ఓటీటీకి టాలీవుడ్ హరర్‌ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Tollywood Thriller Movie 418 Streaming On this OTT From This Date | Sakshi
Sakshi News home page

Thriller Movie: ఓటీటీకి టాలీవుడ్ హరర్‌ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nov 15 2026 3:01 PM | Updated on Nov 15 2026 3:06 PM

Tollywood Thriller Movie 418 Streaming On this OTT From This Date

సూర్య రాజ్‌ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో వచ్చిన టాలీవుడ్ హారర్‌ థ్రిల్లర్ మూవీ  418. ఈ మూవీకి కీర్తన్‌ నాదగౌడ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 23న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.

ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ నెల 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీని ప్రశాంత్‌ నీల్‌ సమర్పణలో కీర్తన్‌ నాదగౌడ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించారు.  ఈ చిత్రంలో చైత్ర ఆచార్, చరణ్ లక్కరాజు, శ్రీ వైష్ణవ, శశాంక్‌ పాటిల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీజీ వెంకీ.

ఈ మూవీ కథేంటంటే..

వివేక్‌(సూర్య రాజ్‌)ని డాక్టర్‌గా చూడాలని అతని తల్లిదండ్రుల కల. ఆస్తులు అమ్మి కొడుకుని మెడికల్‌ కాలేజీలో చేర్పిస్తారు. ఆ కాలేజీ హాస్టల్‌ 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరుస్తారు. అయితే అందులో 418 నంబర్‌ గదిని మాత్రం మూసే ఉంచుతారు. అంతేకాదు ఆ హాస్టల్‌లోకి అమ్మాయిలను అడుగుపెట్టనివ్వరు. అలాంటి హాస్టల్‌లోని 417 గదిలోకి వివేక్‌ చేరతాడు. అప్పటికే ఆ గదిలో మరో స్టూడెంట్‌ రోహిత్‌(చరణ్‌ లక్కరాజు) ఉంటాడు. ఓ రోజు స్నేహితులంతా కలిసి 418 గదిని తెరవాలని ప్లాన్‌ వేస్తారు. వివేక్‌ మాత్రం గదిలోనే ఉంటాడు. మిగిలివారంతా 418 గదిని తెరవడానికి వెళ్తారు. కానీ చివరి నిమిషంలో తమ ప్లాన్‌ని విరమించుకొని బయటకు వెళ్తారు. అదే రోజు రాత్రి వివేక్‌పై హత్యాయత్నం జరుగుతుంది. భయంకరమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. దీనంతటికి 418 నంబర్‌ గదినే కారణం అవుతుంది. అసలు ఆ గదిని ఎందుకు మూసేశారు? అందులో ఉన్నదెవరు? హాస్టల్‌లోకి అమ్మాయిలను ఎందుకు రానివ్వడం లేదు? 15 ఏళ్ల క్రితం ఆ మెడికల్‌ హాస్టల్‌లో జరిగిన ఘోరం ఏంటి? లండన్‌ నుంచి వచ్చిన సాయేషా (ప్రీతి ప‌గ‌డాల‌) ఆ గదిలోకి వెళ్లాలని ఎందుకు ప్రయత్నించింది? హాస్టల్‌లోకి ఆమె వెళ్లిన తర్వాత ఏం జరిగింది? దేవిక(చైత్ర ఆచార్‌) ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement