ఉదయం 10 గంటలకు గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి, నిడదవోలు నాంగల్యదేవి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి చీర–సారె సమర్పణ, 6న నిడదవోలు ఆర్యవైశ్య వర్తక సంఘం వారి చీర–సారె సమర్పణ, 7న అఖిల తెలుగుసేన మహిళా అధ్యక్షురాలు జి.ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుంచి 101 మహిళలతో చీర–సారె, కలశాలు, బోనాలతో అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. 8న సోమవారం సాయంత్రం 6 గంటలకు విలస గ్రామానికి చెందిన మానేపల్లి సత్యనారాయణ సన్నాయిమేళం, గరగ నృత్యాలు, నందన డాన్స్ ఆకాడమీ (తణుకు) వారి కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శన, కేరళ చందామేళం, కాళికా డాన్స్, మహిళల కోలాటం ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఈ ఏడాది కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగే తిరునాళ్లు కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – వి.హరిసూర్యప్రకాష్, అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ, తిమ్మరాజుపాలెం. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మహోత్సవాలు విద్యుత్ కాంతులతో మెరుస్తున్న ఆలయ ప్రాంగణం -
వ్యాస భారతం ధర్మాల పుట్ట
సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వేదవ్యాస భారతం ధర్మాల పుట్ట, ఏ శ్లోకాన్ని తాకినా అనేక ధర్మ రహస్యాలు వెల్లడి అవుతాయని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వేదవ్యాస మహాభారతం ప్రవచనంలో ఏడో రోజైన బుధవారం ఆయన శాకుంతలం ఇతివృత్తాన్ని వివరించారు. వేట తమకంతో కణ్వుని ఆశ్రమానికి వచ్చిన దుష్యంతుడు శకుంతల పట్ల ఆకర్షితుడు అవుతాడు. విప్ర సీ్త్రల పట్ల నా మనస్సు చలించదు, నీవు ఎవరివి అని శకుంతలను అడుగుతాడు. ఆమె తాను విశ్వామిత్రుని కుమార్తెనని, కణ్వుడు తనను పెంచిన తండ్రి అని వివరిస్తుంది. వారు గాంధర్వ వివాహం చేసుకుంటారని సామవేదం అన్నారు. తనకు పుట్టిన కుమారుని తీసుకుని దుష్యంతుని వద్దకు వెళ్ళిన శకుంతల ఆయన తిరస్కారానికి గురి అవుతుంది. నీవు ఎవరో నాకు తెలియదని అన్న దుష్యంతునితో శకుంతల అన్న మాటలను విద్యార్థి లోకానికి తెలియపరచాలని సామవేదం అన్నారు. ‘నీ హృదయంలో ఉన్న అంతరాత్మకు నిజం తెలుసు. ఏకాంతంలో జరిగినది ఎవరికీ తెలియదని అనుకోవద్దు, సూర్య చంద్రులు, అగ్ని, వాయువు, అంతరిక్షం, భూమి, ఉభయ సంధ్యలు, అంతరాత్మ సాక్షులు, వారి కన్ను కప్పలేవు‘ అని శకుంతల దుష్యంతునితో చెబుతుంది. దుర్వాస మహర్షి శాపంతో దుష్యంతుడు శకుంతలను మరచిపోయాడని వ్యాస భారతంలో లేదు, కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో ఇటువంటి కథనం కనపడుతుంది. ఈ కథనానికి పద్మ పురాణం ఆధారమని సామవేదం అన్నారు. భారతంలో స్త్రీ పాత్రలు ఉదాత్తమైనవని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): 2025 – 26 విద్యా సంవత్సరంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను జిల్లాలోని 11 మండలాల్లో నియమించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో 25 పోస్టులను భర్తీ చేస్తామని, డిసెంబర్ 8 నుంచి మే 7వ తేదీ వరకు వీరు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనపర్తి, బిక్కవోలు, పెరవలి, రాజమహేంద్రవరం (అర్బన్), రాజమహేంద్రవరం (రూరల్), ఉండ్రాజవరం, కొవ్వూరు, నిడదవోలు, సీతానగరం, రాజానగరం, కడియం మండలాల్లో ఈ పోస్టుల నియామకాలుంటాయన్నారు. అర్హత గల అభ్యర్థులు సంబంధిత మండల విద్యాశాఖాధికారులకు దరఖాస్తులను ఈ నెల 5వ తేదీలోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు మండల విద్యాశాఖాధికారులను సంప్రదించాలన్నారు. పనిచేసిన సర్వర్లు పెరవలి: మండలంలో వరికోతలు 85 శాతం పూర్తయ్యాయని, 11,061 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించామని వ్యవసాయాధికారి మేరీ కిరణ్ తెలిపారు. బుధవారం సాక్షి దినపత్రిలో ‘మోరాయించిన సర్వర్లు –వర్షార్పణం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై అఽధికారులు స్పందించారు. ఈ నెల రెండో తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వర్లు సాంకేతిక కారణాల వలన పని చేయలేదని, తరువాత సాంకేతిక సమస్య తొలగిందన్నారు. పెరవలిలో రైతు భరోసా కేంద్రానికి రైతులందరూ ఒక్కసారే రావడంతో కొద్ది సేపు ఆలస్యమైందని, తర్వాత ఆన్లైన్ చేసి ధాన్యాన్ని తరలించామని తెలిపారు. వర్షాల వలన ఽబరకాలు కప్పి ఉంచిన ధాన్యాన్ని ఈరోజు ఆరబెట్టించి రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లులకు పంపించమని తెలిపారు. అలాగే రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల వద్ద ఆన్లైన్ చేసి మిల్లులకు తరలిస్తామని వివరణ ఇచ్చారు. 6న జాబ్ మేళా అమలాపురం రూరల్: అమలాపురంలోని ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వసంతలక్ష్మి తెలిపారు. ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని కోరారు. -
ప్రతిభ చూపితే స్కాలర్షిప్ మీదే
● విద్యార్థులకు మంచి అవకాశం ● ఈ నెల 7న ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్ష ● సిద్ధమవుతున్న విద్యార్థులు ● ఉమ్మడి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు రాయవరం: ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలు అందిస్తోంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరుతో ఏటా ప్రతిభ చూపిన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు (తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ పూర్తయ్యే వరకు) ఆర్థిక సాయం చేస్తోంది. దీని ద్వారా నెలకు రూ.1,000 వంతున ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం ఇస్తోంది. ఈ ఏడాది కూడా ఉపకార వేతనాలకు అర్హత పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష సమీపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 10,557 మంది ఏటా నిర్వహించే ఈ పరీక్షకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా పరిధిలో 10,557 మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రం ఇలా.. ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షలో 180 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 90 మార్కులకు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ ఉండగా, మరో 90 మార్కులకు 7వ తరగతి, ఎనిమిదో తరగతి గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలపై ప్రశ్నలుంటాయి. పరీక్ష రాసేందుకు మూడు గంటల సమయం ఇస్తారు. మొదటి పేపరు మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ నాన్ వెర్బల్) పేపరు 90 మార్కులకు ఉంటుంది. నంబర్ సిరీస్ 10, సింపుల్ అర్థమెటిక్ 10, మిస్సింగ్ క్యారెక్టర్లు 10, వర్డ్ ఎనాలజీ 10, లెటర్ సిరీస్ 10 మార్కులు ఉంటాయి. నాన్ వెర్బల్ నుంచి 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపరు రెండో పేపరు కూడా 90 మార్కులకు ఉంటుంది. ఇందులో గణితం 20 మార్కులు, సైన్స్‌లో పీఎస్‌కు 10, కెమిస్ట్రీ 10, బయాలజీ 10, సోషల్ సబ్జెక్టులో భూగోళం 10, చరిత్ర 10, పౌరశాస్త్రం 10, అర్థశాస్త్రం నుంచి 10 మార్కులుంటాయి. ఏడవ తరగతి పూర్తిగా, 8వ తరగతిలో నవంబర్ వరకూ పూర్తయిన సిలబస్ వరకు చదవాలి. కొన్ని జనరలైజ్డ్ బిట్లు, సబ్జెక్టు మీద, అదనపు సమాచారం, కరెంట్ ఎఫైర్స్‌పై కూడా తగిన జ్ఞానం కలిగి ఉండాలి. బబ్లింగ్ విధానంలో.. విద్యార్థులు 180 నిమిషాల్లో 180 బిట్లకు సమాధానం రాయాల్సి ఉంటుంది. పేపర్ 1లో సమయాన్ని సద్వినియోగం చేసుకుని వేగంగా సమాధానాలు రాసి, అక్కడ మిగిలిన సమయాన్ని పేపర్–2లో గణితానికి వినియోగించుకుంటే విజయం సాధించడం చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్న పత్రంలో 60 మార్కులకు సులభంగా, 60 మార్కులకు మధ్యస్థంగా, 60 మార్కులకు కఠినంగా ఇచ్చే అవకాశముంది. కనీసం 130 మార్కులు దాటిన వారికి విజయావకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఓఎంఆర్ షీటుపై బబ్లింగ్ విధానంలో సమాధానాలు రాయాలి. పరీక్షా కేంద్రాల వివరాలు జిల్లా కేంద్రాలు విద్యార్థులు కోనసీమ 15 3,106 కాకినాడ 20 4,578 తూర్పుగోదావరి 13 2,873 మొత్తం 48 10,557 ఆదేశాలు జారీ చేశాం ఎన్ఎంఎంఎస్ పరీక్షను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
వీరేశ్వరస్వామికి రూ.9.96 లక్షల ఆదాయం
ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.9.96 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి వి.సత్యనారాయణ తెలిపారు. అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్, తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 45 రోజులకు గాను ఆలయంలో ప్రధాన హుండీ ద్వారా రూ.9,87,354, అన్నదాన హుండీ ద్వారా రూ.8,849 వెరసి రూ.9,96,203 సమకూరినట్లు తెలిపారు. వీటితో పాటు 5 విదేశీ రియాన్స్ వచ్చాయన్నారు. హుండీ ఆదాయం సొమ్మును దేవస్థానం ఖాతాకు జమ చేస్తున్నట్లు వివరించారు. తొలుత ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ హుండీలకు హారతి ఇచ్చి లెక్కింపును ప్రారంభించారు. -
ఎక్కడి ధాన్యం అక్కడే
పెరవలి: అన్నదాతకు ఖరీఫ్ సాగు కలసి రాలేదు సరికదా ప్రకృతి పగబట్టినట్లు వర్షాలు, తుపానులు దండెత్తడంతో పంట దక్కేలా కనిపించటం లేదు. ప్రభుత్వం కూడా రైతుల పట్ల నిర్లక్ష ధోరణి కనబరచడంతో వారి పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. అన్నింటిని తట్టుకుని ధాన్యం అమ్మే సమయంలో సర్వర్లు పనిచేయక ధాన్యం రాశుల్లో, బస్తాల్లో, చేలగట్ల మీద, అరుగులపై నిల్వ చేసుకుంటున్నారు. శనివారం నుంచి సర్వర్లు పనిచేయకపోవటంతో ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో మునిగితేలుతున్నారు. రైతులు మాత్రం ఒకవైపు వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, మరోవైపు కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదుకోవలసిన ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయటంతో రైతుల నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం మొలక వస్తుండగా, కొనుగోలు కేంద్రాల వద్ద 17 శాతం తేమ శాతం ఉంటేనే ధాన్యం కొంటామని చెప్పటంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఆరుదల ధాన్యం పట్టుకెళ్లినా సర్వర్లు పనిచేయకపోవటం వల్ల ధాన్యాన్ని రైతుల వద్దే ఉంచుకోవలసిన దుస్థితి ఏర్పడింది. 39,966 హెక్టార్లలో పూర్తికాని కోతలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 79,966 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా చేపట్టడంతో ఈ నెల 30 వరకు 40 వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తి కాగా మిగిలిన 39,966 హెక్టార్లలో కోతలు జరగవలసి ఉంది. జిల్లాలోని 18 మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పనిచేయని సర్వర్లు జిల్లాలో ధాన్యం కొనుగోలు ఈ నెల 29 వరకు బాగానే జరిగినా ఆ తరువాత నుంచి సర్వర్లు పనిచేయక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 205 ఏర్పాటు చేసినా సర్వర్లు పనిచేయక ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. ఒకవైపు వర్షాలు జోరుగా కురుస్తున్నా రైతులు మాత్రం ధాన్యం మాసూళ్లు ఆపలేదు. ఎప్పుడు వర్షం తగ్గితే అప్పుడు వరికోత యంత్రాలతో కోతలు కోయించి ధాన్యాన్ని రోడ్లపైకి తీసుకువచ్చి ధాన్యం తడిసిపోకుండా బరకాలతో కప్పి రాశులుగా చేశారు. నాలుగురోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సర్వర్ల గురించి అధికారులు పట్టించుకోవడంలేదు. దీనితో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. జిల్లాలో ధాన్యం నిల్వలు ఎన్ని జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేసి, అందుకు తగినట్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 30వ తేదీ వరకు జిల్లాలో 28,180 మంది రైతుల నుంచి 2,10,210.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగోలు చేశారు. అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో ఇంకా 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించవలసి ఉంది. ఇప్పటి వరకు కోతలు 60 శాతం పూర్తయ్యాయి. నాలుగు రోజులుగా జిల్లాలో వరి కోతలు జరిగి రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యం సుమారు లక్ష మెట్రిక్ టన్నులని అంచనా. వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు రావటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తగ్గుతున్న దిగుబడులు జిల్లాలో మోంథా తుపాన్‌కు ముందు జరిగిన మాసూళ్లలో దిగుబడి 30 నుంచి 35 బస్తాలు వస్తే ఇప్పుడు దిత్వా తుపాను వల్ల పండిన పంట తడిసి ఈదురు గాలులకు చేలు పడిపోయి ధాన్యం రాలిపోవటంతో దిగుబడి 18 నుంచి 22 బస్తాలు మాత్రమే వస్తోంది. ఖండవల్లి కొనుగోలు కేంద్రంలో సర్వర్ పనిచేయక ఎదురు తెన్నులు నల్లాకులవారిపాలెంలో మొలక వచ్చిన ధాన్యం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. 2023లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన తుపాను సమయంలో రైతులకు ముందస్తుగా హెచ్చరికలు చేయటంతో పాటు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి చేలల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. తడిసిన ధాన్యం సేకరించాలని ఆదేశాలు ఇవ్వటంతో పాటు ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. ఇప్పడు అటువంటి హెచ్చరికలు లేవు. అధికారులు పత్తాలేకుండా పోయారని, సంచులు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరాయించిన సర్వర్లు పట్టించుకోని అధికారులు నిలిచిపోయిన కొనుగోళ్లు తడిసి ముద్దయి మొలక వస్తున్న వైనం గగ్గోలు పెడుతున్న రైతన్నలు జిల్లాలో వరి సాగు 79,966 హెక్టార్లు కోతలు పూర్తి అయింది 60 శాతం ధాన్యం కొనుగోలు అంచనాలు 4 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికి 2.10 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ఆరబెట్టి పట్టుకు రమ్మన్నారు ఽతుపాను వలన ఽచేను ఎక్కడ పడిపోతుందోనని భయపడి రాత్రి సమయంలో వరికోత యంత్రంతో కోతలు కోయించి ధాన్యం పట్టుకొచ్చి గట్టుపై వేశాను. అంతే వర్షం వచ్చింది. కొనుగోలు కేంద్రానికి వెళితే ధాన్యం తడసింది, ఆరబెట్టి పట్టుకు రమ్మన్నారు. –బండెల సాయిరామ్, కౌలు రైతు, ఖండవల్లి ఏం చేయాలో అర్థం కావడం లేదు చేతికి వచ్చిన పంట నోటికి దక్కుతుందో లేదో తెలియటం లేదు. కష్టపడి కోతలు కోయించాను. ఆరబెట్టాను. తీరా కొనుగోలు కేంద్రానికి పట్టుకెళ్లితే సర్వర్లు పనిచేయటం లేదు, రేపు పట్టుకు రమ్మని చెప్పారు. వర్షం వచ్చి ధాన్యం తడిసి మొలక వచ్చింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. –కె.రాఘవులు, కౌలు రైతు, ఖండవల్లి గత ప్రభుత్వంలో అధికారులు సహకరించారు రైతు ప్రభుత్వం అంటే ఇదేనా? రైతులు నానా పాట్లు పడుతుంటే పట్టించుకున్న నాథుడే లేడు. వర్షాల వల్ల ధాన్యం మొలక వచ్చాయి. ఎండ కాస్తే కానీ ధాన్యం ఆరదు. అధికారులు ఎవరూ కనిపించటం లేదు. కొనుగోలు కేంద్రాల్లో సర్వర్లు పనిచేయటం లేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే అఽధికారి లేరు. నాయకులు లేరు. గత ప్రభుత్వంలో ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు అధికారులు సహకరించారు. – పిల్లా శ్రీనివాస్, రైతు, కొత్తపల్లి అగ్రహారం -
ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక వైఎస్సార్ స్కేటింగ్ రింక్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ఐ రోలర్ స్కేటింగ్ పోటీలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి. అండర్–14, 17, 19 విభాగాల్లో రింక్–1, రింక్–2, ఇన్లైన్ విభాగాల్లో పోటీలు జరిగాయి. మంగళవారం నిర్వహించిన పోటీలను మహబూబ్ బాషా ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. విజేతలకు మహబూబ్ బాషా, హరిష్, రవిచంద్ర బహుమతులు అందజేశారు. ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు సుధారాణి, శ్రీను, సీనియర్ పీడీలు జార్జి, రవిరాజు, జాన్, కౌర్, పరశురామ్, సురేష్‌రాజు పాల్గొన్నారు. -
ఆరు నెలలకే శిశువు జననం
ప్రత్తిపాడు: నెలలు నిండకుండానే ఓ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. శంఖవరం మండలం కొంతంగి కొత్తూరు గ్రామానికి చెందిన తూరంగి సుహాసిని ఆరు నెలల గర్భిణి. ఆరు నెలలు గడిచి రెండు రోజులైనా కాకముందే నొప్పులు రావడంతో 108 అంబులెన్సులో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవం అయ్యింది. నవజాత శిశువుకు ఉండాల్సిన లక్షణాలు లేకపోవడంతో సీహెచ్‌సీ సూపరింటెండెంట్, చిన్నపిల్లల వైద్యురాలు బి.సౌమ్యమైఖేల్ బృందం తక్షణ చికిత్సలు అందించారు. శిశువు సాధారణ స్థితికి రావడంతో తల్లి క్షేమంగా ఉంది. నెలలు నిండకుండా జన్మించిన శిశువు కేవలం 800 గ్రాముల బరువుతో క్షేమంగా ఉండడం విశేషమని డాక్టర్ సౌమ్యమైఖేల్ చెప్పారు. శిశువు ఊపిరితిత్తులు వృద్ధి చెందక పోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు.తల్లీ బిడ్డా క్షేమం -
విద్యుదాఘాతానికి కౌలురైతు మృతి
కాజులూరు: మండలంలోని దుగ్గుదుర్రులో కౌలురైతు కొప్పుశెట్టి అన్నవరం (67) విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మూడు రోజులు క్రితం అదృశ్యమైన కౌలురైతు మంగళవారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ వద్ద శవమై కనిపించటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం గ్రామంలోని ఒక రైతుకు చెందిన మూడున్నర ఎకరాల పొలం కొన్నేళ్లుగా కౌలుకు సాగుచేస్తున్నాడు. ఆదివారం పొలానికి వెళ్లిన అన్నవరం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా అన్నవరం పొలానికి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తుప్పలలో నుంచి పొగలు రావటం స్థానిక రైతులు గమనించారు. మంగళవారం సాయంత్రం కొందరు రైతులు దగ్గరకు వెళ్లి చూడగా అన్నవరం విద్యుత్ వైర్లకు చుట్టుకుని ఉన్నాడు. విద్యుత్ షాక్ వల్ల అతని శరీరం నుంచే పొగలు వస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలుపుదల చేసి తుప్పలు తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆదివారం అన్నవరం పొలం పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా వర్షం కారణంగా ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగులుకుని షాక్‌కు గురై మృతిచెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. గొల్లపాలెం ఎస్సై ఎం మోహన్‌కుమార్, ట్రాన్స్‌కో, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు అన్నవరం భార్య ఇటీవల మృతి చెందగా కుమార్తె వద్ద ఉంటున్నాడు. రామేశంపేటలో మరొకరు రంగంపేట: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడని ఎస్సై శివప్రసాద్ తెలిపారు. రామేశంపేట గ్రామానికి చెందిన పిల్లల తాతబ్బాయి (51) మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న తన ఇంటి రెండో ఫ్లోర్ పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దామని పైకి వెళ్లాడు. అక్కడ పనులు పరిశీలిస్తుండా పిట్ట గోడ పక్క నుంచి వెళుతున్న కరెంటు వైర్ తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని కుమారుడు పిల్లల కిషోర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై వివరించారు. -
బాలిక అదృశ్యంపై కేసు
సీతానగరం: మండలంలోని పురుషోత్తపట్నంకు చెందిన పదేళ్ల మల్లి సాత్విక కనిపించడం లేదని పెదనాన్న మల్లి బాపిరా జు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్‌కుమార్ మంగళవారం తెలిపారు. పురుషోత్తపట్నంకు చెందిన మాటలు సరిగా పలకని (మూగ) సాత్విక సోమవారం 5.30 గంటలకు వీధిలో తోటి పిల్లలతో ఆటలు ఆడింది. తర్వాత కనిపించకుండా పోయింది. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 94409 04832, 94409 04829 నంబర్లకు కాల్ చేయాలని ఎస్సై కోరారు. జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం): 69వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అండర్–17 విభాగంలో నగరానికి చెందిన జూహిత గుణ బంగారు పతకం సాధించింది. లాలాచెరువు మున్సిపల్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న జూహిత అరుణాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న జాతీయ స్ధాయి పోటీల్లో ఈ ఘనత సాధించింది. ఇటీవలే కామన్ వెల్త్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొన్ని బంగారు పతకం సాధించిన జూహిత ఆసియన్ ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున పాల్గొని పతకాలు సాధించడమే లక్ష్యంగా పుణే స్టోర్ట్స్ అకాడమిలో శిక్షణ తీసుకుంటోంది. -
వైకల్యంపై గెలిచిన సంకల్పం
● విధిని ఎదిరించి నిలబడిన దివ్యాంగులు ● మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న వైనం ● ఆపన్న హస్తమందించిన మాజీ సీఎం వైఎస్ జగన్ ● చంద్రబాబు పాలనలో పింఛన్ల వెరిఫికేషన్ పేరుతో వేధింపులు ● నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కపిలేశ్వరపురం: వైకల్యం భౌతికంగా మాత్రమే వెనుకబాటు. సంకల్ప బలం ఉంటే వైకల్యం తోక ముడుస్తుంది. ప్రతిభ కనబర్చడంలో దివ్యాంగులు ఏ మాత్రమూ తక్కువ కాదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దివ్యాంగుల ప్రగతి, ప్రతిభను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వారి పట్ల చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న విధానాలు విస్తుగొల్పుతున్నాయి. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కథనం... చంద్రబాబు పాలనలో సతమతం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దివ్యాంగులకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎడాపెడా వాగ్దానాలు ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే దివ్యాంగ పింఛను లబ్ధిదారుల్లో అనర్హులున్నారంటూ సర్వే చేపట్టి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేశారు. వైకల్యంతో బాధపడుతున్న వారి రూ.15వేల పింఛన్లపై అక్కసు వెళ్లగక్కుతూ దివ్యాంగులను వేధిస్తున్నారనే విమర్శలున్నాయి. కొత్తగా అందజేసిన దరఖాస్తులు తిరస్కరణకు గురి చేశారంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లో రాణిస్తూ.. ఈ ఏడాది మార్చిలో గుజరాత్ సూరత్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వీల్ చైర్ క్రికెట్ టీ–10 మానస్ కప్ టోర్నీలో ఏపీ వీల్ చైర్ క్రికెట్ జట్టు ప్రతిభ కనబర్చింది. 15 జట్టు సభ్యుల్లో ఎనిమిది మంది ఉమ్మడి తూర్పు గోదావరికి చెందిన క్రీడాకారులున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ రాజస్థాన్ అల్వార్‌లో నిర్వహించిన 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ –2024 పోటీల్లో అమలాపురానికి చెందిన రెడ్డి నరేంద్రకుమార్, జి.గంగరాజు రన్నింగ్ విభాగంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. కంటి చూపులేకపోయినా... కాళ్లు కదలకపోయినా.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామానికి చెందిన 36 ఏళ్ల కసిరెడ్డి సత్తిబాబు పుట్టుకతో అంధుడు. తండ్రి జోగిరాజు వ్యవసాయ కూలి, అమ్మ నాగమణి గృహిణి. వారికి సత్తిబాబు పెద్ద కుమారుడు కాగా మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరో తరగతి వరకూ స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనూ, 7 నుంచి పది వరకూ మండపేటలోని అంధుల పాఠశాలలోనూ, గ్రాడ్యుయేషన్‌ను 2007–10 విద్యాసంవత్సరంలో తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోనూ చదివారు. ఉపాధ్యాయుడు అవ్వాలన్న తలంపుతో నెల్లూరు జిల్లా గూడూరులో బీఈడీ పూర్తి చేశారు. 2014లో డీఎస్సీ రాసినా విజయం వరించలేదు. అదే ఏడాది రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. సత్తిబాబు మాత్రం మనోధైర్యంతో ముందుకు సాగుతూ 2018లో మరోసారి ప్రయత్నించారు. రెట్టించిన ధైర్యంతో 2025 డీఎస్సీలో విజయం సాధించారు. ప్రస్తుతం కాకినాడలోని ఆనంద భారతి మున్సిపల్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పాఠశాలలో వీల్ చైర్‌పై కూర్చుని విద్యార్థులకు బోధిస్తున్నారు. పాఠ్యాంశాలను తన బ్రెయిలీ లిపిలో చదువుకుని అవగాహనను పెంచుకుంటున్నారు. జననేత జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్న దివ్యాంగులు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి దివ్యాంగుల చెంతకు పాలనను తీసుకొచ్చారు. ఒకటో తేదీ తెల్లవారుజామునే దివ్యాంగుడికి రూ.మూడు వేలు, తీవ్ర వైకల్యం గలవారికి రూ.15వేల చొప్పున పింఛను అందించారు. ఉమ్మడి జిల్లాలో 70,984 మంది దివ్యాంగులు రూ.22,14,63,000 విలువైన పింఛన్లను నెల నెలా పొందారు. సచివాలయంలోనే సదరం స్లాట్ బుకింగ్ సదుపాయం దక్కింది. ఉమ్మడి జిల్లాలోని 64 భవిత కేంద్రాలను బలోపేతం చేశారు. మానవత్వం చూపండి వైకల్యం ఉన్నవారిని జాలితో కాకుండా మానవత్వంతో చూడాలి. వారికి చేయూతనివ్వాలి. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. – వేల్పూరు వీరబాబు, ఉపాధ్యాయుడు, వెదురుమూడి 15 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు దూరమైనా.. రాయవరం మండలం వెదురుపాకకు చెందిన అంధుడైన వేల్పూరి వీరబాబు తల్లిదండ్రులు 15 ఏళ్ల వయసులో చనిపోయారు. ఒకపక్క కంటి చూపు లేకపోవడంతో పాటు అమ్మనాన్నల తోడు దూరమవ్వడం వీరబాబును కుంగదీసింది. 2008 నుంచి 2010 వరకూ బొమ్మూరు డైట్ కళాశాలలో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి 2012 డీఎస్సీలో ప్రతిభ కనబర్చి దివ్యాంగ కోటాలో కాకుండా జనరల్ కోటాలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని సాధించారు. ప్రస్తుతం వెదురుమూడి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. -
ఉద్యోగాల పేరిట టోపీ
● రూ.75 లక్షల వసూలు ● ట్రాంజ్ ఇండియా కార్పొరేట్ నెట్‌వర్క్‌కు చెందిన ఎనిమిది మంది అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన కాకినాడ ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్ పిఠాపురం: ఉద్యోగాల పేరుతో యువకులకు గాలం వేసి సుమారు రూ.75 లక్షలు వసూలు చేసి మోసగించిన కేసులో ట్రాంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నెట్‌వర్క్‌కు చెందిన 8 మందిని అరెస్ట్ చేసినట్లు కాకినాడ ఎస్డీపీవో (సబ్ డివిజినల్ పోలీసు ఆఫీసర్) మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. పిఠాపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. రాయుడుపాలేనికి చెందిన నాళం గంగాభవాని గత నెల 24వ తేదీన పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ‘ఉద్యోగ అవకాశాలు. నెలకు రూ.15,000 నుంచిరూ రూ.35,000 జీతం‘ అని ఉన్న పాంప్లెట్ చూసి, అందులోని నంబర్లకు కాల్ చేసింది. అటువైపు మాట్లాడిన వ్యక్తులు ప్రాసెసింగ్ ఫీజులు, ల్యాప్‌ట్యాప్ పేరుతో రూ.24,000 ఫోన్ పే ద్వారా పంపించమని చెప్పి పంపిన తరువాత మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోటపల్లి సాయి, అతని స్నేహితులు మరో ముగ్గురు ఒక్కొక్కరు రూ.13 వేల చొప్పున ఇలాగే మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు. పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్, ఎస్సైలు వి.మణికుమార్, ఎస్కే జానీబా షాతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించామన్నారు. ట్రాంజ్ ఇండియా కార్పొరేట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రాజమహేంద్రవరంలో కార్యాలయం ఏర్పాటు చేసి, డేటాఎంట్రీ, టెలికాలింగ్ ఉద్యోగాల పేరుతో పాంప్లెట్లు ముద్రించి పిఠాపురం సహా పరిసర ప్రాంతాల్లో అతికించి, నిరుద్యోగుల నుంచి రూ.13,000 చొప్పున వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రత్యేక బృందాల సాయంతో నిందితుల పట్టివేత ఎవరినైనా కొత్త వ్యక్తులను కంపెనీలో జాయిన్ చేసినవారికి కంపెనీ రూ.900 ఇస్తుందని నమ్మించారు. జాయిన్ అయిన కొత్త వ్యక్తులతో బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేసి ఫోన్ కాల్స్ ద్వారా ఇతర వ్యక్తులను మోసం చేసేవారు. అకౌంట్లో డబ్బు వేయించుకున్నాక, మొత్తం నగదును వారితో డ్రా చేయించి సొమ్ముని మేనేజర్ అయిన మంజునాథ్ తీసుకుని కంపెనీకి డిపాజిట్ చేస్తున్నట్లు నమ్మించేవారు. గత సంవత్సరం నుంచి సుమారు రూ.75 లక్షలు నిరుద్యోగ యువతీ యువకుల వద్ద నుంచి వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా ఈ మోసాలకు పాల్పడిన సత్యసాయి జిల్లా గుండువెల్ల గ్రామానికి చెందిన మేకల మంజునాథ్, కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా మల్లనాయకనపల్లికి చెందిన సిద్ధేశ్ శ్రీధర్, సిద్దేశ్ సుదీ, నంద్యాల జిల్లా హనుమంతుకుండకు చెందిన యశ్వంత్ కుమార్, అనంతపురం జిల్లా మార్తాడుకు చెందిన వడ్డి జయరాముడు, పార్వతీపురం జిల్లాకు చెందిన దేశం సౌజన్య, అనంతపురం జిల్లా మద్దన్నకుంటకు చెందిన నాగప్ప కావ్య, యానాంకి చెందిన రేపు మహాలక్ష్మిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి ల్యాప్‌ట్యాప్, అకౌంట్ బుక్స్, ఏటీఎం కార్డులు, మొబైల్స్, సిమ్ కార్డ్స్, రూ.53,000 నగదు, 20 గ్రాముల బంగారం, టీ షర్ట్స్ ట్రాన్స్ ఇండియా కంపెనీ ప్రమోషన్ ఐటమ్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం పిఠాపురం జీఎఫ్ సీఎం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ నేత కారుకు నిప్పు పెట్టిన యువకులు
రమేష్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న చెల్లుబోయిన నరేన్ పెట్రోలు పోసి నిప్పటించడంతో దగ్ధమైన రమేష్‌కు చెందిన కారు రాజమహేంద్రవరం రూరల్: వెంకటనగరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత మోతా రమేష్‌కు చెందిన ఐ20 కారును మంగళవారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.20 గంటల మధ్య సమయంలో ఇద్దరు యువకులు పెట్రోలు పోసి నిప్పుపెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. ఇంటిముందు కారు పార్కింగ్ చేసి ఉండగా ఈ ఘటనకు పాల్పడ్డారు. వెంకటనగరంనకు చెందిన కొల్లపుధోనీ, గుమ్మడి చరణ్‌లపై అనుమానం ఉందని, పూర్తి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని మోతారమేష్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. త్రీ టౌన్ ఎస్సై అప్పలరాజు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఈ విషయం తెలియగానే తిరుపతి పర్యటనలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫోన్లో ఎస్పీ డి.నరసింహకిశోర్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటనగరం గ్రామంలో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కారు దగ్ధం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. వేణుగోపాలకృష్ణ తన కుమారుడు నరేన్, పార్టీ నాయకులను వెంకటనగరం పంపించారు. మోతారమేష్ను చెల్లుబోయిన నరేన్ కలిసి ఘటనపై ఆరా తీశారు. అధైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నరేన్ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు ఆచంట కళ్యాణ్, సుందరపల్లి అనిల్, చాపరాజా, అప్పానాని, ఓడూరి రాంకీ, కొల్లినాని, కల్లూరి చైతన్య, ఉండ్రాజవరపు సూర్య, నక్కాధనరాజ్, అల్లంపల్లి శ్రీను, పంతం ప్రసాద్, వెంకటనగరం వైఎస్సార్ సీపీనే తలు పాల్గొన్నారు. -
మొరాయించిన సర్వర్లు
ఫ 4 రోజులుగా నిలిచిన ధాన్యం కొనుగోళ్లు ఫ రైతుల పడిగాపులు పెరవలి: ఖరీఫ్ ఆది నుంచీ నష్టాల పాలైన రైతులకు ధాన్యం చేతికి వచ్చినా కష్టాలు తప్పటం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే సర్వర్లు మొరాయించడంతో అమ్మకాలకు పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం ఒకవైపు తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తూండగా.. మరోవైపు గత శనివారం నుంచి సర్వర్ సమస్య రావడంతో ధాన్యం అమ్మలేక, దాచడానికి చోటు లేక నానాపాట్లూ పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నా పట్టించుకున్న వారే లేరని వాపోతున్నారు. కొనుగొలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నా ఏ ఒక్క రైతు వివరాలూ ఆన్లైన్ అవడం లేదని, మరోవైపు వాతావరణం భయపెడుతోందని ఆవేదన చెందుతున్నారు. సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. -
‘నన్నయ’కు 5 ఐఎస్ఓ సర్టిఫికెట్లు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీకి ఒకేసారి 5 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయని, ఇదే ఒరవడిలో త్వరలోనే ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్ కూడా అందుకుంటామని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీలోని ఈసీ హాలులో ఐక్యూ ఏసీ డైరెక్టర్ వి.పెర్సిస్ సమన్వయంతో మంగళవారం జరిగిన ఐఎస్ఓ ఎగ్జిట్ సమావేశంలో హిమ్ (హెచ్‌వైఎం) ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ సంస్థ అధిపతి ఆలపాటి శివయ్య వీటిని వీసీకి అందజేశారు. అవసరాలకు అనుగుణంగా ఎనర్జీ, పర్యావరణ నిర్వహణ వ్యవస్థలను, విద్యార్థులకు అందిస్తున్న ఉత్తమ విద్యా సేవలకు, జెండర్ సెన్సిటైజేషన్ ఆడిట్ అమలుకు ఈ సర్టిఫికెట్లు ప్రతీకగా నిలుస్తాయన్నారు. శివయ్య మాట్లాడుతూ, వర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆడిట్ ప్రక్రియ సంతృప్తినిచ్చిందన్నారు. దీనికిగాను త్వరలోనే ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్ అందిస్తామని చెప్పారు. తమ సంస్థ ద్వారా తొలిసారిగా ‘నన్నయ’ వర్సిటీకే ఈ సర్టిఫికెట్ అందజేయనున్నామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఖర్మాస్పత్రులు
ఫ వైద్యానికి తాళాలుఫ ప్రభుత్వాస్పత్రుల్లో పడకేసిన వైద్యం ఫ పిఠాపురం నియోజకవర్గంలో పీహెచ్‌సీలకు రాత్రి వేళ తాళాలు ఫ సకాలంలో వైద్య సేవలందక ప్రాణాలు కోల్పోతున్న రోగులు ఫ సీహెచ్‌సీలో సెక్యూరిటీ గార్డుతోనే వైద్య సేవలు ఫ భయాందోళనలకు గురవుతున్న ప్రజలు పిఠాపురం: ఎవరైనా అస్వస్థతకు గురైతే ప్రతి క్షణం ఒక యుగంలా మారుతుంది. గోల్డెన్ అవర్స్‌లో వైద్యం అందితే నిండుప్రాణం నిలబడే చాన్స్ ఉంటుంది. అదే క్షణం ఆలస్యం చేస్తే ఆ ప్రాణదీపం కొడిగట్టిపోయే ప్రమాదం ఉంటుంది. కాస్త స్థితిమంతులైతే కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ నిరుపేదలకు ప్రభుత్వ ధర్మాస్పత్రులే దిక్కు. కానీ, నేడు అక్కడకు వైద్యం చేయించుకోవడానికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యులు లేక వైద్యం అందకపోవడం ఒక ఎత్తయితే.. తీరా వెళ్లినా ఆస్పత్రులకు తాళాలు వేసి ఉండటంతో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలవరపెడుతోంది. 24 గంటలూ వైద్య సేవలందించాల్సిన పీహెచ్‌సీలు సాయంత్రం 4 గంటలు దాటితే చాలు.. మూత పడుతున్నాయి. ఈ నియోజకవర్గానికే పెద్దాస్పత్రి అయిన పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)తో పాటు కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని పీహెచ్‌సీలు వైద్య సేవల్లో ప్రగతి చూపాల్సింది పోయి నానాటికీ దిగజారిపోవడం.. సేవా లోపాలతో వీటి ప్రతిష్ట మసకబారిపోవడం వంటి సంఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక అనర్థం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడా లేని వైద్య సేవలు తీసుకొస్తున్నామంటూ పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు నెరవేరతాయో లేదో తెలీదు కానీ, సరైన వైద్య సేవలందక రోగులు నిత్యం నరకం చూస్తున్నారు. దిగజారిన సేవలు ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తమ వైద్య సేవలు అందించడం ద్వారా పిఠాపురం సీహెచ్‌సీ రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు అందుకుంది. అటువంటి సీహెచ్‌సీ పరిస్థితి కొన్నాళ్లుగా దిగజారింది. ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న బాలింతలకు ఇక్కడి వైద్యులు వణుకు పుట్టిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన ఆపరేషన్లను తూతూమంత్రంగా పూర్తి చేసి, కుట్లు వేసే పనిని ఎటువంటి శిక్షణ, అవగాహన లేని కింది స్థాయి సిబ్బందికి అప్పగిస్తున్నారు. దీంతో, ఆ కుట్ల వద్ద ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ బాలింతలు, వారి బంధువులు గత సెప్టెంబర్‌లో ఆందోళన చేశారు. ● పిఠాపురం మండలం విరవకు చెందిన గర్భిణి ఉమామహేశ్వరి తొమ్మిది నెలలుగా ఈ ఆస్పత్రిలోనే వైద్య సేవలు పొందింది. తొమ్మిది నెలలు పూర్తవుతూండగా ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన ఇక్కడి వైద్యురాలు సుజాత స్కానింగ్ చేయించి, రెండు రోజుల అనంతరం పురుడు కోసం కాకినాడ ఆస్పత్రికి వెళ్లాలని రిఫర్ చేశారు. కాకినాడ ఆస్పత్రిలో చేరిన తరువాత రెండు రోజుల క్రితమే బిడ్డ కడుపులోనే చనిపోయిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ చేసి, చనిపోయిన బిడ్డను బయటకు తీసి తల్లిని రక్షించారు. ● గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన నిండు గర్భిణి దొండపాటి శ్రీదుర్గ(25)కు వైద్యల పర్యవేక్షణలో పురుడు పోయాల్సి ఉంది. అయితే, వైద్యులు బలవంతంగా నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించి, ఆమె మృతికి కారకులయ్యారని బంధువులు ఆరోపించి, ఆందోళనకు దిగారు. ● మరీ దారుణంగా పిఠాపురం సీహెచ్‌సీలో వైద్యులు చేయాల్సిన పనిని కాపలా కాసే సెక్యూరిటీ గార్డుతో చేయించడం రోగులను తీవ్రంగా కలవరపెట్టింది. ఏకంగా మార్చురీలో పోస్టుమార్టం కూడా సెక్యూరిటీ గార్డే చేయడం చూస్తేనే ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు ఏవిధంగా దిగజారయో అర్థం చేసుకోవచ్చు. ● తాజాగా సోమవారం రాత్రి గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఇమంది మాణిక్యం అనే వ్యక్తి అస్వస్థతకు గురవగా స్థానికులు చేబ్రోలు పీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రికి తాళాలు వేసి ఉండటంతో 108కి ఫోన్ చేశారు. అది కూడా గంట అయినా రాకపోవడంతో సకాలంలో వైద్యం అందక మాణిక్యం మృతి చెందాడు. ● ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రులపై పర్యవేక్షణ పెంచి, పూర్తి స్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించి ఉంటే రోగుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి ఉండేది కాదని పలువురు అంటున్నారు. ప్రాణం పోసే చోటే ప్రాణాలు పోతున్నాయి వైద్య వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే ప్రమాదమనే భయాందోళనలను ప్రజల్లో కలిగించింది. ఇటీవల జరిగిన అన్ని సంఘటనల్లోనూ ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. పర్యవేక్షణ కొరవడటంతో ప్రభుత్వాస్పత్రుల్లోని కొంత మంది వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి నిరుపేదలు ఆస్పత్రికి వస్తే వైద్యుల నిర్లక్ష్యం వారి ప్రాణాలు తీస్తోంది. ప్రాణాలు నిలపాల్సిన ఆస్పత్రిలోనే ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం చాలా దారుణం. 24 గంటలూ వైద్యం అందాల్సిన పీహెచ్‌సీలకు తాళాలు వేయడం చూస్తేనే వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. చర్యలు తీసుకోపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతాం. వైద్యులు చేయాల్సిన పనిని సెక్యూరిటీ గార్డులతో చేయించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఈ సంఘటనలపై విచారణ జరిపించాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి. – వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పిఠాపురం -
భారత కథకు మూలపురుషుడు వ్యాసుడు
అల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): భారత కథను రచించినవాడే కాదు.. దీనికి మూలపురుషుడు కూడా వేద వ్యాసుడేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వేదవ్యాస భారత ప్రవచనాన్ని ఆరో రోజైన మంగళవారం ఆయన కొనసాగించారు. ‘వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే’ అని ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. వ్యాసుడు విష్ణువే. కనుకనే మహాభారతాన్ని రచించగలిగాడు. ఇతరులకు అది సాధ్యం కాదు. వ్యాసోచ్ఛి ష్టం జగత్ సర్వం అన్నది అక్షరసత్యం. సాహిత్యమంతా వ్యాసుని ఉచ్ఛిష్టం నుంచి వచ్చినదే. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాత శాకున్తలమ్, మాఘుని శివుపాల వధ తదితర కావ్యాలన్నిటికీ మూలం భారతమే’ అని చెప్పా రు. బ్రహ్మసూత్రాలు వ్యాసుడు రాయలేదని, బాదరాయణుడు, మరొకరంటూ కొందరు పండితులు వ్యాఖ్యానాలు చేయడం శోచనీయమన్నారు. భారత భాగవతాలు, పురాణాలు రచించిన వ్యాసుడు కాక బ్రహ్మసూత్రాలు రాసింది మరొకరు కాదని స్పష్టం చేశారు. ‘మట్టి కుండ నుంచి పుట్టిన నీ పుట్టుక ఎట్టిది?’ అనే సినీ కవుల సంభాషణలు మూలగ్రంథాలను అధ్యయనం చేయకుండా రాసినవేనన్నారు. ఋషి హృదయాన్ని ఉపాసన ద్వారా గ్రహించాలని, కేవలం భాషాపాండిత్యాలు సరిపోవని చెప్పారు. భాగవతంలో విష్ణుదేవుని 21 అవతారాలు కనపడతాయని, వాటిలో 17వది వ్యాసుడేనని అన్నారు. ‘మహాత్ముల పుట్టుకలను మామూలు పుట్టుకలుగా భావించరాదు. అవి దివ్యమైనవి. నిన్న వైజ్ఞానికంగా అసాధ్యమనుకున్నవి నేడు రుజువు కావడం చూస్తున్నాం. నాటి మానవుల ఆయుఃప్రమాణాలు వేరు. జగత్తుకు మూలం ధర్మం. ధర్మానికి మూలం వేదం. వేదాల్లో ఉన్న ధర్మాలను చెప్పడానికే స్మృతి పురాణేతిహాసాలు ఆవిర్భవించాయి. 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించిన వాడు మహాయోగి కాగలడని స్వామి వివేకానందుడు అన్నాడు. ధర్మనిష్ఠయందే నిరంతరం చరించే మహామునుల మనస్సులు కొన్ని సందర్భాల్లో చలించడం దైవప్రేరణ వల్లనే జరిగింది’ అని వివరించారు. కురుపాండవుల జనన విశేషాలను సామవేదం తన ప్రవచనంలో వివరించారు. -
పరిహారం ఎప్పుడు బాబూ?
సాక్షి, రాజమహేంద్రవరం: మోంథా తుపాను అక్టోబర్ నెలాఖరులో విరుచుకుపడి రైతులను నిండా ముంచేసింది. పంట చేతికందే సమయంలో వచ్చిన ఈ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పొలాల్లో నీరు చేరి, పంట కోతలకు సైతం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మరోవైపు ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఆపత్కాలంలో రైతులకు అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. పంట నష్టం అంచనాలు అరకొరగా రూపొందించి మమ అనిపించేసింది. ఇక పరిహారం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. వారి అవస్థలను ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా రైతులకు ఎంతో చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలకు నాంది పలికిందనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే గత నెల 24 నుంచి 30వ తేదీ వరకూ ‘రైతన్నా మీకోసం’ పేరిట ప్రచారార్భాటానికి శ్రీకారం చుట్టింది. రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధిలో శాశ్వత మార్పు తెస్తామని చెబుతోంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలోనూ తూతూ మంత్రంగానే నిర్వహించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు బుధవారం నల్లజర్ల రానున్నారు. తమను ఆదుకోవాల్సిన సమయంలో ఇటువంటి ప్రచార కార్యక్రమాలేమిటనే విమర్శ రైతుల నుంచి వస్తోంది. అన్నదాతకు అపార నష్టం ● జిల్లావ్యాప్తంగా మోంథా తుపాను నష్టాలపై అధికారులు ప్రభుత్వానికి తుది నివేదిక పంపారు. దీని ప్రకారం మొత్తం 18 మండలాల పరిధిలోని 33,262 మంది రైతులు 16,540 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయారు. దీని విలువ రూ.40.96 కోట్లుగా నిర్ధారించారు. ● ఇందులో 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738.607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ రూ.38,21,07,405 కోట్లుగా పేర్కొన్నారు. ● మోంథా తుపానుతో జిల్లావ్యాప్తంగా ఏడు రకాల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. రాజానగరం, రంగంపేట, సీతానగరం, కొవ్వూరు, చాగల్లు, నల్లజర్ల, పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో పంట నష్టం అత్యధికంగా జరిగింది. 14 మండలాల్లో 802.193 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు నిర్ధారించారు. 2,153 మంది రైతులకు సంబంధించి రూ.2,75,77,692 కోట్ల నష్టం జరిగినట్లు తేల్చారు. ● పంట నష్టపోయిన రైతులందరి పేర్లూ నమోదు చేయలేదు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోయిన వారి పేర్లు మాత్రమే నమోదు చేశారు. ● వరికి హెక్టారుకు రూ.25 వేలు, మినుముకు హెక్టారుకు రూ.17 వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ● నివేదిక సమర్పించి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ నయాపైసా నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఇస్తారన్న స్పష్టత కూడా ఇవ్వకపోవడంతో పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్నిటా అన్యాయమే.. ● తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చంద్రబాబు, కూటమి నేతలు ప్రకటించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాది ఈ సాయం ఎగ్గొట్టారు. రెండో దశలో జిల్లా వ్యాప్తంగా 18,511 మంది రైతులకు మొండిచేయి చూపారు. ● ఉచిత పంటల బీమాకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం భారం రైతుల పైనే మోపింది. హెక్టారు వరి పంట విలువను రూ.1.05 లక్షలుగా నిర్ధారించి, రైతు వాటాగా రూ.1,575 (1.50 శాతం) ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. ఇది భారం కావడంతో వేలాదిగా రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. ఫలితంగా మోంథా తుపాను వల్ల జరిగిన పంట నష్టానికి వీరికి బీమా పరిహారం పొందలేని పరిస్థితి ఏర్పడింది. ● రైతులకు వ్యవసాయ సేవలు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 367 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, ఉద్యాన పంటలకు ఎంతో ప్రోత్సాహం అందించింది. రైతులకు సకాలంలో సూచనలు, సలహాలు అందించింది. అటువంటి వ్యవస్థ ప్రస్తుతం నిర్వీర్యమైంది. ఎరువుల పంపిణీ బాధ్యతను పీఏసీఎస్‌లకు అప్పగించారు. ఫలితంగా ఎరువులు పొందేందుకు రైతులు నానా అవస్థలూ పడ్డారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి, దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబే. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నిర్ణయిస్తే.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. 17 నెలల చంద్రబాబు పాలనలో ధాన్యం, పొగాకు, మిర్చి, టమాటా, ఉల్లి, అరటి, మామిడి, పత్తి, బత్తాయి, మొక్కజొన్న, చీనీ ఇలా.. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ 17 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. 2014లో రూ.80 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చి.. రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడు కూడా అదే పంథా అవలంబించారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కలిపి ఇస్తూ మోసం చేస్తున్నారు. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి మిగిలిన వాటికీ నిరీక్షణే.. మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఇతర రంగాలకు కూడా నష్టం వాటిల్లింది. మొత్తం 56 ఇళ్లు నేలమట్టమవగా రూ.28 లక్షల నష్టం జరిగినట్లు నిర్ధారించారు. విద్యుత్ శాఖకు రూ.37.34 లక్షల నష్టం జరిగింది. 48 రోడ్లు ధ్వంసమయ్యాయి. రంగంపేటలో రూ.6.26 కోట్లు, బిక్కవోలులో రూ.4.04 కోట్లు, రాజానగరంలో రూ.16 కోట్ల మేర రహదారులకు నష్టం వాటిల్లింది. 33 పంచాయత్‌రాజ్ రోడ్లు దెబ్బ తినగా.. రూ.45.81 కోట్ల మేర నష్టం జరిగింది. 21 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, చెరువులకు రూ.6.87 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వీటి పరిస్థితి ఏమిటనే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. ఫ ‘మోంథా’ పంట నష్టం రూ.40.96 కోట్లు ఫ నేటికీ రైతుకు నయాపైసా అందించని ప్రభుత్వం ఫ నేడు నల్లజర్లలో ‘రైతన్నా మీకోసం’ ఫ హాజరు కానున్న సీఎం చంద్రబాబు ఫ రైతులను ఆదుకోకుండా వారి సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడమేమిటంటూ విమర్శలు -
