'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత లెక్క ప్రకారం త్రివిక్రమ్‌తో భారీ మైథలాజికల్ మూవీ లైన్‌లో ఉంది. నిన్నటివరకు అంతా ఇదే అనుకున్నారు. కానీ సడన్‌గా అనిల్ రావిపూడితో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడంతో అంతా షాకయ్యారు. దీంతో ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. అదే టైంలో ఎన్నో సందేహాలు రేకెత్తుతుండగా మరోవైపు అభిమానుల తమ కోరికలని బయటపెట్టేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో 'కోర్ట్' శ్రీదేవి రొమాంటిక్ సినిమా)
తెలుగు స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటోళ్లు పాన్ ఇండియా రేసులో పరుగెత్తుతున్నారు. ఈ పోటీలో పడి రెండు మూడేళ్లకు గానీ ఒక సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఏడాదికి ఒక మూవీ అయినా రిలీజ్ చేస్తే అటు అభిమానులు, ఇటు సగటు ప్రేక్షకులు సదరు హీరోలని, వాళ్లు తీసే చిత్రాల్ని గుర్తుంచుకుంటారు. కానీ పాన్ ఇండియా ట్రెండ్ పేరుతో యాక్షన్, రక్తపాతం అని కుటుంబ ప్రేక్షకులకు వీళ్లు దూరమవుతున్నారు.
ఎన్టీఆర్.. అనిల్ రావిపూడితో కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమయ్యేలా సినిమా చేయనుండటం మంచి విషయమే. ఎందుకంటే ఒకవేళ ఇది వర్కౌట్ అయితే గనక మిగతా హీరోలు కూడా ఇలానే చేయొచ్చు. ఎప్పుడూ పెద్ద పెద్ద చిత్రాలే కాకుండా అప్పుడప్పుడు సింపుల్‌గా ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేస్తే అటు టాలీవుడ్‌కి ఇటు బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు ఇలాంటి మూవీసే ప్లస్ అవుతాయి.
మరోవైపు ఎన్టీఆర్, రావిపూడి కాంబోలో సినిమా అనౌన్స్ చేయగానే అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా తమ కోరికల్ని బయటపెట్టేస్తున్నారు. 'అదుర్స్' స్టైల్ కామెడీ పాత్ర ఉండాలి. హీరోయిన్‌గా మమిత, నజ్రియా లాంటి బ్యూటీస్‌ని తీసుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కొత్త వాడైతే బెటర్.. స్టెప్పులు ఇరగదీసే ఓ మంచి పాట ఉండాలి. ఇలా సాగుతోంది కోరికల చిట్టా. కేవలం ప్రకటనకే ఇంతలా హడావుడి నడుస్తుందంటే.. రిలీజ్ టైంకి ఒత్తిడి మరింత పెరిగిపోవచ్చు. దీన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. ప్రకటన వచ్చేసింది)


