జగిత్యాల: ఓ విద్యార్థి పట్ల స్కూల్ యాజమాన్యం అమానుష ఘటనకు పాల్పడింది. జగిత్యాల జిల‍్లా, రాయికల్ విశ్వశాంతి స్కూల్‌లో ఫీజు చెల్లించలేదని విద్యార్థికి శిక్ష వేసింది. ఆ బాలుడితో ముక్కు నేలకు రాయించి ఎండలో నిలబెట్టారని అతడి తండ్రి తెలిపారు. శిక్ష కారణంగా విద్యార్థి కాలికి కూడా గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. మరోవైపు, తన పెద్ద కుమార్తె మార్కుల మెమో ఇవ్వకుండా వేధిస్తున్నారని కూడా తండ్రి ఫిర్యాదు చేశారు. విద్యార్థి పట్ల పాఠశాల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని అవమానకర రీతిలో శిక్షించడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.


