Health Benefits
-
తేనెతో ఎన్నో లాభాలు : కానీ కల్తీని ఎలా గుర్తించాలి!
భారతదేశంలో చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్లకు నిస్పందేహంగా వాడే పదార్థం తేనె (Honey). తేనెటీగల ద్వారా సహజంగా లభించే ఒక తీపి పదార్థం (Natural Sweetener). తేనె వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే కొలెస్ట్రాల్, కొవ్వు సోడియం లేని చక్కటి ఆహారం కూడా తేనె. ప్రపంచవ్యాప్తంగా తేనెను ఎక్కువగా ఉపయోగించేది మన భారతీయులే. అయితే కోవిడ్ తరువాత తేనె వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది విశ్వవ్యాప్తమైంది. పెరిగిన డిమాండ్ తో తేనె కల్తీ కూడా పెరిగింది. మార్కెట్లో ఇప్పుడు స్వచ్ఛమైన తేనె, బ్రాండ్లు చాలా తక్కువే అని చెప్పవచ్చు. మరి స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలి.తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. తేనెలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు, ఖనిజాలు దండిగా లభిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాల మాట దేవుడెరుగు కల్తీ తేనె అనేక సమస్యలకు కారణమవుతోంది. అందుకే స్వచ్ఛమైన తేనె ఏది. నకిలీది ఏది గుర్తించడం, దాని గురించి అవగాహనకలిగి ఉండటం చాలా అవసరం.తేనె కల్తీ ఎలా?తేనె కల్తీ చౌకైన పదార్థాలతో చేయబడుతుంద. ఇది ప్రయోగశాల పరీక్ష పారామితులను తేలిగ్గా దాటేస్తుంది. . మొలాసిస్: ఇది మందపాటి , జిగటగా చెరకు రసం. చెరకు రసం మరిగించడం వల్ల తేనెలా తీపిగా ఉండే టర్బిడ్, ముదురు ద్రావణం లభిస్తుంది.ద్రవ గ్లూకోజ్: ఇది మిఠాయి చ బేకింగ్ పరిశ్రమలో ఉపయోగించే మెరిసే , మందపాటి ద్రావణం. ఇది మార్కెట్లో సులభంగా లభిస్తుంది.ఇన్వర్ట్ షుగర్: ఇది మెరిసే , మందపాటి ద్రవం, శుద్ధి చేసిన చక్కెరను ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు.హై గ్లూకోజ్ కార్న్ సిరప్ (HFCS): ఇది స్వీట్‌కార్న్‌ను ప్రాసెస్ చేసినప్పుడు ఉత్పత్తి అవుతుంది.ఇది అచ్చం తేనెలాగానే కనిపిస్తుంది. రైస్ సిరప్: ఈ సిరప్ బియ్యం ప్రాసెసింగ్ సమయంలో ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తేనెను కల్తీ చేసే వాటిలో ఒకటి.ఇదీ చదవండి: సిల్వర్ స్క్రీన్ క్వీన్ : దేవుడా, ఇలాంటి జీవితం పగవాడిక్కూడా వద్దు! తేనె స్వచ్ఛమైనదా లేదా కల్తీదా ఎలా తనిఖీ చేయాలి?బొటనవేలిపై కొద్దిగా తేనె రాసుకొని చూడండి. నిజమైన తేనె చిక్కగా ఉంటుంది. తేనెను ఒక గ్లాసు నీటిలో నెమ్మదిగా వేయండి. తేనె నీటిలో కరగకుండా గ్లాసు అడుగు భాగానికి చేరుకుంటే తేనె స్వచ్ఛమైనది. నీటిలో కరిగిపోతుంటే అది నకిలీది అని అర్థం. వెనిగర్ నీటిలో కొన్ని చుక్కల తేనె కలపండి. మిశ్రమం నురగలు రావడం ప్రారంభిస్తే అది కచ్చితంగా నకిలీదే. తేనెలో అగ్గిపుల్లను ముంచి, ఆపై వెలిగించడానికి ప్రయత్నించడం ద్వారా ఇంకో పరీక్ష చేయవచ్చు. తేనె స్వచ్ఛంగా ఉంటే, అగ్గిపుల్ల సులభంగా మండుతుంది. కల్తీ దైతే అగ్గిపుల్లను వెలిగించడం కష్టం కావచ్చు.ఇదీ చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!తేనె-ప్రయోజనాలు తేనె సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. తేనె అనేది గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.కాలిన గాయాలు, దెబ్బలకు పై పూత చికిత్సగా వాడవచ్చు.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు సూపర్-హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అందుకే మొటిమల నివారణలోకూడా పనిచేస్తుందితేనెలో కాటలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చిన్న మంట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందిహృదయనాళ వ్యవస్థను రక్షించండి గ్యాస్ట్రోఎంటెరిటిస్ లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది. జ్ఞాపకశక్తి లోపాలను నివారిస్తుంది. -
Union Budget 2025 మఖానా ట్రెండింగ్ : తడాఖా తెలిస్తే అస్సలు వదలరు!
కేంద్ర బడ్జెట్ 2025-26 సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక విషయాన్ని ప్రకటించారు. బిహార్ (Bihar)పై వరాల జల్లు కురిపించిన ఆర్థికమంత్రి అక్కడ మఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫూల్ మఖానా (lotus seeds) పై ఆసక్తి ఏర్పడింది. మఖానాను ఫూల్ మఖానా, తామర గింజలు, ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. అసలేంటి మఖానా ప్రత్యేకత, వీటివల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటి తెలుసుకుందామా!బిహార్‌లో ఏర్పాటుచేయనున్న మఖానా బోర్డుతో అక్కడి రైతులకు మేలు చేయనుంది. దీని ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీనికింద రైతులకు శిక్షణ అందుతుంది నిర్మలా సీతారామన్ ప్రకటించారు.మఖానా ప్రయోజనాలుఈ మధ్య కాలంలో ఆరోగ్యకరమైన డైట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరుచక్కని పౌష్ఠికాహారం మఖానా. మఖానా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడంవల్ల, బరువు తగ్గడంతోపాటు, షుగర్ గుండె జబ్బులున్నవారికి ఎంతో మేలు చేస్తుంది. బాదం, జీడిపప్పు,ఇతర డ్రై ఫ్రూట్స్, మఖానా పోషక విలువలు చాలా ఎక్కువ.కార్బోహైడ్రేట్లు, ఐరన్ లభించే సూపర్ ఫుడ్. అందుకే మఖానా తినడం వల్ల ఏనుగు లాంటి శక్తి వస్తుందని నమ్ముతారు. ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేసే పాలీఫెనాల్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయనిచెబుతున్నారు నిపుణులు.మఖానాల్లో మెగ్నీషియం ద్వారా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది షుగర్ ఉన్నవారికి చాలా మంచిది.కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.మఖానా విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవల్స్ ఉంటాయి.కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్ల మూలం కాబట్టి మఖానాతో ఎముకళు, కీళ్లను బలపోతం చేస్తాయి. దంతాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా మాఖానా పనిచేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలామంచిది. ఇందులోని థయామిన్ నరాల, అభిజ్ఞా పనితీరుకు మంచిది. న్యూరోట్రాన్స్మిషన్ ప్రక్రియకు దోహదం చేస్తుంది. సంతానోత్పత్తికి మంచిది: మఖానా వంధ్యత్వ సమస్యలతో వ్యవహరించడంలో పురుషులు,మహిళలు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.ఇవీ చదవండి: US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం!చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్ చేస్తే.. నిర్మలా సీతారామన్‌కు చేనేత పట్టుచీర -
బ్రెడ్ పాలక్ వడ : రుచితోపాటు ఆరోగ్యం కూడా
పేరులోనే ‘కూర’ను జత చేసుకున్నపాలకూర అన్నంలోకే కాదు, స్నాక్స్‌గానూ మారిపోతుంది. పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆకుకూరను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేకరకాల సమస్యలనుంచి బయటపడవచ్చు. కావలసినవి: పాలకూర తరుగు – ఒకటిన్నర కప్పు, బ్రెడ్ స్లైసులు – 3, అల్లం తరుగు – టీ స్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరగాలి), పుదీనా తరుగు – టేబుల్ స్పూన్, జీలకర్ర – టీ స్పూన్, చాట్ మసాలా – టీ స్పూన్, బియ్యప్పిండి – అర కప్పు, ఉల్లిపాయ తరుగు –పావు కప్పు, జీడిపప్పుల తరుగు – టేబుల్ స్పూన్, నిమ్మరసం – టీ స్పూన్. ఉప్పు – రుచికి తగినంత, నూనె – వేయించడానికి తగినంత.తయారీ: ∙బ్రెడ్ స్లైసులను మిక్సీలో గ్రైండ్ చేయాలి.పాలకూర, పుదీనా, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. ∙ఒక పెద్ద గిన్నెలో బ్రెడ్ మిశ్రమంతో సహా అన్ని పదార్థాలు వేసి, మెత్తని పిండిలా కలపాలి. ∙చిన్ని చిన్న ఉండలు చేసి, కొద్దిగా అరచేతితో అదిమి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించి, తీయాలి. ∙వీటిని కెచప్‌తో సర్వ్ చేయాలి. (Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్! )పాలకూరతో ప్రయోజనాలుపాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తం శుద్ధి అవుతుంది గుండె జబ్బులు కూడా రాకుండా అడ్డుకుంటాయి. మహిళలు పాలకూరను తరచూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా పాలకూరకు ఉందని చెబుతారు. అధిక బరువు ఉన్నవారు పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వారు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. చదవండి: పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ -
పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్
Palakura Pachadi : శ్రేష్టమైన ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరతో, పాలకూర పప్పు, పాలకూర ఆలూ, పాలక్ పనీర్ .. ఇలా రకరకాల వంటలను చేసుకుంటాం. అలాగే పాలకూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి లాగానే పాలకూరను కూడా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. పాలకూర ఎలా చేసుకోవాలో చూద్దామా.పాలకూరతో బీపీ, మధుమేహం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బీపీ అదుపులో ఉంటుందని భావిస్తారు.పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే తో పాటుగా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, తక్కువ క్యాలరీలు ఉంటాయి. పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కావలసిన పదార్థాలుపాలకూర ఒక కప్పు, కొంచెం శుభ్రం చేసుకున్న చింతపండు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ కొద్దిగా నూనె, రుచికి సరిపడినంత ఉప్పు , చిటికెడు పసుపు, ఇంగువ, నాలుగైదు ఎండుమిచ్చి,ధనియాలు-ఒక స్పూను పోపు కోసం: పప్పులు,ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ(ఆప్షనల్) జీలకర్ర, ఆవాలు,తయారీపాలకూరను శుభ్రంగా రెండుమూడుసార్లు బాగా కడగాలి. ఇసుక, మట్టి శుభ్రంగా పోయాయని నిర్ధారించుకున్నాక సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చూసుకోవాలి.స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి, ఎండుమిర్చి వేయించాలి. ఇందులోనే కొద్దిగా ధనియాలు, మెంతులు కూడా బాగా వేగనివ్వాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు అదే కళాయిలో పాలకూరను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉత్తినే మగ్గిపోతుంది. అవసరం పడితే కొద్దిగా నూనె వేసుకోవచ్చు. పాలకూర బాగా దగ్గరికి వచ్చాక, చింతపండును కూడా వేయాలి. బాగా ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే చిటికెపు పసుపు వేయాలి. ఆతరువాత శుభ్రంగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిరెబ్బల్ని కూడా (ఇష్టంలేనివారు మానివేసి నువ్వులను చిటచిటపలాడేలూ వేయించి కలుపుకోవచ్చు) వేసి, ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మినప్పప్పు మెంతులు ఎండుమిర్చి, పచ్చి ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా మెత్తగా అయ్యాక ఉడికించిన పాలకూరను కూడా మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు,పులుపు కారం సరిపోయిందోఒకసారి చెక్ చేసుకోవాలి.ఇపుడు కాస్త మినపప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించి చివర్లో కాస్త ఇంగువ కూడా వేసి పోపు పెట్టుకోవాలి. అంతే ఘుమఘుమలాడే పాలకూర చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో గానీ, రోటీ, చపాతీలో టేస్టీటేస్టీగా తినవచ్చు. దోశ, ఇడ్లీల్లో కూడా చట్నీలా వాడుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే రెండు రోజుల వరకు తాజాగా ఉంటుంది.పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తం శుద్ధి అవుతుంది గుండె జబ్బులు కూడా రాకుండా అడ్డుకుంటాయి. మహిళలు పాలకూరను తరచూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా పాలకూరకు ఉందని చెబుతారు. అధిక బరువు ఉన్నవారు పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వారు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. -
అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!
చిన్నపుడు ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏ చిన్న నొప్పి వచ్చినా మన అమ్మమ్మలు, నానమ్మలు ఉపయోగించే అద్భుతమై చిట్కా కొబ్బరి నూనె. పైపూతగా మాత్రమే కాదు కడుపులోకి తీసుకోవడం ద్వారా కొబ్బరి నూనె వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. కొబ్బరి నూనెలో చాలా పోషక విలువలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందా రండి.కొబ్బరి నూనె అనగానే కేవలం జుట్టు మాత్రమే పనికొచ్చేది కాదు. శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలామంచిది. కేరళ, థాయ్‌లాండ్ లాంటి అనేక ప్రదేశాల్లో కొబ్బరినూనెను వంటల్లో వాడతారు. అలాగే ఈ కొబ్బరి నూనెను ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ తాగితే, శరీరంలో ఆరోగ్య సమస్యలన్నిటికీ దివ్య ఔషధం లాగా పని చేస్తుందని నమ్ముతారు.అధికబరువుతో బాధపడే వారు కొబ్బరి నూనెను గాలి కడుపుతో తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో మంచి కొవ్వు శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కొబ్బరి నూనెతో ఉపయోగాలు :గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడం ద్వారా, చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గిస్తుందిలారిక్ఆమ్లం పుష్కలంగా ఉండే బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.శరీరానికి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు ,శిలీంధ్రాలతో ఫైట్ చేసి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. సాధారణ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనెలోని MCT లు కీటోన్లుగా మారి, మెదడుకు ప్రత్యామ్నాయ శక్తి వనరుగా పనిచేస్తాయి. ఇది జ్ఞాపకశక్తి, దృష్టి ,మానసిక స్పష్టతతో సహా అభిజ్ఞా విధులను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు తగ్గుతాయి .కొబ్బరి నూనె మరో ముఖ్యమైన లక్షణం బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగిస్తుంది. శరీర కొవ్వుగా నిల్వలు పెరగకుండాకా పాడి, బరువు నిర్వహణలో సహాయపడతాయి.కొబ్బరి నూనెలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి,ఆరోగ్యకరమైన ప్రేగును ప్రోత్సహిస్తాయి. ఇది కొవ్వులో కరిగే విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.జుట్టు కండిషనింగ్‌కు కొబ్బరి నూనెకు మించింది లేదు. ఇది జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోతుంది, ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. జుట్టు తెగిపోకుండా నిరోధిస్తుంది. సహజమైన మెరుపు వస్తుంది. క్రమం తప్పకుండా వాడితే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ వల్ల ప్లేక్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులను నివారించవచ్చు. వర్జిన్ కొబ్బరి నూనె తొందరగా శక్తినిస్తుంది. శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది.మంటను తగ్గించడంలో సహాయపడుతంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వంటి లక్షణాలకు ఉపశమనం లభిస్తుంది.చర్మానికి కొబ్బరి నూనెకొబ్బరి నూనె ,చర్మ మెరుపునకు పెట్టింది పేరు. పొడిగా మారిపోయిన చర్మానికి కొబ్బరినూనె పూస్తే సహజ సౌందర్యం వస్తుంది. స్కిన్ బ్యూటీలో ఈ నూనె గేమ్-ఛేంజర్ అని చెప్పవచ్చు. మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. స్నానానికి ముందు, తర్వాత గానీ చర్మానికి కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే తేమను నిలుపుకుంటుంది, మీ చర్మాన్ని రోజంతా మృదువుగా , హైడ్రేటెడ్‌గా ఉంటుంది. సహజ సిద్ధమూన మేకప్ రిమూవర్‌గా పనిచేస్తుంది. వాటర్ ప్రూఫ్ మస్కారాతో సహా మేకప్‌ను కరిగించడానికి కొబ్బరి నూనెతో ముఖంపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తరువాత గోరువెచ్చని నీళ్లలో ముంచిన గుడ్డతో తుడిచేయాలి.పగిలిన పెదాలకు కొబ్బరి నూనె రాస్తే పెదాలు, తేమఉంటాయి. రసాయనాలు కలిపిన ప్రొడక్ట్స్‌తో పోలిస్తే ఇది చాలా ఉత్తమం. నెట్లోకి వెళ్లినా ఎలాంటి హాని ఉండదు. కొబ్బరి నూనె అద్భుతమైన మసాజ్ ఆయిల్. నోట్ : ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. ఈ లాభాలు, ప్రయోజనాలు అందరికీ ఒకేలా వర్తించవు. మెరుగైన ఫలితాలకోసం ఆరోగ్య నిపుణులును సంప్రదించడం ఉత్తమం.చదవండి: చాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..!శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం -
గొంతులో గర గర వేధిస్తోందా? ఈ చిట్కాలతో ఉపశమనం
వాతావరణంలో మార్పులు మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రధానంగా శీతాకాలంలోచల్లగాలులు, మంచు ప్రభావంతో జలుబు, జ్వరం, అలెర్జీ,గొంతు నొప్పి లాంటి సమస్యలకు దారి తీస్తాయి. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడతాయి. మరి ఇలాంటి సమస్యలకు ఇంటి వైద్యం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా గొంతు నొప్పి వేధిస్తుంది. దీంతో పాటు, కళ్లు, ముక్కులలో కూడా దురదగా ఉంటుంది. మరి ఈ గొంతు గరగరను, ఎలర్జీతో బాధపడుతోంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఉపశమనం కోసం పాటించాల్సిన చిట్కాలు తెలుసుకుందామా.చలికాలంలో పిల్లలు, పెద్ద వయసు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.చలికాలంలో అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలి. జలుబు, ఫ్లూ, తలనొప్పి, సైనసైటిస్, దగ్గు వంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా గొంతు చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా గొంతులో గరగర, మింగుతున్నప్పుడు ఇబ్బంది లాంటి సమస్యలు అన్ని రకాల వయస్సుల వారిలోనూ తలెత్తుతుంటాయి.బయటికి వెళ్లినపుడు శరీరం వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి. చెవులలోకి చల్లగాలి వెళ్లకుండా, స్కార్ఫ్‌లు, మఫ్లర్లను ధరించాలి.వేడి వేడి పదార్థాలను తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తాజాగా వంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఫ్రిజ్‌లోంచి తీసిన వంటకాలను అలానే తినకుండావేడి చేసుకుని తినాలి.కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు లాంటి చల్లని పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. గొంతు సమస్య ఉన్నప్పుడు పూర్తిగా దూరం పెట్టాలి. గోరు వెచ్చటి నీటిని తాగటం మంచిది. సూప్స్, పండ్ల రసాలను తాగటంవల్ల కూడా గొంతులో ఇబ్బందిగా ఉంటే తగ్గిపోతుంది.రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు టమిన్ సి నిండిన పండ్లను తినాలి. వీటిల్లో యాంటీ హిస్టమైన్ ఉంటుంది. నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి లాంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే డాక్టర్ సలహా మేరకు యాంటీ హిస్టమైన్ ట్యాబ్లెట్ల రూపంలో కూడా వాడవచ్చు.ఉపశమనం కోసం అల్లం,శొంఠి,మిరియాలు, కొద్దిగా తులసి దళాలు వేసి కషాయంలా చేసుకొని తాగాలి. గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు వేసి తాగాలి. ఇలా చేస్తే గొంతులో గరగర మాయమవుతుంది.కొద్దిగా అల్లం, దాల్చిన చెక్క ముక్క కలిపి చేసిన టీ తాగాలి. ఇలా పొద్దున్న, సాయంత్రం చేస్తే ఫలితం ఉంటుంది. అల్లాన్ని మెత్తగా నూరి, టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగినా మంచి ఫలితం ఉంటుంది.పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి, రుచికి కొద్దిగా తేనె, లేదా బెల్లం కలుపుకొని తాగవచ్చు.అల్లం, తులసి ఆకులు నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి నోటిలో పుకిలిస్తే మంచిది.అల్లం, తులసి, వామ్ము ఆకులు వేసి మరగించిన టీని తాగితే గొంతు నొప్పి, జలుబుకు మంచి ఉపశమనం లభిస్తుంది.ఇవి పిల్లలకు కూడా కొద్ది మోతాదులో తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవీ చదవండి: అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీతేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?నోట్ : తరచుగా జలుబు, జ్వరం, గొంతు నొప్పి, మింగడంలో సమస్యలొస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. చిన్న పిల్లల్లో అయితే టాన్సిల్స్, అడినాయిడ్స్ లాంటి సమస్యలేమైనా ఉన్నాయోమో గుర్తించి మందులును వాడాలి -
తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?
చలికాలం మొదలు కాగానే మార్కెట్టులో విరివిగా కనిపించే వాటిలో తేగలు ఒకటి. వీటిని కొన్ని ప్రాంతాలలో గేగులు అని అంటారు. వీటిని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. అవేంటో తెలుసుకుంటే ఇప్పుడైనా వీటిని తినేందుకు త్వరపడతారు. తేగల్లో పొటాషియం, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి పోషకాల లోపాన్నీ తగ్గిస్తాయి. తేగలతో ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా? తేగలను ఉడికించి మిరియాలు, ఉప్పు అద్దుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. తేగలు తింటే బరువు తగ్గడంతోపాటు కాన్సర్ కూడా దూరం అవుతుంది. అలాగే తేగలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండి కొట్టి, కొబ్బరి పాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.తేగలపిండితో రొట్టెలు చేసుకుని తినొచ్చు. ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. పెద్ద పేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో తెల్ల కణాలను వృద్ధి చేస్తుంది. శరీరానికి చలువనిచ్చి, నోటిపూతను తగ్గిస్తుంది. తేగలను పాలలో ఉడికించి ఆ పాలను చర్మానికి పూతలా రాసుకుంటే చర్మం మిలమిల లాడుతంంది.తేగలు దొరికే రోజుల్లో పిల్లలకు రెగ్యులర్‌గా వీటిని పెడితే ఎముకల ఎదుగుదలకు దోహద పడుతుంది. తాటి తేగలను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించి మధుమేహాన్ని అదుపు చేస్తుంది. రక్తం తక్కువగా ఉండి అనీమియాతో బాధపడుతున్నవారు ఈ సీజన్లో వచ్చే తేగలను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. తాటి చెట్ల ద్వారా... తేగలకు మూలం తాటిచెట్టే. వేసవిలో తాటికాయల కాపు మొదలవుతుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో తాటి ముంజులు మార్కెట్లోకి వస్తాయి. అవి ముదిరి తాటికాయలుగా తయారై పండ్లుగా మారతాయి. అలా రాలిన తాటి పండ్ల గుజ్జును వినియోగించి పిండి వంటలు తయారు చేస్తారు. ముఖ్యంగా తాటి తాండ్ర, తాటి రొట్టెలు మొదలైనవి. ఈ తాటి కాయల టెంకలతో పాటు,కాయలను కూడా ప్రత్యేక ప్రాంతాల్లో రైతులు వ్యాపారులు తేగల పాతరలు వేస్తారు. వీటికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు. భూమి ఇసుక పొరలలో దృఢంగా పెరుగుతాయి. డిసెంబర్ నాటికి ఇవి తేగలుగా తయారవుతాయి. వీటిని మొలకలు రాకముందే తీసి, కుండల్లో ప్రత్యేకంగా అమర్చి నిప్పుల్లో కాల్చతారు. ఇవి తినడానికి కమ్మగా ఉంటాయి. వీటి మార్కెట్లో విక్రయంచి రైతులు ఉపాధి పొందుతారు.ఆహా ఆరోగ్యం.. తేగలు గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి. నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. డయాబెటిస్తో బాధపడే వారు వీటిని తింటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తాటి తేగలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా మంచిది. ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పెరిగే ఈ తాటి తేగలు మంచి పోషకాహారంగా మనం చెప్పవచ్చు. వీటిల్లో ఉండే పీచు పదార్థం మన జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి తాటి తేగలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్లరక్త కణాలను పెంచి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.ఇవీ చదవండి :ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ నోట్: మంచిది కదా అని అతిగా తింటే మాత్రం చెరుపు చేస్తుంది. -
చిటికెలో హెల్దీగా..చియా కర్డ్ పుడ్డింగ్
చియా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. అందులో ఒకటి చియా కర్డ్ పుడ్డింగ్. ఇందులో పెరుగు, క్యారెట్, కీరా లాంటి కూరగాయలు జోడించడం వల్ల రుచికీ రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాదు ఇది బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది. చియా కర్డ్పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలికావలసినవి: చియా సీడ్స్ (నల్ల గసగసాలు) – 4 టేబుల్ స్పూన్లు (రెండు గంటల సేపు నానబెట్టాలి); క్యారట్ తురుము-పావు కప్పు; బీట్ రూట్ తురుము-పావుకప్పు, కీరకాయ తురుము-పావుకప్పు. పెరుగు – కప్పు; పచ్చిమిర్చి – 2 (నిలువుగా తరగాలి); దానిమ్మగింజలు -పావుకప్పు ఉప్పు రుచిని బట్టి; ఇంగువ – చిటికెడు; తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూన్;పోపు కోసం...: నెయ్యి– టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చి శనగపప్పు – గుప్పెడు; వేరుశనగపప్పు – గుప్పెడు.తయారీ: ఒక పాత్రలో నానబెట్టిన చియా సీడ్స్, పెరుగు, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, క్యారట్ , బీట్రూట్, కీరకాయ తురుము వేసి బాగా కలపాలి. ∙ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి అందులోఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు వేయించి కరివేపాకు వేసి దించేయాలి. ఈ పోపును పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా దానిమ్మ గింజలు, కొత్తిమీర చల్లి వడ్డించాలి. పోషకాలు: మ్యాక్రో న్యూట్రియెంట్స్: కేలరీలు – 230; ప్రొటీన్ – 8 గ్రాములు;కార్బోహైడ్రేట్లు – 20 గ్రాములు;ఫైబర్– 7 గ్రాములు;చక్కెర – 6 గ్రాములు;ఫ్యాట్ – 12 గ్రాములు;సాచ్యురేటెడ్ ఫ్యాట్ – 3 గ్రాములు;మైక్రో న్యూట్రియెంట్స్: క్యాల్షియమ్– 280 మిల్లీగ్రాములు;ఐరన్– 2.5 మిల్లీగ్రాములు;మెగ్నీషియమ్– 90 మిల్లీగ్రాములు; పొటాషియమ్– 450 మిల్లీగ్రాములు;విటమిన్ సి– 8– 1– మిల్లీగ్రాములు;విటమిన్ ఏ – 350 మైక్రోగ్రాములు;ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు – 3–4 గ్రాములు ఇదీచదవండి : అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుఅలాగే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ చియా కర్డ్ పుడ్డింగ్. అంతేకాదు సులువుగా చేసుకునే అల్పాహారం. స్ట్రాబెర్రీ, దానిమ్మ, యాపిల్, ఇలా పండ్ల ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే మరింత ఆరోగ్యకరమైంది కూడా. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండిన ఈ పుడ్డింగ్ చాలాసేపు పొట్టనిండుగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. చదవండి: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ : శారీ స్నీకర్స్ -
చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ‘సూపర్ పండు’ ఎన్ని లాభాలో!
ప్రకృతి చాలా మహమాన్వితమైంది. సీజన్‌కు తగ్గట్టు మనకు ఎన్నో అద్భుతమైన ఫలాలను అందిస్తుంది. అందుకే ఏ కాలంలో దొరికే పళ్లు, కూరగాయలు ఆకాలంలో విరివిగా తినాలని పెద్దలు చెబుతారు. మరి శీతాకాలంలో మాత్రమే దొరికే ఒక అద్భుతమైన చిట్టి పండు గురించి తెలుసుకుందాం. రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమిటా పండు? దాని లాభాలేంటి? చూద్దామా. శీతాకాలంలో మాత్రమే దొరికే రేగి పండు(jujube fruit)తీపి పులుపు కలగలిపిన అద్భుతమైన రుచి. చూడ్డానికి చిన్నగా కనిపించినా పోషక విలువలు మాత్రం మెండుగా లభిస్తాయి. అందుకే ఆయుర్వేద చికిత్సలో, ఔషధాల్లో ప్రాముఖ్యత కూడా ఉంది. రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. తలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.ఈ పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతగానో ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా రేగు పళ్లతో చేసే ఒడియాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కసారి అలవాటు పడితే తినకుండా ఉండలేం. వీటి రుచి మహాగమ్మత్తుగా ఉంటుంది. రేగి పళ్ళపై ఉప్పు కారం చల్లుకుని తింటారు. ఇంకా వీజామ్లూ, జెల్లీలూ, జ్యూస్, టీ, వినెగర్, క్యాండీలూ లాంటి వాటిని కూడా తయారు చేస్తారు. రేగుపళ్లలో పురుగులు బాగా ఉంటాయి. చూసుకొని తినాలి రేగు పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. రేగిపండులో ఉన్న పోటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.రక్తహీనతతో బాధపడేవారికి రేగుపళ్లు చాలా మేలు చేస్తాయి. గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే వేవిళ్లు, వాంతుల సమయంలో రేగుపళ్లుతో తయారు చేసిన రేగుపళ్లను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ ఉంటే నోటికి పుల్లగా బావుంటుంది. అలాగే వాంతులు కూడా తగ్గే అవకాశాలున్నాయి. అద్బుతమైన ప్రయోజనాలురేగిపండులోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పళ్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వైరస్లు, బాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి శీతాకాలంలో వచ్చే సీజనల్ జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సహజసిద్ధమైన చక్కెరలు , బీ విటమిన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.రక్తహీనతను (Anaemia) నివారిస్తుంది. రేగిపండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది. అనీమియాసమస్యలతో బాధపడేవారు కొన్ని రేగిపండ్లను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.రేగిపండులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పాడతాయి. ముఖంపై మచ్చలు, ముడతలు , తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి,చర్మానికి మెరుపునిస్తుంది. సౌందర్యం కోసం రేగిపండును ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగిస్తారు.అంతేనా...ఇంకాదీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడితో బాధపడేవాళ్లకి రేగుపండ్లు ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు తింటే డిప్రెషన్ దూరం అవుతుంది. అలాగే నిద్రలేమి (Insomnia) సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ మతిమరుపూ ఆల్జీమర్స్ రాకుండానూ అడ్డుకుంటుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ (Phytochemicals) వల్ల రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రేగిపండును (మితం) తీసుకోవచ్చు.రేగిపండులో కూడా క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కనుక బరువు పెరుగుతామనే బెంగ అవసరం లేదు. పైగా ఇది కడుపుని తేలికగా,తృప్తిగా ఉంచుతుంది. రేగిపండులో కేల్షియం, ఫాస్పరస్, మ్యాగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి. ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సమస్యలకు ఉపశమనం పనిచేస్తాయి.రేగిపండులో యాంటీ-క్యాన్సర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రిస్తాయి . ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ , లివర్ క్యాన్సర్ ముప్పును తగ్గించే అవకాశం ఉంది.ఎవరు తినకూడదుయాంటీ డిప్రెసెంట్ మందులువాడేవారుమూర్చ వ్యాధితో బాధపడుతున్న వారుస్కిన్ అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నవారు.ఆస్తమా వ్యాధితోబాధపడుతున్నారు కూడా రేగుపళ్ళను అతిగా తినకూడదు.ఎక్కువగా తింటే విరేచనాలు అయ్యే ప్రమాదముంది గనుక, ఇప్పటికే ఈ సమస్యతో బాధపడేవారు కూడా దూరంగా ఉండాలి. నోట్: ఇది అవగాహన కోసం అందించిన మాత్రమే. ఏదైనా అతిగా తినకూడదు. అతిగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. గొంతులో కఫం పెరగడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. -
భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!
శీతాకాలం ప్రారంభం కాగానే కొన్ని రకాల శ్వాసకోస వ్యాధులు, కీళ్లు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. అందుకే ఈ సీజన్లో రుచితో పాటు,ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి ఒక గొప్ప సూపర్ ఫుడ్ అవిశె, నువ్వుల లడ్డు. పోషకాలతోపాటు అనేక రకాలుగా మనకు లాభాలను చేకూర్చే అవిశె గింజలు, నువ్వుల లడ్డూ(Flax Seeds And Sesame Seeds Laddu) ఎలా తయారు చేయాలో చూద్దాం.ఈ లడ్డూలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. అంతేకాకుండా, వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. నువ్వులలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, భాస్వరం, జింక్, మాలిబ్డినం, సెలీనియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ఇక అవిశె గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులకు అద్భుతమైన మూలం. పోషకాలకు శక్తివంతమైనది కూడా. వీటి ద్వారా విటమిన్ బి, సి, డైటరీ ఫైబర్, సోడియం, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. బెల్లంతో మంచి ఐరన్ లభిస్తుంది. అంతటి శ్రేష్టమైన వీటికి దేశీ నెయ్యి , సేంద్రీయ బెల్లంతో కలిసి లడ్డూలను తయారు చేసుకుంటే అది సూపర్ ఫుడ్ కాక ఏమవుతుంది.అవిశె గింజలు - నువ్వుల లడ్డు తయారీకావాల్సిన పదార్థాలునువ్వులు, అవిశెగింజలు, బెల్లం, కొద్దిగా బాదం, జీడింపప్పులు, బెల్లం, కొద్దిగా నెయ్యి, చిటికెడు యాలకుల పొడిముందుగా రెండు కప్పుల అవిశె గింజలు( Flax Seeds) దోరగా వేయించిన, అలాగే ఒక కప్పు నువ్వులను కూడా దోరంగా వేయించుకోవాలి. దీంతోపాటు బాదం, జీడి పప్పులను కూడా నూనె లేదా నెయ్యి లేకుండానే వేయించుకోవాలి. ఇవి గోరు వెచ్చగా ఉండగానే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ,రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి (Ghee) ఒకటిన్నర కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము వేసి పాకం పట్టుకోవాలి. పాకం వచ్చినాక, ముందుగా పొడి చేసిపెట్టుకున్న అవిశె, నువ్వుల పొడిని వేసుకుంటూ బాగా కలపాలి. కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇందులో చిటికెడ్ యాలకుల పొడి, బాదం, జీడిపప్పుల పొడి వేసుకోవాలి. కొద్దిసేపాక దింపేసుకుని కొంచెం వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ లడ్డూ వలన ఎముకలు బలోపేతమవుతాయి. ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రేఅవిశె గింజలు - నువ్వుల లడ్డు లాభాలుశీతాకాలంలో చలి నుండి రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.బరువు నిర్వహణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా రెండు విషయాల్లోనూ ప్రయోజనకరంగా ఉంటుంది.క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అధిక రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో సాధారణ బీపీ నిర్వహణలో సహాయపడుతుంది.కడుపుకు చాలా ప్రయోజనకరం. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . జీవక్రియను కూడా పెంచుతుంది.ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,మంచి కొలెస్ట్రాల్ ( HDL)ను పెంచడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.ఎముకలు ,కండరాలను బలపరుస్తుంది.మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .నిద్ర సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.అలసటను తొలగించి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.అనేక చర్మ, జుట్టు సమస్యలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇంకా మోకాళ్లు , కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని మోకాళ్ళ నొప్పులు(Knee Pain) వేధిస్తున్నాయి. అలాంటి వారికి ఇది చాలా మేలు చేస్తుంది.(37 కిలోలు తగ్గి, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన గృహిణి)నోట్: వయసుతోపాటు వచ్చే మోకాళ్ల నొప్పులకు జీవన శైలిమార్పులు, కండరాలను బలోపేతం చేసే కొన్ని రకాల వ్యాయామాలు తప్పనిసరి. దీంతోపాటు వైద్యుల సలహా ప్రకారం అవసరమైతే కొన్ని మందులను వాడాల్సి ఉంటుంది. -
బీరకాయ కూరను బాలింతలకు ఎందుకు పెడతారో తెలుసా?
బీరకాయ అనగానే ‘అబ్బా.. ఇపుడది తినాలా’ అంటారు పిల్లలు. పెద్దల్ల కూడా చాలామంది బీరకాయ తినడానికి ఇష్టపడరు. కానీ బీరకాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మన పెద్దలనాటి నుంచి అనారోగ్యం నుంచి కోలుకున్న వారికి, బాలింతలకు బీరకాయ ఎక్కువ పెడతారు. దీనికా కారణం ఏమిటంటే.. కోలుకోవడానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. తేలిగ్గా జీర్ణం అవుతుంది కూడా. బీరకాయల్లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రొటీన్ పవర్‌హౌస్. బీరకాయ. అందుకే ఆయుర్వేద వైద్యంలో ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ, సహా వివిధ పరిస్థితులకు చికిత్సగా చాలా కాలంగా వాడుతున్నారు.బీరకాయలో వాటర్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, సీ, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం లభిస్తాయి. ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. బీరకాయలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలను తగ్గిస్తుంది. దీంతో రక్తహీనత దరి ఉండదు.బీరకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బీరకాయలో సెల్యులోజ్, డైటర్ ఫైబర్ కూడా లభిస్తుంది. బీరకాయను తినడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. మలబద్దకం దూరం అవుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయిటకు పంపించడంలో బీరకాయ సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.బీరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు నిజానికి పెప్టిక్ అల్సర్లను ఎదుర్కోవడంలో సహాయ పడతాయి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.బీరకాయ వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇందులోని పొటాషియం, సోడియం, జింక్, రాగి, సెలీనియం శరీరంలోని యాసిడ్స్‌ను నియంత్రిస్తాయి.బీరకాయ రసంతో తయారు చేసిన హోమియోపతిక్ మాత్రలను సైనసైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కోసం వాడతారట. బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. బీరకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మూత్రంలోని చక్కెర స్థాయిలను సైతం తగ్గించేందుకు సహాయపడుతుంది.బరువు తగ్గడానికి అల్సర్లు , అజీర్ణం చికిత్సకు కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను పెప్టిక్ అల్సర్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. వాటర్కంటెంట్ ఫైబర్ ఎక్కువ, కొవ్వు తక్కువ కాబట్టి బరువు తగ్గడంలో కూడా గణనీయంగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.బీరకాయను ఎన్ని రకాలుగా వండుకోవచ్చుకంది పప్పుతో కలిపి బీరకాయ పప్పును తయారు చేసుకోవచ్చుపెసరపప్పుతో, శనగపప్పుతో కలిపి పొడి కూరలాగ వండుకోవచ్చుగానుగ నూనెతో చేసిన బీరకాయ కూరను బాలింతకు, పేషెంట్లకు పెట్టవచ్చుబీరకాయ, పాలు కూర వండుకోవచ్చుబీరకాయను పచ్చడిగా చేసుకోవచ్చు.బీరకాయను కూర చేసుకొని, తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు.బీరకాయతో బజ్జీలు కూడా తయారు చేసుకోవచ్చుఅంతేకాదు బీరకాయ, ఎండురొయ్యలతో కూడా రుచికరమైన కూరను వండుకోవచ్చు. -
ఎర్ర కలబందతో ఎన్నో ప్రయోజనాలు : తెలిస్తే, అస్సలు వదలరు!
కలబంద ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పటివరకూ చాలా విన్నాం. తరతరాలుగా సౌందర్య పోషణలో,చర్మ సంరక్షణలో కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోవలోకి ఇపుడు మరో కొత్త రకం కలబంద వచ్చి చేరింది. అదే రెడ్ కలబంద. ఈ రెడ్ కలబంద ఇప్పుడు చర్మ సంరక్షణ మార్కెట్లోకి వేగంగా దూసుకొస్తోంది. ముదురు ఎరుపు రంగుకు ప్రసిద్ధి చెందిన ఈ రకంలో చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.రెడ్ కలబంద ప్రయోజనాలు:ఆకుపచ్చ కలబందతో పోలిస్తే ఎరుపు రంగు కలబంద ఎక్కువ ఔషధ గుణాలు, ప్రయోజనాలున్నాయి. అందుకే ‘కింగ్ ఆఫ్ అలోవెరా’గా పేరు తెచ్చుకుంది. రెడ్ కలబంద వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.పోషకాలు: రెడ్ కలబందలో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), విటమిన్ సి, ఇ, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది పెద్ద మొత్తంలో అమైనో ఆమ్లాలు, పాలిసాకరైడ్లను కలిగి ఉంటుంది. ఇది జుట్టు, చర్మం, కళ్ళకు ఒక వరంలాంటిదట.యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం: ఎరుపు కలబంద ఆంథోసైనిన్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా దాని రంగు ఎర్రగా ఉంటుందని ర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జుష్యా భాటియా సారిన్ చెప్పారు. పర్యావరణ ఒత్తిడి ప్రభావాలను తగ్గించడానికి ఎరుపు కలబంద ఫేస్ సీరం ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే కొల్లాజెన్ చర్మం యవ్వనాన్ని కాపాడుతుంది. ఈ సమ్మేళనాలు కాలుష్యం, ఒత్తిడి, వృద్ధాప్యం వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయని. ఎర్ర కలబంద యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేటింగ్ మూలకాల శక్తివంతమైన మిశ్రమమని ఆమె తెలిపారు.రోగనిరోధక శక్తికి: ఎర్ర కలబంద రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది బాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది.మేనికి మెరుపు : విటమిన్లు A, C , E చర్మాన్ని ప్రకాశవంతంగా, దృఢంగా మారుస్తుంది. దీని ఆధారిత మాయిశ్చరైజర్ చర్మం యొక్క సహజ మెరుపును కాపాడుతుంది. చర్మానికి చల్లదనాన్నిస్తుంది. ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. రెడ్ కలడంద జ్యూస్‌తో శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలిన గాయాలు, గాయాలు, సోరియాసిస్ నివారణలో మేలు చేస్తుంది.గుండెకు మేలు : ఎర్ర కలబంద జ్యూస్‌తో గుండె ఆరోగ్యం బలపడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌లో పరిమిత రూపంలో దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ జ్యూస్ తాగడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా మారడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది ఎర్ర కలబందను జుట్టు మీద అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. -
హెల్దీ డైట్ : మిక్స్డ్ చుడువా : ఇలా ట్రై చేయండి!
బరువు తగ్గాలనుకునేవారికి, ఈజీగా ఏదైన స్నాక్ చేయానుకునేవారికి బెస్ట్ ఆప్షన్ మిక్స్డ్ చుడువా. ఒకసారి చేసుకుని నిల్వ ఉంచుకుని కూడా వినియోగించుకోచ్చు. మరి అలాంటి హెల్దీ అంట్ టేస్టీ మిక్స్డ్ చుడువాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి! కావలసినవి: మఖానా– కప్పు; జీడిపప్పు– కప్పు; బాదం పలుకులు– కప్పు అటుకులు – కప్పు; కిస్మిస్– కప్పు; ఎండు కొబ్బరి పలుకులు– కప్పు; వేరుశనగపప్పు– కప్పు; గుమ్మడి గింజలు – అర కప్పు; కరివేపాకు– 2 రెమ్మలు; నల్ల ఉప్పు – చిటికెడు; ఉప్పు– అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; జీలకర్ర పొడి– టేబుల్ స్పూన్; ఆమ్చూర్ పౌడర్– అర టీ స్పూన్; చక్కెర పొడి– టేబుల్ స్పూన్; నూనె– 2 టీ స్పూన్లు. తయారీ:మఖానీ, జీడిపప్పు, బాదం, వేరుశనగపప్పు, గుమ్మడి గింజలను విడివిడిగా నూనె లేకుండా మందపాటి బాణలిలో దోరగా వేయించాలి. బాణలిలో నూనె వేడి చేసి ఎండుకొబ్బరి, అటుకులను వేయించాలి. అవి వేగిన తరవాత అందులో కరివేపాకు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ కిస్మిస్, చక్కెర పొడి వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గింజలన్నింటినీ వేసి సమంగా కలిసే వరకు కలపాలి. పోషకాలు: వందగ్రాముల మిశ్రమంలో... ∙కేలరీలు– 480 ప్రొఒటీన్– 10 గ్రాములు ∙కార్బొహైడ్రేట్లు – 35 గ్రాములు ∙ఫ్యాట్ – 35 గ్రాములు ∙ఫైబర్ – 6 గ్రాములు ∙ఐరన్ – 2.5 గ్రాములు ∙క్యాల్షియమ్ – 50మిల్లీగ్రాములు ∙విటమిన్ ఈ– 3 మిల్లీగ్రాములు మఖానాలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడి గింజల్లో జింక్, మెగ్నీషియం ఉంటాయి. నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఈ, బీ6 వంటి విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ దేహక్రియలను మెరుగుపరచడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.డాక్టర్ కరుణన్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
పత్తి పండు!
అవును. దీని పేరు పత్తి పండే! వేసవి తాపాన్ని తీర్చే అద్భుతమైన తినదగిన పత్తి పండు ఇది. మధ్యకు కోస్తే దీంట్లో తెల్లని రూది మాదిరిగా కనిపించే గుజ్జు ఉంటుంది. విలక్షణమైన ఈ పండుకు ‘సెంతొల్’, ‘కాటన్ ఫ్రూట్’తో పాటు చాలా మారు పేర్లున్నాయి. కెచపి, లాల్లీ ఫ్రూట్, వైల్డ్ మాంగోస్టీన్, రెడ్ సెంతొల్, సెంతుల్, సౖయె, వైసయన్.. ఇలా అనేక పేర్లుతో పిలుస్తారు.ఆగ్నేయాసియా ప్రాంతమే పత్తి పండు పుట్టిల్లు. దీని శాస్త్రీయ నామం ‘సండోరికం కోయెట్జాపే’. మెనియాసీ లేదా మహోగని కుటుంబానికి చెందినది. ఈ పండు గుజ్జు తీపి, వగరు కలిసిన చిత్రమైన రుచి కలిగి ఉంటుంది. ఆగ్నేసియా దేశాల్లోని ఉష్ణమండల లోతట్టు భూముల్లో విస్తృతంగా సాగవుతున్న పండ్ల చెట్టు ఇది. తాజా పండ్ల వాడకమే ఎక్కువ. సంతొల్ చెట్లు లోయర్ ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో చాలా ఎత్తుగా, వేగంగా పెరుగుతాయి. సాధారణంగా 15–40 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా 4–10 అంగుళాల పొడవు పెరుగుతాయి. పూలు 1 సెం.మీ. పొడవున ఆకుపచ్చ, పసుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. పత్తి పండు గుండ్రంగా, ఆపిల్ సైజులో ఉంటుంది. పండు లోపల రసంతో కూడిన ఐదు దూది తొనల మాదిరిగా ఉంటాయి. 3–4 విత్తనాలుంటాయి. దీని గుజ్జు వగరగా ఉంటుంది. పండు పండిన తర్వాత తియ్యగా మారుతుంది. కొన్ని రకాల సంతొల్ పండ్లు తక్కువ తీపిగా, మరికొన్ని రకాలు మరింత తీపిగా ఉంటాయి. బాగా తియ్యగా ఉండే పండ్లు ఆపిల్ రుచికి దగ్గరగా ఉంటాయి.రెండు రకాలుసంతొల్ పండుకు సంబంధించి ప్రధానంగా రెండు వంగడాలు ఎరుపు (ఎస్.కోయెట్జాపే), పసుపు (ఎస్. నెర్వోసమ్) రంగుల్లో ఉంటాయి. ఎరుపు రంగులో ఉండే రకం పత్తి పండ్లను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. మార్కెట్లలో ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. కొమ్మకు కాయకు మధ్య ఉండే కాడలు, తొక్క, పండు రుచిలో ఈ రెండు రకాల పండ్లకు స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. పసుపు సంతొల్ పండు తొడిమెలు 15 సెం.మీ. పొడవున ఉంటాయి. పండు కోతకు వచ్చే సమయానికి తొడిమలు కూడా పసుపు రంగులోకి మారతాయి. ఎరుపు సంతొల్ పండ్ల తొడిమెలు 30 సెం.మీ. వరకు పెరిగి, ఎరుపుగా మారతాయి. పసుపు పండు తొక్క పల్చగా, రుచి తియ్యగా ఉంటుంది. ఎర్ర పండు తొక్క మందంగా, రుచి కొంచెం వగరుగా ఉంటుంది.ఆరోగ్య ప్రయోజనాలు1. కేన్సర్ నివారణ: సంతొల్ పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేన్సర్ కణాల వ్యాప్తిని ఇవి అరికడతాయి. ఈ పండు నుంచి సంగ్రహించే సెకోట్రిటెర్పెన్, కోయెట్జాపిక్ ఆసిడ్ అనే రెండు బయోయాక్టివ్ కెమికల్స్ కేన్సర్ కణాలపై సైటోటాక్సిక్ ప్రభావం చూపుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఎలుకల స్తన గ్రంధుల్లో గడ్డల సైజును, సంఖ్యను తగ్గించగలిగాయి. మనుషుల్లో కేన్సర్ కణాలను ఇవి హరిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది.2. ఆరోగ్యకరమైన దంతాలు: పత్తి పండ్లు లాలాజలానికి సంబంధించిన గ్రంధులను ఉత్తేజపరచటం ద్వారా మరింత లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. నోట్లో హానికారక క్రిములను నశింపజేయటం ద్వారా దంతాల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.3. ఎల్‌డిఎల్‌ను తగ్గిస్తాయి: సంతొల్ పండులో పెక్టిన్ అనే జీర్ణమయ్యే పీచు ఉంటుంది. లో డెన్సిటీ లిపో్రపొటీన్ (ఎల్డిఎల్) రక్తంలో ఎక్కువగా ఉంటే రక్తపోటు, గుండెపోటు తదితర గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. పెక్టిన్, హెచ్డిఎల్లు కలసి ఎల్‌డిఎల్‌ను రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరకుండా చూస్తాయి. తద్వారా సంతొల్ పండు గుండె జబ్బుల్ని నివారిస్తుంది.4. బరువు తగ్గిస్తుంది: శరీరపు అధిక బరువు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, హార్మోన్ అసమతుల్యత వంటి అనేక సమస్యలకు కారణం. ఈ పండ్లలో జీర్ణమయ్యే, కాని పీచు పదార్థాలు ఉంటాయి. తిండి యావ తగ్గించటం ద్వారా ఊబకాయం తగ్గటానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదం చేస్తుంది.5. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది: పత్తి పండులోని క్వెర్సెటిన్ అనే యాంటాఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కణాలను బాగు చేయటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని పీచు పదార్థం ్రపోబయాటిక్ మైక్రోఆర్గానిజమ్స్ని ఉత్తేజపరచి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.6. రక్తహీనత, అల్జిమర్స్‌ను తగ్గిస్తుంది: దేహంలో సరిపోయినంతగా ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేకపోతే రక్తహీనత కలుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ చలనానికి ఐరన్ అవసరం. ఈ పండ్లలోని విటమిన్ సి వల్ల ఐరన్‌ను ఇముడ్చుకోగల శక్తిని జీర్ణవ్యవస్థ పెంచుకుంటుంది. ఇందులో పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతూ ల్జిమర్స్ ముప్పు నుంచి తప్పిస్తాయి.7. రక్తంలో చక్కెర నియంత్రణ: ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి గ్లూకోజ్‌ను నెమ్మదిగా రక్తంలో కలిసేందుకు దోహదం చేస్తుంది. తద్వారా బ్లడ్ సుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.8. చర్మ సౌందర్యం: చర్మంలోని కణాల మధ్య కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి కొల్లాజెన్ ఉపయోగపడుతుంది. ఇది ఏర్పరడడానికి ఈ పండ్లలోని విటమిన్ సి దోహదపడుతుంది. ఈ పండ్లలోని శాండ్రోనిక్ ఆసిడ్, బ్రయోనోటికాసిడ్లు అలెర్జీలను నివారిస్తాయి. చర్మంపై పొక్కులు, సోరియాసిస్, ఇతర చర్మ సంబంధమైన సమస్యలకు చేసే చికిత్సలో ఈ పండ్లలోని సహజ స్టెరాయిడల్ సపోజెనిన్, అల్కలాయిడ్స్ ఉపయోగపడతాయి. ఈ చెట్టు బెరడులో సపోజెనిన్ ఉంటుంది. తామర, తదితర ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించే చికిత్సకు ఇది ఉపకరిస్తుంది. ఈ చెట్టు బెరడు పొడిని చర్మంపై లేపనం చేస్తే ఇన్షెక్షన్లు తగ్గుతాయి.9. స్త్రీ వ్యాధుల్ని తగ్గిస్తుంది: స్త్రీ జననాంగంలో ఇన్షెక్షన్ల చికిత్సకు ఈ పండుతో పాటు చెట్టు బెరడు కూడా ఉపయోగపడుతుంది. ఈ బెరడు వేసి ఉడికించిన కషాయంతో యోనిని రోజూ శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.విలువ ఆధారిత ఉత్పత్తులు...థాయ్ వంటకాల్లో, సలాడ్లలో సంతొల్ పండ్ల ముక్కలను వాడుతుంటారు. ఈ పండ్లతో తయారు చేసే సోం టామ్ అనే ఉత్పత్తిని రొయ్యల కూరల్లో వాడతారు. ఈ పండ్ల తరుగుతో తయారు చేసే సినటొలన్ అప్పెటైజర్గా వాడతారు. అనేక వంటకాల్లో వగరు రుచి కోసం కూడా పత్తి పండు తరుగును వాడుతూ ఉంటారు. -
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..
స్క్రీన్ టైమింగ్ తగ్గాలి..చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ మొబైల్ ఫోన్ లేనిదే గడవట్లేదు. కొత్త సంవత్సరంలో అయినా స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటే మంచిది. కళ్లతో పాటు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమింగ్ కాస్త తగ్గించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి.సైబర్ వలలో పడకుండా..సైబర్ నేరాలకు అంతులేకుండా పోతోంది. ఏ అవకాశం దొరికినా అందిపుచ్చుకునేందుకు సైబర్ నేరస్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాలో బ్యాంకు వివరాల గోప్యత పాటించడం, కొన్ని జాగ్రత్తలు వహించడం మనకే మంచిది.పొదుపు మంత్రం..ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు చేసే పొదుపే రేపు వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడేస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. దుబారా ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ పొదుపు మంత్రం పాటిస్తే ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. సంపాదనలో కొంత ఇన్సూరెన్స్లోనో, మ్యూచువల్ ఫండ్స్‌లోనో దాచుకోవడం మంచిది.డ్రగ్స్‌కు దూరం..ప్రస్తుతం డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు సమాజానికి చీడపురుగులా తయారయ్యాయి. డ్రగ్స్ రహిత సమాజం కోసం మన వంతు కృషి చేద్దాం. డ్రగ్స్ తీసుకోవడమే కాదు.. దానికి బానిసైన వారిని దూరంగా ఉంచేందుకు ప్రయతి్నద్దాం. దీనిపై పోలీసులకు సహకరిద్దాం.పరులకు సహాయం.. పరులకు సాయం చేస్తే మనకు తిరిగి ప్రకృతి సహాయం చేస్తుంది. అందుకే ఉన్నదాంట్లో తోచినంత పరులకు, అవసరం ఉన్న వారికి సహాయం చేయాలనే ఆలోచన చేస్తే మంచిది. మీ టు డూ లిస్ట్ లో ఇది చేర్చుకోవడం మర్చిపోవద్దు. తద్వారా ఎదో ఒక రోజు మనం ఊహించని రీతిలో తిరిగి సహాయం అందుతుందని మర్చిపోవద్దు.హెల్త్ ఈజ్ వెల్త్..ఎంత సంపాదించినా సరైన ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఉండదు. ఉద్యోగం, సంపాదన వేటలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. సో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ గంట సమయం కేటాయించడం ఎంతో ముఖ్యం. ఉదయం లేవగానే కొద్దిసేపు వ్యాయామం, చిన్నపాటి బరువులు ఎత్తడం, నడక వంటివి ఎంత ముఖ్యమో.. సరైన ఆహారం తీసుకోవడమూ అంతే ముఖ్యం.ప్రస్తుతం తరుణంలో ఉరుకుల, పరుగుల జీవన విధానంలో మనలో చాలా మందికి సామాజిక స్పృహ లేకుండా పోతోందని విశ్లేషకులు చెబుతున్న మాట..! ఇటీవల రోడ్ రేజ్ పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. కనీసం ఓపిక లేకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై వెళ్తుండగా ఎవరితో అయిన ఘర్షణ జరిగితే కాస్త సంయమనం పాటించి.. చిన్న చిరునవ్వు చిందిస్తే ఎలాంటి సమస్యకూ తావులేకుండా ఉంటుంది. లేదంటే గొడవలు, ముష్టి యుద్ధాలకు దారితీసి తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని గ్రహించాలి. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ.. ఒత్తిడి ప్రపంచంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చిన్నవాటికే చిరాకు పడడం.. కోపం తెచ్చుకోవడం.. అసహనం వ్యక్తం చేయడం.. తగ్గించుకోవడం ఎంతో మంచిది. ఇందుకోసం యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ఆరోగ్యకరమైన అలవాటు. మానసిక ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం, తద్వారా సమాజం బాగుంటుంది. ఫ్యామిలీ టైం.. ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కొంత సమయం గడపడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎంత సంపాదించినా అది కుటుంబం కోసమే. ఇంతా చేసి కుటుంబానికి సమయం కేటాయించకపోతే కుటుంబ సభ్యులు మనల్ని మిస్ అవుతారనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతిరోజు కాకపోయినా.. వారంలో ఒకసారి కలిసి కూర్చుని భోజనం చేయడం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఒకరి గురించి ఒకరు ఆరా తీసుకునే వీలు కలుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ విషయంలో.. ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో మిగతా నగరాల పౌరులతో పోల్చుకుంటే మనం వెనుకబడ్డట్టే. రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాల నివారణకు దోహదం చేయవచ్చు. దీనిని మన వంతు బాధ్యతగా పాటించాలని ఇప్పటి నుంచే నిర్ణయం తీసుకుందాం.. మనలో ఈ చిన్న మార్పు 10 మందికి స్ఫూర్తిగా నిలిచి, సమాజాభివృద్ధికి దోహదం చేస్తుంది. టైం సెన్స్ ముఖ్యం.. మనం చిన్నప్పటి నుంచీ వినే మాట సమయపాలన. అయినా.. ఎన్నోసార్లు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటాం. ఒక్క సెకండ్‌తో ఎన్నో మార్పులు జరగవచ్చు. ఒక్క నిమిషం వల్ల ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. సమయం పోతే తిరిగి రాదు.. అనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. ఒలింపిక్స్‌లో ఎన్నో పతకాలు చేజారిపోయేదా ఆ సెకను తేడాతోనే అనే విషయం గ్రహించాలి. సమయం అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉండదు.. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉంటుంది. అందుకే విధిగా సమయపాలన పాటించడం అనేది వచ్చే ఏడాది మన డైరీలో భాగం కావాలి. అదే మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. -
చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!
లవంగం అనగానేపురాతన కాలం నుంచి వంటలలో వాడే మసాలాగా మాత్రమే గుర్తొస్తుంది. అలాగే పంటినొప్పులకు వాడే లవంగ తైలం గురొస్తుంది. వాస్తవానికి మసాలా దినుసు లవంగాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలున్న లవంగ మొగ్గను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలి విపరీతంగా ఉన్న ప్రస్తుతం తరుణంలో లవంగాలు చాలా కీలకంగా పనిచేస్తాయి.ఆహారానికి మంచి రుచి, వాసన ఇచ్చే లవంగాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనేక రోగాల బారి నుండి కాపాడుకునేందుకు లవంగాలు ఉపయోపడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తాయి. లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. రోజుకి రెండు లవంగాలను నమలడం వల్ల బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.ప్రధాన ప్రయోజనాలు లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువముఖ్యమైన పోషకాలూ లభిస్తాయికడుపులోని అల్సర్లను తగ్గిస్తుంది.కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.చెడు బ్యాక్టీరియాను మన దరి చేరకుండా కాపాడుతుంది.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.శీతాకాలంలో లవంగాలలో ఉండే విటమిన్ ‘సి’ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను లవంగం దూరం చేస్తుంది. శీతాకాలంలో లవంగాల తయారు చేసిన టీ తాగితే జలుబు, గొంతునొప్పి, శ్వాసకోస సమస్యలు, దగ్గ లాంటివాటికి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు దరి చేర నీయవు. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి చాలామంచిది. కఫం సమస్య బాగా తగ్గుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.లవంగాలలో యుజైనాల్ అనే మూలకం యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది. పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది, పంటి సమస్యల నివారణలో పనిచేస్తుంది. లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.ఇతర నొప్పుల నివారణలో కూడా ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్‌గా లవంగాలను వాడడం వల్ల ఉపశమనం కలుగుతుంది. లవంగాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది.చర్మ దురదలను తగ్గించడంలో పెట్రోలియం జెల్లీ, ప్లేసిబో కంటే లవంగం నూనె బాగా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇదీ చదవండి: భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్ -
పుట్టింది పనామా, పోషకాల చిరునామా
ప్రాచుర్యంలోకి రాని అద్భుతమైన ఉష్ణమండల పండ్ల జాతిలో ‘స్టార్ ఆపిల్’ ఒకటి. సపోటేసియా కుటుంబానికి చెందిన ఈ పండును వండర్ మిల్క్ ఫ్రూట్ అని వ్యవహరిస్తుంటారు. చూపులకు గుండ్రటి నేరేడు పండులాగా ఉంటుంది. మధ్యకు కోసి చూస్తే నక్షత్రపు ఆకారంలో త్లెని గుజ్జు ఉంటుంది. అందుకే దీన్ని ‘స్టార్ ఫ్రూట్’ అంటారు. దీని రంగును బట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. స్టార్ ఆపిల్ శాస్త్రీయ నామం క్రైసోఫైల్లం కైనిటో. కైనిటో, కైమిటో అని అంటుంటారు. ఈ పదాల మూలాలు పురాతన మయన్ భాషలో ఉన్నాయి. తెల్లని, తియ్యని రసం కలిగి ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చిందట.పుట్టిల్లు పనామాస్టార్ ఆపిల్ మన వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో సాగుకు అనువైన సతత హరిత వృక్షం. పనామా దేశంలోని ఇస్థమస్ దీని పురిటి గడ్డ. అక్కడి నుంచి గ్రేటర్ అంటిల్లెస్, వెస్ట్ ఇండీస్‌కు విస్తరించింది. ఇవ్వాళ స్టార్ ఆపిల్ విస్తరించని ఉష్ణమండల ప్రాంతాల్లేవంటే అతిశయోక్తి కాదు. ఈశాన్య ఆసియా దేశాల్లో ఈ పండ్ల చెట్టు ఎంచక్కా ఇమిడిపోయి సాగవుతోంది. స్టార్ ఆపిల్ చెట్టు చాలా వేగంగా పెరుగుతుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ ఊదా రంగు పండ్లలోని తెల్లని గుజ్జు, రసం తియ్యగా ఉంటుంది. పంట పండే స్థానిక ప్రాంతాల్లో తాజా పండ్ల వినియోగంతో పాటు ఇతర దేశాలకు వాణిజ్యపరంగా ఎగుమతి అవుతుంటాయి. కొన్ని ఉష్ణమండల దేశాల్లోని వ్యవసాయంలో స్టార్ ఆపిల్ ప్రధాన భాగంగా మారిపోయింది. మయన్ భాషలోని కైనిటొ, కైమిటో పదాల నుంచి దీని శాస్త్రీయ నామం పుట్టింది. ఈ పండ్ల రసం తల్లి΄ాలు మాదిరిగా అత్యంత పోషకాలతో కూడినదని చెబుతారు. ఈ పండును అడ్డంగా రెండు ముక్కలుగా కోస్తే.. లోపలి తెల్లని గుజ్జు నక్షత్రం ఆకారంలో ఉంటుంది. అందువల్లే దీనికి స్టార్ ఆపిల్ అనే పేరు వచ్చింది. ఊదా రంగులో ఉంటుంది కాబట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా అంటారు. ఈ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు పండిన తర్వాత కూడా ఆకుపచ్చగానే ఉంటాయి.మెక్సికో నుంచి పెరూ వరకు.. స్టార్ ఆపిల్ సెంట్రల్ అమెరికాలో పుట్టినట్లు చెబుతున్నప్పటికీ దీని మూలాలు వెస్ట్ ఇండీస్‌లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. దక్షిణ మెక్సికో నుంచి ఉత్తర అర్జెంటీనా, పెరు వంటి లో–మీడియం ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో విస్తారంగా సాగవుతోంది. గ్వాటెమల పసిఫిక్ తీర ప్రాంతంలో ఇది విస్తారంగా సాగు అవుతోంది. అక్కడితో దీని విస్తృతి ఆగలేదు. వియత్నాం, భారత్, చైనా, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా దేశాల్లోనూ సాగవుతోంది. కోస్టారికా, క్యూబా, డొమినిక, హైతి, హాండూరస్, జమైకా, నెదర్లాండ్స్ అంటిల్లెస్, నికరాగువ, పనామా, ఉరుగ్వే, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఈజిప్ట్, సౌత్ఆఫ్రికా, మొంజాబిక్, జింబాబ్వే తదితర దేశాల్లోనూ సాగులో ఉంది.పోషకాలు పుష్కలంస్టార్ ఆపిల్ గుజ్జు, రసం తియ్యగా ఉండటానికి కారణం అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండటమే. ఈ పండులో నీరు 78–86% వరకు ఉంటుంది. వంద గ్రాముల పండ్లలో 0.71–2.33 గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల పిండి పదార్థం, 9–10 గ్రాముల టోటల్ సుగర్స్ ఉన్నాయి. దీని విత్తనాల్లో శ్యానోజెనిక్ గ్లైకోసైడ్ లుకుమిన్, తదితర యాక్టివ్ కాంపౌండ్లు ఉన్నాయి. స్టార్ ఆపిల్‌లో ఉన్న జీవరసాయనాల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. ఫెనాల్స్, అల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, స్టెరాయిడ్స్, సపోనిన్స్, టాన్నిన్స్, కార్డియాక్ గ్లైకోసైడ్స్ వంటివి వున్నాయి. 2002లో వెలువడిన ఓ అధ్యయన పత్రం ప్రకారం ఈ పండులో 120 రకాల వొలేటైల్ కాన్స్టిట్యుయెంట్స్ ఉన్నాయి. పచ్చి, పండిన పండ్లలోనూ విటమిన్ సి బాగా ఉంది. ఆకుల్లో కూడా గాల్లిక్ యాసిడ్, ట్రైటెర్పినాయిడ్స్ వంటి ఉపయోగకరమైన కాంపౌండ్స్ ఉన్నాయి. అధిక స్థాయిలో ఫెనోలిక్స్, ఫ్లావనాయిడ్స్ కలిగి ఉండటం వల్ల స్టార్ ఆపిల్‌కు వ్యాధినిరోధకతను పెంచే యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యం మెండుగా ఉంది. ఇందులోని క్యుయెర్సెటిన్ కాంపౌండ్‌కు అత్యధిక యాంటీఆక్సిడెంట్ గుణం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.గోళాకార పండ్లుఈ చెట్టు ఆకులు ఆకర్షణీయమైన ముదురు ఆకుపచ్చగా ఓవెల్ షేప్‌లో ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి 5–15 సెం.మీ. పొడవు పెరుగుతాయి. ఊదా–తెలుపు రంగుల్లో ఉండే దీని పూలు చక్కని సుగంధాన్ని వెదజల్లుతూ తేనెటీగలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ చెట్టు స్వీయ పరాగ సంపర్క సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని కాయ గోళాకారంలో 2–3 అంగుళాల డయామీటర్‌లో ఉంటాయి. ఈ పండ్లను తాజాగా తింటారు. ఈ జాతి పండ్లు ముదురు ఊదా రంగులోను, ఆకుపచ్చ–గోధుమ, పసుపు రంగుల్లో కూడా ఉంటాయి. ఊదా రంగు పండు తొక్క మందంగా, గుజ్జు గట్టిగా ఉంటుంది. రవాణాకు, నిల్వకు అనువైనవి కాబట్టి ఈ రకం స్టార్ ఆపిల్ తోటలే సాగులో ఉన్నాయి. ఆకుపచ్చ–గోధుమ రంగులో ఉండే రకం పండ్ల తొక్క పల్చగా, గుజ్జు పల్చని ద్రవంలా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పండ్లు చాలా అరుదు. ఈ కుటుంబంలోనే క్రైసోఫైల్లం కైనిటో మాదిరిగానే ప్రజాదరణ పొందుతున్న రెండు స్టార్ ఆపిల్ రకాలు ఆఫ్రికాలో సాగులో విస్తారంగా సాగులో ఉన్నాయి. అవి.. గంబేయ అల్బిద, గంబేయ ఆఫ్రికాన. 3–5 ఏళ్లకు కాపు ప్రారంభంక్రైసోఫైల్లం కైనిటో రకం స్టార్ ఆపిల్ మొక్కలు నాటిన తర్వాత 3–5 ఏళ్లలో కాపు వస్తుంది. 6–7 ఏళ్లకు పూర్తిస్థాయి కాపు తీసుకోవచ్చు. ఫ్రూట్ చాలా త్వరగా సెట్ అవుతుంది కాబట్టి తోటల సాగుదారులకు అనుకూలంగా ఉంటుంది. శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చే దశలో పండ్లు పక్వానికి వస్తాయి. వెస్ట్ ఇండీస్‌లో ఏప్రిల్–మే మధ్యన స్టార్ ఆపిల్స్ పుష్కలంగా మార్కెట్లోకి వస్తాయి. స్టార్ ఆపిల్ విత్తనాల వ్యాప్తికి గబ్బిలాలు బాగా తోడ్పడుతుంటాయి. ఏ సీజన్లోనైనా పచ్చగా ఉండే స్వభావం వల్ల ఈ చెట్లు వ్యాపించిన చోట్ల పచ్చదనం, పర్యావరణం పరిఢవిల్లుతాయి.అన్ని పండ్లూ ఒకేసారి కోతకు రావుస్టార్ ఫ్రూట్ పక్వానికి రాక ముందు బంక సాగుతూ వగరుగా ఉంటుంది. బాగా పండి పోయిన తర్వాత కోస్తే రవాణా చేయటానికి, నిల్వ చేయటానికి ఇబ్బంది అవుతుంది. అందుకని పండు ముచ్చిక దగ్గర కొంచెం ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోసెయ్యాలి. తాజా పండ్లు తినొచ్చు లేదా జెల్లీలుగా మార్చి నిల్వ చేసుకోవచ్చు. ఈ పండులోని విత్తనాలు కూడా పనికొస్తాయి. విత్తనం లోపలి పప్పుతో తయారు చేసే డ్రింక్ బాదం పాల మాదిరిగా ఉంటాయి. అనేక తినుబండారాల్లో వాడుతున్నారు. ఫ్రోజెన్ స్టార్ ఫ్రూట్ గుజ్జును ఐస్‌క్రీమ్‌లు, షర్బత్‌లలో వాడుతున్నారు. కాబట్టి, వాణిజ్యపరమైన సాగుకు అనువైన పండ్ల జాతి. అయితే, నేరేడు మాదిరిగానే ఈ పంటకు కూడా కోత కూలి ఎక్కువ అవుతుంది. -
టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్ ఇదిగో!
ఉదయం నిద్రలేచింది మొదలు గొంతులో రాత్రి పడుకునేదాకా కాసిన్ని ‘టీ’ నీళ్లు పడితే తప్ప ఏ పనీ జరగదు చాలామందికి. బ్లాక్‌టీ, హెర్బల్ టీ, మసాలా టీ, లెమన్ టీ, హనీ టీ..ఇలా ఏదో ఒక‘టీ’ పడాల్సిందే. తాజాగా టీకు సంబంధించిన ఒక మంచి వార్త ముఖ్యమైన ఆరోగ్య నియంత్రణ ఏజెన్సీ అందించింది . అదేంటంటే..టీ ఆరోగ్యకరమైనదే అని యూఎస్ ఎఫ్‌డీఏ టీకి సర్టిఫికెట్ ఇచ్చింది. టీ హెల్దీ డ్రింకా కాదా అనే అంశంపై తన తుది నిర్ణయాన్ని డిసెంబరు 19న ప్రకటించింది.ఈ నిర్ణయం టీ ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి ప్రపంచ టీ పరిశ్రమ వాదనలను ధృవీకరిస్తుందంటూ ఆనందం వెల్లువెత్తింది.అయితే ఇది కామెల్లియా సినెన్సిస్ (తేయాకు) నుండి తీసుకోబడిన టీకి మాత్రమే వర్తిస్తుందని ఎఫ్‌డీఐ స్పష్టం చేసింది. ఐదు కేలరీల కంటే తక్కువ ఉన్న నీరు, టీ , కాఫీ వంటి పానీయాలు మాత్రం "ఆరోగ్యకరమైన" హోదాకు అర్హత పొందుతాయని ఎఫ్‌డీఏ పేర్కొంది. అయితే, చామోమిలే, పిప్పరమెంటు, అల్లం, లావెండర్, మందార, శంఖంపువ్వు (అపరాజిsత) లేదా మసాలా టీతో సహా ఇతర హెర్బల్ టీలకు "ఆరోగ్యకరమైన" ఈ గుర్తింపు వర్తించదని ఏజెన్సీ స్పష్టం చేసింది. కామెల్లియా సైనెన్సిస్ను కొన్ని క్యాన్సర్ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలకు ముందస్తు పరిశోధనలను కూడా ఎఫ్‌డీఏ అంగీకరించింది.నార్త్ ఈస్టర్న్ టీ అసోసియేషన్ (NETA), ఇండియన్ టీ అసోసియేషన్ (ITA) U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కూడా కామెల్లియా సినెన్సిస్ టీని ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించడాన్ని స్వాగతించాయి. దేశంలోని అతిపురాతన టీ ఉత్పత్తిదారుల సంస్థ ఇండియన్ టీ అసోసియేషన్ (ITA), ఇది ల్యాండ్‌మార్క్ నిర్ణయంగా అభివర్ణించింది. అటు ప్రపంచ తేయాకు పరిశ్రమకు ఇది "అద్భుతమైన వార్త" అంటూ అమెరికా టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటర్ ఎఫ్. గోగీ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మాజీ వైస్ చైర్మన్ బిద్యానంద బోర్కకోటి కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఏ గుర్తింపు, టీ ఆరోగ్య ప్రయోజనాల నేపథ్యంలో టీని ఒక వెల్నెస్ ,జీవనశైలి పానీయంగా ప్రచారం చేయాలని తాము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: మోతీ షాహీ మహల్ : ఐరన్ మ్యాన్ మెమోరియల్ -
మంకీ జాక్ గురించి విన్నారా? బోలెడన్ని పోషకాలు, ప్రయోజనాలు
మంకీ జాక్ మనకు అనువైన పంట. ఏడాదంతా ఆకులతో పచ్చగా, నిలువుగా పెరుగుతుంది. దీని కలప విలువైనది. పరికరాలు తదితర వస్తువులు తయారీకి వాడుతారు. మంకీ జాక్ పండు ఆరోగ్యకరమైనది. ఇందులో పోషక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న ఈ కాలంలో ఆగ్రో ఫారెస్ట్రీ పద్ధతిలో ఈ చెట్లను సాగు చేస్తూ.. ఈ చెట్లు అందించే పాక్షిక నీడలో ఇతర స్వల్పకాలిక పంటలు పండించుకోవచ్చు. వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటానికి మంకీ జాక్ చెట్లు ఎంతగానో దోహదపడతాయి. కలప కోసం పెంచే రైతుకు పండ్లు కూడా ఇస్తుంది. మంకీ జాక్‌ను బాదల్, దెఫల్, దావ్ లేదా లకూచ తదితర పేర్లతో పిలుస్తారు. ఆగ్రోఫారెస్ట్రీకి ఎంతగానో ఉపయోగపడే ఈ జాతి చెట్లు విస్మరణకు గురయ్యాయి. ఇకనైనా దృష్టి కేంద్రీకరించాల్సిన దీర్ఘకాలిక పంట ఇది. మంకీ జాక్ చెట్లుపర్యావరణరంగా, ఆర్థికపరంగానే కాక పోషకాహార స్థాయిని పెంపొందించడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంకీ జాక్ బొటానికల్ నేమ్ ఆర్టోకార్పస్ లకుచ (Artocarpus Lacucha) పనస, మల్బరీ కూడా ఇదే కుటుంబానికి చెందినవి. అందుకే మంకీ జాక్ పండు ఆకారం, దానిలో తొనలు, గింజలు పనసను పోలి ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్నవి. భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మయన్మార్‌లోని కొన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో సైతం చక్కగా పెరిగే బహుళ ప్రయోజనకారి మంకీ జాక్ చెట్టు. నిటారుగా పెరిగే చెట్టు ఇది. అంతర పంటలతో కూడిన తోటల్లో ప్రధాన వృక్ష జాతిగా మంకీ జాక్ చెట్లను పెంచుకోవచ్చు. పర్యావరణపరమైన సమతుల్యతను కాపాడే అనేక ప్రయోజనాలు అందించటం మంకీ జాక్ చెట్ల ప్రత్యేకత. నిటారుగా 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పెద్దగా, గట్టిగా ఉంటాయి. కొన్నిప్రాంతాల్లోఈ చెట్ల ఆకులు ఏడాదికి ఒకసారి రాలిపోతాయి. దీని పండ్లు మెత్తగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పండినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. ఈ చెట్టు బెరడు ముదురు రంగులో ఉంటాయి. దీని పూలు సువానతో తేనెటీగలను ఆకర్షిస్తూ పరపరాగ సంపర్కానికి దోహదపడుతూ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ మంకీ జాక్ చెట్ల పెంపకం పెద్దగా కనపడక΄ోవటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒక్కచోట తప్ప ఈ చెట్లు కనిపించవు. (ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!)పండ్లు తినొచ్చు.. పచ్చడి పెట్టుకోవచ్చు..మంకీ జాక్ కొత్త వాతావరణ పరిస్థితులకు, భిన్నమైన నేలలకు ఇట్టే అలవాటు పడిపోతుంది. ఏ ప్రాంతంలోనైనా ఇతర పంటలతో కలిపి సాగు చేయటానికి అనువైన జాతి ఇది. పండ్లు, పశుగ్రాసం, కలప, ఔషధ గుణాలు, సహజ రంగుగా వాడటానికి ఉపయోగపడే బెరడు వంటి ఉపయోగాలున్నాయి.మంకీ జాక్ పండును నేరుగా తినొచ్చు. పచ్చళ్లు, సాస్‌లు, చట్నీలు తయారు చేసుకోవచ్చు. ఈ పండ్ల గుజ్జు తింటే కాలేయ జబ్బులు తగ్గిపోతాయట. యాంటీఆక్సిడెంట్లతో పాటు కాలేయాన్ని రక్షించే గుణాలు పుష్కలంగా ఉండటం దీని ప్రత్యేకత. వయోభారం వల్ల చర్మం ముడతలు పడటం వంటి సమస్యల్ని దూరం చేసే చికిత్సల్లో దీన్ని వాడుతున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీలో వాడుతున్నారు. జార్కండ్ వంటి చోట్ల గిరిజనుల సంప్రదాయ వైద్యంలో మంకీ జాక్‌ను ఉపయోగిస్తున్నారు. మంకీ జాక్ చెట్టు ఆకుల్లో ప్రొటీన్ అత్యధికంగా 28.6% ఉంటుంది. అందువల్ల ఈ ఆకులు పశువులకు అత్యంత విలువైన గ్రాసం అని చెప్పచ్చు. కాబట్టి పొడి పశువులపాల ఉత్పత్తిని పెంపొందించడానికి మంకీ జాక్ చెట్టు ఆకులు బాగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ఎండా కాలంలో ఇతర పచ్చి మేత అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ చెట్ల ఆకులు చక్కని పచ్చిమేతగా ఉపయోగపడతాయి. దీని బెరడు నుంచి వచ్చే జిగురు ఉపయోగకరం. అన్నిటికీ మించి దీని కలప ఎంత గట్టిగా ఉంటుందంటే చెద పురుగులు కూడా ఏమీ చేయలేవు. అందువల్ల కుర్చీలు, బల్లలు వంటి ఫర్నీచర్ తయారీలో దీని చెక్కను వాడుతున్నారు. పడవలు, నౌకల తయారీలో, నిర్మాణ రంగంలో కూడా ఈ కలపను ఉపయోగిస్తున్నారు.పర్యావరణ, పౌష్టికాహార ప్రయోజనాలుమంకీ జాక్ చెట్లు సుస్థిర వ్యవసాయ పద్ధతులకు అనేక విధాలుగా దోహదపడతాయి. భూసారాన్ని పెంపొందించటం, గాలికి వర్షానికి మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడటం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి ఈ చెట్లు దోహదపడతాయి. వేడిని, గాలిలో తేమను తట్టుకొని పెరుగుతాయి. తరచూ కరువు బారిన పడే నిస్సారమైన భూముల్లో సైతం ఈ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల నీడ సానుకూల సూక్ష్మ వాతావరణాన్ని కలిగిస్తుంది కాబట్టి అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఇక పోషకాల సంగతికి వస్తే.. మంకీ జాక్ పండ్లు, ఆకులు పోషకాల గనులే. పండ్ల గుజ్జులో డయటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విత్తనాలు, జిగురులో యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి ఇనుమడిస్తుంది. నాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎజెంట్‌గా పనిచేస్తుంది. ఈ గుణగణాలు మనుషులకు, పశువులకు ఆరోగ్యాన్నందిస్తాయి. తద్వారా పశువుల ఉత్పాదకత పెరుగుతుంది. పండ్ల ధర కిలో రూ. 175మంకీ జాక్ చెట్లు వర్షాధార వ్యవసాయం చేసే చిన్న,సన్నకారు రైతులకు మంచి ఆదాయాన్ని సమకూర్చుతాయి. ఒక చెట్టు ఆకుల నుంచి 200 కిలోల పచ్చి మేతను పొందవచ్చని, ఆ మేరకు పొడి పశువుల పోషణ ఖర్చు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్ల పచ్చి ఆకులు క్వింటాలు రూ. 300 విలువ చేస్తాయి. పండ్లు కిలో రూ. 175 పలుకుతామంటున్నారు. చీడపీడలను తట్టుకునే స్వభావం కలిగిన ఈ చెట్లను పెంచటం చాలా సులభం. దీని కలప, పండ్ల ద్వారా కూడా ఇంకా ఆదాయం సమకూరుతుంది. మంకీ జాక్ చెట్లు రాల్చే ఆకులు భూమిని సారవంతం చేస్తాయి. అంటే రైతులు రసాయనాలపై ఆధారపడటం తగ్గుతుంది. అంతర పంటలకు అనువైన తోటల్లో పెంచడానికి మంకీ జాక్ చెట్లు ఎంతో అనువైనవి. భూతాపోన్నతితో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే అతివృష్టి, అనావృష్టిని తట్టుకునే స్వభావం, నిస్సారమైన భూముల్లోనూ పెరిగే స్వభావం ఈ చెట్లకు ఉండటం రైతులకు ఎంతో ఉపయోగపడే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే, మంకీ జాక్ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామీణాభివృద్ధికి, పేదరికాన్ని పారదోలటానికి, పశుగ్రాసం కొరతను తీర్చడానికి, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంపొందించడానికి బహువిధాలుగా ఉపయోగ పడుతుంది. -
శీతాకాలంలో ఈ సూపర్ ఫుడ్‌తో అనేక సమస్యలకు చెక్
చలి కాలంలో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్‌కు తగినట్టుగా మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. చలికాలంలో బాడీని వేడిగా ఉంచుకోవడంతోపాటు, కొవ్వులేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించే చియా గింజలను వింటర్ సూపర్ ఫుడ్‌గా చెబుతారు ఆహార నిపుణులు. వీటిల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA)లో పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె, మెదడు పనితీరును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని పలు రకాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా చియా వాటర్, స్మూతీస్, యోగర్ట్స్, లలాడ్స్, పుడ్డింగ్ రూపంలో తీసుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి, మంటను తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.చియా గింజల్లో ఎక్కువగా లభించే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి శక్తి నిస్తుంది.యాంటీఆక్సిడెంట్లతో నిండిన చియా విత్తనాలు పర్యావరణ కారకాలు, కాలానుగుణ హెచ్చుతగ్గుల వల్ల కలిగే సమస్యల్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలనుంచి ఉపశమనానికి తోడ్పడతాయి.అలాగే చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతాం కాబట్టి చియా గింజల వాటర్ తీసుకోవడం మంచిది. చియా విత్తనాలు హైడ్రోఫిలిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫలితంగా శీతాకాలంలో శరీరంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. చియా విత్తనాలు చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి.హెర్బల్ టీ లేదా హాట్ చాక్లెట్ వంటి వేడి పానీయాలకు చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు.ఒక గ్లాస్ నీటిలో, కొద్దిగా చియా గింజలు వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం పరగడుపునే తాగితే, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. పీచు పదార్థం పుష్కలంగా అందుతుంది. తద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచీ ఉపశమనం లభిస్తుంది.చియా గింజల్లో యాంటి ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడతాయి. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కేన్సర్ లక్షణాలను తగ్గిస్తాయి. చియా పుడ్డింగ్: పాలలో (బాదం లేదా కొబ్బరి పాలతో కూడా) చియా గింజలను నానబెట్టి రాత్రంతా రిఫ్రిజిరేటర్లో ఉంచి, నచ్చిన మరికొన్ని పండ్ల ముక్కలను కలుపుకొని చియా సీడ్ పుడ్డింగ్‌ను చేసుకోవచ్చు. సౌందర్య పోషణలోనూ, జుట్టు సంరక్షణలో కూడా చియా గింజలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. -
ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్
ఒసేయ్.. తల పగిలిపోతుంది కాసింత టీ పొయ్యవే ..గట్టిగా భార్య భారతి మీద అరిచాడు సూర్యం.రండి..రండి.. చాన్నాళ్ళకు వచ్చారు కూర్చోండి.. టీ తాగుతారామామా చికాగ్గా ఉంది అలా వెళ్లి మంచి అల్లం టీ తాగి వద్దాం రా మామా పిలిచాడు రామకృష్ణహలో అమీర్ భాయ్ దో చాయ్ దేదో కేకేశాడు లక్ష్మణ్ఇలా చినుకులు పడుతుండగా అలా నీ కళ్ళలోకి చూస్తూ వేడివేడి టీ పెదాలను తాకుతుంటే అచ్చం నిన్ను ముద్దాడినట్లె ఉంటుంది ప్రియా.. పొయిటిక్ గా చెబుతున్నాడు దీపక్తెల్లారి ఆరైంది ఇంకా టీ లేకపోతే ఎలాగూ..కోడలు పిల్లా నాకూ మీ మామయ్యకు స్ట్రాంగ్ ఇలాచి టీ తీసుకురామ్మా.. ఆర్థర్ వేసింది అత్త అనసూయఈరోజు బోర్డు మీటింగ్..మంచి టీ ఓ ఇరవై చెప్పండి.. చెక్ లిస్టులో రాసేసాడు ఎండీపిల్లాడికి జ్వరం..దగ్గు ఉంది .కాస్త అల్లం టీ ఇవ్వండి గొంతు రిలీఫ్ వస్తుంది.. ఓ డాక్టర్ సూచనట్రైనెక్కి అరగంట అయింది ఇంకా టీ కుర్రాడు రాలేదేంటి..కిటికీలోంచి చూస్తూ గొనుక్కున్నాడు రాకేష్సర్ మీకు ఏ టీ తేమ్మంటారు.. అల్లం టీ..ఇలాచి టీ..గ్రీన్ టీ.. లెమన్ టీ.. హెర్బల్ టీ.. ఏదిమ్మంటారు అడిగింది ఎయిర్ హోస్టెస్..పొద్దంతా రిక్షా లాగి లాగి తల వాచిపోతోంది.. ఓ టీ పడితే తప్ప ఇంకో ట్రిప్ లోడ్ ఎత్తలేను అంటూ టీ బంక్ వైపు పరుగుతీసాడు నర్సయ్యదేశంలో ఎక్కడ ఏ స్థాయిలో .. ఏ ఇద్దరు మాట్లాడుకోవాలన్నా వారిమధ్య వారధి టీ.. దేశ రాజకీయాలన్నీ చర్చకు వచ్చేది కూడా టీ బంకుల దగ్గరేటకీమని మూడ్ మార్చేస్తుంది..మనసు బాగా లేకపోయినా.. ఒంట్లో బాలేకపోయినా.. ఇంట్లో బాలేకపోయినా ఏ ఇద్దరి మధ్య గొడవ అయినా సరే ...ఇలాంటి ఎన్నో చిన్నచిన్న సమస్యలను టీ చటుక్కున పరిష్కరించేస్తుంది.. అడగ్గానే డబ్బు సరిపోక.. భర్త నక్లెస్ కొనలేదని మూడు రోజులుగా జగడమాడి మాటలు మానేసి అటు తిరిగి మూతి ముడుచుకుని కూర్చున్న ప్రశాంతి సాయంత్రం చిన్నగా వర్షం పడుతున్న వేళ ఎలాగైనా శ్రీమతిని మచ్చిక చేసుకోవాలని మూడు రోజులుగా భర్త శ్రీకాంత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తనకు ఇష్టమైన యాలకుల టీ చేసి రెండుకప్పుల్లో పోసి ఒక కప్పును ప్రశాంతి ముందుకు జరిపి ఏమంటుందో ఏమో అని కాస్త భయంతో బెదురు చూపులు చూస్తున్న శ్రీకాంత్ కు ఆఫర్ తగిలేసింది.. ఘమాఘమలాడే టీ సువాసనతో ప్రశాంతి కోపం కూడా ఆవిరైపోయింది. భర్తను దగ్గరకు తీసుకుని నెక్లెస్ ఏముంది..డబ్బులున్నపుడు కొందాం లెండి అంటూ అల్లుకుపోయింది.విద్యార్థులను మేల్కొలిపే ఆత్మీయ హస్తం టీఇప్పటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయ సాధించేందుకు గంటలు గంటలు.. ఒక్కోసారి నైట్ అవుట్.. అంటే తెల్లార్లు చదవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నిద్ర మేల్కొని ఉండేందుకు.. శరీరం డస్సిపోకుండా ఉండేందుకు.. కోల్పోయిన శక్తిని మళ్లీ రీచార్జ్ చేసుకునేందుకు. చదివింది మైండ్ లోకి ఎక్కేందుకు .. నిద్ర రాకుండా.. మూత పడిపోకుండా ఉండేందుకు కూడా టీ ఆత్మీయ మిత్రుల పక్కనే నిలబడి ఉంటుంది. ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని పుస్తకం పట్టుకుని కూర్చున్నారు అంటే ఇక ఆ సిలబస్ అంతు తేల్చేయాల్సిందే. రెప్పల మూతపడుతున్న తరుణంలో.. లేవయ్యా.. బోలెడు సిలబస్ ఉంది నిద్రపోతే ఎలా.. అంటూ ఆ టీ కప్ మనల్ని నిద్రలేపి పుస్తకం వైపు చూసేలా చేస్తుంది..సర్జరీలు చేసి అలసిపోయే డాక్టర్లు.. వేల కిలోమీటర్లు ప్రయాణాన్ని అలవోకగా పూర్తిచేసే డ్రైవర్లు.. పరిశోధన విద్యార్థులు శాస్త్రవేత్తలు ఒకరేమిటి,. అన్ని రంగాల వారికి టి అనేది ఒక ఔషధం.. అందమైన వ్యసనం.. ఉదయం పూట సూర్యోదయాన్ని చూస్తూ.. ఆ వెచ్చదనాన్ని టీ కప్పులో ఆస్వాదించడం కొందరికి ఒక ఇష్టమైన దినచర్య. సాయంత్రం వేళ కొండల్లోకి వెళ్లిపోతున్న సూర్యుని చూస్తూ మళ్ళీ ఓ టీ తీసుకోవడం మరికొందరికి ప్రియమైన ప్రక్రియ. ఇలా అన్నివర్గాల వారినీ కలిపి ఉంచే టీ కి కూడా అన్ని సందర్భాల్లో ఓ గౌరవప్రదమైన స్థానం ఉంది. అందరం టీ తాగుదాం.. ఆరోగ్యంగా ఉందాం.- సిమ్మాదిరప్పన్న -
ముత్యమంత పసుపుతో బోలెడన్ని ప్రయోజనాలు
పసుపులో ఎన్నో పోషకాలు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా పసుపు వాడకం చాలా ఎక్కువ అయింది. ముఖ్యంగా పచ్చిపసుపును విరివిగా వాడుతున్నారు. అయితే ఎలా పడితే అలా కాకుండా పద్ధతి ప్రకారం పచ్చిపసుపును వాడటం వల్ల అధిక ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం... పసుపును కొన్ని ఆయుర్వేద ఔషధాలలో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. వంటలో కూడా ఉపయోగిస్తారు. గ్లాసుడు వేడి పాలలో చిటికడు పసుపు కలుపుకుని తాగడం వల్ల ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, జలుబు, దగ్గు తగ్గుతాయి. శరీరంలో అధికంగా ఉన్న చెడు కొవ్వు కూడా కరిగిపోతుంది. అలాగని పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా వాడాలి!పచ్చి పసుపుతో ఆయుర్వేదిక్ టీలు, సూప్‌లు, స్మూతీస్ వంటివి తయారు చేసుకోవచ్చు. ఇది వంటకాలకు మంచి రంగు, రుచి, వాసనలను జత చేస్తుంది. అయితే పసుపు పొడిని మరిన్ని అవసరాలకు వాడొచ్చు. మారినేషన్, మసాలాలు, సాస్‌లు, డ్రింక్స్‌లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు.పసుపు టీ: రెండంగుళాల ΄ పొడవున్న తాజా పచ్చిపసుపు కొమ్మును తీసుకుని దాని మీదుండే పొరను తీసేయాలి. దానిని సన్నటి ముక్కలుగా తరుక్కోవాలి. స్టవ్ మీద మరుగుతున్న గ్లాసున్నర నీటిలో ఆ ముక్కలు వేయాలి. దానికి చిటికెడు మిరియాల పొడి, కాస్తంత బెల్లం తరుగు జతచేయాలి. కాగిన తర్వాత కొద్దిగా నెయ్యి లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కలిపి ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి దించి వడపోసి గ్లాసులో పోసుకుని టీలాగే సిప్ చేయాలి.స్మూతీస్‌లో కలపడం...పైనాపిల్, మ్యాంగో, ఇతర రకాల పండ్ల ముక్కలతో పాటు సన్నగా తురుమిన పచ్చి పసుపు కొమ్ము, కొబ్బరినీళ్లు, బాదం పాలు కలిపి చేసిన స్మూతీ తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగు తాయి. నిమ్మరసం, అల్లం రంసం, మిరియాల పొడి, కొబ్బరి నీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లలో చిటికడు పచ్చిపసుపు కలిపి వడకట్టి తాగితే జలుబు, దగ్గు, ఒంట్లో వాపులు తగ్గుతాయి. వెటిజబుల్ సలాడ్‌తో... టమోటా, దోస, బీర, బెండ, క్యారట్, బీట్రూట్, ముల్లంగి, స్ప్రింగ్ ఆనియన్స్ తదితర కూరగాయల ముక్కల మీద పసుపు, మిరియాలపొడి,చల్లుకుని తింటే మంచిది. పసుపు నీళ్లు... తేలికైన మార్గం ఏమిటంటే... తాజా పసుపు కొమ్మును పొట్టు తీసి ముక్కలుగా తరిగి వాటర్ బాటిల్లో వేయాలి. కొన్ని గంటల తర్వాత ఆ నీటిని తాగుతూ ఉంటే పసుపులో ఉన్న లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. -
శీతాకాలం : స్నానానికి వేడి నీళ్లా? చన్నీళ్లా?
వేసవి కాలంలో చన్నీటి స్నానం ఎంతో హాయినిస్తుంది. అయితే శీతాకాలం వచ్చింది అనగానే స్నానానికి దాదాపు అందరూ వేడి నీళ్లే వాడతారు. ఎందుకంటే చల్లనీటితో స్నానం చేస్తే జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలొస్తాయనే భయం కూడా దీనికి ప్రధాన కారణం. మరోవైపు కార్తీకస్నానాలు, అయ్యప్పమాల ధరించిన భక్తులు ఎంత చలిగా ఉన్నా సరే చన్నీటి స్నానాలే ఆచరిస్తారు. అసలు స్నానానికి ఏ నీళ్లు వాడితే మంచిది? తెలుసుకుందాం. అయితే ఏ కాలంలో అయినా స్నానానికి మరీ వేడినీళ్లు కాకుండా, గోరువెచ్చని నీళ్లు వాడాలి అనేది నిపుణుల మాట. రోజూ ఎక్కువ వేడి నీటి స్నానంతో చర్మానికి కొన్నిఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ముందుగా వేడి నీటి స్నానం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.వేడి నీటి స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?వేడి నీటి స్నానంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలసట తీరుతుంది. చర్మానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. శరీరంలో బీపీ తగ్గుతుంది. శరీర నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో కుచించుకు పోయిన కండరాలకు, ఎముకలకు వేడి నీటి స్నానంతో రిలీఫ్ లభిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల (గుండె జబ్బు) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే హాట్ టబ్ బాత్, ఆవిరిస్నానంతో ఈ ప్రయోజనాలు మరింత మెరుగ్గా ఉంటాయంటున్నారు. అసలే శీతాకాలంలో చర్మంలో తేమ శాతం తక్కువగా చర్మం పొడిగా మారిపోతుంది. దీనికి వేడి నీటి స్నానం మరింత ఆజ్యం పోస్తుంది. సేబుమ్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. చర్మంలోని సహజమైన ఆయిల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా మంట, దురదలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సోరియాసిస్, ఎగ్జిమా, రోసాసియా లాంటి సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. జుట్టుకు చేటువేడి, వేడి నీళ్లతో తల స్నానం అస్సలు మంచిది కాదు. వెంట్రుకలు బలహీనంగా మారతాయి. జుట్టులోని కెరాటిన్, లిపిడ్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది.చన్నీటితో స్నానం వల్ల కలిగే లాభాలుమరీ గడ్డ కట్టేంత చల్లని నీరు కాకుండా, ఒక మాదిరి చన్నీటిస్నానం వల్ల శరీరానికి ఉపశమనం లభిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. జుట్టు, చర్మానికి మంచిది. బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా చెబుతారు. తలకు కూడా చల్ల నీటి స్నానం మంచిదే.నోట్: చిన్న పిల్లలకు, వృద్ధులకు, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఇతర అనారోగ్యంతో ఉన్నవారికి చన్నీటి స్నానం మంచిది కాదు. ఏ వయసు వారికైనా గోరు వెచ్చటి స్నానం ఉత్తమం. అటు వాటు ఉన్నవారు, తట్టుకోగల శక్తిఉన్నవారు చన్నీటి స్నానం చేయవచ్చు. లేదంటే గోరు వెచ్చని నీటితో స్నానం బెటర్. స్నానానికి ముందు శరీరానికి నూనెతో మసాజ్ చేసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే స్నానం తరువాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడాలి. -
వింటర్లో వ్యాధులు : మిరియాలతో చాలా మేలు!
లేదు..రాలేదు అనుకుంటూ ఉండగానే చలి పులి పరుగెత్తుకొచ్చేసింది. మరోవైవు ఫంగెల్ ప్రభావం, వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశంఉంది. చలికాలంలో వచ్చే కొన్ని అనారోగ్యసమస్యల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిందే. ఇంట్లోనే లభించే నల్ల మిరియాలతో చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు మొదలైన సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధగుణాలుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్నాయి. ఉంటాయి. ఇవి అంటువ్యాలులు సోకకుండా కాపాడతాయి. అలాగే నొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల మిరియాల్లోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా మెగ్నీషియం, రాగి, ఇనుము, కాల్షియం, భాస్వరం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలకు మంచి మూలం. ఇందులో విటమిన్లు ఎ, కె, ఇ బి విటమిన్ కూడా ఉన్నాయి. ఇందులోని పైపెరిన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగులను శుభ్రం చేస్తుంది.మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా నల్ల మిరియాలను సేవిస్తే మలబద్ధకం సమస్య తీరుతుంది.రక్త ప్రసరణను మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తాయి.అంతేకాదుబరువు తగ్గడంలో కూడా మిరియాలు బాగా పనిచేస్తాయి. ఇందులో లభించే ఫైటో న్యూట్రియెంట్స్ అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి.అలాగే చలికాలంలో కీళ్లు,ఎముకల నొప్పులు బాగా వేధిస్తాయి. ఈ బాధలనుంచి ఉపశమనం కలిగించే ఔషధ గుణాలు మిరియాల్లో ఉన్నాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా ఇవి మేలు చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. నల్ల మిరియాలు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్‌ను నివారణలోనూ ఉపయోగపడ తాయంటున్నారు నిపుణులుమనకున్న అనారోగ్య సమస్యను బట్టి తులసి ఆకులు, పసుపు మిరియాలతో చేసిన కషాయం, మిరియాల పాలు,మిరియాలు తేనె, మిరియాలు, తమలపాకు రసం కలుపుకొని తాగవచ్చు.గ్రీన్ టీకి చిటికెడు నల్ల మిరియాలు కలుపుకోవచ్చు.కూరలు, సలాడ్లలో మిరియాల పొడి జల్లు కోవచ్చు. మిరియాలు ,యూకలిప్టస్ నూనె వేసి మరిగించిన నీళ్లో ఆవిరి పట్టవచ్చు. నోట్: ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మిరియాలు అందరికి ఒకేలా పనిచేయవు. శరీర తత్వాన్ని బట్టి, నిపుణుల సలహామేరకు తీసుకోవాలి. మిరియాలను ఎక్కువగా తీసుకుంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయనేది గమనించాలి. -
‘మమ్రా’ బాదం గురించి తెలుసా? అంత స్పెషల్ ఏంటో?
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగ పడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సౌందర్యానికి, రోగ నిరోధకశక్తికి చాలా అవసరం. అయితే బాదం పప్పు రకాల గురించి తెలుసా? అవేంటో తెలుసుకుందామా.!మార్కెట్లో మమ్రా ,కాలిఫోర్నియా బాదంతో సహా వివిధ రకాల బాదంపప్పులు అందుబాటులో ఉన్నాయి. బట్ బాదం ,కార్మెల్ బాదం, నాన్పరెయిల్ బాదం,గుర్బండి బాదం,స్వీట్ బాదం,పీర్లెస్ బాదం, గ్రీన్ బాదం మార్కోనా బాదం ఇలా 14 రకాలు ఉన్నాయి. వవీటిల్లో మమ్రా ,కాలిఫోర్నియా ఆల్మండ్స్ అనే ప్రధానమైనవి. ఈ రెండూ రుచికరమైనవీ, పోషకాలతో నిండి ఉన్నవే. అయితే, ఈ రెండింటి మధ్య కొన్ని కీలకమైన తేడాలు ఉన్నాయి. మమ్రా బాదం: "రాయల్ బాదం" అని కూడా పిలుస్తారు, మమ్రా బాదం మధ్యప్రాచ్యానికి చెందినది మరియు కొన్ని శతాబ్దాల తరబడి సాగు చేయబడుతోంది. కాలిఫోర్నియా బాదం: ఇది అమెరికాకు చెందినది. కాలిఫోర్నియా బాదంపప్పును 19వ శతాబ్దంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో మొదటిసారిగా సాగు చేశారు. అనుకూలమైన వాతావరణం ,ఆధునిక వ్యవసాయ పద్ధతులు కాలిఫోర్నియాను ప్రపంచంలోనే అతిపెద్ద బాదం ఉత్పత్తిదారులలో ఒకటిగా మార్చాయి.రుచి, ఆకృతిలోనూ మమ్రా ,కాలిఫోర్నియా రకాలు మధ్య తేడాలున్నాయిమమ్రా బాదం మంచి సువాసనతో పెద్దగా ఉంటాయి. వీటిల్లో నూనె శాతం కూడా ఎక్కువే. మృదువుగా, విలక్షణమైన రుచితో ఎక్కువ క్రీమీగా ఉంటాయి కాలిఫోర్నియా బాదంపప్పులు చిన్నవిగా ఉంటాయి. నూనె శాతం తక్కువ . అందుకే రుచిలో కొంచెం తక్కువగా, క్రంచీగా ఉంటాయి. ప్రాసెసింగ్ పద్ధతులుమమ్రాం బాదంను చేతితో ప్రాసెస్ చేస్తారు. అందుకే ఇవిఎక్కువ నాణ్యంగా ఉంటాయి. సహజ రుచి ,ఆకృతిని పాడుకాకుండా ఉంటాయికాలిఫోర్నియా బాదం: సాధారణంగా ఆధునిక యంత్రాలను ఉపయోగించి ప్రాసెస్ చేస్తారు. కనుక కొద్దిగా రుచినీ ఆకృతిని కోల్పోతుంది. అయినప్పటికీ, ఇది ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది.పోషక విలువలుమమ్రా , కాలిఫోర్నియా బాదం రెండూ విటమిన్లు, ఖనిజాలు , ఆరోగ్యకరమైన కొవ్వులకుఅద్భుతమైన మూలాలు, కానీ కొన్ని తేడాలు ఉన్నాయి:మమ్రా బాదం పెద్దగా, నూనె కంటెంట్ ఎక్కువ గనుక పోషక-సాంద్రత కలిగి ఉంటాయి. మమ్రా బాదంతో పోలిస్తే కాలిఫోర్నియా బాదంలో పోషక సాంద్రత కొంచెం తక్కువ. ధరలుమమ్రా బాధం ధర కిలో సుమారు రూ. 4000కాలిఫోర్నియా బాదం ధర కిలో సుమారు రూ. 1100