భార్యపై అనుమానంతో హత్య
● ఇంద్రపాలెం పిల్ల కాల్వ రోడ్డులో ఘటన ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాకినాడ రూరల్: పచ్చని సంసారంలో అనుమానమనే జాడ్యం చిచ్చురేపింది. బతుకు తెరువు కోసం ఊరు గాని ఊరు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నింపింది. కష్ట సుఖాల్లో కడ వరకూ తోడు ఉంటానని ఏడు అడుగుల సాక్షిగా మూడు ముళ్లు వేసిన భర్తే దారుణంగా సహధర్మ చారిణిని కడతేర్చాడు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇంద్రపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంద్రపాలెం పిల్ల కాల్వ ప్రాంతంలో అద్దెకు నివాసం ఉంటున్న బేతా మల్లీశ్వరి(47) భర్త గంగరాజు చేతిలో హత్యకు గురయ్యింది. మల్లీశ్వరి, గంగరాజు దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిది నర్సీపట్నం సమీపంలోని వేమూలపూడి గ్రామం. కూతురుకు కాకినాడ రూరల్ స్వామినగర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కొడుకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. పనీపాటూ లేకుండా ఇంటి వద్ద గడిపే గంగరాజు తరచూ భార్యను వేధించడంతో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో కూతురు స్వామినగర్‌లో ఉండడంతో వారు కాకినాడ రూరల్ ఇంద్రపాలెంకు నెలన్నర కిత్రం మకాం వచ్చారు. అప్పటి నుంచి ఇంద్రపాలెం పిల్ల కాల్వ రోడ్డులో ఉంటున్నారు. మల్లేశ్వరి ఇంటింటా పాచి పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండగా, కొడుకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గంగరాజు భార్యపై అనుమానంతో ఆదివారం రాత్రి గొడవ పడ్డాడు. ఆ సమయంలో కొడుకు తన సోదరి ఇంటికి వెళ్లాడు. మల్లీశ్వరితో గొడవ పెరిగి తీవ్ర వాగ్వాదం జరగడంతో నాపరాయితో తలపై గట్టిగా మోదాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన కుమారుడు తల్లి గాయాలతో పడి ఉండడం చూసి ఇరుగుపొరుగు వారి సాయంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇంద్రపాలెం ఎస్సై వీరబాబు కేసు నమోదు చేయగా సీఐ చైతన్య కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
బడోపేతానికి కసరత్తు
● ఆందోళనకరంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ● 5న మెగా పీటీఎం 3.0 ● ఏర్పాట్లలో విద్యాశాఖ నిమగ్నం రాయవరం: ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల బలోపేతం, విద్యార్థుల నమోదు లక్ష్యంగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికి మెగా పీటీఎం 3.0గా నామకరణం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేందుకు, సమాజ భాగస్వామ్యం పెంచేందుకు, విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసేలా అవసరమైన సూచనలను తల్లిదండ్రుల నుంచి సేకరించడం, పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అర్థించడం వంటి అంశాల ప్రాతిపదికగా ఈ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 5వ తేదీ ఈ సమావేశాన్ని జిల్లా వ్యాప్తంగా 1,582 ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్, ఏపీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాలను ఉప విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు. విద్యార్థుల ప్రగతి నివేదికలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే రెండు ఫార్మేటివ్, సమ్మేటివ్–1 పరీక్షలు నిర్వహించారు. వీటిలో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రగతి నివేదికల్లో పొందుపర్చి తల్లిదండ్రులకు అందించనున్నారు. ఈ ప్రగతి నివేదికల్లోనే విద్యార్థుల హాజరు, క్రీడా ప్రగతి, వ్యక్తిగత ఆరోగ్యాంశాలు పొందుపరచనున్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్ అధికంగా వినియోగించకుండా తల్లిదండ్రులకు ఈ సమావేశాల వేదికగా అవగాహన కల్పించనున్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు మహిళా పోలీసుల ద్వారా అవగాహన కల్పిస్తారు. ఇదే సందర్భంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. విద్యార్థులతో పాటుగా మెగా పేటీఎం రోజు తల్లులకు రంగవల్లులు పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పూర్వ విద్యార్థులను ఆహ్వానించి వారు సాధించిన విజయాలను తెలియజెప్పేలా చర్యలు తీసుకుంటారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మధ్యాహ్నం ఒంటిగంటకు సహ ఫంక్తి భోజనంతో ముగియనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లలో నిమగ్నం మెగా పీటీఎం ఏర్పాట్లలో భాగంగా పాఠశాలల్లో అవగాహనా సమావేశాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలు అందజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశాలను నిర్వహించేందుకు ఉన్నతాధికారులు అదేశాలు ఇచ్చారు. – జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలి విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెగా పీటీఎంను అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు డీవైఈవోలు, ఎంఈవోలకు ఆదేశాలు ఇచ్చాం. స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని అందుకనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశాలకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యా శాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
హెచ్ఎం కులవివక్ష చూపుతున్నారని ఆందోళన
● ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ● విద్యాశాఖాధికారి హామీతో నిరసన విరమణ కొత్తపల్లి: పాఠశాలలో విద్యార్థుల మధ్య కుల వివక్ష చూపుతూ తల్లిదండ్రులను కూడా చులకన చేసి మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులకు సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. మండలంలోని ఎండపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పిల్లల పట్ల వ్యత్యాసం చూపుతున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారంటూ తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి.సురేష్ బోస్ పాఠశాలలో విద్యార్థుల మధ్య కుల వివక్ష చూపుతూ అగ్రకులాలకు చెందిన విద్యార్థులతో చులకనగా మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అక్రమ సంబంధాలు అంటగడుతున్నారని ఆరోపించారు. మండల విద్యాశాఖాధికారులు వేణుగోపాల్, పైడిరాజు, ఎస్సై వెంకటేష్ పాఠశాల వద్దకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు. ఈ ఘటనపై పూర్తిస్ధాయిలో విచారణ చేపడతామని, వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


