మహరాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న విషాదకర ఘటన నేపథ్యంలో పుచ్చకాయ (Watermelon) ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు పుచ్చకాయ ఎలా తినాలి? ఎవరు తిన కూడదు. అసలు పుచ్చకాయ తినడం సురక్షితమేనా, పుచ్చకాయలోని పోషకాల విలువ ఎంత? ఇలాంటివి చర్చనీయాంశంగా మారాయి.
పుచ్చకాయ లేని వేసవికాలాన్ని అస్సలు ఊహించలేం. పుచ్చకాయలో సహజంగా నీరు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. వేసవికాలంలో అనేక విటమిన్లు ఖనిజాలు, నీటి శాతం ఎక్కువగా పుచ్చకాయ డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది.ఇది శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా దాహాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రముఖ పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం పుచ్చకాయలో 94శాతం నీరు, లైకోపీన్, పొటాషియం,కుకుర్బిటాసిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
1 కప్పు (152 గ్రాముల) పుచ్చకాయ ముక్కల్లో ఉండే పోషకాలు
కేలరీలు: 46
కార్బోహైడ్రేట్లు: 11.5 గ్రాములు
ఫైబర్: 0.6 గ్రాములు
చక్కెర: 9.4 గ్రాములు
ప్రోటీన్: 0.9 గ్రాములు
కొవ్వు: 0.2 గ్రాములు
విటమిన్ ఎ: రోజువారీ అవసరంలో (DV) 5%
విటమిన్ సి: రోజువారీ అవసరంలో 14%
పొటాషియం: రోజువారీ అవసరంలో 4%
మెగ్నీషియం: రోజువారీ అవసరంలో 4%
క్యాన్సర్ నివారణలో
పుచ్చకాయలో లభించే లైకోపీన్ , కుకుర్బిటాసిన్ Eతో సహా అనేక మొక్కల సమ్మేళనాలకు క్యాన్సర్ నిరోధక ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. అధ్యయన ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, లైకోపీన్ తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్‌ల వంటి కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదం తగ్గే అవకాశం ఉంది.
లైకోపీన్ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి, ఇవి రెండూ హృదయ సంబంధ ఆరోగ్యానికి కీలకం.
బీపీ, గుండె జబ్బులు
పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది, ఇది మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచి, రక్తపోటును తగ్గించడానికి, రక్తనాళాలు విస్తరించడంలో సహాయపడుతుంది.
ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం. పుచ్చకాయలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు A, B6, C వంటి ఇతర విటమిన్లు, ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ గుండెకు, మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్‌గా, లైకోపీన్ అల్జీమర్స్ వ్యాధి ప్రారంభాన్నిపురోగతిని కూడా ఆలస్యం చేయగలదు. కానీ ఆ విషయంపై మరింత పరిశోధన అవసరం అంటున్నారు నిపుణులు.
ఎపుడు తినకూడదు
అయితే, రాత్రి 7 గంటల తర్వాత పుచ్చకాయ లేదా మరే ఇతర పండ్లను తీసుకోవడం మంచిది కాదు. పుచ్చకాయ స్వభావరీత్యా కొంచెం ఆమ్ల గుణాన్ని (Acidic)కలిగి ఉంటుంది.రాత్రిపూట మన జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి, ఆ సమయంలో పుచ్చకాయ తింటే జీర్ణ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. మధ్యాహ్నం 12 నుండి 1 గంటల మధ్య పుచ్చకాయ తినడానికి ఉత్తమ సమయం. ఈ సమయంలో జీర్ణక్రియ చురుగ్గా ఉంటుంది.
ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ధన్వంతరి త్యాగి హెచ్చరికల ప్రకారంరాత్రిపూట పుచ్చకాయ తింటే కడుపు ఉబ్బరం (Bloating), కడుపులో అసౌకర్యంగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు. పుచ్చకాయలో నీరు అధికంగా ఉండటం వల్ల రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది, దీనివల్ల నిద్ర చెడిపోతుంది. దీనిలోని సహజ చక్కెరలు కూడా రాత్రిపూట జీర్ణం కావడం కష్టమవుతుంది. రాత్రి భారీ భోజనం (Heavy Dinner) తిన్న వెంటనే పుచ్చకాయ తినడం అసలు మంచిది కాదు.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
రాత్రిపూట పుచ్చకాయ తినే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు లేదా IBS (Irritable Bowel Syndrome) ఉన్నవారు.ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు. మధుమేహం (Diabetes) ఉన్నవారు (షుగర్ లెవల్స్ పెరగకుండా పోర్షన్ కంట్రోల్ ముఖ్యం).
పుచ్చకాయ - నురుగు
పుచ్చకాయల కొనేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. బయట వేడి ఎక్కువగా ఉండటం వల్ల పండు లోపల కూడా ఉష్ణోగ్రత పెరిగి, దాని నాణ్యత మారిపోతుంది.ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల లోపల గ్యాస్ తయారవుతుంది, దాంతో పండు పులుపు వాసన రావచ్చు లేదా కొన్నిసార్లు నురుగు కూడా కనిపించవచ్చు. ఇలాంటి పుచ్చకాయ తింటే కడుపు నొప్పి, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు రావచ్చు.
పుచ్చకాయ ఆరోగ్యకరమైన పండే, కానీ అది తాజాగా ఉన్నప్పుడు మరియు సరైన సమయంలో తిన్నప్పుడే మేలు చేస్తుంది. దీనిని రాత్రిపూట డెజర్ట్‌గా కాకుండా, పగటిపూట స్నాక్ లాగా తీసుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.


