హోమ్లీ పెట్‌ ఉంటే ఒత్తిడి సెట్‌.. ఇంట్రస్టింగ్‌ సర్వే | Mars x Calm Survey Reveals How Pets boots Mental Health | Sakshi
Sakshi News home page

హోమ్లీ పెట్‌ ఉంటే ఒత్తిడి సెట్‌.. ఇంట్రస్టింగ్‌ సర్వే

Jun 10 2025 4:12 PM | Updated on Jun 10 2025 4:29 PM

Mars x Calm Survey Reveals How Pets boots Mental Health

పెంపుడు జంతువులతో మానసిక ప్రశాంతత 

జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఒంటరితనం దూరం 

మానవ శ్రేయస్సులో పెంపుడు జంతువుల ప్రభావం 

మార్స్.కామ్‌ సర్వేలో వెల్లడైన విశేష అంశాలు 

ఈ ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక శాతం మంది నగరవాసులు ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో మానవులకు మానసిక ప్రశాంతత ఒక విలాసంగా మారుతోంది. ఇలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువులే మిత్రులుగా ఎంతో సహాయ పడుతున్నాయి. ఈ విషయం ఇటీవల మార్స్‌ పెట్‌కేర్, మెడిటేషన్‌ యాప్‌ కామ్‌ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. 20 దేశాల్లో 31 వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో భారత్‌కు చెందిన వెయ్యి మంది పెంపుడు జంతువుల యజమానుల అభిప్రాయాలు విశేషంగా వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం – సాక్షి, సిటీబ్యూరో 

పెంపుడు జంతువుల కారణంగా భారతీయుల్లో 92 శాతం మంది తమ స్క్రీన్‌ టైమ్‌ తగ్గిందని చెబుతుండగా, 93 శాతం మంది రోజువారీ పనుల మధ్య బ్రేక్‌ తీసుకోడానికి పెంపుడు జంతువులే ప్రేరణగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే, 82 శాతం మంది పెంపుడు జంతువులతో మాట్లాడటం ద్వారా రిలాక్సేషన్‌ పొందుతున్నామని, ఒంటరి తనానికి దూరం అవుతున్నామని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌లోని మార్స్‌ కార్యాలయం కూడా భాగస్వామ్యమైంది. 

సర్వే విశేషాలివే.. 
ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 79 శాతం మంది భారతీయులు నిద్ర బాగా పడుతోందని చెబుతుండగా, అదే అమెరికాలో ఇది కేవలం 55 శాతం మాత్రమే ఉండటం విశేషం. అంతేకాదు, 88 శాతం మంది ఆలోచనల్లో ఆవేశం తగ్గిందని, 76 శాతం మంది ఆ క్షణాలను ఆస్వాదించే పరిస్థితుల్లో ఉన్నామని వెల్లడించారు. ఈ డేటా కేవలం గణాంకాలుగా కాకుండా, మానవుల మానసిక శ్రేయస్సులో పెంపుడు జంతువుల ప్రభావాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ సందర్భంగా మార్స్‌ పెట్‌కేర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సలిల్‌ మూర్తి చెప్పినట్లు, ‘పెంపుడు జంతువులు కేవలం మనిషికి ఆనందం కలిగించడమే కాక, మెదడుకు విశ్రాంతినిచ్చే సహచరులుగా నిలుస్తున్నాయి.’ కామ్‌ చీఫ్‌ కంటెంట్‌ ఆఫీసర్‌ గ్రెగ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ.. ‘పెంపుడు జంతువులు మెడిటేషన్‌ లాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. మానవ సంబంధాల్లో మానవ–జంతు అనుబంధం ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటోంది’ అన్నారు. 


పెంపుడు జంతువులకు అనుకూలంగా హైదరాబాద్‌లోని మార్స్‌ కార్యాలయంపెంపుడు జంతువులతో మానసిక ప్రశాంతతఈ సర్వే ద్వారా మార్స్, కామ్‌ మధ్య దీర్ఘకాలిక గ్లోబల్‌ భాగస్వామ్యం ప్రారంభమైంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా కామ్‌ యాప్‌లో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల నేపథ్యంలో గైడెడ్‌ మెడిటేషన్లు, మైండ్‌ఫుల్‌నెస్‌ టూల్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపుడు జంతువుల అనుబంధంతో మరింత బలోపేతం చేస్తోంది. హైదరాబాద్‌లోని మార్స్‌ కార్యాలయం కూడా పెంపుడు జంతువులకు అనుకూలంగా రూపొందించబడినదని వారు పేర్కొన్నారు. ‘మాయా’, ‘మైలో’ వంటి పెట్‌ అసోసియేట్స్‌తో సహా సంస్థ జంతుప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిశోధన స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. పెంపుడు జంతువులు ఇక కేవలం సరదా కోసం కాదు, ఆరోగ్యంగా బతకడానికీ, హాయిగా ఉండడానికీ ఒక సహజ మార్గంగా నిలుస్తున్నాయి..  

చదవండి: టూరిస్టులకూ నో : మాంసాహారాన్ని బ్యాన్‌ చేసిన ఏకైక నగరం ఇదే..!

ఈ సర్వే ద్వారా మార్స్, కామ్‌ మధ్య దీర్ఘకాలిక గ్లోబల్‌ భాగస్వామ్యం ప్రారంభమైంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా కామ్‌ యాప్‌లో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల నేపథ్యంలో గైడెడ్‌ మెడిటేషన్లు, మైండ్‌ఫుల్‌నెస్‌ టూల్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపుడు జంతువుల అనుబంధంతో మరింత బలోపేతం చేస్తోంది. హైదరాబాద్‌లోని మార్స్‌ కార్యాలయం కూడా పెంపుడు జంతువులకు అనుకూలంగా రూపొందించబడినదని వారు పేర్కొన్నారు. ‘మాయా’, ‘మైలో’ వంటి పెట్‌ అసోసియేట్స్‌తో సహా సంస్థ జంతుప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిశోధన స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. పెంపుడు జంతువులు ఇక కేవలం సరదా కోసం కాదు, ఆరోగ్యంగా బతకడానికీ, హాయిగా ఉండడానికీ ఒక సహజ మార్గంగా నిలుస్తున్నాయి..   

ఇదీ చదవండి: Beauty Tips: బ్లాక్‌ హెడ్స్‌కు చెక్‌, ముఖాన్ని మెరిపించే స్క్రబ్స్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement