అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోండి: చిరంజీవి | Chiranjeevi Request To Central Minister Kishan Reddy On AI and Deepfake | Sakshi
Sakshi News home page

Chiranjeevi: అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోండి: చిరంజీవి

Nov 16 2026 12:29 PM | Updated on Nov 16 2026 12:43 PM

Chiranjeevi Request To Central Minister Kishan Reddy On AI and Deepfake

డీపేఫేక్ వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రోజుల్లో ఏఐ దుర్వినియోగం పెరిగిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు. టెక్నాలజీ క్రియేటివిటీని పెంచాలే తప్పా.. కళాకారుల గౌరవాన్ని దెబ్బ తీయకూడదని  చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సమస్యను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి పౌరుడి భద్రతతో పాటు, కళాకారుల గౌరవం, గుర్తింపు సృజనాత్మక హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి ఉమ్మడి బాధ్యతని అన్నారు.

కాగా.. ఇటీవలే హైదరాబాద్‌ విచ్చేసిన కేంద్ర హోమంత్రి అమిత్‌షాని మెగాస్టార్‌తో పాటు రామ్ చరణ్ కూడా కలిశారు. ఈ సందర్భంగా ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ నకిలీ గుర్తింపులకు వ్యతిరేకంగా మరింత పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. తాజాగా కేంద్ర మంత్రి  కిషన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఇక సినిమాల విషయానికొస్తే చిరంజీవి ప్రస్తుతం కాకా మూవీలో నటిస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. 
.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement