హిందూపురంలో సీటీఓ కృష్ణవేణి వసూళ్ల దందా.. బాలకృష్ణ పీఏ సపోర్ట్‌! | Hindupur TO Krishnaveni Caught Over Taking Bribe | Sakshi
Sakshi News home page

హిందూపురంలో సీటీఓ కృష్ణవేణి వసూళ్ల దందా.. బాలకృష్ణ పీఏ సపోర్ట్‌!

Nov 14 2026 9:00 AM | Updated on Nov 14 2026 9:00 AM

Hindupur TO Krishnaveni Caught Over Taking Bribe

సాక్షి, హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కమర్షియల్ టాక్స్ అధికారిపై అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హిందూపురం కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (సీటీఓ) కృష్ణవేణి రూ.10 వేల లంచం తీసుకుంటున్న దృశ్యాలను ఓ చిరు వ్యాపారి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోతో అధికారిణి వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.

కృష్ణవేణి ఒక్కో వ్యాపారి నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో కర్నూలులో మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నారంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు. మరోవైపు సీటీఓకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ అండదండలు ఉన్నాయని, ఆ కారణంగానే ఆమె బాహాటంగా వసూళ్లకు పాల్పడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులకు వ్యాపారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కృష్ణవేణిపై సమగ్ర విచారణ జరిపికఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది. 

ఇదీ చదవండి: బడాయి బాబు.. అర్ధరాత్రి సూరీడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement