ఐశ్వర్య, సరోజ్‌కుమార్
బండి సరోజ్ కుమార్ కథ–స్క్రీన్‌ప్లే–సంభాషణలు–సాహిత్యం–ఎడిటింగ్–సంగీతం బాధ్యతలతో పాటు హీరోగా నటించిన చిత్రం ‘ఛప్రి’. ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మిస్తున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కానుంది.
ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో బండి సరోజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘700 రోజులు కష్టపడి ఈ కథ రాశాను. కథకు తగ్గట్టుగా మంచి ఆర్టిస్టులు దొరికారు. మా సినిమా టీజర్‌ను ఫిబ్రవరిలో ప్లాన్ చేశాం. కానీ ‘ఈ మగాడు...’ సీన్‌ని ఎవరో జూనియర్ ఆర్టిస్టు లీక్ చేశాడు. అందుకే టీజర్‌ను ఇంత ఫాస్ట్‌గా రిలీజ్ చేశాం’’ అని తెలిపారు. ‘ఛప్రి నా కులం, నర్సింగ్ ఛప్రి నా పేరు’ వంటి డైలాగ్స్ ఈ సినిమా టీజర్‌లో ఉన్నాయి.


