బ్రెయిన్‌లో టమోటో సైజు ట్యూమర్‌.. నరకం చూశా : అషు రెడ్డి | Ashu Reddy Opens About Her Brain Surgery | Sakshi
Sakshi News home page

అరగుండు..అద్దంలో చూసుకోలేకపోయా : అషు రెడ్డి

Nov 15 2026 4:27 PM | Updated on Nov 15 2026 4:33 PM

Ashu Reddy Opens About Her Brain Surgery

బిగ్‌బాస్‌ బ్యూటీ అషు రెడ్డికి రెండేళ్ల క్రితం బ్రెయిన్‌ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటివరకు టీవీ షోలు చేస్తూ హ్యాపీగా ఉన్న అషు..ఒక్కసారి ఆస్పత్రిలో ఉన్న ఫోటోలు షేర్‌ చేయడంతో ఆమె ఫాలోవర్స్‌ అంతా కంగారు పడ్డారు. సర్జరీ తర్వాత కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న అషు..ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సర్జరీ సమయంలో తాను అభవించిన బాధ గురించి వివరించింది.

టమాటా సైజు ట్యూమర్‌
ఒకసారి భరించరాని తలనొప్పి వచ్చింది. ఎవరో సుత్తితో తలపై కొట్టినట్లుగా అనిపించింది. నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రికి వెళ్లాను. స్కాన్‌ చేస్తే.. టమోటో సైజు అంత ట్యూమర్‌ ఉందని తేలింది. వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. నాకేం అర్థం కాలేదు. మా సర్కిల్‌లో ఎవరికీ ఇలాంటి సమస్య రాలేదు. వెంటనే సర్జరీ చేశారు. టమోటో సైజు ట్యూమర్‌ని బయటకు తీశారు. దాన్ని ఒక పెద్ద బాక్సులో వేసి  నాకు చూపించారు. ఆ తర్వాత ల్యాబ్‌కి పంపించారు.

(చదవండి: పెళ్లంటే 'థూ' అనేసిన అషూ.. కామెంట్స్ వైరల్)

అద్దంలో చూసుకోలేకపోయా
సర్జరీ తర్వాత వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లోవాళ్లు మొక్కని దేవుడు లేరు. అప్పటికే నాకు అరగుండు చేశారు. గుండు మాత్రం చేయిస్తామని మొక్కద్దని చెప్పా(నవ్వుతూ..). ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు నెల రోజుల పాటు అద్దంలో నేను ముఖం చూసుకోలేదు. కుట్లు తీసిన తర్వాత అద్దంలో చూసుకున్నా.అది నేనేనా అనిపించింది. చాలా బాధపడ్డా. మనసులో ఎన్నో ప్రశ్నలు వేధించాయి. కొన్నాళ్ల తర్వాత నాకు నేనే సర్ధిచెప్పుకున్నా. అందం శాశ్వతం కాదని తెలుసుకున్నా. ఒకరకంగా చెప్పాలంటే నేను ఆ సమయంలో నరకం అనుభవించా’ అంటూ అషురెడ్డి ఎమోషనల్‌ అయింది. 

డబ్‌స్మాష్‌ వీడియోలతో ఫేమస్‌ అయింది అషూ. అచ్చుగుద్దినట్లు సమంతలా ఉండటంతో తనకు బాగా క్రేజ్‌ వచ్చింది. అదే సమయంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా వైరల్‌ అయిపోయింది. అలా ఈ వర్మ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్‌ దక్కించుకుంది. నెల రోజులకే షో నుంచి ఎలిమినేట్‌ అయింది. తర్వాత ఓటీటీలో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ సీజన్‌లోనూ పాల్గొంది. ఛల్‌ మోహనరంగ, బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌, ఎ మాస్టర్‌ పీస్‌ చిత్రాల్లోనూ నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement