చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
మడకశిర: తిరుమల లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు... చెంపలేసుకుని కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని మడకశిర నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం మడకశిరలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో సీబీఐ వేసిన అభియోగపత్రంలో తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా పేర్కొందన్నారు. కేవలం చంద్రబాబు తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని మండిపడ్డారు. ఈ విషయంలోవైఎస్సార్‌సీపీపై తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. చేసిన తప్పుకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే దేవుడే శిక్షవేస్తారన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఉన్న కోపంతోనే చంద్రబాబు తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేసి ఘోర తప్పిదం చేశారని తెలిపారు. ఇప్పటికై నా చేసిన తప్పును ఒప్పుకుని చంద్రబాబు పాపపరిహారం చేసుకోవాలని హితవు పలికారు.
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప


