ఓట్ల లెక్కింపులో అడుగడుగునా అన్యాయం | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపులో అడుగడుగునా అన్యాయం

Nov 14 2026 7:57 AM | Updated on Nov 14 2026 7:57 AM

హిందూపురం(చిలమత్తూరు): పురం మున్సిపాలిటీలో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే అని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక పేర్కొన్నారు. మంగళవారం హిందూపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే పీఏలు దౌర్జన్యంగా కౌంటింగ్‌ కేంద్రంలో దగ్గరుండి టీడీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారని మండిపడ్డారు. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రజాస్వామ్యహితంగా జరగలేదని విమర్శించారు. అనైతికంగా గెలిచిన గెలుపు అసలు గెలుపే కాదన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బెదిరింపులకు పాల్పడడమే కాకుండా డిక్లరేషన్‌ ఫారాలను చించివేశారని, అలానే రీకౌంటింగ్‌ పేరుతో వేధించారని తెలిపారు. టీడీపీ నాయకులకు పాస్‌లు అందించి కౌంటింగ్‌ కేంద్రాల వద్ద వ్యవహారం నడిపించారని, తమ పార్టీ వారికి పాసుల మంజూరు అన్యాయం చేశారని వాపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమ అరెస్టులు, బైండోవర్లు చేయడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎక్కడా.. ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరించారని విమర్శించారు. తాము గెలిచింది 11 సీట్లే అయినా ప్రతి చోటా తమ పార్టీ అభ్యర్థులు చెమటోడ్చి ప్రచారాలు చేయడాన్ని అభినందించారు. గెలుపొందిన వారు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు.

నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే

కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యే పీఏల దౌర్జన్యకాండ

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్‌ దీపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement