అక్కినేని నాగార్జున సమర్పణలో వెంకీ కుడుముల నిర్మించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించారు. 'శిరిడి సాయి' నిర్మాత మహేష్ రెడ్డి తనయుడు అనీష్ హీరోగా పరిచయం అయ్యాడు. అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో కింగ్ నాగార్జున పాల్గొని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా అందుకే చేశారా
‘ఫ్రెండ్ వాళ్ల అబ్బాయి అని ఈ సినిమా చేశారా? లేక కంటెంట్ నచ్చి చేశారా?’ అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘సినిమా కంటెంట్ చూపించి నన్ను అడిగారు. ఇప్పుడు ఫ్రెండ్ కొడుకు అని నేను చేస్తే సినిమా ఆడదు. అలా చాలా మంది సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అంతమాత్రాన సినిమాలు ఆడాయా? అలా ఎప్పుడూ ఉండదు. సినిమాకి కంటెంట్ ఉంటేనే ఆడుతుంది. సినిమాని ఎవరు ప్రెజెంట్ చేశారని విషయం మీద కాదు’ అని నాగార్జున అన్నారు.
(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత తొలిసారి కనిపించిన క్రేజీ జంట( వీడియో))


