పుస్తకశాలగా మారిన పాఠశాల..! | This Asavari Agrawal a 17-year-old social entrepreneur Shape The Future | Sakshi
Sakshi News home page

Asavari Agrawal: పుస్తకశాలగా మారిన పాఠశాల..!

Nov 18 2026 3:35 PM | Updated on Nov 18 2026 3:39 PM

This Asavari Agrawal a 17-year-old social entrepreneur Shape The Future

బడి పిల్లలకు పాఠ్యపుస్తకాలే కాదు.. ప్రపంచాన్ని పరిచయం చేసే కథల పుస్తకాలు, విజ్ఞాన గ్రంథాలు కూడా అందుబాటులో ఉండాలి. ఈ ఆలోచనతోనే ఓ అమ్మాయి పాత స్టోర్‌ రూమ్‌ను 2,000 పుస్తకాల లైబ్రరీగా మార్చింది. బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అసావరి అగర్వాల్‌ 12వ తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచే అనాథాశ్రమాలు, సేవా సంస్థలకు వెళ్లేది. అక్కడి పిల్లలతో గడిపే క్రమంలో వారికి చదువు, ఆటలు, ఇతర నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని గుర్తించింది. 

2021లో అక్కడి పిల్లలకు టేబుల్‌ టెన్నిస్‌ నేర్పించడం ప్రారంభించింది. ఆ తర్వాత 2022లో 13 ఏళ్ల వయసులో ‘షేప్‌ ద ఫ్యూచర్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముల్లూర్‌ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ నిరుపయోగంగా ఉన్న గదిని లైబ్రరీగా మార్చాలని నిర్ణయించింది. సుమారు ఏడాదిన్నరపాటు పాఠశాలలు, సమాజంలోని వ్యక్తుల నుంచి పుస్తకాలను సేకరించి 2,000కు పైగా పుస్తకాలు సమకూర్చింది. 

గదికి మరమ్మతులు చేయించి, రంగులు వేయించి, అల్మారాలు, ఫర్నిచర్‌ ఏర్పాటు చేసింది. 2026 ఫిబ్రవరిలో లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం సుమారు 50 మంది విద్యార్థి వాలంటీర్లతో కలిసి 250 మంది పిల్లలకు చదువు, క్రీడలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉన్నత చదువుల కోసం తాను విదేశాలకు వెళ్లినా ఈ కార్యక్రమం ఆగకుండా ఉండేందుకు ఇతర విద్యార్థులకు బాధ్యతలు అప్పగిస్తానని చెబుతూ చిన్న వయస్సులో పెద్ద మనసు చాటుకుంది అసావరి.  

ఇదీ చదవండి: భారత డిజైనర్లు రూపొందించిన దుస్తుల్లో ప్రిన్స్‌ విలియం దంపతులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement