ఉత్తమ నాటికగా అసత్యం
● ముగిసిన ఉభయ తెలుగు రాష్ట్రాల
నాటిక పోటీలు
● ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా
‘అమ్మ చెక్కిన బొమ్మ’
సామర్లకోట: పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు ముగిశాయి. ఉత్తమ నాటికగా విశాఖపట్నం, చైతన్య కళా స్రవంతి ప్రదర్శించిన ‘అసత్యం’ ఎంపిక అయింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నిలిచింది. తృతీయ ప్రదర్శనగా అభినయ ఆర్ట్సు గుంటూరు వారి ‘ఇది అతని సంతకం’ ఎంపిక అయింది. ‘గేమ్’ నాటిక జ్యూరీ బహుమతిని అందుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు విశ్రాంత చీఫ్ మేనేజరు గోపి కాశీవిశ్వనాథ్, విశ్వకవి విద్యాసంస్థల వారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఉత్తమ దర్శకునిగా అసత్యం నాటిక దర్శకుడు బాలాజీ నాయక్, ఉత్తమ రచయితగా (అమ్మ చెక్కిన బొమ్మ) జ్యోతిరాజ్ బీసెట్ బహుమతులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ఇది అతని సంతకం నాటికలో కృష్ణమూర్తి పాత్రధారి రవీంద్రరెడ్డి, ఉత్తమ నటిగా అమ్మ చెక్కిన బొమ్మ నాటికలో అనసూయ పాత్ర ధారి జ్యోతిరాజ్ నిలిచారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కె.శాంతారావు, బీఎస్ ఆర్ స్వామి, ఘంటా ముత్యాలనాయుడు వ్యవహరించారు. చంద్రమాంపల్లి గ్రామానికి చెందిన కళాభిమానులు స్నేహా ఆర్ట్స్ నాటక పరిషత్తు ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. పరిషత్తు అధ్యక్షుడు గొందేసి రాజా, గౌరవ సలహాదారు కొత్తెం స్వామినాథన్, గౌరవ అధ్యక్షుడు గోగులపాటి సీతారామస్వామి, కార్యదర్శి యిందన బ్రహ్మానందం, ఉపాధ్యక్షుడు దేవాడ పాపేశ్వరరావు, సహాయ కార్యదర్శి మంతిన సత్తిబాబు, కోశాధికారి మానేపలి రవీంద్ర, కార్యవర్గ సభ్యులు కేదారి నాగేశ్వరరావు, గొందేసి సత్యానందం, వెన్నా సత్యనారాయణ, నూకలమంతి నానాజీ, ప్రజానాట్యమండలి కళాకారులు డి సత్యనారాయణ, మహాపాతిన రాంబాబు, రామిశెట్టి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


