ప్రభుత్వం ఆదుకోవాలి
ధర్మవరం: జిల్లాలోని ధర్మవరం, గోరంట్ల, చిలమత్తూరు, సోమందేపల్లి, హిందూపురం, పెనుకొండ తదితర ప్రాంతాలలో 35 వేలకు పైగా చేనేత మగ్గాలు ఉన్నాయి. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.30 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. మిరమిట్లు గొలిపే రంగురంగుల పట్టుచీరలను నేతన్నలు తయారు చేస్తున్నారు.
కానరాని మద్దతు..
పట్టుచీరలను ఆకర్షణీయంగా రూపొందించేందుకు బార్డర్, పల్లు (కొంగు), మధ్యలో డిజైన్ తదితర చోట్ల జరీ వాడకం తప్పనిసరి. బంగారం, వెండి, రాగి వంటి లోహాల పూతతో చేసే దారాన్ని జరీ అంటారు. ప్రధానంగా కంచి జరీ (వన్‌గ్రాం గోల్డ్ పూత), జర్మన్ సిల్వర్ జరీ (వెండి పూత), నార్మల్ టెస్టెడ్ జరీ (గోల్డ్ కలర్ కోటింగ్), కాపర్ జరీ (రాగిపూత)ని నేతన్నలు ఉపయోగిస్తారు. ఇటీవల బంగారం, వెండి, రాగి ధరలు పెరగడంతో అందుకనుగుణంగా జరీ రేటు కూడా విపరీతంగా పెరిగింది. కొన్ని రోజుల క్రితం రూ.2 వేలు పలికిన కంచి జరీ మార్కు ఇటీవల ఏకంగా రూ. 4 వేలకు చేరింది. అదేవిధంగా జర్మన్ సిల్వర్ జరీ రూ.800 నుంచి రూ.1,200కు, కాపర్ జరీ రూ.700 నుంచి రూ.1,000కు, నార్మల్ టెస్టెడ్ జరీ రూ.600 నుంచి రూ.800కు ఎగబాకాయి. ఒక పట్టు చీర తయారీకి కనీసం రెండు మార్కుల వరకు జరీ వాడాల్సి ఉంటుంది. అనతికాలంలోనే జరీ ధరలు భారీగా పెరగడం, పట్టుచీరలకు మద్దతు ధర మాత్రం 5 ఏళ్ల క్రితం ఎంత ఉందో నేటికీ అంతే ఉండటంతో నేతన్నలు నష్టాల పాలవుతున్నారు.
సరఫరాలో జాప్యం..
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో మాత్రమే జరీ తయారవుతుంది. అక్కడి వ్యాపారుల నుంచి జిల్లాకు చెందిన చేనేతలు జరీ కొనుగోలు చేసి తీసుకొస్తారు. ముందుగా జరీ బాక్స్‌లకు నగదును డీడీల రూపంలో చెల్లిస్తేనే సూరత్ లోని కంపెనీ నిర్వాహకులు, ఏజెంట్‌లు పంపుతారు.ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో జరీకి డిమాండ్ పెరగడంతో నగదు చెల్లించినా ఇక్కడికి సరుకు సరఫరాలో జాప్యం అవుతోంది. దీంతో నేతన్నలకు మరిన్ని అవస్థలు తప్పడం లేదు.
కష్టతరంగా మగ్గాల నిర్వహణ
గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలతో ఆధునిక డిజైన్‌లను చేనేత మగ్గాలలో తయారు చేస్తే కార్మికులకు కొంత లాభదాయకంగా ఉండేది. ఇటీవల జరీ ధరల పెరుగుదల కారణంగా చేనేతలకు గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం స్పందించి జరీ ధరల పెరుగుదలను నియంత్రించాలి. చేనేతలకు సాయం అందించాలి.
–జింకా కంబగిరి, జిల్లా అధ్యక్షుడు,
వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం
పెరిగిన జరీ ధరలకనుగుణంగా పెట్టుబడి వ్యయం బాగా పెరిగింది. ఇప్పటికే ముడిపట్టు, రేషం (నిలువుదారం, అడ్డదారం) ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని పెరిగిన జరీ ధరలు మరింత సంక్షోభంలోకి నెట్టాయి. రోజంతా కష్టపడినా దిన కూలీ కూడా దక్కడం లేదు. పరిస్థితి ఇలానే
కొనసాగితే మగ్గాల నిర్వహణ కష్టంగా మారుతుంది.
–నాగరాజు, చేనేత కార్మికుడు, ధర్మవరం
పట్టుచీరలు అందంగా, ఆకర్షణీయంగా కనపడేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషించే జరీ ధరలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో అదనపు భారం పడడంతో నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం స్పందించి చేయూత
అందించకుంటే భారీగా నష్టాలు
మూటగట్టుకోవాల్సి వస్తుందంటూ
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా పెరిగిన జరీ ధరలు
పట్టుచీరలకు మాత్రం
‘మద్దతు’ లేని వైనం
నష్టాలబాటలో నేతన్నలు
ప్రభుత్వం చేయూతనివ్వాలని వేడుకోలు
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వం ఆదుకోవాలి


