అంతకుముందు విజయ డెయిరీ ఛైర్మన్‌గా ఉన్న చలసాని ఆంజనేయులు చేత టీడీపీ పెద్దలు బలవంతంగా రాజీనామా చేయించి, ఆ పదవిలో దాసరి బాలవర్ధనరావును ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే విజయ డెయిరీ బోర్డుపై రెడ్‌బుక్ ప్రయోగించారు మంత్రి లోకేష్. చైర్మన్‌గా ఉన్న చలసాని ఆంజనేయులను బలవంతంగా తప్పించారు.. మంత్రుల ఒత్తిడితో చలసాని ఆంజనేయులు ఆస్పత్రి పాలయ్యారు.
అయినప్పటికీ ఆస్పత్రి బెడ్‌పై ఉండగానే చలసాని ఆంజనేయుల చేత రాజీనామా చేయించి, ఆపై బాలవర్ధనరావును చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దాంతో పాటు బోర్డు డైరెక్టర్లను కూడా ఎంపిక చేసేశారు. అయితే ఈ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు.. విజయ డెయిరీ చైర్మన్, డైరెక్టర్ల ఎన్నిక చెల్లదంటూ కీలక తీర్పు వెలువరించింది. దాంతో టీడీపీ పెద్దలకు గట్టి షాక్ తగిలినట్లయ్యింది.
ఇదీ చదవండి: గుడివాడలో టీడీపీకి భారీ షాక్


