వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవం తర్వాత ఆహార నాణ్యతపై మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమకు పాడైపోయిన ఆహారాన్ని అందిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ప్రయాణీకులు క్యాటరింగ్ సిబ్బందితో తలపడుతున్నవీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వందే భారత్ రైళ్లలో ఆహార నాణ్యతపై మరో కొత్త దుమారం చెలరేగింది.
కోల్‌కతాకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు చెందినవిగా ఈ వీడియోలో అన్‌లైన్ షేర్ అవుతున్నాయి. దీని ప్రకారం ఇది తినడానికి పనికి వచ్చే ఆహారమైనా అని ప్రశ్నిస్తూ క్యాటరింగ్ సిబ్బందితో ప్రయాణీకులు వాదనకు దిగారు.తమ ఆహార ప్యాకెట్లను తిరిగిచ్చారు. “ఈ పప్పు చూడండి కుళ్ళిపోయింది, కూర కంపు కొడుతోంది అంటూ ఒక ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెమీ-హై-స్పీడ్ రైళ్లలో అధిక ధరల పాటు భోజనానికి ప్రయాణికులకు ప్రీమియం ధరలు వసూలు చేస్తారని మండిపడ్డారు.
WATCH | Passengers on the Kolkata bound Vande Bharat Express allege they were served rotten, foul smelling food onboard. pic.twitter.com/RLvps0Ze1O
— The News Drill™ (@thenewsdrill) January 25, 2026
దీంతో వందే భారత్ పేరుతో తీసుకొచ్చిన సెమీ-హై-స్పీడ్ భారతదేశ ప్రధాన రైళ్లలో ఆహార ప్రమాణాలపై మరోసారి చర్చకు తెరలేచింది. చాలామంది వినియోగదారులు ఇలాంటి అనుభవాలను కామెంట్లలో హెరెత్తించారు. ఈ సమస్య ఒకే రూట్‌కే పరిమితం కాదని ఎక్కడ చూసినా ఇదే తంతు అని విమర్శించారు. వారణాసి-పట్నా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఇలాంటి సంఘటనను ఒక యూజర్ గుర్తు చేసుకుంటూ, ప్రయాణీకులు ఎక్కువ చెల్లించినప్పటికీ మెరుగైన సేవలు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. అధిక ఛార్జీలు చెల్లిస్తున్నాం దీనిపై మనం ఎందుకు ప్రశ్నించకూడదు అని మరొకరు రాశారు.
మరికొందరు పరిష్కారాలను సూచించారు. నాణ్యమైన ఫుడ్ అందించలేకపోతేఇండియన్ రైల్వేలు భోజనాన్ని అందించడం పూర్తిగా నిలిపివేయాలని కొందరు వాదించారు. ఇలాంటి ఫుడ్ తీసుకోవద్దు, బిస్కెట్లు, చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినండి" అని ఒకరు సూచించారు, వందే భారత్ రూట్లలో ఆహారం పేరుకే ప్రీమియం, క్వాలిటీ యావరేజ్ కంటే తక్కువే అని కామెంట్ చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా?
We've made efforts to include local cuisine in our menu. On 22/01/26 first day run, after receiving feedback, we withdrew the Assamese-style dal from some passengers due to its tangy flavor and offered alternative meals. The menu has been revised since and we're receiving… https://t.co/SjnDDxnADY
— IRCTC (@IRCTCofficial) January 26, 2026
IRCTC వివరణ
మరోవైపు ఈ ఆరోపణలను ఖండిస్తూ IRCTC ఒక ప్రకటన జారీ చేసింది. వందేభారత్ రైళ్లలో అందించే ఆహారం, ప్రారంభం, వాణిజ్య ప్రకటనల సమయంలో ఎంత నాణ్యంగా ఉండో ఇపుడు కూడా అలాగే ఉంటుందని తెలిపింది. పప్పు, బియ్యం లేదా పులావ్, కూరగాయలు లేదా పన్నీర్ గ్రేవీ, పొడి కూరగాయలు, చపాతీ లేదా స్వీట్‌ను భోజనంలో అందిస్తారని, స్థానిక ఆహారాన్ని అందించేందుకు ఒక గొప్ప క్యాటరింగ్ సంస్థ బాధ్యత వహిస్తోందని కూడా ఐఆర్‌సీటీసీ వివరించింది. ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్న ఒకవీడియోను కూడా ట్వీట్ చేసింది.


