ఆమెకు 82.. అతడికి 28.. ఇంతకీ నిజమేంటి? | Actor Jaden Smith Dating With 82 Years Michele Lamy | Sakshi
Sakshi News home page

Jaden Smith: 82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు డేటింగా?

Nov 15 2026 11:49 AM | Updated on Nov 15 2026 11:54 AM

Actor Jaden Smith Dating With 82 Years Michele Lamy

ప్రేమకు వయసుతో పనిలేదు. అందుకు తగ్గట్లే సెలబ్రిటీలు తమ కంటే వయసులో చిన్నవాళ్లని చాలా పెద్దోళ్లని కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే స్టార్ హీరోకి ఉన్న 28 ఏళ్ల కొడుకు.. 82 ఏళ్ల ఫ్యాషన్ సెలబ్రిటీతో డేటింగ్‌లో ఉన్నాడనే సంగతి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఇందులో నిజమెంత? మరి ఫొటోల మాటేమిటి?

(ఇదీ చదవండి: విడాకులు తీసుకోలేదు.. కానీ విడివిడిగా ఉంటున్నాం: రమ్యకృష్ణ)

హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్.. డబ్బింగ్ సినిమాల రూపంలో తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. బ్యాడ్ బాయ్ సిరీస్‌తో పాటు మెన్ ఇన్ బ్లాక్, ఇండిపెండెన్స్ డే, ఆఫ్టర్ ఎర్త్, ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ తదితర చిత్రాల్లో సొంత కొడుకు జేడెన్ స్మిత్‌తో కలిసి నటించాడు. 2010లో వచ్చిన 'కరాటే కిడ్' మూవీలో హీరోగానూ జేడెన్ నటించాడు.

ప్రస్తుతం ర్యాపర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జేడెన్ స్మిత్.. 82 ఏళ్ల వయసున్న ఫ్రెంచ్ ఫ్యాషన్ సెలబ్రిటీ మిచెల్ లామీ అనే మహిళతో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి. వీళ్లిద్దరూ క్లోజ్‌గా ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో చాలామంది ఇది నిజమనుకున్నారు. కానీ ఇవి ఏఐతో తయారు చేసినవని తెలిసింది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: కొత్త కెప్టెన్ నరేశ్.. వర్షిణికి పనిష్మెంట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement