పెళ్లిబంధంలోకి ప్రముఖ బుల్లితెర నటి | TV actors Nandish Sandhu Kavita Banerjee get married in Bengali style | Sakshi
Sakshi News home page

TV Actors: పెళ్లి చేసుకున్న సీరియల్ జంట

Nov 15 2026 1:09 PM | Updated on Nov 15 2026 1:16 PM

TV actors Nandish Sandhu Kavita Banerjee get married in Bengali style

ప్రముఖ బుల్లితెర జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. బెంగాలీకి చెందిన సీరియల్ నటులు కవితా బెనర్జీ, నందీశ్ సంధు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి వేడుక నవంబర్ 14న పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో జరిగింది. స్థానిక సంప్రదాయ పద్ధతితో ఈ జంట ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కాగా.. నటి రష్మీ దేశాయ్‌తో విడాకుల తర్వాత నందీశ్‌కు ఇది రెండో పెళ్లి. వీరిద్దరు గతేడాది  సెప్టెంబర్ 5 ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. 
దాదాపు నెల రోజుల తర్వాత నిశ్చితార్థం జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. కాగా.. నందీశ్, కవిత ఇద్దరూ పలు సీరియల్స్‌లో పనిచేశారు. కవిత 'తేరీ మేరీ ఇక్ జింద్రీ', 'భాగ్యలక్ష్మి' వంటి సీరియల్స్‌లో కనిపించగా.. నందిశ్ సైతం పలు ప్రాజెక్టులలో భాగమయ్యాడు. వీరిద్దరి మధ్య దాదాపు 11 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉందని సమాచారం.

నందీశ్ మొదటి పెళ్లి..

కాగా.. నందీశ్ గతంలో నటి రష్మీ దేశాయ్‌ను వివాహం చేసుకున్నాడు. టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2012లో వివాహం చేసుకున్నారు. 2014లో వారు విడిపోయినట్లు వార్తలు రాగా.. 2016లో వీరికి విడాకులు ఖరారయ్యాయి. ఆ తర్వాత నందీశ్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని రష్మీ ఆరోపించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement