rotten leather smell
-
ట్రెండింగ్‌లో పుచ్చ: ఎన్ని లాభాలో తెలుసా? కానీ బహుపరాక్!
మహరాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న విషాదకర ఘటన నేపథ్యంలో పుచ్చకాయ (Watermelon) ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు పుచ్చకాయ ఎలా తినాలి? ఎవరు తిన కూడదు. అసలు పుచ్చకాయ తినడం సురక్షితమేనా, పుచ్చకాయలోని పోషకాల విలువ ఎంత? ఇలాంటివి చర్చనీయాంశంగా మారాయి. పుచ్చకాయ లేని వేసవికాలాన్ని అస్సలు ఊహించలేం. పుచ్చకాయలో సహజంగా నీరు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. వేసవికాలంలో అనేక విటమిన్లు ఖనిజాలు, నీటి శాతం ఎక్కువగా పుచ్చకాయ డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది.ఇది శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా దాహాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రముఖ పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం పుచ్చకాయలో 94శాతం నీరు, లైకోపీన్, పొటాషియం,కుకుర్బిటాసిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. 1 కప్పు (152 గ్రాముల) పుచ్చకాయ ముక్కల్లో ఉండే పోషకాలు కేలరీలు: 46కార్బోహైడ్రేట్లు: 11.5 గ్రాములుఫైబర్: 0.6 గ్రాములుచక్కెర: 9.4 గ్రాములుప్రోటీన్: 0.9 గ్రాములుకొవ్వు: 0.2 గ్రాములువిటమిన్ ఎ: రోజువారీ అవసరంలో (DV) 5%విటమిన్ సి: రోజువారీ అవసరంలో 14%పొటాషియం: రోజువారీ అవసరంలో 4%మెగ్నీషియం: రోజువారీ అవసరంలో 4% క్యాన్సర్ నివారణలోపుచ్చకాయలో లభించే లైకోపీన్ , కుకుర్బిటాసిన్ Eతో సహా అనేక మొక్కల సమ్మేళనాలకు క్యాన్సర్ నిరోధక ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. అధ్యయన ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, లైకోపీన్ తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ల వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గే అవకాశం ఉంది.లైకోపీన్ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి, ఇవి రెండూ హృదయ సంబంధ ఆరోగ్యానికి కీలకం.బీపీ, గుండె జబ్బులుపుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది, ఇది మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచి, రక్తపోటును తగ్గించడానికి, రక్తనాళాలు విస్తరించడంలో సహాయపడుతుంది.ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం. పుచ్చకాయలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు A, B6, C వంటి ఇతర విటమిన్లు, ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ గుండెకు, మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి.యాంటీఆక్సిడెంట్‌గా, లైకోపీన్ అల్జీమర్స్ వ్యాధి ప్రారంభాన్నిపురోగతిని కూడా ఆలస్యం చేయగలదు. కానీ ఆ విషయంపై మరింత పరిశోధన అవసరం అంటున్నారు నిపుణులు.ఎపుడు తినకూడదుఅయితే, రాత్రి 7 గంటల తర్వాత పుచ్చకాయ లేదా మరే ఇతర పండ్లను తీసుకోవడం మంచిది కాదు. పుచ్చకాయ స్వభావరీత్యా కొంచెం ఆమ్ల గుణాన్ని (Acidic)కలిగి ఉంటుంది.రాత్రిపూట మన జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి, ఆ సమయంలో పుచ్చకాయ తింటే జీర్ణ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. మధ్యాహ్నం 12 నుండి 1 గంటల మధ్య పుచ్చకాయ తినడానికి ఉత్తమ సమయం. ఈ సమయంలో జీర్ణక్రియ చురుగ్గా ఉంటుంది.ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ధన్వంతరి త్యాగి హెచ్చరికల ప్రకారంరాత్రిపూట పుచ్చకాయ తింటే కడుపు ఉబ్బరం (Bloating), కడుపులో అసౌకర్యంగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు. పుచ్చకాయలో నీరు అధికంగా ఉండటం వల్ల రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది, దీనివల్ల నిద్ర చెడిపోతుంది. దీనిలోని సహజ చక్కెరలు కూడా రాత్రిపూట జీర్ణం కావడం కష్టమవుతుంది. రాత్రి భారీ భోజనం (Heavy Dinner) తిన్న వెంటనే పుచ్చకాయ తినడం అసలు మంచిది కాదు.ఎవరు జాగ్రత్తగా ఉండాలి?రాత్రిపూట పుచ్చకాయ తినే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు లేదా IBS (Irritable Bowel Syndrome) ఉన్నవారు.ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు. మధుమేహం (Diabetes) ఉన్నవారు (షుగర్ లెవల్స్ పెరగకుండా పోర్షన్ కంట్రోల్ ముఖ్యం).పుచ్చకాయ - నురుగుపుచ్చకాయల కొనేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. బయట వేడి ఎక్కువగా ఉండటం వల్ల పండు లోపల కూడా ఉష్ణోగ్రత పెరిగి, దాని నాణ్యత మారిపోతుంది.ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల లోపల గ్యాస్ తయారవుతుంది, దాంతో పండు పులుపు వాసన రావచ్చు లేదా కొన్నిసార్లు నురుగు కూడా కనిపించవచ్చు. ఇలాంటి పుచ్చకాయ తింటే కడుపు నొప్పి, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు రావచ్చు.పుచ్చకాయ ఆరోగ్యకరమైన పండే, కానీ అది తాజాగా ఉన్నప్పుడు మరియు సరైన సమయంలో తిన్నప్పుడే మేలు చేస్తుంది. దీనిని రాత్రిపూట డెజర్ట్‌గా కాకుండా, పగటిపూట స్నాక్ లాగా తీసుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. -
పాచిపోయిన పప్పు, కంపు గొట్టే కూర : వందే భారత్ రైల్లో ఫుడ్‌పై వైరల్ వీడియో
వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవం తర్వాత ఆహార నాణ్యతపై మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమకు పాడైపోయిన ఆహారాన్ని అందిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ప్రయాణీకులు క్యాటరింగ్ సిబ్బందితో తలపడుతున్నవీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వందే భారత్ రైళ్లలో ఆహార నాణ్యతపై మరో కొత్త దుమారం చెలరేగింది.కోల్‌కతాకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు చెందినవిగా ఈ వీడియోలో అన్లైన్ షేర్ అవుతున్నాయి. దీని ప్రకారం ఇది తినడానికి పనికి వచ్చే ఆహారమైనా అని ప్రశ్నిస్తూ క్యాటరింగ్ సిబ్బందితో ప్రయాణీకులు వాదనకు దిగారు.తమ ఆహార ప్యాకెట్లను తిరిగిచ్చారు. “ఈ పప్పు చూడండి కుళ్ళిపోయింది, కూర కంపు కొడుతోంది అంటూ ఒక ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెమీ-హై-స్పీడ్ రైళ్లలో అధిక ధరల పాటు భోజనానికి ప్రయాణికులకు ప్రీమియం ధరలు వసూలు చేస్తారని మండిపడ్డారు.WATCH | Passengers on the Kolkata bound Vande Bharat Express allege they were served rotten, foul smelling food onboard. pic.twitter.com/RLvps0Ze1O— The News Drill™ (@thenewsdrill) January 25, 2026 దీంతో వందే భారత్ పేరుతో తీసుకొచ్చిన సెమీ-హై-స్పీడ్ భారతదేశ ప్రధాన రైళ్లలో ఆహార ప్రమాణాలపై మరోసారి చర్చకు తెరలేచింది. చాలామంది వినియోగదారులు ఇలాంటి అనుభవాలను కామెంట్లలో హెరెత్తించారు. ఈ సమస్య ఒకే రూట్‌కే పరిమితం కాదని ఎక్కడ చూసినా ఇదే తంతు అని విమర్శించారు. వారణాసి-పట్నా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఇలాంటి సంఘటనను ఒక యూజర్ గుర్తు చేసుకుంటూ, ప్రయాణీకులు ఎక్కువ చెల్లించినప్పటికీ మెరుగైన సేవలు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. అధిక ఛార్జీలు చెల్లిస్తున్నాం దీనిపై మనం ఎందుకు ప్రశ్నించకూడదు అని మరొకరు రాశారు. మరికొందరు పరిష్కారాలను సూచించారు. నాణ్యమైన ఫుడ్ అందించలేకపోతేఇండియన్ రైల్వేలు భోజనాన్ని అందించడం పూర్తిగా నిలిపివేయాలని కొందరు వాదించారు. ఇలాంటి ఫుడ్ తీసుకోవద్దు, బిస్కెట్లు, చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినండి" అని ఒకరు సూచించారు, వందే భారత్ రూట్లలో ఆహారం పేరుకే ప్రీమియం, క్వాలిటీ యావరేజ్ కంటే తక్కువే అని కామెంట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా? We've made efforts to include local cuisine in our menu. On 22/01/26 first day run, after receiving feedback, we withdrew the Assamese-style dal from some passengers due to its tangy flavor and offered alternative meals. The menu has been revised since and we're receiving… https://t.co/SjnDDxnADY— IRCTC (@IRCTCofficial) January 26, 2026 IRCTC వివరణ మరోవైపు ఈ ఆరోపణలను ఖండిస్తూ IRCTC ఒక ప్రకటన జారీ చేసింది. వందేభారత్ రైళ్లలో అందించే ఆహారం, ప్రారంభం, వాణిజ్య ప్రకటనల సమయంలో ఎంత నాణ్యంగా ఉండో ఇపుడు కూడా అలాగే ఉంటుందని తెలిపింది. పప్పు, బియ్యం లేదా పులావ్, కూరగాయలు లేదా పన్నీర్ గ్రేవీ, పొడి కూరగాయలు, చపాతీ లేదా స్వీట్‌ను భోజనంలో అందిస్తారని, స్థానిక ఆహారాన్ని అందించేందుకు ఒక గొప్ప క్యాటరింగ్ సంస్థ బాధ్యత వహిస్తోందని కూడా ఐఆర్సీటీసీ వివరించింది. ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్న ఒకవీడియోను కూడా ట్వీట్ చేసింది. -
ఆ నోట్లు.. కుళ్లుకంపు కొడుతున్నాయి!
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించడంతో బ్యాంకుల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. వీళ్లంతా డిపాజిట్ చేస్తున్న దాంట్లోని నల్లడబ్బు కుళ్లిపోయిన తోలు వాసన వస్తోందట!! ఈ విషయాన్ని ఒక బ్యాంకు మేనేజర్ చెప్పారు. కొంతమంది రాత్రిపూట కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు కాస్తున్నారు. డబ్బు రాగానే తామే ముందు తీసుకుని వెళ్లిపోవాలని ఇలా చేస్తున్నారు. బయట వేచి ఉన్నవాళ్లకు ఇన్ని ఇబ్బందులుంటే.. మరి లోపల బ్యాంకులో కూర్చుని ఇన్ని వేల మంది వస్తున్నా అందరికీ ఓపిగ్గా డబ్బులు ఇస్తూ, వాళ్ల వివరాలు నోట్ చేసుకుంటూ సెలవులన్నవి లేకుండా నిర్విరామంగా పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులు ఈ నిర్ణయం గురించి ఏమంటున్నారు? ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల తమకు పనిభారం పెరిగిపోయిందని ఏమైనా చెబుతున్నారా.. కానే కాదు. సాధారణంగా రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు. కానీ గత వారాంతంలో అన్ని బ్యాంకులూ పనిచేశాయి. మిగిలిన రోజుల్లో కూడా అదనపు సమయం పనిచేస్తున్నాయి. దీనిపై ముంబైకి చెందిన 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఫేస్బుక్ పేజిలో ఒక బ్యాంకు మేనేజర్ తన అభిప్రాయాన్ని రాశారు. ఊపిరి పీల్చుకోడానికి కూడా ఖాళీ లేకుండా.. అసలు తిండి, తిప్పలన్న మాటే మర్చిపోయి బ్యాంకు ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో ఆమె వివరించారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. ''కొన్ని సంవత్సరాల తరబడి పేరుకుపోయిన నల్లడబ్బు మా దగ్గరకు వస్తోంది. ఈ డబ్బు అంతా కుళ్లిపోయిన తోలు వాసన వస్తోంది. అందుకే మా క్యాషియర్లందరికీ మాస్కులు కావాలని మేం ఆర్డర్ చేశాం. అంత ఘోరంగా ఈ డబ్బు వాసన వస్తోంది. ఇక బ్యాంకులకు వచ్చేవాళ్లు ఎంత దారుణంగా ఉంటున్నారో, మమ్మల్ని ఎంత నీచంగా చూస్తున్నారో.. నాలుగు గంటల క్రితం నాకు నాందేడ్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. నామీద ఎడతెరిపి లేకుండా తిట్లవర్షం కురిపిస్తూనే ఉన్నాడు. మరాఠీలో శాపనార్థాలు పెట్టాడు. ఇలాంటివి ప్రతిరోజూ కొన్ని డజన్లు మాకు ఎదురవుతాయి. పొద్దున్న బ్యాంకుకు డ్యూటీ సమయం కంటే ముందే వస్తాం. డ్యూటీ ముగిసిపోయిన చాలా సేపటి వరకు అక్కడే ఉంటాం. తిండి తిప్పల మాట దేవుడెరుగు.. కనీసం మంచినీళ్లు తాగే తీరిక కూడా ఉండట్లేదు. ఇలా గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి కూర్చున్నా.. రెండు గంటలు క్యూలో ఉన్నవాళ్లు మమ్మల్ని నానా తిట్లు తిట్టుకుంటూ మేమిచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్నారు. మరి మా కష్టాలు పట్టించుకునేవాళ్లు ఎవరూ ఉండరా? మరికొందరైతే వాళ్లు కోరినంత డబ్బులు మార్చకపోతే మా విషయాన్ని మీడియాకు చెప్పి తేలుస్తామని బెదిరిస్తున్నారు. అక్కడ బోలెడంత సీన్ క్రియేట్ చేస్తున్నారు'' అని ఆమె అన్నారు.


