చిరంజీవితో స్టెప్పులేయనున్న రితికా సింగ్‌..? | Kaaka Movie Latest Update Rithika Singh | Sakshi
Sakshi News home page

Kaaka Update: చిరంజీవితో రితికా మాస్ స్టెప్పులు..!

Nov 16 2026 11:14 AM | Updated on Nov 16 2026 11:19 AM

Kaaka Movie Latest Update Rithika Singh

‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న చిత్రం‘కాకా’. ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘గురు’ ఫేమ్ రితికా సింగ్‌.. చిరంజీవితో కలిసి ఈ పాటలో సందడి చేసినట్లు తెలుస్తోంది.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ
కాగా ఈ ఐటమ్‌ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
(ఇదీ చదవండి: మూవీ చూసి తిడుతున్నారు.. థమన్‌‍కి ఇదే నా రిక్వెస్ట్‌ : నాగార్జున)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement