విడాకులు తీసుకోలేదు.. కానీ విడివిడిగా ఉంటున్నాం: రమ్యకృష్ణ | Ramyakrishnan Reacts Her Divorce Rumours Latest Interview | Sakshi
Sakshi News home page

Ramyakrishnan: మేం వేర్వేరు ఊళ్లలో ఉండటానికి అదే కారణం

Nov 15 2026 9:24 AM | Updated on Nov 15 2026 9:25 AM

Ramyakrishnan Reacts Her Divorce Rumours Latest Interview

రమ్యకృష్ణ.. ఇప్పటి జనరేషన్‌కి ఈమె శివగామిగానే తెలుసు. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్‌గా తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేసిన ఈమె తర్వాత కాలంలో టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీని 2003 జూన్ 12న పెళ్లి చేసుకుంది. ఏడాదిన్నరలోనే కొడుకు కూడా పుట్టాడు. తర్వాత సీరియల్స్ చేస్తూ మళ్లీ కెరీర్ మొదలుపెట్టింది. ప్రస్తుతం కీలక పాత్రలు, సహాయ పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

అయితే పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రస్తుతం రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుండగా, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీంతో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారా అనే రూమర్స్ చాలానే వచ్చాయి, వస్తున్నాయి. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రమ్యకృష్ణ.. అసలు ఎందుకు విడివిడిగా ఉంటున్నామో చెప్పుకొచ్చింది.

'మేం ఇప్పటికీ దంపతులుగానే ఉన్నాం. కానీ వేర్వేరు చోట్ల ఉంటున్నాం. కెరీర్ కారణంగానే ఇలా ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే నా కొడుకు పుట్టిన తర్వాత సీరియల్స్ చేస్తున్న టైంలో ప్రతి 15 రోజులకొకసారి చెన్నై వెళ్లొచ్చేదాన్ని. నేను అలా వెళ్లిన ప్రతిసారి నా కొడుకు అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో నేను అబ్బాయిని చెన్నైలోనే చదివిస్తానని ఆయన(భర్త కృష్ణవంశీ)తో చెప్పాను. అయితే ఆ ప్రొసెస్‌లో పరిస్థితులు కన్వీనియంట్‌గా మారిపోయాయి. అందుకేనేమో ఇప్పటికీ మేం దంపతులుగానే ఉన్నాం. ప్రస్తుతానికైతే రోజూ గొడవలు పడటం కంటే మంచి ఫ్రెండ్స్‌లా ఉన్నాం. పెళ్లెందుకు.. లివింగ్ టుగెదర్ చేద్దామని వంశీ(కృష్ణవంశీ) అప్పుడే చెప్పాడు. నేను కూడా అప్పుడే దానికి ఓకే చెప్పి ఉండాల్సింది' అని రమ్యకృష్ణ వెల్లడించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'కోర్ట్' శ్రీదేవి రొమాంటిక్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement