'ప్రెగ్నెన్సీ ఉందన్న సోయి లేదు.. రోజుకు 100 సిగరెట్లు తాగేశా' | Soni Razdan smoked 100 cigarettes a day on set when pregnant with Alia | Sakshi
Sakshi News home page

Soni Razdan: 'కడుపులో ఆలియా భట్.. రోజుకు వంద సిగరెట్లు తాగా'

Nov 16 2026 11:22 AM | Updated on Nov 16 2026 11:27 AM

Soni Razdan smoked 100 cigarettes a day on set when pregnant with Alia

బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రస్తుతం సినిమాలతో పాటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తన భర్త రణ్‌బీర్‌ కపూర్, కూతురు రాహతో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం లవ్ అండ్ వార్ చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సంగతి పక్కనపెడితే ఆలియా భట్‌ తల్లి సోనీ రజ్దాన్ ఓ షాకింగ్ విషయాన్ని పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తాను నటించిన గుమ్రా మూవీ టైమ్‌లో జరిగిన సంఘటనను వివరించింది. తాను రెండోసారి ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్రా సినిమా చేయాల్సి వచ్చిందని తెలిపింది. గుమ్రా మూవీలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు తన కడుపులో అలియా భట్‌ ఉందని వెల్లడించింది. కానీ ఆ సీన్‌ కోసం ఒకే రోజులో దాదాపు 100 సిగరెట్లు తాగినట్లు గుర్తు చేసుకుంది. ఈ సీన్ కోసం పదేపదే ధూమపానం చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో తన సహనటులు నాకు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకుంది. కాగా.. ఈ చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు.

తన అనుభవాన్ని వివరిస్తూ..  "గుమ్రా మూవీ షూటింగ్‌లో నేను స్మోకింగ్ సీన్‌ని షూట్ చేస్తున్నా. ఆ సమయంలో నేను ఒక్కరోజులోనే దాదాపు 100 సిగరెట్లు తాగా. నా కడుపులో ఉన్నా ఆలియా భట్ గురించి ఆలోచన రాలేదు. లేదంటే స్మోక్ చేసేదాన్ని కాదు. కానీ ఆ తర్వాత నాకు సిగరెట్ తాగాలని కోరిక పుట్టింది' అని సోనీ రజ్దాన్ పంచుకుంది. కాగా.. సోని, మహేష్ భట్‌లకు 1988లో  మొదటి కుమార్తె షాహీన్ భట్‌ను స్వాగతించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే అలియా  భట్‌కు జన్మనిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement