వైఎస్సార్‌ కుటుంబంపై దుష్ప‍్రచారం చేస్తే సహించం: ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి | MLA Anirudh reddy warns trollers | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ కుటుంబంపై దుష్ప‍్రచారం చేస్తే సహించం: ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి

Nov 16 2026 3:07 PM | Updated on Nov 16 2026 3:14 PM

MLA Anirudh reddy warns trollers

జడ్చర్ల: మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు వీడియోలు సృష్టిస్తూ, ట్రోలింగ్‌కు పాల్పడితే ఊరుకునేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్‌ కుటుంబంపై దుష్ప‍్రచారం చేస్తే సహించేది లేదని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్యప్రచారాన్ని ఆయన ఖండించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో అనిరుధ్‌ రెడ్డి సాక్షి మీడియాతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణలోనైనా, ఆంధ్రప్రదేశ్‌లోనైనా ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్సార్‌ ఉన్నారు. కాబట్టి వైఎస్సార్‌ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోం. సోషల్‌ మీడియాలో కావాలని ట్రోల్‌ చేస్తూ వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ గురించి గ్రూపులలో రాస్తున్నారు. తప్పుడు ప్రొపగండాలు సృష్టిస్తే ఊరుకోబోం’’ అని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement