breaking news
Sri Sathya Sai District Latest News
-
రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లా?
ఇచ్చిన హామీలేవీ అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. రెండేళ్లలో ఏకంగా రూ.3 లక్షల కోట్లు అప్పు చేసింది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై టీడీపీ నాయకులు విమర్శలు చేశారు. మరి చంద్రబాబు హయాంలో సంక్షేమం పేరుతో తీసుకువచ్చిన రూ.3 లక్షల కోట్లకుపైగా డబ్బు ఎవరి జేబులోకి వెళ్లిందో చెప్పాలి. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. చెప్పింది చెప్పినట్టు చేసిన పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమే. – మక్బూల్, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త -
దోపిడీ సర్కార్ ఇది
ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచి చేయాలని భావిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం దోపిడీనే పరమాధిగా భావిస్తోంది. చివరకు డబ్బు కోసం రైతులకు తీరని అన్యాయం చేస్తూ హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టింది. రైతుల తరఫున పోరాడిన మాలాంటి వారందరిపై అక్రమ కేసులు పెట్టింది. గ్రామాల్లో వలసలు మొదలయ్యాయి. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే స్థానిక సంస్థల్లో మనం విజయఢంకా మోగించాలి. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త -
నల్లమాడలో రెడ్‌బుక్ రాజ్యాంగం
పుట్టపర్తి టౌన్: ‘మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండదండలతో నల్లమాడలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు’ అని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నేత ఎన్‌హెచ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్లమాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నల్లమాడలో తమ తాత, ముత్తాలకు సంబంధించి సర్వేనంబర్ 136–1లో 8.47 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో అన్నదమ్ములు 8 ఎకరాల భూమిని పంచుకోగా 47 సెంట్లు భూమి మిగులు భూమిగా ఉందని చెప్పారు. దానికి సంబంధించి మోదీనమ్మ, ఆలామ్మోలీ, ఎన్ బాషా పేరుమీద రికార్డులు కూడా ఉన్నాయన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీకి చెందిన సలాముల్లాఖాన్, రఫీఖాన్ కన్ను ఆ భూమిపై పడిందన్నారు. తాము కూడా వంశ వృక్షంలో ఉన్నామని, తమకు భూమి రావాలని మాపై గొడవకు దిగారన్నారు. తాము అంగీకరించకపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండతో రెవెన్యూ, పోలీసులును ఆశ్రయించారన్నారు. అధికార పార్టీకి తలొగ్గిన అధికారులు ఇద్దరిని పిలిచి పంచాయితీ పెట్టి అందులో ఆరు సెంట్ల భూమి సలాంముల్లా, రఫీఖాన్‌కు ఇవ్వాలని, అధికారులకు మూడు సెంట్ల భూమి ఇవ్వాలని పంచాయితీ చేశారన్నారు. తాము ససేమీరా అనడంతో వైఎస్సార్సీపీ సానుభూతి పరులవి ఫేక్ వంశవృక్షమని మోదీనమ్మ, ఆలామ్మోలీ ,ఎన్‌హెచ్ బాషాపై అక్రమ కేసులు బనాయించి కదిరి కోర్టుకు తరలించారన్నారు. మహిళ అని కూడా చూడకుండా అర్ధరాత్రి సమయంలో అనంతపురం కోర్టుకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పూచీ కత్తుతో తనను విడిచిపెట్టారని ఎన్‌హెచ్ బాషా తెలిపారు. నల్లమాడలో వైఎస్సార్సీపీకి పనిచేశామని, పదవులు కూడా తీసుకున్నామని ఏనాడూ ఎవరి భూములు లాక్కోలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూములు లాక్కొని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. మాట విని అధికారులకు మూడు సెంట్ల భూమి ఇచ్చివుంటే ఇదంతా జరిగివుండేది కాదన్నారు. ప్రాణాలు పోయినా సెంటు భూమి కూడా ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నేత బాషా -
కుట్రలకు భయపడం
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండగా... అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తోంది. అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తోంది. కానీ వారికి తెలియదేమో ప్రాణం పోయినా వైఎస్సార్ సీపీ క్యాడర్ వెనక్కి తగ్గే రకం కాదు. మన సత్తా ఏమిటో స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి చూపుదాం. ప్రతి కార్యకర్త విజయమే లక్ష్యంగా శ్రమించాలి. ప్రతి స్థానంలోనూ వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడించాలి. – ఈరలక్కప్ప, మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త -
పందుల దొంగల ముఠా అరెస్టు
హిందూపురం టౌన్: పోలీసులపై దాడులకు పాల్పడిన దొంగల ముఠాను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. గతంలో పందులను దొంగిలించేందుకు బొలెరో వాహనంలో వచ్చిన ముఠా సభ్యులు పోలీసులను సైతం లెక్కచేయకుండా రెండు సార్లు దాడులకు పాల్పడి పరారయ్యారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి 11 మంది ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హిందూపురం ఏఎస్పీ మహేష్‌తో కలిసి ఎస్పీ సతీష్‌కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కేసు పూర్వాపరాలు ఇలా.. గత నెల 6న రాత్రి హిందూపురం పట్టణంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా, చిన్నమార్కెట్ సమీపంలో ఓ బొలెరో వాహనం ఆపకుండా వేగంగా వెళ్లింది. వెంబడించిన పోలీసులపై ముఠా సభ్యులు దాడి చేయడానికి ప్రయత్నించారు. సీఐని వాహనంతో గుద్దేందుకు ప్రయత్నించారు. సీఐ చాకచక్యంగా తప్పించుకున్నారు. అదే నెలలో 27న అర్ధరాత్రి సమయంలో హిందూపురం రూరల్ సీఐ జనార్దన్ స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో గస్తీలో ఉండగా, అదే సమయంలో ఓ బొలెరో రావడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. వారు ఆపకుండా వెళ్లడంతో సీఐ జనార్దన్ ఇతర పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసులపైనే రాళ్లు, బాటిళ్లతో దాడులకు యత్నించారు. దీంతో రూరల్ సీఐ జనార్దన్ దుండగుల వాహనంపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా దుండగులు తప్పించుకుపోయారు. దీనిపై హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. ముఠా అరెస్ట్... హిందూపురం పట్టణ శివారులో హైవేపై దారిదోపిడీకి సిద్ధమవుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం పట్టణంలోని సింగిరెడ్డిపల్లి శివారులో శిరా–కొడిగెనహళ్లి ఎన్‌హెచ్–544ఈ రహదారి వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా మారణాయుధాలతో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వన్‌టౌన్ సీఐ ప్రసాద్‌బాబు, టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం, హిందూపురం రూరల్ సీఐ జనార్దన్, యూపీఎస్ సీఐ ఆంజనేయులు, వన్‌టౌన్ ఎస్ఐ రాజేష్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముఠాలోని 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు హైవేపై రవాణా అవుతున్న పందుల లోడును దారి కాచి పందులను దొంగిలించేందుకు సిద్ధమైనట్లు వెల్లడైంది. వారి వద్ద నుంచి రూ.8.50 లక్షల నగదు, రెండు బొలెరో పికప్ వాహనాలు, ఆరు పిడిబాకులు, దాడి చేయడానికి ఉంచుకున్న రాళ్లు, 20 ఖాళీ కూల్‌డ్రింక్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పోలీసులపై దాడికి పాల్పడిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. విచారణలో గత నెల 27న హిందూపురం పట్టణంలో 10 పందులను దొంగలించినట్లు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టు అయిన వారిలా.. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అనంతపురానికి చెందిన ఎరికల చంద్రశేఖర్, సాకే రాజేష్, ఎరికల రమేష్, వెంకటేష్, బెస్త రాకేష్, సాకే మహేష్, ఎరికల గంగన్న, నడిమిండ్లు లక్ష్మణ్, ఎరికల సునీల్, జె.రోహిత్, హిందూపురానికి చెందిన వెంకటేష్ ఉన్నారు. వీరు పందులను దొంగలించి కర్ణాటక, అనంతపురం ప్రాంతాల్లో విక్రయించేవారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన పందులను కొన్న అనంతపురం, కర్ణాటకకు చెందిన వారిని కూడా పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులపై కేసులు ప్రస్తుతం అరెస్టు అయిన ముఠా సభ్యులపై హిందూపురం వన్‌టౌన్, ఉరవకొండ, తాడిపత్రి టౌన్, తాడిపత్రి రూరల్, గుంతకల్లు రూరల్, కసాపురం, యల్లనూరు, కళ్యాణదుర్గం అర్బన్, డోన్ రూరల్, అమరాపురం, నల్లమాడ, బుక్కరాయసముద్రం తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, పోలీసులపై దాడులు, హింసాత్మక నేరాలకు సంబంధించిన పలు కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐలు ప్రసాద్ బాబు, ఆంజనేయులు, జనార్ధన్, కరీం, ఎస్ఐ రాజేష్, ఉమ్మడి అనంతపురం జిల్లా క్రైమ్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులను అందించారు. 11 మంది అరెస్ట్, పరారీలో ఇద్దరు రూ.8.50 లక్షల నగదు, రెండు బొలెరోలు, మారణాయుధాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్‌కుమార్ దోపిడీ ముఠాకు పోలీస్ ట్రీట్మెంట్ బేడీలు వేసి నడిపించుకుంటూ తీసుకెళ్లిన వైనం దారి దోపిడీ, పందుల దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులపైనే దాడులకు పాల్పడుతున్న 11 మంది దోపిడీ ముఠా సభ్యులకు పట్టణ ఖాకీలు పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ముఠా సభ్యులను అరెస్టు చేశారు. అనంతరం సీఐలు ప్రసాద్‌బాబు, అబ్దుల్ కరీం, జనార్దన్ ఆంజనేయులు సమక్షంలో పోలీసు సిబ్బంది స్థానిక గురునాథ్ సర్కిల్ నుంచి తెలుగుతల్లి సర్కిల్ వరకు నిందితుల చేతులకు బేడీలు వేసి ఊరేగించారు. ప్రజల్లో భయభ్రాంతులు కలిగించేలా, అడ్డొచ్చిన వారిని అంతమొందించేలా దాడులకు తెగబడుతున్న దోపీడి ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించడానికి నిందితులను ఊరేగించామని పేర్కొన్నారు. -
అక్రమాలకు ‘సహకారం’
చిలమత్తూరు: సహకార కేంద్ర బ్యాంకు అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. అడిగేవారు లేకపోవడంతో బ్యాంకు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ బ్యాంకుకే తీరని నష్టం కలిగిస్తున్నారు. భూములను తాకట్టుపెట్టుకుని రుణాలు ఇస్తున్న బ్యాంకు సిబ్బంది రుణదాతలు రుణం మొత్తం చెల్లించినా... బ్యాంకులో చెల్లించకుండా సెక్రటరీలు మింగేసిన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో స్కాం రాష్ట్రంలో సంచలనంగా మారింది. హిందూపురం ఏడీసీసీ బ్యాంకులో భారీ స్కాం బయటపడింది. బ్యాంకుల్లో పనిచేసే గోల్డ్ అప్రైజర్ ద్వారా నకిలీ బంగారం తనఖా పెట్టించి సుమారు రూ.8 కోట్లు రుణాలు పొందడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో హిందూపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బ్యాంకు సిబ్బంది పాత్రపై అనుమానాలు జిల్లా సహకార సంఘం బ్యాంకులో జరిగిన భారీ గోల్డ్ స్కాంలో ఇక్కడే పాతుకుపోయిన అధికారుల పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఘటన తో బ్యాంకులో పనిచేసే సిబ్బంది అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ స్కాంలో సూత్రధారులుగా అనుమానిస్తున్న బ్యాంకు మేనేజరు జయరాం చౌదరి, అసిస్టెంట్ మేనేజరు కంబగిరి, సహాయకురాలు అర్చనాభాయిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గుట్టుగా విచారణ ఏడీసీసీబీ అధికారులు హిందూపురంలోనే తిష్ట వేసి అవినీతి అంశంపై విచారణ వేగవంతం చేశారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఉంటూ నకిలీ బంగారం తాకట్టు అంశానికి సంబంధించి గుట్టుగా విచారణ జరుపుతున్నారు. నకిలీ బంగారం తాకట్టుపై ఇప్పటికే మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. సహకార బ్యాంకుల్లో ఇంత పెద్ద స్కాం బయట పడటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గోల్డ్‌స్కాం కేరాఫ్‌గా మారిన హిందూపురం ఏడీసీసీబీ నకిలీ బంగారంతో బ్యాంకుకు భారీ టోకరా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సహా ముగ్గురు సస్పెండ్ సమగ్ర విచారణ చేపట్టిన బ్యాంకు ఉన్నతాధికారులు ఎస్పీకి ఫిర్యాదు ? నకిలీ ఖాతాలు.. నకిలీ బంగారం ఏడీసీసీ బ్యాంకులో సాధారణ తనిఖీలు నామమాత్రంగా సాగుతుండటంతో అక్రమార్కుల పంట పండింది. కేవలం రైతులు మాత్రమే రుణాలు తీసుకొనే ఈ బ్యాంకుల్లో నకిలీ రైతులను సృష్టించి, అదే విధంగా పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు తెరచి వాటి ద్వారా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి వాటిని తనిఖీ చేసే అప్రైజర్‌తో బ్యాంకు అధికారులు కుమ్మకై ్క ఈ భారీ స్కాంకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. తవ్వే కొద్దీ అక్రమాల చిట్టా బయటకు వస్తుండటం సంచలనంగా మారింది. ఈ విషయం అధికారికంగా బయటకు చెప్పనప్పటికీ బ్యాంకు ఉన్నతాధికారులు ఈ స్కాంపై ఐదు రోజులుగా విచారణ చేస్తూనే ఉండటంతో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గోల్డ్ స్కాం వ్యవహారంలో బ్యాంకులో పనిచేసే సిబ్బంది పాత్ర ఉండటంతో విచారణ అధికారులకు వారు ఏమాత్రం సహకరించనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భారీగా రుణాలు ఇచ్చినట్టు గుర్తించిన అధికారులు, ఈ వ్యవహారం పై పోలీసులు విచారణ చేస్తేనే నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో బుధవారం ఎస్పీ సతీష్‌కుమార్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. -
దేవర చెరువును తవ్వేస్తున్నారు!
కదిరి అర్బన్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరగానే అధికారం అండలో టీడీపీ నేతలు దోపిడీలకు తెగబడ్డారు. భూదందాలు, ప్రైవేటు పంచాయితీలతో భారీగా ఆర్జిస్తున్నారు. మరికొందరు ‘తమ్ముళ్లు’ సహజవనరులను కొల్లగొట్టి రూ.కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా కదిరిలోని పచ్చ నేతలు చెరువులను చెరబట్టారు. సారవంతమైన మట్టిని తవ్వుకుని తరలిస్తున్నారు. చెలరేగుతున్న మట్టిమాఫియా.. కదిరిలో మట్టిమాఫియాగా మారిన తెలుగు తమ్ముళ్లు... దేవరచెరువు, విఠలరాయుని చెరువు, సున్నపుగుట్టతండా సమీపంలోని గుట్టలు...ఇలా ఎక్కడ బడితే అక్కడ మట్టిని తవ్వేస్తున్నారు. దేవరచెరువు కట్టపై ఒకవైపు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సుందరీకరణ అంటూ హడావుడి చేస్తుండగా...అదే చెరువు నుంచి రాత్రివేళల్లో ‘తమ్ముళ్లు’ మట్టిని అక్రమంగా తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి రూ.4 వేల చొప్పున విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. రోజూ వందలాది టిప్పర్లు మట్టి తరలిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు మట్టిమాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇంత విచ్చలవిడిగా మట్టిమాఫియా రెచ్చిపోతోందంటే ఇదంతా ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతుందా...అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఎమ్మెల్యే అండదండలు ఉండడంతోనే అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నారు. కళ్లముందే టిప్పర్లు పోతున్నా.. రాత్రి 12 గంటల సమయంలో కదిరి జీవిమాను కూడలిలో పోలీసుల ముందే ఒకదానివెనుక ఒకటి మట్టి టిప్పర్లు తరలిపోతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే పట్టణంలో అన్ని కూడళ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి అయినా మట్టి అక్రమ తరలింపుపై కేసులు నమోదు చేయవచ్చు. – అరుణ్‌కుమార్, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, కదిరి మట్టి మాఫియాగా మారిన తెలుగు తమ్ముళ్లు రోజూ రాత్రి వేళల్లో చెరువు నుంచి మట్టి తరలింపు మరోవైపు సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే ఆర్భాటం -
అభివృద్ధి కుంటుపడింది
రాష్ట్రంపై అప్పుల భారం పెరిగినప్పటికీ, సంక్షేమం, అభివృద్ధి మాత్రం కుంటుపడింది. వర్షాలు లేక ఈ సారి రైతులు పంటల సాగుకు విరామం ఇచ్చారు. వరుసగా పంటలు నష్టపోతున్నా ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. దీంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. అప్పుల భారంతో ఇటీవలే బత్తలపల్లిలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. రైతులకు సంక్షేమం కావాలంటే, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త -
నిలుద్దాం... గెలుద్దాం
పెనుకొండ రూరల్: ‘విజయమే లక్ష్యం కావాలి. ఎవరెన్ని కేసులు పెట్టినా...ఎవరెంత భయపెట్టినా వెనక్కు తగ్గేది లేదు..స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలుద్దాం...గెలిచి చూపిద్దాం’ అంటూ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బుధవారం పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. ముందుగా దివంగత నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విజయానికి దోహదపడే అంశాలను వైఎస్సార్ సీపీ శ్రేణులకు నేతలు వివరించారు. విజయఢంకా మోగిద్దాం.. నాయకులు, కార్యకర్తలు అన్న తేడా మరచి అందరం సమష్టిగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయఢంకా మోగిద్దామని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. నాయకులు క్షేత్రస్థాయిలో కేడర్‌కు భరోసా ఇవ్వాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో స్పష్టత ఉండాలన్నారు. పార్టీ కోసం చేసిన సేవలు, వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నేతలు బనాయించే అక్రమ కేసులను పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. సమావేశంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు రమేష్ రెడ్డి, పెనుకొండ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు మధుమతి, మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు వైటీ ప్రభాకర్ రెడ్డి, తిప్పేస్వామి, అత్తార్ చాంద్ బాషా, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వక్కలిగ సాధికారిత విభాగం అధ్యక్షుడు రంగేగౌడ్, అనుబంధ విభాగాల నాయకులు, కన్వీనర్లు పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ చంద్రబాబు రెండేళ్ల పాలనపై పార్టీ రూపొందించిన వెన్నుపోటు పార్టీ...వెన్నుపోటు పాలన’ పోస్టర్లను పార్టీ నేతలు ఆవిష్కరించారు. అనంతరం మిథున్‌రెడ్డి పార్టీ ముఖ్యనేతలకు పార్టీ ఐడీ కార్డులు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగిద్దాం పార్టీ శ్రేణులకు ఎంపీ మిథున్ రెడ్డి దిశానిర్దేశం అరాచకపాలనకు చరమగీతం పాడుదామని పిలుపు ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని వెల్లడి పెనుకొండలో వైఎస్సార్‌ీసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం -
విజయ ఢంకా మోగిద్దాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి అరాచక పాలన అంతానికి నాంది పలుకుదాం. ఎన్నికల్లో కూటమి నేతలు అబద్ధపు హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఒక్క పథకాన్నీ సంపూర్ణంగా అమలు చేయలేదు. బీసీలకు 50 ఏళ్లకు ిపింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. పక్క రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నా... మనరాష్ట్రం మాత్రం వర్షాలు లేక ఏడారిగా మారుతోంది. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటాయి. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకపోవడంతో రైతులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి దాపురించింది. ప్రతి కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేందుకు సమష్టిగా కష్టపడాలి. – ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ -
దొంగల ముఠా అరెస్ట్
ధర్మవరం అర్బన్: ఆలయాలను టార్గెట్ చేసి వరుస చోరీలతో రెచ్చిపోయిన ముగ్గురు సభ్యులు గల ముఠాను ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.20.35 లక్షల విలువైన సొత్తు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సతీష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఏడు ఆలయాల్లో చోరీలు.. ధర్మవరం మండలం పోతుకుంట బీసీ కాలనీకి చెందిన సిల్లా నాగరాజు, అతని కుమారుడు సిల్లా శివ రోజువారీ కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి బుక్కపట్నంలోని కుమ్మరివీధికి చెందిన చింతకాయల నవీన్‌కుమార్ పరిచయం అయ్యాడు. ముగ్గురూ కలిసి వివిధ ప్రాంతాల్లో కూలి పనులు చేశారు. ఆ సమయంలోనే సులభంగా డబ్బులు సంపాదించాలని భావించారు. ఇందుకు చోరీలను ఎంచుకున్నారు. అయితే ఇళ్లలో చోరీలకు ప్రయత్నిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన వారు...ఆలయాలను కన్నం వేసేందుకు నిర్ణయించుకున్నారు. సీసీ కెమెరాలు లేని ఆలయాలను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడ్డారు. కనగానపల్లి మండలంలో రెండు దేవాలయాలు, ధర్మవరం రూరల్ పరిధిలో మూడు దేవాలయాలు, బత్తలపల్లి మండలంలో రెండు దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. ఆలయాల్లో వరుస చోరీలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మవరం డీఎస్పీ జగన్నాథరాజు పర్యవేక్షణలో ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ రాజశేఖర్, చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ, పట్నం ఎస్ అర్షద్‌లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీరంతా దొంగల కోసం విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలోనే బుధవారం ధర్మవరం మండలం కుణుతూరు గ్రామ శివారులోని ఎస్ఎల్వి రైస్ మిల్ సమీపంలో తచ్చాడుతున్న ముగ్గురు నిందితులను ధర్మవరం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..ఆలయాల్లో జరిగిన వరుస చోరీల గుట్టు వీడింది. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు... వారి వద్ద నుంచి రూ.20.35 లక్షల విలువైన 6.750 కిలోల వెండి వస్తువులు, 40 కిలోల ఇత్తడి వస్తువులు, డోలు, ఆరు యాంప్లిఫ్లైయర్లు, రూ.90 వేల నగదు, చోరీలకు ఉపయోగించే కట్టర్, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసులను చేధించడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ అభినందించి సర్టిఫికెట్లు అందించారు. ఆలయాల్లోని బంగారు, వెండి ఆభరణాలను సురక్షితంగా భద్రపరచాలని సూచించారు. రూ.20.35 లక్షల సొత్తు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్‌కుమార్ -
‘వరి’లో జాగ్రత్తలు పాటించండి
పుట్టపర్తి అర్బన్: ప్రస్తుతం సాగు చేసిన వరి పంటలో పలు జాగ్రత్తలు పాటించి ఆశించిన దిగుబడులు సాధించాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5120 హెక్టార్లలో వరి పంట సాగు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వరి పంట పిలక దశ నుంచి పొట్ట దశలో ఉందన్నారు. బుధవారం పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన అక్కడక్కడా పంటను నల్లి ఆశించినట్లు గుర్తించామన్నారు. దాని నివారణకు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్న, పెద్ద నల్లి పురుగులు ఆకుల అడుగు భాగానికి చేరుకొని రసం పీల్చడంతో ఆకులు పసుపు రంగులోకి మారి క్రమేపి ఎండిపోయినట్లుగా కనిపిస్తుందన్నారు. బెట్ట పరిస్థితుల్లో పురుగు ఉధృతి అధికంగా ఉంటుందన్నారు. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం పొడి మూడు గ్రాములు, లేకపోతే ప్రొఫినోపాస్ 2 మి.లీ లేకపోతే ఓమైట్ 1 మి.లీ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వ్యక్తి ఆత్మహత్య కదిరి అర్బన్: మండల పరిధిలోని కదిరి కుంట్లపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదినారాయణరెడ్డి (68) మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఆదినారాయణరెడ్డి కడుపునొప్పితో బాధపడుతుండేవాడని, ఈ క్రమంలో కడుపు నొప్ప భరించలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడని మృతుని బంధువులు చెబుతున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రి తరలించారు. రూరల్ మండల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఇసుక టిప్పర్ల పట్టివేతముదిగుబ్బ: కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ అధికారులు బుధవారం జరిపిన ఆకస్మిక దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు టిప్పర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మైనింగ్ అధికారులు అమీర్‌బాషా, సునీతబాయి మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టుబడిన టిప్పర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి
పుట్టపర్తి: ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లకు ఈ నెల 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ లాజరు పేర్కొన్నారు. బుధవారం ఆయన మడకశిర, పెద్దమంతూరు, రాళ్లపల్లి, మావటూరు తదితర స్కూళ్లు, కళాశాలల్లో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై అవగాహన కల్పించి పోస్టర్లు ప్రదర్శించారు. చదువు మానేసిన వారు తిరిగి కొనసాగించేందుకు ఓపెన్ స్కూల్ అద్భుతమైన అవకాశమన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు చెల్లించాలని సూచించారు. జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక సోమందేపల్లి(పరిగి): ఇన్స్పైర్ మనాక్ అవార్డు కోసం నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు సోమందేపల్లి మండలంలోని జూలకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్. విష్ణువర్దన్‌రెడ్డి ఎంపికయ్యాడు. ఈమేరకు గైడ్ టీచర్ నరసింహమూర్తి వివరాలను తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాలను ప్రోత్సహించడానికి ఇన్స్పైర్ మనాక్ అవార్డులు అందిస్తారన్నారు. ఇందులో తమ పాఠశాలకు చెందిన విష్ణువర్దన్‌రెడ్డి విత్తనాలు తడవకుండా ఎండబెట్టే ప్రాజెక్టుతో ఇటీవల జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయిల పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఈ ప్రాజెక్టు అత్యుత్తమమైనదిగా భావించిన నిర్వాహకులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. విష్ణువర్దన్‌రెడ్డి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించి, హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో రాణించి అవార్డు తీసుకురావాలని ఆకాంక్షించారు. నీటి కోసం మహిళల నిరసన తలుపుల: పదిరోజులుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా..అధికారులు పట్టించుకోకపోవడంతో తలుపుల సంగం బజార్‌కు చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ...తాము పది రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా...అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాగునీటి సమస్యపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి మహిళలకు సర్దిచెప్పారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి రవణప్పనాయుడుని పిలిపించారు. ఆయన వచ్చి తాగునీటి సమస్య పరిష్కారమయ్యే వరకూ తాత్కాలికంగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తామని చెప్పడంతో మహిళలు శాంతించారు. రూ.6 కోట్లతో పరార్ ● చీటీలతో పాటు భారీగా అప్పులు ● రాత్రికి రాత్రే ఉడాయించిన డ్వామా ఉద్యోగి కదిరి టౌన్: డ్వామా టెక్నికల్ అసిస్టెంట్ వీరారెడ్డి చీటీలు, డైలీ కలెక్షన్ పేరుతో దాదాపు రూ.6 కోట్ల దాకా మోసం చేసి పరారయ్యాడు. బాధితుల వివరాల మేరకు.. కదిరికి చెందిన వీబీజీ రామ్‌జీ టెక్నికల్ అసిస్టెంట్ వీరారెడ్డి పదేళ్లుగా డబ్బులు వడ్డీకి ఇవ్వడంతో పాటు చిట్టీలు నిర్వహించేవాడు. నమ్మకంగా డబ్బులు వెనక్కు ఇస్తుండటంతో డ్వామా కార్యాలయంలోని టెక్నికల్ ఇంజనీర్లు, టెక్నికల్ అసిస్టెంట్లతోనే దాదాపు రూ.30 లక్షలు, జ్ఞానేశ్వర్రెడ్డితో రూ.40 లక్షలు, ఎస్పీఎస్ మెడికల్ స్టోర్ నిర్వాహకుడితో రూ.18 లక్షలు, కమలాకర్ మూర్తితో రూ. 5 లక్షలు, రామాంజనేయనాయక్ రూ.5 లక్షలు, అలాగే ఇతరులతో పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. మొత్తంగా రూ.6 కోట్ల దాకా వసూలు చేశాడు. చీటీలు ఎత్తిన వారికి డబ్బులు ఇవ్వకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చి అతని ఇంటి వద్దకు బాధితులు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. -
జగన్‌తోనే సస్యశ్యామలం
పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా కరుణిస్తుంది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తప్పడం లేదు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లేవి. పొలాలు పచ్చగా కళకళలాడేవి. నేడు ఆ పరిస్థితులు లేవు. చంద్రబాబు కరువుకు మారుపేరు. మళ్లీ రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్నా, పొలాలు పచ్చగా మారాలన్నా వైఎస్ జగన్ సీఎం కావాలి. –దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
రొళ్ల: ఒంటరిగా ద్విచక్ర వాహనంలో వెళ్లే వారిని టార్గెట్ చేస్తూ బంగారు ఆభరణాలను కాజేస్తున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగ మహమ్మద్ ఇరానీ ఆలీని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎస్ఐ కె.నరసింహుడు విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మే 23న టీడీ పల్లికి చెందిన తిమ్మారెడ్డి ద్విచక్ర వాహనంలో రొళ్లకు వస్తున్నాడు. మార్గ మధ్యలో హెచ్ఎం పల్లి గ్రామ సమీపాన అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న గుడిబండ ప్రధాన రోడ్డు పక్కన వెలసిన బైలాంజనేయస్వామి ఆలయం వద్దకు రాగానే మహమ్మద్ ఇరానీ ఆలీతో పాటు ఆయన మామ అబ్బస్ ఇద్దరు స్కూటీలో వచ్చి తిమ్మారెడ్డి వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు. ముందు వెళ్లేదారిలో పోలీసులు ఉన్నారని, వాహనానికి సంబంధించిన రికార్డులు చూపాలని మాట కలిపి తిమ్మారెడ్డి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని దౌర్జన్యాంగా లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాతీయ రహదారిలో ఓ షాపు వద్ద అమర్చిన సీసీ ఫుటేజీ ఆధారంగా ముద్దాయిని గుర్తించారు. రంగనపల్లి క్రాస్ వద్ద అరెస్ట్... రొళ్ల మండలం రంగనపల్లి క్రాస్ వద్ద ముద్దాయి మహమ్మద్ ఇరానీఆలీ తన స్కూటిలో హిందూపురం నుంచి రొళ్లకు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని జేబులో బంగారు ఉంగరం దొరికింది. వెంటనే అతన్ని పోలీసుల శైలిలో విచారణ చేశారు. నిందితుడిది మహారాష్ట్రలోని థానే జిల్లాలో అంబావలి అని, రెండేళ్లక్రితం హిందూపురంలో వివాహం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అప్పుడప్పుడూ సొంత ఊరికి వెళ్లొచ్చేవాడన్నారు. దీనికి తోడు హిందూపురంలోని ఓ హోటల్లో వంట మనిషిగా కూడా పని చేసేవాడని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని తన మామ అయిన అబ్బాస్‌తో చిన్న దొంగతనాలతో పాటు ఒంటరిగా ద్విచక్ర వాహనంలో తిరుతున్న వారిని టార్గెట్ చేసేవాడని పేర్కొన్నారు. బంగారు చైన్, ఉంగరాలను లాక్కొని వెళ్లేవారన్నారు. ముద్దాయి మామ అబ్బాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. మహమ్మద్ఇరానీఆలీని అరెస్ట్ చేసి మడకశిర జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) న్యాయమూర్తి అశోక్‌కుమార్ ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించారు. నేరం చేయడానికి ఉపయోగించిన స్కూటీతో పాటు బంగారు ఉంగరాన్ని సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి పెళ్లి
● దగ్గరుండి వివాహం జరిపించిన ట్రాన్స్జెండర్లు కణేకల్లు: ప్రేమకు లింగభేదాలు కూడా అడ్డురావని నిరూపించారు జాను, వంశీ. ట్రాన్స్‌జెండర్‌ను యువకుడు పెళ్లిచేసుకోవడంతో కణేకల్లులోనే కాదు సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కణేకల్లుకు చెందిన ట్రాన్స్‌జెండర్ జానుతో డీ.హీరేహళ్ మండలం గొడిసెలపల్లికి చెందిన వంశీకి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్లు ఇద్దరూ ప్రేమించుకొన్నారు. ప్రేమించిన జానుతో జీవితాంతం కలిసి ఉండి ఆమె జీవితంలో వెలుగులు నింపాలని నిర్ణయించుకొన్నాడు వంశీ. కొద్ది రోజుల క్రితమే ఈ విషయాన్ని జానుకూ చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. దీంతో బుధవారం కణేకల్లు బస్టాండ్‌లోని నాగులకట్ట వద్ద మనసా, వాచా, కర్మణా అంటూ జానూ మెడలో వంశీ మూడు ముళ్లూ వేశాడు. సహచర ట్రాన్స్ జెండర్లు దగ్గరుండి ఈ వివాహాన్ని జరిపించారు. తమ జానుకు పెళ్లికావడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
హిందూపురం టౌన్: పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈనెల 5, 6 తేదీల్లో నిర్వహించిన 7వ దక్షిణ మండల పెంకాక్ సిలాట్ చాంపియషిప్–2026లో హిందూపురానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మొత్తం 8 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో హిందూపురానికి చెందిన డి.సానియా సీనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. సీనియర్ విభాగంలో దక్షిణ మండల స్థాయిలో ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. ఈ విజయంతో సానియా జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. అలాగే హిందూపురానికి చెందిన జి.రుచిత పోరాట విభాగంలో రజత పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా ఇరువురు క్రీడాకారులతో పాటు కోచ్ ఎన్ఆర్ ప్రవీణ్‌కుమార్‌ను పలువురు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి మరిన్ని పతకాలు సాధించాలని పెంకాక్ సిలాట్ జిల్లా అసోసియేషన్ నాయకులు ఆకాంక్షించారు. ఇద్దరు అంతర్రాష్ట దొంగల అరెస్ట్పుట్టపర్తి టౌన్: ఇటీవల సంస్కృతి కళాశాలలో జరిగిన చోరీ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు అంతర్రాష్ట దొంగలను పుట్టపర్తి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7.5 లక్షల నగదు, వాచ్, స్టీల్ రాడ్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జూలై 23న బీడుపల్లి సమీపంలో ఉన్న సంస్కృతి కళాశాలలోని అకౌంట్స్ విభాగంలోకి గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి చొరబడి అల్మారాను పగులగొట్టి అందులో భద్రపరచిన రూ.17,45,450 నగదును అపహరించి పరారయ్యారు. ఈ విషయంపై కళాశాల సిబ్బంది అశోక్ పుట్టపర్తి అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు కోణాల్లో ఆధారాలను సేకరించి ప్రధాన నిందితుడు అలెక్స్ మనోహర్ (మురళీ)ను శనివారం మామమిళ్లకుంట క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.4.5 లక్షల నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న మరో ఇద్దరు దొంగలు.. బిహార్ రాష్ట్రానికి చెందిన కాజూరామ్ అలియాస్ ఆకాష్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజయ్ చౌహన్ అలియాస్ బేదిని పుట్టపర్తి ఎయిర్ పోర్టు వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7.5 లక్షల నగదు, వాచ్, స్టీల్ రాడ్ స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన అర్బన్ సీఐ యువరాజ్‌తో పాటు సిబ్బంది అశోక్, ఉదయ్‌భాస్కర్, వన్నూరప్ప, నాగరాజు, శ్రీరాములు, మనోహర్, పుల్లప్ప, నరసింహమూర్తి, సుధాకర్, దస్తగిరి, జనార్దన్‌రెడ్డి విశ్వనాథ్, భాస్కర్, చలపతిని డీఎస్పీ సత్యనారాయణ అభినందించారు. -
నేడు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
పెనుకొండ రూరల్: స్థానిక సంస్థల సమరానికి వైఎస్సార్సీపీ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా బుధవారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని పట్టణంలోని ఎన్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.00 గంటలకు విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గుక్కెడు నీళ్లివ్వండి సారూ..తనకల్లు: మండల పరిధిలోని కోటపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో కోటపల్లి– మల్లిరెడ్డిపల్లి రోడ్డుపై మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు మహిళలు మాట్లాడుతూ మంచినీటి బోర్లు పనిచేయకపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాగునీటి కోసం ప్రభుత్వం వేయించిన బోర్లలో నీరు రాకపోవడంతో కిలో మీటర్ల దూరంలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి రైతులకు బతిమాలి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. తాగునీటి సమస్యతో నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించకపోతే మండల పరిషత్ కార్యాలయం ఎదుట పెద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అర్హులందరికీ పింఛన్ అందాలిధర్మవరం అర్బన్: అర్హత కలిగిన వారందరికీ సామాజిక పింఛన్ అందేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ధర్మవరం పట్టణంలోని 15వ వార్డు గాంధీనగర్ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో నూతన పింఛను దరఖాస్తుల స్వీకరణ, వెరిఫికేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించాలన్నారు. దరఖాస్తుల వెరిఫికేషన్, ఈ–కేవైసీ నమోదులో జాప్యానికి తావులేకుండా నిర్దేశిత సమయానికే అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రామభూపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, సచివాలయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలకై నా సరే రిజిస్ట్రేషన్ చేయను ● ఏపీఐఐసీ, ‘పురం’ సబ్ రిజిస్ట్రార్ మధ్య వాగ్వాదం చిలమత్తూరు: పరిశ్రమలకై నా డీ నోటిఫై చేసినట్టు ఆధారాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానంటూ సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ ఏపీఐఐసీ అధికారులతో దురుసుగా మాట్లాడటం కలకలం రేపుతోంది. కొటిపి ఎంఎస్ఎంఈ పార్కులో మొత్తం 72.95 ఎకరాలు భూమి ఉండగా, వాటిలో ముగ్గురుకి 15 సెంట్లు చొప్పున రిజిస్ట్రేషన్ చేయించడానికి ఏపీఐఐసీ అధికారులు మంగళవారం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. ఏపీఐఐసీ అధికారులు ఏ భూమి అయితే చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నారో ఆ భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉండటంతో దాన్ని సాకుగా చూపి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్‌కు నిరాకరించారు. అలాగే మరో సబ్‌రిజిస్ట్రార్ వాటిని రిజిస్ట్రేషన్ చేస్తారని, ఆయన సెలవులో ఉన్నారని, ఆయన వచ్చిన తరువాత చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ఏపీఐఐసీ అధికారులు ఆగ్రహించి పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ఇలా అసంబద్ధమైన కారణాలు చూపడం సరికాదన్నారు. డీనోటిఫై చేసిన ఆధారాలు తీసుకురండి అప్పుడు చేస్తాం అని సమాధానం రావడంతో వారు చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే ఎమ్మెల్యే పీఏలే రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపారన్న చర్చ జరుగుతోంది. -
కదలని బండికి బిల్లులు !
కదిరి టౌన్: కదలని బండికి మరమ్మతుల పేరుతో బిల్లులు చేసుకొని మెక్కేశారు కదిరి మున్సిపాలిటీ అధికారులు. కదిరి మున్సిపాలిటీ పారిశుధ్య వాహనం (ఏపీ39ఎక్స్2793) తుప్పుబట్టిపోయింది. రెండేళ్లుగా దాన్ని వినియోగించడం లేదు. అయితే సచివాలయ ఉద్యోగి పరమేష్ తప్పుడు బిల్లులు సృష్టించి రూ.2.30 లక్షలు స్వాహా చేశాడు. వేరే వాహనాల ఫోటోలను ఉపయోగించి వాహనానికి మరమ్మతు చేసినట్లు చూపించారు. కాంట్రాక్టర్ ఎ.బయప్పరెడ్డి పేరుతో ఎస్టిమేషన్, కొటేషన్ పత్రాలతో డబ్బు నొక్కేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ సందీప్ సంతకాలతో ఉన్న ఎం బుక్ ఫైళ్లు 943160, 943166, 943170 పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయ ఉద్యోగి అయినా... వాస్తవానికి నిజాంవలి కాలనీ సచివాలయ వార్డు శానిటేషన్ సెక్రటరీగా పనిచేయాల్సిన పరమేష్ పైరవీలతో కమిషనర్‌కు పీఏగా కొనసాగుతున్నారని చెబుతున్నారు. దీన్నే అస్త్రంగా చేసుకొని మున్సిపల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ డీజిల్, వాహన రిపేర్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారంటున్నారు. ఒక ప్రజాప్రతినిధితో పాటు గతంలో పనిచేసిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారి ఆధ్వర్యంలో చక్రం తప్పారంటున్నారు. వాహనం రిపేరీ బిల్లులే కాకుండా కొన్నేళ్లుగా కదిరి నియోజకవర్గంలోని వివిధ శాఖల్లో జరిగిన పనులు, టెండర్ల, కాంట్రాక్టులు, వాహన రిపేర్లు, డిజిల్ కొనుగొళ్లు, బిల్లులు, చెల్లింపులపై కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రిపేరీల బిల్లులు, ఎం బుక్‌లు, ఎస్టిమేషన్లు, కొటేషన్లు, వర్క్ ఆర్డర్లు, ఓచర్లు పరిశీలించాలని, అలాగే పైళ్లను పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తే అన్ని నిజాలు బయట పడతాయని స్థానికులు చెబుతున్నారు. అడిగితే సంతకం చేశా... ఈ వ్యవహారంపై గతంలో ఇన్చార్జ్ కమిషనర్‌గా ఉన్న సందీప్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తాను ఏ తప్పుచేయలేదని, బిల్లులు కూడా పెట్టలేదన్నారు. ఎంబుక్‌లో మూడుచోట్ల సంతకాలు ఎలా చేశారని ప్రశ్నించగా.. అడిగితే సంతకం పెట్టాను కాని బిల్లులు చేయలేదన్నారు. కదిరి మున్సిపాలిటీలో బట్టబయలైన అవినీతి రిపేరీ బిల్లుల పేరుతో దాదాపు రూ.2.30 లక్షలకుపైగా స్వాహా ఎంబుక్లపై అధికారుల సంతకాలు -
స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసుల సత్తా
పుట్టపర్తి టౌన్: గుంటూరులో నాగార్జున, విట్ యూనివర్సటీలో నిర్వహించిన ఏపీ పోలీస్ స్పోర్ట్స్‌లో జిల్లా పోలీసులు అద్భుతమైన ప్రతిభచూపి 17 పతకాలు సాధించారు. ఇందులో భాగంగానే మంగళవారం తన చాంబర్లో ఎస్పీ సతీష్‌కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురానా వారిని అభినందించారు. వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, కోకో, యోగా ,400 మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం తదితర క్రీడల్లో జిల్లా చెందిన 23 మంది మూడు స్వర్ణ, 3 రజత, 11 కాంస్య పతాకాలు మొత్తం 17 పతాకాలు సాధించారు. కబడ్డీలో గోరంట్ల సీఐ శేఖర్ కాంస్య, ఏఆర్ ఆర్ఎస్ఐ వీరన్న క్రికెట్, ఖోఖోలో రజత, కాంస్య పతకాలు, సంజీవరాయుడు, మురళీమోహన్, సంజప్ప, రాంప్రసాద్, ఈశ్వర్, వీరానాయక్ ఖోఖో పోటీల్లో కాంస్య పతకాలు, ప్రసాద్ 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెం పోటీల్లో స్వర్ణ పతకం, పద్మశ్రీ పవర్ లిప్టింగ్లో స్వర్ణ పతకం, బ్యాడ్మింటన్‌లో రజత, 400 మీటర్ల రిలేలో రజత పతకాలు సాధించారు. అలాగే మంజమ్మ యోగాలో రజత కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఎస్పీ సతీష్ మాట్లాడుతూ క్రీడలు సిబ్బందిలో శారీర దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెంపొందిస్తాయన్నారు. స్పోర్ట్స్‌లో ప్రతిభచూపి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన పోలీస్ క్రీడాకారులు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాని ఆకాంక్షించారు. 17 పతకాలు సాధించడంతో అభినందించిన ఎస్పీ -
పొలం ఆక్రమణకు కుట్రలు
ధర్మవరం రూరల్: తాను సాగు చేస్తున్న పొలాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండల పరిధిలోని పోతులనాగేపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు కంభం చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తెలిపిన మేరకు.. సర్వే నంబర్ 103–2లోని 4.03 ఎకరాల భూమిలో చంద్రమ్మ 20 ఏళ్లుగా కంది, ఉలవ, వేరుశనగ పంటలు సాగు చేస్తోంది. 2007లో రెండు ఎకరాల 52 సెంట్లకు ప్రభుత్వం డీ పట్టా ఇచ్చింది. మిగిలిన ఎకరా 50 సెంట్లలోనూ ఆమె 20 ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటోంది. వేలాది రూపాయలు ఖర్చు చేసి భూమిలో ఉన్న రాళ్లు, గుట్టలు తొలగించి సాగు భూమిగా మార్చింది. ఈ ఏడాది పొలంలో కంది పంట సాగు చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రమ్మ భూమిపై కొందరి కన్ను పడింది. వెంకటలక్ష్మి అనే పేరు మీద నకిలీ పట్టా తెచ్చుకున్నారు. కొన్ని రోజులుగా ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్డీఓ కోర్టులో కేసు వేసినా పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మహిళా రైతు కోరారు. మహిళా రైతు ఆవేదన -
ఇవేం విద్యుత్ కోతలు బాబూ...
ఓడీచెరువు: వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో కోతలను నివారించి , సక్రమంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని మండల పరిధిలోని కొండకమర్ల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలతో పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఓ పక్క వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని, దీనికి తోడు విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో సాగు మరింత భారమైందని వాపోయారు. సమాచారం అందుకున్న విద్యుత్‌శాఖ ఏఇడీ ఓబులేసు, ఏఇ గౌరీశంకర్రెడ్డి సబ్‌స్టేషన్ చేరుకొని రైతులతో చర్చించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పశువధశాల నిర్వహిస్తున్న నలుగురి అరెస్ట్హిందూపురం టౌన్: పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువధశాలను నిర్వహిస్తున్న నలుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ మహేష్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 5న మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, టూటౌన్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా పట్టణంలోని రహమత్‌పురం, సూరప్పకట్ట ప్రాంతంలో నిర్వహిస్తున్న పశువుల కొట్టాలను తనిఖీ చేశారన్నారు. అయితే వధ చేయడానికి ఉంచిన 9 ఆవులు, 55 దూడలను గుర్తించి, వాటిని సంరక్షణ నిమిత్తం గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. వాటిని నిర్వహిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. -
ట్యాంకర్లతో నీటి సరఫరా
ఓడీచెరువు: ‘తాగునీటి కోసం అష్టకష్టాలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఓడీ చెరువు మండలం దొన్నికోటవారిపల్లిలో మంగళవారం ట్యాంకర్లతో నీటి సరఫరా చేపట్టారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే క్రమంలో ఉంట్లవారిపల్లిలో బోరుబావిలో నుంచి మోటారు తీసి మరమ్మతుల నిమిత్తం తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. గంగప్పకు పెన్షన్ మంజూరు కదిరి అర్బన్: కదిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేసి 2019 జూన్‌లో రిటైర్డ్ అయిన గంగప్పకు ఎనిమిదేళ్ల అనంతరం పెన్షన్ మంజూరు చేశారు. గంగప్ప సమస్యపై ఈ ఏడాది మే 21న ‘సాక్షి’లో ‘ఎనిమిదేళ్లయినా పెన్షన్ లేదు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన అధికారులు కావాల్సిన పత్రాలు తెప్పించుకుని పెన్షన్ మంజూరు చేశారు. ప్రస్తుతం గంగప్పకు నెలకు రూ.3,335 పెన్షన్, అరియర్స్ రూ.2.88 లక్షలు మంజూరు చేశారు. దీంతో గంగప్ప ఆనందం అంతా ఇంతా కాదు. రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ నాయకుడి మృతి మడకశిర రూరల్: మండల సరిహద్దులో కర్ణాటక రాష్ట్రంలోని చంద్రబావి వద్ద సోమవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మడకశిర మండలం జాడ్రపల్లికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి నాగభూషణరెడ్డి సోదరుడి కుమారుడు, యువ నాయకుడు అశోక్‌కుమార్‌రెడ్డి (28) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బెంగళూరుకు తరలించగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. అశోక్‌కుమార్ రెడ్డి మృతితో జాడ్రపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. అశోక్‌కుమార్‌రెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ నాయకులు, రెడ్డి సంఘం నాయకులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు. యువకుడి బలవన్మరణం పరిగి: మండలంలోని శ్రీరంగరాజుపల్లిలో యూసూఫ్‌ఖాన్ కుమారుడు మైదీన్ సాబ్ (22) అనే యువకుడు బలవన్మరణం పొందాడు. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యూసూఫ్‌ఖాన్, షాహీమ్ దంపతుల పెద్ద కుమారుడు మైదీన్సాబ్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయినా, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లో ఫ్యానుకు చీర బిగించి మెడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి షాహీమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ప్రాణాంతక వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి బత్తలపల్లి: ప్రాణాంతక వ్యాధులపై యువతకు అవగాహన ముఖ్యమని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. శక్తి మైత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా మంగళవారం బత్తలపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ హెచ్ఐవీపై యువతకు అవగాహన ఉండాలన్నారు. అంతకు ముందు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగరత్నమ్మ, ఎల్‌డబ్ల్యూ ఆనంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడుదాం
ప్రశాంతి నిలయం: ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన ‘‘మట్టి గణపతిని చేద్దాం...కాలుష్యాన్ని తగ్గిద్దాం’ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల కాలుష్యం పెరుగుతుందన్నారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ప్రకృతి పరిరక్షించవచ్చన్నారు. ఏఈ శశికళ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన ఫలితాలు సాధించాలి ప్రశాంతి నిలయం: ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా శాఖల అధికారులు పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలకు అన్ని విధాలు ఆయా శాఖల అధికారులు సన్నద్ధం కావాలన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
ఆరు నెలలుగా తిరుగుతున్నా కనికరమేదీ..?
రొద్దం: మండల పరిధిలోని నల్లూరు దళిత వాడకు చెందిన రామప్ప తన వ్యవసాయ పొలం వద్ద రేకుల షెడ్డు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే షెడ్డుకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని ఆరు నెలల క్రితం సింగిల్ ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నా ట్రాన్స్‌కో వారు కనికరించడం లేదు. గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉండడంతో కటిక చీకట్లో జీవనం సాగించాల్సి వస్తోందని రామప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకటి, రెండు రోజులు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని వాపోయాడు. రాత్రి వేళ కటిక చీకట్లో పాములు, అడవి జంతువుల భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తోందని చెప్పాడు. ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులైనా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నాడు. దళితుడి సమస్యపై ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం -
తప్పు ఎల్‌నినోది కాదు.. ఎల్లో ప్రభుత్వానిదే
ధర్మవరం: ఎల్‌నినో కంటే ఎల్లో ప్రభుత్వమే రైతులను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం బత్తలపల్లి మండల పరిధిలోని ఈదుల ముష్టూరులో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు ఆయన ఎదుట సమస్యలను ఏకరువు పెట్టారు. తొలుత రైతు పెద్దన్న మాట్లాడుతూ పొలంలో బోరు బావులు ఎండిపోవడంతో ఈ రెండేళ్లలో ఏకంగా 16 దాకా బోర్లు వేసినా చుక్క నీరు పడక పోవడంతో అప్పుల పాలైనట్లు కన్నీటి పర్యంతమయ్యారు. చేసేది లేక 300 దాకా చీనీ చెట్లును తొలగించానని, బోర్లు వేసేందుకు రూ.14 లక్షల దాకా అప్పులు చేశామన్నారు. రైతులు బత్తిని శ్రీనన్న, శివమ్మలు మాట్లాడుతూ పొలంలో నీళ్లు చాలక పోవడంతో పశుగ్రాసం కూడా దొరకక రూ.90 వేలకు కొనుగోలు చేసిన పశువులను రూ.25 వేలకే అమ్ముకున్నామన్నారు. నీళ్లు వదలకపోతే ఎడారి కావడం ఖాయం ధర్మవరం నియోజకవర్గంలో అవగాహన లేని పాలకుల చేతకాని తనంతోనే రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. బత్తలపల్లి మండలంలోని ఈదుల ముష్టూరు, ఎర్రాపల్లి, పోట్లమర్రిలకు పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా నీరు వదిలి చెరువులు, కుంటలకు నీళ్లు వదిలారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో నీళ్లు వదలకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని శారస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా రావాల్సిన నీటిని చెరువులకు వదలలేదన్నారు. ఫలితంగా ఈ యేడాది వర్షాలు కురవక భూగర్భ జలాలన్నీ అడుగంటి పోయాయన్నారు. తప్పు ఎల్‌నినోది కాదని ఎల్లో ప్రభుత్వానిదేనన్నారు. వాటర్ మ్యాన్ అంటూ ప్రచారం చేయించుకోవడం, డాక్టరేట్లను డబ్బులిచ్చి కొనడం వంటి షోలు మానేసి రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి సత్యకుమార్‌కు కేతిరెడ్డి చురకలంటించారు. పీఏబీఆర్ నీటిని కాలువల ద్వారా వదిలి భూగర్భ జలాలు పెంపొందించకపోతే ధర్మవరం నియోజకవర్గం ఎడారి కావడం ఖాయమన్నారు. నీటి విడుదల కోసం ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ వెంగళరెడ్డి, మండల కన్వీనర్ గుమ్మళ్లగుంట జయరామిరెడ్డి, మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, జిల్లా కమిటి నాయకులు ముష్టూరు నరసింహారెడ్డి, కోటి సురేష్, కోటి నరేష్కుమార్, నాయకులు జాంపుల చంద్రమోహన్, యోగానందాచారి, బండి వీరనారప్ప, ఈడిగ కాశప్ప, రాజవీరారెడ్డి, దివాకర్‌రెడ్డి, మల్లిరెడ్డి,శ్రీనివాసరెడ్డి బ్రదర్స్, అక్కిం దామోదర్, కొండారపల్లి ఈశ్వరయ్య, రాంభూపాల్‌రెడ్డి, బండి నాగభూషణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి -
కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి
ప్రజల అవసరాలకు సంబంధించిన తాగునీటి పథకం నిర్వహణకు కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. దీంతో కార్మికులకు ఉద్యోగ భద్రత, రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట పడుతుంది. తొలగించిన 23 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పూర్తి వేతనాలు, పీఎఫ్ చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మికులకు న్యాయం జరిగే వరకు సీఐటీయూ పోరాటం కొనసాగిస్తుంది. –ఎస్.నాగేంద్రకుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
విద్యుత్ సరఫరాలో విఫలం
రాప్తాడు రూరల్: రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా పెంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయి, రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడుతోందని ఆరోపించారు. మంగళవారం హంపాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరాను పెంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటల విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే రాప్తాడు నియోజకవర్గంలో మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం 7 గంటలైనా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను చులకనగా చూస్తున్నారు విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, విద్యుత్ కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేవని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రైతుల కష్టాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు సత్తిరెడ్డి, గద్దె కేశవరెడ్డి, మండల కన్వీనరు సాకే వెంకటేశు, మాజీ కన్వీనరు శేఖర్, యూత్ కన్వీనరు విశ్వనాథరెడ్డి, హంపాపురం సింగారప్ప, చుక్కా సంజీవరాయుడు, రామినేపల్లి మాధవరెడ్డి, మన్నల రవికుమార్, రాప్తాడు చిరుతల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర విచారణ చేపట్టాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యవేక్షణ పూర్తిగా కుప్పకూలింది. ఆర్డ్డబ్ల్యూఎస్ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలకు నిరంతర తాగునీరు అందించడం పక్కనబెట్టి.. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ ప్రజల హక్కులను తాకట్టు పెడుతున్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టుపై హై లెవల్ కమిటీతో సమగ్ర విచారణ జరపాలి. అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. –వెన్నపూస రవీంద్రారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం -
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
కదిరి టౌన్/నల్లచెరువు/ముదిగుబ్బ: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప, జి.సునీత, కె.లక్ష్మీ, కె.సాయిరాం, కె.మల్లేశ్వరరావుతో పాటు అధికారులతో కలిసి నల్లచెరువు, కదిరి ,ముదిగుబ్బ మండలాల్లో పర్యటించారు. తొలుత నల్లచెరువు మండలం బాలేపల్లి తండాలో నెలకొన్న సమస్యలపై ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తండాలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నూతనంగా బోర్లు వేయించాలని, గ్రామంలో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా హంద్రీ–నీవా కాలువ ద్వారా మండలంలోని చెరువులు నింపితే బోర్లలో నీళ్లు వచ్చి రైతులకు మేలు జరుగుతుందని తండా వాసులు వివరించారు. ఈ మేరకు ఎస్టీ కమిషన్‌కు వినతి పత్రం అందజేశారు. గిరిజనుల సమస్యపై ప్రభుత్వంతో చర్చించి ఎస్టీ కమిషన్ తరపున సమస్యల పరిష్కరిస్తామని బొజ్జిరెడ్డి తెలిపారు. అనంతరం స్థానిక బాలికల గురుకుల పాఠశాలను కమిషన్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. తాగునీటి ఎద్దడిపై స్థానికులు మొరపెట్టుకోగా, సమస్యను తక్షణమే పరిష్కరించి నీటి వసతి పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కదిరి ఆర్అండ్బీ అతిథి గృహంలో గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గిరిజన విద్యాసంస్థల నిర్వహణ, మౌలిక వసతుల లేమిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఎస్టీ కమిషన్ చైర్మన్ కదిరిలో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామని దర్శించుకున్నారు. తండావాసులతో ముఖాముఖి ముదిగుబ్బ మండలం గరుగు తండాలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణ విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి తగిన పరిహారం అందలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీరు, విద్యుత్ సరఫరా సరిగా లేక తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. స్పందించిన చైర్మన్.. పరిహారం చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేసేలా కలెక్టరేట్ అధికారులతో మాట్లాడతానని, తాగునీరు, విద్యుత్ సమస్యలను ప్రాధాన్యతపై పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముదిగుబ్బ ఎంపీడీఓ కార్యాలయంలో ’ఎస్టీ గ్రీవెన్స్ డే’ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రామ్, కదిరి ఆర్డీఓ కళావతి, ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి, కదిరి తహసీల్దార్ రెడ్డి శేఖర్, ముదిగుబ్బ తహసీల్దార్ రవినాయక్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పొలాల్లో కేబుల్ చోరీ
కనగానపల్లి: మండల పరిధిలోని తగరకుంట గ్రామంలోని వ్యవసాయ పొలాల వద్ద బోరుబావులకు అమర్చిన కేబుల్‌ను దొంగలు చోరీ చేశారు. స్థానిక రైతులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని రైతులు క్రిష్ణారెడ్డి, మంజునాథరెడ్డి, శ్రీరాములుకు చెందిన 3 వ్యవసాయ బోర్ల వద్ద మోటార్లకు అమర్చిన కేబుల్‌ను దొంగలు కత్తిరించుకుని వెళ్లారు. రాత్రి మళ్లీ వచ్చిన దొంగలు బోరుబావుల వద్ద కేబుల్‌ను కత్తిరిస్తుండగా రైతులు గమనించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ద్విచక్ర వాహనంలో వచ్చిన దొంగలు వాహనాన్ని వదిలేసి పారిపోయినట్లు రైతులు తెలిపారు. చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో తామే రాత్రి వేళ పొలాల వద్ద కాపలా ఉంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం ● మంత్రి సత్యకుమార్ ధర్మవరం అర్బన్: ధర్మవరం యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం జాబ్‌మేళా ప్రక్రియ జరుగుతూనే ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పట్టణంలోని సీఎన్బీ ఫంక్షన్ హాలులో మంగళవారం సంస్కృతి సేవా సమితి సహకారంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాను మంత్రి సత్యకుమార్‌యాదవ్, ప్రభుత్వ గౌరవ సలహాదారు సతీష్‌రెడ్డి, కలెక్టర్ శ్యామ్ప్రసాద్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో యువతకు విద్య, నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలను అందించాలన్న సంకల్పంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికై న యువతకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో సంస్కృతి సేవా సమితి కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసరెడ్డి, జనసేన ఇన్చార్జ్ చిలకం మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘కేసుతో సంబంధం లేదు’రాప్తాడు రూరల్: ఇటీవల కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో బాలికపై లైంగిక దాడి కేసులో అనంతపురం రూరల్ మండలం జంగాలపల్లికి చెందిన శ్రీకాంత్ అరెస్టయినట్లు వచ్చిన వార్తతో తనపై అపోహలు ఏర్పడుతున్నాయని అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. తాను హైదరాబాద్‌లో అనస్తీషియా విభాగంలో పని చేస్తున్నానని, ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గ్రామం, పేరు సరిపోవడంతో కొందరు తననే నిందితుడిగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచార లోపంతో తన గ్రామం పేరు వార్తల్లో వచ్చి ఉండవచ్చని పేర్కొన్నాడు. -
కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి
●ఈ నెల 16 వరకూ అవకాశం ప్రశాంతి నిలయం: అర్హులై ఉండి ఇప్పటివరకూ సామాజిక పింఛన్ అందుకోలేని వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ భరోసా కింద అందించే సామాజిక భద్రతా పింఛన్ పథకానికి నూతనంగా అర్హత పొందిన వారి నుంచి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు తదితర వర్గాలకు చెందిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రైస్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, కేటగిరీ ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలని సూచించారు. చీనీ మొక్కల ధ్వంసంగుంతకల్లు రూరల్: మండల పరిధిలోని ఓబుళాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మైనాపురం గ్రామంలో రైతు వెంకటేష్‌కు చెందిన తోటలోకి ఆదివారం రాత్రి దుందగులు చొరబడి చీనీ చెట్లను నరికివేశారు. రైతు వెంకటేష్ తన 9.5 ఎకరాల పొలంలో నాలుగు సంవత్సరాల క్రితం చీనీ తోట సాగు చేశాడు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఈ ఏడాది మొదటికోతను తీయాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి జేసీబీతో చొరబడి మొక్కలపై ఇష్టారాజ్యంగా నడిపిస్తూ 200 మొక్కలను నాశనం చేశారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు వెంకటేష్ చీనీ మొక్కలు నేలకు ఒరిగి ఉండటాన్ని గమనించి హతాశుడయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనాపురం గ్రామానికి చెందిన శేఖర్‌కు, తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఈ విషయంలో ఆదివారం అర్ధరాత్రి శేఖర్ తనకు ఫోన్ చేసి దుర్భాషలాడాడని బాధితుడు తెలిపాడు. శేఖర్ తన జేసీబీతో ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించాడు. కరెంటు కోసం పడిగాపులు కాయాల్సిందేనా? ఉరవకొండ: కరెంటు కోసం పొలాల వద్ద రేయింబవళ్లూ పడిగాపులు కాయాల్సిందేనా అని రైతులు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిరప సాగు చేసుకోవడానికి విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ వెలిగొండ, బూదగవి గ్రామాల రైతులు సోమవారం ఉరవకొండలోని విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతులు మాట్లాడుతూ బోరు బావుల కింద ఉన్న నీటితో మిరప నారు వేసుకుందామంటే అధికారులు రాత్రిపూట ఒక్కటే గంటపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. ఈ కరెంటు కోసం ఎప్పుడు వదులుతారా అని పొలాల్లోనే ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. ఏఈ గురుమూర్తి ఆందోళనకారుల వద్దకు వచ్చి అధిక లోడు కారణంగా సమస్య ఏర్పడిందని, ఇక నుంచి సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని లారీ దగ్ధం
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో సోమవారం వేకువజామున ఓ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నుంచి బెంగళూరులోని మాలూరుకు ఆలు గడ్డల లోడుతో లారీ బయలుదేరింది. కొత్తపేట గ్రామ శివారులోకి రాగానే సర్వీస్ రోడ్డులో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో విద్యుత్ తీగలు తెగి లారీపై పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై అనుమానాలు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు లారీ హైవే మీదుగా వెళ్లాలి. అయితే సర్వీస్ రోడ్డులోకి రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి డ్రైవర్, క్లీనర్లు అదృశ్యమయ్యారు. పొరపాటుగా లేదా నిద్రమత్తులో లారీని సర్వీస్ రోడ్డులోకి తిప్పి ఉంటే ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్, క్లీనర్ అక్కడే ఉండేవారు. దీనిపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేలుడు పదార్థాలు తీసుకెళ్తూ మంటలు రావడంతో డ్రైవర్ లారీని కావాలనే సర్వీస్ రోడ్డులోకి తీసుకెళ్లి పల్టీ కొట్టించాడా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
కలశం చిచ్చు.. ఇరువర్గాల ఘర్షణ
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): ఆలయంపై కలశం ఏర్పాటు చిచ్చు రేపింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో నలుగురికి గాయాలయ్యాయి.. డి.హీరేహాళ్ మండలం పులకర్తిలో జంబన్న తాత గుడి వెనుక ఉన్న మడివాల మాచిదేవ ఆలయ విషయంలో రజకులు, కురుబల మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆలయ హక్కులు, నిర్వహణ తదితర అంశాలపై ఇరువర్గాలు రాయదుర్గం కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉంది. ఈ క్రమంలో సోమవారం రజక వర్గానికి చెందిన వారు ఆలయంపై కలశం ఏర్పాటు చేశారు. కోర్టులో వివాదం నడుస్తున్న సమయంలో కలశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ కురుబ వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలశాన్ని తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని చివరకు పరస్పరం దాడులకు దారితీసింది. సమాచారం అందుకున్న రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి సిబ్బందితో వెంటనే గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘర్షణలో గాయపడిన రజకవర్గానికి చెందిన ఎర్రిస్వామి, హేమంతరాజు, కురుబ వర్గానికి చెందిన లోకేష్, మంజునాథ్‌ను రాయదుర్గం, బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
బైకును ఢీకొన్న టిప్పర్.. వృద్ధురాలి మృతి
బత్తలపల్లి: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం ధర్మవరం పట్టణం కొత్తపేటకు చెందిన వెంకటరమణ, అతని తల్లి లక్ష్మీనారాయణమ్మ (60) ద్విచక్రవాహనంలో తాడిపత్రికి వెళుతున్నారు. మార్గమధ్యంలో మండల పరిధిలోని పోట్లమర్రి ఆంజనేయస్వామి ఆలయం వద్ద టిప్పర్ వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణమ్మ మృతి చెందగా, వెంకటరమణ చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న బత్తలపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ● బత్తలపల్లి నుంచి ధర్మవరం వైపు వెళ్లే టిప్పర్ల వేగానికి అంతేలేకుండా పోతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇసుక, బంకమట్టి, కంకర లోడుతో వెళ్లే టిప్పర్లకు స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా ఏమాత్రమూ అడ్డూఅదుపు ఉండదన్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరొకరికి తీవ్రగాయాలు -
వైభవంగా దొణగంగమ్మ జాతర
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని టీ.వీరాపురం గ్రామ సమీపంలో వెలసిన దొణ గంగమ్మ జాతర సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. జాతరకు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో కొలువుదీర్చి పురవీధులలో మేళతాళాల నడుమ ఊరేగింపుగా దొణవద్దకు చేర్చారు. తిరిగి సాయంత్రం రథాన్ని ఆలయం వద్దకు లాగారు. అంతకుమునుపు మహిళలు భక్తిశ్రద్ధలతో దొణవద్దకు చేరుకుని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కాంట్రాక్టర్ నేత్రపల్లి ఆర్టీ లక్ష్మీకాంతారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జున, మాజీ సర్పంచ్ ఓబుళమ్మ, మాజీ ఎంపీటీసీ రాజమ్మ, మెట్టు ధనుంజయరెడ్డి, గొల్ల రామాంజినేయులు, తిమ్మారెడ్డి, అనుమేష్, రామన్నయాదవ్ లక్ష్మీరెడ్డి, చిత్రయ్య, మహేష్, అశోక్, ప్రకాష్, దుబాయ్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
బాఽధితులకు సత్వరమే న్యాయం చేయాలి
● ఎస్పీ సతీష్‌కుమార్ పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. సమస్య తీవ్రతను తెలుసుకుని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలన్నారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సీఐలు బొజ్జప్ప, లక్ష్మీకాంత్‌రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికుడిపై కత్తితో దాడి ధర్మవరం అర్బన్: పట్టణంలోని కేశవనగర్‌లో ఇంటి గోడ విషయంలో చేనేత కార్మికుడిపై పక్కింటి వారు కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం జరిగింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... కేశవనగర్‌లో చేనేత కార్మికుడు శివానంద ఇంటి నిర్మాణం చేపట్టాడు. పక్క ఇంటి గోడకు బేల్దార్లు పొరపాటున రంధ్రాన్ని పెట్టారు. రంధ్రాన్ని పూడ్చివేస్తామని చెప్పినా వినకుండా పక్కింట్లో ఉన్న శివయ్య, అతని కుమారుడు వంశీలు గొడవ చేశారు. శివానందపై కర్రలతో దాడి చేసిన అనంతరం పిడి బాకుతో దాడికి దిగారు. స్థానికులు గమనించి వెంటనే గొడవను ఆపి గాయపడ్డ శివానందను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు శివానంద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ‘ఉద్యోగ సంఘాలతో కంటితుడుపు చర్చలా?’ పుట్టపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో కేవలం కంటితుడుపు చర్చలు చేపట్టిందని వైఎస్సార్‌టీఏ విమర్శించింది. సోమవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి తదితరులు పుట్టపర్తిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమైన సమస్య ఏ ఒక్కటీ కూడా చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. అయినా రెండు పెండింగ్ డీఏలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం మరో సారి మోసం చేసిందన్నారు. పీఆర్సీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తోందో చెప్పలేదని విమర్శించారు. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయినా ఇంకా నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఆటో బోల్తా.. వృద్ధుడి మృతి ఉరవకొండ: ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన ఉరవకొండ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి గ్రామం నుంచి సోమవారం ఆటో ప్రయాణికులతో బయలుదేరింది. ఉరవకొండ సమీపంలో గొర్రెల మంద అడ్డురావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన అంజయ్య (70) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ బాషాతో పాటు మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజయ్యకు భార్య తిప్పమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. -
మొదటి రోజే ఏడి‘పింఛన్’
ఆత్మకూరు: కొత్త పింఛన్ల కోసం సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి పలువురు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల వద్ద వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. ఇంటింటి సర్వేలో భాగంగా ఆత్మకూరు మండల వ్యాప్తంగా 2 వేల మంది వరకు కొత్త పింఛన్లకు అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. కేవలం ఆత్మకూరులోనే 500 మందికి పైగా ఉన్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేయడంతో సచివాలయాల వద్ద సోమవారం వారంతా బారులు తీరారు. అయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ పని చేయకపోవడంతో వద్ద నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 16 వరకే దరఖాస్తుకు అవకాశం ఉండటంతో అర్హులు ఆందోళనకు గురవుతున్నారు. అయినవారు ఉన్నా అనాథలా మృతి! పామిడి: అయినవారు పట్టించుకోకపోవడంతో మనసు చంపుకొని ఇల్లు వదిలివచ్చిన ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పామిడి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం ఈరన్నపల్లికి చెందిన చింతాకుల అశోక్(65) 25 ఏళ్ల క్రితం వ్యాపార రీత్యా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇటీవల అశోక్ అనారోగ్యం బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై 6 నెలల క్రితం ఇల్లు వదిలి వచ్చాడు. రెండు రోజులుగా పామిడి కమ్యూనిటీ ఆసుపత్రిలో తిరుగుతూ ఆసుపత్రి ప్రాంగణంలో నిద్రించేవాడు. ఆదివారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచా డు. పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుమారుడు, ప్రొద్దుటూరుకు చెందిన హరికృష్ణకు సమాచారం చేరవేశారు. ‘పీఎం విశ్వకర్మ’ కోసం ప్రత్యేక శిబిరాలు ప్రశాంతి నిలయం: పీఎం విశ్వకర్మ పథకం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ వెంటనే పరిశీలించి రుణాలు మంజూరు చేసేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఫణీంద్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8న ఉదయం 10.30 గంటలకు ధర్మవరం మండల మహిళా సమైక్య కార్యాలయంలో, మధ్యాహ్నం 3.30 గంటలకు పెనుకొండ మండల మహిళా సమైక్య కార్యాలయం, ఈనెల 9న ఉదయం 10.30 గంటలకు మడకశిర వెలుగు కార్యాలయం, మధ్యాహ్నం 3.30 గంటలకు హిందూపురం వెలుగు కార్యాలయం, ఈ నెల 10న ఉదయం 10.30 గంటలకు కదిరి ఎంపీడీఓ కార్యాలయం, మధ్యాహ్నం 3.30 గంటలకు పుట్టపర్తి డీఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులు, చేతి వృత్తుల కళాకారులు, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. -
ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టు కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి.. నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెలోకి వెళతామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎర్రిస్వామి, వన్నూరుస్వామి సోమవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి నోటీసు అందజేశారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ట్రంక్‌లైన్ ఫేజ్–1 కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, 2025 సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్కరికి రూ. 22 వేలు బకాయిలు పెట్టారని, 40 నెలల పీఎఫ్ సొమ్ము జమ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. ట్రంక్‌లైన్ ఫేజ్–4లో పనిచేసే కార్మికులకు 11 నెలల జీతంతో పాటు 11 నెలల పీఎఫ్ నిధులను జమ చేయకుండా కాంట్రాక్టర్ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. సమ్మె నోటీసుపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్డీ శ్రీనివాసులు, కార్మిక శాఖ ఉప కమిషనర్ లక్ష్మీనారాయణలను పిలిపించుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనల మేరకు పనిచేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. వేధింపులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఒకవేళ అలా చేయకుండా కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క కార్మికుల కడుపు కొట్టే చర్యలకు పాల్పడితే మీపై చర్యలు తీసుకుంటానంటూ అధికారులను హెచ్చరించారు. -
అయ్యో చిత్రావతి!
పుట్టపర్తి: చిత్రావతి నది కళ తప్పింది. గతంలో నదికి అడ్డంగా చెక్ డ్యామ్ నిర్మించి నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించారు. ప్రస్తుతం చెక్ డ్యామ్‌లో నీళ్లులేక ఎండిపోవడంతో కళావిహీనంగా మారింది. గత వైఎస్సాసీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు చెక్ డ్యామ్‌లో నీళ్లు పుష్కలంగా ఉండటంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో చిత్రావతిని సందర్శించేవారు. వేసవి కాలంలోనూ బోటింగ్ చేస్తూ ఆహ్లాదంగా గడిపేవారు. ప్రస్తుతం పుట్టపర్తికి వచ్చే పర్యాటకులు ఇటు వైపు కూడా చూడని పరిస్థితి దాపురించింది. కూత వేటు దూరంలోనే జలాలు.. హంద్రీ–నీవా కాలువ ద్వారా పుట్టపర్తికి కూత వేటు దూరంలోనే కృష్ణా జలాలు వెళ్తున్నాయి. పైపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి చెక్ డ్యామ్‌ను నింపే అవకాశం ఉంది. ఇందుకు వ్యయం కూడా చాలా తక్కువ అవుతుందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కానీ చంద్రబాబు సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో చిత్రావతి వెలవెలపోతోంది. ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై పుట్టపర్తివాసులు మండిపడుతున్నారు. తాగునీటికీ కష్టాలే.. చిత్రావతి నదిలో నీళ్లు లేకపోవటంతో పుట్టపర్తివాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పుట్టపర్తిలో ఏ ఒక్క వార్డులో కూడా నీటి సమస్య తలెత్తలేదు. ప్రస్తుతం చెక్ డ్యామ్ ఎండిపోవటంతో బోర్లలో నీళ్లు తగ్గుతున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే స్పందించాలి పుట్టపర్తికే తలమానికంగా ఉన్న చిత్రావతి చెక్ డ్యామ్ నీళ్లు లేక ఎండిపోయింది. స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తక్షణమే స్పందించి లిఫ్టింగ్ ద్వారా కృష్ణా జలాలతో నింపేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సుందరీకరణ వృథా కావటంతో పాటు పర్యాటకులు దూరమవుతారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. – కవిత, పుట్టపర్తి జలాలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో తీవ్రమైన కరువు నెలకొంది. అయినా కృష్ణా జలాలను వినియోగించుకోకుండా కుప్పానికి తీసుకుపోవటం అన్యాయం. చిత్రావతి నది ఎండి పోవటంతో కళావిహీనంగా కనిపిస్తోంది. తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశముంది. అధికారులు, ప్రభుత్వం స్పందించి వెంటనే కృష్ణా జలాలతో చెక్ డ్యామ్‌ను నింపాలి. – లక్ష్మిదేవి, పుట్టపర్తి కళ తప్పిన నది కూత వేటు దూరంలోనే కృష్ణా జలాలు పోతున్నా దుస్థితి గతంలో ఆహ్లాదం పంచిన విషయాన్ని గుర్తు చేసుకుని ప్రజల ఆవేదన -
నేడు పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: ప్రశాంతి రైల్వేస్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. అన్ని డివిజన్, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలో కూడా కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. చెరువును చెరబట్టాడు.. ఎన్పీకుంట: మండల పరిధిలోని ధనియానిచెరువు గ్రామ సమీపంలోని చెరువును ఓ టీడీపీ నాయకుడు చెరబట్టాడు. అక్రమార్జనే ధ్యేయంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వందలాది ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నాడు. సెలవు రోజులను ఆసరాగా చేసుకుని అధికారులు లేని సమయంలో చెరువులో జేసీబీలతో మట్టి తవ్వి యథేచ్ఛగా తరలిస్తున్నాడు. ఈ విషయమై తహసీల్దార్ లక్ష్మమ్మను వివరణ కోరగా మట్టి తరలింపునకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. మట్టి తవ్విన ప్రదేశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిపై పోక్సో కేసు ● అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు కదిరి టౌన్: బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు, కదిరి పట్టణానికి చెందిన తిమ్మరాజుపై పోక్సో కేసు నమో దైంది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపినట్లు సీఐ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. పట్టణానికి చెందిన 16 ఏళ్ల బాలికకు ప్రేమ పేరుతో ఇటీవల తిమ్మరాజు దగ్గరయ్యాడు. బాలికపై అనుమానం పెంచుకుని వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తిమ్మరాజుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆదివారం తిమ్మరాజును అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ● మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచరుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తలుపుల గంగాధర్ కుమారుడైన తిమ్మరాజు గతంలో బార్ రమణ కుమారుడు పిట్టుపై హత్యాయత్నం చేసిన కేసులో 3 నెలల పాటు జైలులో ఉన్నాడు. ఖాద్రీ ఆలయం వద్ద టెంకాయల టెండర్ సమయంలో మహిళలపై ఇతను దాడి చేశాడు. అంతేకాకుండా తను నివాసముండే అడపాల వీధిలో అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతుంటాడనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అప్పటి సీఐ వి.నారాయణరెడ్డి తిమ్మరాజు ఇంట్లో సోదాలు చేయడం గమనార్హం. ‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంగా ఉండండిఅనంతపురం న్యూటౌన్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సుధాకర్‌రావు ఆదేశించారు. ఆదివారం ఆయన డీడీఓలు, ఎంపీడీఓలు తదితరులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే గ్రామాలను గుర్తించి మ్యాపింగ్ చేయాలని సూచించారు. 2026 జనవరి ఒకటో తేదీ నాటికి ప్రచురించిన ఓటర్ల జాబితాలను ఆన్లైన్ చేయడంతో పాటు మూడు సెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.పంచాయతీలకు సంబంధించి స్టేజ్–1, స్టేజ్–2 ఎన్నికల అధికారుల జాబితాలతో జిల్లా, మండల, గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
రొద్దం: మండల పరిధిలోని పెద్దగువ్వలపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో రొద్దం కొత్త ఎస్సీ కాలనీకి చెందిన నాగరత్నమ్మకు గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే గాయపడిన మహిళను ఆమె కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతానికి తరలించడానికి 108కు ఫోన్ చేస్తే వారు స్పందిండం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడితే చిన్నగాయాలకు 108 వాహనం పంపమని చెప్పడం ఏమిటిని ఆగ్రహించారు. వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకోవడంతో ఆఖరికి 108 వాహనాన్ని ఏర్పాటు చేసి బాధితురాలిని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బంది మాట్లాడుతూ ఇప్పడు చిన్న,చిన్న గాయాలకు 108 వాహనం పంపడం కుదరన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన చోటి నుంచి కాకుండా ఆస్పత్రికి తీసుకొచ్చి గొడవ చేస్తే అర్థం లేదన్నారు. 108 సిబ్బంది స్పందించక పోవడంపై గ్రామస్తుల ఆగ్రహం -
కేపీఎస్ వెంచర్లో మళ్లీ దొంగతనం
గుత్తి: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎస్ కేపీఎస్ వెంచర్లో మళ్లీ దొంగతనం జరిగింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి దక్షణామూర్తి ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన కొంత నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి కూడా దొంగలు హల్ చల్ చేశారు. దొంగలు హల్ చల్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ముగ్గురు దొంగలు ముసుగు ధరించి ఒకే దుస్తుల్లో చోరీకి వచ్చారు. చేతుల్లో ఇనుప రాడ్లు పట్టుకున్న దృశ్యాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాలనీవాసులే చందాలు వేసుకుని నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నా దొంగలు రెచ్చిపోతుండటం కలకలం రేపుతోంది. ఇదే కాలనీలో సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ ఖాన్ కూడా నివాసముంటున్నారు. పోలీసులు నివాసముండే ప్రాంతమైనా చోరీలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. -
కంది పంటను రక్షించుకోండి
పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్ సీజన్లో సాగైన కంది పంటను బెట్ట నుంచి రక్షించుకోవాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తి సమీపంలోని ఓ రైతు సాగు చేసిన కంది పంటను పరిశీలించారు. వారం రోజుల నుంచి ఎండ తీవ్రత పెరగడంతో కంది పంట బెట్టకు గురైందన్నారు. రక్షించుకునేందుకు పొటాషియం నైట్రేట్ 5 గ్రాములను లీటరు నీటికి కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలన్నారు. అలాగే 60 రోజులకు, 90 రోజులకు ఓమైట్ ఒక మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. దీంతో మొక్కకు వెర్రి తెగులు రాకుండా నివారించవచ్చన్నారు. దగ్గర్లో నీటి సదుపాయం ఉంటే ఒక తడి ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 30,712 హెక్టార్లలో కంది సాగు చేశారన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్● శింగనమల సబ్ రిజిస్ట్రార్‌తో పాటు సీకే పల్లి సీనియర్ అసిస్టెంట్‌పై వేటు అనంతపురం టౌన్: ప్రభుత్వ భూములతో పాటు రికార్డుల్లోలేని భూములను రిజిస్ట్రేషన్ చేసిన ఇద్దరు రిజిస్ట్రేషన్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ డీఐజీ విజయలక్ష్మీ ఉత్తర్వులను జారీ చేశారు. శింగమనల సబ్ రిజిస్ట్రార్ గురునాథ్ వెబ్‌ల్యాండ్‌లో లేని భూమిని భాగ పరిష్కరాల రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. నార్పల మండలం చామలూరుకు చెందిన భూములు సర్వేనంబర్ 374, 377–3, 378, 385, 386లోని భూములను వెబ్‌ల్యాండ్‌లో పేర్లు లేకున్నా వేరొకరి పేరుతో భాగ పరిష్కారల రిజిస్ట్రేషన్ 3344–2025 గత ఏడాది నవంబర్‌లో రిజిస్ట్రేషన్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ గురునాథ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్‌కుమార్ అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే అరోపణల నేపథ్యంలో ఇరువురిపై విచారణ చేపట్టిన డీఐజీ విజయలక్ష్మీ ఆరోపణలు రుజువు కావడంతో ఇద్దరిపై వేటు వేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. సంసారాన్ని పట్టించుకోవాలన్న భార్య.. ఉరేసుకున్న భర్తబత్తలపల్లి: నిత్యం తాగుతుంటే ఎలా? సంసారాన్ని కూడా పట్టించుకోమని భర్తను భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని జ్వాలాపురంలో ఆదివారం చోటు చేసుకుంది. బత్తలపల్లి పోలీసుల వివరాల మేరకు... జ్వాలాపురానికి చెందిన తలారి రామాంజనేయులు (40), నాగమ్మ దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలి పనులు, పాడి ఆవులు చూసుకుంటూ కుటుంబాన్ని నాగమ్మ పోషిస్తోంది. రామాంజనేయులు కూలి పనులకు వెళ్లి ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా తాగుడుకే ఖర్చు పెట్టుకునేవాడు. సంసారం బాధ్యతలు నాగమ్మ చూసుకుంటూ కుమారుడిని బీటెక్ చవిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం పిల్లలు పెద్ద వాళ్లు అవుతున్నారు.. సంసారం పట్టించుకోమని భార్య.. భర్తను మందలించింది. కుమారుడు తిరుపతికి కళాశాలకు వెళ్లగా, భార్య, కుమార్తె పాడి ఆవులకు మేత కోసం బయటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామాంజనేయులు చీరతో తాటి తీర్లకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. బత్తలపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేపు ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక ప్రశాంతి నిలయం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్‌తో పాటు ఐదుగురు కమిటీ సభ్యుల బృందం కూడా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం రాత్రికి కదిరిలోని ఆర్‌ఆండ్‌బీ బంగ్లాకు చేరుకుని అక్కడ బస చేస్తారన్నారు. 8న నల్లచెరువు మండలం బలేపల్లి తండా, ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి ఎస్టీ కాలనీ, గురుగు తండా సందర్శించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కదిరి అర్అండ్బీ బంగ్లాలో గిరిజన నాయకులు ,ప్రజా సంఘాలు, ఉద్యోగులు, ప్రజలతో సమావేశమై అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఎల్లమ్మ ఆలయంలో చోరీ శెట్టూరు: మండలంలోని కై రేవు గ్రామంలో శనివారం అర్ధరాత్రి గ్రామ దేవత ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం రాత్రి కై రేవులో వీధినాటకాన్ని ప్రదర్శించారు. ఇదే అదునుగా భావించిన దుండుగులు ఆలయంలోకి చొరబడి సుమారు 60 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. అర్చకులు గుర్తించి గ్రామస్తుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుమన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ధరలు పెరిగినా తగ్గేదేలే!
హిందూపురం టౌన్: ప్రతి యేటా అంగరంగ వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలకు గణనాథుల విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. వేడు కలకు నెల రోజుల నుంచే సందడి మొదలైంది. ఓ వైపు వీధుల్లో మండపాలు ఏర్పాటవుతుండగా, గణనాథుల విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. హిందూపురం పట్టణంలోని బెంగళూరు రోడ్డు, కొట్నూరు, మేళాపురం వద్ద వినాయక విగ్రహాల తయారీ ఊపందుకుంది. డిమాండ్‌కు తగ్గట్టుగానే విగ్రహాల ధరలు ఆకాశాన్నంటాయి. హిందూపురంలో అడుగుల వారీగా రూ.5 వేల నుంచి రూ.5 లక్షల దాకా వినాయక విగ్రహాల ధరలు పలుకుతున్నాయి. రూ.కోట్లలో వ్యాపారం హిందూపురంలో వినాయక చవితి అంటే రూ. కోట్లలో వ్యాపారం జరుగుతుంది. వినాయక మండపాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి విగ్రహాం తయారీ, డెకరేషన్, పూజా సామగ్రి, లైటింగ్, టపాసులు, డీజేలు, నిమజ్జన ఖర్చులు ఇలా ఎన్నో హంగు, ఆర్భాటాలు ఉంటాయి. అన్నింటికంటే వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించడానికి ఎంత ఖర్చునైనా భరించాల్సిందే. హిందూపురం పట్టణంలో పలు చోట్ల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి వినాయకుల విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. హిందూపురంతో పాటు లేపాక్షి, చిలమత్తూరు, పరిగి మండలాలు, పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర, కదిరి, ధర్మవరం, కర్ణాటక ప్రాంతాలకు చెందిన వారు తరలివచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ 5 అడుగల విగ్రహాల నుంచి 40 అడుగుల విగ్రహం వరకు తయారు చేస్తుంటారు. భారీ విగ్రహాలను ముందస్తు ఒప్పందం ప్రకారం తయారీ చేస్తారు. లేదా హిందూపురం పట్టణంలో అయితే మండపం ఉన్న చోటుకే వెళ్లి తయారు చేస్తున్నారు. గతంతో పోలిస్తే వినాయక విగ్రహాల ధరలు భారీగానే పెరిగాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, గడ్డి, రంగులు, కట్టెలు, కొబ్బరి పీచు ఇలా ముడి వస్తువుల ధరలు పెరగడంతో వినాయక విగ్రహాల ధరలు ౖపైపెకి చేరాయి. గత ఏడాది మట్టి వినాయకుడి 18 అడుగుల విగ్రహం రూ.1.50 లక్షల వరకు ధర ఉండగా, ఇప్పుడు రూ.2 లక్షలకు చేరింది. విగ్రహాల తయారీ భారం పెరగడంతోనే ధరలు పెంచక తప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు. అడుగుల వారీగా మట్టి విగ్రహాలను చూసినా (భారీ అడుగుల వినాయకులు) గత ఏడాది అడుగుకు రూ.6 వేల నుంచి రూ.7 వేలు తీసుకునే వారు. ప్రస్తుతం రూ.9 వేల నుంచి రూ.10 వేలు తీసుకుంటున్నారు. బేరసారాల్లో మరికొంత తగ్గొచ్చు. అదే విధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు 12 అడుగులు, 16 అడుగులవి రూ. రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉన్నాయి. ఆకాశాన్నంటుతున్న గణపతి విగ్రహాల ధరలు ముడి సరుకులు, రవాణా భారంతో రేట్లు ౖపైపెకి అడుగుల వారీగా రూ.5 వేల నుంచి 5లక్షల వరకు.. ధర ఎక్కువైనా కొనుగోలుకే మొగ్గు మట్టి విగ్రహాలకే మొగ్గు హిందూపురంలో యేటా 200 వరకు విగ్రహాలు కొలువుదీరుస్తుంటారు. ఎక్కువగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడానికే మొగ్గు చూపుతారు. ధరలు ఎంత పెరిగినప్పటికి పర్యావరణానికి ముప్పు వాటిల్లని, మంచి రూపును ఇచ్చే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. వివిధ ఆకృతులతో మట్టి విగ్రహాలను తయారీదారులు తీర్చిదిద్దుతుంటారు. మట్టి విగ్రహాలను భారీ అడుగుల్లోనూ తయారీదారులు రూపొందిస్తున్నారు. 40 అడుగుల వరకు తయారు చేస్తున్నారు. ఇవి పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. -
తాగునీటి కోసం అష్టకష్టాలు
పొలం వద్ద నీటిని పట్టుకుంటున్న దొన్నికోటవారిపల్లి గ్రామస్తులుఉంట్లవారిపల్లిలో నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఓడీచెరువు: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై ప్రజలలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని దొన్నికోటవారిపల్లిలో 20 రోజుల నుంచి పంచాయతీ బోర్లలో నీళ్లు రావడం లేదు. దీంతో ప్రజలు ఖాళీ బిందెలతో పంట పొలాలవైపు పరుగులు తీస్తున్నారు. పలు మార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని, ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు పడాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉంట్లవారిపల్లిలో బోరు ఉన్నా మోటారు రిపేరు చేయించకపోవడంతో పది రోజుల నుంచి తాగునీటికి అష్టకష్టాలు పడుతున్నారు. పనులన్నీ మానుకొని నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు. బోరు మరమ్మతు చేయడంలో స్థానిక అధికార పార్టీ నాయకులు పోటీ పడుతుండటంతో ఆ పని ఆగిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే కమ్మవారిపల్లి పంచాయతీ అచ్చామియాపల్లిలో సైతం స్థానికులకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. అన్ని చోట్లా గ్రామీణులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. -
19 నుంచి ఉద్యోగుల క్రికెట్ టోర్నీ
అనంతపురం: ఆర్డీటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 19 నుంచి ఏపీ వెటర్నన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఉద్యోగుల క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. ఆదివారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోర్నీ వివరాలను వెటర్నన్స్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.విజయరాజు వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఈ టోర్నీలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. క్రీడాకారులకు జెర్సీలను కూడా అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు విభాగాధిపతితో సంతకం చేయించి ఈ నెల 13వ తేదీలోపు అనంతపురంలోని కమలానగర్లో ఉన్న అంకుశం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 94900 62555ను సంప్రదించవచ్చన్నారు. ఔదార్యం చాటుకున్న మిత్రులు కదిరి అర్బన్: స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తలా ఓ చేయి వేసి బతుకుదెరువు కోసం ఆటో కొనిచ్చి కుటుంబాన్ని ఆదుకున్నారు. కదిరి పట్టణంలోని వేమన బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1988 – 89 బ్యాచ్ 10వ తరగతి చదివిన విద్యార్థులు తమ మిత్రుడు చిదానందప్ప కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆటో అందజేశారు. మొత్తం 80 మంది మిత్రులు కలసి రూ.2,80,000 వేలు ఆర్థికసాయం చేసి కొత్త ఆటోను కొనిచ్చారు. ఎవడు ఎలా ఉంటే మనకేంటి.. మనం బాగుంటే చాలు అని బతికేసే ఈ కాలంలో ఇలాంటి మిత్రులు ఉండడం సంతోషకరమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మస్తాన్‌వలీ, శ్రీనాథ్‌రెడ్డి, ఆది, గంగరాజు, మోహన్రావ్, బాబా, అక్బర్, ప్రసాద్, షంషీర్, కృష్ణానాయక్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంధర్మవరం అర్బన్: పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని వ్యవసాయ భూమిలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని, పర్పుల్ రంగు షర్ట్, నీలం రంగు లుంగీ, గ్రే రంగు అండర్వేర్ ధరించాడని టూటౌన్ సీఐ జయనాయక్ తెలిపారు. వివరాలు తెలిసినవారు, కుటుంబ సభ్యులు వెంటనే టూటౌన్ సీఐ 6305800429, ఎస్ఐ 9848424349 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
వైభవం.. అంజన్న బ్రహ్మ రథోత్సవం
బొమ్మనహాళ్: నేమకల్లు అంజన్న ఉత్సవం, బ్రహ్మ రథోత్సవం కమనీయంగా సాగింది. శ్రావణ మాసం ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున నేమకల్లు ఆంజనేయస్వామి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భభక్తులు పెద్ద ఎత్తున ఉత్సవంలో పాల్గొన్నారు. బాలాలయంలో అర్చకుల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక అలంకరణ, ఆకుపూజ, గంగాభిషేకం, బంగారు కిరీటం, వెండి పాదాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహామంగళ హారతి, ప్రసాద వినియోగ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు సునీత, శివారెడ్డి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆంజనేయస్వామి బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి బ్రహ్మ రథంపై కొలువు దీర్చారు. ఈ సందర్భంగా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు రథాన్ని లాగారు. చుట్టు పక్కన ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు బ్రహ్మ రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత లంకాదహనం కార్యక్రమం జరిగింది. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ నరసింహారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
గంజాయి గుప్పు
సాక్షి, పుట్టపర్తి: గతంలో కూలీలు, సాధువులు, బిచ్చగాళ్లు మాత్రమే గంజాయి పీల్చేవారు. ఇప్పుడు విద్యార్థులు, యువకులు కూడా గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారు. ఇన్నాళ్లూ పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గంజాయి గుప్పు ప్రస్తుతం పల్లెల వరకు పాకింది. తాము అధికారంలోకి వస్తే గంజాయి ఆట కట్టిస్తామని కూటమి నాయకులు ప్రగల్బాలు పలికారు. కానీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి గంజాయి మత్తులో ఎన్నో అఘాయిత్యాలు వెలుగు చూశాయి. గంజాయి విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బడాబాబుల అండదండలతో కొందరు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. గుడి, బడి తేడా లేకుండా అన్ని చోట్ల గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో మౌనంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి మొదలు కదిరి, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం ప్రాంతాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు తెలిసింది. ప్రతి రోజూ సాయంత్రం నుంచి గంజాయి గురించి యువత ఆలోచిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సమాచారం చేరవేసుకుని రోజుకో ప్రాంతానికి వెళ్లి గంజాయి పీలుస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మత్తులో హత్యలకూ వెనుకాడటం లేదు. గతేడాది పుట్టపర్తి మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లిలో ఓ హత్య కేసులో నిందితులు గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది. అయితే కేసు పక్కదోవ పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చిత్రావతి రోడ్డులో ఓ విదేశీయుడు గంజాయి మత్తులో భవనం పైనుంచి పడి చనిపోయిన ఘటన నెల క్రితం కలకలం రేపింది. గంజాయి ఒక్కసారి పీల్చితే రోజంతా మత్తు ఉండటంతో చాలామంది బానిసలవుతున్నారు. గంజాయి కోసం వెంపర్లాడుతున్నారు. గత 2024 విజయదశమి రోజున చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి మద్ద అత్తా–కోడలిపై సామూహిక అత్యాచారం చేసిన వారందరూ గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. గ్యాంగ్ రేప్లోని నిందితులపై అంతకుముందు గంజాయి కేసులు ఉన్నట్లు సమాచారం. ప్యాకెట్ల రూపంలో కిలోల లెక్కన గంజాయి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. అక్కడక్కడా నిల్వ చేసి చాక్లెట్లు, పెన్నుల్లో నింపి విక్రయిస్తున్నారు. రూ.100 చెల్లిస్తే రోజుకు కావాల్సినంత మత్తు వచ్చే గంజాయి లభిస్తోంది. దీంతో చిన్న ప్యాకెట్ల వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పోలీసులు అడపాదడపా దాడులు, కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో యథేచ్ఛగా విక్రయాలు మారుమూల ప్రాంతాలకూ విస్తరించిన మహమ్మారి పెన్నులు, చాక్లెట్ల రూపంలో అమ్మకాలు పుట్టపర్తి, పెనుకొండ, కదిరి, హిందూపురంలో అధికం మత్తులో ఘోరాలకు పాల్పడుతున్న వైనం2026 సెప్టెంబరు 5 : తలుపుల మండలం పూలవాండ్లపల్లిలో గంజాయి మొక్కలు సాగు చేసి విక్రయిస్తున్న శాంతమ్మ, నారాయణ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5.430 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన మరో 20 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెన్నయ్య తెలిపారు. చీకటి పడగానే శివారు ప్రాంతాలకు వివిధ రూపాల్లో అమ్మకాలు 2026 సెప్టెంబరు 4 : గంజాయి వినియోగించడంతో పాటు విక్రయిస్తున్న నలుగురిని హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముక్కిడిపేటకు చెందిన గౌతమ్, శ్రీకంఠపురానికి చెందిన అరుణ్‌కుమార్, ఆటోనగర్‌కు చెందిన బాబా, లక్ష్మీపురానికి చెందిన మనోజ్‌కుమార్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ మహేశ్ పేర్కొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
పుట్టపర్తి టౌన్: ఇటీవల సంస్కృతి కళాశాలలో జరిగిన చోరీ కేసును పుట్టపర్తి అర్బన్ పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అలెక్స్ మనోహర్ పవార్ (మురళీ)ని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.4.5 లక్షల నగదు, చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ శనివారం పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ 2026 జూలై 23న బీడుపల్లి సమీపంలో ఉన్న సంస్కృతి కళాశాలలో అకౌంట్స్ విభాగంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అల్మారాను పగుల గొట్టిన అనంతరం అందులో భద్రపరచిన రూ.17,45,450 అపహరించి పరారయ్యారు. ఈ విషయంపై కళాశాల సిబ్బంది అశోక్ పుట్టపర్తి అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా గుజరాత్‌కు చెందిన అలెక్స్ మనోహర్ అలియాస్ మురళి, బిహార్‌కు చెందిన కాజురామ్ ఆకాశ్, హర్యానాకు చెందిన బేడి అజయ్ చౌహాన్లు ముఠాగా ఏర్పడి దొంగతనం చేసినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు అలెక్స్ మనోహర్‌ను శనివారం మామిళ్లకుంట క్రాస్ వద్ద వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం సమీపంలో అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 4.5 లక్షల నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకునేదని, అడ్మిషన్ల సమయంలో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని గుర్తించి చోరీలకు పాల్పడేవారన్నారు. కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన అర్బన్ సీఐ యువరాజ్‌తోపాటు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు, కళాశాలల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, నగదు, బంగారు తదితర విలువైన వస్తువులను సురక్షితంగా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
మడకశిర: కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ దళిత యువకుడు మడకశిర మండలంలోని యూరంగాపురం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మృతుడు పావగడ తాలూకా నల్లిగానపల్లికి చెందిన చిరంజీవి(28)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరెంట్ షాక్‌తో మృతి చెందాడా..? చిరంజీవి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లు భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. మడకశిర మండలం దాసప్పపాళ్యం గ్రామానికి చెందిన ఓ యువకుడు, చిరంజీవి స్నేహితులు. వీరికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఇద్దరూ కలిసి రెండు రోజుల క్రితం రాత్రి మడకశిర మండలం నీలకంఠాపురం సమీపంలో గల కర్ణాటక రాష్ట్రం లక్ష్మీపురం వద్ద ఓ రైతు తోటలో మద్యం సేవించడానికి వెళ్లారు. తోట యజమాని అడవి పందులు రాకుండా కరెంట్ తీగలను ఏర్పాటు చేసిన విషయం తెలియక వెళ్లిన చిరంజీవి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలోనే తోట యజమాని కేసు తనపైకి వస్తుందని భావించి చిరంజీవి మృతదేహాన్ని యువకుడి సహాయంతో వాహనంలో తీసుకువచ్చి మడకశిర మండలం యూరంగాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. అయితే, సదరు యువకుడు భయపడిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్ఐ కృష్ణారెడ్డి అటవీ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మడకశిరకు చేరుకున్నారు. మృతదేహం వద్ద బోరున విలపించారు. చిరంజీవి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. మృతుడి తల్లిదండ్రులు గోవిందప్ప, భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. హత్య కోణంలో విచారిస్తున్నామన్నారు. ధర్మవరంలో ప్రైవేటు టీచర్.. ధర్మవరం రూరల్: నాగలూరు గ్రామంలో శనివారం ఓ ప్రవేటు పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ కేవీ మ్యాథ్యూస్ (60) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళ రాష్ట్రం వాయనాడ్‌కు చెందిన మ్యాథ్యూస్ నాగలూరులో ఉన్న ఓ ప్రవేటు పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తూ అదే గ్రామంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం ఉదయం గదిలో నుంచి ఆయన బయటకు రాకపోవడంతో చుట్టు పక్కల వారు అనుమానం వచ్చి ఇంట్లో చూడగా రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధిక రక్తపోటు కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం అయినట్లు గుర్తించారు. శరీరంలో ఎక్కడా గాయాలు లేకపోవడంతో అధిక రక్తపోటు కారణంగా మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. వారు కేరళ రాష్ట్రంలోనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుని సోదరుడు కేవీ షాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రైతులకు పంగనామం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రామగిరి మండలంలోని పలువురు రైతులు పండించిన కంది, పప్పుశనగ ఏడు నెలల క్రితం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. వారం, పదిరోజుల్లో నేరుగా ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందని మార్క్‌ఫెడ్ సంస్థ అధికారి శ్రీనివాసులు చెప్పారు. ఇప్పటికే ఏడునెలలు దాటుతున్నా ఒక్క రూపాయి అందలేదు. దీంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. తమ సమస్య తెలిసినా... స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత కనీసం పట్టింతుకోవడం లేదని రైతుల వాపోతున్నారు. రూ.14 లక్షలకు టెండర్.. దుబ్బార్లపల్లి గ్రామానికి చెందిన అశోక్, లక్ష్మీనారాయణ, పెదయ్య, నాగేంద్ర, శివయ్య, బోయ ఓబలేష్, బుర్రా నరసింహులు దాదాపు 450 (50 కేజీలు) బస్తాల వేరుశనగను రామగిరిలోని వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో మార్క్‌ఫెడ్ సంస్థ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్మారు. మొత్తంగా రూ.13,16,250 రావాల్సి ఉండగా... నేటికీ ఒక్క రూపాయి కూడా అధికారులు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చుట్టూ తిరిగి విసిగిపోయిన తాము ఇటీవలే రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పండించిన పంటకు గిట్టుబాటు లేదని, ప్రభుత్వమే పంట కొనుగోలు చేసినా డబ్బులివ్వకపోతే తాము కుటుంబాలను ఎలా పోషించుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు చర్యలు తీసుకుని తమకు రావాల్సిన సొమ్మును వెంటనే ఇప్పించే విధంగా చూడాలని కోరుతున్నారు. కాగా, ఈఏడాది రబీలో రైతులు సాగుచేసిన కందిపంటకు కూడా రెండు, మూడు క్వింటాళ్లను పట్టుకొని సంస్థ యాజమాన్యం రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేసినట్లు రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన రైతులు పేర్కొన్నారు. పరిటాల ఇలాకాలో ‘మార్క్‌ఫెడ్’ భారీ మోసం ఏడు నెలల క్రితం కంది, పప్పుశనగ కొనుగోళ్లు నేటి వరకూ డబ్బులివ్వకుండా తిప్పుకుంటున్న వైనం రూ.14 లక్షలు రావాలంటూ రైతుల ఆందోళన మార్క్‌ఫెడ్ అధికారిపై ఇటీవల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు రైతుల సమస్యలు తెలిసీ స్పందించని ‘ఎమ్మెల్యే పరిటాల’ -
శనీశ్వరా... కాపాడు తండ్రీ
అలంకరణలో శనీశ్వరస్వామి , శీతలాంభదేవి, కాకి వాహనం పావగడ: స్థానిక స్వర్ణ శనీశ్వరాలయంలో శ్రావణ బహుళ నవమి చివరి శ్రావణ శనివారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వరస్వామి, శీతలాంభదేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4 గంటల నుంచి శనీశ్వరునికి పంచామృతాభిషేకం, తైలాభిషేకం, నవ గ్రహ పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయం పై అంతస్తులోని ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేసిన నవగ్రహ పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొని శనీశ్వర పారాయణం ఆలకించి తరించిపోయారు. ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అగ్ని గుండంలోకి భక్తులు నువ్వుల నూనె, నల్ల వస్త్రాలు, నల్ల వత్తులు సమర్పించి టెంకాయలు కొట్టి పూజలు చేశారు. మూడు శ్రావణ శనివారాల కంటే చివరి నాల్గవ శ్రావణ శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ముఖ్యంగా చిత్రదుర్గం, చెళ్లకెరె, దావణగెరె, శివమొగ్గ ప్రాంతాల నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీక్ష మంటపంలో భక్తులు శనీశ్వరస్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అన్నపూర్ణ భవనంలో ఏర్పాటు చేసిన ప్రసాద వినియోగంలో భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సీఐ సురేశ్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సమితి పదాధికారులు, ఆలయ సిబ్బంది, వలంటీర్లు సేవలందించారు. -
రూ.కోట్లుంటేనే సీట్లు!
సాక్షి, పుట్టపర్తి పురపాలక పీఠం చాలా ఖరీదు కానుంది. మారిన ఎన్నిక విధానంలో రూ.కోట్లుంటే తప్ప సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో అత్యధిక కౌన్సిల్ సీట్లు గెలిచిన పార్టీ చైర్మన్‌గా ఒకరిని ఎంపిక చేసేది. ఈ క్రమంలో సామాన్యులెందరో చైర్మన్లుగా అవకాశాలు దక్కించుకున్నారు. కానీ తాజాగా మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో చైర్మన్ సీటు హాట్‌గా మారింది. డబ్బుమూటలుంటే తప్ప కౌన్సిలర్ సీటు కూడా ఇవ్వని కూటమి పార్టీలు... చైర్మన్ సీటును ఎంతకు బేరం పెడతాయో ఆలోచించుకోవచ్చు. ఇప్పటికే ఆ విషయం తెలుసుకున్న కొందరు బడాబాబులు ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ ఫండ్ కింద కొంత.. ఎన్నికల కోసం ఇంకొంత కలిపి రూ.కోట్లలో ఖర్చు చేసే సామర్థ్యం ఉందని.. తమకే చైర్మన్ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే రిజర్వేషన్ ఖరారయ్యే వరకూ ఎవరికీ హామీ ఇవ్వలేమంటూ పెద్దలు మాట దాట వేస్తున్నారు. దీంతో ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ధనమూ... బలమూ ఉంటేనే చైర్మన్.. గతంలో మున్సిపాలిటీలో ఉన్న స్థానాల్లో సగం కంటే ఎక్కువ గెలిచిన పార్టీ వ్యక్తి చైర్మన్ అయ్యేవారు. గెలిచిన వారిలో ఎవరో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకునే వారు. కౌన్సిలర్‌గా గెలిచి.. చైర్మన్ పీఠం అధిరోహించే అవకాశం ఉండేది. ఒక వార్డులో ఖర్చు భరించి.. పార్టీలో చెలామణి అవుతూ.. పెద్దల ఆశీర్వాదం ఉంటే చైర్మన్ పీఠంపై కూర్చునే అవకాశం ఉండేది. ఒక్కోసారి రిజర్వేషన్ కలిసి వచ్చి పదవులు పొందిన వారూ ఉన్నారు. అయితే ఇక నుంచి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రస్తుతం చైర్మన్ కోసం ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో మున్సిపాలిటీలోని అన్ని వార్డుల ఓటర్ల ఆశీర్వాదం అవసరం. చైర్మన్ కుర్చీ కావాలంటే కనిష్టంగా రూ.కోటి పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో సామాన్యులకు ఇక నుంచి చైర్మన్ పీఠం కలగానే మిగిలిపోనుంది. కేవలం బడాబాబులే చైర్మన్ కోసం పోటీ చేసి.. కుర్చీ దక్కించుకుంటారు. పెరిగిన సీట్లతో అధిక భారం.. గతంతో పోలిస్తే ప్రతి మున్సిపాలిటీలో కౌన్సిల్ స్థానాల పెరిగింది. పెనుకొండలో 3, మడకశిరలో 3, పుట్టపర్తిలో 8, ధర్మవరంలో 8, కదిరిలో 8, హిందూపురంలో 14 స్థానాలు పెరగనున్నాయి. గతంలో ఏదో ఒక స్థానం నుంచి గెలిచి పార్టీ ఆశీస్సులతో చైర్మన్ అయ్యే వారు. కానీ మారిన పరిస్థితుల్లో అన్ని కౌన్సిల్ స్థానాల అభ్యర్థుల ద్వారా ప్రజల ఓట్లు రాబట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. ఫలితంగా ఖర్చు రూ.లక్షల నుంచి రూ.కోట్లకు చేరింది. దీంతో సంపన్నులకు భారీగా అవకాశాలు రానున్నాయి. మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఇక ప్రత్యక్షమే నేరుగా ఓట్లు వేస్తేనే చైర్మన్ అయ్యే అవకాశం రూ.కోట్లు కుమ్మరిస్తే తప్ప గట్టెక్కలేని వైనం ఇప్పటికే ఎమ్మెల్యేల వద్ద ప్రారంభమైన లాబీయింగ్ రిజర్వేషన్ ఖరారయ్యే వరకూ హామీ ఇవ్వలేమంటున్న పెద్దలు సీట్ల ఆధారంగా డబ్బు సర్దుకుంటున్న ఆశావహులు వైఎస్సార్సీపీ హయాంలో సామాన్యులకే చైర్మన్ పీఠం డబ్బుపైనే కూటమి ఆశలు.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఏర్పడింది. ఏ ఓటరును అడిగినా.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం డబ్బుపై ఆధారపడి కూటమి నేతలు ఓటింగ్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో భారీగా డబ్బులు ఉన్న వారికే గాలం వేస్తున్నారు. ఇదే అదనుగా బడాబాబుల్లో ఆశలు మొదలయ్యాయి. ఎవరికి వారుగా ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే తమకే సీటు కావాలంటూ పట్టుబడుతునట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రూ.లక్షలు దాటి చైర్మన్ పీఠం రూ.కోట్లు పలుకుతోందని తెలిసింది. సామాన్యులను పీఠం ఎక్కించిన వైఎస్సార్ సీపీ.. జిల్లాలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, మడకశిర మున్సిపాలిటీలు ఉన్నాయి. 2021 ఎన్నికల్లో ఆరు స్థానాలనూ వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. అప్పట్లో ఉన్న నిబంధనల ప్రకారం అత్యధిక సీట్లు సాధించి వారిలో ఒకరికి చైర్మన్ పీఠం కట్టబెట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి రాజకీయ అనుభవం, నేపథ్యంలేని సామాన్యులకు, మహిళలకు సైతం అవకాశం కల్పించారు. అందులోనూ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు పెద్దపీట వేశారు. దీంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ సామాన్యులే చైర్మన్ పీఠం అధిరోహించారు. ఎంతైనా తీసుకోండి చైర్మన్‌ను చేయండిఆగండి.. ఆగండి రిజర్వేషన్ రానివ్వండిఎలాగైనా ఈ పీఠం నాకే దక్కాలి -
సాయి స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేద్దాం
ప్రశాంతి నిలయం: ‘‘అందరినీ ప్రేమించు– అందరినీ సేవించు’’ అన్న సత్యసాయి స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ప్రతి సాయి భక్తుడు ముందుకు సాగాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు పిలుపునిచ్చారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన విశాఖపట్నం జిల్లా సత్యసాయి భక్తులకు శనివారం ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జే రత్నాకర్ రాజు మాట్లాడుతూ సత్యసాయి ప్రేమ, సేవ, సత్యం అన్న మానవతా విలువలను ఆచరించి చూపారన్నారు. నేటి తరానికి సాయి బోధించిన విలువలే ఆచరణ మార్గాలు కావాలన్నారు. అభాగ్యులకు ఆపన్న హస్తం అందించాలన్న సత్యసాయి సంకల్పం ఎంతో గొప్పదన్నారు. వైద్యం వ్యాపార మయమైన ఈ రోజుల్లో సత్యసాయి వైద్య సంస్థలు నయా పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాయంటే సత్యసాయి సంకల్ప బలంతోనే సాధ్యమైందన్నారు. ప్రశాంతి నిలయానికి వచ్చే ప్రతి భక్తుడు తన బిడ్డే అన్న విశ్వాసంతో సత్యసాయి నడిచారని, అందుకే ప్రశాంతి నిలయానికి ధనికులు వచ్చినా, పేదలు వచ్చినా నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేని వ్యవస్థను రూపొందించారన్నారు. ప్రశాంతి నిలయానికి వచ్చి వెళ్లే ప్రతి భక్తుడు తనను తాను సంపూర్ణుడిగా స్వయం పరివర్తన సాధిస్తూ సమాజానికి మంచిని పంచాలన్నారు. అలరించిన సంగీత కచేరీ విశాఖపట్నం జిల్లా సత్యసాయి భక్తులు పర్తియాత్ర ముగింపు సందర్భంగా సాయికుల్వంత్ సభా మందిరంలో సంగీత విభావరి నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ ఆయన ప్రేమ తత్వాన్ని కీర్తిస్తూ నిర్వహించిన కచేరీతో భక్తులు పరవశించి పోయారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు -
వీఆర్ఓ వెంకటసాయిపై సస్పెన్షన్ వేటు
చిలమత్తూరు: మండల పరిధిలోని వీరాపురం, సోమఘట్ట పంచాయతీల్లో వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటసాయిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్యాంప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు వెంకటసాయిపై పలు అవినీతి ఆరోపణలు రావడం, సామాన్యులు, అమాయకులతో డబ్బు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు, అదే విధంగా విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్నారు. పట్టపగలే రెండిళ్లలో చోరీ ఎన్పీకుంట: మండల పరిధిలోని గౌకనపల్లి గ్రామంలో శనివారం ఉదయం రెండు ఇళ్లలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన టి.బయప్ప, జల్లా శివమోహన్‌రెడ్డి ఇంట్లో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితుల వివరాల మేరకు.. శనివారం గ్రామస్తులంతా వనభోజనాలకు వెళ్లారు. టి.బయప్ప భార్య చంద్రమ్మ వనభోజన కార్యక్రమం నుంచి తమ ఇంటి పక్కన ఉన్న వృద్ధుడు గంగిరెడ్డికి భోజనం ఇవ్వడానికి ఉదయం 11 గంటలకు ఇంటికి రాగా తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.1.38 లక్షల నగదు, ఆరు తులాల బంగారు ఆభరణాలు, నాలుగు జతల వెండి పట్టీలు దొంగిలించినట్లు గుర్తించారు. అలాగే జల్లా శివమోహన్‌రెడ్డి ఇంటిలోని బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.20,000 నగదు అపహరించుకు పోయినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించినట్లు ఎస్ఐ క్రిష్ణమూర్తి తెలిపారు. ● నాలుగు రోజుల క్రితమే మండలంలోని వెలిచలమల గ్రామంలో రెండు ఇళ్లలో చోరీ జరిగిన ఘటన మరవక ముందే మరో రెండు ఇళ్లలో చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై ఎస్పీకి ఫిర్యాదు పుట్టపర్తి టౌన్: కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు గూలూరు మహాసంస్థానం ప్రతినిధి నరసింహమూర్తి తెలిపారు. శనివారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపర్తి మండల పరిధిలోని నిడిమామిడి గ్రామంలో 750 ఏళ్ల చరిత్ర కలిగిన జంగమ మఠం, వీరభద్రస్వామి దేవాలయం వివాదాస్పదంగా మారిందన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికి నకిలీ తాళాలతో దేవాలయం తెరిచి పూజలు చేస్తున్నారన్నారు. మఠం భూములు తన పేరుపైకి మార్చుకున్న నిడిమామిడి వాసి వీరభద్రునిపై మూలమఠం ప్రతినిధులు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈనెల 6,7 తేదీల్లో నిడిమామిడిలో తలపెట్టిన కార్యక్రమం నిలుపుదల చేయాలని పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. భక్తులు రూ.70 లక్షల విరాళాలు సేకరించి శిథిలమైన దేవాలయాన్ని 2021–25 సంవత్సరంలో పునరుద్ధరించి ఫిబ్రవరిలో ప్రతిష్ట చేశారన్నారు. పూజల కోసం శిక్షణ పొందిన అర్చకుడు కరిబసయ్యను నియమించామని, అయితే, గతంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన వీరభద్రడు తానే అర్చకుడని కొత్త అర్చకునిపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. దీనిపై పుట్టపర్తి కోర్టులో మార్చిలో కేసు వేయగా, కోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ పాత పూజారి పూజలు చేయడానికి అనుమతులు ఇచ్చిందన్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి నకిలీ తాళాలతో వీరభద్రుడు దేవాలయంలో పూజలు చేస్తున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో నిడిమామిడి జగద్గురు మఠం కార్యదర్శి రత్నకుమార్, గూలూరు మహా సంస్థానం ప్రతినిధి వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జెడ్పీగా శ్రీసత్యసాయి
● 25 నుంచి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అనంతపురం న్యూటౌన్: శ్రీసత్యసాయి జిల్లాలో నూతన జిల్లా పరిషత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్‌ల పునర్విభజనకు సంబంధించి 114 నంబరు ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రస్తుతమున్న జిల్లా ప్రజా పరిషత్ పాలక వర్గాల పదవీకాలం ఈ నెల 24తో ముగయనుంది. ఆ మరుసటి రోజు అంటే సెప్టంబర్ 25వ తేదీ నుంచి కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా పరిషత్‌లు అమల్లోకి రానున్నాయి. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలోని 13 జిల్లాల స్థానంలో పరిపాలనా సౌలభ్యం కోసం 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పాత జిల్లా కేంద్రాలుగానే ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్తులుగా పాలనను కొనసాగిస్తూ వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో రెండు జిల్లాను అదనంగా ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో 28 జిల్లాలయ్యాయి. అనంతపురం నుంచి దక్షిణ ప్రాంతాన్ని విడగొట్టి పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే జెడ్పీ పాలన మాత్రం ఉమ్మడి అనంతపురం నుంచే కొనసాగుతూ వచ్చింది. కొత్తగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 32 మండలాలతో శ్రీసత్యసాయి జిల్లా ప్రజా పరిషత్ పాలన ఈ నెల చివరి వారం నుంచి అమల్లోకి రానుంది. ఇసుక టిప్పర్ల అడ్డగింత ముదిగుబ్బ: నదిలోని ఇసుకను అక్రమంగా తరలించడంతో పాటు అధికలోడుతో వెళ్తూ తమ గ్రామ రహదారిని దారుణంగా దెబ్బతీస్తున్న ఇసుక టిప్పర్లను పీసీరేవు గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని పీసీరేవు ఇసుక రీచ్ నుంచి కొందరు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా సిమెంట్ పైపులు వేసి ఇసుక వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ... ఇసుక టిప్పర్ల వల్ల రహదారులు ఛిద్రం అవుతున్నాయన్నారు. ఇష్టానుసారం ఇసుక తరలింపుతో నదీ పరివాహాక ప్రాంతంలో భూగర్భ జలమట్టం అడుగంటిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గంజాయి విక్రేతల అరెస్ట్ తలుపుల: గంజాయి విక్రయిస్తున్న ఓ జంటను పోలీసులు శనివారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5.430 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ చెన్నయ్య తెలిపిన వివరాల మేరకు...మండలంలోని పూలవాండ్లపల్లికి చెందిన నారాయణ, శాంతమ్మ దంపతులు. వారు తమ ఇంటి వద్దే 12 గంజాయి మొక్కలు పెంచుతున్నారు. తరచూ గంజాయి పంటను కోసి ఇతరులకు విక్రయిస్తూ ఉండేవారు. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం తహసీల్దార్ మురళీకృష్ణ, ఆర్ఐ శ్రీనివాస్, ఏఓ నాగమధుసూదన్ సమక్షంలో నారాయణ దంపతుల ఇంటిపై దాడులు నిర్వహించారు. దంపతులపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేశారు. అనంతరం వారు సాగుచేస్తున్న 5.430 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే విక్రయానికి సిద్ధం చేసి ఇంట్లో దాచి ఉంచిన మరో 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కబ్జాకు గురైన వంక స్థలం సర్వే కదిరి టౌన్: కబ్జాకు గురైన సైదాపురం పొలం సర్వే నంబర్ 624–1, 625లోని స్థలాన్ని శనివారం అధికారులు సర్వే చేశారు. సదరు స్థలాన్ని స్థానిక టీడీపీ నాయకుడు కబ్జా చేసి భూమిని చదును చేసిన వైనంపై ‘వంకనూ వదల్లేదు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు శనివారం ఉదయం అక్రమణకు గురైన స్థలాన్ని సర్వే చేశారు. వంక పోరంబోకు భూమిని ఎవరు ఆక్రమించినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైదాపురం పొలం సర్వే నంబర్ 624–1, 625లోని స్థలానికి సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఇరిగేషన్ ఏఈ మహేష్ తెలిపారు. -
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
పుట్టపర్తి అర్బన్: చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్జేడీ శామ్యూల్, డీఈఓ కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, అధికారులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, వారి కుటుంబీకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ మేధావి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమన్నారు. విద్యారంగంలో మనం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని, ఈ గొప్పతనం మన ఉపాధ్యాయులదే నన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అన్నింటికంటే ముందు క్రమశిక్షణ నేర్పించాలన్నారు. ఇక సాంకేతిక పెరిగిపోవడంతో ఉపాధ్యాయుల్లో ఒత్తిడి మరింత పెరిగిందన్నారు. యాప్‌లతో ఇబ్బంది పడుతున్నారని, పని ఒత్తిడి, టెట్ సమస్యలు...ఇలా ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం ముందుంచామని, త్వరలోనే మంచి సంకేతాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంపై పలు విమర్శలు వస్తున్నాయన్నారు. సరఫరాదారులంతా ముఠాగా ఏర్పడి దోచుకుంటున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. జాతి నిర్మాతలు ఉపాధ్యాయులే.. జాతి నిర్మాతలు ఉపాధ్యాయులేనని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. విద్యార్థుల్లో విలువలు పెంచేలా బోధన సాగాలన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంపై తల్లిదండ్రులే చర్యలు తీసుకుంటే మంచిదన్నారు. సెల్‌కు బానిసలుగా కాకుండా సమాజానికి నిర్దేశకులుగా తీర్చి దిద్దాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రలకు హితబోధ చేశారు. వలసలు పెరిగి హాజరు తగ్గింది.. జిల్లాలో వలసలు పెరగడంతో స్కూళ్లలో విద్యార్థుల హాజరుశాతం తగ్గిందని ఆర్జేడీ శామ్యూల్ అన్నారు. జిల్లాలో 8 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా హాజరు 99 శాతం ఉందన్నారు. కానీ విద్యార్థుల హాజరు మాత్రం 89 శాతమే ఉందన్నారు. హాజరు శాతం పెంచాలన్నారు. అనంతరం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయుల్లో క్రమ శిక్షణ పెరగాలన్నారు. ఉపాధ్యాయులకు క్రమశిక్షణ ముఖ్యం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ‘మంగళకర’లో ఉపాధ్యాయ దినోత్సవం 54 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల అందజేత ఉపాధ్యాయులకు అవమానం గురుపూజోత్సవం రోజున జిల్లా ఉపాధ్యాయులకు తీవ్ర అవమానం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆహ్వానాలు పంపడంతో పాటు కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. అయితే కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా... 2 గంటలు ఆలస్యంగా 3.30 గంటలకు ప్రారంభమైంది. పైగా ఉపాధ్యాయులు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేకపోవడంతో వారంతా గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది. ఉపాధ్యాయుల ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ డీఈఓ కిష్టప్పపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు కుర్చీలు తెప్పించారు. దీంతో పాటు సుమారు గంటన్నరకుపైగా ప్రసంగాలతో విసుగు తెప్పించారు. సన్మాన కార్యక్రమం కూడా చాలా దారుణంగా సాగింది. అవార్డు గ్రహీతలను కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి ఉత్తమ ఉపాధ్యాయులను నిల్చోబెట్టే సత్కరించడంతో వారంతా అసహనం వ్యక్తం చేశారు. -
వివాహిత ఆత్మహత్య
గుంతకల్లు: స్థానిక తాటాకుల వీధికి చెందిన రాజేశ్వరి (33) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి బోయ లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజేశ్వరికి 15 ఏళ్ల క్రితం నేమకల్లు మద్దిలేటితో వివాహం జరిగింది. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ఈ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అప్పులు ఎక్కువగా ఉన్నాయంటూ తల్లి లక్ష్మీదేవితో రాజేశ్వరి చెప్పుకుంటూ బాధపడుతుండేది. శనివారం ఉదయం సెంట్రింగ్ పనికి మద్దిలేటి వెళ్లగా.. చిన్న కుమారుడు స్కూల్‌కు వెళ్లాడు. పెద్ద కుమారుడు శ్యామ్‌కుమార్ కూడా బయటకు వెళ్లిన సమయంలో జీవితంపై విరక్తి చెందిన రాజేశ్వరి బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అప్పడే ఇంటికి వచ్చిన కుమారుడు శ్యామ్‌కుమార్ బెడ్ రూమ్ తలుపులు ఎంత కొట్టినా రాజేశ్వరి తెరవకపోవడంతో సమీపంలోనే ఉన్న మామ కృష్ణకు చెప్పాడు. ఆయన తలుపులు పగులగొట్టి వెంటనే రాజేశ్వరిని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు ఉరవకొండ:మండలపరిధిలోని పెద్దముస్టూరు గ్రామానికి చెందిన చరణ్‌తేజ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ మహనంది యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన మేరకు.. బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించిన చరణ్‌తేజ్ గత నెల 10న బెంగళూరుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కోసం తల్లిదండ్రులు వెతుకుతున్న సమయంలో చరణ్ గత నెల 18న ఇంటి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయిన బాలికతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో● ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు రాయదుర్గం రూరల్/బెళుగుప్ప: రాయదుర్గం మండలంలోని కాశీపురం గేటు వద్ద శనివారం సాయంత్రం బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రామ్‌చరణ్, అభిరామ్, గోపాల్‌లు రాయదుర్గం మండలంలోని కాశీపురం గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్లి తిరిగి వస్తుండగా, రాయదుర్గం–అనంతపురం జాతీయ రహదారిపై బొలెరో ఢీకొంది. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులు గుండ్లపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై రాయదుర్గం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెలరేగిన అనంత బ్యాటర్లుఅనంతపురం: ఏసీఏ సౌత్ జోన్ అండర్ 23 పురుషుల మల్టీడే క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో అనంత బ్యాటర్లు చెలరేగిపోయారు. నెల్లూరుపై భారీ స్కోర్ సాధించారు. అనంత క్రీడాగ్రామంలోని ఆర్సీజీ మైదానం వేదికగా అనంతపురం, నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 450 పరుగులు సాధించింది. జట్టు బ్యాటర్లు పి.విశ్వవికాస్ 238 బంతుల్లో 20 ఫోర్లు 5 సిక్సర్లతో 161 పరుగులు సాధించాడు. మరో బ్యాటర్ వెంకట్లోకేష్ 126 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 118 పరుగులు, హనీష్ వీరారెడ్డి 94 పరుగులు సాధించారు. నెల్లూరు బౌలర్లలో అఖిల్ 5, భార్గవ్ మహేష్ 2 వికెట్లు తీశారు. ● ఏసీజీ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో వైఎస్సార్ కడప, కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కడప జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను చాలా పేలవమైన ఆటతీరుతో చతికిలపడింది. కేవలం 26.2 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌట్ అయింది. కర్నూలు బౌలర్లలో అక్షిత్‌రెడ్డి ఐదు, సబ్జాన్బాషా 5 వికెట్లు చొప్పున కూలదోసి, కడప బ్యాటర్లను కట్టడి చేశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 37.3 ఓవర్ల వద్ద 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులకు ఆటను డిక్లైర్ చేసింది. కర్నూలు బ్యాటర్లు సాయి సూర్యతేజారెడ్డి 76, రోహిత్‌గౌడ్ 67 పరుగులు సాధించారు. కడప బౌలర్లలో ఆదిల్‌హుస్సేన్ 5, మహమ్మద్ అస్లాం 4 నాలుగు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు ఆట ముగిసే సమయానికి పది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులు సాధించింది. -
పాలపాటిదిన్నె కిటకిట
నల్లచెరువు: పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలతో పాటు అభిషేకాలు చేశారు. శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో స్వామి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు క్యూలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని మంగళ వాయిద్యాలు, భజన, కోలాటాల మధ్య ఊరేగించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. కదిరి ఆర్టీసీ అధికారులు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా బస్సులను నడిపారు. ఆలయ ప్రాంగణంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ మక్బూల్ బాష బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి దర్శనానికి క్యూలో వెళ్తున్న భక్తులు, పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి -
సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండాలి
పెనుకొండ రూరల్: మహిళలు, బాలికలు సోషల్ మీడియా వేదికలపై అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ అంకిత సురాన పేర్కొన్నారు. శనివారం పట్టణంలో మహిళల భద్రతపై ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలోని భువన విజయం సమావేశం మందిరంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సోషల్ మీడియాను అవసరానికి మించి వినియోగించరాదన్నారు. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోరాదన్నారు. ఆర్డీఓ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, శోభ, రవి కుమార్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి డీఎస్పీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన పోలీస్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను అడిషనల్ ఎస్పీ అంకిత సురాన సందర్శించారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన దంపతులతో మాట్లాడారు. సహనం, ఓర్పుతో ఉండి పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలన్నారు. కుటుంబ బంధాలను కాపాడుకోవాలని సూచించారు. -
కారు – ద్విచక్ర వాహనం ఢీ
● వ్యక్తికి తీవ్ర గాయాలు అగళి: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాలమేరకు.. పి.బ్యాడేగర్ గ్రామానికి చెందిన మంజునాథ్ ద్విచక్ర వాహనంలో జాతీయ రహదారి దాటే క్రమంలో మడకశిర వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొంది. ఘటనలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న మంజునాథ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స చేయాడానికి వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏమైనా ప్రమాదాలు జరినప్పుడు కూడా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రమాదం జరిగినా కర్ణాటక రాష్ట్రంలోని శిర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికారులు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మెరుగైన వేద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. -
రాత్రి కేబుల్ దొంగతనాలు
పగలు కొబ్బరి బోండాల వ్యాపారం...అగళి: పగటిపూట కొబ్బరి బోండాలు అమ్ముతూ ... రాత్రి వేళల్లో మాత్రం వ్యవసాయ పొలాల వద్ద మోటార్లకున్న కేబుల్‌ను అపహరించే దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలమేరకు.. మండల పరిధిలోని నందరాజన్నపల్లికి చెందిన తిప్పన్న, హెచ్డీ హళ్లి తండాకు చెందిన ఆనందనాయక్ రైతుల నుంచి కొబ్బరి బోండాలను తీసుకొని అమ్ముకునేవారు. అయితే రాత్రి సమయంలో మాత్రం దొంగలుగా మారి రైతుల పొలాల్లో మోటర్లుకు అమర్చిన కేబుల్‌ను అపహరించేవారు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం శిర తాలూక దావూసపాళ్యం వద్ద పాత వస్తువులు తీసుకునే వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకునేవాళ్లు. ఈ నేపథ్యంలో రైతులు తమ పొలాల్లో కేబుల్ దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల పాత వస్తువులను తీసుకునే వాళ్లకు కేబుల్ తీసుకొని ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు దొంగలు కేబుల్‌ను అపహరించి దావూసపాళ్యంలో పాత వస్తువులు కొనే యజమానికి అమ్మేందుకు యత్నించారు. అతను వారి వీడియోను పోలీసులకు పంపడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఆరు నెలల నుంచి మండల పరిధిలోని అనేక వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్‌ను చోరీ చేశారని రైతులు చెబుతున్నారు. -
టైలరింగ్, బ్యూటీషియన్‌పై ఉచిత శిక్షణ
పుట్టపర్తి టౌన్: కెనరాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, బ్యూటీపార్లల్పై నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శాంతిప్రియ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలలకు పుట్టపర్తి సమీపంలో బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న కెనరాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈనెల 15 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఆధార్, రేషన్‌కార్డు, నాలుగు పాస్ ఫొటోలు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, తమ విద్యార్హత సర్టిఫికెట్లను జిరాక్స్ తీసుకొని బ్రాహ్మణపల్లిపల్లి వద్ద కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈఅవకాశాన్ని గ్రామీణా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8977718982, 9391486269, 08555–286427 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. జూదరుల అరెస్టు ధర్మవరం: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్జీఓ హోంపై పట్టణ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.59,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ రెడ్డప్ప పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. -
మైనార్టీల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
కదిరిటౌన్: మైనార్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వక్తలు అన్నారు. కదిరిలో శుక్రవారం క్రైస్తవుల సమాఖ్య కదిరి ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సమానత్వాన్ని మరింత బలోపేతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. సమాజాభివృద్ధికి విద్య, అవగాహన, ఐక్యత, రాజ్యాంగ విలువలపై నమ్మకం ఎంతో అవసరమన్నారు. సిమ్స్ హాస్పిటల్ ఎండీ నిసార్యాసీన్ మాట్లాడుతూ మైనారిటీలు, పేదలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సభలో మైనార్టీ వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులు, రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. మైనార్టీ వర్గాలపై చోటుచేసుకుంటున్న దాడులు, వివక్ష వంటి ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, మత స్వేచ్ఛ వంటి విలువలను కాపాడుకుంటూ అన్ని వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులు, ముస్లింలు, వెనుకబడిన వర్గాల పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి.. రాజ్యాంగ పరిధిలో తగిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో క్రైస్తవుల సమాఖ్య కదిరి ఫెలోషిప్ కమిటీ సభ్యులు, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు, సంఘపెద్దలు, యువత, మైనారిటీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ -
క్రికెట్ టాలెంట్ హంట్‌లో బాలికల ప్రతిభ
కదిరి టౌన్: శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయం 10 గంటల నుంచి ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఆలయంలోని కల్యాణ వేదిక పైన అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామగ్రి ఆలయ అధికారులు సమకూర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎ.డి.పార్థసారథి చార్యులు మహిళల చేత వ్రతాన్ని ఆచరింపజేయించి, వ్రత విశిష్టతను తెలియజేశారు. పూజల్లో దాదాపు 400 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం తీర్థ, అన్నప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి, మహిళలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
శింగనమల చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
● రక్షించిన స్థానికులు శింగనమల: అనారోగ్యంతో కుటుంబ సభ్యులకు భారం కాకూడదని భావించిన ఓ మహిళ శింగనమల చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే అక్కడే రోడ్డు పనులు చేస్తున్న వారు గుర్తించి ఆమెను రక్షించారు. పోలీసుల వివరాల మేరకు... తాడిపత్రి గన్నెవారిపల్లి కాలనీకి చెందిన లక్ష్మీదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు షుగర్, పెరాల్సిస్ ఉండడంతో, కుటుంబ సభ్యులకు భారమవుతానని భావించి శింగనమల మరువకొమ్మ క్రాస్‌కు బస్సులో వచ్చారు. అక్కడ బస్సు దిగి చెరువులోకి దూకింది. అయితే అక్కడే దగ్గరలో రోడ్డు పనులు చేస్తున్న కార్మికులు , రోడ్డు మీద ఉన్న ప్రయాణికులు వెంటనే ఆమెను కాపాడి చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. ఏఎస్ఐ అశోక్‌కుమార్ సిబ్బందితో అక్కడికి వెళ్లి లక్ష్మీదేవిని పోలీస్‌సేష్టన్‌కు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల వివరాలు కనుక్కొని వారిని పిలిపించి జాగ్రత్తగా చూసుకోవాలని మందలించారు. -
‘నేతన్న సేవ’ తేదీలను పొడిగించడం అన్యాయం
ధర్మవరం: నేతన్న సేవ పథకం కింద చేనేతల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసే తేదీలను పొడిగించడం అన్యాయమని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జేవీ రమణ, పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌బాషా, కార్యదర్శి గుంపు హరిలు తెలిపారు. స్థానిక ఏపీ చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ మొదటి విడతలో చేనేత కార్మికులకు నేతన్న సేవ పథకం కింద రూ.25వేలు కొంతమందికి వేశారన్నారు. పథకం వర్తించని అర్హులైన కార్మికులకు ఆగస్టు 30వతేదిన అందరి అకౌంట్లోకి జమ చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ చెప్పినా ఇంత వరకు డబ్బులు జమకాలేదన్నారు. మళ్లీ 10వ తేదీన జమ చేస్తామని మంత్రి చెప్పడం ఇలా తేదీలు పొడిగించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికై నా అర్హుల అకౌంట్లలో జమ చేయాలని లేకుంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్నం సూరి, పులిచెర్ల హరి, లోకేష్, సీఐటీయూ నాయకులు ఎల్.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని పోతుకుంట గ్రామ నడిబొడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయానికి ఉన్న తాళాలను ఆక్సాబ్లేడుతో కట్ చేసి దొంగలు లోపలికి ప్రవేశించారు. స్వామి వారికి అలంకరించిన సుమారు మూడు కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారని గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడే ఉన్న హుండీ పగులగొట్టే ప్రయత్నం చేసినా అది తెరుచుకోకపోవడంతో అలాగే వదిలివేశారు. గ్రామ నడిబొడ్డున ఉన్న ఆలయంలో చోరీ జరగడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విరాళాలు అందజేత తలుపుల: మండలంలోని గంజివారిపల్లి అభయాంజనేయస్వామి ఆలయాభివృద్ధి పనులకు రూ.లక్ష విరాళాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు వివేకానందరెడ్డికి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ డీకే బాబు శుక్రవారం అందజేశారు. అలాగే కుమ్మరపేట రామాలయానికి రూ.లక్ష, ఎగువపేట వినాయక మండపానికి రూ.50 వేలు విరాళం అందజేసినట్టు ఆయా గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు డీకే బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఖాద్రీశునికి ఉయ్యాల ఉత్సవం
కదిరి టౌన్: శ్రావణ శుక్రవారం సందర్భంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుడైన శ్రీవారికి శుక్రవారం రాత్రి అర్చకులు ఉయ్యాల ఉత్సవం నిర్వహించారు. ఉయ్యాల సేవలో భాగంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు భారీగా సంఖ్యలో పాల్గొని ఖాద్రీశుడిని కీర్తిస్తూ గీతాలు ఆలపించారు. వర్షం కోసం ముస్లింల ప్రార్థనలు అమడగూరు: మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామంలోని ఈద్గా వద్ద శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈద్గా వద్ద గంట పాటు ప్రార్థనలు నిర్వహించి వర్షాలు కురిపించాలంటూ అల్లాహ్‌ను వేడుకున్నారు. దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ధర్మవరం అర్బన్: పారా మెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని కాంట్రాక్ట్ మెడికల్, పారా మెడికల్ ఉద్యోగులు తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకూ వంద శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. తమ న్యాయమైన సమస్యల సాధనకు నిరంతరం పోరాడుతామన్నారు. నిరసనలో వెంకట రామంజినేయులు, మహబూబ్ చాన్, పద్మ, కమలమ్మ, జయమ్మ, మహాదేవి, ఉమారాణి పాల్గొన్నారు. -
తెలుగుసారు.. సమాజహితుడు
చిలమత్తూరులోని పొట్టి శ్రీరాములు హైస్కూల్ తెలుగు టీచర్ హర్షవర్దన్‌రెడ్డి తెలుగు భాషాభివృద్ధితో పాటు పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు క్రీడా పరికరాలు, దుస్తులు అందించి క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. అలాగే తాను పనిచేస్తున్న పొట్టి శ్రీరాములు హైస్కూల్లో పొట్టి శ్రీరాములు పేరుతో 3డి ఆకృతిలో ఉద్యానవనం ఏర్పాటుకు కృషి చేశారు. ఇక బ్రిటీష్ హయాంలో అనంతకు తొలికలెక్టర్‌గా వ్యవహరించి ప్రజల మనసులు గెలుచుకున్న థామస్ మన్రో గురించి నేటి తరానికి తెలియజెప్పాలని హర్షవర్దన్‌రెడ్డి భావించారు. స్నేహితులు, సహచర ఉపాధ్యాయుల సహకారంతో మన్రో గుర్తుగా కోడూరు తోపు వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయించి ఎంతో విశిష్టత కల్పించారు. అందుకే నేటికీ దాన్ని థామస్ మన్రో తోపు అని పిలుస్తుంటారు. ఎక్కడ పనిచేస్తే అదే తన ఊరిలా భావించే హర్షవర్దన్‌రెడ్డి ఆ గ్రామాభివృద్ధికీ కృషి చేస్తుంటారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో తిరుగులేని గురువు
పరిగి మండలం మోదా ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రామకృష్ణ... స్కౌట్స్ అండ్ గైడ్స్ కబ్ మాస్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. విద్యార్థులను స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేర్చడంతో పాటు వారికి తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. పిల్లల్లో క్రమశిక్షణ, దేశ సేవ, సమాజ సేవ, వ్యక్తి గత సేవ తదితర అంశాల పట్ల విద్యార్థులను చైతన్యవంతులను చేయడంలో సఫలీకృతులయ్యారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌పై ఆసక్తి పెంచుకున్న ఆయన తొలుత బేసిక్ కోర్స్, ఆ తర్వాత అడ్వాన్స్ కోర్స్ ఫర్ కబ్ మాస్టర్, అనంతరం హిమాలయన్ ఉడ్ బ్యాడ్జ్ కబ్ మాస్టర్, అసిస్టెంట్ లీడర్ ట్రైనర్ కోర్సును పూర్తి చేశారు. అనంతరం విద్యార్థులను చైతన్యవంతులను చేసి స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో రాణింపజేసి దేశసేవకు పంపుతున్నారు. -
కేన్సర్‌తో పోరాడుతూనే వినూత్న బోధన
కదిరి మండలం కాళసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రిష్ణవేణి ఎస్జీటీగా పని చేస్తున్నారు. బోధించడంతోనే టీచరు బాధ్యత తీరదని భావించే ఆమె విద్యార్థుల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తున్నారు. తన జీతంతో తాను పని చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో అవసరాలు తీర్చారు. ప్లేట్లు, గ్లాసు, బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు, ఇలా చాలావరకు విద్యాసామగ్రిని తన సొంత నిధులతో కొనిచ్చారు. కేన్సర్ మహమ్మారి కబలిస్తున్నా..ఆత్మస్థైర్యంతో ముందుకుసాగుతూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. భర్త సహకారంతో విద్యార్థులకోసం ఎన్నోసేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకత వెలికితీసి వారితోనే చేతివృత్తులకు సంబంధించి పరికరాలను తయారు చేయిస్తున్నారు. తద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ వారు తమ సొంతకాళ్లపై నిలబడేలా ఇప్పటి నుంచే తీర్చిదిద్దుతున్నారు. -
‘పురం’లో గుప్పుమన్న గంజాయి
హిందూపురం టౌన్: గంజాయి విక్రయించిన, వినియోగిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏఎస్పీ మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. గంజాయి విక్రయాలు, వినియోగం, రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం హిందూపురం రూరల్, టూటౌన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది ప్రత్యేక దాడులు చేశారన్నారు. శ్రీకంఠపురం సమీపంలోని వివేకానంద స్కూల్ వద్ద గంజాయి సేవిస్తున్న ముక్కడిపేటకు చెందిన ఎస్.గౌతమ్, శ్రీకంఠపురానికి చెందిన కె.అరుణ్ కుమార్‌ను హిందూపురం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. గంజాయిని ఇతర వ్యక్తుల వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు వారు వెల్లడించగా, దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి 14.53 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా హిందూపురం ఆర్టీఓ కార్యాలయ సమీపంలో ఆటోనగర్‌కు చెందిన బాబా, లక్ష్మీపురానికి చెందిన మనోజ్ కుమార్ అలియాస్ మామ గంజాయి సేవిస్తుండగా..టూటౌన్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత, విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. యువత, విద్యార్థులు గంజాయికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయించే వారితో పాటు వినియోగించే వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ ప్రసాద్‌బాబు, టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం, ఎస్ఐలు రాజేష్, మునీర్ అహ్మద్, వీరాంజినేయులు, సిబ్బంది పాల్గొన్నారు. చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా విక్రయం.. హిందూపురంలో గంజాయి విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏఎస్పీ మహేష్ తెలిపారు. గంజాయిని కర్ణాటక, వైజాగ్ నుంచి కిలోల వారీగా అక్రమంగా రవాణా చేసి ఇక్కడ వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా సిద్ధం చేసి విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. గంజాయిని వినియోగిస్తున్న వారి గుర్తించేందుకు ప్రత్యేక టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ప్రస్తుతం హిందూపురంలో ఈ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, అనుమానితులతో పాటు వినాయక నిమజ్జనం సమయంలోనూ భారీగా టెస్టులు నిర్వహించి, గంజాయి వినియోగిస్తున్న వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు. వినాయక నిమజ్జనంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నలుగురు అరెస్ట్ 1.6 కేజీల గంజాయి స్వాధీనం -
వీరభద్రుని సేవలో 31 దేశాల ప్రతినిధులు
లేపాక్షి: ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన లేపాక్షిలో వెలసిన వీరభద్రస్వామిని 31 దేశాల మహిళా ప్రతినిధులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. పాలసముద్రం వద్ద ఉన్న నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్) ‘ప్రజా సేవలో నాయకత్వాన్ని ఆచరించడం’ అనే అంశంపై సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 31 దేశాల నుంచి 47 మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. వారంతా శుక్రవారం ఉదయమే లేపాక్షికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వామి, పాపనాశేశ్వర, రఘునాథస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వైభవం, శిల్పా కళా చాతుర్యం చూసిన మహిళా ప్రతినిధులు అబ్బురపడ్డారు. రాతి విగ్రహాలు, ఆలయ నిర్మాణ నైపుణ్యం చూసి ముగ్ధులయ్యారు. ఒక్కో విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించి చరిత్ర అడిగి తెలుసుకున్నారు. -
ఆటలతో జీవితాలకు బాటలు
బుక్కపట్నం బాలికల ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కె.ఉషారాణి అంకిత భావంతో పనిచేస్తూ వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేలా తీర్చిదిద్దుతున్నారు. తద్వారా పాఠశాలకూ ఎంతో పేరు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే బుక్కపట్నం పాఠశాలలో చదివే విద్యార్థిని హైందవి.. ఉషారాణి ప్రోత్సాహంతో 2023–24లో వెయిట్ లిఫ్టింగ్‌లో రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచింది. 2024–25లో పాఠశాలకు చెందిన హనీద, భార్గవి రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటారు. అలాగే విజయవాడలో జరిగిన ‘రంగోత్సవం’ పోటీల్లోనూ పాఠశాల విద్యార్థులను మొదటి స్థానంలో నిలబెట్టారు. -
సాయి కీర్తనం..కృష్ణ లీలామృతం
ప్రశాంతి నిలయం: సత్యసాయి సన్నిధిలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ఫల, పుష్ప, దళాలతో పాటు నెమలి ఈకలతో అలంకరించిన సత్యసాయి మహాసమధి చెంత వేలాది మంది భక్తులు ‘‘జగద్గురువు నీవే..మము నడిపించు సద్గురువు నీవే’’ అంటూ శ్రీ కృష్ణుని స్మరిస్కూ...సాయిని వేడుకుంటూ గీతాలాపన చేశారు. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థుల వేదపఠనంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీకృష్ణ లీలలు వివరిస్తూ... సత్యసాయి విద్యార్థులు కృష్ణాష్టకం నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో సంగీత కచేరీ నిర్వహించారు. అంతకుముందు గోకులం నుంచి గోవులను, పశుపక్షాదులను పుట్టపర్తి వీధులలో ఊరేగింపుగా సాయికుల్వంత్ సభా మందిరానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు గోవులకు పాలు తాగించి, పండ్లు తినిపిస్తూ గోసేవ నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో ఘనంగా కృష్ణజన్మాష్టమి వేడుకలు గోసేవ చేసిన ఆర్జే రత్నాకర్ రాజు నయన మనోహరం జనని నృత్యరూపకం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో విశాఖపట్నం జిల్లా బాలవికాస్ విద్యార్థులు ఆధ్యాత్మిక భక్తిరస సాంస్కృతిక ప్రదర్శనతో అందరినీ అలరించారు. ‘పర్తియాత్ర’లో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన చిన్నారులు... మానవ జీవితంలో తల్లి పాత్ర, తల్లి ప్రేమను వర్ణిస్తూ ‘జనని’ నాటికను నయన మనోహరంగా ప్రదర్శించారు. మహనీయుల జీవితాల్లో తల్లి ప్రేమ, త్యాగం ఎలా స్ఫూర్తిగా నిలిచాయో నృత్యరూపకం ద్వారా కళ్లకు కట్టారు. సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ పుట్టపర్తి ప్రాంతంలోని పేదలకు తాగునీరు, బడి, ఆస్పత్రి నిర్మించాలని కోరిన తీరు..ఆమె కోర్కెను మన్నించి సత్యసాయి సేవా కార్యక్రమాలు చేపి చూపిన తీరును చక్కగా వివరించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం
కణేకల్లు: వయోభారంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు హెచ్చెల్సీ వద్ద ఆత్మహత్యకు యత్నించిన ఘటన కణేకల్లులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బెణికల్లు గ్రామానికి చెందిన లింగాయితీ గిరిజమ్మ, ఎర్రిస్వామికి ముగ్గురు కూతుళ్లుండగా, అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఇటీవల ఎర్రిస్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వయోభారంతో బాధపడుతున్న గిరిజమ్మ జీవితంపై విరక్తి చెంది చనిపోవాలనుకుంది. సాయంత్రం బస్సులో కణేకల్లుకు వచ్చి శివారులో రామనగర్‌లోని హెచ్చెల్సీ వద్దకెళ్లింది. కాలువ గట్టుపై నుంచి దూకే శక్తి కూడా ఆ వృద్ధురాలికి లేదు. ఏదోలా కాలువలో పడి చనిపోవాలనుకున్న ఆమె ర్యాంప్ మీదుగా నడుచుకుంటూ కాలువలోపలికి వెళ్లింది. అటుగా వెళుతున్న కొందరు యువకులు గమనించి వెంటనే వృద్ధురాలిని రక్షించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వృద్ధురాలి నుంచి వివరాలు సేకరించి భర్తకు సమాచారమివ్వడంతో ఆయన ఆటోలో వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. తమను చూసుకునే వారు ఎవరూ లేకనే ఆత్మహత్యకు యత్నించినట్లు వృద్ధురాలు తీవ్ర వేదనతో పోలీసులకు చెప్పింది. -
దుర్గమ్మ గుడిలో చోరీ
బత్తలపల్లి: మండల పరిధిలోని వెంకటగారిపల్లి సత్రం వద్ద వెలసిన పురాతన దుర్గమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆలయ పూజారి డేరంగుల రాజా చిన్నాన్న గంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు ధరించి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయ తలుపులను మిషన్ ద్వారా తొలగించారు. అనంతరం ఆలయం లోపలికి వెళ్లి మిషన్ ద్వారానే హుండీ తలుపులు తెరిచి అందులో ఉన్న దాదాపు రూ.15 వేల నగదు, 10 తులాల వెండి గొడుగుతో పాటు మరో ఏడు చిన్న గొడుగులను (దాదాపు 25 నుంచి 30 తులాల వరకు) ఎత్తుకెళ్లిపోయారు. ఆలయ పూజారి రాజా తిరుపతికి వెళ్లడంతో ఆయన చిన్నాన్న గంగయ్య ఆలయం వద్దకు పూజలు నిర్వహించేందుకు వెళ్లాడు. అక్కడ ఆలయ తలుపులు కోసి ఉండడంతో అనుమానం వచ్చి గ్రామస్తులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరా ఉండగా అందులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ఎలా పాల్పడింది నమోదైంది. ముగ్గురు వ్యక్తులు రాగా ఇద్దరు బయట కాపలాగా ఉన్నట్లు తెలిసింది. -
దాడి కేసులో మూడేళ్ల జైలు శిక్ష
ఎన్పీకుంట: ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపర్చిన కేసులో ముద్దాయికి కదిరి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్ఐ కృష్ణమూర్తి వివరాలమేరకు... మండల పరిధిలోని ఎగువతూపల్లికి చెందిన కుప్పాల గంగప్ప గత ఏడాది నవంబర్ 24న మల్లెం శ్రీరాములు అనే వ్యక్తి జేసీబీతో చేస్తున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తుండగా అతనితో గొడవపడి దాడి చేసి గాయపరిచాడన్నారు. బాధితుడి ఫిర్యాదుమేరకు అప్పటి ఎస్ఐ వలిబాషా కేసు నమోదు చేసి ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు. కదిరి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సాక్ష్యాలను పరిశీలించి ముద్దాయికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారన్నారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పుఇచ్చినట్లు పేర్కొన్నారు. సకాలంలో సాక్ష్యులను హాజరుపరచి ముద్దాయికి శిక్షపడేలా చేసిన ఎస్ఐ కృష్ణమూర్తి, కోర్టు కానిస్టేబుల్ శేషగిరి, అధికారులు, సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్ అభినందించనట్లు తెలియజేశారు. సమ్మెలోకి ‘సత్యసాయి’ తాగునీటి కార్మికులుముదిగుబ్బ: సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కార్మికులు మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఇందులో భాగంగానే ముదిగుబ్బ సమీపంలోని పంప్ హౌస్ దగ్గర కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇన్నాళ్లూ వేతనాలు అందకపోయినా ఎండ, వాన, పండుగలు, సెలవులు లెక్క చేయకుండా ప్రజలకు తాగునీటి సరఫరా కొనసాగిస్తున్నామన్నారు. వేతనాల కోసం ప్రతిసారి సమ్మె చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. వేతనాలతో పాటు ఉద్యోగ భద్రతకు శాశ్వత పరిష్కారం చూపాలని, అలాగే మృతి చెందిన, రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీని చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, ముదిగుబ్బ మండల కార్యదర్శి బాబ్జాన్, సీఐటీయు జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, కార్మిక సంఘం నాయకులు మధు, నరేష్, రాజారెడ్డి, వెంకటేష్, బాషా, మిద్ది వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 92 శాతం పింఛన్ పంపిణీ పుట్టపర్తి అర్బన్: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో భాగంగా మంగళవారం ఉదయం కలెక్టర్ శ్యాంప్రసాద్ పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో పలువురు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. జిల్లాలోని 2,58,234 మంది లబ్ధిదారులకు రూ.113.88 కోట్లు మంజూరు చేశారు. ఇందులో మొదటి రోజు 2,37,743 మంది లబ్ధిదారులకు రూ.104.14 కోట్లు పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీకి బుధవారం ఆఖరని, తక్కిన మొత్తాన్ని సెర్ప్‌కు తిరిగి చెల్లించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ పీడీ నరసయ్య, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు పుట్టపర్తి టౌన్: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ సతీష్‌కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఎస్పీ సతీష్‌కుమార్ సబ్ డివిజన్ల వారీగా నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, పరిరక్షణ, చోరీలు, గ్రేవ్, నాన్‌గ్రేవ్, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, పెండింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాల చర్చించి దిశా నిర్దేశం చేశారు. స్టేషన్లలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సున్నితమైన సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వినాయక చవితి వేడుకలు ప్రశాంతగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేసి దొంగతనాలకు చెక్ పెట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సీఐలు లింగన్న, లక్ష్మీకాంత్‌రెడ్డి, ఇస్మాయిల్, బొజ్జప్ప, ఏఓ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
పుట్టపర్తి: తాగునీటి కోసం నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం రోడ్డెక్కారు. గుక్కెడు తాగునీళ్లు ఇవ్వలేని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఉన్నా ఒకటే .. రాజీనామా చేసినా ఒకటే అంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నెల రోజుల నుంచి తాగునీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరికి ఎస్ఐ వచ్చి సంబంధిత అధికారులతో మాట్లాడి నీళ్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మోటారు మరమ్మతుకు గురికావడంతో నెలరోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామన్నారు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అసెంబ్లీలో గొప్పలు చెప్పుకోవడం కాదు గ్రామీణ ప్రాంతాల్లో చుక్క నీళ్లు ఇవ్వలేకపోతున్నారు.. మీకెందుకు ఎమ్మెల్యే పదవి అని మండిపడ్డారు. నీటి సమస్య పరిష్కరించకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామన్నారు. తాగునీళ్లు ఇవ్వలేని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ -
సాంకేతిక విద్యా ప్రదాత
●వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు సువర్ణ యుగం ●ఉచిత విద్యుత్ అమలు, కరెంటు బకాయిల రద్దుతో వ్యవసాయానికి ఊపిరి ●సంక్షేమం.. అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాలకూ మేలు చేకూర్చిన వైనం ●నేడు వైఎస్సార్ వర్ధంతివిద్యా కేంద్రంగా మడకశిర మడకశిర: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ హయాంలో మడకశిరను విద్యా కేంద్రంగా మార్చారు. రాష్ట్రస్థాయి వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి మడకశిర రూపురేఖలను మార్చివేశారు. అలాగే వెటర్నరీ, హార్టికల్చర్, వ్యవసాయ పాలిటెక్నక్ కళాశాలలను కూడా ఏర్పాటు చేసి విద్యాప్రదాతగా నిలిచారు. ఒకేషనల్ జూనియర్ కళాశాల, జనరల్ పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఏర్పాటు చేసి మడకశిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. సాగు, తాగునీటికి భరోసా మడకశిర నియోజకవర్గంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం వైఎస్సార్ హయాంలో దాదాపుగా 80 శాతం పనులను పూర్తి చేశారు. మడకశిరకు కృష్ణా జలాలు వస్తున్నాయంటే వైఎస్సార్ చూపిన చొరవే కారణం. వైఎస్సార్ హయాంలోనే పీఏబీఆర్ (శ్రీరామరెడ్డి తాగునీటి పథకం) తాగునీటి పథకం ప్రారంభమైంది. దాదాపు రూ.600 కోట్లతో ఈపథకాన్ని పూర్తి చేసి మడకశిర నియోజకవర్గానికి ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందించారు. రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో వైఎస్సార్ హయాంలో దాదాపు 30 వేల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ఆయన హయాంలో వందలాది కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. వైఎస్సార్ హయాంలో మడకశిర నియోజకవర్గంలో దాదాపు రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. అనంతపురం అగ్రికల్చర్: అది 1993 – 2004 మధ్య కాలం. ప్రకృతి కన్నెర్రజేసింది. వరుస కరువులు ఉమ్మడి అనంతపురం జిల్లాను అతలాకుతలం చేశాయి. పంటలు దెబ్బతిని.. పెట్టుబడులు తిరిగి రాలేదు. రైతు ఇంట అప్పులు కుప్పలుగా పెరిగిపోయాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ పోషణ భారమై.. పొట్ట చేత పట్టుకుని వలసబాట పట్టారు. అప్పులు తీర్చలేక.. ఆత్మాభిమానం చంపుకోలేక వందలాదిమంది రైతులు అర్ధంతరంగా తనువు చాలించారు. ఆదుకోవాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటి సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే రైతులతో పాటు అన్ని వర్గాలకూ నేనున్నానంటూ సంక్షేమ పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలతో భరోసా కల్పించారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సువర్ణయుగాన్ని మరిపించేలా పాలన సాగిస్తున్న క్రమంలో 2009 సెప్టెంబర్ 2న ఆయన హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అయినా ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం వైఎస్సార్సీపీ కార్యాలయాలతో పాటు ఊరూరా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో ఘనంగా నివాళులర్పించనున్నారు. ఉచిత విద్యుత్‌తో వ్యవసాయానికి జీవం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్ అమలుతో పాటు విద్యుత్ బిల్లుల మాఫీ ఫైలుపై తొలిసంతకం చేసి.. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయానికి జీవం పోశారు. ఈ క్రమంలో జిల్లా రైతులకు రూ.70.65 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ అయ్యాయి. అలా ఐదేళ్లూ 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ.వందల కోట్లు విలువ చేసే కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. అంతకు మునుపు చంద్రబాబు హయాంలో విద్యుత్ బిల్లులు కట్టాలంటూ అర్థరాత్రి వెళ్లి మోటార్లు, స్టార్టర్లు ఎత్తుకెళ్లారు. ఎంతో మంది రైతులపై కేసులు పెట్టి వేధించారు. వైఎస్ రాకతో వ్యవసాయానికి సువర్ణయుగం మొదలైంది. అలాగే ఖరీఫ్‌లో 2004కు ముందు రూ.1,200 కోట్లు ఉన్న పంట రుణాలను ఐదేళ్లలో రూ.6,594 కోట్లకు చేర్చారు. పావలా వడ్డీ కింద రూ.44 కోట్లు ఇచ్చారు. బీమాతో రైతన్నకు భరోసా.. చంద్రబాబు హయాంలో అమలవుతున్న పంటల బీమా పథకం రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఆ పథకాన్ని రైతులకు మేలు జరిగేలా మార్పులు చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనలేని భరోసా కల్పించారు. 2004–2009 మధ్య వైఎస్ హయాంలో పంటకోత ఫలితాల ఆధారంగా వేరుశనగకు బీమా కింద కింద ఏకంగా రూ.1,138 కోట్ల పరిహారం ఇచ్చారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.100 కోట్లు ఇచ్చారు. వైఎస్ మార్క్ రుణమాఫీ వైఎస్ హయాంకు సంబంధించి 2008లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్లు రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులను గౌరవిస్తూ వారికి కూడా ప్రోత్సాహకాల కింద 3,61,269 మందికి రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద వైఎస్ మార్క్ రుణమాఫీ, ప్రోత్సాహకాల కింద ఒకే విడతగా 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్లు లబ్ధిచేకూర్చారు. విత్తుకు రాయితీ ఏటా ఖరీఫ్, రబీలో జిల్లాలోని రైతులకు లక్షల క్వింటాళ్లు వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు రాయితీతో ఇచ్చారు. అలా వైఎస్ 2004– 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్లు వేరుశనగ పంపిణీ చేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం మరో రూ.80 కోట్లు ఖర్చు రాయితీ ఇచ్చారు. పండ్లతోటలు, సూక్ష్మసాగుకు ప్రోత్సాహం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటలు, డ్రిప్, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూతను అందించడంతో ఈ రంగాలు కూడా గాడినపడ్డాయి. రూ.25 కోట్లు రాయితీ ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీరవిప్లవానికి నాంది పలికారు. 40 వేల హెక్టార్లలో కొత్తగా పండ్లతోటల విస్తరణకు రూ.80 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. దీంతో అప్పట్లోనే ‘ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరొచ్చింది. రైతులకు బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు)... ఎస్సీ ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో రూ.280 కోట్లు రాయితీ ఇవ్వడంతో అప్పట్లోనే 1.13 లక్షల హెక్టార్లుకు సూక్ష్మసాగు విస్తరించింది. వీటితో పాటు జలయజ్ఞం కింద పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో అన్నదాతకు ఈ ఐదేళ్లూ వ్యవసాయం పండుగలా సాగింది. అనంతపురం: కరువు సీమలో అనంతపురం జేఎన్టీయూను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పతరువుగా తీర్చిదిద్దారు. 2008 ఆగస్టు 18న జేఎన్టీయూ (ఏ)కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ యూనివర్సిటీగా మార్పు చేశారు. అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో యూనివర్సిటీ 98 ఇంజినీరింగ్ కళాశాలలు, 33 ఫార్మసీ కళాశాలలు ఉండేవి. ఏటా లక్ష మంది విద్యార్థులు అభ్యసించేవారు. 2007–08 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్ వంటి కోర్సులను నిరుపేద విద్యార్థులకు చేరువ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లబ్దిపొందిన అనేక మంది నేడు ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. -
అన్ని స్థానాల్లోనూ పోటీచేయాలి
చిలమత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి జిల్లా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలకు సూచించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయన మంగళవారం బెంగళూరులో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులోనూ బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని సూచించారు. పెరిగిన మున్సిపల్ వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సమన్వయకర్తలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, టీఎన్ దీపిక, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మక్బుల్ భాషా, వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఎంపీ మిథున్‌రెడ్డి దిశానిర్దేశం -
వృద్ధుడి మృతదేహం లభ్యం
గుంతకల్లు రూరల్: హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వృద్ధుడు సీతానంద (64) మృతదేహం రాగులపాడు వద్ద లభించింది. కసాపురం ఎస్ఐ టీపీ వెంకటస్వామి తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెల్డోణ గ్రామానికి చెందిన సోమలింగమ్మ, సీతానంద దంపతులు కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వృద్ధాప్యంలో ఒకరు మరొకరికి భారంగా ఉండకూడదని నిర్ణయించుకున్న వారు ఆగస్టు 30న గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామం వద్ద ఉన్న హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఒకేసారి కాలువలో దూకారు. అయితే అదేరోజు కొద్దిదూరంలో సోమలింగమ్మ మృతదేహం లభ్యం కాగా, సీతానంద మృతదేహం గల్లంతయ్యింది. ఈ క్రమంలోనే మృతదేహం మంగళవారం రాగులపాడు వద్ద లభ్యమైంది. మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. -
‘సూర్య ఘర్’ పనులు వందశాతం పూర్తి చేయాలి
పుట్టపర్తి అర్బన్: పీఎం సూర్యఘర్ పథకం పనులు ఈ నెలాఖరుకు వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో పర్యటించిన కలెక్టర్ పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లు, నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 11,987 గృహాలు గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 8,687 గృహాలకు ఇన్స్టలేషన్ పూర్తి చేశామన్నారు. తక్కిన 2,300 గృహాలకు ఈనెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న గృహ లబ్ధిదారులతో ఈ పథకం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ నరసయ్య, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తాగు, సాగునీటి ఇబ్బందుల్లేకుండా చర్యలు పుట్టపర్తి టౌన్: జిల్లాలో తాగు, సాగునీటికి ఇబ్బందులకు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. చిత్రావతి నది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పుట్టపర్తి పట్టణ సమీపంలో ఉన్న చిత్రావతి నదిని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే సిఽంధూరారెడ్డి, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో జిల్లా కేంద్రంలో సాగు, తాగునీటి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యంతో పాటు పూడికతీత పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీనిద్వారా చిత్రావతి నదిలో నీటి సామర్థ్యం పెరిగి భూగర్భజలాలు వృద్ధి చెందుతాయన్నారు. పట్టణ పరిధిలోని చిత్రావతి నదిలో వ్యర్థాలు కలవకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులుతో పాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
రెండో‘సారీ’ వెన్నుపోటు
పుట్టపర్తి: పుట్టపర్తి–బుక్కపట్నం–కొత్తచెరువును కలుపుతూ రూ.200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఔటర్ రింగ్ రోడ్డుపై గత ఎన్నికల్లో టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కూడా ఈ అంశమే అజెండాగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని, బుక్కపట్నం చెరువులో సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటు చేస్తామని, బుక్కపట్నం నల్లనమ్మ గుడి వద్ద చిత్రావతి మరువ వంకకు బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే, రెండున్నరేళ్లు గడచినా ఎలాంటి ప్రణాళికలు తయారు చేయలేదని ఇక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే పనులు ప్రారంభించాలని వారు కోరుతున్నారు. మళ్లీ మళ్లీ మోసం.. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలను వంచించడం పరిపాటిగా మారింది. 2014–19 సమయంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లోనే పుట్టపర్తి–బుక్కపట్నం–కొత్తచెరువు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడంతో పాటు బుక్కపట్నం చెరువులో సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటు చేస్తామని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తిరిగి 2024లో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఎలాంటి ప్రతిపాదనలు తయారు చేయలేదు. దీంతో రెండో సారీ పుట్టపర్తి ప్రజలకు బాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పుట్టపర్తి ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వ మోసం ఔటర్ రింగ్ నిర్మాణాన్ని గాలికొదిలిన వైనం పట్టించుకోని ఎమ్మెల్యే పల్లె సింధూరా మండిపడుతున్న ప్రజలు ఇదే మొదటి సారి కాదు.. పుట్టపర్తి–బుక్కపట్నం–కొత్తచెరువును కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలి. బుక్కపట్నం చెరువులో సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటు చేయాలి. దీంతో పర్యాటకంగానూ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చొరవ చూపాలి. టీడీపీకి ప్రజలను మోసం చేయటం కొత్త కాదు. గతంలోను హామీ ఇచ్చి మోసం చేశారు. – నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్, పుట్టపర్తి -
వరికి నీరు ఇవ్వలేం
అనంతపురం అర్బన్: సాగునీటిపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురయ్యింది. తాగునీటికే ప్రాధాన్యత... వరి, మిర్చి సాగుకు నీరివ్వలేం అంటూ మొదటి నుంచి అధికారులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వరికి నీరివ్వలేం అనే విషయాన్ని సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం వేదికగా స్పష్టం చేశారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. అయితే ఆరుతడి పంటల సాగుకు నీటిని కేటాయించే విషయంలో వివక్ష కనిపించింది. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, మంత్రి కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీటిని కేటాయించారు. ఇతర నియోజకవర్గాలకు మొండిచేయి చూపారు. సాగునీటి సలహా మండలి చైర్మన్, కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఐఏబీ సమావేశం నిర్వహించారు. మంత్రి, చీఫ్‌విప్‌తో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, జేసీ అస్మిత్‌రెడ్డి, బండారు శ్రావణిశ్రీ, దగ్గుపాటి ప్రసాద్ మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశానికి అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలి. జిల్లాకు చెందిన ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా గైర్హాజరయ్యారు. నికర జలాల లభ్యత 10.323 టీఎంసీలు జిల్లాకు తుంగభద్ర డ్యాం నుంచి నీటి కేటాయింపు 16.097 టీఎంసీలు. ఇందులో జలాశయ, ప్రవాహ, ఇతర నష్టాలు 5.774 టీఎంసీలుగా అంచనా వేశారు. నష్టాలు పోగా నికర జలాల లభ్యత 10.323 టీఎంసీలుగా అంచనా వేశారు. ఇందులో తాగునీటి అవసరాలకు 5.130 టీఎంసీలు, సాగునీటి అవసరాలకు 5.193 టీఎంసీలు కేటాయించారు. వచ్చే ఏడాది జూలై 31 వరకు తాగునీటికే ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. ఆ రెండు నియోజకవర్గాలకే... ఆరుతడి ఆయకట్టుకు సాగునీటిని రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆరుతడి ఆయకట్టుకు సాగునీటికి కేటాయించలేదు. ● మధ్య పెన్నార్ దక్షిణ కాలువ కింద శింగనమల నియోజకవర్గం పరిధిలో తడి, ఆరుతడి ఆయకట్టు 33,176 ఎకరాలు ఉంది. మధ్య పెన్నార్ ఉత్తర కాలువ కింద తడి, ఆరుతడి ఆయకట్టు 13,325 ఎకరాలు ఉంది. తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ కింద తడి, ఆరుతడి ఆయకట్టు 31,131 ఎకరాలు ఉంది. ఈ కాలువలకు నీటి కేటాయింపు చేసినప్పటికీ ఆరుతడి ఆయకట్టుకు నీటిని కేటాయించలేదు. తేల్చి చెప్పిన ఆర్థిక మంత్రి కేశవ్ ఆరుతడి కింద 40 వేల ఎకరాలకు సాగునీరు రాయదుర్గం, ఉరవకొండకు పెద్దపీట.. మిగతా నియోజకవర్గాలకు మొండిచేయి -
భూముల విలువ రెట్టింపు
పుట్టపర్తి: జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన అమడగూరు, ఓడీ చెరువుల్లో సైన్స్ సిటీ ఏర్పాటుకు వైఎస్సార్ కృషి చేశారు. దీంతో ఎకరా రూ.10 వేలు కూడా చేయని భూముల విలువ అమాంతం పెరిగాయి. అలాగే అప్పట్లో పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి పట్టణాభివృద్ధికి కృషి చేశారు. బెంగళూరుకు అతి సమీపంగా ఉన్న కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఐటీ పరిశ్రమల ఏర్పాటు కోసం లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్నిపట్టించుకోలేదు. అలాగే జలయజ్ఞంలో భాగంగా హంద్రీ–నీవా కాలువ వైఎస్సార్ హయాంలోనే 80 శాతం పూర్తయింది. ఈ పథకానికి అప్పట్లో రూ.3 వేల కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపాదికన పనులు చేశారు. అప్పటి రాజన్న ముందు చూపుతో నేడు కృష్ణా జలాలు అందుబాటులోకి వచ్చాయి. -
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
రొళ్ల: ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకంగా ఉంటుందని, దీని వల్ల పెట్టుబడులు తగ్గడంతో పాటు రసాయనాలు లేని పంటలను ప్రజలకు అందించవచ్చని పలువురు పేర్కొన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలకు చెందిన ఆగాఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ (ఏకేఆర్ఎస్పీ) 30 మంది ప్రతినిధుల బృందం మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. దొడ్డేరి, నసేపల్లి తదితర గ్రామాల్లో కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీటీఅండ్ఐఓ) లక్ష్మానాయక్, స్థానిక వ్యవసాయశాఖ అధికారి వెంకటబ్రహ్మంతో కలిసి పర్యటించారు. నసేపల్లిలో మహిళా రైతులు లక్ష్మమ్మ, సిద్ధమ్మలు వక్కతోట, మామిడి తోటలో అంతర పంటగా సాగు చేసిన కంది, గోరు చిక్కుడు, వేరుశనగ, ఏటీఎం, పీఎండీఎస్ పంటలను పరిశీలించి, వాటి విధానాలను అడిగి తెలుసుకున్నారు. దొడ్డేరిలో రైతు గోవిందరెడ్డి పొలంలో ఏటీఎం పద్ధతిలో సాగు చేసిన కంది పంటను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే బీజామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, విత్తన గుళికలు, విత్తన శుద్ధి ఇతరత్ర ఘన, ద్రవ విధానం తయారీ, జీవామృతాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పాటు నిరంతరం పంటలు పండిస్తూ లాభాలు పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో జాతీయ వనరుల సంస్థ (ఎన్ఆర్ఓ) అధిపతి వి.కృష్ణారావు, టెక్నికల్ ఏఓ హుమాయన్, వైఈఎల్ సంతోష్, ఎన్ఆర్ఓ బృందం చెందిన సయ్యద్దాదాఫీర్, ఏపీసీఎన్ఎఫ్ బృందం ఎస్పీఎం నవీన్, ఎంటీ రమేష్, హనుమంతరాయప్ప, ఆర్‌వైఎస్‌ఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన మలేషియా సత్యసాయి భక్తులు మంగళవారం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శ్రీ సత్యసాయి అష్టోత్తర శత నామావళి నిర్వహించారు. వేలాది మంది సామూహికంగా నిర్వహించిన నామావళితో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. సాయంత్రం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత విభావరి నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో నిర్వహించిన సంగీత విభావరి భక్తులను మైమరపించింది. భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
గ్యాస్ లీకై ఇల్లు దగ్ధం: 10 లక్షల ఆస్తి నష్టం
చిలమత్తూరు: మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నాగలక్ష్మి అనే గాజుల వ్యాపారి గృహంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. వివరాలు.. మంగళవారం మధ్యాహ్నం నాగలక్ష్మి కుమారుడు నాగరాజు రెగ్యులేటర్ సరిగా వేయకపోవడంతో గ్యాస్ లీకేజీ మొదలైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంచితో మంటలు ఆర్పడానికి యత్నించగా, చేయి కాలడంతో భయపడి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో క్షణాల్లో ఇల్లంతా మంటలతో నిండిపోయింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినా అప్పటికే ఇల్లంతా దగ్ధమైంది. ఇంట్లో సామగ్రి, బియ్యం, బీరువా మొత్తం కాలిపోయింది. రూ.లక్షల విలువ చేసే గాజులు, బీరువాలోని బంగారం, రూ.3 లక్షల నగదు కాలి బూడిదయ్యాయి. కట్టు బట్టలు మినహా ఏమీ మిగలలేదంటూ బాధిత మహిళ నాగలక్ష్మి బోరున విలపించింది. -
సాకే వినయ్‌పై చర్యలు తీసుకోవాలి
పుట్టపర్తి: తనపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న బీఎస్పీ ధర్మవరం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సాకే వినయ్‌కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగంతో పాటు ఎస్పీ సతీష్ కుమార్‌కు ఐసీడీఎస్ పీడీ ప్రమీళ ఫిర్యాదు చేశారు. మంగళవారం కొత్తచెరువులోని నూతన వన్ స్టాప్ సెంటర్ పరిశీలనకు రుకియా బేగం విచ్చేశారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆశ్రయం పొందుతున్న బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ ప్రమీళ ఆమెకు లిఖిత పూర్వకంగా సాకే వినయ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు. పీడీ మాట్లాడుతూ తనపై జరుగుతున్న నిరంతర వేధింపులతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానన్నారు. భయాందోళనల మధ్య విధులు నిర్వర్తిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వారం పీజీఆర్ఎస్లో లేని పోని అర్జీలు ఇస్తూ, సోషల్ మీడియాలో ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఐసీడీఎస్‌లో సంక్షేమ పథకాలు సజావుగా సాగకుండా ఆటంకం కలిగిస్తున్నారన్నారు. తన కార్యాలయంలో పని చేస్తున్న కొందరు సిబ్బంది సాకే వినయ్ కుమార్‌కు ఆఫీస్ సమాచారాన్ని అందిస్తూ సహకరిస్తున్నారన్నారు. సొంత శాఖ అధికారి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా బయటి వ్యక్తులతో చేతులు కలిపిన సిబ్బందిని గుర్తించి తక్షణమే చర్యలు తసుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలికి ఐసీడీఎస్ పీడీ ఫిర్యాదు -
యువకుడి బలవన్మరణం
హిందూపురం టౌన్: పట్టణంలోని హస్నాబాద్‌కు చెందిన ఆసీఫ్(30) మంగళవారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు హస్నాబాద్‌కు చెందిన ఆసీఫ్‌తో భార్య ముస్కాన్ మనస్పర్థల కారణంగా మంగళవారం 8 ఏళ్ల కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారిని ఫోన్లో సంప్రదించినా అందుబాటులోకి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆసీఫ్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో వారు గుర్తించి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అలాగే మృతుడి భార్య, కుమార్తె కనిపించడం లేదని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే వారు బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి రొళ్ల: పాడి పరిశ్రమపై దృష్టి సారించి డెయిరీ ద్వారా మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలని మహిళ డెయిరీ సహకార సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా మేనేజర్ నారాయణమ్మ, జిల్లా మహిళ డెయిరీ సహకార సంఘం స్పెషల్ ఆఫీసర్లు శివశంకర్‌నాయక్, హరినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలం పరిధిలోని ఎల్కే పల్లివడ్రహట్టి గ్రామాల్లో పశువైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళ డెయిరీ సహకార సంఘం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో మహిళ డెయిరీ సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. బ్యాంకు ద్వారా రుణ సదుపాయం, పశువైద్య శాఖ ద్వారా దాణా, విత్తనాలు అందిస్తామన్నారు. మహిళలు పాడిపరిశ్రమ వైపు ఆసక్తి పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఏమైన సమస్యలు ఉంటే స్థానికంగా ఉన్న పశువైద్యశాఖ సిబ్బందిని సంప్రదింపులు జరుపుకుని పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో పశువైద్యశాఖ ఏడీ అమర్, ఎల్ఎస్ఏ శశికళ, ఏహెచ్ఏలు కవిత, మహలింగప్ప, కుమార్‌నాయక్, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య కళ్యాణదుర్గం: పట్టణంలోని సిద్దప్ప వంక వీధికి చెందిన బిల్లి పవన్ కుమార్ (36) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు... సిద్దప్ప వంక వీధికి చెందిన బిల్లి పవన్ కుమార్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినట్లు సమాచారం. అటుగా వెళ్లిన గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని భార్య తులసి అలియాస్ చిట్టి సైతం ఏడాది క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
పుట్టపర్తి అర్బన్: అప్పటి వరకూ ఎంతో చలాకీగా పని చేస్తూ ఉన్న ఓ ఉపాధి కూలీ పనులు చేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందిన సంఘటన పుట్టపర్తి మండలం పైపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హరిజన ఓసూరప్ప (73) రోజూలాగే వీబీజీరామ్‌జీ పనులకు మంగళవారంవెళ్లాడు. అదే గ్రామానికి చెందిన కేశప్ప పొలంలో మామిడి మొక్కలు నాటడానికి గుంతలు తీస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి కూలీలు ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న ఏపీఓ వరప్రసాద్ సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు, కూలీలు కోరారు. ఓసూరప్పకు ఇది వరకే భార్య మృతి చెందగా ముగ్గురు బిడ్డలూ పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోయారు. మద్యం మత్తులో డ్రైవింగ్.. యువకుడికి జైలు ఎన్పీకుంట: మండల కేంద్రానికి చెందిన ఇడగొట్టు ప్రశాంత్ అనే యువకుడు మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పట్టుబడ్డాడని ఎస్ఐ క్రిష్ణమూర్తి తెలిపారు. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లు గుర్తించామని, నిందితుడిని కదిరి జ్యుడీషియల్ సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జడ్జీ 7 రోజులు జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. పురం వన్‌టౌన్ ఏఎస్ఐపై వేటు హిందూపురం టౌన్: హిందూపురం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ ధనుంజయపై ఎస్పీ సతీష్‌బాబు వేటు వేశారు. పలు ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏఎస్ఐతో పాటు కానిస్టేబుల్ నాగాంజనేయులుపై కూడా వేటు వేశారు. ఈ విషయాన్ని ఏఎస్పీ మహేష్ ధ్రువీకరించగా, వీరిని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సరెండర్ చేసినట్టు ఆయన తెలిపారు. మల్లాపల్లిలో డీపీఓ పర్యటన గోరంట్ల: మండల పరిధిలోని మల్లాపల్లి పంచాయతీలో మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి సమత పర్యటించారు. ఈ సందర్భంగా చెత్త శుద్ధి కేంద్రాన్ని ఎంపీడీఓ కమలబాయితో కలిసి పరిశీలించారు. వర్మీ కంపోస్టు తయారీపై పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశుగ్రాసం కొరతపై సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూధన నాయక్, మండల విద్యాశాఖ అధికారి జాన్రెడ్డప్ప, రక్షిత మంచి నీటి శాఖ ఇంజినీర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ వేతనాల కోసం ఆకులు తిని నిరసనఓడీచెరువు: మండల కేంద్రంలో పని చేస్తున్న పంచాయతీ కార్మికులు, స్వచ్ఛభారత్ కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆకులు తిని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీతాలు ఇవ్వాలని పలు మార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. కార్మికులు ఏమి తిని బతకాలని, అందుకే ఆకులు తిని నిరసన కార్యక్రమం చేపట్టనట్లు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని, లేని పక్షంలో పనులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ రమణ, నాయకులు కుళ్లాయప్ప, అంజనప్ప, గంగులప్ప, నాగమ్మ, నిర్మల, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఆవు దాడిలో వృద్ధురాలి మృతి వజ్రకరూరు: ఆవు దాడిలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొనకొండ్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. కొనకొండ్ల ఇందిరమ్మ కాలనీకి చెందిన నెట్టికంటమ్మ (70) మంగళవారం ఇంటి వద్ద నుంచి సమీపంలోని దుకాణానికి వెళుతుండగా వెనుక వైపు నుంచి ఆవు దాడి చేసింది. దీంతో గాయపడిన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వృద్ధురాలు మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ● అదే ఆవు దాడిలో మరో మహిళ గాయపడినట్లు తెలిసింది. ఇద్దరిపై దాడి చేసిన ఆవు కూడా మరణించడం గమనార్హం. ఈ ఆవు గ్రామంలోని ఓ దేవాలయానికి చెందినదిగా గ్రామస్తులు చెబుతున్నారు. -
చెలరేగిన ‘అనంత’ బౌలర్లు
అనంతపురం: అనంత క్రీడాగ్రామంలోని ఆర్సీజీ, ఏసీఏ మైదానాల్లో ఏసీఏ అండర్–23 పురుషుల మల్టీడే క్రికెట్ టోర్నీ నాల్గో రౌండ్ మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. మంగళవారం అనంత బౌలర్ల ధాటికి కర్నూలు బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు 40.1 ఓవర్ల వద్ద 118 పరుగులకు ఆలౌట్ అయింది. కర్నూలు బ్యాటర్లలో మురారీ హృదయ్ ఒంటరి పోరాటంతో 31 పరుగులు సాధించాడు. అనంత బౌలర్లలో జి.మల్లికార్జున 4, కె.ప్రమోద్‌కుమార్ 3, దీపక్‌కుమార్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 222 పరుగులు సాధించింది. అనంత బ్యాటర్లలో ఎన్.మనోజ్‌కుమార్ 42, జయంత్‌కృష్ణ 86, ఎంకే దత్తారెడ్డి 52 పరుగులు సాధించారు. కర్నూలు బౌలర్ దినేష్‌కుమార్ రెండు వికెట్లు తీశాడు. ● మరో మ్యాచ్‌లో నెల్లూరుతో చిత్తూరు జట్టు తలపడింది. టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 307 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటర్లు నిఖిలేశ్వరరెడ్డి 80, సుతేజ్‌రెడ్డి 40, ఏకాక్షర్ 51 పరుగులు సాధించారు. చిత్తూరు బౌలర్లలో ఆర్.రెడ్డి ప్రకాష్ తన స్పిన్ మాయాజాలంతో ఆరు వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ కృష్ణతేజారెడ్డి, ఎం.ముఖేష్ చెరో రెండు వికెట్లు చొప్పున తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 72 పరుగులు సాధించింది. బ్యాటర్లు లోహిత్ లక్ష్మీనారాయణ 36, హర్షసాయి 29 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. -
కిక్కు సరిపోలేదు!
పేరుకు ఒకటే మద్యం దుకాణం.. కానీ అనుబంధంగా 20కి తక్కువ కాకుండా బెల్టుషాపులు.. బాటిల్‌పై అ‘ధన’పు బాదుడు. 24 గంటలూ అమ్మకాలతో ఈ రెండేళ్లలో మద్యం దుకాణాలు నడుపుతున్న కూటమి పార్టీల నాయకులు భారీగానే ఆర్జించారు. కానీ తాజాగా గల్లాపెట్టెకు కిక్కుసరిపోలేదు.. ఇంకో ఏడాది లీజు పెంచండంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. లీజు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ‘తమ్ముళ్ల’ వద్దే దుకాణం ఉంటే...మద్యంతో జనాన్ని ముంచేసి ఓట్లు రాబట్టవచ్చని కొందరు ప్రభుత్వ పెద్దలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. సాక్షి, పుట్టపర్తి మద్యం వ్యాపారంలో ఇప్పటికే భారీగా ఆర్జించిన అధికార పార్టీ నేతలు, అనుయాయులు దుకాణాల లీజు గడువు ముగుస్తున్న వేళ ‘నష్టాల రాగం’ అందుకున్నారు. లైసెన్స్ ఫీజు భారీగా చెల్లించామని, రెండేళ్లలో పెద్దగా మిగల్లేదంటూ మొసలికన్నీరు కారుస్తున్నారు. మద్యం దుకాణాల లీజు వచ్చే అక్టోబరు 2వ తేదీ నాటికి ముగియనుండగా.. లీజు గడువు పెంచి మళ్లీ పాతవారికే దుకాణాలు ఇచ్చేలా చూడాలంటూ మంతనాలు సాగిస్తున్నారు. ఏడాది పొడిగింపునకు సన్నాహాలు.. జిల్లాలోని మద్యం దుకాణాల్లో 80 శాతం కూటమి పార్టీల నాయకులవే. మిగతా దుకాణాల్లో కూడా వాటాలున్నాయి. దీంతో మద్యం ద్వారా అక్రమార్జన రుచి చూసిన ‘కూటమి నేతలు’ దుకాణాలను యథావిధిగా కొనసాగించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పట్లో టెండర్లు రాకుండా.. మరో ఏడాది పాటు రెన్యువల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాత వారికే కట్టబెడితే నెలవారీ మామూళ్లు యథావిధిగా వసూలు చేయవచ్చనే కారణంతో అధికారుల వద్ద కొందరు సిండికేటుగా మారి లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఒక్కో దుకాణం నుంచి డిమాండ్ ఆధారంగా రూ.20 లక్షల వరకు చెల్లిస్తే.. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రెన్యువల్ చేయిస్తామని దుకాణదారులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గత టెండర్లలో దుకాణాలు దక్కించుకుని నష్టాల్లో ఉన్నారని సాకుగా చెబుతూ మళ్లీ వారికే కట్టబెట్టాలని సర్కార్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. పైగా ప్రభుత్వంలోని పెద్దలు అభ్యంతరం తెలపకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు కావాల్సినంత సరఫరా చేస్తామంటూ ఎరవేసినట్లు తెలుస్తోంది. అప్పుడూ సిండికేటే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే, అంతకుముందు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం దుకాణాలన్నీ రద్దు చేసి.. ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కుమ్మకై ్క తమ అనుచరులు, అనుయాయులకే దుకాణాలు దక్కేలా ప్లాన్ చేశారు. ఇతరులు దరఖాస్తు చేయకుండా బెదిరించారు. కేవలం ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో దుకాణానికి నాలుగు దరఖాస్తులు వేసి.. లాటరీ తీయించి తలాకొన్ని పంచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగింది. లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వారిలో 80 శాతం మంది పైగా కూటమి పార్టీలకు చెందిన వారే ఉన్నారు. దీంతో కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిన రోజు నుంచి గుడి, బడి తేడా లేకుండా బెల్టు షాపులు ఏర్పాటు చేయించి అమ్మకాలు సాగించారు. రాత్రింబవళ్లు మద్యం ఏరులై పారించారు. దుకాణాలన్నీ కూటమి నేతల కనుసన్నల్లో ఉండటంతో నియంత్రించాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో బెల్టు షాపులతో పాటు మద్యం దుకాణాల్లో అ‘ధన’పు దోపిడీ చేస్తున్నారు. ప్రతి సీసాపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. అదే తరహాలో దుకాణాల లీజు కొనసాగింపునకు కూడా ఇప్పుడు సిండికేటుగా మారినట్లు తెలిసింది. రెన్యువల్ కోసం ఒక్కో దుకాణం నుంచి మరో రూ.20 లక్షల వరకు ప్రాంతాల వారీగా.. డిమాండ్ ఆధారంగా షరతు విధించినట్లు తెలిసింది. సిండికేటుకు లబ్ధి చేకూరేలా.. మద్యం దుకాణాల లీజు గడువు ముగిసిన తర్వాత టెండర్లు ఆహ్వానిస్తే.. ఒక్కో దరఖాస్తుకు గతంలో మాదిరిగా రూ.2 లక్షలు చొప్పున నిర్దేశించినా.. ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది. అయితే లీజు కొనసాగిస్తే.. సిండికేటుకు లబ్ధి చేకూరుతుంది. దుకాణదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి అందులో ప్రభుత్వ పెద్దలకూ వాటాలిచ్చి లీజు గడువు పెంచేందుకు ఒప్పించే మార్గంలో వెళ్తున్నట్లు తెలిసింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సిన కోట్లాది రూపాయలు కూటమి పార్టీల నేతలు, ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లనున్నాయి. మద్యం దుకాణాల కోసం మంత్రాంగం అక్టోబరు 2తో ముగియనున్న రెండేళ్ల లీజు గడువు మళ్లీ పాతవారికే కట్టబెట్టేందుకు సిండికేటు ప్రయత్నాలు నష్టాల్లో ఉన్నారంటూ పక్కా ప్లాన్‌తో ముందస్తుగా పైరవీలు మరో ఏడాది లీజు పొడిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిళ్లు ఒక్కో దుకాణం నుంచి అదనంగా రూ.20 లక్షల వరకు డిమాండ్ ‘స్థానిక’ ఎన్నికల వేళ దుకాణాలు తమ్ముళ్ల వద్ద ఉంటేనే మేలంటూ పెద్దలకు సలహా మద్యం దుకాణాల ద్వారా రోజూ ప్రభుత్వానికి రూ.కోట్లలో రాబడి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2024 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి రూ.1,370 కోట్ల రాబడి వచ్చింది. మరోవైపు బాటిల్‌పై అదనంగా రూ.10 వసూలు చేస్తూ మద్యం దుకాణాల నిర్వాహకులూ జేబులు నింపుకుంటున్నారు. ఇంకోవైపు బెల్టు షాపుల ద్వారా ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. మద్యం వ్యాపారంతో ఇటు దుకాణాల నిర్వాహకులు, అటు ప్రభుత్వానికి డబ్బులు వస్తుండగా...మందుబాబుల జేబులకు చిల్లుపడి.. ఇల్లు గుళ్లవుతోంది. -
సర్కారుపై ఉద్యోగుల సమరభేరి
పుట్టపర్తి అర్బన్: తమ డిమాండ్లపై రెండేళ్లుగా సర్కారు స్పందించకపోయినా మౌనంగా ఉన్న ఉద్యోగులు...తాజాగా సమరభేరి మోగించారు. ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ఉద్యోగులు..త్వరలోనే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతిగ్రామం వద్ద ఉన్న ప్రభుత్వ జిల్లా కార్యాలయాల వద్ద ఏపీ జేఏసీ (అమరావతి) నాయకులు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ (అమరావతి) జిల్లా అధ్యక్షుడు మైనుద్దీన్ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకూ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, తాత్కాలిక భృతి (ఐఆర్)ని వెంటనే అందజేయాలన్నారు. అలాగే ప్రభుత్వం ముందుంచిన 21 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జీవైపీ రావు, మున్సిపాలిటీల నాయకుడు శంకర్, సచివాలయాల జేఏసీ నాయకులు చౌడప్ప, శశికుమార్, కలెక్టరేట్ ఉద్యోగుల సంఘం నాయకులు చక్రపాణి, జిల్లా వైద్య సిబ్బంది వీరమ్మ, కళాధర్, బాబా ఫకృద్దీన్, ఫిరోజ్, నాగభూషణం, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి టౌన్: ‘‘పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవులు, ఇతర బకాయిల విడుదల చేయడంతోపాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని రెండేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయినా చలనం లేదు. మాకూ ఓపిక లేదు. సెప్టెంబర్ 5వ తేదీలోపు ప్రభుత్వం మా డిమాండ్లపై సానుకూల ప్రకటన చేయకపోతే ఉద్యమాలకు శ్రీకారం చుడతాం’’ అని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ లింగా రామ్మోహన్ అన్నారు. గురువారం పుట్టపర్తిలోని జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ చంద్ర, ఉద్యోగులు సురేంద్ర, గౌస్‌బాషా, శ్రీరామ్ నాయక్, బాబా ఫకృద్దీన్, వెంకటరాముడు, గఫూర్, దేవేంద్ర, పరిమల, పుష్ప, జనార్దన్‌తోపాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం స్పష్టం చేసిన ఏపీ జేఏసీ (అమరావతి) నేతలు ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధంకావాలని ఏపీజేఏసీ నేత పిలుపు సెప్టెంబర్ 5 డెడ్‌లైన్.. దాటితే ఉద్యమమే -
బైరాపురంలో తీరిన నీటి సమస్య
ప్రశాంతి నిలయం: కొత్తచెరువు మండల పరిధిలోని బైరాపురం గ్రామ ప్రజలు మంచి నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో స్పందించిన సత్యసాయి భక్తులు గ్రామంలో మంచి నీటి పథకాన్ని ఏర్పాటు చేసి దాతృత్వం చాటుకున్నారు. ఇటీవల బైరాపురం గ్రామస్తులు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు కలసి తమ గ్రామంలోని తాగునీటి సమస్యను వివరించారు. స్పందించిన ఆర్జె రత్నాకర్రాజు పుట్టపర్తి పర్తియాత్రకు వచ్చిన మలేషియా సత్యసాయి భక్తులకు సమస్యను తెలియజేసి మంచినీటి పథకం ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నారు. దీంతో బైరాపురంలోని 350 కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందించే యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి అవసరమైన విరాళాన్ని మలేషియా సత్యసాయి భక్తులు అందించారు. తాగునీటి పథకం నిర్మాణం పూర్తి కావడంతో గురువారం మలేసియా సత్యసాయి భక్తులు, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులతో కలసి ఆ పథకాన్ని ప్రారంభించారు. సత్యసాయి భక్తులు చూపిన సేవాభావంపై బైరాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సత్యసాయి స్ఫూర్తితో తాము ఈ యూనిట్‌ను ప్రారంభించినట్లు మలేషియా సత్యసాయి భక్తులు పేర్కొన్నారు. గ్రామస్తులకు నూతన వస్త్రాలలో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మలేషియా సాయి భక్తులు మహేంద్రన్, శ్రీలంకా విటాన్, డాక్టర్ హూ, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు లక్ష్మణరావు, చంద్రశేఖరన్, సత్యనారాయనమూర్తి తదితరులు పాల్గొన్నారు. తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటు చేసిన మలేషియా సత్యసాయి భక్తులు -
నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
మడకశిర: నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు మిన్నంటుతున్నాయి. పర్యవేక్షణ లేక...పట్టించుకునే వారు లేక తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతుండగా... కడుపుమండిన జనం ఊరూరా ఖాళీ బిందెలతో బైఠాయిస్తున్నారు. తాజాగా నియోజకవర్గ కేంద్రమైన మడకశిరలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వారంతా గురువారం రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. పట్టణంలోని పావగడ–తుమకూరు ప్రధాన రోడ్డుపై మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, 20 రోజులుగా తమ కాలనీకి తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా తాగునీటి సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని తమ కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కృష్ణారెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న మహిళలకు నచ్చ జెప్పడానికి ప్రయత్నించారు. తాగునీటి సమస్య పరిష్కరమయ్యేంత వరకూ తాము ఇక్కడి నుంచి కదలబోమన్నారు. చివరకు మున్సిపల్ అధికారులు వచ్చి తాగునీటి సమస్య పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
పేదలపై ధరల బాదుడేంది ‘బాబూ’..?
ధర్మవరం: నిత్యావసరాల ధరలు నింగినంటడంతో సామాన్యులు బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ‘బాదుడే బాదుడు’ అంటూ విష ప్రచారం చేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే అన్ని ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. కానీ రెండేళ్లలో నిత్యావసరాలతో పాటు అన్ని ధరలు పెరిగినా.. ఎందుకు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన పట్టణంలోని పలు రిటైల్ కిరాణా మార్ట్లు, షాపులను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు పేద, మధ్య తరగతి ప్రజలతో మాట్లాడి నిత్యావసరాల ధరల పెరుగుదల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో కూటమే అధికారంలో ఉందని, ధరల పెరుగుదలపై ఎందుకు నియంత్రణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. అనాలోచిత నిర్ణయాలతోనే ధరల పెరుగుదల గతంలో బియ్యం కిలో రూ.55 ఉంటే, ప్రస్తుతం రూ.75కు పెరిగాయని, కందిపప్పు కిలో రూ.145 ఉంటే ప్రస్తుతం రూ.165కు చేరిందని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వంట నూనెలు 30 శాతం దాకా పెరిగాయన్నారు. చక్కెర చూస్తే కిలో రూ.75 ఆల్‌టైం హైకి చేరిందన్నారు. టమాట నుంచి ఉల్లిగడ్డల వరకు సామాన్యులు కొనే పరిస్థితి లేదన్నారు. పోనీ ధరల పెరుగుదల వల్ల రైతులకు మద్దతు అయినా దక్కుతుందా అంటే అదీ లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లనే ధరలు పెరిగాయన్నారు. ఈ రెండేళ్లలో ధరల నియంత్రణకు కనీసం ఒక్క చర్య అయినా చేపట్టారా అని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించాలి ఎన్నికల వరకు ధరలు తగ్గిస్తామని హామీలు గుప్పించి... అధికారంలోకి వచ్చాక ధరలు పెంచిన చంద్రబాబు మోసపూరిత నైజాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. ఇటువంటి వారిని రాజకీయాల్లో మళ్లీ అబద్ధాలు చెప్పకుండా తగిన బుద్ధిచెప్పాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు. ధరల తగ్గింపు కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి -
మారిన అభివృద్ధి లెక్కలు
అనంతపురం క్రైం: ఉమ్మడి అనంతపురం జిల్లా పునర్విభజన జరిగి నాలుగేళ్లు గడిచినా.. పట్టణాభివృద్ధి పరంగా మాత్రం రెండు జిల్లాల మధ్య సంబంధం పూర్తిగా తెగిపోలేదు. అనంతపురం–హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థగా కొనసాగిన అహుడా పరిధి ఏళ్ల తరబడి రెండు జిల్లాల భౌగోళిక ప్రాంతాలను కలుపుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఆ వ్యవస్థకు తెరపడింది. అహుడా పేరును ‘అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థ’గా (ఏటీపీ యూడీఏ) మార్చి.. శ్రీసత్యసాయి జిల్లా పరిధిని పూర్తిగా బయటకు తీసింది. అదే సమయంలో పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పీయూడీఏ) పరిధిని శ్రీసత్యసాయి జిల్లాలో విస్తరించింది. ఇప్పటికే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. విస్తీర్ణంలో ‘అనంత’ ముందంజ కొత్త ఏటీపీ యూడీఏలో అనంతపురం నగరంతో పాటు రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు పట్టణాలు ఉన్నాయి. అనంతపురం, ఆత్మకూరు, బెలుగుప్ప, బొమ్మనహాళ్, బ్రహ్మసముద్రం, బుక్కరాయసముద్రం, డి.హీరేహాళ్, గార్లదిన్నె, గుత్తి, గుమ్మగట్ట, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కంబదూరు, కనేణేల్లు, కూడేరు, కుందుర్పి, నార్పల, పామిడి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పుట్లూరు, రాప్తాడు, రాయదుర్గం, శెట్టూరు, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు మండలాలున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మొత్తం విస్తీర్ణాన్ని 10,205 చ.కి.మీ.గా పేర్కొన్నారు. అంటే అనంతపురం యూడీఏ కేవలం అనంతపురం నగర చుట్టుపక్కల అభివృద్ధి సంస్థ కాదు. తాడిపత్రి–యాడికి పారిశ్రామిక అక్షం, గుత్తి–గుంతకల్లు రవాణ అక్షం, అనంతపురం–రాప్తాడు పట్టణ విస్తరణ, ఉరవకొండ–వజ్రకరూరు ప్రాంతాల భవిష్యత్ అభివృద్ధి ఒకే ప్రణాళికా వ్యవస్థలోకి వచ్చాయి. ‘శ్రీసత్యసాయి’కి పెట్టుబడే బలం పీయూడీఏలో ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి వంటి పట్టణాలు ఉన్నాయి. మొత్తం 32 మండలాలు, 8,925 చ.కి.మీ. పరిధిలో పీయూడీఏను పునర్వ్యవస్థీకరించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక గణాంకాల ప్రకారం ఉమ్మడి అనంతపురం–శ్రీసత్యసాయి ప్రాంతంలో నమోదైన భారీ, మెగా పరిశ్రమలు 68. అందులో శ్రీసత్యసాయి జిల్లాలోనే 47, అనంతపురం జిల్లాలో 21 ఉన్నాయి. అంటే భారీ పరిశ్రమల సంఖ్యలో శ్రీసత్యసాయి జిల్లా వాటా దాదాపు 69 శాతం. పెట్టుబడుల విషయానికి వస్తే మొత్తం భారీ, మెగా పరిశ్రమల పెట్టుబడి సుమారు రూ.21,751.68 కోట్లు. అందులో శ్రీసత్యసాయి జిల్లాలో రూ.16,430.50 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.5,321.16 కోట్లు ఉన్నాయి. అంటే పెట్టుబడుల్లో శ్రీసత్యసాయి వాటా సుమారు 75.5 శాతం. ఉద్యోగాల పరంగానూ శ్రీసత్యసాయి జిల్లాలో 25,672, అనంతపురం జిల్లాలో 7,492 ఉద్యోగాలు నమోదయ్యాయి. అంటే విస్తీర్ణం అనంతపురం వైపు ఎక్కువగా ఉన్నా.. భారీ పరిశ్రమల ఆర్థిక బలం సత్యసాయి వైపు గట్టిగా కేంద్రీకృతమై ఉంది. పరిశ్రమల కేంద్రాల లెక్క ఇలా.. పారిశ్రామిక వివరాల ప్రకారం అనంతపురం వైపు అనంతపురం, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, సజ్జలదిన్నె, సద్లపల్లి, తిమ్మసముద్రం వంటి పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. శ్రీసత్యసాయి వైపు అమ్మవారిపల్లి, గుడిపల్లి, హిందూపురం, గొల్లాపురం, కదిరి, అమడగూరు, పెనుకొండ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. రాప్తాడు, కొటిపి, కప్పలబండ వంటి ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి కూడా నమోదైంది. ఎంఎస్ఎంఈల్లో సీన్ రివర్స్ చిన్న, మధ్యతరహా పరిశ్రమల దగ్గర లెక్కలు పూర్తిగా మారిపోయాయి. రెండు జిల్లాల్లో కలిపి నమోదైన ఎంఎస్ఎంఈలు 7,040. ఇందులో అనంతపురం జిల్లాలో 4,180, శ్రీసత్యసాయి జిల్లాలో 2,860 ఉన్నాయి. అంటే సంఖ్య పరంగా దాదాపు 59.4 శాతం అనంతపురం వాటా ఉంది. ఎంఎస్ఎంఈ పెట్టుబడుల్లోనూ మొత్తం రూ.2,28,673.6 కోట్లు నమోదై ఉండగా.. అనంతపురం వాటా రూ.98,815.1 కోట్లు, శ్రీసత్యసాయి వాటా రూ.1,29,859 కోట్లు. ఉద్యోగాల్లో మాత్రం అనంతపురంలో 31,754, శ్రీసత్యసాయిలో 33,245 ఉన్నాయి. అహుడా స్థానంలో ఉమ్మడి అనంతకు రెండు పట్టణాభివృద్ధి సంస్థలు పరిశ్రమల పెట్టుబడుల్లో ‘శ్రీసత్యసాయి’ దూకుడు.. ఎంఎస్ఎంఈల సంఖ్యలో ‘అనంత’ ముందంజ -
12న జాతీయ లోక్ అదాలత్
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు తెలిపారు. అనంతపురంలోని న్యాయ సేవా సదన్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో గురువారం ఆయన రెండు జిల్లాల ఎస్పీలు జగదీష్, సతీష్‌కుమార్‌తో సబీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను రాజీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సత్యవాణి, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ శైలజదేవి తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తిని ‘మోడల్’గా నిలుపుదాం ● ఉన్నతస్థాయి సమీక్షలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రశాంతి నిలయం: ప్రజా ప్రతినిధులు, అధికారులు, సత్యసాయి భక్తుల సహకారంతో పుట్టపర్తిని ‘మోడల్’ ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పుట్టపర్తి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితో కలిసి కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పుట్టపర్తిని అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చెత్తరహిత, నీటి నిల్వరహిత పుట్టపర్తిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం దృష్ట్యా రోడ్ల మీద ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ దేశాల నుంచి పుట్టపర్తికి వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, పబ్లిక్ హెల్త్ డీఈ నరసింహమూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఉచిత నైపుణ్య శిక్షణ
అనంతపురం సిటీ: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన భవిష్యత్ కల్పించేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం రూపొందించిన ‘ఇండస్ట్రీ రెడీ’ ఆన్లైన్ వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలోని తన చాంబర్లో గురువారం ఆయన ఆవిష్కరించారు. పారిశ్రామిక అవసరాలకు తగిన మానవ వనరులను పెంపొందించేలా బృహత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు లక్ష్మీనర్సయ్య తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో భవన నిర్మాణ కార్మికుల సభ్యత్వం కలిగిన వారి పిల్లలకు ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరఫున ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే డిప్లొమా, డిగ్రీ, బీటెక్, మెడికల్ విభాగాల్లో చదువుతున్న కార్మికుల పిల్లలు ఇందుకు అర్హులన్నారు. శిక్షణ మొత్తం ప్రీ రికార్డెడ్ (ముందస్తుగానే నిక్షిప్తం చేసిన) వీడియోల ద్వారా సాగుతుందన్నారు. ఈ విధానం వల్ల పిల్లలు తాము ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు తమకు తీరిక ఉన్న సమయాల్లో ఇంటి వద్దనే ఉంటూ మొబైల్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏసీఎల్ శ్రీకాంత్‌నాయక్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎస్.ఎన్.లావణ్య, సహాయ కార్మిక అధికారులు కె.రాధారమాదేవి, ఎం. సుజాత తదితరులు పాల్గొన్నారు. -
పక్కా స్కెచ్‌తోనే భరద్వాజ్ హత్య
● ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు ● వివాహేతర సంబంధమే హత్యకు కారణం రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం వీఎన్ఆర్ కాలనీలోని ఆరాధ్య హోమ్స్‌కు వెళ్లే మార్గంలో గుజరి షాపు వద్ద జరిగిన మఠం భరద్వాజ్ (33) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పాళ్యం శ్రీహరి, పాళ్యం చందన, అనంతపురం రూరల్ పామురాయికి చెందిన దాసంద్రం అనిల్‌కుమార్, తరిమెల పంచాయతీ చింతమేకలపల్లికి చెందిన దండు మునికుమార్, గురుగుంట్లకు చెందిన వరుకూటి రామాంజనేయులు, బెళుగుప్పకు చెందిన అక్కిశెట్టి తులసిలను గురువారం అరెస్టు చేశారు. వివరాలను సీఐ శ్రీకాంత్‌యాదవ్ మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్ కేసు పెట్టినా... రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భరద్వాజ్‌కు టిఫిన్ సెంటర్ నిర్వహించే శ్రీహరితో పరిచయం ఉంది. ఈ క్రమంలో శ్రీహరి భార్య చందనతో భరద్వాజ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భరద్వాజ్... చందనను తీసుకెళ్లాడు. దీనిపై ఈ ఏడాది మార్చిలో అనంతపురం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో భరద్వాజ్‌పై కిడ్నాప్ కేసు నమోదై రిమాండ్‌కు వెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చందన వెంటపడుతుండటంతో శ్రీహరి, అతని బంధువులు భరద్వాజ్‌ను హతమార్చేందుకు కుట్ర పన్నారు. ఫోన్ చేయించి.. కాపు కాసి.. కుట్రలో భాగంగా గత నెల 29న రాత్రి 10.30 గంటల సమయంలో చందనతో భరద్వాజ్‌కు ఫోన్ చేయించి ఆరాధ్య హోమ్స్ వద్దకు రప్పించారు. భరద్వాజ్ కారులో అక్కడికి చేరుకుని చందనతో మాట్లాడి తిరిగి వెళ్తుండగా నిందితులు అతడి వాహనానికి మోటార్‌సైకిల్ అడ్డుపెట్టి కొడవలి, ఇనుపరాడ్లు, బండరాయితో దాడి చేసి హత్య చేశారు. నిందితులను పామురాయి వద్ద అక్కమ్మగార్ల గుట్ట సమీపంలో అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, కొడవలి, రెండు ఇనుపరాడ్లు, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆచూకీ గుర్తించి అరెస్టు చేయడంలో సహకరించిన సీసీఎస్ సీఐ జయపాల్‌రెడ్డి, రూరల్ మహిళా ఎస్ఐ చైతన్యస్వరూపిణి, ఎస్ఐలు ధరణిబాబు, నవీన్‌కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు మహమ్మద్ రఫీక్, రామయ్య, కానిస్టేబుళ్లు తిమ్మప్ప, ఆసిఫ్, దాస్, రాజశేఖర్, మహేంద్ర, చంద్రకళను జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. -
‘పోషణ వనిత’తో ఆరోగ్యవంతమైన సమాజం
పుట్టపర్తి టౌన్: ‘పోషణ వనిత’ కార్యక్రమం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజానికి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. గురువారం స్థానిక సాయి ఆరామంలో ‘పోషణ వనిత’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్డీఏ పీడీ నరసయ్య, వాసన్ అసోిసియేట్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామీణ మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ‘పోషణ వనిత’లుగా ఎంపిక చేసి వారి ద్వారా సమాజంలో పోషకాహారంపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే పోషకాలున్న పంటలతో పాటు పెరటి తోటల ద్వారా తాజా కూరగాయలు పండించేలా స్థానిక రైతులను ప్రోత్సహిస్తామన్నారు. తొలివిడతలో జిల్లాలోని 10 మండలాల్లో 10 వేల కుటుంబాలను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. వారికి ప్రత్యేక నిపుణులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కుటుంబాల పోషకాహార స్థాయిని మెరుగుపరచడం, స్థానిక వైవిద్యాలను ప్రోత్సహించడం, మహిళలకు పోషణ, ఆధారిత జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ‘పోషణ వనిత’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోనే ప్రారంభించామని, దశల వారీగా గ్రామాలకూ విస్తరిస్తామన్నారు. బావిలో పడి వివాహిత మృతి ఓడీచెరువు: మండల పరిధిలోని నల్లచెరువుపల్లికి చెందిన లక్కసాని ఉషారాణి (37) బావిలో పడి మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల వివరాలమేరకు... నల్లచెరువుపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి, ఉషారాణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం ఉదయం టమాట పంటను చూసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రతాప్‌రెడ్డి తిరిగి వచ్చేశాడు. ఎంత సేపటికీ భార్య రాకపోవడంతో బోరు బావి దగ్గరికి వెళ్లి వెతకగా ఆమె బావిలోని నీటిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలికి అప్పుడప్పుడూ ఫిట్స్ వచ్చేవని, ప్రమాదవశాత్తూ బావినీటిలో పడి చనిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తండ్రి సోమశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కదిరిలో ఫ్లెక్సీ వార్
● బీజేపీ నేత విష్ణు ఫ్లెక్సీ చించివేత ● టీడీపీ వర్గీయులపైనే అనుమానం కదిరి టౌన్: కదిరి పట్టణంలో కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బీజేపీ జాతీయ నేత విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను చించివేయడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో టీడీపీ నాయకులే ఫ్లెక్సీలను చించేసి ఉంటారన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఆల్ సెల్స్ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్‌గా నియమితులైన విష్ణువర్ధన్‌రెడ్డి ఢిల్లీలో బాధ్యతలు చేపట్టి ఈ నెల ఐదో తేదీ కదిరికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను స్వాగతిస్తూ కదిరి పట్టణంలో బీజేపీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కుటాగుళ్ల ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. టీడీపీ వర్గీయులే ఈ పని చేసి ఉంటారని బీజేపీ నాయకులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య సోషల్ మీడియాలోనూ ‘వార్’ సాగుతోంది. -
ధర్మవరంలో కార్డెన్ సెర్చ్
ధర్మవరం అర్బన్: రౌడీషీటర్లు, అనుమానితులు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరించారు. పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం, మహాత్మాగాంధీకాలనీలలో గురువారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రెండు కాలనీలను మొత్తం రౌండప్ చేసి కాలనీల్లో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా, బయట నుంచి ఎవరు లోపలికి రాకుండా పోలీసులు జల్లెడ పట్టారు. డ్రోన్ కెమెరాలతో వార్డు మొత్తం తనిఖీలు చేశారు. ఎస్పీ సతీష్‌కుమార్ కార్డెన్ సెర్చ్‌ను పరిశీలించారు. రౌడీషీటర్లు ఇళ్ల వద్దకు వెళ్లి సత్ప్రవర్తనతో మెలగాలని, వారు మారేలా కుటుంబ సభ్యులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డీఎస్పీ జగన్నాథ్రాజుతో పాటు ఐదుగురు సీఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ, పోలీసులు మొత్తం 102 మంది ఇంటింటా తనిఖీలు చేపట్టామన్నారు. రానున్న గణేష్ ఉత్సవాలు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల కాపాడటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రికార్డులు, నంబర్ ప్లేట్లు లేని 75 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, కారు, అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను సీజ్ చేశామని తెలిపారు. రికార్డులు చూపి వాహనాలను తీసుకెళ్లాలని, సరైన రికార్డులు చూపని వాహనాలపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథ్‌రాజు, సీఐలు రెడ్డెప్ప, జయనాయక్, సునీత పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. 75 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, కారు, అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల సీజ్ -
వినూత్న బోధనకు రాష్ట్రస్థాయి గుర్తింపు
● ధర్మవరం మోడల్ స్కూల్ టీచర్ శ్రావణికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ, వినూత్న బోధనా పద్ధతులతో విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న ధర్మవరం ఏపీ మోడల్ స్కూల్ ఫిజిక్స్ పీజీటీ సీవీ శ్రావణికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026కు ఎంపిక చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేసిన కృషి, ఫిజిక్స్ లాంటి క్లిష్టమైన సబ్జెక్టును సైతం ఆసక్తికరంగా, సులభతరంగా బోధించిన విధానం ఆమెకు ఈ గుర్తింపును తెచ్చిపెట్టింది. సులభమైన బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి.. ఫిజిక్స్ సబ్జెక్టులోని సూత్రాలు, సిద్ధాంతాలను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా నిత్యజీవితంలోని ఉదాహరణలతో అనుసంధానం చేస్తూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం శ్రావణి ప్రత్యేకతగా నిలిచారు. క్లిష్టమైన అంశాలను చిన్నచిన్న భాగాలుగా విభజించి, ప్రయోగాలు, ప్రదర్శనలు, నమూనాలు, దృశ్యరూపకాలు, ప్రశ్నోత్తరాల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు ఆమె నిరంతరం కృషి చేశారు. విద్యార్థులు పాఠాన్ని కేవలం వినడం కాకుండా ఆలోచించడం, ప్రశ్నించడం, స్వయంగా పరిశీలించడం, ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం వంటి విధానాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తరగతి గదిని చురుకై న అభ్యసన వేదికగా మార్చడంలో ఆమె చూపిన ప్రత్యేక శ్రద్ధ విద్యార్థులు, సహచర ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకున్నారు. బోధనను కేవలం ఉద్యోగ బాధ్యతగా కాకుండా సామాజిక బాధ్యతగా భావిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న సీవీ శ్రావణి సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు– 2026కు ఎంపిక చేయడంపై విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నష్టాల బాటలో వేరుశనగ రైతులు
గోరంట్ల: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అరకొరగా కురిసిన వర్షాలకు మండలంలోని కొందరు రైతులు వేరుశనగ పంట సాగు చేశారు. అప్పటి నుంచి నేటికీ చినుకు చుక్క నేలరాలకపోవడంతో రైతులు నష్టాల బాట పట్టారు. కేవలం ఐదు శాతం మందే... మండలంలో ఖరీఫ్ సీజన్లో 14 వేల హెక్టర్లలో రైతులు వేరుశనగ పంట సాగు చేయాల్సి ఉంది. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో 95 శాతం మంది రైతులు వేరుశనగ పంట సాగు చేయలేదు. కేవలం ఐదు శాతం మంది రైతులు జూన్ మాసంలో పడిన అరకొర వర్షానికి విత్తనం వేశారు. దాదాపు మూడు నెలలుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు విత్తిన విత్తనం మొలకెత్తి ఎదుగు బొదుగు లేకుండా పోయాయి. రూ.లక్ష నష్టం.. చొండూరివాండ్లపల్లికి చెందిన వడ్డే వెంకటేష్ తనకున్న ఆరు ఎకరాల పొలంలో జూన్ 5న కురిసిన అరకొర వర్షానికి మూడు క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను విత్తారు. అయితే వెంకటేష్ విత్తిన విత్తనం అరకోర వర్షానికి మొలకెత్తింది. అయితే అప్పటి నుంచి మళ్లీ వర్షం జాడ లేకపోవడంతో విత్తన మొలకలు ఏమాత్రం పెరగకుండా అలానే ఉండిపోవడం వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు ఎకరాల పొలంలో వేరుశనగ పంట సాగు చేయడానికి దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏఓ శంకనాయక్ను ‘సాక్షి’ వివరణ కోరగా మండల వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కేవలం 720 హెక్టర్లలో మాత్రమే వేరశనగ పంటను సాగు చేసినట్లు పేర్కొన్నారు. వర్షాలు పడకపోవడంతో వేరుశనగ మొలక పెరగలేదన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
పుట్టపర్తి: ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయంలో డీఈఓ కిష్టప్ప అధ్యక్షతన ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌టీఏ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలతో పాటు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక విషయంలో ఎలాంటి ఆలస్యానికి తావులేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. యూటీఎఫ్ నేతల అరెస్టు అప్రజాస్వామికంధర్మవరం అర్బన్: విజయవాడ నగరంలో మంగళగిరి వద్ద స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ విద్యాభవన్ ముట్టడికి దిగిన యూటీఎఫ్ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు అమర్ నారాయణరెడ్డి, నాగేంద్రమ్మ, రాష్ట్ర కౌన్సిలర్ మేరీవరకుమారి, పట్టణాధ్యక్షుడు జింకా హరికృష్ణ ఖండించారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో మంగళగిరి వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను రద్దుకు అవసరమైన అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, ఆఫ్‌లైన్‌లో పరీక్షను సంబంధిత సబ్జెక్టులో మాత్రమే నిర్వహించి క్వాలిఫైయింగ్ మార్కులు 40 శాతంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్ తదితరులను అరెస్టు చేయడం సరికాదన్నారు. బుక్కపట్నంలో పట్టపగలే చోరీ ● ఐదు తులాల బంగారు, రూ.80 వేలు నగదు అపహరణ పుట్టపర్తి: బుక్కపట్నం మండల కేంద్రంలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. బాధితుడు శేఖర్ వివరాలమేరకు... స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం వద్ద నివాసం ఉంటున్న జంపాల శేఖర్ ఇంట్లోని బీరువాలో దాచిన రూ.7 లక్షల విలువ చేసే 5 తులాల బంగారు నగలు, రూ.80 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాటు వేసిన దొంగ ఆ ఇంటి బాత్ రూంలో ఉంచిన తాళం చెవిని తీసుకొని నేరుగా ఇంట్లోకి ప్రవేశించి దొంగతానికి పాల్పడ్డారు. ఆ సమయంలో శేఖర్ భార్య ఉపాధి పనులకు, శేఖర్ వ్యవసాయ పనులకు వెళ్లారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నారాయణరెడ్డి శేఖర్ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. రెండు నెలల క్రితం పట్టపగలే ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగిన విషయం ఇంకా మరువకనే మరో దొంగతనం జరగడంలో బుక్కపట్నం వాసులు ఆందోళన చెందుతున్నారు. అలరించిన సంగీత కచేరీ ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన విశాఖ జిల్లా సత్యసాయి భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. గురువారం విశాఖటప్నం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు ‘మానస సంచరే’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ సుమారు గంట పాటు కచేరీ నిర్వహించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
బీడుగా హంద్రీనీవా పరివాహక ప్రాంతం
పుట్టపర్తి అర్బన్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు పారించారు. అయితే చంద్రబాబు పాలనలో హంద్రీనీవా నీళ్లు కుప్పం తీసుకువెళ్లే పన్నాగంతో లైనింగ్ పనులు చేయించారు. ఇదే ఇప్పుడు రైతులకు శాపంగా మారింది. గతంలో హంద్రీనీవా కాలువకు నీళ్లు రాగానే కాలువకు ఇరువైపులా ఉన్న వేలాది బోరు బావులు, వ్యవసాయ బావులు నీటితో కళకళ లాడేవి. దీంతో ఏటా రెండు పంటలను పండించుకుంటూ జీవనం సాగించేవారు. గత ఏడాది హంద్రీనీవా కాలువకు సిమెంట్ పూతతో లైనింగ్ వేశారు. దీంతో ఒక్క చుక్క నీళ్లు కూడా భూమిలోకి ఇంక కుండా నేరుగా చిత్తూరు జిల్లా కుప్పంకు వెళ్లిపోతున్నాయి. 3 టీఎంసీల నికర జలాలు సాధించినా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులకు 3 టీఎంసీల నీళ్లు కావాలని అప్పటి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పట్టుబట్టి 3 టీఎంసీల నికర జలాలను సాధించారు. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నేటికీ ఒక్క టీఎంసీ నీళ్లను కూడా వినియోగించుకోక పోవడం విశేషం. హంద్రీనీవా జలాలు జిల్లాకు వారం రోజుల నుంచి వస్తున్నా హంద్రీనీవా పరివాహక ప్రాంతంలోని బావులు, బోర్లు రీచార్జ్ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
వంకనూ వదల్లేదు!
కదిరి టౌన్: టీడీపీ నేతల కబ్జాలతో కదిరిలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. తాజాగా కదిరి మున్సిపల్ పరిధిలోని సైదాపురం పొలం సర్వే నంబర్ 624–1, 625లో ఎకరం విస్తీర్ణంలో వంకపోరంబోకు భూమిపై టీడీపీ నాయకుడు, కదిరి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కొమ్మినేని గంగయ్యనాయుడు కన్నేశాడు. వర్షాకాలంలో పైనుంచి వచ్చే నీరు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఉద్దేశించిన వంక భూమిని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యాడు. రూ.5 కోట్ల భూమిని అప్పనంగా కొట్టేసేందుకు... సైదాపురం పొలం గతంలో ఊరికి దూరంగా ఉండేది. కానీ కదిరి పట్టణం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుండగా సైదాపురం మున్సిపాలిటీలో కలిసిపోయింది. 624, 625 సర్వే నంబర్లలోని పొలాలు పట్టణంలో కలిసిపోయాయి. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి వాణివీధిలోని శ్రీషిర్డిసాయిబాబా గుడి వెనుక వైపున ఉంది. ప్రభుత్వ రికార్డుల్లో వంకపోరంబోకుగా పేర్కొన్న భూమి విలువ సెంటు రూ.5 లక్షలపైనే ధర పలుకుతోంది. దీంతో సైదాపురం గ్రామానికి చెందిన కొమ్మినేని గంగయ్యనాయుడు ఆ భూమిపై కన్నేశాడు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అండతో కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మట్టితొలి చదును చేశాడు. త్వరలోనే ప్లాట్లు వేసి అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఏకంగా రూ.5 కోట్ల విలువైన భూమిని టీడీపీ నాయకుడు కబ్జా చేసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన వంకపోరంబోకు భూమిని పూడ్చివేసి ప్లాట్లుగా మారిస్తే... భవిష్యత్‌లో వర్షపు నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడి పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి పరిరక్షించాలని కోరుతున్నారు. కఠిన చర్యలు తప్పవు ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా కఠిన చర్యలు తప్పవు. సైదాపురం పొలం సర్వే నంబర్ 624–1, 625లోని స్థలాన్ని సర్వే చేయిస్తాం. ఎవరైనా ఆక్రమించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. – రెడ్డి శేఖర్, తహసీల్దార్, కదిరి కదిరిలో మితిమీరిన టీడీపీ నాయకుల భూకబ్జాలు వంకను ఆక్రమించి మట్టితోలి చదును చేసిన ఓ ‘తమ్ముడు’ రూ. 5 కోట్ల భూమికి ఎసరు పెట్టిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అధికార పార్టీ నాయకుడు కావడంతో కళ్లుమూసుకున్న అధికారులు -
మాటలతో రెచ్చగొట్టి.. చితకబాది!
అనంతపురం సిటీ: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పార్కింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. వారి సూచనలు పాటించకపోతే బూతులతో రెచ్చిపోతారు. దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. బుధవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఉప్పునేసిన పల్లికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు ద్విచక్ర వాహనంపై సర్వజనాస్పత్రికి వచ్చాడు. అప్పటికే చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తన తండ్రికి అవసరమైన మందుల కోసం వచ్చిన అతను తన వాహనాన్ని పార్క్ చేస్తున్న సమయంలో అక్కడున్న సిబ్బంది పక్కకు తీసుకెళ్లి పెట్టాలని తెలిపారు. దీంతో అతను మందులు తీసుకుని వెంటనే వెళ్లిపోతానని అనడంతో సిబ్బంది ససేమిరా అన్నారు. మాటలతో రెచ్చగొట్టి యువకుడిని పక్కకు నెట్టారు. ఆ సమయంలో స్వీయ రక్షణలో భాగంగా యువకుడు ప్రతిఘటించడంతో సిబ్బంది చుట్టుముట్టి మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడి తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. పెదవి పగిలింది. అక్కడున్న వారు సర్దిచెప్పి యువకుడిని వెంటనే ఏఎంసీలో చికిత్స కోసం తరలించారు. సర్వజనాస్పత్రిలో పార్కింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది దౌర్జన్యం తీవ్ర రక్తగాయాలతో ఆస్పత్రిలో చేరిన ధర్మవరం వాసి బాధితుడిపైనే ఫిర్యాదు దాడికి సంబంధించి బాధితుడిని సర్వజనాస్పత్రి అవుట్ పోస్ట్ పోలీసులు విచారించారు. అతడి ఫిర్యాదు మేరకు దౌర్జన్యం చేసిన పార్కింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ వెంటనే అప్రమత్తమై సదరు యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసేలా పావులు కదిపాడు. వాహనాన్ని పక్కన పెట్టమని చెప్పినందుకు తమపైనే యువకుడు దాడి చేసి గాయపరిచాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాలపై కేసుల నమోదుకు రెండో పట్టణ పోలీసులకు అవుట్‌పోస్టు సిబ్బంది సిఫారసు చేశారు. ఈ విషయమై సర్వజనాస్పత్రి పరిపాలనా అధికారి మల్లికార్జునరెడ్డిని వివరణ కోరగా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు ఇబ్బంది కలిగిస్తే పార్కింగ్ కాంట్రాక్ట్ టెండర్‌ను రద్దు చేస్తామన్నారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
పుట్టపర్తి టౌన్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.84 లక్షల విలువైన 47 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. బుధవారం పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. గత ఏడాది బుక్కపట్నం, ధర్మవరం ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక వివరాల ఆధారంగా చిత్తూరు జిల్లా చౌడేపల్లి వైఎస్సార్ కాలనీకి చెందిన శ్రీనివాసులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బుధవారం చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఇతను 2016 నుంచి తాళం వేసిన ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి సమయాల్లో ఒంటరిగా దొంగతనాలకు పాల్పడేవాడని వెల్లడైంది. నిందితునిపై ఇప్పటివరకూ 20 కేసులు నమోదైనట్లు గుర్తించారు. తిరుపతి, చిత్తూరు, పాకాల, మదనపల్లె, పలమనేరు, పీలేరు తదితర ప్రాంతాల్లోనూ ఇతనిపై కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. శ్రీకాళహస్తిలో నమోదైన కేసులో అరెస్టయ్యి జైలుకు కూడా వెళ్లాడు. నిందితున్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీలు జగన్నథ్రాజు, సత్యనారాయణ, సీఐ సురేష్, ఎస్ఐ సత్యనారాయణ, ఎస్ఓజీ బృందాలను ఎస్పీ అభినందించారు. నేరగాళ్లను గుర్తించి చట్టం ముందు నిలబెట్టేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో ఐరన్ గ్రిల్ సిస్టంతో పాటు డోర్‌లాక్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లో ఉంచుకోవాలని, ఎల్ఎచ్ఎంఎస్ యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. పోగొట్టుకున్న బంగారం తిరిగి తమ చేతుల్లోకి రావడంతో బాధితులు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా తదితరులు పాల్గొన్నారు. 47 తులాల బంగారం, కేజీ వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్‌కుమార్ -
ముగిసిన ఆగాఖాన్ బృందం పర్యటన
మడకశిరరూరల్: మడకశిర డివిజన్లో ఆగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ (ఏకేఆర్ఎస్పీ)కు చెందిన ప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా పావగడలో క్షేత్ర స్థాయి పర్యటన, అనుభవాలను సమీక్షిస్తూ, వారి వారి రాష్ట్రాల భౌగోళిక, వాతావరణ, పంటల పరిస్థితులకు అనుగుణంగా ఏపీసీఎన్ఎఫ్ పద్ధతులను ఎలా అన్వయించుకోవాలనే అంశాలపై కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీటీఅండ్ఐఓ) లక్ష్మానాయక్ సమగ్ర సైద్ధాంతిక సమావేశం నిర్వహించారు. బృందం ప్రతినిధుల రెండు రోజుల క్షేత్ర స్థాయి పర్యటన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం అమలు, రైతుకు కలిగే లాభాలు, తగ్గుతున్న పెట్టుబడి, పీఎండీఎస్ విత్తనాలు విత్తే విధానం, ఏ గ్రేడ్, ఏటీఎం, జీవ వైవిధ్య పంటల ప్రాధాన్యతతో పాటు తక్కువ వర్షపాత నమోదు పరిస్థితుల్లో పంట వ్యవస్థలను స్థిరంగా కొనసాగించే విధానాలను బృందం ప్రతినిధులకు ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానం రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని వివరించారు. సమావేశంలో జాతీయ వనరుల సంస్థ అధిపతి వి. కృష్ణారావు, టెక్నికల్ ఏఓలు ఎం.హుమాయున్, సంతోష్, ఎన్ఆర్ఓ, ఏపీసీఎన్ఎఫ్ బృందం సభ్యులు సయ్యుద్ దాదాపీర్, నవీన్,మాస్టర్ ట్రైనర్ రమేష్, ఆర్‌వైఎస్‌ఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
భూముల రీ సర్వే పక్కాగా చేపట్టండి
● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): భూముల రీ సర్వే ప్రక్రియను పక్కాగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేజ్ మ్యాప్‌లు పరిశీలించి సర్వే నంబర్ల హద్దులను తనిఖీ చేశారు. భూ యజమానులు, రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా చేయాలని రెవెన్యూ, సర్వే సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రెవెన్యూ కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ దరఖాస్తులపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్‌రెడ్డి, తహసీల్దార్ సురేష్‌బాబు, మండల సర్వేయర్ సంతోషలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సౌత్‌జోన్ పెంకాక్ సిలాట్ పోటీలకు ఎంపిక హిందూపురం టౌన్: పుదుచ్చేరిలో ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించనున్న 7వ సౌత్‌జోన్ పెంకాక్ సిలాట్ చాంపియన్‌షిప్–2026 పోటీలకు హిందూపురానికి చెందిన ఎనిమిది మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. పట్టణంలోని ఎంజీఎం మైదానంలో గల సీ–మ్యాన్ అకాడమీ నుంచి యతికా రుక్మిణి, ఆర్.రియా, ఓంకార్ దేవ్, జీఎం రాజు, ఎఫ్. సమీర్, అలాగే ఇతర పాఠశాల, కళాశాల నుంచి జి.రుచిత, కురుబ మణితేజ, డి.సానియా ఎంపికై న వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా పెంకాక్ సిలాట్ కోచ్ ప్రవీణ్ కుమార్, పెంకాక్ సిలాట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రియాజ్ బాషా, ఉపాధ్యక్షుడు ఖాన్ బాబా ఫక్రుద్దీన్, కార్యదర్శి జనార్దన్ రెడ్డి, హరికృష్ణ, సాధిక్ తదితరులు క్రీడాకారులను అభినందించారు. సౌత్‌జోన్ పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఇసుక అక్రమ తరలింపు.. టిప్పర్, ట్రాక్టర్ల పట్టివేత ధర్మవరం రూరల్: చిత్రావతి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక టిప్పర్, 7 ట్రాక్టర్లను బుధవారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దేవరాజ్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక, మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండల వ్యాప్తంగా తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బైండోవర్ షరతుల ఉల్లంఘన.. వ్యక్తికి రిమాండ్ రొళ్ల: బైండోవర్ షరతులు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని ఎస్ఐ నరసింహుడు హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని కల్లురొప్పంగొల్లహట్టి గ్రామానికి చెందిన దేవరాజు అనే వ్యక్తి ఇది వరకే విధించిన బైండోవర్ ఉల్లంఘించినట్లు గుర్తించి అతనిపై చర్యలు చేపట్టినట్లు వివరించారు. దేవరాజును స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు. మడకశిరలో న్యాయమూర్తి ఎదుట దేవరాజు హాజరు పరచగా 15 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించామన్నారు. బైండోవర్ చేసిన తర్వాత ఏడాది పాటు ఎలాంటి గొడవలు, ఇతర నేరాలకు పాల్పడకూడదన్నారు. అలాచేస్తే బైండోవర్ ఉల్లంఘన కింద రూ.5,00,000 జరిమాన లేదా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్ఐ కోరారు. -
టీచర్ కొట్టడంతో విద్యార్థికి గాయాలు
కదిరి అర్బన్: టీచర్ కొట్టడంతో విద్యార్థి తలకు గాయమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కదిరి– హిందూపురం రోడ్డులో ఉన్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 31న 8వ తరగతి చదివే అల్తాఫ్ అనే విద్యార్థి ఎత్తు కొలుచుకోవడం తనకు రాదని సోషల్ ఉపాధ్యాయురాలైన సుజాతకు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆమె తలపై కర్రతో కొట్టింది. దీంతో విద్యార్థి తలకు రక్తగాయమైంది. సదరు ఉపాధ్యాయురాలు భయపడి రక్తాన్ని నీళ్లతో కడిగేసి ఇంట్లో ఎవరికీ చెప్పద్దని పంపించేసింది. తలగాయం నొప్పిరావడంతో మరుసటి రోజు జరిగిన విషయాన్ని విద్యార్థి తన సోదరుడికి చెప్పాడు. విద్యార్థి సోదరుడు ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకులకు తెలపడంతో ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని వారు బుధవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. మండల విద్యాధికారి చెన్నక్రిష్ణ పాఠశాలలో విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూదరుల అరెస్ట్ మడకశిర: మండలంలోని కల్లుమర్రి, అగ్రంపల్లి పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జూద కేంద్రాలపై రూరల్ సీఐ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఎస్ఐ కృష్ణారెడ్డి, పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. అభి అనే వ్యక్తి మడకశిర, హిందూపురం, కర్ణాటకలోని మధుగిరి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జూదరులను రప్పించి పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో రవీంద్ర, కిషోర్, నరసన్న, ఆదెన్న అనే జూదరులు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.72 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 5 ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. కొంతమంది జూదరులు పారిపోయినట్లు పేర్కొన్నారు. వారిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు పెనుకొండ డీఎస్పీ పర్యవేక్షణలో దాడులు చేసినట్లు చెప్పారు. జూదరులపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. వెల్ఫేర్ అసిస్టెంట్ చేతివాటం! కదిరి అర్బన్: సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీలో ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ చేతివాటం ప్రదర్శించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. కదిరి మండల పరిధిలోని బాలప్పగారిపల్లి క్వార్టర్స్‌కు చెందిన వెంకటమ్మ అనే మతి స్థితిమితం లేని మహిళకు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రకాష్ పెన్షన్ డబ్బు రూ.4 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.2 వేలే ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీంతో వెల్ఫేర్ అసిస్టెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఎంపీడీఓ నసీమాను వివరణ కోరగా ఆమె స్పందించారు. పెన్షన్ రూ. 4 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.3,500 ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. దీనిపై డిప్యూటీ ఎంపీడీఓ ఇచ్చే విచారణ నివేదికను ఉన్నతాధికారులను పంపిస్తామని, తప్పు జరిగినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచండి
● సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం కనగానపల్లి: స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన కనగానపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది రోల్ కాల్ (డ్యూటీ షెడ్యూల్)ను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ.. రానున్న స్థానిక ఎన్నికలు, వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలన్నారు. గ్రామాల్లో రాజకీయ, వర్గకక్షలు ప్రేరేపితం కాకుండా ముఠా నాయకులు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అలాగే గ్రామాల్లో దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు జరకుండా రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ రిజ్వాన్, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్షుద్రపూజల కలకలం నల్లచెరువు: మండలంలో బుధవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నల్లచెరువుకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని బుధవారం ముస్లింలు ఖబరస్తాన్కు తీసుకువెళ్లారు. అయితే ప్రవేశ ద్వారం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కర్పూరం, పూలు, కోడిగుడ్లు ఉంచి పూజలు నిర్వహించినట్లు గుర్తించిన ముస్లింలు భయాందోళన చెందారు. ఆ విషయం ఆ నోటా..ఈ నోటా మండలమంతా వ్యాపించగా...స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. డిమాండ్లు నెరవేర్చే వరకూ పోరుబాటే ధర్మవరం అర్బన్: పారా మెడికల్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ పోరుబాట వీడబోమని కాంట్రాక్ట్ మెడికల్, పారా మెడికల్ ఉద్యోగులు తేల్చిచెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు చేపట్టిన నిరసన బుధవారంతో 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... వైద్యశాఖలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, అంతవరూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వంద శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబంలో అర్హులైన వారికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలు చేయాలని, అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో కూడిన వైద్య సెలవులు మంజూరు చేసి ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు హెల్త్‌కార్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నిరంతరం పోరాడతామన్నారు. నిరసన కార్యక్రమంలో కాంట్రాక్ట్ మెడికల్, పారా మెడికల్ ఉద్యోగులు పుష్పలత, కమలమ్మ, జయమ్మ, మహబూబ్జాను, మాధవి, విదియ, సంధ్య, మహాదేవి, లలిత పాల్గొన్నారు. -
తండ్రి మందలింపు.. కుమారుల అదృశ్యం
● క్షేమంగా పట్టుకొచ్చి అప్పగించిన పోలీసులుధర్మవరం రూరల్: మండలంలోని తుంపర్తిలో తండ్రి మందలించడంతో ఇద్దరు కుమారులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. రమేష్, కృష్ణకుమారి దంపతులకు ఇంటర్, పదో తరగతి చదువుతున్న దినేశ్, ఆర్యన్ సంతానం. వారు తరచూ సెల్‌ఫోన్ చూస్తూ చదువుపై శ్రద్ధ చూపడం లేదని తండ్రి సోమవారం సాయంత్రం మందలించాడు. దీంతో ఇద్దరు కుమారులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుమారులు కనిపించడం లేదని తల్లిదండ్రులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారు విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం రాత్రి పిల్లలిద్దరినీ క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. అప్పుల బాధతో బలవన్మరణం సోమందేపల్లి(పరిగి): సోమందేపల్లి మండలంలోని కేతగానిచెరువు గ్రామానికి చెందిన నాగరాజు (42) అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేతగానిచెరువు గ్రామానికి చెందిన నాగరాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. ఇతనికి భార్య మంజులతో పాటూ ఇద్దరు సంతానం ఉన్నారు. నాగరాజుకు కొంతకాలంగా అప్పుల బాధలు ఎక్కువైనట్లు స్థానికులు తెలిపారు. దీంతో తరచూ మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన గత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి తాడిపత్రి రూరల్: విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి చెందిన ఘటన పట్టణ సమీపంలోని యల్లనూరు రోడ్డు రైల్వే గేటు వద్ద జరిగింది. అప్‌గ్రెడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లా నర్షిపూర్ ప్రాంతానికి చెందిన మసూద్‌రాణా(25) యల్లనూరు రోడ్డు రైల్వే గేటు వద్ద జరుగుతున్న రైల్వే బ్రిడ్జి పనుల వద్ద కూలీగా పనిచేసేవాడు. బుధవారం వెల్డింగ్, సెంట్రింగ్ పనులు చేస్తున్న సమయంలో చేతిలోని ఫోకస్ లైట్‌కు ఉన్న జాయింట్ తెగి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. సహచర కూలీలు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మసూద్‌రాణా మృతి చెందాడని డాక్టర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
అంగన్వాడీల యాప్‌సోపాలు
అనంతపురం సిటీ: అంగన్వాడీ సిబ్బందిని యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అమలుచేస్తున్న ‘బాల సంజీవని’ యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి 2.0 పేరుతో అందుబాటులోకి తెచ్చింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రేషన్ సరుకులను మరింత పకడ్బందీగా పంపిణీ చేసేందుకు వీలుగా మార్పులు చేసిన తరువాత ఈ యాప్ సరిగా పనిచేయడం లేదని, దీంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. గంటల తరబడి కుస్తీ.. ప్రస్తుతం అంగన్వాడీలపై ఎనిమిది రకాల యాప్‌ల భారాన్ని ప్రభుత్వం మోపింది. కేవలం పదో తరగతి చదువుతో ఈ చిరుద్యోగానికి వచ్చిన చాలా మందిలో స్మార్ట్ ఫోన్ల వినియోగంపై సరైన అవగాహన లేదు. ఇలాంటి వారికి ఎనిమిది రకాల యాప్‌ల ద్వారా సమాచారాన్ని అప్లోడ్ చేయడం తలకు మించిన భారమే అవుతోంది. అంతేకాక సాంకేతిక కారణాలతో చాలా చోట్ల యాప్‌లు సక్రమంగా ఓపెన్ కాక గంటల తరబడి కుస్తీ పట్టాల్సి వస్తోంది. రోజూ యాప్‌లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలు నమోదు చేయడంతో పాటు వారి ఫొటోలు తీసి అప్లోడ్ చేసిన తరువాతే రేషన్ అందించాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాలతో ఒక్కోసారి లబ్ధిదారులు అంగన్ వాడీ కేంద్రాలకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో వారికి సరుకులు అందించడం కష్టమవుతోంది. సిబ్బంది హాజరు కూడా ఇదే యాప్‌లో నమోదు చేయాల్సి ఉందని, సమయానికి యాప్ ఓపెన్ కాకపోవడంతో కేంద్రానికి ఆలస్యంగా వచ్చినట్టు నమోదవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చుల వివరాలూ.. గతంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖర్చులకు సంబంధించిన వివరాలను మాన్యువల్‌గా రిజిస్టర్లో నమోదు చేసేవారు. తాజాగా పిల్లలకు వండి వడ్డించేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రతి రూపాయిని యాప్‌లోనే అప్లోడ్ చేయాలి. సాంకేతిక సమస్యలతో వివరాలు అప్లోడ్ కాకపోతే మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. పిల్లలు గుండు చేయించుకుని ఉన్నా, ఫొటో తీసే సమయంలో కెమెరా వైపు చూడకపోయినా వారి హాజరును లెక్కించడం లేదని, దీంతో రోజువారీ ఖర్చులపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరం.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, ఆరేళ్ల లోపు ఉన్న చిన్నారులకు అందిస్తున్న టేక్ హోం రేషన్, బాలామృతం పంపిణీకి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ (పోషన్ అభియాన్)ను వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్ వినియోగంలో నెట్వర్క్ కష్టాలు వెన్నాడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సరిగా ఉండకపోవడంతో లబ్ధిదారుల ఫేస్‌ను క్యాప్చర్ చేయడానికి చాలా సమయం పడుతోంది. అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం! చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు యాప్‌ల కారణంగా నిర్వీర్యమైపోయాయి. పూర్వ ప్రాథమిక విద్య బలపడేలా అందజేసిన కిట్లు కూడా నిరుపయోగంగా మారాయి. ఆటపాటలతో చిన్నారులకు బోధన చేయాల్సిన సమయం కాస్త యాప్‌లలో సమాచారాన్ని నింపి అప్లోడ్ చేయడానికే సరిపోతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా చాలా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు కనీస రెయిమ్స్ కూడా చెప్పలేని దుస్థితి నెలకొంది. కొన్ని సెంటర్లలో పిల్లలు ఎత్తుకు తగిన బరువు కూడా ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి యాప్‌ల భారం తగ్గించాలని అంగన్వాడీలు కోరుతున్నారు. ‘‘సాఫ్ట్వేర్ ఇంజినీర్లకంటే దారుణంగా ఉంది మా పరిస్థితి. కేవలం పదో తరగతి వరకు చదువుకున్న వారిపై ఇంతటి సాంకేతిక పని భారాన్ని మోపడం సరికాదు. ఈ విషయంగా ప్రశ్నిస్తే ఆ నాలెడ్జ్ ఉన్న వారితో పని పూర్తి చేయించాలని చెబుతున్నారు. అయితే పని చేసిన వారికి ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వరంట. అది కూడా మేమే ఇచ్చుకోవాలంటా’’ – ఓ అంగన్వాడీ కార్యకర్త ఆవేదన ఇది.. అటకెక్కిన పూర్వ ప్రాథమిక విద్య చదువు చెప్పడం కంటే యాప్‌లతోనే కుస్తీ సాంకేతిక సమస్యతో వినియోగంలో ఇబ్బందులు మనుషులుగా చూడడం లేదు అంగన్వాడీ కార్యకర్తలను మనుషులుగా కాకుండా యంత్రాలుగా ప్రభుత్వం చూస్తోంది. అన్ని రకాల పనులను వారితో చేయిస్తోంది. దీంతో ఐసీడీఎస్ ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం కాస్త నీరుగారిపోతోంది. రోజంతా సెల్ఫోన్లలోనే పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. – ఎస్.నాగేంద్రకుమార్, సీఐటీయూ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి -
రాజన్నకు నీరాజనం
సాక్షి, పుట్టపర్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు వైఎస్సార్ అభిమానులు ఊరూరా మహానేత విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసి ఘన నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, వస్త్ర దానంతో పాటు ఆస్పత్రుల్లోని రోగులకు పండ్లు, బ్రెడ్డు పంచిపెట్టారు. జనరంజక పాలన అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆమె పార్టీ శ్రేణులతో కలిసి పెనుకొండలోని మడకశిర రోడ్డులో ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.. హంద్రీ–నీవా పథకంతో ఉమ్మడి అనంతపురం జిల్లా సాగునీటి కష్టాలు తీర్చిన అపరభగీరథుడు వైఎస్సార్ అని కొనియాడారు. అప్పట్లో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు.. ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని గుర్తు చేశారు. వైఎస్సార్ ఆశయ సాధన దిశగా ఆయన కుమారుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ముందుకెళ్తున్నారని, అందరం ఆయనకు అండగా నిలుద్దామన్నారు. అనంతరం రొద్దం మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి అన్నారు. బుధవారం ఆయన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద రోగులకు పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎస్ కేశవరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకు వస్తుందన్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహరహం కృషి చేశారని కొనియాడారు. అందుకే జనం కూడా ఆయన్ను తమ ఇలవేల్పుగా గుండెగుడిలో పెట్టి చూసుకుంటున్నారన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో వ్యవసాయానికి పెద్దపీట వేశారని వైఎస్సార్ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం మడకశిరలోని వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ‘రైతుబాంధవుడు రాజశేఖరుడు.. వ్యవసాయాన్ని పండుగ చేసింది రాజశేఖరుడే’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. హిందూపురంలోని పరిగి బస్టాండులోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక భర్త వేణురెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చౌళూరు మధుమతి గజమాల వేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టి.. అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తదితర పథకాల గురించి కొనియాడారు. ఆయా పథకాలతో ఎందరో లబ్ధి పొంది... తమ జీవితాల్లో వెలుగులు నింపుకున్నారన్నారు. రాజన్నా అని పిలిస్తే నేనున్నానంటూ ముందుకు వచ్చిన నాయకుడని, అందుకే ఆయన అందరివాడయ్యారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు సజీవంగా ఉన్నాయని వైఎస్సార్ సీపీ కదిరి సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అన్నారు. కదిరిలోని మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ.. జలప్రదాత.. సంక్షేమ పథకాల పితామహుడు, హంద్రీనీవా కాలువ తెచ్చిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ముస్లింల దుస్థితిని గుర్తించి రిజర్వేషన్లతో లబ్ధి చేకూర్చిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. రాజశేఖరరెడ్డి అంటేనే సంక్షేమ సంతకమని, అందుకే ఆయన జన హృదయ నేతగా మారారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు ఆయన ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. బుధవారం బత్తలపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించి రాజన్న రాజ్యానికి బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. సాగులో సాయంగా నిలిచిన రైతు బాంధవుడు.. పేదవాడి ఆరోగ్యానికి రక్షగా నిలిచిన వైద్యుడు.. విద్యార్థుల భవితకు బాటలు వేసిన దార్శనికుడు.. నిరుపేదల బతుక్కి భరోసా కల్పించిన మహా మనీషి...అందుకే ఆయన భౌతికంగా దూరమైనా.. పచ్చని పైరులో..నిరుపేదల నవ్వుల్లో.. నిత్యం కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఆయన వర్ధంతి వేళ ఊరూవాడా ఘనంగా నివాళులర్పించింది. రాజన్నా నినుమరువలేమన్నా అంటూ అభిమానం చాటుతూ అంజలి ఘటించింది. వాడవాడలా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచిన అభిమానులు ఊరూరా విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసిన నాయకులు రాజన్న ఆశయ సాధనే ధ్యేయమని వెల్లడి ‘పురం’లో సేవా కార్యక్రమాలు.. జన హృదయ నేత రాజశేఖరరెడ్డి.. ప్రజల గుండెల్లోనే రాజన్న.. వైఎస్సార్ ఆశయ సాధనే ధ్యేయం.. రైతు బాంధవుడు రాజశేఖరుడు.. సంక్షేమ పథకాల పితామహుడు వైఎస్సార్.. -
●తరగని అభిమానం
గాండ్లపెంట: సంక్షేమ పథకాలతో జన రంజక పాలన అందించిన వైఎస్సార్ అంటే పేదలకు ఎనలేని అభిమానం. తన హయాంలో రైతులకే కాదు..రైతు కూలీలకు ఏ కష్టమూ కలగకుండా పాలన సాగించారు. అందుకే ఆయన వర్ధంతి సందర్భంగా బుధవారం మండల పరిధిలోని కత్తివారిపల్లి గ్రామ శివారులోని పొలాల్లో పనిచేసేందుకు వచ్చిన కూలీలు దివంగత నేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర సేవలను గుర్తు చేసుకున్నారు. కల్మషం లేని ఆ మట్టిమనుషులు తమ బతుకులు మార్చిన మారాజుకు అంజలి ఘటించారు. -
ఆధిక్యంలో కర్నూలు, చిత్తూరు
అనంతపురం: అనంత క్రీడాగ్రామం వేదికగా ఏసీజీ, ఆర్సీజీ మైదానాల్లో సాగుతున్న ఏసీఏ అండర్–23 పురుషుల మల్టీ డే సౌత్‌జోన్ క్రికెట్ టోర్నీలో భాగంగా కర్నూలు, చిత్తూరు జట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆర్సీజీ మైదానంలో కర్నూలు, అనంతపురం జట్లు తలపడగా... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన అనంతపురం జట్టు 51.2 ఓవర్ల వద్ద 287 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటర్లు జయంత్‌కృష్ణ 86, ఎంకే దత్తారెడ్డి 52, మనోజ్‌కుమార్ 42 పరుగులు సాధించారు. కర్నూలు బౌలర్లలో దినేష్‌కుమార్ 5, అక్షిత్‌రెడ్డి 3, గౌరవిఖ్యాత్ 1 వికెట్లు తీశారు. బుధవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కర్నూలు జట్టు 64.2 ఓవర్ల వద్ద ఆరు వికెట్ల నష్టానికి 291 పరుగులు సాధించింది. బ్యాటర్లు నయీముల్లా 73, గౌర విఖ్యాత్ 68, విష్ణువర్దన్ నాయుడు 52 పరుగులు సాధించారు. కర్నూలు బ్యాటర్ గౌర విఖ్యాత్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును పటిష్ట స్థాయికి చేర్చాడు. ● ఏసీజీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు, చిత్తూరు జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు 307 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటర్లు నిఖిలేశ్వర్‌రెడ్డి 80, సుతేజ్‌రెడ్డి 40, ఏకాక్షర్ 40 పరుగులు సాధించారు. చిత్తూరు బౌటర్లలో రెడ్డి ప్రకాష్ తన స్పిన్ మాయాజాలంతో ఆరు వికెట్లు కూలదోసిన విషయం తెలిసిందే. అనంతరం చిత్తూరు జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 90.2 ఓవర్ల వద్ద 501 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటర్ చరంజిత్ 101 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 116 పరుగులు సాధించాడు. మరో బ్యాటర్ లోహిత్ లక్ష్మీనారాయణ 70, తేజారెడ్డి 70 సాధించారు. నెల్లూరు బౌలర్ భార్గవ్ మహేష్ ఐదు వికెట్లు తీశాడు. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి చిత్తూరు జట్టు 194 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
సాయి నామం.. సుమధురగానం
ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ భక్తులు ఆలపించిన గీతాలతో ప్రశాంతి నిలయం ప్రతిధ్వనించింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ స్థాపించి 54 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ప్రశాంతి నిలయంలో 54వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉదయం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉద్యోగులు సత్యసాయి మహా సమాధి చెంత ‘సేవా మధురం’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయి సేవలను, ఆధ్యాత్మిక తత్వాన్ని కొనియాడుతూ వారు నిర్వహించిన సంగీత కచేరీ భక్తకోటిని అలరించింది. అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ.. సత్యసాయి మానవాళికి సేవలు అందించే లక్ష్యంతో 1972 సెప్టెంబర్ 2న సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌ను ప్రారంభించారన్నారు. ఆ నాటి నుంచి నేటి వరకూ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్య, వైద్యం, తాగునీరు, సామాజిక సేవలు నిర్వహిస్తు అభాగ్యులకు తోడుగా నిలుస్తోందని వెల్లడించారు. నయనానందకరం నృత్యరూపకం ‘భక్తి శాశ్వతం... సురక్షితం’ అన్న సందేశాన్నిస్తూ మలేషియాకు చెందిన సత్యసాయి విద్యాసంస్థల చిన్నారులు నిర్వహించిన ‘ఎటర్నల్ ప్రాగ్రెన్స్ ఆఫ్ భక్తి’ నాటిక నయనానందకరంగా సాగింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన జోన్ –5కు చెందిన మలేషియా భక్తులు బుధవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పురాణ ఇతిహాసాలను నుంచి రామాయణం, భాగవతం, భారతంలోని వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తూ భక్తి తరతరాలుగా మానవాళిని సన్మార్గంలో నడుపుతున్న తీరును చిన్నారులు చక్కగా వివరించారు. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఘనంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 54వ వార్షికోత్సవం -
రెండిళ్లలో చోరీ
ఎన్పీకుంట: మండల పరిధిలోని వెలిచలమల గ్రామంలో సోమవారం రాత్రి రెండిళ్లలో జరిగిన చోరీలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బి.నాగిరెడ్డి తన కుటుంబ సభ్యులతో ముందు గదిలో తాళం వేసి పడుకుని ఉండగా గుర్తు తెలియని దుండగలు వెనుక వైపు ఉన్న ద్వారం గుండా లోనికి ప్రవేశించారు. బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న వస్తువులను చిందరవందరగా పడవేసి రెండు జతల బంగారు కమ్మలు, రూ.25,000 నగదు అపహరించారు. అక్కడే ఉన్న మరో బీరువా (లాకర్) తెరిచే ప్రయత్నం చేసినా తెరుచుకోక పోవడంతో అక్కడి నుంచి వెళ్లి పోయారు. ● అదే గ్రామానికి చెందిన బి.రాములమ్మ తనకు ఆరోగ్యం సరిలేక వారం క్రితం బాగేపల్లిలో ఉన్న తన కుమారుడి ఇంటికి వెళ్లింది. బుధవారం ఉదయం ఇంటిని శుభ్రపరచడానికి పనిమనిషి వెళ్లగా అప్పటికే ఇంటికి ఉన్న గొళ్లెం విరిగి పడి ఉండటంతో వెంటనే రాములమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె తమ బంధువుల ద్వారా ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా రెండు బీరువాలు తెరిచి ఉన్నాయి. అందులో ఉన్న రూ.2,000 దొంగిలించినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామని, క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించినట్లు ఎస్ఐ క్రిష్ణమూర్తి తెలిపారు. -
ఐదు నెలల జీతాలు వెంటనే చెల్లించండి
ప్రశాంతి నిలయం: వెంటనే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రెవెన్యూ భవన్ ఎదుట సమ్మె చేపట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు పాల్గొని కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ సత్యసాయి తాగునీటి పథకం ద్వారా జిల్లాలోని వందలాది గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతోందన్నారు. కార్మికుల నిరంతర కృషితో ప్రజల దాహర్తి తీరుస్తున్నారని చెప్పారు. అయితే ప్రభుత్వం కార్మికులపై పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ వారి కనీస హక్కు అయిన నెలసరి వేతనం కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. కార్మికులు విధిలేని పరిస్థితులలో 24 గంటల నిరవధిక సమ్మెకు పూనుకున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కార్మికులకు ఇవ్వాల్సిన 5 నెలలు వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత విషయంలో శాశ్వత పరిష్కారం చూపాలని, రిటైర్డ్ అయిన కార్మికులకు రావాల్సిన గ్రాట్యూటీని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు పీజీఆర్ఎస్లో కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ముత్యాలు, సాకే వెంకటేషు, కేవీపీఎస్ రమణ తదితరులు పాల్గొన్నారు. -
కార్లు బాడుగకు తీసుకుని తాకట్టు
● పోలీసుల అదుపులో నిందితుడు ఉరవకొండ: నియోజకవర్గంలో పలువురు కార్ల యజమానుల నుంచి బాడుగకు కార్లు తీసుకొని వాటిని బయట వ్యక్తులకు తాకెట్టు పెట్టి డబ్బు వసూలు చేసి పరారీలో ఉన్న మోసకారిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉరవకొండ సీఐ మహానంది, ఎస్ఐ జనార్ధన్‌నాయుడు తెలిపిన వివరాలమేరకు... స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో నివాసమంటున్న అంకె అమరేశ్వర అలియాస్ హనుమంతు పట్టణంలో బాడుగులకు వాహనాలు తిప్పే కార్ల యజమానుల వద్దకు వెళ్లి అధిక బాడుగ చెల్లిస్తానంటూ ఆశ చూపాడని తెలిపారు. అతని మాటలు నమ్మిన కార్ల యజమానులు కార్లు బాడుగలకు ఇచ్చారన్నారు. అయితే వారికి తెలియకుండా హనుమంతు 13 కార్లను బయట వ్యక్తులకు కుదవ పెట్టి డబ్బులు వసూలు చేసి పరారైనట్లు పేర్కొన్నారు. వాహన యజమానుల్లో ఒకరైన ఎర్రిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సోమవారం పాల్తూరు క్రాస్ వద్ద 42వ జాతీయ రహదారి వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 9 కార్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు. మామపై అల్లుడి దాడి నార్పల: కుటుంబ కలహాలతో మామపై వేటకొడవలితో అల్లుడు విచక్షణారహితంగా దాడిచేసిన ఘటన మండల కేంద్రమైన నార్పలలో కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు... నార్పలలోని తిక్కస్వామివీధిలో నివాసం ఉంటున్న చిలమకూరి పాముల రాజాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ముందే వివాహం జరిపించాడు. చిన్నకుమార్తె రమాదేవికి 18 నెలలు క్రితం లింగాల మండలానికి చెందిన శివయ్య కుమరుడు చరణ్‌తో పెళ్లి చేశారు. కుమార్తె గర్భిణి కావడంతో ప్రసవం కోసం పాముల రాజా తన ఇంటికి పిలుచుకుని వచ్చాడు. నెల రోజుల క్రితం రమాదేవి ప్రసవించింది. బిడ్డను చూసేందుకు చరణ్ తో పాటు అతని తండ్రి శివయ్య వచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబ విషయాల్లో వచ్చిన మనస్పర్థల కారణంగా చరణ్ ... తన మామ అయిన పాముల రాజాపై వేట కొడవలితో దాడి చేశాడు. దాడిలో రాజా కుడి చేతికి తీవ్ర గాయమైంది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆయన బయటకు పరుగులు తీశాడు. చరణ్ అంతటి అగకుండా రాజా వెంటాపడ్డాడు. గమనించిన స్థానికులు చరణ్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు. తీవ్రంగా గాయపడిన రాజాను వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా...పైళ్లెనప్పటి నుంచి తనను హింసిస్తున్నాడంటూ భర్త చరణ్‌పై భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రారంభ దశలో గుర్తిస్తే కుష్టు చికిత్స సులభం
ప్రశాంతి నిలయం: కుష్టు వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే త్వరగా నయం చేయవచ్చు. అందుకే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కుష్టు వ్యాధి సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. సోమవారం రెవెన్యూ భవన్లో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 24 తేదీ వరకూ ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి ముందస్తు గుర్తింపు సర్వే చేపడతారన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు పాఠశాలలు, సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ పరీక్షలు చేయించాలని ఽఅధికారులను ఆదేశించారు. అనంతరం సర్వేకి సంబంధించిన అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ సువర్ణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఫైరోజా బేగం, జిలా కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్ ప్రణయ్, డీపీఎంఓ రెడ్డి కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
కృష్ణా జలాలు అందించాలి
వర్షాలు లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం మడకశిర ప్రాంతానికి పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అందించడానికి చర్యలు తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు ఉత్తుత్తి మాటలు మానుకుని రైతులను ఆదుకోవడానికి చొరవ చూపాలి. హంద్రీనీవా పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని చెరువులను కృష్ణా జలాలతో నింపాలి. లేకపోతే రైతులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. – వీరక్యాతరాయప్ప, వక్కరైతు, అమరాపురం -
సారూ... సమస్యలు తీర్చండి
ప్రశాంతి నిలయం: ‘‘సారూ..సమస్యలపై అర్జీలిచ్చి అలసిపోతున్నాం. అయినా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇకనైనా దయచూపండి..మా సమస్యలు పరిష్కరించండి’’ అంటూ జనం కలెక్టర్‌ను వేడుకున్నారు. సోమవారం ప్రశాంతి రైల్వేస్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై 264 అర్జీలు ఇవ్వగా...వాటిని ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్..అధికారులతో సమీక్షించారు. ‘పరిష్కార వేదిక’లో అందే అర్జీలను పరిష్కరించడంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పింఛన్ రూ.15 వేలు ఇప్పించండి.. తాను పుట్టుకతోనే దివ్యాంగుడనని, సదరం క్యాంపులో సైతం డాక్టర్లు 90 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించారని, మంచానికే పరిమితమైన తనకు రూ.15 వేల పింఛన్ ఇప్పించాలని పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకమ్మవారిపల్లికి చెందిన అమ్మినేని లీలావతి కలెక్టర్‌ను వేడుకుంటూ అర్జీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు తనకు రూ.6 వేల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని, అది తన జీవనానికి చాలడం లేదన్నారు. వేదిక వద్దకు రాలేక బయటే నిరీక్షిస్తున్న లీలావతిని గమనించిన కలెక్టర్ ఆమె వద్దకే వచ్చి సమస్యను తెలుసుకున్నారు. అర్జీ పరిశీలించి అర్హత మేరకు న్యాయం చేయాలని అక్కడే ఉన్న డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. రజకులను ఎస్పీ జాబితాలో చేర్చండి.. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చంద్రబాబు పలు మార్లు హామీ ఇచ్చారని, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో సైతం చేర్చారన్నారు. 2018లో అధ్యయన కమిటీ కూడా వేశారన్నారు. వెంటనే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నాయకులు కలెక్టర్‌ను కోరారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జనం గగ్గోలు -
హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్టు
బొమ్మనహాళ్: ప్రేమ వ్యవహారానికి సంబంధించి యువకుడిపై వేటకోడవళ్లతో దాడి చేసిన కేసులో నలుగురిని బొమ్మనహాళ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు వేటకొడవళ్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ నబీరసూల్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరుకు చెందిన చరణ్ అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించగా అప్పట్లో రాజీ చేసిన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇటీవల చరణ్ బొమ్మనహాళ్ మండలంలోని ఽశ్రీధరఘట్టలోని బంధువుల ఇంట్లో ఉంటూ ఇన్‌స్టా, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫొటోలను పోస్ట్ చేస్తున్నాడన్నారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఈనెల 29న వేటకోడవళ్లతో చరణ్‌పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. చరణ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం గోవిందవాడ క్రాస్ వద్ద మునీంద్ర, నారాయణస్వామి, వన్నూరుస్వామి, ప్రసాద్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు వేటకోడవళ్లు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను రాయదుర్గం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
హంద్రీ–నీవా.. అడిగేవారే లేరా?
మడకశిర: కరువుకు నిలయమైన మడకశిర నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్ జగన్ హయాంలో పనులు ప్రారంభమైనా...రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పనులకు మళ్లీ బ్రేక్ పడింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. హెచ్ఎన్ఎస్ఎస్ పథకం పూర్తికి చొరవ చూపకపోవడంపై రైతుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ హయాంలో రూపుదిద్దుకున్న హంద్రీ–నీవా 2004లో రెండో విడత ‘పల్లెబాట’ కార్యక్రమంలో భాగంగా సీఎం హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ ప్రాంతంలోని కరువు పరిస్థితులను కళ్లారా చూశారు. మడకశిరకు కృష్ణా జలాలను అందించి కరువు రైతులను ఆదుకుంటామని ప్రకటించారు. వెంటనే హంద్రీనీవా సాగునీటి పథకం పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ పథకం గురించి పట్టించుకోలేదు. మళ్లీ 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం పనుల్లో కదలిక వచ్చింది. వరుసగా మూడేళ్లు మడకశిర మండలానికి కృష్ణా జలాలు అందించారు. మడకశిర చెరువును రెండుసార్లు మరువ పారించారు. దీంతో నియోజకవర్గంలోని మిగతా మండలాల రైతుల్లోనూ ఆశలు చిగురించాయి. కానీ 2024లో చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టడంతో హెచ్ఎన్ఎస్ఎస్ పథకం మూలన పడిపోయింది. మూడు మండలాల్లో పనులు పెండింగ్.. మడకశిర, అమరాపురం మండలాల్లో హెచ్ఎన్ఎస్ఎస్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. గుడిబండ మండలంలో కూడా కొంతమేర పెండింగ్‌లో ఉన్నాయి. ఇక అగళి, రొళ్ల మండలాల్లో కాల్వలు తప్ప పనులే ప్రారంభం కాలేదు. ప్రస్తుతం హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మడకశిర మండలంలోని నాలుగైదు చెరువులకు మాత్రమే కృష్ణా జలాలు అందుతున్నాయి. దీంతో మిగతా మండలాల రైతులు కృష్ణమ్మ తమ దరికి ఎప్పుడు చేరేనోనని ఎదురుచూస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో రూ.70 కోట్లతో ప్రణాళిక.. వైఎస్ జగన్ హయాంలో నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ పథకం పనులను పూర్తి చేయడానికి ఓ ప్రణాళిక రూపొందించారు. రూ.70 కోట్లతో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకూ కృష్ణా జలాలు అందించాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభించారు. అయితే అంతలోనే ఎన్నికలు రావడం, చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ ప్రణాళిక అమలు ఆగిపోయింది. బైపాస్ కెనాల్ రూపకర్త వైఎస్ జగన్.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే మడకశిర బైపాస్ కెనాల్ రూపుదిద్దుకుంది. గొల్లపల్లి రిజర్వార్ నుంచి కృష్ణా జలాలను నేరుగా మడకశిర నియోజకవర్గానికి తరలించాలనే ఉద్దేశంతో బైపాస్ కెనాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు రూ.214.85 కోట్లు మంజూరు చేయడంతో పాటు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో ఈ కెనాల్ నిర్మాణం ఆగిపోయింది. పట్టించుకోని చంద్రబాబు సర్కార్.. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచింది. అయినా హంద్రీనీవా సాగునీటి పథకానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు పెండింగ్ పనులను పూర్తి చేయకుండా, ఇటు బైపాస్ కెనాలు పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం చూపుతోందని రైతులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. హడావుడికే పరిమితం.. హంద్రీనీవా సాగునీటి పథకంపై స్థానిక ప్రజా ప్రతినిధులు హడావుడికే పరిమితమవుతున్నారు. ఇంతవరకు ఈపథకం పనులపై ఎలాంటి పురోగతి సాధించలేక పోయారు. ముఖ్యమంత్రి, జలవనరులశాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం...దాన్ని ప్రచారం చేసుకోవడానికే పరిమితమయ్యారు. అంతేకాకుండా అమరాపురం మండలానికి కృష్ణా జలాలు పారిస్తామని, ముఖ్యమంత్రి వచ్చి జలహారతి ఇస్తారని ప్రచారం చేశారు. రైతులందరూ ఎంతో సంతోషపడ్డారు. అయితే రోజులు గడిచాయేగానీ... ఇంతవరకు అమరాపురం మండలంలో కృష్ణా జలాలు పారలేదు. ఇప్పటికై నా స్థానిక ప్రజాప్రతినిధి ప్రచారం మానుకుని, హెచ్ఎన్ఎస్ఎస్ పనులపై చిత్తశుద్ధి చూపాలని రైతులు కోరుతున్నారు.ఇది అగళి మండలంలోని హంద్రీ–నీవా కాలువ దుస్థితి. వైఎస్సార్ హయాంలో తవ్విన కాలువలో కృష్ణా జలాలు నేటికీ పారలేదు. 2004లో పల్లెబాటలో భాగంగా మడకశిర ప్రాంతంలో పర్యటించిన వైఎస్ రాజశేఖరరెడ్డి నియోజకవర్గానికి సాగునీటి ఇబ్బందులు లేకుండా హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించి పనులు ప్రారంభించారు. అయితే ఆయన మరణానంతరం ఆ పనులు అటకెక్కాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మళ్లీ పనులు ప్రారంభమైనా...తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కనీసం కాల్వల వైపు కన్నెత్తి చూడటం లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ పథకంపై చంద్రబాబు సర్కార్ శీతకన్ను పెండింగ్ పనుల పూర్తికి చొరవ చూపని వైనం వైఎస్ జగన్ హయాంలో రూ.70 కోట్లతో ప్రణాళిక బైపాస్ కెనాల్ నిర్మాణానికి రూ.214.85 కోట్లు మంజూరు తాజాగా మడకశిర బైపాస్ కెనాల్ కూడా ప్రశ్నార్థకం హడావుడికే పరిమితమైన ప్రజా ప్రతినిధులు రైతులకు తప్పని సాగునీటి కష్టాలు -
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం చేయాలి
పుట్టపర్తి టౌన్: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటాలు కొనసాగిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎర్ఎస్ రత్నాకర్ తెలిపారు. సోమవారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై కుట్ర చేస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా అమలు చేశారన్నారు. దేశంలో ఎస్సీ లిస్టులో ఉన్న 1108 కులాలకు సమ న్యాయం, సామాజిక న్యాయం ఎలా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇదంతా దళితుల ఐక్యతపై కట్ర అని విమర్శించారు ఈ విధంగా మాల కులాలపై కుట్ర చేస్తుంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం శోచనీయమన్నారు. దీనివల్ల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మాల జాతి ప్రజలు ఉనికి కోల్పోతారన్నారు. ఇప్పటికై ప్రతి ఒక్కరూ కళ్లు తెరిచి బయటకు వచ్చి ఎస్పీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసేంతవరకు శాంతియుతంగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నరేష్, దుర్గాప్రసాద్, వెంకటరమణ, కేశవ్ ప్రసాద్, గోవిందప్ప, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయం భేష్
బత్తలపల్లి: జిల్లా రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని జాంబియా దేశం నుంచి 8 మందితో కూడిన సభ్యుల ప్రతినిధి బృందం కితాబునిచ్చింది. సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తృతస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన ప్రకృతి ఆధారిత విధానాలు, సంస్థాగత ఏర్పాట్లు, శాసీ్త్రయ ఆధారాలు, విస్తరణ వ్యవస్థలు, ఆర్థిక సహాయ విధానాలు, భాగస్వామ్యాలపై అవగాహన పొందడం కోసం జాంబియా దేశం నుంచి 8 మందితో కూడిన సభ్యుల ప్రతినిధి బృందం జిల్లాలో పర్యటించింది. సోమవారం మండలంలోని గంటాపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను వారు సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులు ఆచరిస్తున్న వినూత్న విధానాలు, స్థితిస్థాపక వ్యవసాయ నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జాంబియా దేశ ప్రతినిధుల బృందం మాట్లాడుతూ.. ఇక్కడ అమలు చేస్తున్న సుస్థిర వ్యవసాయ పద్ధతులు, సంస్థాగత ఏర్పాట్లు, శాసీ్త్రయ ఆధారాలు, ఆర్థిక సహాయ విధానాలను అధ్యయనం చేసి తమ దేశంలోనూ అమలు చేస్తామన్నారు. అంతకుముందు ప్రకృతి వ్యవసాయంలోని తొమ్మిది సార్వత్రిక సూత్రాలకు సంబంధించిన ప్రదర్శనలను ప్రతినిధి బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారీ విధానాలను కూడా బృందం పరిశీలించింది. రైతు సాధికార సంస్థ చీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మానాయక్ ప్రకృతి వ్యవసాయంలో జీవ ఉత్ప్రేరకాల ప్రాముఖ్యత, వాటి పాత్ర, నేల ఆరోగ్యం, పంటల పెరుగుదలను మెరుగుపరచడంలో వాటి వినియోగం గురించి వివరించారు. గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల సందర్శనతో పాటు మహిళా సంఘాలతో పరస్పర చర్చలు జరిపారు. మహిళల పాత్ర గురించి తెలుసుకున్నారు. ఏపీఎంఏఎస్ ప్రతినిధులు కలైమని, రమాదేవి సహకారం అందించారు. రైతు సాధికార సంస్థ అధికారులు సీనియర్ థిమాటిక్ సుధాకర్, టిఎల్స్ సురేష్, స్వాతి, ఎపీసీఎన్ఎఫ్ జిల్లా స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం పరిశీలన మడకశిర రూరల్: జిల్లా రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రాం (ఏకేఆర్ఎస్పీ) చెందిన గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల ప్రతినిధుల బృందం పరిశీలించింది. సోమవారం బృందం సభ్యులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు సాగు చేసిన వివిధ పంటలు, ఆర్‌వైఎస్‌ఎస్ ద్వారా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్)ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆమిదాలగొందిలో గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్యం, పోషకాహారం, కుటుంబ ఆహార భద్రతకు సంబంధించిన నమూనాలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో వారి అనుభవాలు, స్థానిక వనరుల వినియోగం, జీవ వైవిధ్యం, పీఎండీఎస్ తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గుడిబండ మండలం బూదిపల్లి, జవనడుకు గ్రామాల్లోనూ ఏకేఆర్ఎస్పీ ప్రతినిధులు పర్యటించారు. పీఎండీఎస్ విత్తనాలు విత్తే విధానాన్ని, ఏ గ్రేడ్, ఏటీఎం, పీఎండీఎస్ నమూనాలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అమలు గురించి బృందం ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో అవగాహన పెంపొందించుకున్నారు. మూడు రోజుల పాటు బృందం సభ్యులు పంటలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానం రైతులకు ఎంతో లాభదాయకంగా ఉందని ప్రతినిధులకు మాస్టర్ ట్రైనర్ వివరించారు. వారి వెంట జాతీయ వనరుల సంస్థ అధిపతి కృష్ణారావు, టెక్నికల్ ఏఓలు హుమాయున్, సంతోష్, ఎన్ఆర్ఓ, ఏపీసీఎన్ఎఫ్ బృందం సభ్యులు సయ్యద్ దాదాపీర్, నవీన్, మాస్టర్ ట్రైనర్ రమేష్, శివాజీ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కితాబునిచ్చిన జాంబియా ప్రతినిధి బృందం -
●ఎండిన ఆశలు
ఏలుకుంట్ల గ్రామంలో ఎండిన వేరుశనగ పంటను తొలగించుకుంటున్న రైతుతీవ్ర వర్షాభావంతో బోరు ఒట్టిపోయింది. కళ్ల ముందే పంట ఎండిపోతోంది...ఏం చేయాలో తెలియని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు బొగ్గు సూరప్ప కనీసం పశుగ్రాసమైనా దక్కుతుందని పంటను ఇలా తొలగించాడు. ఎకరం పొలంలో రూ.60 వేల దాకా పెట్టుబడులు పెట్టి వేరుశనగ పంటను సాగు చేశానని, ఇప్పటికే బోరుకు, మోటర్‌కు, పైపులైన్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశానన్నారు. పంట చేతికందితే అప్పులన్నీ తీర్చేద్దామనుకుంటే అప్పుమొత్తం మరింత పెరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. – ధర్మవరం రూరల్: -
డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం
ప్రశాంతి నిలయం: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ (అమరావతి) నాయకులు తేల్చిచెప్పారు. సోమవారం ప్రశాంతి రైల్వేస్టేషన్ వద్ద ఉన్న రెవెన్యూ భవన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు ఉద్యమ కార్యాచరణను వివరిస్తూ సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగులు సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. వెంటనే 12వ పీఆర్సీ అమలు చేయాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమ్మె నోటీసులో భాగంగా జేఏసీ తెలిపిన 29 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ మైనుద్దీన్, రెవెన్యూ అసోసియేషన్ పుట్టపర్తి డివిజన్ ట్రెజరర్ గణేష్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు విజయభారతి, మున్సిపల్ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు, కార్యదర్శి శంకర్, కోఆపరేటివ్ శాఖ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటనారాయణ, వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, ఉపాధ్యక్షులు చక్రపాణి, సనత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తేల్చిచెప్పిన ఏపీ జేఏసీ (అమరావతి) నాయకులు కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందజేత -
భూపరిహారం కోసం ఆత్మహత్యాయత్నం
ప్రశాంతినిలయం: భూపరిహారం చెల్లించకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందుతూ పుట్టపర్తి మండలం గోనేనాయక్ తండాకు చెందిన రాజ్‌కుమార్ నాయక్ అనే రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఈ ఘటన సోమవారం పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు...రాజ్‌కుమార్ నాయక్ కుటుంబానికి పుట్టపర్తి మండల పరిధిలోని కప్పలబండ రెవెన్యూ గ్రామ సర్వే నంబరు 165–3హెచ్లో 1.15 ఎకరాల పొలం ఉంది. పూర్వీకుల నుంచి వారసత్వంగా సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని ఇటీవల జాతీయ రహదారి 342 నిర్మాణానికి తీసుకున్నారు. బాధితులకు పరిహారం మాత్రం ఇవ్వలేదు. అధికారులకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో సోమవారం తల్లి బబ్లీ బాయితో కలిసి పీజీఆర్ఎస్కు వచ్చిన రాజ్‌కుమార్ నాయక్ సంచిలో తీసుకువచ్చిన క్రిమి సంహారక మందును తాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే గమనించిన పోలీసులు అతని వద్ద నుంచి క్రిమి సంహారక మందు డబ్బాను లాగేసుకున్నారు. అతన్ని అక్కడే ఉన్న పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా లేకపోవడం, ఆన్‌లైన్‌లోనూ వివరాలు లేకపోవడంతో నిబంధనల మేరకు పరిహారం చెల్లించేందుకు వీలు కాలేదని ఆర్డీఓ తెలిపారు. మరోమారు పరిశీలిస్తామని చెప్పారు. పూర్వీకుల నుంచి సాగులో ఉన్నందున ఎలాగైనా న్యాయం చేయాలని రాజ్‌కుమార్ నాయక్, తల్లి బబ్లీ బాయి, బంధువు పెద్ద ఓబులేషు నాయక్‌లు వేడుకున్నారు. పీజీఆర్ఎస్లో ఘటన -
ద్విచక్ర వాహనం ఢీ – బాలుడికి గాయాలు
ఎన్పీకుంట: ద్విచక్ర వాహనం ఢీకొని ఎన్.జనార్ధన అనే బాలుడి తలకు తీవ్ర గాయమైంది. స్థానికుల వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన ఎన్.రామాంజులు కుమారుడు జనార్ధన సోమవారం సాయంత్రం బస్టాండ్ దగ్గరున్న మూడు రోడ్ల కూడలిలో రోడ్డు దాటుతుండగా ఓ ద్విచక్ర వాహనం వేగంతో వచ్చి బాలుడికి ఢీ కొంది. ఘటనలో జనార్ధనకు తీవ్ర గాయాలు కాగా కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నేడు మహిళా క్రికెట్ జట్ల ఎంపిక అనంతపురం: ఆర్డీటీ క్రికెట్ టాలెంట్ హంట్‌లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్–15, అండర్–18 విభాగాల్లో మహిళా కికెట్ జట్లను ఎంపిక చేయనున్నారు. కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బాలికలతో పాటు స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న మహిళా క్రికెటర్లు ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చన్నారు. ఈ మేరకు ఆర్డీటీ క్రీడా విభాగం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గుండెపోటుతో టెకీ మృతి పుట్టపర్తి అర్బన్: గుండెపోటుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందడంతో పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లికిలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల వివరాలమేరకు... వెంకటగారిపల్లికి చెందిన కుళ్లాయిరెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి (40) హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో గుండెపోటు ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే రాజశేఖర్‌రెడ్డి మృతి చెందినట్లు డాక్టర్ చెప్పడంతో భార్య నవశ్రీ కన్నీరు మున్నీరైంది. విషయం కుటుంబ సభ్యులకు , గ్రామస్తులకు తెలయడంతో వెంకటగారిపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనంతరం గణేష్ మృత దేహానికి వెంకటగారిపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గణేష్ పండక్కి వస్తానని చెప్పి వెళ్లాడని, చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా నాయనా అంటూ బంధువులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. ఆటో – ద్విచక్ర వాహనం ఢీ ● ఇద్దరికి తీవ్ర గాయాలు ముదిగుబ్బ: మండల పరిధిలోని సంకేపల్లి క్రాస్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఆటో – ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గుంజేపల్లికి చెందిన శ్రీధర్, బి.కొట్టాల గ్రామానికి చెందిన రాములు తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది మల్లేసు, నారాయణస్వామి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు బీఎల్ఓ, జనగణన పనులొద్దు అనంతపురం క్రైం: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందాల్సిన సేవలకు ఆటంకం కలగకుండా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సిబ్బందిని ఇతర ప్రభుత్వ విధులకు దూరంగా ఉంచాలని జిల్లా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు అధికారి జి.నాసరరెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులను బీఎల్ఓ విధులు, జనగణన, ఇతర సర్వే సంబంధిత పనులకు వినియోగించకూడదని స్పష్టం చేశారు. 50 తులాల బంగారు నగల చోరీ రాయదుర్గంటౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళను మాటలతో ఏమార్చి బ్యాగులోని 50 తులాల బంగారు నగలను అపహరించారు. ఈమేరకు డీ.హీరేహాళ్ మండలం మడేనహళ్లికి చెందిన పుష్పలత రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం పుష్పలత కణేకల్లులోని తన పుట్టింటికి వెళ్లి తిరిగి రాయదుర్గానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. కణేకల్లు క్రాస్‌లో ఓ మహిళ బస్సు ఎక్కి పుష్పలత పక్కన కూర్చుంది. స్నేహంగా మాటలు కలిపి పిల్లవాడికి పాలు తాగించేందుకు అంటూ కింద కూర్చొని బ్యాగులో ఉంచిన 50 తులాల బంగారు నగలను దొంగిలించింది. రాయదుర్గం పట్టణానికి చేరుకోగా మొదటి స్టాప్‌లో సదరు మహిళ దిగిపోయింది. బస్సు బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత బ్యాగ్ జిప్ తీసి ఉండటంతో దొంగతనం విషయం బయట పడింది. దీంతో పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
24 గంటల్లో డిగ్రీ ఇన్స్టంట్ ఫలితాలు విడుదల
అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలో ఆగస్టు 30న డిగ్రీ ఐదవ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించారు. జవాబు పత్రాలను వేగవంతంగా మూల్యాంకనం చేసి 24 గంటల్లోనే ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా, వారి భవిష్యత్తు విద్యా అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత వేగంగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు వీసీ ప్రొఫెసర్ జ్యోతికుమార్ తెలిపారు. పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ లక్ష్మయ్య సమర్థవంతంగా పర్యవేక్షించారని ప్రశంసించారు. ఇన్స్టంట్ పరీక్షలకు మొత్తం 231 మంది విద్యార్థులు హాజరు కాగా, 228 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇన్చార్జ్ డీసీహెచ్ఎస్గా డాక్టర్ శ్రీకాంతి హిందూపురం టౌన్: మడకశిరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీకాంతి ఇన్చార్జ్ డీసీహెచ్ఎస్గా నియమితులయ్యారు. ఇప్పటివరకూ డీసీహెచ్ఎస్గా పనిచేసిన డాక్టర్ మధుసూదన్ పదవీ విరమణ పొందడంతో ఉన్నతాధికారులు ఆయన స్థానంలో శ్రీకాంతి నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆమె... కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్నం పోలీస్ స్టేషన్ తనిఖీ ముదిగుబ్బ: మండల పరిధిలోని పట్నం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సతీష్‌కుమార్ సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీత, పట్నం ఎస్ఐ మహమ్మద్ అర్షద్‌ను అడిగి స్టేషన్ పరిధిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. అలాగే పోలీస్ సిబ్బంది యోగక్షేమాలను కూడా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. నేడు ఐఏబీ సమావేశం ● హడావుడిగా ఖరారు చేసిన అధికారులు అనంతపురం సెంట్రల్: సాగునీటి సలహామండలి (ఐఏబీ) సమావేశం మంగళవారం అనంతపురంలో నిర్వహించనున్నారు. హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాతో పాటు ఆలూరు బ్రాంచ్ కెనాల్ కింద కర్నూలు జిల్లా రైతులు, పులివెందుల, మైలవరం బ్రాంచ్కెనాల్స్ కింద వైఎస్సార్ కడప జిల్లాల రైతులు ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు కూడా హాజరుకావాల్సి ఉంది. గతంలో వారం రోజుల క్రితమే ఐఏబీ సమావేశం తేదీ ఖరారు చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ రాత్రికి రాత్రి సమావేశాల తేదీలను ఖరారు చేసేస్తున్నారు. ఇటు హెచ్చెల్సీ.. అటు హంద్రీ–నీవా ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటి వినియోగంపై రైతులకు ఉపయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఐఏబీ సమావేశం అత్యంత కీలకం. అలాంటి సమావేశాన్ని అధికారులు హడావుడిగా నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా హెచ్చెల్సీ ద్వారా దాదాపు 20 టీఎంసీలకు పైగా నీరు వచ్చే అవకాశముంది. అయితే గత బోర్డు సమావేశంలో అప్పటి అంచనాల మేరకు 16 టీఎంసీలు కేటాయించారు. దీంతో సాగుకు నీటిని విడుదల చేయడానికి ఆస్కారం లేదంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం దాదాపు 100 టీఎంసీల సామర్థ్యంతో తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీకి కేటాయింపులు పెరగనున్నాయి. అయినప్పటికీ సాగునీటికి నీటిని విడదుల చేయకూడదనే భావనతో పాటు తుంగభద్ర హై లెవల్ మెయిన్ కెనాల్ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు రైతులకు మాత్రమే మేలు చేకూర్చేందుకు.. దిగువన ఉన్న ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయలేమని చెప్పే విధంగా ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రణాళికలు రచిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేటి సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ముగిసిన అహుడా కథ
అనంతపురం క్రైం: ఉమ్మడి అనంతపురం జిల్లా విభజనకు అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. ఇప్పటి వరకూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిని కలుపుతూ ఉన్న అనంతపురం – హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ (అహుడా) ఇకపై ఉండదు. దాని స్థానంలో రెండు జిల్లాలకు రెండు ప్రత్యేక పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఈ నెల 17న రెండు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురానికి ఏటీపీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ), అహుడా పరిధిలోని శ్రీసత్యసాయి జిల్లా ప్రాంతాలను తొలగిస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 197 జారీ చేసింది. దీంతో అనంతపురం జిల్లా ప్రాంతంతో అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థ (ఏటీపీ యూడీఏ) ఏర్పడింది. ఈ పరిధిలో అనంతపురం నగరపాలక సంస్థతో పాటు రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అదే విధంగా 31 పూర్తి మండలాలు, 507 రెవెన్యూ గ్రామాలు ఏటీపీ యూడీఏ పరిధిలోకి వచ్చాయి. మొత్తం విస్తీర్ణం సుమారు 10,205 చదరపు కిలోమీటర్లుగా ఉంది. శ్రీసత్యసాయికి ‘పుడా’ శ్రీసత్యసాయి జిల్లా ప్రాంతాలను ఒకే పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 190 జారీ చేసింది. పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పీయూడీఏ) పరిధిలో శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండలాలు, గ్రామాలను చేర్చారు. కొత్త పుడా పరిధిలో 31 మండలాలు, 461 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం సుమారు 8,925 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి తదితర ప్రాంతాలు ఇకపై పుడా పరిధిలో పట్టణాభివృద్ధి ప్రణాళికలకు లోబడి ఉంటాయి. అహుడాకు తెర జిల్లాల విభజన జరిగినప్పటికీ ఇప్పటివరకూ కొనసాగుతున్న అహుడా వ్యవస్థను ప్రభుత్వం తాజాగా పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. దీంతో అహుడా పేరు చరిత్రలో కలిసిపోయి.. అనంతపురం జిల్లాకు ఏటీపీ యూడీఏ, శ్రీసత్యసాయి జిల్లాకు పుడా అధికారికంగా రూపుదిద్దుకున్నాయి. ఇకపై ఆయా ప్రాంతాల్లో మాస్టర్ప్లాన్లు, భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు, అభివృద్ధి ప్రణాళికలు, పట్టణ విస్తరణ వంటి అంశాలను ఆయా యూడీఏలు పర్యవేక్షించనున్నాయి. చైర్మన్ల నియామకం ఎప్పుడో? కొత్తగా రెండు యూడీఏల పరిధులు ఖరారైనప్పటికీ వాటి చైర్మన్ల నియామకం మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో కొత్త యూడీఏలకు చైర్మన్లుగా ఎవరిని నియమిస్తారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం తదుపరి దశలో చైర్మన్ల నియామకంతో పాటు ఇతర పాలక వ్యవస్థను పూర్తి చేయాల్సి ఉంది. కొత్తగా అనంతకు ఏటీపీ యూడీఏ, శ్రీసత్యసాయికి పుడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ల నియామకమే తరువాయి -
ప్రతి ఫిర్యాదును గడువులోపు పరిష్కరించండి
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ప్రజా సమస్యల పరిష్కారి వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ అర్జీలను స్వీకరించారు. 70 వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు ఓపిగ్గా విని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ చేసి మాట్లాడారు. సమస్య తీవ్రతను తెలుసుకొని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపుతామన్నారు. అర్జీలు పునారావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, సీఐ బొజ్జప్ప, లక్ష్మీకాంత్‌రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ -
రెవెన్యూ భవన్లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న రెవెన్యూ భవన్లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే డివిజన్, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రెవెన్యూభవన్కు రాకుండా కూడా మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పోలీస్ కార్యాలయంలోనూ.. పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. అర్జీదారులు కచ్చితంగా తమ ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు. నీట్–పీజీ పరీక్షా కేంద్రం పరిశీలనపుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని సంస్కృతీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఆదివారం జరిగిన నీట్–పీజీ కంప్యూటర్ ఆధారిత పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో వంద మంది అభ్యర్థులకుగాను 96 మంది హాజరైనట్లు అధికారులకు కలెక్టర్‌కు తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ జరిగింది. ఆయన వెంట సీఐ యువరాజ్, తహసీల్దార్ సంహిత తదితరులు పాల్గొన్నారు. ఖాద్రీశుడి సేవలో దేవదాయశాఖ కమిషనర్ కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దేవదాయశాఖ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు రాగానే అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం కమిషనర్‌ను శాలువాతో పాటు పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అంజన్కుమార్స్వామి, శీనా స్వామి , ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రసాయనాల నమూనాల సేకరణ చిలమత్తూరు: హిందూపురం రూరల్ మండల పరిధిలోని తూముకుంట, గొల్లాపురం పారిశ్రామికవాడలో ఫార్మా కంపెనీలు బహిరంగ ప్రదేశాల్లో రసాయనాలు వదులుతూ పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్న విషయంపై ‘‘ఫార్మా.. ప్రజలకు ఇదేమి ఖర్మ’’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పీకే స్టీల్ పరిశ్రమ రెండో గేటు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి కింద ఉన్న రసాయన నమూనాలను సేకరించారు. ఈ మేరకు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే యథావిధిగా ప్రతిసారి శ్యాంపిల్స్ సేకరించడం, వాటి నివేదికలను బయటకు చెప్పకపోవడం పీసీబీ అధికారులకు అలవాటైపోయిందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. -
గెస్ట్ ఫ్యాకల్టీపై నిర్లక్ష్యం
అనంతపురం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఆరు నెలలుగా వీరికి జీతాలు అందలేదు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో దాదాపు 1100 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 107 మంది ఉన్నారు. వీరికి జీతం నెలకు రూ.28 వేలు. అయితే మార్చి నుంచి వేతనం ఆగిపోయింది. ప్రభుత్వం వేతనాల చెల్లింపు కోసం బడ్జెట్ విడుదల చేయాలని, తక్షణమే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెన్యూవల్ చేయాలని గెస్ట్ లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. శ్రమ దోపిడీ.. గెస్ట్ ఫ్యాకల్టీకి ఉద్యోగ భద్రత కల్పించక, సకాలంలో రెన్యూవల్ ప్రొసీడింగులు, వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు శాంక్షన్డ్– నాన్ శాంక్షన్డ్ పోస్టుల పేరుతో వారి శ్రమను ప్రభుత్వం దోచుకుంటోంది. నెలకు 70 గంటల పాటు పనిచేయాల్సి ఉన్నప్పటికీ, రెట్టింపు చేయించుకుంటున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. శాంక్షన్డ్ పోస్టుల్లో చేరిన వారికి నెలకు రూ.28 వేల వేతనం ఇస్తుంటే.. నెలలో 70 గంటలకు తగ్గకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నాన్ శాంక్షన్డ్ పోస్టులతో సమానంగా తాము పనులు చేస్తున్నా వేతనాల్లో మాత్రం భారీగా తేడా ఉంటోందని గెస్ట్ లెక్చరర్లు వాపోతున్నారు. ఆరు నెలలుగా అందని జీతాలు డిగ్రీ కళాశాలల అధ్యాపకులపై చిన్నచూపు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న వైనం -
కదిరి నియోజకవర్గంలో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. మద్యం బాటిల్‌పై రూ.30 నుంచి రూ.40 దాకా బాదుతూ మందు బాబుల జేబులకు చిల్లు వేస్తోంది. గల్లీకో మద్యం బెల్ట్ షాపు పెట్టి అందినకాడికి దోచేస్తున్నారు. దీనికి తోడు కర్ణాటక లిక్కర్ అన్ని చోట్లా సులువుగా దొరుకుతోంది
కదిరి టౌన్: నియోజకవర్గంలో టీడీపీ మద్యం మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. కదిరి మున్సిపాలిటీలో 7, కదిరి రూరల్ 2, తలుపుల 2, గాండ్లపెంట 1, ఎన్పీ కుంట 2, తనకల్లు 2, నల్లచెరువులో ఒక మద్యం షాపు అధికారికంగా ఉన్నాయి. అయితే బెల్ట్ షాపులు మాత్రం వీధికొకటి పుట్టుకొచ్చాయి. కీలక నేత జేబులోకే... నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నియోజకవర్గస్థాయి కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే మద్యం వ్యాపారం మొత్తం సాగుతోందన్న విమర్శలున్నాయి. ప్రతి నెలా రూ.10 కోట్లకు పైగానే నియోజకవర్గంలో అధికారికంగా వ్యాపారం జరుగుతోంది. అనధికారికంగా మాత్రం దీనికి రెట్టింపు ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి మద్యం షాపుతో పాటు బెల్ట్ షాపుల నుంచి కూడా కీలక నేతకు ముడుపులు వెళ్తున్నాయని అంటున్నారు. చెప్పినంత ఇవ్వాల్సిందే... పట్టణంతో పాటు గ్రామాల్లో ఎవరైనా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు చెల్లిస్తేచాలు మద్యం బెల్ట్ షాపు పెట్టుకునేందుకు టీడీపీ నేతలు ఓకే చెబుతున్నారు. లేకపోతే బెల్ట్ షాపులు పెట్టొద్దని హుకుం జారీ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక.. మద్యం షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ 40 వరకూ అదనంగా వసూలు చేస్తూ మందు బాబులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అధిక ధరలతో పాటు కల్తీ మద్యాన్ని అంట గడుతూ లిక్కర్ ప్రియుల ఒళ్లు గుళ్ల చేస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులకు పట్టదా? నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు నడుస్తున్నా పట్టించుకొనేవారే లేరా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఎకై ్సజ్ అధికారులు ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తున్నారు. అన్నీ తెలిసినా నియోజకవర్గస్థాయి కీలక నేత సూచనలతోనే మౌనంగా ఉంటున్నారంటున్నారు. ఏం చేయలేక కొందరు ఎకై ్సజ్‌శాఖ సిబ్బంది కూడా తమకు రావాల్సిన వాటాను సైలెంట్‌గా తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కర్ణాటక మద్యంతో ఫుల్లు కిక్కు జిల్లా ఉన్నతాధికారులు కర్ణాటక మద్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నామని కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కర్ణాటక మద్యం ఏరులై పారుతుండటమే దీనికి చక్కటి ఉదాహరణ. ముఖ్యంగా బెల్ట్ షాపుల్లో గుట్టుచప్పుడు కాకుండా కర్ణాటక మద్యాన్ని జోరుగా విక్రయిస్తున్నారు. ఎక్కువ లాభాలు వస్తుండటంతోనే కర్ణాటక మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయంటున్నారు. మందుబాబులకు కూడా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ కిక్ వస్తుండటంతో కర్ణాటక మద్యానికి భారీ డిమాండ్ ఏర్పడుతోంది. కదిరి నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు మద్యం బాటిల్‌పై రూ.30 నుంచి రూ.40 వసూలు గల్లీకో బెల్ట్ షాపు .. జోరుగా కర్ణాటక లిక్కర్ విక్రయాలు చక్రం తిప్పతున్న కీలక ప్రజాప్రతినిధి ఉదయం 6 గంటలకే ఓపెన్ -
17 ఏళ్లుగా ఇన్చార్జ్ ప్రిన్సిపాళ్లే దిక్కు !
మడకశిర: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలకు 17 ఏళ్లుగా ఇన్చార్జ్ ప్రిన్సిపాళ్లే దిక్కుగా మారారు. నేటికీ ప్రభుత్వం ప్రిన్సిపాల్ పోస్టులను మంజూరు చేయలేదు. రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేకపోవడంతో ఆ కళాశాలల నిర్వహణ అంతంతగానే మారింది. 2008లో ఏర్పాటు.. అనంతపురం, మడకశిరలో రెండు ఒకేషనల్ జూనియర్ కాలేజీలున్నాయి. 2008లో ఇవి ఏర్పాటయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఆ కళాశాలలకు ప్రిన్సిపాల్ పోస్టులు మంజూరు కాలేదు. దాదాపు 17 ఏళ్ల నుంచి ఇన్చార్జ్ ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. దీంతో కళాశాలల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలున్నాయి. ప్రిన్సిపాల్ పోస్టులను మంజూరు చేయాలని అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు కోరుతున్నా... పాలకులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. కోర్సులకు పెరుగుతున్న ఆదరణ.. జిల్లాలో ఒకేషనల్ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. ప్రధానంగా ఒకేషనల్ కోర్సులను పూర్తి చేసుకుని చాలా మంది విద్యార్థులు స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఒకేషనల్ కళాశాలల్లో ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, డీటీ, సెరికల్చర్, సీటీ, ఈటీ, ఈఈటీ, ఎఫ్‌జీఎం, ఎంఅండ్ ఏటీ, బీఅండ్ ఆర్ఎం, సీఎస్ తదితర కోర్సులను నిర్వహిస్తున్నారు. రెండేళ్లలో ఈకోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. దీంతో ఈకోర్సులకు డిమాండ్ నెలకొంది. మడకశిర ఒకేషనల్ కళాశాలలో 11 కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మడకశిర కళాశాలలోనే దాదాపు 550 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చేస్తున్నారు. 25 ఒకేషనల్ కళాశాలలు మంజూరు.. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఉన్నప్పుడు 25 ఒకేషనల్ కళాశాలలను మంజూరు చేశారు. ప్రస్తుతం ఏపీలో 12 ఒకేషనల్ కళాశాలలు ఉన్నాయి. మడకశిర, అనంతపురంలోని కళాశాలలు కూడా వైఎస్సార్ హయాంలో మంజూరైనవే. స్వయం ఉపాధి కల్పించడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చి కళాశాలలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈకళాశాలల్లో రెండేళ్ల కోర్సులను పూర్తి చేసుకున్న అనేక మంది విద్యార్థులు స్వయం ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈకళాశాలల నిర్వహణను గాలికొదిలేసింది. ప్రిన్సిపాల్ పోస్టులను మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోంది. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ కూడా ప్రిన్సిపాల్ పోస్టుల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తుండటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం ఒకేషనల్ కళాశాలలకు ప్రిన్సిపాల్ పోస్టులను మంజూరు చేసి విద్యాభివృద్ధికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కళాశాలల్లో విద్యాప్రమాణాలు తగ్గి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. నేటికీ ఒకేషనల్ కళాశాలలకు మంజూరు కాని ప్రిన్సిపాల్ పోస్టులు 2008లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు రెండు కళాశాలలు మంజూరు ప్రిన్సిపాల్ పోస్టుల మంజూరును పట్టించుకోని ప్రభుత్వం -
ఆటోను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు
హిందూపురం టౌన్: ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన హిందూపురం పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్ఐ ప్రసన్న వివరాల మేరకు... పట్టణంలోని ఇందిరానగర్ సమీపంలో హిందూపురం–బెంగళూరు మార్గంలో ఓ రోడ్డు బ్లాక్ చేశారు. దీంతో ఒకే రోడ్డులోనే వాహనాలు రాకపోకలు సాగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం కర్ణాటక ఆర్టీసీ బస్సు మరో రోడ్డులో ఎదురుదిశలో వేగంగా ప్రయాణించగా, అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన సురేష్ (29) తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. క్షతగ్రాతుడిని ఆటోలో నుంచి బయటకు లాగడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అతడిని హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతుడి భార్య ప్రస్తుతం గర్భిణి. సురేష్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. యువకుడి మృతి -
హంద్రీ–నీవా కాలువలోకి దూకిన దంపతులు
● భార్య మృతి.. భర్త గల్లంతు గుంతకల్లుటౌన్: జీవితంపై విరక్తితో వృద్ధ దంపతులు హంద్రీ–నీవా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో భార్య మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన భర్త కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు... కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెలడోణ గ్రామానికి చెందిన సోమలింగమ్మ (60), సీతానంద(64) దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు కుమారుడు నారాయణ వద్ద ఉంటున్నారు. వీరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుంతకల్లులో ఆస్పత్రికి వెళ్తున్నామని ఇంటి నుంచి వచ్చిన వీరు బస్సులో కసాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి హంద్రీ–నీవా కాలువ వద్దకు వెళ్లి నీటిలో దూకారు. నీటిలో తేలియాడుతున్న సోమలింగమ్మను స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. నీటిలో గల్లంతైన సీతానంద కోసం గాలింపు చేపట్టారు. దంపతులు అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కసాపురం ఎస్ఐ వెంకటస్వామి తెలియజేశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. -
చిగిచెర్ల పాఠశాలకు వరుసగా మూడోసారి అవార్డు
ధర్మవరం రూరల్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సం సందర్భంగా జిల్లా విద్యాశాఖ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ప్రకటించిన స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026–27లో ధర్మవరం మండలం చిగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సరికొత్త రికార్డు సృష్టించింది. క్రీడారంగంలో నిరంతర ప్రతిభ కనబరుస్తూ ఈ పాఠశాల వరుసగా మూడోసారి జిల్లా స్థాయి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు తిమ్మారెడ్డి, పీడీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కమిటీ పరిశీలన అనంతరం చిగిచెర్ల ఉన్నత పాఠశాల ఏకంగా 226 పాయింట్లతో జిల్లాలోనే అగ్రస్థానాన్ని కై వసం చేసుకుంది. పుట్టపర్తిలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, డీఈఓ కృష్టప్ప, ఎస్జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేతుల మీదుగా పాఠశాల ప్రతినిధులకు ప్రథమ బహుమతితో పాటు ట్రోఫీ, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. వరుసగా మూడోసారి కూడా పాఠశాల జిల్లాలోనే నంబర్‌వన్‌గా నిలవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీ ప్రతాప్‌రెడ్డిని, ప్రధానోపాధ్యాయులు తిమ్మారెడ్డిని, ఉపాధ్యాయ బృందాన్ని గ్రామస్తులు అభినందించారు. పాఠశాల విద్యార్థులను మరింతగా ప్రోత్సహించి మరిన్ని విజయాలు అందేలా చూడాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చిలమత్తూరు: మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్డిచెన్నంపల్లికి చెందిన వినయ్ కుమార్ (22) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. జాతీయ రహదారి పక్కనే ఉన్న పంజాబీ డాబా వద్ద శనివారం కోడూరు తోపు నుంచి వినయ్‌కుమార్ మరో యువకుడితో పాటు చెక్‌పోస్ట్ వైపునకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. దేమకేతేపల్లికి చెందిన గొల్ల రాధాకృష్ణ రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో వినయ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని బాగేపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యలో వినయ్ మృతి చెందగా, మరో ద్విచక్ర వాహనదారుడు రాధాకృష్ణకు గాయాలు కాగా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం చిలమత్తూరు: మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారి థామస్ మన్రోతోపు సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. స్థానికుల సమాచారం మేరకు బెంగళూరు వైపు నుంచి ఆర్మీ వాహనం థామస్ మన్రో తోపు కుషావతి నదిపై కట్టిన బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన స్పీడు బ్రేకర్ల వద్ద వేగం తగ్గించింది. వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ వాహనం ఆర్మీ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దాని వెనుక వచ్చిన మరో లారీ కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టింది.అయితే ప్రమాద సమయంలో వాహనాలు నదిలో పడలేదు. దీంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదంలో కంటైనర్, లారీ డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎనిమిది మంది రౌడీషీటర్ల బైండోవర్ ధర్మవరం అర్బన్: పట్టణంలో ఎనిమిది మంది రౌడీషీటర్లను బైండోవర్ చేసి రూ.5 లక్షల పూచీకత్తుతో వదిలివేసినట్లు వన్ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. శనివారం పట్టణంలోని ఎరగుంట వార్డుకు చెందిన ఎనిమిది మంది రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులను తహసీల్దార్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దేవరాజ్ ముందు బైండోవర్ చేశారు. ఒక్కొక్కరు రూ.5 లక్షల పూచీకత్తు బాండ్లు సమర్పించారు. నీట్ పీజీ ప్రవేశపరీక్షలో శర్వాణికి మొదటి ర్యాంకు మడకశిర: పట్టణానికి చెందిన శర్వాణి అనే విద్యార్థిని డెంటల్ పీజీలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షలో అత్యంత ప్రతిభను కనబరిచింది. ఆర్యవైశ్య వర్గానికి చెందిన ఎంసీ నాగరాజు కుమార్తె అయిన శర్వాణి 2026–27 డెంటల్ పీజీలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షలో దేశ స్థాయిలో 54వ ర్యాంక్ సాధించింది. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి మడకశిర నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. గత మే నెలలో డెంటల్ పీజీలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. శర్వాణి మాట్లాడుతూ తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రొఫెసర్ల ప్రోత్సాహంతోనే తాను ఈ ఘనత సాధించానని తెలిపారు. దేశస్థాయిలో 54వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆమె తండ్రి నాగరాజు మాట్లాడుతూ కష్టానికి ఫలితం దక్కిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. శర్వాణికి ఆర్యవైశ్య సంఘం నాయకులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. -
ఫార్మా.. ప్రజలకు ఇదేమి కర్మ!
చిలమత్తూరు: హిందూపురం రూరల్ మండల పరిధిలోని తూముకుంట, గొల్లాపురం పారిశ్రామికవాడ ప్రజలు భయానక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికార టీడీపీ నేతలు తమ స్వార్థంతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. పారిశ్రామిక వాడ వద్ద రసాయన ట్యాంకర్లు కుమ్మరిస్తుండడంతో తాగునీరు విషతుల్యమవుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. హిందూపురం రూరల్ మండల పరిధిలోని తూముకుంట, గొల్లాపురం పారిశ్రామిక వాడల్లో ప్రస్తుతం రసాయన వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలను శాసీ్త్రయంగా నిర్వీర్యం చేయాల్సిన ఫార్మా కంపెనీలు.. తమ స్వలాభం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చీకటిపడిన తర్వాత టీడీపీ నేతలతో ఒప్పందాలు చేసుకున్న ఫార్మా కంపెనీలు కెమికల్ ట్యాంకర్లను పారిశ్రామికవాడల్లోని ఖాళీ ప్రదేశాల్లో కుమ్మరిస్తున్నారు. గొల్లాపురం పారిశ్రామిక వాడలోని పీకే స్టీల్ పరిశ్రమ రెండో గేటు సమీపంలోని రైల్వే బ్రిడ్డి కింద ఫార్మా కంపెనీలు రసాయనాలను ట్యాంకర్ల ద్వారా వదిలేసి వెళ్తున్నారు. తూముకుంట పారిశ్రామిక వాడలో శ్యామ్ ఫెర్రస్ స్టీల్ పరిశ్రమకు చెందిన సోలార్ ప్లాంట్ వద్ద రసాయనాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇవి చూడటానికి నీటిలాగే ఉన్నా, అవి పీల్చే గాలిని, తాకే భూమిని, తాగే నీటిని విషతుల్యం చేస్తున్నాయి. పాడవుతున్న ప్రజారోగ్యం.. ఫార్మా కంపెనీలలో వాడే రసాయన వ్యర్థాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను విషతుల్యం చేస్తున్నాయి. తూముకుంట, గొల్లాపురం, దేవరపల్లి బోరుబావుల్లో నీటిలో ఈ రసాయనాలు కలుస్తున్నాయి. దీంతో ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు వంటి భయానక వ్యాధులు ప్రజలను పీడిస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా.. శ్యాంపిల్స్ తీసుకెళ్లి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అధికార టీడీపీకి చెందిన ఓ నేతకు, ఫార్మా కంపెనీలకు మధ్య జరిగిన చీకటి ఒప్పందంతో ఆ నేత శాసీ్త్రయంగా రసాయనాలను నిర్వీర్యం చేసే ప్రాంతాలకు తరలించాల్సి ఉండగా, లాభాలు పెంచుకునేందుకు ఖాళీ ప్రదేశాల్లో పడేస్తూ ఆ ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్నారు. వీరికి ఎమ్మెల్యే పీఏల అండ ఉండటంతో ప్రశ్నించేందుకు స్థానికులు భయపడే పరిస్థితి ఉంది. రసాయన ట్యాంకర్లు పడవేసేటప్పుడు ఆ ట్యాంకర్ల వద్ద టీడీపీ నేతలు కొందరు గూండాలను పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక వాహనంలో మారణాయుధాలతో ట్యాంకరు వెంట వెళతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్వార్థంతో ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్న అధికార పార్టీ నేతలు పారిశ్రామిక వాడ వద్ద రసాయన ట్యాంకర్ల కుమ్మరింత విషతుల్యమవుతున్న తాగునీరు అవస్థలు పడుతున్న స్థానిక ప్రజలు శ్యాంపిల్స్ మాత్రమే తీసుకుంటారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలకు వస్తారు. శ్యాంపిల్స్ తీసుకుంటారు. వెళ్లిపోతారు.కానీ శ్యాంపిల్ నివేదికలు ఏమౌతాయో, అసలు వస్తాయో రావో కూడా తెలియదు. ఆ రసాయనాలు మళ్లీ మళ్లీ అక్కడే వేస్తున్నారు. ఎన్ని ధర్నాలు చేసినా వారిలో చలనం కనిపించడం లేదు. అధికారులు చర్యలు తీసుకోకపోతే నిరసన దీక్షలు చేపడతాం. – రవికుమార్, కార్మిక సంఘం నాయకుడు, తూముకుంట పారిశ్రామిక వాడ దుర్వాసన భరించలేం ఫార్మా కంపెనీల నిర్లక్ష్యంతో రసాయన వ్యర్థాలు మా గ్రామ సమీప ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. నీళ్లు అనుకుని దగ్గరకు వెళ్లి చూస్తే అవి నీళ్లు కాదు. దుర్వాసన వస్తున్న రసాయనాలు. వాసన చూస్తే ఆరోజు అన్నం ముద్ద కూడా తినలేం. నీళ్లు కలుషితం అవుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. – దేవరాజు, మాజీ సర్పంచ్, తూముకుంట


