సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. తాజాగా ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను వెలికి తీసి.. అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ ( 43 )గా గుర్తించారు ఈ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అగ్నిప్రమాదంలో 90 శాతం వరకూ రెస్క్యూ ఆపరేషన్ పూర్తియ్యిందని తెలుస్తోంది. 200 మంది సిబ్బంది 22 గంటలకుపైగా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లోపాల్గొంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం చేసుకుంది.
అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా ప్రయత్నించారు.. ఇందుకోసం వారు ఆక్సిజన్ సిలిండర్‌తో సెల్లార్ లోకి వెళ్లారు. వీరివెంట వైద్య సిబ్బంది కూడా వెళ్లారు.
తొలుత ఒక ఒక డెడ్ బాడీ లభ్యమయ్యింది. అది గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో డిఎన్ఎ టెస్ట్‌కు అధికారులు తరలించారు. మరో డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆపై మరో మూడు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీసింది.






