సుడిగాలి సుధీర్‌తో పెళ్లి.. ఏమాట్లాడో తెలియడం లేదు : అషు రెడ్డి | Ashu Reddy Intersting Comments On Sudigali Sudheer | Sakshi
Sakshi News home page

సుడిగాలి సుధీర్‌ అలాంటి వాడు : అషురెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Nov 15 2026 6:29 PM | Updated on Nov 15 2026 6:41 PM

Ashu Reddy Intersting Comments On Sudigali Sudheer

సుడిగాలి సుధీర్‌ గురించి బుల్లితెర ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కమెడియన్‌గా, హోస్ట్‌గా అద్భుమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన సుధీర్‌..ఇప్పుడు వెండితెరపై కూడా రాణిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన గోట్‌ చిత్రం ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు హోస్ట్‌గాను పలు షోలు చేస్తున్నారు.

అయితే గతంలో రష్మితో లవ్ ట్రాక్ నడుపుతూ... విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌.. ఆ తర్వాత చానల్‌ మారి అక్కడ వేరే అమ్మాయిలతో లవ్‌ స్కిట్లు చేసి అలరించాడు. ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్‌ షోలో బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి.. సుధీర్‌ని బావా అని పిలిచినప్పటి నుంచి వీరిద్ధరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇదంతా షో కోసమే చేసినా.. కొంతమంది నిజంగానే ప్రేమలో ఉన్నట్లు ప్రచారం చేశారు.తాజాగా ఈ రూమర్స్‌లో అషురెడ్డి స్పందించింది. 

(చదవండి: బిగ్‌బాస్‌ కంటెస్టెట్లపై హైపర్‌ ఆది రివ్యూ)

ప్రముఖ నటి సురేఖావాణి కూతురు సుప్రీత హోస్ట్‌గా చేస్తున్న టాక్‌ షోకి గెస్ట్‌గా వెళ్లిన అషురెడ్డి..సుధీర్‌తో తనుకున్న అనుబంధం గురించి వివరించింది. ‘మీ బావా..సుడిగాలి సుధీర్‌తో పెళ్లి అంటున్నారు నిజమేనా? ఆయనతో నీ బాండింగ్‌ ఏంటి?’ అని హోస్ట్‌ సుప్రీత అడగ్గా.. అషురెడ్డి సిగ్గుపడుతూ.. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మా బావా చాలా మంచి పర్సన్‌. ఫ్యామిలీ స్టార్స్‌ షో కోసం రెండేళ్లుగా కలిసి పని చేస్తున్నాం. చాలా ప్రొఫిషినల్‌గా ఉంటాడు. తనపై ఎన్ని పంచులేసినా సీరియస్‌గా తీసుకోడు. వర్క్‌ని వర్క్‌లాగే చూస్తాడు. పని అయిపోయిందా? ఇంటికి వెళ్లిపోయామా అన్నట్లుగా ఉంటాడు’ అంటూ..తనతో ప్రేమ, పెళ్లి పుకార్లు మాత్రమే అని చెప్పకనే చెప్పేసింది.

(చదవండి: అరగుండు..అద్దంలో చూసుకోలేకపోయా : అషు రెడ్డి ఎమోషనల్‌)

ఇక ఇదే షోలో మరో బుల్లితెర నటుడు హరి గురించి మాట్లాడుతూ.. ‘అతను నాకు మంచి ఫ్రెండ్‌. ఇప్పుడు కలిసి పని చేయడం లేదు. గతంలో అతనికి ఓ బైక్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాను.కానీ ఇంతవరకు బైక్‌పై తీసుకెళ్లలేదు’ అని నవ్వుతూ చెప్పింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement