breaking news
Sri Sathya Sai District News
-
భక్తి శ్రద్ధలతో శ్రీగిరి రఽథోత్సవం
పుట్టపర్తి టౌన్: పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం సత్యసాయి శ్రీగిరి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రశాంతి నిలయం ముఖ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని లాగుతూ ఊరేగింపుగా విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్ కూడలి, చింతతోపు, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చారు. ఉత్సవంలో దేశవిదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అనుబంధ విభాగంలో చోటుధర్మవరం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మవరం పట్టణానికి చెందిన చందమూరి నారాయణరెడ్డి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టాలపై యువకుడి మృతదేహం ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గురువారం ఉదయం 7 గంటలకు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లేత నీలం రంగు టీ షర్ట్, నలుపు రంగు షార్ట్ ధరించిన 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకుడి మృతదేహం ఎడమ చేతిపై నేహ అనే పచ్చబొట్టును గుర్తించారు. అంతకు మించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 99513 25345లో సంప్రదించాలని ధర్మవరం రైల్వే పోలీసులు కోరారు. -
ఆన్‌లైనా? ఆఫ్‌లైనా!?
ఈ ఏడాది ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12న వెలువడ్డాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో తమకు నచ్చిన గ్రూపులో చేరడానికి సన్నద్ధమయ్యారు. కానీ, ఫలితాలు వెలువడి మూడు నెలలు గడుస్తున్నా డిగ్రీ అడ్మిషన్లపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ప్రవేశాలను గత ఏడాది మాదిరిగా ఆన్లైన్లో చేపడతారా?, లేకపోతే అంతకుముందు మాదిరిగా ఆఫ్‌లైన్‌లో చేపడతారా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టి, గోప్యంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. హిందూపురం టౌన్: ఉన్నత విద్యపై కూటమి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఇంటర్ ఫలితాలు విడుదలై మూడు నెలలు కావస్తున్నా.. నేటికీ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది కూడా ఉన్నత విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యంగా చేపట్టంతో అనేక కళాశాలల్లో పదుల సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ ఉన్నత విద్య నిర్వీర్యం.. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. ఫలితాలు విడుదలైనప్పటి నుంచి డిగ్రీలో ప్రవేశాలకు మూడు నెలలుగా విద్యార్థులు ఎదురు చూస్తున్నా నేటీకీ షెడ్యూల్ విడుదల కాలేదు. జూన్‌లోనే పాఠశాలలు, ఇంటర్ తరగతులు ప్రారంభమయ్యాయి. మరో వైపు డిగ్రీ కళాశాలలు కూడా నెల రోజుల క్రితమై పునఃప్రారంభమయ్యాయి. అయినా డిగ్రీలో అడ్మిషన్ల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే పలు ప్రైవేటు, కార్పొరేట్ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి, గుట్టు చప్పుడు కాకుండా తరగతులనూ నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యం చేయడం ద్వారా ప్రైవేట్ కళాశాలలు పుంజుకోగా, పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలు వెనుకబడి పోతున్నాయి. కూటమి ప్రభుత్వ తీరుతో ఉన్నత విద్య నిర్వీర్యమవుతోందననే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 8 వేల మంది విద్యార్థుల ఎదురుచూపులు.. 2025–26 విద్యాసంవత్సరంలో డిగ్రీలో అడ్మిషన్లు పొందడానికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 8వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 10వేల మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. గత ఏడాది అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యంగా చేపట్టడంతో జిల్లా వ్యాప్తంగా చాలా కళాశాలల్లో 30 నుంచి 40 శాతం సీట్లు మిగిలిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎస్కేయూ పరిధిలో మొత్తం డిగ్రీ కళాశాలలుప్రభుత్వ డిగ్రీ కళాశాలలుప్రైవేటు డిగ్రీ కళాశాలలు30 వేల వరకుమొత్తం విద్యార్థుల సంఖ్య డిగ్రీ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు విడుదలై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ విడుదల కానీ షెడ్యూల్ ప్రభుత్వ ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపు ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించిన ప్రైవేటు కాలేజీలు 86 1373 -
ఘర్షణ కేసులో 21 మంది అరెస్ట్
రాయదుర్గం: వివాహేతర సంబంధ కారణంగా ఆస్తి విధ్వంసాలకు పాల్పడిన 21 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లికి చెందిన అనంతరాజు కొంత కాలంగా అదే మండలం మైలాపురం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేత సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంగా వివాదం తలెత్తి సోమవారం రాత్రి అనంతరాజుపై దాడి చేశారు. దీంతో కోపోద్రిక్తులైన అనంతరాజు, ఆయన బంధువులు మైలాపురం చేరుకుని లోకేష్, విజయ్ ఇళ్లల్లోకి చొరబడి తలుపులు, టీవీ, రెండు ద్విచక్రవాహనాలు, కారు ధ్వంసం చేయడంతో పాటు పది ట్రాక్టర్ల ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు నేతృత్వంలో ఇరు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆస్తి నష్టానికి కారకులైన 21 మంది యువకులను గురువారం అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా, ఇదే కేసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతరాజును డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే అనంతరాజుపై దాడికి కారకులైన మైలాపురం గ్రామానికి చెందిన వారిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ నబీరసూల్, బొమ్మనహాళ్ పోలీసులు పాల్గొన్నారు. -
నిడిగల్లు వాసికి జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ అవార్డు
తాడిమర్రి: మండలంలోని నిడిగల్లు గ్రామానికి చెందిన బీదాల పెద్దన్నకు జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ అవార్డు దక్కింది. బళ్లారి సమీపంలోని ఆదానీ సిమెంట్స్‌లో దక్షిణ భారతదేశ జోనల్ హెడ్‌గా పనిచేస్తున్న ఆయన, డాక్టర్ రమేష్ చంద్, నీతి అయోగ్ సభ్యులతో కలసి కంపెనీ సమీపంలోని గ్రామాల్లో 29 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడం, 65 వేల మందికి పైగా రైతుల జీవనోపాధుల మెరుగు పరచడంలో చేసిన కృషికి గాను అవార్డు దక్కింది. బుధవారం ఢిల్లీలో జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన కృషి విక్రమ్ – 2025 జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా నిడిగల్లు వాసులు హర్షం వ్యక్తం చేశారు. జేఏసీ కన్వీనర్ సాకే హరి అరెస్ట్ పుట్టపర్తి టౌన్: ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు వెళ్తున్న ఆర్డీటీ పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ సాకే హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కొత్తచెరువు సీఎం పర్యటనలో ఆర్డీటీని కాపాడాలని జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న సీఐలు రెడ్డెప్ప, జయపాల్‌రెడ్డి తదితరులు సాకే హరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను సీఎంకు తెలియజేయడానికి చెప్పుకొనేందుకు వెళ్తున్న జేఏసీ నాయకులు, సభ్యలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రైల్వే ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలి గుంతకల్లు: రైల్వే ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ కోరారు. గురువారం గుంతకల్లు రైల్వే ఆస్పత్రికి విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే ఛీఫ్ మెడికల్ డైరెక్టర్ నిర్మాల రాజరాంకు మెడికల్ బ్రాంచ్ సెక్రటరీ రమేష్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ఆస్పత్రిలో ముఖ్యమైన సర్జన్, గైనకాలజిస్ట్ డాక్టర్లతోపాటు 7 నర్సింగ్ స్టాఫ్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఫార్మిసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్, ఈసీజీ టెక్నిషియన్ పోస్ట్‌లు భర్తీకి నోచుకోలేదన్నారు. ఇక్కడి నుంచి అనంతపురం, కర్నూలులోని కార్పొరేట్ ఆస్పత్రులకు రైల్వే ఉద్యోగులను మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. గుంతకల్లు పట్టణానికి సమీపంలో ఉన్న బళ్లారి సిటీలోని కార్పొరేట్ ఆస్పత్రికి రెఫరల్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతకముందు సీఎండీ నిర్మాల రాజరాం రైల్వే ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఓపీ విభాగాన్ని పరిశీలించి రోగులకు అందతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
అనంతపురం: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌ను నిరసిస్తూ అనంతపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా అశోక స్థూపం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, ఉపాధ్యక్షుడు ధర్మసింగ్ నాయక్, ట్రెజరర్ వెంకట రఘుకుమార్, సంయుక్త కార్యదర్శి జుబేర్, మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, భరత్ భూషణ్ రెడ్డి, అవ్వా సురేష్ తదితరులు మాట్లాడుతూ.. ట్రోలింగ్‌తో న్యాయ వ్యవస్థపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సైతం జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించనున్నట్లు తెలిపారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
హిందూపురం: మండలంలోని మలుగూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. వివరాలు.. సోమందేపల్లి మండలం పోలేపల్లికి చెందిన నరసింహులు మరో వ్యక్తితో కలసి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా మలుగూరు రైల్వేస్టేషన్ సమీపంలో వెనుక నుంచి మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అటకాయించి మలుగూరు గ్రామానికి దారి అడిగారు. చెబుతుండగానే కత్తితో దాడి చేశారు. ఆ సమయంలో కేకలు వేయడంతో దుండగులు ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. అక్కడకు చేరుకున్న స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలిచంఆరు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు ఇళ్లల్లో చోరీ లేపాక్షి: మండలంలోని మైదుగోళం గ్రామంలో మంగళవారం రాత్రి రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. పది రోజుల క్రితం గ్రామంలో చోటు చేసుకున్న హత్య నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన శాంతమ్మ, బేబీ శ్యామల కుటుంబాలు ఈ 5న గ్రామాన్ని వీడిపోయాయి. తాళం వేసిన ఇళ్లను గుర్తించిన దుండగులు మంగళవారం రాత్రి లోపలకు చొరబడి బంగారు నగలతో పాటు, కిరాణా దుకాణంలోని నగదునూ అపహరించారు. విషయం తెలుసుకున్న బాధితులు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతిఅమరాపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. వివరాలు.. అమరాపురంలోని గాడి దొడ్డయ్య ఇంటి సమీపంలో ఉన్న చింత చెట్టులో ఉన్న తుట్టె నుంచి తేనెను సేకరించేందుకు బుధవారం అదే గ్రామానికి చెందిన యువకులు తిప్పేస్వామి (35), గిరీష్ సిద్ధమయ్యారు. చెట్టు ఎక్కి తేనె తుట్టె వైపుగా సాగుతుండగా చెట్టు మధ్యలో నుంచి వెళ్లిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలి షాక్‌కు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తిప్పేస్వామి మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన గిరీష్‌కు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. కాగా, కుమారుడు మృతితో ఒంటరిగా మారిన తల్లి పుట్టమ్మ వేదనకు అంతులేకుండా పోయింది. -
‘మేడా’లో అడ్మిషన్.. జీజీహెచ్‌లో డెత్
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం సొంతంగా నిర్వహిస్తున్న మేడా నర్సింగ్ హోం నుంచి జీజీహెచ్‌కు రెఫర్ అయిన యువకుడు ఆర్థో వార్డులో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందంటూ మృతుడి కుటుంబీకులు దాదాపు ఆరు గంటలకు పైగా ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. వివరాలు.. ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్, లక్ష్మీదేవి దంపతులకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్న రెండో కుమారుడు రాజేష్ (22) బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో తన ఎడమ కాలు నొప్పిగా ఉందంటూ 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 3న మేడా నర్సింగ్ హోంకు వెళ్లి డాక్టర్ ఆత్మారాంను సంప్రదించారు. ఆ రోజు అడ్మిషన్లో ఉంచుకున్న అనంతరం ఇక్కడైతే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని, జీజీహెచ్‌కు వెళితే అక్కడ ఉచితంగా వైద్యం చేస్తారని డాక్టర్ ఆత్మారాం తెలిపి, సిఫారసు చేయడంతో 4న ఆగమేఘాలపై జీజీహెచ్‌లోని ఆర్థో విభాగంలో వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీయించిన అనంతరం ఎడమ కాలులో చీము ఉన్నట్లు నిర్ధారించి, ఈ నెల 7న శస్త్రచికిత్స చేశారు. అనంతరం వైద్యులు కానీ, సిబ్బంది కాని పట్టించుకోక పోవడంతో రెండు రోజుల పాటు నొప్పి తాళలేక రాజేష్ విలవిల్లాడినట్లు తల్లి లక్ష్మీదేవి కన్నీటి పర్యతమయ్యారు. నొప్పి వచ్చినప్పుడల్లా పీజీ వైద్యులు పరీక్షించి ఓ టాబ్లెట్, ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేవారని వివరించారు. బుధవారం ఉదయం టిఫిన్ తింటున్న సమయంలో రాజేష్ ఒక్కసారిగా కుప్పకూలాడు. విషయాన్ని వెంటనే డాక్టర్లకు తెలపడంతో వారు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారని వాపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రాజేష్ మృతి చెందాడంటూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పడంతో ఆందోళనను విరమించారు. మధ్యాహ్నం 2 గంటలకు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సాయంత్రం పోస్టుమార్టం చేసి మృతుడి కుటుంబీకులకు అప్పగించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు ఖర్చు పెట్టలేరనే జీజీహెచ్‌కు వెళ్లమన్నా కాలు నొప్పితో రాజేష్ మేడా నర్సింగ్ హోంకు వచ్చాడు. ఒక రోజు ట్రీట్మెంట్ ఇచ్చా. మూడు సార్లు ఆపరేషన్ చేయాల్సి ఉందని, అందుకు బోలెడంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పా. వారికి ఆర్థిక స్థోమత లేక పోవడంతో నేనే జీజీహెచ్‌కు రెఫర్ చేసి, ఉచితంగా ఎంఆర్ఐ తీయించి, సర్జరీ చేశా. మృతికి సెప్టిసేమియా కారణమై ఉండవచ్చు. – డాక్టర్ ఆత్మారాం, మెడికల్ సూపరింటెండెంట్, జీజీహెచ్ వివాదాస్పదంగా మారిన జీజీహెచ్ ఆర్థో వార్డులో యువకుడి మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ 6 గంటలకుపైగా కుటుంబీకుల ఆందోళన దరిదాపులకు రాని సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం -
కోవూరు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి హేయం
చిలమత్తూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరుమాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు చేసిన దాడిని హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఖండించారు. దాడిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. బుధవారం హిందూపురంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వందలాది టీడీపీ గూండాలు మూకుమ్మడిగా ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దారుణాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డిని హతమార్చేందుకే ఈ దాడి జరిగినట్లుగా కనిపిస్తోందన్నారు. తమ కంటి ముందే విధ్వంసం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. దాడికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల తీరు అమానుషం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా బరితెగించడం సిగ్గుచేటని టీఎన్ దీపిక మండిపడ్డారు. మామిడి రైతులను పరామర్శించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై పోలీసులు విధించిన ఆంక్షలు చూస్తుంటే సీఎం చంద్రబాబు భయపడ్డారనేది స్పష్టమవుతోందన్నారు. పోలీసులను ఉసిగొల్పి రైతులను భయభ్రాంతులకు గురి చేసేలా లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు. ఈ దుశ్చర్యను బట్టి చూస్తే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అర్థం అవుతోందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేసులు బనాయించినా, బెదిరింపులకు దిగినా రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ వెంటే ఉంటారనే విషయం ఈ పర్యటనతో స్పష్టమైందన్నారు. ఇప్పటికై నా వైఎస్ జగన్‌పై ఉన్న ప్రజాభిమానాన్ని గుర్తించి తమ నిరంకుశ ధోరణికి స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు హితవు పలికారు. వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ధ్వజం -
సచివాలయ బది‘లీలలు’
అనంతపురం అర్బన్: ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మెరిట్ (ర్యాంక్) ఆధారంగా బదిలీలు నిర్వహించాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా రాజకీయ సిఫారసులకు తలొగ్గారు. ఫలితంగా స్థానాల కేటాయింపులో అర్హులైన ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. దీంతో బాధిత ఉద్యోగులు న్యాయం కోసం కలెక్టర్ వినోద్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారిలో అత్యధికంగా వ్యవసాయ శాఖ పరిధిలోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు, పోలీసు శాఖ పరిధిలోని మహిళ సంరక్షకులు (మహిళ పోలీసు) ఉన్నారు. సిఫారసులకే పెద్దపీట వ్యవసాయశాఖలో సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఓ ప్రహసనంలా సాగిందనే అరోపణలున్నాయి. బదిలీల ప్రక్రియలో అగ్రికల్చర్ అసిస్టెంట్లకు మెరిట్ ఆధారంగా కాకుండా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు తొలి ప్రాధాన్యతనివ్వడం విమర్శలకు తావిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో 2వ ర్యాంకు, ఉమ్మడి జిల్లాలో 5వ ర్యాంక్‌లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ సుస్మితకు, అదే జిల్లాలో 3వ ర్యాంకు, ఉమ్మడి జిల్లాలో 6వ ర్యాంక్ ఉన్న జనార్ధన్‌కు.. దివ్యాంగుల కోటా కింది శిరీష్.. వారు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కాకుండా అధికారులకు తమకు ఇష్టమొచ్చిన చోటికి పోస్టింగ్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. వీరు కోరిన ఆప్షన్లను వీరి తర్వాతి ర్యాంకు వారికి కట్టబెట్టినట్లుగా తెలిసింది. ఇదే తరహాలో చాలా మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లకు అధికారులు ఇష్టానుసారంగా పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఎటూ తేల్చని అధికారులు బదిలీల ప్రక్రియలతో తమకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్‌కు ఈ నెల 2న అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతే కాక కలెక్టర్‌ను వారు ఇప్పటికి మూడుసార్లు కలసి న్యాయం చేయాలని కోరారు. ఇక 4న కలెక్టర్‌కు మహిళ సంరక్షకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం రోజులవుతున్నా అధికారులు ఎటూ తేల్చలేదని బాధిత అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిలీవ్ కావాలని మరోవైపు అధికారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయని వాపోతున్నారు. సత్వర పరిష్కారంతోనే ఊరట అందిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. సత్వర పరిష్కారంతోనూ బాధితులకు న్యాయం చేకూరుతుంది. అయితే సచివాలయ ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం. న్యాయం కోసం అనంత కలెక్టర్‌కు ఉద్యోగుల ఫిర్యాదు వ్యవసాయ, పోలీసు శాఖల్లో అడ్డగోలు వ్యవహారం వ్యవసాయ శాఖలో తారస్థాయిలో అక్రమాలు వారమవుతున్నా ఫిర్యాదుపై ఎటూ తేల్చని వైనం సత్వర పరిష్కారంతోనే బాధితులకు ఊరట -
రైల్వే రక్షణ కవచం
గుంతకల్లు: రైలు ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ప్రధాన కారణం సిగ్నలింగ్ సమస్య. ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాల్లో అత్యధికంగా ఒకే లైనుపై రెండు రైళ్లు ఎదురెదురుగా దూసుకురావటం వల్ల చోటు చేసుకున్నవే ఉండడం బాధాకరం. ఈ తరహా ప్రమాదాలను నియంత్రించగలిగి ప్రయాణికుల భద్రతకు భరోసానిచ్చే దిశగా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూపొందించిన ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఈఎస్)ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. కవచ్ అనే పేరుతో పిలువబడే టీసీఈఎస్ పనితీరును ఇప్పటికే క్షేత్ర స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజయవంతంగా పరీక్షించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం గుంతకల్లు–డోన్ సెక్షన్లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దశల వారీగా గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. రక్షణ కవచం పని చేస్తుంది ఇలా.. కవచ్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా రైళ్లలో మెక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), యాంటీ కొలిజన్ పరికరాలను రైలు ఇంజన్లో ఏర్పాటు చేస్తారు. వీటిని రైల్వే ట్రాక్‌లకు అనుసంధానిస్తారు. ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రతి స్టేషన్లో ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా రైలింజన్‌లోని కవచ్ యాంటీనాలు రేడియో ఫ్రీక్వెన్సీల స్వీకరిస్తూ వాటికి అనుగుణంగా పనిచేస్తుంటాయి. ప్రయాణంలో ఉండగా లోకో పైలెట్ రెడ్ సిగ్నల్ గుర్తించకపోవడం... సిగ్నల్ దాటి ముందుకెళ్లడం... పరిమితికి మించిన వేగంతో రైలు ప్రయాణించడం, రైలు వేగాన్ని లోకో పైలెట్ నియంత్రించలేకపోవడం తదితర సమస్యలు ఎదురైనప్పుడు కవచ్ వ్యస్థ స్వతంత్రంగా పనిచేయడం మొదలు పెడుతుంది. సిగ్నల్ జంప్ కాగానే వెంటనే లోకో పైటెల్ను అప్రమత్తం చేస్తుంది. బ్రేయ్లను నియంత్రిస్తుంది. నిర్ణీత దూరం లోపు అదే లైనులో మరో రైలును గమనించినప్పుడు స్వయం చాలకంగా రైలు కదలికను నిలిపివేస్తుంది. కి.మీ రూ.50 లక్షలు వ్యయం.. గుంతకల్లు డివిజన్ దాదాపు 1450 కి.మీ మేర విస్తరించి ఉంది. ఇందులో వాడి–రేణిగుంట, గుత్తి–ధర్మవరం, ధర్మవరం–పాకాల. పాకాల–కాట్పాడి, నంద్యాల–యర్రగుంట్ల, గుంతకల్లు–బళ్లారి సెక్షన్లలో దశల వారీగా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రసుత్తం గుంతకల్లు–డోన్ మధ్య ఉన్న 69 కి.మీలకు కి.మీకు రూ.50 లక్షలు చొప్పన దాదాపు రూ.345 కోట్లను రైల్వే శాఖ ఖర్చు చేసింది. ఈ మార్గంలో తిరిగే దాదాపు 20 నుంచి 30 రైలింజన్లో కవచ్ పరికరాలను ఏర్పాటు చేశారు. అలాగే వాడి–రేణిగుంట మధ్య 538 కి.మీల పరిధిలో ఉన్న 60 స్టేషన్లతో పాటు 200కు పైగా రైలింజన్ల్లో కవచ్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగా ఒకే లైనుపై ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రైళ్లు ఢీకొన్న ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. ఆయా ఘటనల్లో పలువురు ప్రయాణికులు చనిపోవడంతో పాటు రైల్వేకు భారీ నష్టాలూ చేకూరాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతా చర్యల్లో భాగంగా రైళ్లు పరస్పరం ఢీకొనకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ సమకూర్చుకుంది. దాని పేరే ‘కవచ్’. కవచ్ వ్యవస్థతో ఆటోమేటిక్‌గా ఆగిపోనున్న రైళ్లు ప్రస్తుతం గుంతకల్లు–డోన్ సెక్షన్ మార్గంలో ఏర్పాటు త్వరలో గుంతకల్లు డివిజన్లోని అన్ని సెక్షన్లలో ఏర్పాటుకు చర్యలు ప్రయాణికుల భద్రతే లక్ష్యం ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైలు ప్రమాదాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా కవచ్ లాంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చాం. ప్రస్తుతం గుంతకల్లు – డోన్ సెక్షన్లో కవచ్‌ను ఏర్పాటు చేశాం. త్వరలో గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా అన్ని సెక్షన్లలో ఈ పరికరాలను ఏర్పాటు చేయనున్నాం. – చంద్రశేఖర్, సీనియర్ డీఎస్టీఈ, గుంతకల్లు -
1542 నాటి శాసనం లభ్యం
పావగడ: తాలూకాలోని పొన్న సముద్రం గ్రామం నుంచి బుడ్డారెడ్డి హళ్లికి వెళ్లే మార్గ మధ్యంలో ఓ పెద్ద బండపై కన్నడ లిపిలో చెక్కిన 9 వరుసల శిలా శాసనాన్ని స్థానిక చరిత్ర పరిశోధకుడు బీవీ రమేష్ బాబు మంగళవారం గుర్తించారు. శాసనానికి సంబంధించి అద్భుతంగా చెక్కిన సీ్త్ర పురుషుల చిత్రం ఉంది. క్రీ.శ. అక్టోబర్ 9, 1542లో శాసనం చెక్కినట్లుగా అందులో పేర్కొన్నారు. పొన్నసముద్రం కబిల అంగజోళ జక్కయ్యన మక్కళు నాగయ్య తదితర సహోదరుల ప్రతిష్ట జ్ఞాపకంగా ఈ శాసనం, శిల్పాలు చెక్కినట్లుగా అందులో పేర్కొన్నట్లు రమేష్‌బాబు తెలిపారు. హత్య కేసు నమోదుగాండ్లపెంట: ఉపాధి కూలీ మృతి కేసు మలుపు తిరిగింది. సమగ్ర దర్యాప్తు అనంతరం హత్య కేసుగా పోలీసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. గాండ్లపెంట మండలం కురుమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టకిందపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఘర్షణలో అదే గ్రామానికి చెందిన ఉపాధి కూలీ చెన్నక రంగారెడ్డి (55) మృతి చెందిన విషయం తెలిసిందే. ఉపాధి బిల్లుల చెల్లింపుల విషయంగా ప్రశ్నించినందుకు క్షేత్ర సహయకుడు మనోహర్, ఆయన భార్య స్వాతి, మామ దాదెప్ప సోమవారం రాత్రి రాళ్లతో ఆయనపై దాడికి తెగబడ్డారు. ఘటనలో అపస్మారక స్థితికి చేరుకున్న రంగారెడ్డిని కుటుంబసభ్యులు వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. హతుడి వదిన వెంకటరత్నమ్మ ఫిర్యాదు మేరకు మనోహర్, స్వాతి, దాదెప్పపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నీట మునిగి రాజస్థానీల మృతి కళ్యాణదుర్గం రూరల్: ప్రమాదవశాత్తు నీట మునిగి రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజస్థాన్‌కు చెందిన జుట్టూ(22), భగత్‌సింగ్(25), సురేష్ బతుకు తెరువు కోసం కళ్యాణదుర్గం వలస వచ్చి ఉడ్‌వర్క్ షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మండలం పాపంపల్లిలోని వెంకటేష్ బాబు తోటలోకి వెళ్లి, అక్కడ బొప్పాయి పండ్లను ఆరగించిన అనంతరం చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటి ట్యాంక్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు జుట్టూ కాలు జారి ట్యాంక్ పడ్డాడు. గమనించిన భగత్‌సింగ్ వెంటనే ట్యాంక్‌లోకి దిగాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. సురేష్, స్థానిక రైతుల నుంచి సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి యువకుల మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
రెక్కీ నిర్వహించి.. గొలుసు అపహరణ!
రాప్తాడు రూరల్: రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన అనంతరం ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును యువకుడు లాక్కొని ఉడాయించాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. శింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన రమణయ్య, పద్మావతి దంపతులు కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని నందమూరినగర్‌లో స్థిరపడ్డారు. సొంతూరిలో ఉన్న భూముల్లో భర్త వ్యవసాయం చేస్తున్నాడు. పద్మావతికి గుండె శస్త్రచికిత్స జరగడంతో వ్యవసాయ పనులకు వెళ్లలేక ఇంటికి సమీపంలోనే కళ్యాణదుర్గం ప్రధాన రహదారి పక్కనే ఓ బంకు ఏర్పాటు చేసుకుని కూల్‌డ్రింక్స్, స్నాక్స్ విక్రయిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఓ యువకుడు వచ్చి బంక్ వద్ద దాదాపు గంట పాటు కూర్చొని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించాడు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో అదే యువకుడు మరోమారు వచ్చాడు. సిగరెట్ తీసుకుని తాగాడు. 2.30 గంటల వరకు అక్కడే కూర్చున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం ‘పెద్దమ్మా...తాగేందుకు కొన్ని నీళ్లు ఇవ్వు’ అని అడిగాడు. దీంతో పద్మావతి ఫ్రిజ్ తెరుస్తుండగా ఒక్క ఉదుటన వెనుక నుంచి అరవకుండా నోటిని గట్టిగా అదిమపెట్టి మెడలో ఉన్న బంగారు చైనును లాక్కొని, ఆమెను గిరాటేసి వెళ్లిపోయాడు. ఈ హఠత్పరిణామంతో కాసేపటి వరకూ ఆమె కోలుకోలేక పోయింది. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన యువకుడు ఎలాంటి బెదురు లేకుండా నింపాదిగా నడుచుకుంటూ వెళ్లడం విశేషం. ఘటనపై బాధితురాలు అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలసీఉలు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమరాలను పరిశీలిస్తున్నారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ధర్మవరం అర్బన్: మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను వారు వెల్లడించారు. ధర్మవరంలోని గీతానగర్‌కు చెందిన చితా రమాదేవి(55)తో ఎదురింటిలో నివాసముంటున్న యలమకూరు రాజశేఖర్ అలియాస్ చాకలి శేఖర్ రెండేళ్ల క్రితం రూ.10వేలు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించలేదు. అప్పు చెల్లించాలంటూ రమాదేవి రెండు పర్యాయాలు నిలదీసింది. దీంతో అవమానంగా భావించిన రాజశేఖర్ గత నెల 29న రమాదేవి ఇంట్లోకి చొరబడి ఆమెను కొట్టి అరవకుండా నోరు అదిమిపెట్టి రెండు చేతులతో కిందకు తోసేశాడు. అనంతరం టెంకాయ తాడు తీసుకుని ఆమె గొంతు బిగించాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో చనిపోయిందని భావించి అక్కడి నుంచి జారుకున్నాడు. కాసేపటి తర్వాత తేరుకున్న ఆమె స్థానికుల సాయంలో ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 4న ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ నాగేంద్రప్రసాద్... ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మృతి చెంది పోస్టుమార్టం అయ్యే వరకూ ఆస్పత్రిలోనే తచ్చాడుతున్న రాజశేఖర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో రమాదేవిని తానే హత్య చేసినట్లుగా ఆయన అంగీకరించడంతో మంగళవారం హత్య కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
టీడీపీ ట్రోల్స్‌పై న్యాయవాదుల ఆగ్రహం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సాగిస్తున్న ట్రోల్స్‌పై జిల్లా న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ట్రోల్స్‌ను ఖండిస్తూ బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిపై జరుగుతున్న ట్రోలింగ్‌ను న్యాయవ్యవస్థపై దాడిగా అభి వర్ణించారు. సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తిపైనే ట్రోలింగ్ చేస్తే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రోలింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రెండు రోజుల పాటు న్యాయవాదులు విధులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, భరత్‌భూషణ్ రెడ్డి, అవ్వా సురేష్ తదితరులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు బార్ అసోసియేషన్ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో బుధ, గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు విధుల బహిష్కరణ -
‘నేతన్న నేస్తం’ అమలు చేయండి
ధర్మవరం అర్బన్: చేనేత కార్మికులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ధర్మవరంలోని కేశవనగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులకు గత జగన్ ప్రభుత్వం ఏటా రూ.24వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తామని, చేనేత కార్మికులకు రెండు సెంట్ల స్థలంతోపాటు వర్క్ షెడ్ కట్టిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీనిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇప్పటి వరకూ నేత కార్మికులకు చేసిన మేలంటూ ఏదీ లేదన్నారు. దీంతో చేనేత కార్మికులకు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందన్నారు. మరమగ్గాలను అరికట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టించుకోక పోవడంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఎక్కడేగాని ప్రస్తావించక పోవడం బాధాకరమన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ సైతం చేనేత పరిశ్రమ, కార్మికుల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎన్నికలకు ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీల అమలుపై ఈ నెల 10న జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు చెన్నంపల్లి శ్రీనివాసులు, విజయభాస్కర్, నాయకులు శ్రీనివాసులు, కేశవ తదితరులు పాల్గొన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ -
ఆకుతోటపల్లి వాసులకు దుద్దుకుంట పరామర్శ
ఓడీచెరువు: కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఓడీ చెరువు మండలం ఆకుతోటపల్లి వాసులను పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి పరామర్శించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో చికిత్స పొందుతున్న వారిని నేరుగా కలసి మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. అనంతరం బాధితులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దామోదరరెడ్డి, ఎంపీపీ పర్వీన్‌భాను, పార్టీ టౌన్ కన్వీనర్ కోళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్ట్ ● రూ.12 లక్షల విలువైన సొత్తు రికవరీ అనంతపురం: ఇళ్లలోకి ప్రవేశించి బంగారు నగలు, సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అపహరిస్తున్న విక్కీ అలియాస్ షామీర్‌తో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న ఫరూక్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రెండో పట్టణ పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ శ్రీకాంత్ యాదవ్ వెల్లడించారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సలీం కుమారుడు మాదిరి కర్రి విక్కీ అలియాస్ షామీర్ (20) తన ఆరేళ్ల వయసులోనే పారిపోయి అనంతపురానికి చేరుకున్నాడు. అప్పట్లో విజయనగర కాలనీలోని అనాథ ఆశ్రమంలో ఉంటూ రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ రాత్రి సమయాల్లో ఇళ్లలోకి చొరబడి చోరీలు చేయడం ప్రవృత్తిగా మార్చుకుని, చివరకు దొంగతనాల్లో రాటుదేలాడు. 2024, నవంబర్‌లో అనంతపురంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో ఉన్న ఇంట్లోకి వారం వ్యవధిలో రెండు సార్లు చొరబడి రెండు బంగారు గాజులు అపహరించాడు. అలాగే ఈ ఏడాది జూన్‌లో ఓ యమహా బైక్, గోవాలో ఐ ఫోన్, ఆపిల్ ల్యాప్‌టాప్‌ను అపహరించాడు. ఆయా కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ప్రనస్నాయపల్లి రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న షామీర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వరుస చోరీలు వెలుగుచూశాయి. గతంలో చోరీ చేసిన సొత్తుతో పాటు పలు సందర్భాల్లో అపహరించిన 8 సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను రికవరీ చేశారు. అలాగే నాలుగు సెల్ఫోన్లను కొనుగోలు చేసిన ఫరూక్ అరెస్ట్ చేసి నాలుగు సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఇద్దరి నుంచి రికవరీ చేసిన మొత్తం ఆరు తులాల బంగారు గాజులు, 12 సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక స్కూటీ విలువ రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీసీఎస్ సీఐ వలిబాషా, జయపాల్‌రెడ్డి, టూ టౌన్ సీఐ శ్రీకాంత్‌యాదవ్, ఎస్ఐ రుష్యేంద్రబాబును ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. గురుకులంలో విద్యార్థినికి గాయాలు గుత్తి రూరల్: మండలంలోని రజాపురంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థినికి అనుమానాస్పద స్థితిలో గాయాలయ్యాయి. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన మేరకు... పుట్లూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన చిన్న కుళ్లాయప్ప, వరలక్ష్మి దంపతుల కుమార్తె పి.మైథిలి.. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తరగతి గదిలో రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలతో పడి ఉంది. గమనించిన గురుకుల సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. కాగా ఘటనపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మాత్రం తరగతి గదిలో డెస్క్ మధ్యలో ఇరుక్కొని కింద పడటంతో కాళ్లు విరిగాయని చెబుతోందని, అయితే తమకు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. -
నెల్లూరుపై కడప విజయం
● అనంతపురం, చిత్తూరు మ్యాచ్ డ్రా అనంతపురం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడామైదానం వేదికగా అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సీనియర్ మల్టీ డే క్రికెట్ మ్యాచ్‌లో నెల్లూరుపై కడప జట్టు విజయం సాధించింది. అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్ డ్రా అయింది. వివరాలు.. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులతో బ్యాటింగ్‌కు వచ్చిన అనంతపురం జట్టు 90 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో రంజీ క్రీడాకారుడు మచ్చా దత్తారెడ్డి 196 బంతుల్లో 9 సిక్సర్లు, 16 ఫోర్లతో 164 పరుగులు చేశారు. చిత్తూరు రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జట్టులో బ్యాటర్ ధ్రువ 48 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 81 పరుగులు, మరో బ్యాటర్ మోనిష్ 64 పరుగులు సాధించారు. కాగా, అనంతపురం జట్టుపై మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యత ప్రదర్శించిన చిత్తూరు జట్టుకు మూడు పాయింట్లు, అనంతపురం జట్టుకు ఒక పాయింటు దక్కింది. రెండో మైదానంలో నెల్లూరు జట్టుతో తలపడిన కడప జట్టు 5 వికెట్లతో విజయం సాధించి ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 179 పరుగులు ఆరు వికెట్ల నష్టానికి బ్యాటింగ్ చేపట్టిన నెల్లూరు జట్టు 215 పరుగులకు ఆలౌట్ అయింది. నెల్లూరు బ్యాటర్ రేవంత్ రెడ్డి 76 పరుగులు సాధించాడు. 259 పరుగుల లక్ష్యాన్ని కడప జట్టు సునాయసంగా ఛేదించింది. కేవలం 43.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. కడప బ్యాటర్లు ధ్రువ 103 బంతుల్లో మూడు సిక్సర్లు, 10 ఫోర్లతో 101 పరుగులు చేసి విజయానికి తోడ్పాటునందించాడు. కడప బౌలర్లు శ్రీకాంత్ 5 వికెట్లు, ఆశిష్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. -
‘వందే భారత్’కు అదనపు కోచ్‌లు
అనంతపురం సిటీ: ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్–యశ్వంత్‌పూర్–హైదరాబాద్ మధ్య తిరిగే వందేభారత్ (20703/20704) రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ అశోక్‌కుమార్ మంగళవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తుండగా.. అదనంగా మరో ఎనిమిది కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 16న మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మడకశిర: మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఈనెల 16న నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ తెలిపారు. ఈ ఎన్నిక నోటిఫికేషన్‌ను ఈనెల 12న జారీ చేస్తారన్నారు. ఇదిలా ఉండగా ఇంతకు మునుపు మడకశిర నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్‌గా రామచంద్రారెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. 20 మంది సభ్యులున్న మడకశిర నగర పంచాయతీలో 15 మంది వైఎస్సార్సీపీ తరుఫున గెలుపొందారు. కేవలం ఐదుగురు మాత్రమే టీడీపీ తరుఫున గెలుపొందారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి చేర్పించుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న చైర్పర్సన్, వైస్ చైర్మన్లను పదవుల నుంచి దించారు. ఈ నేపథ్యంలో ఎన్నిక అనివార్యమైంది. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు కొత్తచెరువు: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీఎస్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ఈ నెల 10న సీఎం చంద్రబాబు కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలల్లో నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా కార్యక్రమానికి హాజరవుతారన్నారు. కార్యక్రమానికి సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అందలేదని, అందిన వెంటనే తెలియజేస్తామన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో పక్కాగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్ డైవర్షన్లను చేశామని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి మరికొన్ని డైవర్షన్లు చేస్తామని వెల్లడించారు. కేవలం తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. -
రైలు ప్రయాణికులకు మరింత భద్రత
ధర్మవరం అర్బన్: రైల్వే ప్రయాణికులకు మరింత భద్రత కల్పించనున్నట్లు ఆర్పీఎఫ్ సౌత్ సెంట్రల్ జోన్ డీఐజీ షదాన్ ఖాన్ తెలిపారు. సౌత్ సెంట్రల్ పరిధిలోని ధర్మవరం ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పరిసరాలను, పలు పరికరాల పనితీరు పరిశీలించారు. అనంతరం ఆర్పీఎఫ్ మహిళా వసతి గృహంలో పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రైల్వే శాఖలో మహిళా ఉద్యోగుల భద్రతాపరంగా మహిళా వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో గుంతకల్లు డివిజనల్ ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆకాష్‌కుమార్ జైస్వాల్, సీఐ నాగేశ్వరరావు, అధికారులు రోహిత్‌గౌడ్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఒక్క హామీనైనా అమలు చేశారా?
చిలమత్తూరు: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్‌సిక్స్ హామీలు ఇచ్చి మరచిపోయారు. ప్రజలను కూడా మరచిపోయి.. ప్రాజెక్టులు, అమరావతి, యోగాంధ్ర అంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేష్‌రెడ్డి విమర్శించారు. 143 హామీలు ఇచ్చి ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. హిందూపురం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరడం లేదని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారని, ఈ వైఫల్యానికి కారణం మీరు కాదా అని మండిపడ్డారు. చంద్రబాబు తనను తాను మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్‌తో పోల్చుకోవడం సిగ్గుచేటన్నారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు పార్టీ లైన్ దాటి వైఎస్సార్సీపీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని రమేష్‌రెడ్డి హెచ్చరించారు. గీత దాటిన వారి లిస్ట్ అధిష్టానం వద్ద ఉందని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. స్వలాభమే బాబుకు ముఖ్యం రాష్ట్రంలో ప్రజలు అప్పుల పాలవుతున్నా సీఎం చంద్రబాబు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపిక ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు స్వలాభం కోసమే ప్రభుత్వం నడుపుతున్నారని, పేదలను ఆదుకునేందుకు కాదన్నారు. ఎన్నికల సమయంలో ఓటరు ఇంటికెళ్లి నా కుటుంబం అన్న సీఎం చంద్రబాబు, గెలిచాక నాకేంటి సంబంధం అంటున్నాడని విమర్శించారు. సీనియర్ నాయకుడు బాలాజీ మనోహర్ మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలో స్థానికేతరులను గెలిపించుకొని పరిపాలన అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితుల్లో పురం ప్రజలు ఉన్నారని, ఇకనైనా స్థానికులకు అవకాశం కల్పించిన వైఎస్సార్సీపీకి పట్టంకట్టాలన్నారు. మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుమతిరెడ్డి మాట్లాడుతూ ఏదైనా సమస్యపై మాజీ సీఎం వైఎస్ జగన్ గళమెత్తితేగాని కూటమి ప్రభుత్వంలో చలనం ఉండడం లేదన్నారు. ఆయన వస్తున్నారంటే అప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తోందన్నారు. ఇప్పుడు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ మాజీ సీఎం జగన్ సమస్య తెలుసుకోవడానికి వస్తే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి, రాష్ట్ర కురుబ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఏ శివ, రాష్ట్ర కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఆసిఫుల్లా, జిల్లా అధికార ప్రతినిధి శివశంకర్‌రెడ్డి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు వాల్మీకి లోకేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, కవితారెడ్డి, శ్రీరామిరెడ్డి, ధనుంజయరెడ్డి, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీ సురేష్‌కుమార్‌రెడ్డి, మండల కన్వీనర్లు రాము, రామకృష్ణారెడ్డి, సయ్యద్ నిస్సార్, ఎంపీపీ రత్నమ్మ, వైస్ ఎంపీపీ అంజన్‌రెడ్డి, తిమ్మిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా తదతరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి -
మానవతా విలువలతోనే జీవితం సంపూర్ణం
ప్రశాంతి నిలయం: సత్యసాయి బోధనల మేరకు మనిషి మానవతా విలువలు పాటించడం ద్వారా సంపూర్ణుడు అవుతాడని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు విషాల్రావు పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం సత్యసాయి విద్యాసంస్థల అనంతపురం క్యాంపస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వారు నిర్వహించిన ఆధ్యాత్మిక సంగీత ప్రదర్శనతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అంతకుముందు విషాల్రావు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్రాజు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య సత్యసాయి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌ను ఆవిష్కరించారు. నేడు మానవతా విలువల సదస్సు మానవతా విలువలపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ప్రశాంతి నిలయంలో మానవతా విలువలపై సదస్సు జరగనుంది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత ఉదయం 8 గంటలకు వేదపఠనంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 8.45 గంటలకు జ్యోతి ప్రజ్వలన, 8.55 గంటలకు సదస్సు లక్ష్యాన్ని వివరిస్తూ ప్రసంగం, 9 గంటలకు సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య ప్రారంభోపన్యాసం ఉంటుంది. రామకృష్ణ మిషన్, వివేకానంద ఎడ్యూకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కోల్కత్తా వైస్ చైర్మన్ స్వామి సర్వోత్తమా నంద మానవతా విలువపై ప్రసంగిస్తారు. తర్వాత ముఖ్య అతిథి హరిభౌ కృష్ణారావు బాగ్డే ప్రసంగిస్తారు. సాయంత్రం సదస్సు తీర్మానాలను వివరిస్తారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇల్లు, ఇంటి పట్టాలు, సామాజిక పింఛన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై 172 అర్జీలు వచ్చాయి. పుట్టపర్తి డివిజన్ నుంచి 60, పెనుకొండ 44, ధర్మవరం 41, కదిరి నుండి 27 వినతులు అందాయి. అనంతరం జాయింట్ కలెక్టర్ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఎ, రీ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. డీఆర్ఓ విజయ సారధి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామసుబ్బయ్య, పుట్టపర్తి అర్డీఓ సువర్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వృద్ధురాలి ఆస్తి వెనక్కి ఇప్పించిన ఆర్డీఓ
ధర్మవరం అర్బన్: నానమ్మ ఆస్తిని రాయించుకుని ఆమె బాగోగులు పట్టించుకోని మనవడితో ఆస్తి వెనక్కి ఇప్పించారు ఆర్డీఓ మహేష్. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం వృద్ధురాలికి ఆస్తి వెనక్కి ఇస్తున్నట్లు తీర్పు పత్రాలను ఆర్డీఓ మహేష్ ఆమెకు అందించారు. వివరాలు.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన 70 ఏళ్ల గాజుల వెంకట లక్ష్మమ్మ భర్త గాజుల తిప్పన్న కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె పేరు మీద ఉన్న ఇంటిని మనవడు గాజుల అనిల్‌కుమార్ పేరున గిఫ్ట్‌డీడ్‌ను చేసింది. కాని ఆమె బాగోగులు పట్టించుకోకుండా వదిలేయడంతో పింఛన్ డబ్బుతో జీవిస్తోంది. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనవడిని డబ్బు అడిగినా పట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో గాజుల వెంకట లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు అధికారులు అనిల్‌కుమార్‌కు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో సీనియర్ సిటిజన్ నిర్వహణ సంక్షేమ చట్టం 2007 కింద ఆమె మనవడికి ఇచ్చిన గిఫ్ట్‌డీడ్‌ను రద్దు పరుస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు ఆర్డీఓ తెలిపారు. అర్జీలపై అలసత్వం వహిస్తే చర్యలు పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రవమంలో వచ్చిన అర్జీలపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ రత్న పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన 55 మందితో అర్జీలు స్వీకరించారు. సమస్యలపై ఎస్పీ నేరుగా పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులో ఉన్న అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలపై విచారణ చేసి చట్ట పరిధిలో తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, ఎస్పీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నిరసన కార్యక్రమానికి అనుమతివ్వండి.. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులను, వారి సమస్యలను కలెక్టర్‌కు తెలియజేసేందుకు ఈనెల 14న జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నిరసన కార్యక్రమం తలపెట్టామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఎస్సీ జనసంఘ్ జాతీయ అధ్యక్షులు దానసగారిపల్లి కుళ్లాయప్ప కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ బీసీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దాడులు చేస్తున్నారు. అనంతపురం ఆలుమూరు గ్రామంలో దళితుల భూమిని ఆక్రమిస్తే కొంత మంది దళితులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మరికొంత మంది బీసీ, మైనార్టీలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. పుట్టపర్తిలో జర్నలిస్ట్ డాక్యుమెంట్ తయారు చేస్తే దాడి చేసి కేసులు పెట్టారన్నారు. ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ భూమిని ఆక్రమించడమే గాక బీసీ నేతను అణగదొక్కేలా ఆయనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఈదాడులపై ఈనెల 10న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు సాకే ఆదినారాయణ, జైభీమ్ రామాంజనేయలు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. వేసవి శిక్షణ ప్రారంభం ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యా సంస్థలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, మానవతా విలువలు అన్న అంశంపై శిక్షణ ఇస్తున్నారు. నందగిరి, ప్రశాంతి నిలయం, అనంతపురం, బృందావన్ క్యాంపస్ విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు రామ కథ పేరుతో ఆధ్యాత్మిక సంగీత విభావరి నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో గ్లోబల్ మెడికల్ క్యాంప్ ప్రశాంతి నిలయంలో భక్తులకు ఆరోగ్య సేవలను అందించే లక్ష్యంతో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్లోబల్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సోమవారం నార్త్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు ప్రారంభించారు. ఈనెల 11 వరకు క్యాంప్ నిర్వహించనున్నారు. మా భూమిలోకి పోకుండా అడ్డుకుంటున్నారు ● ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జవాన్ ఫిర్యాదు ప్రశాంతి నిలయం: తాము కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకుంటున్నారని సీఆర్పీఎఫ్ జవాన్ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. కనగానపల్లి మండలం కుర్లపల్లికి చెందిన వై.చెన్నారెడ్డి ఓడిశాలోని రాయ్‌ఘడ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2012లో కుర్లపల్లి గ్రామం సర్వేనంబర్ 248–4బీలో 5.16 ఎకరాల భూమిని బంధువుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. అయితే కొందరు వ్యక్తులు ఆ భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో జవాన్ 2017లో కోర్టులో పిటిషన్ వేసి.. ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి మూడేళ్లపాటు పంటలు సాగు చేశారు. 2021లో మళ్లీ ఆ భూమిని సాగు చేయకుండా దౌర్జన్యపరులు అడ్డుకున్నారు. దీంతో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న తమ భూమికే గ్రామంలో రక్షణ లేకపోతే ఎలా అని జవాన్ చెన్నారెడ్డి సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
అంబేడ్కర్ స్మృతివనం ప్రైవేటీకరణపై ఆగ్రహం
మడకశిర: విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జీఓ జారీ చేయడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మడకశిరలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వివిధ దళిత సంఘాల నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీఓ ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు హనుమంతు మాట్లాడుతూ వైఎస్జగన్ హయాంలో రూ.కోట్లు వెచ్చించి అంబేడ్కర్ స్మృతి వనం ఏర్పాటు చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం స్మృతి వనాన్ని ప్రైవేట్‌పరం చేయడం దళితులకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. ప్రభుత్వ ఆధీనంలోనే స్మృతి వనాన్ని నిర్వహించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు శివన్న, క్రిష్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు నరసింహ, బూత్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మంజునాథ్, మైనార్టీ సెల్ కార్యదర్శి సికిందర్, పట్టణ వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షులు గోపి, వైఎస్సార్సీపీ దళిత నాయకులు ధను, నగేష్, బీసీ సెల్ కార్యదర్శి సత్యనారాయణ, సర్పంచులు రంగనాథ్, హనుమంతప్ప, టీడీపల్లి రంగనాథ్, అంజినప్ప, అంజలి తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద దళిత సంఘాల ఆందోళన -
జన హృదయ నేత వైఎస్సార్
● లక్షలాది మందికి పునర్జన్మనిచ్చిన ఆరోగ్యశ్రీ ● అనంతరం 108, 104 పథకాలు అమల్లోకి తెచ్చిన మహానేత ● కరువుతో అల్లాడుతున్న సమయంలో అనంతకు వైఎస్ ఆసరా ● జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చింది వైఎస్సారే ● రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో ఊరట ● అద్భుత పథకాల ఆవిష్కర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేడు సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒక పథకం దేశం కాదు ప్రపంచం దృష్టినే ఆకర్షించడం సామాన్య విషయం కాదు. ఏకంగా ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వంటి సంస్థలు ఆరోగ్యశ్రీని పొగిడాయంటే ఈ పథకం ఎలాంటిదో అంచనా వేయొచ్చు. ఆరోగ్యశ్రీ.. ఈ పథకం పేరు వినగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకు వస్తారు. దేశవ్యాప్తంగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా పథకాల రూపకర్తగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీ పురుడు పోసుకుంది అనంతలోనే 2004 సంవత్సరానికి ముందు ఉమ్మడి అనంతపురం జిల్లా అత్యంత కరువు ప్రాంతం. పదిరూపాయలు పెట్టి వైద్యం కూడా చేయించుకోలేని దుస్థితి. ఇలాంటి సమయంలో మొదటి దశలో అనంతపురం జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఇక్కడే పథకం పురుడు పోసుకుంది. అనంతపురంతో పాటు మహబూబ్‌నగర్, శ్రీకాకుళంలో ఒకేరోజు ఈ పథకాన్ని ప్రారంభించారు. 168 వ్యాధులతో ప్రారంభమైన ఈ పథకం తర్వాత 958 చికిత్సలకు వైద్యం అందించింది. ఈ పథకం ద్వారా పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందారు. పుట్టుకతోనే చెవిటి మూగ ఉన్న పిల్లలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షలు వెచ్చించి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేయించిన ఘనత వైఎస్సార్‌దేనని అందరికీ తెలిసిందే. 108, 104 పథకాలు... ఆపదలో నేనున్నానంటూ కుయ్ కుయ్‌మంటూ వచ్చే 108 వాహనాల రూపకర్తా వైఎస్సారే. ప్రమాదంలో గాయపడి నిస్సహాయ స్థితిలో ఉండే వేలాదిమందికి ఈ వాహనాలే ప్రాణభిక్ష పెట్టాయి. రాత్రనకా పగలనకా ఏ సమయంలో పిలిచినా పలికే ఈ వాహనాల పథకాన్ని వైఎస్సార్ సృష్టించారు. ఈ పథకం ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ అమలు చేశాయి. వైద్య సలహాల కోసం 104 పథకాన్నీ రూపొందించారు. 104కు ఫోన్ చేస్తే చాలు వైద్య సలహాలు అందేవి. వైఎస్సార్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్, పంట రుణాల మాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. దార్శనికుడు వైఎస్సార్ జిల్లాలో కరువు నివారణలో భాగంగా సాగు – తాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక తాగునీటి పథకంగా ఉన్న హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లోనే ఫేజ్–1కు రూ.1,305 కోట్లు, ఫేజ్–2కు రూ.1,880 కోట్లు విడుదల చేశారు. ఆయన హయాంలోనే ఫేజ్–1 పనులను పూర్తి చేశారు. ఫేజ్–2 పనులు 60శాతం మేర పూర్తి చేశారు. 2008 నుంచి ఏటా హంద్రీ–నీవా ద్వారా కృష్ణాజలాలు జిల్లాకు వస్తున్నాయి. అలాగే తుంగభద్ర ఎగువ కాలువ ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాలోని కణేకల్లు వరకు కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ ఉంటుంది. అక్కడి నుంచి హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ, మిడ్‌పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్ ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇదిలా ఉంటే ఆనాడు కరువు పరిస్థితులతో తాగునీళ్లో రామచంద్రా అనే పరిస్థితులు జిల్లాలో ఉండేవి. కిలోమీటర్ల మేర దూరంలోని వ్యవసాయబోర్ల నుంచి తాగునీటిని తెచ్చుకునే వారు. నేడు జిల్లాలో శాశ్వతంగా తాగునీటి ఇబ్బందులు తొలగిపోయావంటే అది మహానేత వైఎస్సార్ చలవే అని చెప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీఏబీఆర్ రిజర్వాయర్ నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా ఉరవకొండ నియోజకవర్గం నుంచి హిందూపురం వరకు తాగునీటిని అందించారు. అనంతపురం నగరానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారానే జిల్లాలో 60 శాతానికి పైగా జనాభాకు నేడు తాగునీటి సరఫరా జరుగుతోంది. -
34 ఏళ్ల తర్వాత భేటీకి వచ్చిన మల్కాపురం పీర్లు
మొహర్రం ఉత్సవాల్లో 34 ఏళ్ల తర్వాత ధర్మవరం మండలం మల్కాపురం పీర్లు భేటీ కోసం బత్తలపల్లికి వచ్చాయి. గతంలో మండలంలోని 24 గ్రామాల పీర్లు వెంకటగారిపల్లి సత్రం వద్ద భేఠీ అయ్యేవి. 1992లో అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం వల్ల భేటీకి కొన్ని గ్రామాల పీర్లు వెళ్లడం లేదు. అప్పటి నుంచి మల్కాపురం పీర్లు కూడా భేటీకి వెళ్లడం లేదు. ఇప్పడు బత్తలపల్లి కూడలిలో సోమవారం జరిగిన భేటీకి ఆ గ్రామానికి చెందిన పీర్లు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మల్కాపురంలో గ్రామోత్సవం అనంతరం పోట్లమర్రికి చేరుకున్న పీర్లకు ఇక్కడ పీర్లు ఘనస్వాగతం పలికి భేటీ తీసుకున్నారు. అక్కడ నుంచి బత్తలపల్లి కూడలికి రెండు గ్రామాలకు చెందిన పీర్లు తరలివచ్చాయి. -
కదిరిలో చెడ్డీగ్యాంగ్ హల్చల్
కదిరి టౌన్: పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో మధ్యప్రదేశ్‌కు చెందిన చెడ్డీగ్యాంగ్ హల్చల్ చేసింది. కాలనీకి చెందిన బోడెల్ల నరసారెడ్డి ఇంటిలో 17 తులాలు బంగారు, 1500 గ్రాముల వెండి చోరీ చేసింది. పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపిన వివరాలు..నరసారెడ్డి కుటుంబం ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటోంది. ఇదే అదనుగా భావించిన మధ్యప్రదేశ్‌కు చెందిన చెడ్డీ గ్యాంగ్ ఆదివారం అర్ధరాత్రి ఇంటిలో చొరబడ్డారు. ఇంటిలో ఉన్న 30 గ్రాముల బంగారు నక్లెస్, 60 గ్రాముల 4 బంగారు గాజులు, 20 గ్రాముల బంగారు డాలర్, 40 గ్రాముల మూడు జతలు కమ్మలు, 20 గ్రాముల రెండు ఉంగరాలు, 1500 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.9.5 లక్షలు ఉంటుంది. సోమవారం ఇంటి పక్కన ఉన్న నరసారెడ్డి బంధువులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇంటి వద్దనున్న సీసీకెమెరా పుటేజీ పరిశీలించగా ఐదుగురు సభ్యులున్న చెడ్డీగ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తేలింది. 17 తులాల బంగారు, 1500 గ్రాముల వెండి చోరీ -
స్థల ఆక్రమణకు టీడీపీ నాయకుల యత్నం
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు నల్లచెరువు: మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తన స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పడుచూరి నగేష్ కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగేష్‌కుమార్‌కు జాతీయ రహదారి పక్కనున్న వేరుశనగ ఫ్యాక్టరీ ముందు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అల్లాబకాష్, టీడీపీ మండల మాజీ కన్వీనర్ శివారెడ్డి, ఆయన అల్లుడు ప్రసాద్‌రెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేశారు. జేసీబీతో చదును చేయిస్తుండగా నగేష్‌కుమార్ అడ్డుకున్నాడు. వారం రోజుల్లో ఇక్కడ భవనం నిర్మిస్తామని, దిక్కున్న చోట చెప్పుకో అని సదరు వ్యక్తులు బెదిరించారని నగేష్‌కుమార్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
చంద్రబాబు.. పెద్ద మోసకారి
స్వలాభం కోసమే బాబు పాలన సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి: ‘ప్రతి ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం చంద్రబాబు నాయుడుకు అలవాటే. ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుని గెలవడం.. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈసారి ప్రతిపక్ష పాత్రలో వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తోన్న క్రమంలోనే ఒకట్రెండు పథకాలను అరకొరగా ఇచ్చారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీశ్‌రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నియోజకవర్గ స్థాయిలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను క్యూఆర్ కోడ్ ద్వారా పరిశీలించాలని.. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వేంపల్లి సతీశ్‌రెడ్డి అన్నారు. గడిచిన ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీ అమలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు.. ఓ మోసగాడు.. మాయలోడు అనే విషయం ప్రజలందరికీ అర్థమైందన్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి నెలా ఏదో ఒక పథకం రూపంలో ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అయ్యేదని గుర్తు చేశారు. పేదలకు చేదోడు – వాదోడుగా వైఎస్ జగన్ నిలిచారని, నేడు చంద్రబాబు కేవలం తన కార్యకర్తలకు మాత్రమే సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే తనకు ఇదివరకు పుట్టపర్తి తెలుసన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో పంటలు దున్నేయడం, చెట్లను నరికేయడం వంటి సంప్రదాయాలను ఇక్కడ చూడాల్సి రావటం దౌర్భాగ్యమన్నారు. వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో జిల్లాకు రెండుసార్లు వచ్చారని, జన ప్రభంజనం చూశామని సతీశ్‌రెడ్డి అన్నారు. జగన్ వస్తే భారీ సంఖ్యలో జనాలు వస్తారని, ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చిస్తారనే భయంతో చంద్రబాబు ప్రభుత్వం హెలికాప్టర్ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా.. అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్య కిరణాలను ఆపలేమన్న రీతిలో వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాదిరి తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని చంద్రబాబు చెబుతుంటారని, ఎవరితో పోల్చుకోవాలనే విషయంలో కనీస ఇంగిత జ్ఞానం, సిగ్గు ఉండాలని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేశ్‌రెడ్డి అన్నారు. ‘గాంధీజీ వారసులు ఎవరో మనకు పెద్దగా తెలియదు.. అంబేడ్కర్ ఆశయాలు తప్ప వారసులు కనిపించరు.. కానీ చంద్రబాబు తన కుమారుడిని రాజకీయంగా తెచ్చి మంత్రిని చేశాడు. మనవడి పేరు మీద రూ.కోట్ల ఆస్తులు ఉన్నాయి’ అని దుయ్య బట్టారు. సూపర్ సిక్స్‌తో సహా వందకు పైగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇంటింటికీ తిరిగి హామీలు.. వంచనల గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు మాజీ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు మోసాలపై ఇంటింటికీ వెళ్లితెలియజేస్తాం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీశ్‌రెడ్డి పుట్టపర్తిలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’కి హాజరు చంద్రబాబు పాలన స్వలాభం కోసమేనని మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ కార్యకర్తల బాగు కోసమే పథకాలు తెచ్చారన్నారు. వైఎస్సార్సీపీ డిమాండ్ చేయకుంటే ఉచిత గ్యాస్, తల్లికి వందనం కూడా వచ్చేవి కాదన్నారు. తల్లికి వందనం గురించి అడిగితే.. అమ్మ ఒడి వచ్చిందని చెబుతున్నారని, దీన్నిబట్టి తమ నాయకుడి పథకాలకు పేరు మార్చినా.. ప్రజల్లో చెరగని ముద్ర అలాగే ఉందని అన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరకు ఏమీ తెలీదని, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముందు ఉంటే.. సినిమాల్లో హీరోలకు డూప్‌లా ఆమె వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సూపర్‌సిక్స్ పేరుతో ప్రజలను వంచించిన చంద్రబాబు.. రెడ్‌బుక్‌ను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు, మద్దతుదారులపై అక్రమ కేసులు, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. కూటమి పార్టీల నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. తమ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో శరవేగంగా అభివృద్ధి వైఎస్సార్సీపీ హయాంలో పుట్టపర్తిని జిల్లా చేయటంతో పాటు వేల సంఖ్యలో జగనన్న ఇళ్లు కట్టించామని, రెండు జాతీయ రహదారులు, ఒక గ్రీన్‌ఫీల్డు హైవే పనులు చేపట్టామని, రూ.864 కోట్లతో నియోజకవర్గంలో 193 చెరువులు నింపే పనులకు శ్రీకారం చుట్టామని శ్రీధర్‌రెడ్డి గుర్తు చేశారు. వీటన్నింటిని ప్రస్తుత ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు.జనాలొస్తారనే బాధ.. పోల్చుకోవడానికి సిగ్గుండాలి.. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
పుట్టపర్తి టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం కొత్తచెరువులోని శ్రీసత్యసాయి జూనియర్ కళాశాల ఆవరణలో కలెక్టర్, ఎస్పీతో పాటు జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ కళాశాల పరిసర ప్రాంతాలు పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పుట్టపర్తి సమీపంలోని సత్యసాయి విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన సీఎం కొత్తచెరువులోని జిల్లా పరిషత్, జూనియర్ కళాశాల ఆవరణలో జరిగే మోగా పేరెంట్స్ సమావేశంలో పాల్గొంటారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని అదికారుకు సూచించారు. పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని అధికారును ఆదేశించారు. ప్రతి అధికారీ అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాణరెడ్డి, పుట్టపర్తి, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, మహేష్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, సీపీఓ విజయకుమార్, డీఈఓ క్రిష్టప్ప, పౌరసంబంధాల శాఖ జిల్లా మేనేజర్ రాజు, డీపీఓ సమత, జిల్లా రవాణాధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశిఅగళి: తొలి ఏకాదశి సందర్భంగా మధూడి గ్రామంలో భూతప్ప ఉత్సవాలు నిర్వహించారు. భూతప్ప వేషధారుల సంప్రదాయక నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. భూతప్పలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని వివిధ ఆలయాల్లో ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.వాహనదారులకు ఝలక్ ● లైసెన్స్ లేదని రూ.5వేల జరిమానాహిందూపురం: నూతన మోటార్ వాహనాల చట్టం అమలుతో వాహనదారులకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఏకంగా రూ.5వేలు జరిమానా విధించారు. ఆదివారం హిందూపురం పట్టణంలోని రహమత్‌పురం సర్కిల్ వద్ద ఆదివారం టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని వారికి, త్రిపుల్ రైడింగ్ చేస్తున్న యువకులను సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందికి రూ.5వేలు చొప్పున జరిమానా విధించారు. రూ.వందల్లో వేసే ఫైన్లు ఒక్కసారిగా రూ.వేలల్లో వేయడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు.టీబీ డ్యాంకు నూతన శోభబొమ్మనహాళ్: తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో డ్యాంకు నూతన శోభ వచ్చింది. ఆదివారం 52,815 క్యూసెక్కులు నదికి, 6 వేల క్యూసెక్కుల నీటిని వివిధ కాలువలకు పంపారు. డ్యాంలో ప్రస్తుతం 77 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుకుని, మిగిలిన నీటిని నదికి వదిలుతున్నారు. మరో 4 రోజుల్లో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడతో ఆయకట్టు రైతులు వరినారు సాగుతో పాటు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రసుత్తం తుంగభద్ర జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,625.21 అడుగులకు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 52,805 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో 62,027 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 77.180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,593.19 అడుగుల వద్ద 13.900 టీఎంసీల నీటి నిల్వంతో, 25,556 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 190 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండిందని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. -
కనుల పండువగా ఆషాఢ ఏకాదశి
ప్రశాంతి నిలయం: సత్యసాయి భక్తుల నడుమ ప్రశాంతి నిలయంలో ఆషాఢ ఏకాదశి వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఆదివారం ఉదయం మహారాష్ట్ర, గోవా సత్యసాయి భక్తులు సాయిని కీర్తిస్తూ దిండి పల్లకీని ఊరేగింపుగా మహాసమాధి చెంతకు తీసుకువచ్చారు. పాండురంగడు.. సత్య సాయిల అవతార లక్ష్యం ఒక్కటేనన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. సనాతన భారత చరిత్రలో అనేకమంది సాధువులు మనిషిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన తీరును చక్కగా వివరించారు. సాయంత్రం మహారాష్ట్ర, గోవా బాలవికాస్ చిన్నారులు ‘వాల్యూస్ వర్సెస్ వాల్యూస్’ పేరుతో మనిషి నిత్య జీవితంలో విలువలు పాటించాల్సిన ఆవశ్యకతను, పురాణాల ఆధారంగా విలువల ప్రాముఖ్యతను వివరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఆకట్టుకున్న సత్యసాయి బాల వికాస్ చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన -
పరిశ్రమల జాడేదీ..?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడాదిగా విచిత్ర పరిస్థితి నెలకొంది. ‘మిమ్మల్ని లక్షాధికారులను చేస్తాం, ఇంటింటికీ ఉద్యోగమిస్తాం, లేకుంటే నిరుద్యోగ భృతి అందిస్తాం’ అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన టీడీపీ నేతల నోట ఆ మాటే నేడు రావడం లేదు. ఆ మాటలు ఇప్పుడు వారికి కొరగానివిగా తయారయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా రాప్తాడు, పెనుకొండ, హిందూపురం ప్రాంతాలు చిన్న, సూక్ష్మ, భారీ పరిశ్రమలకు అనుకూలం. కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు ప్రాంతాల్లోనూ ఇప్పటివరకూ ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. ఎంఎస్ఎంఈల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అరాచకాలతో రాంరాం.. జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం పరిశ్రమల ఏర్పాటుకు బాగా అనుకూలమని చెబుతారు. నియోజక వర్గం గుండా జాతీయ రహదారి వెళ్తుండడం, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగంగా చేరుకునే అవకాశం తదితర సానుకూలతలున్నా హత్యలు, భూకబ్జాలు, ఆక్రమణలు, రౌడీయిజం, దొంగతనాలు వెరసి చిన్న పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. శాంతిభద్రతలు అదుపుతప్పడంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు రావడానికి వెనకాడుతున్నారు. గడిచిన ఏడాదిలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన పాపాన పోలేదు. ‘కొత్త పారిశ్రామిక పాలసీ తెచ్చాం, పెట్టుబడులు పెట్టండి’ అంటూ అధికారులు ఎంత బతిమాలినా ‘మాకొద్దు బాబూ’ అంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలు రాకపోవడంతో పాటు ఉన్న ఉద్యోగాలకు కూడా గండం ఏర్పడింది. పెనుకొండ.. హిందూపురంలోనూ అంతే పెనుకొండ, హిందూపురం ప్రశాంతంగా ఉండే పట్టణాలు. అలాంటిది నేడు రాజకీయ నాయకుల అండతో టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. స్వయానా ప్రజాప్రతినిధులే ఉసిగొలిపి ఇదంతా చేయిస్తున్నారు. పెనుకొండలో ఓ రీమిక్స్ప్లాంట్ యాజమాన్యాన్ని స్వయానా మంత్రి బెదిరించడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. చిన్న పరిశ్రమ నెలకొల్పడానికి ఎవరైనా వచ్చినా వసూళ్లకు తెగబడుతున్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే పీఏలుగా చెప్పుకుంటూ కొందరు చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి సర్కారు వచ్చినప్పటినుంచీ అక్కడ ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. మద్యం, జూదం తీవ్రస్థాయిలో జరుగుతుండటంతో పెట్టుబడిదారులు హిందూపురం రావడానికి మొగ్గు చూపడం లేదు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం అదీ ఇవ్వలేదు. ఏడాది ముగిసినా చిన్న పరిశ్రమకూ దిక్కులేదు లక్షల్లో ఉద్యోగాలని ఒక్కటీ ఇవ్వలేదు ఎంఎస్ఎంఈలు పెట్టడానికీ మొగ్గుచూపని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాప్తాడులో దారుణ పరిస్థితుల నేపథ్యంలో అటువైపే చూడని వైనం పెనుకొండ, హిందూపురం పట్టణాల్లోనూ ఇంతే... ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతీ అందక అల్లాడిపోతున్న నిరుద్యోగులు -
కోలాహలంగా పెద్దసరిగెత్తు
● ఖాశీంస్వామిని దర్శించుకున్న భక్తులు బత్తలపల్లి: మండల కేంద్రం బత్తలపల్లిలో బొప్పేపల్లి ఖాశీంస్వామి మొహర్రం ఉత్సవాల్లో కీలక ఘట్టం ఆదివారం పెద్ద సరిగెత్తు కోలాహలంగా సాగింది. హిఽందువులు, ముస్లింలు కలసికట్టుగా పెద్దసరిగెత్తు నిర్వహించారు. ఉదయం నుంచే ముజావర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పీర్లస్వాములకు చక్కెర, పానకాలు చదివించి మొక్కులు తీర్చుకున్నారు. పీర్లను పూలు, వస్త్రాలతో అలంకరించి గుండం చుట్టూ తిప్పారు. రాత్రంతా గుండంలోకి మొద్దులను వేసి రగిలించి అలావు తొక్కారు. వివిధ వేషధారణలతో ఉన్న వ్యక్తులు వరస అయిన వారి వద్దకు వెళ్లి గుండంలోని బూడిదను పూసి ఆనందం వెలిబుచ్చారు. బత్తలపల్లి ఎస్సీ కాలనీ మహిళలు పానకం దుత్తలతో ఊరేగింపుగా వెళ్లడం ఆకట్టుకుంది. గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి, రాఘవంపల్లి, ఈదుల ముష్టూరు గ్రామాల్లో పెద్దసరిగెత్తు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ సోమశేఖర్ గ్రామపెద్దలకు సూచించారు. నేడు భేటీ..: బత్తలపల్లిలోని నాలుగు రోడ్ల కూడలిలో సోమవారం ఉదయం 9 గంటలకు వివిధ గ్రామాల పీర్లు భేటీ అవుతాయి. ఈ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. భేటీని తిలకించేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ను బైపాస్ మీదుగా మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటలలోపు భేటీ ముగించాలని ఆయా గ్రామాల పెద్దలకు పోలీసులు సూచించారు. -
భక్తరపల్లిలో రేపు భూతప్ప ఉత్సవాలు
మడకశిర రూరల్: తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని భక్తరహళ్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద భూతప్ప ఉత్సవాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మినీ భూతప్ప ఉత్సవాలు ఉంటాయని దేవదాయశాఖ అధికారులు తెలిపారు. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారు, సంతానం లేని మహిళలు ఉత్సవాలకు భారీగా తరలివస్తారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. ఈమేరకు ఏర్పాట్లు చేసింది. జాతీయస్థాయి హాకీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ధర్మవరం: జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న 15వ జాతీయస్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు జిల్లాకు చెందిన క్రీడాకారిణులు మధురిమ బాయి, వైష్ణవి, వర్ష ఎంపికయ్యారని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ శనివారం తెలిపారు. అలాగే కేరళ రాష్ట్ర జట్టుకు తలారి హేమ ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారిణులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్, జిల్లా గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, ఉపాధ్యక్షులు ఉడుముల రామచంద్ర, గౌరీప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ కార్యదర్శి అరవింద్‌గౌడ్, చందు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ హాకీ కోచ్ హస్సేన్, డైరెక్టర్లు మారుతి, ఇర్షాద్, అమునుద్దిన్, కిరణ్ హర్షం వ్యక్తం చేశారు. రేపు ఫుట్‌బాల్ జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికహిందూపురం టౌన్: పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో సోమవారం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్ జూనియర్స్ బాల, బాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు జేవీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. 2012 జనవరి 1 నుంచి 2013 డిసెంబర్ 31 లోపు జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల వారు తమ ఆధార్, బర్త్ సర్టిఫికెట్, మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని రేపటి ఎంపిక కార్యక్రమానికి రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా కార్యదర్శి మహమ్మద్ సలీమ్‌ను 80995 98958 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. పారిశుధ్య కార్మికునికి పాముకాటు ధర్మవరం అర్బన్: పట్టణంలోని ఎర్రగుంట రైల్వే బ్రిడ్జి సమీపంలోని పార్కు వద్ద శనివారం శుభ్రం చేస్తున్న సమయంలో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికుడు శాంతమూర్తికి పాము కాటు వేసింది. గట్టిగా కేకలు వేయడంతో తోటి కార్మికులు వచ్చి ఆయన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్సన్ కార్మికుడు శాంతమూర్తిని ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు ప్రథమ చికిత్స అనంతరం కార్మికుడిని పుట్టపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శాంతమూర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని తోటి కార్మికులు తెలిపారు. ఇదిలా ఉండగా కాటు వేసిన పామును కార్మికులు పార్కులోనే చంపేశారు. -
సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి
పుట్టపర్తి టౌన్: సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుని నేరాల నియంత్రణకు గట్టిగా కృషి చేయాలని స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి ఎస్పీ రత్న సూచించారు. శనివారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో సమావేశం నిర్వహించి కిట్లు, లెదర్ బ్యాగులు పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత అధునిక యుగంలో సాంకేతిక నైపుణ్యాలను ప్రతి పోలీస్ అధికారి మెరుగుపరుచుకోవాలన్నారు. నేర నియంత్రణలో స్పెషల్ బ్రాంచ్ పాత్ర కీలకమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో గొడవలు జరగకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం తెలుకొని నియంత్రణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఆర్ఐ వలి, సోషల్ మీడియా ఎస్ఐ మునిప్రతాప్తోపాటు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. -
మోసపోతున్నా.. మేలుకోరా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆశ ఉండొచ్చుగానీ.. అత్యాశ ఉండకూడదు అంటారు. ఈ అత్యాశే వేల మందిని ముంచేసింది. డబ్బు పోగొట్టుకునేలా చేసింది. రోజుకో యాప్.. రోజుకో సైబర్ మోసం పత్రికల్లో చూస్తూనే ఉన్నా ఎగబడి మరీ కట్టేశారు. చివరకు బిచాణా ఎత్తేస్తే గానీ వాని అసలు విషయం తెలియరాలేదు. వారం రోజుల క్రితం ‘లుక్ యాప్’ గొలుసుకట్టు ఫైనాన్స్ పేరుతో బురిడీ కొట్టించిన కేసులో ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది రూ.30 కోట్లు పైనే పోగొట్టుకున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయులు..ఐటీ ఉద్యోగులూ.. పిల్లలకు జీవిత పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు సైతం ‘లుక్’ ఉచ్చులో ఇరుక్కోవడం విస్మయం కలిగిస్తోంది. రూ.20 వేలు కడితే రోజూ రూ.700 ఇస్తామని అనడంతో రెండు జిల్లాలో సుమారు 800 మందికి పైగా ఉపాధ్యాయులు ‘యాప్’లో డబ్బులు పోశారు. ఇక ఐటీ ఉద్యోగులు వచ్చే జీతాలు సరిపోకనో లేదా అత్యాశకు వెళ్లారో గానీ వేలకు వేలు ఎగబడి కట్టారు. చివరకు మాయగాళ్లు మొత్తం ఊడ్చుకుని నిండా ముంచేశారు. అనంతపురంలోని కమలానగర్లో వ్యాపారులు ఒకరికి తెలియకుండా ఒకరు భారీ సంఖ్యలో డబ్బులు కట్టి మోసపోయినట్టు తెలుస్తోంది. లుక్ యాప్ ఎక్కడిదో, యజమాని ఎవరో, కార్యాలయం ఎక్కడో ఎవరికీ తెలియదు. వేలం వెర్రిగా కట్టేశారంతే! గతంలో మోసాలు జరిగినా... గతంలో అనంతపురం జిల్లా కేంద్రంగా భారీ స్కాములు జరిగాయి. ఈ–బిడ్ పేరుతో లక్ష రూపాయలు కడితే నెలకు రూ.30 వేలు ఇస్తామని చెప్పగా వేల మంది కట్టారు. నాలుగైదు నెలలు బాగానే ఇచ్చారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. రూ.230 కోట్ల మేర బాధితులకు శఠగోపం పెట్టారు. దీంతో కొంతమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత జయలక్ష్మి అనే మహిళ రూ.30 కోట్ల మేరకు చిట్టీల పేరుతో కుచ్చుటోపీ పెట్టింది. తర్వాత కొద్దిరోజులకే ఆదరణ చిట్స్ పేరుతో రూ.50 కోట్లు ఎగ్గొట్టారు. ఇలా పలు ఘటనలు జరిగినా అత్యాశకు పోవడం వల్లే మోసపోతున్నట్టు తెలుస్తోంది. ‘లుక్’ యాప్ బాధితులు 20 వేల మంది పైనే అత్యాశే కొంప ముంచిన వైనం బాధితుల్లో ఉపాధ్యాయులు, ఐటీ ఉద్యోగులూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ ముందుకు రాలేక ఇబ్బంది అనంతపురం నగరంలో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న పరమేష్.. తన పిల్లలకు స్కూలు ఫీజులకై నా డబ్బులు సంపాదించచ్చనే ఉద్దేశంతో ‘లుక్’ యాప్‌లో రూ.20 వేలు కట్టాడు. కట్టిన నాలుగు రోజులకే కంపెనీ మూసేశారు. దీంతో వారం రోజుల నుంచి బ్యాంకుకు సెలవు పెట్టి ఇంట్లోనే కూర్చున్నాడు. వీరిద్దరే కాదు.. ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ‘లుక్’ బాధితులు వేలల్లోనే ఉన్నారు. కురుగుంటకు చెందిన సురేష్ రూ.40 వేలు లుక్ యాప్‌లో డిపాజిట్ చేశాడు. నాలుగు రోజులు బాగానే సంపాదించాడు. ఈ క్రమంలోనే మరో 10 మందిని చేర్పించాడు. వారం రోజుల తర్వాత చూస్తే మొత్తం కంపెనీ ఎత్తేశారు. తనతో పాటు తాను కట్టించిన వారి డబ్బంతా పోయింది. దీంతో అవమానంగా భావించిన సురేష్ ఇటీవల ఇంటి నుంచి అసలు బయటకు రావడం లేదు. -
సాయి నామం.. దివ్య చరితం
ప్రశాంతి నిలయం: ఆశాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర, గోవా సత్యసాయి భక్తులు చేపట్టిన ఆశాడీ దిండి పర్తియాత్ర శనివారం ప్రశాంతి నిలయం చేరుకుంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజు యాత్రికులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం యాత్రికులు సత్యసాయి మహాసమాధి చెంత పల్లకీని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. అంతకుముందు వారు ధర్మవరం రైల్వేష్టేషన్లో రెండు రోజుల క్రితం దిగి అక్కడి నుంచి సత్యసాయి పల్లకీని ఊరేగిస్తూ పాదయాత్రగా పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి వేషధారణలో సత్యసాయి బోధించిన మానవతా విలువలను ప్రచారం చేస్తూ పాదయాత్ర సాగించారు. అలరించిన సంగీత కచేరీ ఆశాఢ ఏకాదశి సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఆర్యా అంబేకర్ బృందం నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. ఆశాఢ ఏకాదశి విశిష్టతను వివరిస్తూ చక్కటి భక్తిగీతాలను ఆలపించారు. బాలవికాస్ చిన్నారులు ఆశాఢ ఏకాదళి వైభవాన్ని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి అవకాశం
పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర కమిటీలో చోటు లభించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాప్తాడుకు చెందిన కురుబ నాగిరెడ్డి, గంగన గోపాల్‌రెడ్డి, ముదిగుబ్బకు చెందిన వీరాంజనేయులు, అంకే లక్ష్మన్న, పుట్టపర్తికి చెందిన పి.సుధాకరరెడ్డి, జి.శేషురెడ్డిలను నియమించారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో చోటు పుట్టపర్తి టౌన్: వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర కమిటీల్లో జిల్లా నుంచి పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యువజన విభాగం అధికార ప్రతినిధిగా వి.అమరనాథరెడ్డి (ధర్మవరం), రాష్ట్ర వలంటీర్ల విభాగం జోనల్ ప్రెసిడెంట్‌గా టి.గంగాధర్‌రెడ్డి (పెనుకొండ), ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా డి.లక్ష్మానాయక్ (ధర్మవరం) స్టేట్ పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా కె.సురేష్‌కుమార్‌రెడ్డి (హిందూపురం) స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా జి,రమేష్ (ధర్మవరం) స్టేట్ పంచాయతీ వింగ్ జనరల్ సెక్రటరీగా కె.నాగరాజు (పుట్టపర్తి)స్టేట్ పంచాయితీ వింగ్ సెక్రటరీగా కె. రవీంద్రరెడ్డి ( పుట్టపర్తి )నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ‘కొర్రపాడు’ అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనంతపురానికి చెందిన కొర్రపాడు హుస్సేన్‌పీరా, రాష్ట్ర కార్యదర్శిగా బి.రాజాశేఖర్‌రెడ్డి (రాజారెడ్డి)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్వర్వులు అందాయి. -
బొలెరో.. బైక్ ఢీ: ఇద్దరు మృతి
బత్తలపల్లి: అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై బత్తలపల్లి బైపాస్ రోడ్డులోని వేల్పుమడుగు క్రాస్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. మండలంలోని గంటాపురం గ్రామానికి చెందిన ఓబిలేసు(38) శనివారం ఉదయం తన బైక్‌పై బత్తలపల్లి నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. ఇదే సమయంలో పీర్లను దర్శించుకునేందుకు గంటాపురం వెళ్లేందుకు రోడ్డుపై ఉన్న సదాశివ(32)ను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. వీరి వాహనం బత్తలపల్లి బైపాస్ వద్ద వేల్పుమడుగు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో అనంతపురం నుంచి తమిళనాడుకు జీవాలతో వెళ్తున్న బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వారిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్, ఏఎస్ఐ సోమశేఖర్‌మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను హైవే అంబులెన్స్‌లో ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గంటాపురం గ్రామస్తులు, మృతుల బంధువులు సంఘటనాస్థలానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్జీవంగా ఉన్న తమ వారిని చూసి వారంతా కన్నీరు మున్నీరయ్యారు. ఓబిలేసుకు భార్య రమణమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సదాశివకు భార్య శివకాంతతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రమణీయం.. రథోత్సవం
హిందూపురం: ‘హరేరామ... హరే కృష్ణ’ నామస్మరణతో హిందూపురం పురవీధులు మార్మోగాయి. హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బహుద రథయాత్ర హిందూపురంలో వైభవంగా సాగింది. తొలుత స్థానిక పాలిటెక్నికల్ కళాశాల కృష్ణాలాండ్ వద్ద గోవింద చరణ్ దాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవీ ఉత్సవమూర్తులకు పూజలు చేసి ప్రత్యేకంగా సిద్ధం చేసి 32 అడుగుల రథంలో కొలువుదీర్చారు. అనంతరం ఆశేష భక్త జనుల నడుమ ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర బైపాస్‌రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సర్కిల్, వాసవీధర్మశాల ఫంక్షన్ హాలు మీదుగా వాల్మీకి భవన్‌కు చేరింది. రథయాత్రలో మహిళలు కోలాటం, చిన్నారులు భరతనాట్యం చేశారు. కృష్ణ సంకీర్తనలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. వాల్మీకి భవన్ వద్ద శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీసీ నాయకులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, కొటిపి హనుమంతరెడ్డి పాల్గొన్నారు. వైభవంగా జగన్నాథుడి రథయాత్ర పురంలో మార్మోగిన శ్రీకృష్ణ నామస్మరణ -
అమాయకుల జోలికెళ్తే ఊరుకోం
పుట్టపర్తి అర్బన్: అధికారం ఉంది కదా అని అమాయకుల జోలికి వెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కూటమి నాయకులను హెచ్చరించారు. ఐదురోజుల క్రితం పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వీరనారప్ప కుటుంబీకులకు చెందిన మామిడి తోటలో సుమారు 300 చెట్లను ప్రత్యర్థులు నరికి వేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి శనివారం పార్టీ నాయకులతో కలిసి వెంగళమ్మచెరువుకు వెళ్లారు. మామిడి తోటకు వెళ్లి దుండగులు నరికిన చెట్లను పరిశీలించారు. బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక నగరిగా పేరొందిన పుట్టపర్తిలోనూ రెడ్‌బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందన్నారు. చెట్లు నరికే విష సంస్కృతికి కూటమి నేతలు బీజం వేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎంతో కాలం ఉండదన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ప్రజలు, రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. రైతులు ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడి చెట్లను నరికి వేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచే పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతు వీరనారప్ప కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి వెంట ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ తిప్పన్న, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు ఈశ్వరయ్య, రవినాయక్, మాజీ కన్వీనర్లు నరసారెడ్డి, గంగాద్రి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఈశ్వరరెడ్డి, తిప్పారెడ్డి ఉన్నారు. రాజకీయ కక్షతో పచ్చని చెట్లు కొట్టడం దుర్మార్గం మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి -
పుట్టపర్తిలో ఇసుక తోడేళ్లు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు సహజ వనరులపై కన్నేశారు. ముఖ్యంగా బాగా డిమాండ్ ఉన్న ఇసుకనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికారం అడ్డు పెట్టుకుని.. అధికారులను మామూళ్ల మత్తులో జోకొట్టి.. నదుల నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది నుంచి పట్టపగలే ట్రాక్టర్ల ద్వారా భారీగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక రవాణాకు ప్రత్యేక వ్యవస్థ కూటమి నేతలు కొందరు సిండికేటుగా మారి చిత్రావతి నదిలో ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. చిత్రావతి నదిలోకి ట్రాక్టర్లు వెళ్లేందుకు పుట్టపర్తి దుర్గమ్మ గుడి పక్క నుంచి రోడ్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి హారతి ఘాట్ మీదుగా కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జి వరకు ఇసుక ట్రాక్టరుకు ముందుగా రెండు బైకులు వెళ్తుంటాయి. ఏదైనా ఇబ్బందులుంటే బైక్‌పై ఉన్న వ్యక్తులు ముందే సమాచారం ఇస్తారు. అలాగే ఇసుక ట్రాక్టర్ వెనుక కూడా రెండు బైకులు వస్తుంటాయి. వెనుక నుంచి ఎవరు వచ్చినా బైక్‌లపై ఉన్న వారు చూసుకుంటారు. ఇలా కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జి వరకూ ఇసుక ట్రాక్టర్లకు రక్షణగా వెళ్తారు. ఇలా ఇసుక ట్రాక్టర్‌కు రక్షణగా వెళ్లినందుకు ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.500 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. డబ్బులు ఇవ్వని ట్రాక్టర్ల సమాచారం పోలీసులకు ఇచ్చి పట్టిస్తారు. ఎనుములపల్లి శివారు నుంచి ఒక సమూహం.. దుర్గమ్మ గుడి దగ్గర నుంచి మరో గ్రూపు.. ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తరలిస్తూ భారీగా వెనుకేసుకుంటున్నారు. కావాలంటే రూ.1,000 తీసుకో.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎవరైనా అధికారి వెళితే...ఆయనకూ మామూళ్ల ఎర వేస్తారు. వినకపోతే వారి ఉన్నతాధికారుల పేర్లు చెప్పి భయపెడతారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం చిత్రావతి నదిలో ఇసుకను ట్రాక్టర్లకు నింపుతుండగా.. ఇరిగేషన్ అధికారి ఒకరు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అయితే ‘మీ పై అధికారులకు లంచం ఇచ్చాం. ఈ రోజంతా తరలిస్తూనే ఉంటాం. నీకూ కావాలంటే రూ.వెయ్యి ఇస్తాం. ఈ రోజంతా ఇటు వైపు చూడొద్దు. కాదు.. కూడదు అంటే ఇష్టం వచ్చింది చేస్కో. ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. మా ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు అడ్డుకునేది’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో సదరు అధికారి మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెనక్కు వచ్చారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాకపోతే పోలీసులు వచ్చే లోపు ఇసుకాసురులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇలా వారు తప్పించుకుని వెళ్లేందుకు కూడా కొందరు సహకరించినట్లు తెలుస్తోంది. చిత్రావతి నదిని తోడేస్తున్న ‘తమ్ముళ్లు’ పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక దోపిడీ ప్రశ్నించిన ఓ ఇరిగేషన్ అధికారికి బెదిరింపులు ఉన్నతాధికారులకు భారీగా సమర్పించుకున్నామని వెల్లడి -
లోక్ అదాలత్‌లో 10,089 కేసుల పరిష్కారం
అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 10,089 కేసులు పరిష్కారమయ్యాయి. అనంతపురం జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌ను ప్రధాన న్యాయమూర్తి భీమారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉండదన్నారు. రెగ్యులర్ కోర్టులో కేసులు పరిష్కారమైతే ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంటుందని, అదే లోక్ అదాలత్‌లో అయితే ఇరు పార్టీలు సంతోషంగా ఇంటికి చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్, మొదటి అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, బార్ అసోసియేట్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో మోటారు వాహనాల ప్రమాద కేసులు 28 పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.1,57,55,000 నష్ట పరిహారం ఇప్పించారు. సివిల్ కేసులు 75 పరిష్కారమయ్యాయి. వీటి విలువ రూ.5,35,59,388. ప్రీలిటిగేషన్ కేసులు 3,876 పరిష్కారం కాగా, ఇందులో మొత్తం రూ.1,98,98,382. ఎన్ఐ యాక్ట్ కేసులు– 22 మొత్తం రూ.31,50,000. 10న మెగా పీటీఎం సమావేశాలు ప్రశాంతి నిలయం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 10న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ వి.రత్నతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి మెగా పీటీఎం సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థీ తల్లిందడ్రులతో కలసి పీటీఎంకి హాజరు కావాలని, ఉపాధ్యాయులందరూ విధిగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరిస్తారన్నారు. అలాగే ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈఏడాది ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతిలో 20,789 మంది, 6వ తరగతిలో 24 వేల మంది చేరారన్నారు. డ్రాప్ అవుట్స్ నివారించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. సామాజిక భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే పీ–4 కార్యక్రమం లక్ష్యమన్నారు. తల్లికి వందనంకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 14,703 ఫిర్యాదులు అందాయని, అందులో 10,803 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. మిగిలిన ఫిర్యాదులను మరోసారి పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. -
మార్కెటింగ్ కల్పించాలి
అన్‌సీజన్ కారణంగా పట్టుచీరల అమ్మకాలు బాగా తగ్గాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా షోరూం నిర్వాహకులు ఆషాఢం డిస్కౌంట్ ఇవ్వాలంటున్నారు. దీంతో మేం నష్టపోతున్నాం. ప్రభుత్వం పట్టుచీరల వ్యాపారులకు సొసైటీల ద్వారా అన్‌సీజన్‌లో పట్టు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుంది. అలాగే పరిశ్రమల శాఖ నుంచి రాయితీ రుణాలను అందివ్వాలి. చేనేత కార్మికులకు ముడిపట్టురాయితీలు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పట్టుచీరల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. – రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం. తీవ్రంగా నష్టపోతున్నాం ఆషాఢం ఎఫెక్ట్ పట్టుచీరల వ్యాపారంపై తీవ్రంగా చూపుతోంది. ఇప్పటికే చేనేత సంక్షోభం కారణంగా పట్టుచీరల ఉత్పత్తి తగ్గింది. అన్‌సీజన్ కారణంగా రూ.లక్షల పెట్టుబడి స్తంభించిపోతోంది. ఆషాఢం డిస్కౌంట్ సేల్స్, అన్‌సీజన్ పట్టుచీరల వ్యాపారులకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – నరేంద్ర, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం. -
మొహర్రం.. ఆధ్యాత్మిక సౌరభం
బత్తలపల్లి: మొహర్రం సందర్భంగా ఆధ్యాత్మిక సౌరభాలు వికసిస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం బత్తలపల్లిలోని ఖాసీంస్వామి పీర్లు భేటీకి రావాలని వివిధ గ్రామాల పీర్లకు ఆహ్వానం పలికేందుకు గ్రామాల పర్యటనకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. ఉదయం గ్రామోత్సవం.. బత్తలపల్లి, గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి గ్రామాల్లో ఉదయం పీర్లకు గ్రామోత్సవం నిర్వహించారు. వందలాది మంది భక్తులు పీర్లు వెంట నడిచారు. తమ ఇళ్ల వద్దకు వచ్చిన పీర్లకు భక్తులు చక్కెర చదివించారు. అలావ్ తొక్కుతూ సందడి చేశారు. అనంతరం బత్తలపల్లి పీర్లు గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రికి వెళ్లగా.. ఆయా గ్రామాల పెద్దలు పీర్లతో ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం బత్తలపల్లి పీర్లు రాత్రికి మకాన్‌కు చేరుకున్నాయి. కాగా, మొహర్రం ఉత్సవాల్లో భాగంగా పీర్లస్వాముల వెంట వచ్చిన భక్తులకు, ప్రజలకు మాజీ సర్పంచు సింగారం నాగేష్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అదేవిధంగా బత్తలపల్లి ఎస్సీ కాలనీవాసుల ఆధ్వర్యంలోనూ అన్నదాన కార్యక్రమం జరిగింది. భేటీకి వివిధ గ్రామాల పీర్లకు స్వాగతం పలికిన బత్తలపల్లి పీర్లు ఆయా గ్రామాల్లో బత్తలపల్లి పీర్లకు ఘనస్వాగతం -
గూగూడుకు పోటెత్తిన భక్తులు
నార్పల మండలం గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున చిన్నసరిగెత్తు సందర్భంగా అర్చకులు హుసేనప్ప కుళ్లాయిస్వామి పీరును ప్రత్యేక పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. కుళ్లాయిస్వామి– ఆంజనేయస్వామి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కాసేపు తొక్కిసలాట జరిగింది. చిన్న సరిగెత్తులో భాగంగా స్వామి వారి భక్తులు ఫకీర్లుగా మారి జలధి పోయే వరకు నియమనిష్టగా ఉంటారు. – నార్పల/ సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
కార్మికుల జీవితాలతో చెలగాటమొద్దు
అనంతపురం అర్బన్: కార్మికుల జీవితాలతో చెలగాటమాడరాదని కూటమి ప్రభుత్వాన్ని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు హెచ్చరించారు. ఏడు నెలలుగా బకాయిపడిన వేతనాన్ని తక్షణమే చెల్లించాలంటూ శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఐఎఫ్టీయూ ఏసురత్నం, రైతు కూలీ సంఘం రాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం రామకృష్ణ మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు మాట్లాడుతూ.. నెలలుగా వేతనం చెల్లించకపోతే కార్మికులు ఎలా బతుకుతారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వేతనాలు చెల్లించాలంటూ 85 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ఇటు ప్రభుత్వం కానీ, అటు అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. యోగా డే అంటూ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వానికి కార్మిక కుటుంబాల ఆకలి కేకలు వినిపించడం లేదని మండిపడ్డారు. తక్షణమే ఏడు నెలల వేతన, 40 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఏబీఆర్ నుంచి హిందూపురం వరకూ ట్రంక్‌లైన్ కార్మికులకు ఆరు నెలల వేతనాలు, 26 నెలల పీఎఫ్ బకాయి చెల్లించాల్సి ఉందన్నారు. ఫేస్–4 కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర కార్మికులకు రెండు నెలల వేతనం, 18 నెల పీఎఫ్, మడకశిర కార్మికులకు మూడు నెలల వేతనం, 36 నెలల పీఎఫ్, హిందూపురం కార్మికులకు 15 నెలల వేతనం, 15 నెలల పీఎఫ్ చెల్లించాల్సి ఉందన్నారు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ కార్మికులకు బకాయిలు చెల్లించినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.5 కోట్ల నిధులు విడుదలైనట్లు కలెక్టర్ ఐదు రోజుల క్రితం ప్రకటించారని, అయితే ఆ డబ్బు నేటికీ కార్మికుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. కార్మికుల బకాయిలు పూర్తిగా చెల్లించే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రిస్వామి, రాము, తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు ఏడు నెలల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలి అనంత కలెక్టరేట్ ఎదుట ధర్నా మద్ధతు పలికి న సీపీఎం, వైఎస్సార్‌టీయూ, ఐఎఫ్టీయూ, రైతుసంఘాలు -
ధర పట్టుకుంది
ఇంత కాలం నష్టాలు చవి చూసిన పట్టుగూళ్ల రైతులు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వారం రోజులుగా పట్టుగూళ్ల ధరలు స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో పట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ధరలు మరికొంత కాలం నిలకడగా కొనసాగాలని కోరుకుంటున్నారు. మడకశిర: జిల్లాలో మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో బైవోల్టిన్ పట్టు సాగు చేసే రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో దాదాపు 20వేల మంది పట్టు రైతులు బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు పెరుగుతుండడంతో హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్లో సందడి నెలకొంది. గతమంతా నష్టాలే.. ఐదారు నెలలుగా పట్టుగూళ్లకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతూ వచ్చారు. కిలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర రూ.600లోపే ఉండేది. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కొన్ని రోజులుగా బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. కిలో పట్టుగూళ్లు గరిష్టంగా రూ.600కు పైగా ధర పలుకుతోంది. ఈ నెల 2న గరిష్ట ధర రూ.655కు చేరుకుంది. 3న స్వల్పంగా తగ్గి గరిష్టంగా రూ.630తో క్రయ విక్రయాలు సాగాయి. తాజాగా మార్కెట్‌కు శుక్రవారం దాదాపు 1,541 కిలోల పట్టుగూళ్లను రైతులు తీసుకురాగా, ధర గరిష్టం రూ.648కు ఎగబాకింది. పెరుగుతున్న క్రయవిక్రయాలు మార్కెట్లో ధర నిలకడగా కొనసాగుతుండడంతో హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్లో క్రయ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. గత 8 రోజుల్లోనే 39,180 కిలోల బైవోల్టిన్ పట్టుగూళ్లు హిందూపురం మార్కెట్లో అమ్మకానికి రైతులు తీసుకువచ్చారు. వారం రోజుల క్రయవిక్రయాలను పరిశీలిస్తే... జూన్ 26న మార్కెట్‌కు 6,272 కిలోల పట్టుగూళ్లను రైతులు తీసుకువచ్చారు. అలాగే అదే నెల 27న 7,140 కిలోలు, 28న 6,847 కిలోలు, 29న 7,130 కిలోలు, 30న 4,061 కిలోల చొప్పున బైవోల్టిన్ పట్టు గూళ్ల క్రయవిక్రయాలు సాగాయి. ఈ నెల 1న 1,705 కిలోలు, 2న 3,641 కిలోలు, 3న 2,384 కిలోల పట్టు గూళ్లను మార్కెట్లో రైతులు విక్రయించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తుండడంతో పట్టుగూళ్ల ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రోత్సాహక ధనం విడుదలపై నీలి నీడలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బైవోల్టిన్ పట్టు రైతులకిచ్చే ప్రోత్సాహక ధనాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ నయా పైసా కూడా చెల్లించలేదని వాపోతున్నారు. ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్లలో విక్రయించే బైవోల్టిన్ పట్టుగూళ్లకు ప్రతి కిలోకు రూ. 50 చొప్పున ప్రోత్సాహక ధనాన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఈ ప్రోత్సాహక ధనాన్ని చెల్లించలేదు. దీంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రోత్సాహక ధనాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని పలుమార్లు విజయవాడకు పట్టు రైతుల సంక్షేమ సంఘం నాయకులు వెళ్లి కూటమి ప్రభుత్వ పెద్దలను కలసి విన్నవించారు. అయినా ఫలితం దక్కలేదు. క్రమేణ పెరుగుతున్న బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు కొన్ని రోజుల క్రితం కిలో రూ.600 లోపే,, తాజాగా రూ.655 వరకు గరిష్ట ధర -
పేకాటరాయుళ్ల అరెస్ట్
బత్తలపల్లి: స్థానిక మారుతీనగర్‌లో పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. వివరాలను ఆయన వెల్లడించారు. అందిన పక్కా సమాచారంతో శుక్రవారం మారుతీనగర్‌లోని జొన్నలగడ్డ రంగనాయుడు ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్డు వద్దకు డీఎస్పీ హేమంత్‌కుమార్‌తో పాటు సిబ్బంది చేరుకున్నారు. ఆ సమయంలో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1,01,050 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. తనిఖీల్లో స్థానిక పోలీసులతో పాటు డీఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. హత్య కేసు నమోదు ధర్మవరం అర్బన్: ఈ ఏడాది మే 29న గుర్తు తెలియని వ్యక్తులు ధర్మవరంలోని గీతానగర్‌లో నివాసముంటున్న చింతా రమాదేవి(55) ఇంట్లో చొరబడి ఆమె గొంతుకు తాడు బిగించి హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం మృతి చెందడంతో దుండగులపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. కాగా, ఆమె భర్త సుబ్రహ్మణ్యం కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. ఒంటరిగా జీవిస్తున్న తన తల్లిపై హత్యాయత్నం చేశారంటూ కూతురు దీపిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
కలుషిత ఆహారం అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి
● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుల డిమాండ్ ధర్మవరం రూరల్/పుట్టపర్తి: సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీలో గురువారం కలుషిత ఆహారం అందించి 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పురుషోత్తం రాయల్, వేముల అమర్నాథ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్మవరంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువకుడి ఆత్మహత్య పరిగి: ఉద్యోగం రాలేదన్న బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన శ్రీరాములు కుమారుడు కురుబ సోమశేఖర్ (29) మెకానికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి, నాలుగేళ్ల పాటు బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేశాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. సొంతూరిలోనే మేకలను కాచుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇక తనకు ఉద్యోగం రాదన్న బెంగతో గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు తన తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం వేకువజామున ఇంటికి చేరుకున్న తల్లి తిప్పక్క ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని చూసి బోరున విలపించింది. చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తండ్రి శ్రీరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపారు. ఆక్రమణలు తొలగించకుండానే స్నాన ఘట్టాల నిర్మాణం పుట్టపర్తి అర్బన్: సత్యసాయి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని చిత్రావతి నదిలో నిర్మిస్తున్న స్నాన ఘట్టాలు విమర్శలకు తావిస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో సత్యసాయి శత జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చిత్రావతి నది ఒడ్డున స్నాన ఘట్టాలు, నది తీరం వెంబడి ఇరువైపులా సుమారు కిలోమీటరుకు పైగా రాతితో బండింగ్ పనులు, నది మధ్యన సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం దాదాపు రూ.3.5 కోట్లను వెచ్చిస్తున్నారు. అయితే స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసే స్థలం చాలా వరకూ ఆక్రమణకు గురైంది. ఇలాంటి తరుణంలో ఆక్రమణలు తొలగించకుండా నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదమవుతోంది. ఆక్రమణలు తొలగించకపోతే నది కుచించుకుపోయి, భారీ వర్షాలు కురిస్తే వరద మొత్తం పట్టణంలోకి చొరబడి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఆక్రమణలు తొలగించిన తర్వాతనే స్నాన ఘట్టాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. -
హామీలతో నయవంచన
గోరంట్ల: సూపర్ సిక్స్ సహా 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ప్రజలను నయవంచన చేస్తున్నారని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఓట్లు వేయించుకుని.. అవసరం తీరాక హామీలను గాలికి వదిలేశారని విరుచుకుపడ్డారు. గోరంట్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ‘రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో– చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పోస్టర్లను జిల్లా అధ్యక్షురాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరి ఏడాది దాటినా హామీలు సంపూర్ణంగా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారని దుయ్యబట్టారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం ఇంతవరకూ అందలేదన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా, ఉద్యోగాలు కల్పించకుండా.. నిరుద్యోగ భృతి చెల్లింకుండా యువతను దగా చేశారన్నారు. 18 ఏళ్లు నిండి 59 ఏళ్ల వయసు వరకు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఏడాది దాటినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు వివరించి, ఏ విధంగా మోసం చేశారో ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యకుడు రఘురామిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పాలే జయరాంనాయక్, పట్టణ కన్వీనర్ మేదర శంకర, జిల్లా స్టీరింగ్ కమిటీ మాజీ సభ్యుడు గంపల వెంకటరమణారెడ్డి, ముఖ్యనాయకులు, బూదిలి రవీంద్రారెడ్డి, వానవోలు రాజేంద్రప్రసాద్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
పట్టుచీరల వ్యాపారి బలవన్మరణం
ధర్మవరం అర్బన్: పట్టుచీరల వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెడు అలవాట్లు, క్రికెట్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం.. వ్యసనాలు మానుకోవాలని ప్రాధేయపడినా మారలేదని భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన బండి జగదీష్ (30)కు నేసేపేటకు చెందిన అంజలితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. జగదీష్ పట్టుచీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఏడాది కిందటి నుంచి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌లో సంపాదించిన సొమ్ముతో పాటు బయట అప్పులు చేసి మరీ పెట్టి.. నష్టపోయాడు. పద్ధతి తప్పిన భర్తను తిరిగి మార్చుకోవడానికి భార్య ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. మందలించినా, ప్రాధేయపడినా అతనిలో మార్పు కనిపించలేదు. చేసేదిలేక ఆమె నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికీ జగదీష్ వ్యసనాలను వదులుకోలేదు. భార్య తిరిగి కాపురానికి రాకపోవడం, వ్యసనాలను వీడలేకపోవడంతో మనస్తాపం చెంది గురువారం ఇంట్లోని బాత్రూమ్లోకి వెళ్లి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే జగదీష్ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చెడు అలవాట్లు, బెట్టింగ్తో విపరీతంగా అప్పులు -
అరాచకాలు దాచేసి.. అబద్ధాలు అచ్చేసి!
ఇచ్చిన హామీలే నీటిమూటలనుకుంటే ఇంటింటికీ సుపరిపాలన అంటూ ముద్రించిన కరపత్రాలు మరీ ఘోరంగా ఉన్నాయంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతోంది. హామీలు నెరవేర్చామా లేదా అన్నది చెప్పకుండా చేయని పనులపై అబద్ధాలు అచ్చువేసి కరపత్రాలు పంచుతున్నారు. వీటిని చదువుతున్న సామాన్యులు కూడా అర్థం కాక బిక్కముఖం వేస్తున్న పరిస్థితి. ‘సూపర్ సిక్స్’పై ఎక్కడా ఒక్కమాట కూడా చెప్పకనే.. ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్త్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వ ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న కూటమి ఎమ్మెల్యేలు పంచుతున్న కరపత్రాల్లో ఎస్సీ ఎస్టీ, మైనార్టీ మహిళలపై దాడులు గణనీయంగా తగ్గాయని ముద్రించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన జరిగింది. అనంతపురంలో ఇంటర్ చదివే గిరిజన బాలిక తన్మయి దారుణ హత్యకు గురైంది. ఈ రెండు ఘటనలు జిల్లాలోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక.. కూటమి ప్రభుత్వం వచ్చాక తాడిపత్రిలో ఎస్సీ వర్గానికి చెందిన ఎంపీపీపై దారుణంగా దాడి చేశారు. రాప్తాడు, ధర్మవరం, తాడిపత్రి ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఎస్సీ,ఎస్టీలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. కానీ, వాటన్నింటినీ దాచి దాడులు తగ్గినట్టు చిత్రీకరించడం చర్చనీయాంశమైంది. గంజాయి, డ్రగ్స్ ముఠా పేట్రేగి పోతున్నా కూటమి ప్రభుత్వం వచ్చాక రాయదుర్గం ప్రాంతంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా గంజాయి సాగు చేస్తూ దొరికిపోయాడు. తాడిపత్రిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తూ పోలీసులకు సవాలుగా మారింది. అనంతపురంలో ఇటీవలే గంజాయి బ్యాచ్ పోలీసులకు పట్టుబడింది. హిందూపురంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా అవుతోంది. ఇంత దారుణంగా రెండు జిల్లాలో గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదవుతుంటే.. సురక్షిత ఆంధ్రప్రదేశ్ అని, రౌడీషీటర్లు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఏడాది పాలన కరపత్రాల్లో భజన చేశారు. గుంతల రోడ్లకు గంతలు.. ఉమ్మడి జిల్లాలో గుంతలు పడిన రోడ్లకు కూటమి సర్కారు గంతలు కట్టింది. ఎక్కడ చూసినా రోడ్లు ఛిద్రమై వాహనదారులు ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు రూ.866 కోట్లు విడుదల చేశామని కరపత్రాల్లో పొగుడుకున్నారు. కానీ రోడ్లు బాగుపడకపోగా బిల్లులు మాత్రం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. మరోవైపు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అంటూనే ఇటీవలి కాలంలో కరెంటు కోతలు విపరీతంగా విధించారు. ముందే రెక్కీ.. ఆకస్మికంగా గ్రామాల పర్యటన చేసే పరిస్థితి కూటమి నేతలకు లేదు. ఎక్కడ పర్యటిస్తున్నారో ఆ ప్రాంతానికి ముందురోజే అనుచరులను పంపించి అక్కడ వ్యతిరేకులెవరైనా ఉంటే బుజ్జగిస్తున్నట్టు తెలిసింది. ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంటే వారికి ముందే నచ్చజెప్పి వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇంటింటికీ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న సామాన్యులు వాట్సాప్ గ్రూపుల్లో సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. డ్రైనేజీ, రోడ్లు, కరెంటు స్తంభాలు, డీపీలు, ఆస్పత్రుల్లో వసతులు ఇలా ఒకటేమిటి రకరకాల సమస్యలతో వాట్సాప్ గ్రూపులు మోత మోగుతున్నాయి. ‘సుపరిపాలన’ కరపత్రాల్లో ఎస్సీ, ఎస్టీలపై దాడులు తగ్గాయని ముద్రణ క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితి ‘ఉమ్మడి అనంత’లో పెరిగిన అత్యాచారాలు, హత్య ఘటనలు రైతులకు ఉచిత విద్యుత్ అంటూనే.. విపరీతంగా కోతలు గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం అంటూ పత్రాల్లో భజన -
పద్మనాభుడి మాన్యం.. పరాధీనం
చిలమత్తూరు: హిందూపురంలోని నానెప్ప సత్రం ఎదురుగా ఉన్న సుప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన మాన్యం భూములు వివాదంలో చిక్కుకున్నాయి. శ్రీకంఠపురం పరిధిలోని సర్వే నంబరు 131–3సీలో తనకున్న 17 ఎకరాల్లో రెండు ఎకరాలను 1925లో స్థానిక వైద్యుడు నానెప్ప అనే బ్రాహ్మణుడు అనంత పద్మనాభస్వామి ఆలయానికి దానం చేశారు. మిగిలిన 15 ఎకరాల భూమిలో ఎస్డీజీఎస్ కళాశాల ఉంది. తనకు వారసులెవరూ లేకపోవడంతో ఉన్న భూమిని దానం చేశారు. అప్పటి నుంచి ఆ భూమిలో కొన్నేళ్ల పాటు అక్కడే ఉన్న చంద్రవంక బావి నుంచి నీటిని వినియోగించుకుని పూల మొక్కలు పెంచుతూ వాటి పూలను స్వామి వారి సేవకు వినియోగిస్తూ వస్తున్నారు. కాలక్రమేణ ఆ భూమిలో దేవదాయశాఖ అనుమతితో కొందరు వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని ప్రతి నెలా అద్దెను అప్పటి నుంచి ఇప్పటి వరకూ చెల్లిస్తూ వస్తున్నారు. రూ.80 కోట్ల విలువైన మాన్యంపై కన్నేసి.. హిందూపురం పరిసరాల్లో భూముల విలువ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో పద్మనాభస్వామి ఆలయ మాన్యం విలువ రూ.80 కోట్లకు పైగా చేరుకుంది. దీంతో ఆలయానికి చెందిన రెండు ఎకరాలపై కొందరు ప్రైవేట్ వ్యక్తులు కన్నేశారు. లేని వారసులను సృష్టించి ఆ భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులను లోబర్చుకుని సృష్టించిన పత్రాలను న్యాయస్థానంలో సమర్పించి చివరకు ఆ భూమిని తమ వశం చేసుకున్నారు. ఆ భూమి ఆలయానిదేనంటూ కోర్టుకు దేవదాయశాఖ విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఇదే అంశంపై ఆ భూమిలో దుకాణాలు నిర్వహిస్తున్న పలువురు హిందూ సంఘాల నాయకులతో కలసి ఉద్యమాలు చేపట్టారు. అన్యాక్రాంతమైన ఆ భూమిని తిరిగి ఆలయానికి దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు పట్టని దురాక్రమణ.. అనంత పద్మనాభస్వామి ఆలయ మాన్యం దురాక్రమణపై ప్రజాప్రతినిధులు సైతం పెదవి విప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చివరకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. రూ.80 కోట్లు విలువైన ఆలయ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కోర్టుకు నకిలీ ప్రత్రాలు సమర్పించి తప్పుదోవ పట్టించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రజాప్రతినిధులు సైతం అక్రమార్కులకే వంత పాడుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బావిలో నిధులు కాజేందుకేనా? ఆలయ మాన్యంలోని చంద్రవంక బావిలో అనంత పద్మనాభుడికి చెందిన అపారమైన నిధి, నిక్షేపాలు ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పూర్వం సుల్తానుల బారి నుంచి ఆలయాన్ని కాపాడుకునేందుకు అప్పట్లో విలువైన వజ్ర, వైఢూర్యాలు, బంగారం, ఇతర విలువైన సామగ్రిని బావిలో దాచినట్లుగా స్థానికులు విశ్వసిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు బావిలో నిధులు కాజేందుకు కోర్టును తప్పుదోవ పట్టించి ఆలయ మాన్యం భూములను తమ వశం చేసుకున్నారని, ఆ తర్వాత నింపాదిగా బావిలోని నిధి నిక్షేపాలను వెలికి తీసి సొంతం చేసుకునే కుట్రకు తెరలేపారనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బావిని పురావస్తు శాఖ స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ సైతం స్థానికుల నుంచి వినిపిస్తోంది. రోడ్డున పడనున్న 50 కుటుంబాలు.. స్వామి మాన్యంలో సుమారు 46 నుంచి 50 దుకాణాలు వెలశాయి. వీరు ప్రతి నెలా సత్రానికి అద్దె కూడా చెల్లిస్తున్నారు. వివిద రకాలుచిరు వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రస్తుతం భూమిని తమ వశం చేసుకున్న వారు అక్కడున్న దుకాణాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తొలగించేందుకు సిద్ధమయ్యారు. నోటీసులు ఇస్తే దాదాపు ఆరు దశాబ్దాలుగా అక్కడ దుకాణాలు నిర్వహిస్తున్న వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముండడంతో పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఈఓ బదిలీకి కుట్ర.. అన్యాక్రాంతమైన అనంత పద్మనాభస్వామి ఆలయ మాన్యం భూములను తిరిగి ఎలాగైనా ఆలయానికే దక్కేలా చేయడానికి ఆలయ ఈఓ నాగేంద్రుడు పోరాటం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆలయ ఎదుట ఫ్టెక్సీ ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ అంశం ఆలయ మాన్యం దక్కించుకున్న ప్రైవేట్ వ్యక్తులకు గిట్టలేదు. దీంతో ఎలాగైనా ఈఓను అక్కడి నుంచి బదిలీ చేయించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా సమాచారం. రూ.80 కోట్ల విలువైన ఆ భూమి తమ పూర్వీకులదంటూ తెరపైకి ప్రైవేట్ వ్యక్తులు ఆధారాల సృష్టించి దక్కించుకున్న వైనం ఆలయ మాన్యం వదలబోమంటున్న దేవదాయ శాఖ -
●తుంగభద్ర తుళ్లింత
బొమ్మనహాళ్: ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గురువారం తుంగభద్ర జలాశయం 20 క్రస్ట్ గేట్లను బోర్డు అధికారులు ఎత్తివేశారు. రెండున్నర అడుగుల మేర ఎత్తి నదికి 58,260 క్యూసెక్కులు, వివిధ కాలువలకు 4,506 క్యూసెక్కులు కలిపి మొత్తం 62,766 క్యూసెక్కులను బయటికి పంపుతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలకు కుదించారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోపే ఆమేరకు నీరు చేరడం గమనార్హం. దీంతో డ్యాంలో 78.100 టీఎంసీలు నిల్వ ఉంచి మిగిలిన నీటిని నదికి వదులుతున్నారు. 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేత 58,260 క్యూసెక్కుల నీరు నదికి -
రాజకీయ క్రీనీడలో భూసేకరణ సమావేశం
చిలమత్తూరు: మండలంలోని టేకులోడు గ్రామంలో సెజ్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని టీడీపీ నేతలు దబడి దిబిడిగా మార్చేశారు. ఆర్డీఓ వస్తున్నారని రైతులంతా రావాలని హాజరు కావాలని ముందస్తుగా అధికారులు ప్రకటించారు. అయితే గురువారం ఉదయం సమావేశానికి స్థానిక తహసీల్దార్ తప్ప మరే అధికారి హాజరు కాలేదు. మొత్తం సమావేశాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, సురేంద్రబాబు దగ్గరుండి నడిపించారు. వేదికపై తహసీల్దార్ ఒక్కరే అధికారి కాగా, మిగిలిన వారందరూ టీడీపీ నాయకులు ఆక్రమించేశారు. రైతులకు అనుకూలంగా మాట్లాడాల్సిన నాయకులు బెదిరింపు ధోరణితో రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. పక్క నియోజకవర్గాల్లో భూములు తక్కువ ధరకే వస్తున్నాయని, ఇక్కడ రైతులు కూడా ప్రభుత్వం అందించే స్వల్పపాటి పరిహారం తీసుకొని భూములు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన గ్రామ సభ కాస్త పక్కదారి పట్టడంతో రైతుల్లో అసహనం వ్యక్తమైంది. తక్కువ ధరకే దౌర్జన్యంగా భూములు కొట్టేయాలని చూస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సెజ్ ఏర్పాటుకు భూములు ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించేలా అప్పటి సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకున్నారని, ప్రస్తుతం రూ.12 లక్షలకే భూములు అప్పగించాలంటూ ఒత్తిడి చేయడం సబబు కాదని పలువురు రైతులు వాపోయారు. కాగా, సెజ్ ఏర్పాటుకు భూములు సేకరిస్తే నిర్వాసితులకు ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమావేశంలో తహసీల్దార్ నటరాజ్‌కు సీపీఎం నేత ప్రవీణ్‌కుమార్ వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. తహసీల్దార్ తప్ప వేదికపై కూర్చున్న వాళ్లందరూ టీడీపీ నేతలే గ్రామ సభలో రైతుల గొంతు నొక్కే ప్రయత్నం -
ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీ నియామకంపై సెర్చ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ముగ్గురు సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ నామినీగా డాక్టర్ రామ్‌కుమార్ కాకాని (డైరెక్టర్, ఐఐఎం రాయ్‌పూర్), పాలకమండలి నామినీగా ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ (వీసీ, గీతం వర్సిటీ), యూజీసీ నామినీగా ప్రొఫెసర్ అలోక్‌కుమార్ రాయ్ (వీసీ, యూనివర్సిటీ ఆఫ్ లక్నో బాబుగంజ్, లక్నో) వ్యవహరించనున్నారు. ఈ కమిటీలోని సభ్యులు సమావేశమై ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు గవర్నర్ తుది నియామకం చేయనున్నారు. కాగా, ఎస్కేయూ ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ బి.అనిత ప్రస్తుతం ఉన్నారు. ఇన్చార్జి పాలనలోనే ఏడాది పూర్తయింది. సాధారణ ఉద్యోగిని రిజిస్ట్రార్‌గా నియామకం చేశారు. కనీసం డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయి అధికారిని నియామకం చేయాల్సి ఉండగా, నిబంధనలు బేఖాతరు చేస్తూ రీసెర్చ్కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌ను రిజిస్ట్రార్‌గా నియామకం చేశారు. ఏడాది కాలంలో వర్సిటీకి ఒక్క యూజీసీ ప్రాజెక్ట్ రాలేదు. కీలక నిర్ణయాలు అన్నీ జాప్యం కావడంతో వర్సిటీ పురోగతి మందగించింది. ఇలాంటి తరుణంలో పూర్తి స్థాయి వీసీ వస్తే వర్సిటీ పురోగతి గాడిన పడుతుందని ఉద్యోగులు, విద్యార్థులు భావిస్తున్నారు. సగం ధరకే వాహనమంటూ కుచ్చుటోపీ ● తాడిపత్రి పోలీసుల అదుపులో మోసగాళ్లు? ● ఇప్పటి వరకూ 53 ద్విచక్ర వాహనాల స్వాధీనం తాడిపత్రి టౌన్: సగం ధరకే అంటూ ప్రజలను మోసం చేసి ద్విచక్ర వాహనాలను అంటగడుతున్న తాడిపత్రికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో తాడిపత్రిలోనే వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు, ఆటోలు విక్రయించినట్లు గుర్తించి, ఇప్పటి వరకూ 53 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాహనాల కోసం పోలీసులు వల పన్నారు. కాగా, తాడిపత్రి పట్టణంలోని పెద్దబజార్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రధాన నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని దుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే పూర్తిగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకునేంత వరకూ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున ద్విచక్రవాహనాలు ప్రత్యక్షం కావడంతో పట్టణ వాసుల అవాక్కయ్యారు. కాగా, సగం ధరకే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన వారిలో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్‌స్టేషన్ చుట్టూ ఉన్న వ్యాపార సముదాయాల యజమానులు, పోలీసులూ ఉన్నట్లు సమాచారం. తాడిపత్రికి చెందిన కొందరు ధనవంతులు సైతం కార్లు, లారీలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయాలి
ప్రశాంతి నిలయం: ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయాలని, సంపూర్ణ ఆరోగ్యంతోనే చక్కగా జీవించవచ్చని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ శాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహార పదార్థాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కిలో కందిపప్పు, కిలో రాగిపిండి, కిలో గోధుమపిండి, కిలో శనగపిండి, కిలో వేరుశనగ, నూనె, 30 కోడిగుడ్లు, 250 గ్రాముల చిక్కీ బర్ఫీలు, కిలో శనగలు, 8 రకాల పౌష్టికాహార పదార్థాలతో కూడి కిట్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,172 మంది టీబీ రోగులకు చికిత్స పొందుతున్నారన్నారు. వారికి జిల్లాలో గల రెండు కంపెనీల సహకారంతో పౌష్టికాహారం ఆరు నెలలకు ఒకసారి చొప్పున అందించనున్నట్లు చెఆప్పరు. పౌష్టికాహారంతో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో దాతలు సింగ్వూ కంపెనీ ప్రతినిధులు ఆదిత్య, డీఎస్ఓ వంశీకృష్ణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ మధుసూదన్, డీఎస్ఏటీఓ డాక్టర్ ఎస్.ఎ.సునీల్ కుమార్, ఎంఓడీటీసీ డాక్టర్ గాయత్రి, టీబీ సిబ్బంది పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌పై మంత్రి సమీక్ష
ధర్మవరం అర్బన్: స్థానిక నియోజకవర్గ పరిధిలో స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌పై అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గురువారం సమీక్షించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన ఈ ప్రక్రియలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆర్డీఓ మహేష్, ఎంపీడీఓ సాయి మనోహర్, విద్యావేత్త సురేంద్రనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర సామాజిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్క రంగంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బ్లాక్ స్పాట్ల పరిశీలన ధర్మవరం అర్బన్: ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న బ్లాక్ స్పాట్స్ మరింత నిఘా ఉంచాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి, సిబ్బందికి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బి.కృష్ణవేణి సూచించారు. ధర్మవరంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని గురువారం జేటీసీ సందర్శించారు. పట్టణంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిపై గుర్తించిన బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో ఎంవీఐతో సమావేశమై మాట్లాడారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రేపు ‘అనంత’లో జగన్నాథ యాత్ర
అనంతపురం కల్చరల్: అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అనంత వేదికగా మరోసారి పూరీ జగన్నాథ రథయాత్ర వేడుకలకు సర్వాంగ సుందరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కళాకారులు, ఇస్కాన్ మందిరాల ప్రతినిధులు అనంతకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన పూరీ రథయాత్రను 2015లో ఇస్కాన్ మందిరం అనంతలో ఘనంగా నిర్వహించింది. దేశంలోనే అతి పెద్దదైన పూరీ జగన్నాథుడి వేడుకలను దూరాభారం వల్ల చూడలేని వారికి.. వారి ముంగిటనే రథయాత్రను చూసే భాగ్యాన్ని ఇస్కాన్ తీసుకువచ్చింది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటి వరకూ ఆరు సార్లు వైభవంగా రథయాత్ర వేడుకలు జరిగాయి. ఈ నెల 5న సాగే వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. రథయాత్ర సాగుతుందిలా.. తొలుత రెండు రోజుల పాటూ రథయాత్ర ఘనంగా నిర్వహించాలని ఇస్కాన్ ప్రతినిధులు భావించారు. కానీ ఒక్కరోజు యాత్రకు కూడా జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతివ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి రథయాత్ర సజావుగా సాగేలా కృషి చేశారు. ఈ నేపథ్యంలో కళాజాత, ఆధ్యాత్మిక ప్రవచనాలు, వేద పఠనం నడుమ జగన్నాథ రథయాత్ర శనివారం ఉదయం లలిత కళాపరిషత్తులో ప్రారంభం కానుంది. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు సాగుతాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానిక కేఎస్ఆర్ కాలేజ్ సమీపంలో మహా అభిషేకంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. నగర పాలక సంస్థ కార్యాలయం, సుభాష్‌రోడ్, టవర్‌క్లాక్, రాజు రోడ్డు, శ్రీకంఠం సర్కిల్, తిలక్‌రోడ్, గాంధీబజార్, పాతూరు మీదుగా బసవన్నకట్ట నుంచి మళ్లీ సప్తగిరి సర్కిల్ మీదుగా లలిత కళాపరిషత్తుకు చేరుకుంటుంది. విశిష్ట అతిథిగా శ్రీమాన్ సత్యగోపీనాథ్ ప్రభు విచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నారు. సినీనటుడు సుమన్ ఆత్మీయ అతిథిగా విచ్చేసి రథయాత్రను ప్రారంభిస్తారు. అలాగే కళాజాతను పలువురు ప్రజాప్రతినిధులు ఆరంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా కేరళ, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన కళాకారులు అనంతకు విచ్చేసి తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. నగర వీధుల్లో శోభాయమానంగా సాగే రథయాత్రలో అనంత వాసులు భాగస్వాములు కావాలని గురువారం ఇస్కాన్ మందిరంలో జరిగిన సమావేశంలో నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. తరలి రానున్న జాతీయ ఇస్కాన్ సభ్యులు, సినీ ప్రముఖులు హైకోర్టు ఆదేశంతో ముందుకు కదలనున్న రథచక్రాలు -
మహారాష్ట్ర భక్తుల పర్తి యాత్ర
ధర్మవరం అర్బన్: పర్తి యాత్రలో భాగంగా ధర్మవరం రైల్వే స్టేషన్‌కు గురువారం చేరుకున్న మహారాష్ట్ర వాసులు పాదయాత్రగా పుట్టపర్తికి తరలివెళ్లారు. దాదాపు 500 మందికి పైగా భక్తులు వారి సంప్రదాయ రీతిలో భజనలు చేస్తూ, కీర్తనలు ఆలపిస్తూ వెళుతుండగా పట్టణ ప్రజలు సాదరస్వాగతం పలికారు. ఇద్దరిపై కేసు నమోదుకదిరి అర్బన్: యువకుడిపై రాళ్లతో దాడి చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను సీఐ నారాయణరెడ్డి గురువారం వెల్లడించారు. కదిరిలోని నిజాంవలీ కాలనీకి చెందిన కేదార్ మహేష్‌కుమార్‌పై అదే కాలనీకి చెందిన రాకేష్, నగేష్ రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. స్నేహితులైన ఈ ముగ్గురి మధ్య చిన్నపాటి గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్‌కుమార్‌పై వారు దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాకేష్, నగేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జూదరుల అరెస్ట్ పరిగి: మండలంలోని మోదా పంచాయతీ పరిధిలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలసి ఎస్ఐ రంగడు యాదవ్ గురువారం మోదా పంచాయతీ పరిధిలోని బందార్లపల్లి శివారున తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించగానే పేకాటరాయులు పారిపోయారు. పోలీసులు వెంటాడి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు తప్పించుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.70,500 నగదు, 19 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు. జూదరులపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనులపై కఠిన చర్యలు పుట్టపర్తి టౌన్: ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి మద్యం షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ప్రోహిబిషన్, ఎకై ్సజ్ అధికారి గోవింద నాయక్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం దకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలన్నారు. బార్లలలో రాత్రి 11 గంటల వరకు మాత్రమే అమ్మకాలు జరపాలన్నారు. ప్రతి మద్యం షాపులోనూ 21 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే మద్యం విక్రయించాలన్నారు. ఒకరికి 3 కంటే ఎక్కువ మద్యం సీసాలు విక్రయించరాదన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయాలు చేయరాదన్నారు. .సుంకం చెల్లించని మద్యం, కల్తీ మద్యం విక్రయించిన దుకాణ యజమానులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీఎస్పీ పదోన్నతుల సీనియార్టీ జాబితా విడుదల అనంతపురం: డీఎస్పీ పదోన్నతులకు సంబంధించి తాత్కాలిక (అడహాక్ ) సీనియార్టీ జాబితాను అధికారులు విడుదల చేశారు. 2024–25 ప్యానల్లో సీనియార్టీ జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీఐలు ఉన్నారు. వీరిలో కె.దేవానంద్ (అనంతపురం), ఎం.ఆదినారాయణ (పీటీసీ అనంతపురం), బి.మోహన్ ( శ్రీసత్యసాయి), కె.సాయినాథ్ (అనంతపురం), ఎస్వీ భాస్కర్‌గౌడ్ (అనంతపురం), కె.రాఘవన్ (శ్రీసత్యసాయి), పి.సత్యబాబు (అనంతపురం), జి.బాలసుబ్రహ్మణ్యం రెడ్డి (శ్రీసత్యసాయి) ఉన్నారు. కలుషిత నీరు తాగి 16 జీవాల మృతి బెళుగుప్ప: కలుషిత నీరు తాగి 16 జీవాలు మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలం కోనంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తన మొక్కజొన్న పంటకు యూరియా కలిపిన నీటిని డ్రిప్ ద్వారా అందించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గొర్రెల మంద అక్కడకు చేరుకుంది. దాహంతో ఉన్న గొర్రెలు, మేకలు అప్పటికే తొట్టెలో ఉన్న యూరియా కలిపిన నీటిని తాగాయి. కాసేపటి తర్వాత 10 గొర్రెలు, 5 మేకలు, ఓ పొట్టేలు మృత్యువాత పడడంతో కాపరులు తిప్పయ్య, మహేష్, వన్నూరుస్వామి, రామాంజనేయులు, అంజనప్ప, లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు. -
పంచాయతీకి ట్రాక్టర్ అప్పగింత
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఎట్టకేలకు ఏడాది తర్వాత పేరూరు మేజర్ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ తిరిగి పంచాయతీకి చేరింది. స్వచ్ఛ భారత్ పనుల కోసం ప్రభుత్వం పేరూరు పంచాయతీకి ట్రాక్టర్ ఇవ్వగా.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సొంత పనులకు వాడుకోవడంతో పాటు ఇతర రైతులకు అద్దెకు ఇస్తూ సొమ్ముచేసున్నాడు. దీనిపై ‘పంచాయతీకే పంగనామం’ శీర్షికన ఈనెల 1వ తేదీ మంగళవారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు సాగిస్తున్న అక్రమాల పర్వాన్ని బట్టబయలు చేసింది. ఈ కథనం తీవ్ర చర్చనీయాంశం కాగా, టీడీపీ నాయకులు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. వెంటనే ట్రాక్టర్‌ను పంచాయతీకి స్వాధీనం చేయాలని ఆదేశించడంతో.. టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ బుధవారం ట్రాక్టర్‌ను పంచాయతీ ఆఫీసు వద్దకు తీసకువెళ్లి కార్యదర్శి సత్యమ్మకు తాళాలు అప్పగించారు. అయితే ఏడాదిగా ట్రాక్టర్‌ను అద్దెలకు ఇచ్చి సంపాదించిన మొత్తాన్నీ పంచాయతీ ఖాతాకు జమ చేయాలని ప్రజలు కోరుతున్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు ● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 10న జిల్లాలోని కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉందని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలిసి సీఎం పర్యటన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 10న సీఎం చంద్రబాబు కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉందన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ప్రతి శాఖకు బాధ్యతలు అప్పగించామని, లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్‌లో స్పెషలిస్ట్ వైద్యులతో పాటు అత్యవసర మందులను, అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వైవీఎస్ శర్మ, డీపీఓ సమత, డీఆర్డీఏ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, జిల్లా రవాణా శాఖ అధికారి జే.శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం తదితరులు పాల్గొన్నారు. జలజలా తుంగభద్రమ్మ.. ● టీబీ డ్యాం 6 క్రస్ట్ గేట్లు ఎత్తివేత బొమ్మనహాళ్: ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండగా తుంగభద్రమ్మ పరుగులు తీస్తోంది. దీంతో అధికారులు బుధవారం జలాశయం 6 క్రస్ట్ గేట్లను ఎత్తి నదికి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 14,136 క్యూసెక్కుల నీటిని నదికి వదులుతున్నారు. డ్యాం ఎగువ భాగంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్‌కు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రానికి 32,494 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రసుత్తం జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1,625.46 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 78.100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో బుధవారం మధ్యాహ్నం డ్యాం క్రస్ట్ గేట్లలో నాలుగింటిని, రాత్రి 7 గంటల సమయంలో మరో రెండింటిని ఎత్తి నదికి నీటిని విడుదల చేశారు. -
అధికారులు అన్యాయం చేశారు
అనంతపురం అర్బన్: బదిలీల కౌన్సెలింగ్‌లో అధికారులు తమకు తీవ్ర అన్యాయం చేశారని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించలేదన్నారు. ర్యాంక్ (మెరిట్) ఆధారంగా బదిలీలు నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా స్థానాలు కేటాయించారని మండిపడ్డారు. రాజకీయ సిఫారసు ఉన్నవారికి వారు కోరుకున్న స్థానాలు కేటాయించారని వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు గతనెల 28న బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. ఆరోజున కౌన్సెలింగ్‌కు హాజరైన తమ నుంచి ఆప్షన్ ఫారాలు తీసుకుని..మీ ఆప్షన్లలో ఏదో ఒకటి తర్వాత ఇస్తామని చెప్పారన్నారు. తీరా పోస్టింగ్ ఆర్డర్స్ ఒకటో తేదీన పంపారని, అందులో తామిచ్చిన ఆప్షన్లకు సంబంధం లేని మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. ముందు ర్యాంకులో ఉన్న తమను కాదని తరువాత ర్యాంక్ వాళ్లకు తమ స్థానాలు ఇచ్చారని ఆరోపించారు. అంతే కాకుండా దివ్యాంగులు, మెడికల్, ఒంటరి మహిళలు, స్పౌజ్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఇలా బదిలీల కౌన్సెలింగ్‌లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు నేత్ర, జహీర్, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ర్యాంక్ ప్రకారం ఇవ్వలేదు ఉమ్మడి జిల్లాలో నాది 6వ ర్యాంకు. శ్రీసత్యసాయి జిల్లాలో 3వ ర్యాంక్. నేను కదిరిలో పనిచేస్తున్నారు. బదిలీల్లో కదిరి, నల్లచెరువు, గాండ్లపెంట ఆప్షన్ ఇచ్చా. నాకు ముదిగుబ్బ మండలంలో పోస్టింగ్ ఇచ్చారు. నేను ఆప్షన్లో ఉంచిన స్థానాలను ఇవ్వకుండా నా తరువాత ర్యాంక్ వారికి కేటాయించారు. – జనార్దన్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇష్టానుసారంగా ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో నాది 5వ ర్యాంక్, శ్రీసత్యసాయి జిల్లాలో 2వ ర్యాంక్, నేను తలుపుల మండలంలో పనిచేస్తున్నా. నల్లచెరువు, ఎన్పీకుంట, నల్లమాడ మండలాలకు ఆప్షన్ ఇచ్చాను. అయితే నా ఆప్షన్లు కాకుండా తనకల్లు మండలం కోటపల్లి సచివాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. మా తరువాతి ర్యాంకు వారికి మా ఆప్షన్ స్థానాలు ఇచ్చారు. – సుస్మిత, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పీహెచ్ కోటా అమలు చేయలేదు పీహెచ్ కేటగిరీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఆ కేటగిరీలో ఉన్న నాకు అన్యాయం చేశారు. నేను నల్లమాడ మండలం వేళ్లమద్ది సచివాలయంలో పనిచేస్తున్నా. బదిలీ ఆప్షన్ ఇటుకలపల్లి, బత్తపల్లి సచివాలయం–2, ఆత్మకూరు మండలం బి.యాలేరు ఇచ్చాను. అయితే అవేవీ కాకుండా బుక్కపట్నం మండల అగ్రహారం సచివాలయానికి నన్ను బదిలీ చేశారు. – శిరీష, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల ఆవేదన రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేశారని ధ్వజం -
కూటమి మోసాలను ప్రజలందరికీ వివరిస్తాం
రొద్దం: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి సర్కార్ అసమర్థపాలనను ప్రజలందరికీ వివరించేందుకు వైఎస్సార్ సీపీ ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. బుధవారం ఆమె రొద్దంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ నేతలతో కలిసి క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..కూటమి సర్కార్ చేసిన మోసాలను ప్రజలందరికీ వివరిస్తామన్నారు. ఆరు వారాలపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని గ్రామగ్రామానా నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు..అమలు తీరు..ఏడాది కూటమి పాలనలో ఒక్కో కుటుంబం ఎంతమేర నష్టపోయిందో వివరిస్తామన్నారు. ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు.. ఎన్నికల వేళ చంద్రబాబు ప్రజలందరికీ అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. ప్రభుత్వ పథకాలు అందిస్తామంటూ గ్యారెంటీ వారంటీ కార్డులు ఇచ్చారన్నారు. కానీ ఏడాది పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేకపోయారన్నారు. నిరుదోగ్య భృతి, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, 20 లక్షల ఉద్యోగాలు ఇలా ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారన్నారు. ‘తల్లికి వందనం’ అమలుకూ సవాలక్ష ఆంక్షలు పెట్టారన్నారు. ఉచిత గ్యాస్ ఎవరికి అందుతుందో కూడా తెలియడం లేదన్నారు. పెనుకొండ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత... బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకం గురించి మాట్లాడటం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు ఉషశ్రీచరణ్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, ఎంపీటీసీ సభ్యురాలు కురుబ రత్నమ్మ, వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామంద్ర, నాయకులు ఎన్. నారాయణరెడ్డి, చిలకల రవి, సి.నారాయణరెడ్డి, సినిమా నారాయణ, లక్ష్మీనారాయణరెడ్డి, అమీర్, నరేంద్రరెడ్డి, తిమ్మయ్య, జట్టి శ్రీనివాస్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
‘పురం’ మున్సిపాలిటీ నిధులకు కన్నం
చిలమత్తూరు: హిందూపురం మున్సిపాలిటీ ఆదాయానికి కన్నం వేశారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనులకు గానూ ఎయిర్టెల్ సంస్థ నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన మొత్తంలో ఏకంగా రూ. 33.94 లక్షలు కోత వేశారు. ఇలా ఓ ప్రైవేటు సంస్థకు లబ్ధి కలిగేలా వ్యవహరించిన వైనం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏం జరిగిందంటే..... పట్టణంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు భారతీ ఎయిర్టెల్ సంస్థ సిద్ధమైంది. కేబుల్ వైరు వేసేందుకు మెటల్ రోడ్డు, సీసీ రోడ్లను తవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కలిగే నష్టానికి గానూ మున్సిపాలిటీకి నిర్ణయించిన మొత్తాన్ని డీడీ రూపంగానో, నేరుగా మున్సిపాలిటీ బ్యాంకు ఖాతాలోనో జమ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జూన్ నెలలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 7,700 మీటర్లు సీసీ రోడ్డు, 2,200 మీటర్ల మేర మెటల్ రోడ్డుల గుండా ఫైబర్ కేబుల్ వేయాలని భారతీ ఎయిర్టెల్ సంస్థ నిర్ణయించుకుంది. ఇందుకు గానూ 2022–23 ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. అలాగే ప్రతి ఏటా 10 శాతం అదనంగా పెంచి అంచనాలు తయారు చేయాల్సి ఉంటుంది. 2022–23 ప్రకారం మీటరుకు రూ. 464 మేర మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. ఏటా 10 శాతం పెంచితే..2025–26 సంవత్సరం నాటికి 30 శాతం అంచనా పెంచి మున్సిపాలిటీకి చెల్లించేలా అంచనాలు తయారు చేయాలి. ఆ లెక్కన మీటరుకు రూ.464 మేర చెల్లించాల్సి ఉండగా..మూడేళ్లకు 30 శాతం అదనంగా అంటే రూ. 139 చేరిస్తే మీటరుకు రూ. 603 చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా మెటల్ రోడ్డుకు 2022–23 లెక్క ప్రకారం మీటరుకు రూ.295 చెల్లించాల్సి ఉంది. మూడేళ్లకు పెంచాల్సిన మొత్తం రూ.89 కాగా పాత ధరనే చెల్లించేలా అంచనాలు తయారు చేసి ఆమోదించారు. దీంతో మున్సిపాలిటీకి రావాల్సిన మొత్తంలో రూ.33.94 లక్షలు కోత పడింది. కాగా పాత ధరల మేరకే ఇప్పుడూ డబ్బు చెల్లించేలా టెలికాం సంస్థ యాజమాన్యానికి ఏఈ శంకర్ ఈ ఎస్టిమేషన్ వేసి డిమాండ్ నోటీసు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంస్థకు రాసిన లేఖలో సీసీ రోడ్డు అని పేర్కొనగా, ధర మాత్రం మెటల్ రోడ్డుగా ఉంది. అధికారపార్టీ నేతల పాత్రపై అనుమానాలు..? ఈ తతంగం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెలికాం సంస్థ నుంచి మున్సిపాలిటీకి అందాల్సిన నిధులు ఎమ్మెల్యే కార్యాలయానికి మళ్లినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపాలిటీకి రూ.లక్షలు నష్టం కలిగేలా కొందరు నేతలు అధికారులతో చేతులు కలిపి ఈ కుంభకోణం చేసినట్టుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టెలికాం రిస్టోరేషన్‌లో అవకతవకలు రూ.33.94 లక్షలు దారి మళ్లినట్లు అనుమానాలు -
పుట్టపర్తిలో ఢిల్లీ వాసి మృతి
పుట్టపర్తి టౌన్: సత్యసాయి సన్నిధిలో శేష జీవితం గడిపేందుకు వచ్చిన ఢిల్లీకి చెందిన సత్యకుమార్ మధుకరన్ మీనన్ (64) మృతి చెందారు. తోడు ఎవరూ లేని ఆయన కొన్ని రోజుల క్రితం పుట్టపర్తికి వచ్చి ప్రియాంక అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. నాలుగు రోజులుగా గది తలుపులు తీయలేదు. బుధవారం ఉదయం ఆయన నివాసముంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో సీఐ సునీత, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించి, మృతదేహాన్ని గుర్తించారు. గుండె నొప్పి కారణంగా కిందపడి మృతి చెందినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణంగోరంట్ల: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. గోరంట్ల మండలం కసిరెడ్డిపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటు వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీకొంది. ప్రమాదంలో రోడ్డుపై పడిన అతని తల మీదుగా వాహనం చక్కాలు దూసుకెళ్లాయి. దీంతో మృతుడు ఎవరైంది ఆచూకీ తెలియకుండా పోయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లుగా నిర్ధారించి, కేసు నమోదు చేశారు. భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య ధర్మవరం అర్బన్: స్థానిక ప్రియాంక నగర్లో నివాసముంటున్న లింగారెడ్డి(48) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు ఉన్నారు. వంట పనితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో బుధవారం భార్యతో గొడవపడిన ఆయన క్షణికావేశంలో ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కిందకు దించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బంగారు నగల అపహరణ హిందూపురం: స్థానిక మార్కండేయ నగర్లో నివాసముంటున్న లేపాక్షి పశువైద్యశాక ఉద్యోగి కృష్ణవేణి ఇంట్లో చోరీ జరిగింది. మంగళవారం ఇంటికి తాళం వేసి కృష్ణవేణి కుటుంబసభ్యులు మరో ఊరికి వెళ్లారు. విషయాన్ని గుర్తించిన దుండగులు అదే రోజు తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేవించారు. బీరువాలోని 10 తులాల బంగారు నగలు, పట్టుచీరలు, విలువైన సామగ్రిని అపహరించారు. బుధవారం ఉదయం తిరిగి వచ్చిన ఇంటి యాజమాని ఇంట్లో జరిగిన చోరీని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లోని గైనిక్ విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో రోగికి ప్రాణం పోశారు. వివరాలు... గుత్తికి చెందిన లక్ష్మి గత నెల 23న ఆయాసం, రక్త హీనతతో బాధపడుతూ జీజీహెచ్‌లోని గైనిక్ ఓపీకి వచ్చింది. ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని,, పలు రకాల స్కానింగ్‌లు నిర్వహించారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 4.3 ఉన్నట్లు నిర్ధారణ కావడంతో పాటు గర్భసంచికి రెండు వైపులా భారీ పరిమాణంలో కణితులు పెరిగినట్లుగా గుర్తించారు. విషయాన్ని గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం దృష్టికి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిస్సార్ బేగం, అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌజన్య తీసుకెళ్లి చర్చించారు. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు వెంటనే శస్త్రచికిత్స చేయలేమని హెచ్‌బీ 10 శాతానికి చేరుకున్న తర్వాత ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రక్తం ఎక్కిస్తూ వచ్చారు. హిమోగ్లోబిన్ శాతం మెరుగు పడిన తర్వాత బుధవారం డాక్టర్ షంషాద్‌బేగం నేతృత్వంలో డాక్టర్ నిస్సార్ బేగం, డాక్టర్ సౌజన్య, పీజీలు డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ రమణి, అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్ర, స్టాఫ్‌నర్సులు సుప్రియ, ఉషారాణి బృందంగా ఏర్పడి శస్త్రచికిత్స చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి 6 కిలోల బరువున్న భారీ కణితులను తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం లక్ష్మి ఆరోగ్యం కుదుట పడుతోందని డాక్టర్ షంషాద్ బేగం తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ తరహా శస్త్రచికిత్సను సర్వజనాస్పత్రిలో పూర్తి ఉచితంగా చేసినట్లు తెలిపారు. తొలగించిన కణితిని బయాప్సీకి పంపామని, క్యాన్సర్ నిర్ధారణ అయితే తదుపరి చికిత్సకు రెఫర్ చేస్తామని పేర్కొన్నారు. -
300 మామిడి చెట్ల నరికివేత
పుట్టపర్తి టౌన్: మండలంలోని వెంగలమ్మచెరువు గ్రామంలో వైఎస్సార్ ీసీపీ సానుభూతిపరుడు వీరనారప్ప తోటలోని మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. మూడేళ్ల క్రితం దాదాపు 400 మామిడి మొక్కలను ఆయన నాటారు. మంగళవారం సాయంత్రం తోటలో పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి చొరబడి 300 చెట్లను నరికి వేశారు. బుదవారం మధ్యాహ్నం రైతు కుటుంబ సభ్యులు తోట వద్దకెళ్లి చూడగా నరికి వేసిన చెట్టు కనిపించాయి. ఘటనపై పుట్టపర్తి రూరల్ పీఎస్ ఎస్ఐ లింగన్నకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన దాయాదులు లింగప్ప, రాము, లక్ష్మీనారాయణపై అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో వారు తనపై దాడి చేశారని, ఆర్థికంగా తనను దెబ్బతీసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, నరసారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుడికి ధైర్యం చెప్పారు. ‘తల్ సైనిక్’ ఎంపికే లక్ష్యం కావాలి ● ఎన్సీసీ కర్నూలు గ్రూప్ కమాండర్ అలోక్ త్రిపాఠి కూడేరు: ఈ ఏడాది ఆగస్టులో న్యూఽఢిల్లీలో జరిగే తల్ సైనిక్ క్యాంప్‌నకు ఎంపిక కావడమే లక్ష్యంగా సాధన చేయాలని ఎన్సీసీ క్యాడెట్లకు కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి సూచించారు. కూడేరు మండలంలోని ఎన్సీసీ నగర్లో సీఏటీసీ–5 ఎన్సీసీ ఽశిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన 500 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. బుధవారం కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి హాజరై, మ్యాప్ రీడింగ్, ఫైరింగ్‌లో శిక్షణను పరిశీలించారు. ఏకాగ్రత, ఆత్మ విశ్వాసమున్నపుడే అన్నింటా రాణించగలుగుతారని పేర్కొన్నారు. అనంతరం శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు సునీత, రాజ్యలక్ష్మి, నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్‌మీటర్ల’పై క్యూఆర్ కోడ్‌తో పోరాటం : సీపీఎం
అనంతపురం అర్బన్: స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుపై ప్రజా నిరసన ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ తెలిపారు. ప్రజలతో క్యూర్‌కోడ్ స్కాన్ చేయించి తమ వ్యతిరేకతను నేరుగా సీఎం కార్యాలయానికి తెలియజేసేలా చర్యలు తీసుకున్నారు. బుధవారం స్థానిక గణేనాయక్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, కార్యవర్గ సభ్యులతో కలిసి క్యూఆర్ కోడ్ ప్రతులను ఆయన విడుదల చేసి, మాట్లాడారు. ఈ నెల 6న ప్రజా సముదాయం ఉండే కూడళ్లలో ప్రజల ద్వారానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయిస్తామన్నారు. ఈ విధానానికి స్వస్తి పలికేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా చేపట్టిన క్యూఆర్ కోడ్ పోరులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, నాగేంద్రకుమార్, కృష్ణమూర్తి, చంద్రశేఖరరెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
103 మంది విద్యార్థులకు ఏకోపాధ్యాయురాలా?
డి హీరేహాళ్(రాయదుర్గం): ఏకోపాధ్యాయురాలితో తమ పిల్లల చదువులు ఎలా సాగుతాయంటూ కర్ణాటక సరిహద్దున ఉన్న డి.హీరేహాళ్ మండలం మలపనగుడి గ్రామస్తులు బుధవారం పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. 103 మంది విద్యార్థులుంటే ఒక్క ఉపాధ్యాయురాలు ఎలా నెట్టుకొస్తోందో చెప్పాలంటూ నిలదీశారు. నిత్యం హాజరు వేయడం, అల్లరి చేయకుండా కంట్రోల్ చేయడం మినహా పుస్తకాలు తెరవలేక పోతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎంఈఓకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రైవేటు బడుల్లో ఖరీదైన చదువులకు పంపడం తమ వల్లకాదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి మరో ఇద్దరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు -
మంత్రి కేశవ్‌కు సమస్యల ఏకరవు
కూడేరు: మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏకరవు పెట్టారు. కూడేరు మండలం జయపురంలో బుధవారం మంత్రి కేశవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరూ ఆయనను కలిసి, సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రోజూ ఉదయం 6 గంటలకే పంచాయతీల్లో ఉండాలని, చెత్త సేకరణ, క్లోరినేషన్ చేసేటప్పుడు ఆ రోజు దిన పత్రిక పట్టుకొని నోట్ కమ్ ఫొటో దిగాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీ రాజ్ కమిషనర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించినట్లు గుర్తు చేశారు. రోజూ ఉదయం 6 గంటలకే వెళ్లడం చాలా ఇబ్బందవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలను వేరు చేసి పంచాయతీరాజ్ పనులను మాత్రమే తమకు అప్పగించేలా చూడాలని విన్నవించారు. స్పందించిన మంత్రి.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిస్కారానికి చొరవ తీసుకుంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్, కార్యదర్శులు రాఘవ, నాగరాజు, హరీష్, వెంకటనారాయణ,రమాదేవి, సుభాషిణి, లక్ష్మీకాంతమ్మ, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ తీరుతో నష్టం
ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కాలంలో ఉపాధ్యాయుల బదిలీలు, శిక్షణలు నిర్వహించాలి. ఈ ఏడాది పాఠశాలల ప్రారంభంలోనే బదిలీలు చేపట్టారు. ఇదే సమయంలోనే శిక్షణ పేరుతో తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించలేక ఉపాధ్యాయులు సతమతమయ్యారు. దీంతో 1వ తరగతి చేరే విద్యార్థులు కరవయ్యారు. ప్రభుత్వ తీరుతో తీరని నష్టం చేకూరుతోంది. – బడా హరిప్రసాదరెడ్డి, ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడు -
రాకెట్లలో దళిత యువ రైతుపై దాడి
ఉరవకొండ: మండలంలోని రాకెట్లలో దళిత యువ రైతు హనుమంతుపై అదే గ్రామానికి చెందిన చిన్న సుంకప్ప కుటుంబసభ్యులు దాడి చేశారు. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... రాకెట్లలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న దళిత వెంకటేష్ కుమారులు హనుమంతు, రామాంజనేయులు కలిసి ఇటీవల నెట్టం రాధాకృష్ణ నుంచి సర్వేనంబర్ 320–బీ1లోని 74 సెంట్లలో 15 సెంట్లను కొనుగోలు చేశారు. ఈ స్థలానికి చెక్కు బందీ మేరకు దక్షిణం వైపు బండి రస్తా ఉంది. భూమి విక్రయించే ముందు రాధాకృష్ణ కుటుంబసభ్యులు చూపించిన సర్వే హద్దుల్లోనే హనుమంతు సోదరులు పంట దిగుబడిని, పశువుల మేత వామిని హనుమంతు వేశాడు. అయితే ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన చిన్న గుండ్లొల్ల చిన్న సుంకప్ప కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితం దౌర్జన్యంగా ఆక్రమించి, అందులో ఎరువులను, మట్టిని వేసుకున్నారు. తమ స్థలంలోకి ఎందుకు చొరబడుతున్నారని అడిగితే.. ఇది మాదే స్థలం అంటూ ఎదురు తిరిగారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో మరోమారు మరికొంత స్థలాన్ని ఆక్రమించేందుకు ముళ్లకంపలు తొలగించడంతో హనుమంతు గమనించి ప్రశ్నించాడు. అంతే చిన్న సుంకప్ప, ఆయన కుటుంబ సభ్యులు చందు, మణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాదిగ లం... కొ.. అంటూ దూషణలకు పాల్పడటమే కాకుండా కిందపడేసి చెప్పులతో కొట్టారు. కాసేపటి తర్వాత పెదనాన్న, పెద్దమ్మ వచ్చి అతడిని వారి నుంచి విడిపించుకుని ఇంటికి తీసుకెళ్లారు. అయినా శాంతించని చిన్నసుంకప్ప కుటుంబ సభ్యులు మరోమారు ఇంటిలోకి చొరబడి హనుమంతుపై చెప్పులు, కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ రాత్రి భయంభయంగా గడిపిన బాధితుడు బుధవారం మధ్యాహ్నం ఉరవకొండ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. తమ భూమిలోకి అకారణంగా ప్రవేశించి, ఆక్రమణకు పాల్పడి, ఇదేమని అడిగిన తనపై చెప్పులతో దాడిచేసి, కులం పేరుతో దూషించారని, వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
పిల్లలూ.. భోజనం బాగుందా?
● విద్యార్థులను ఆరా తీసిన జాయింట్ కలెక్టర్ పుట్టపర్తి: పిల్లలూ మధ్యాహ్న భోజనం బాగుందా... సన్నబియ్యంతోనే అన్నం వండుతున్నారా.. మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా... అంటూ జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ విద్యార్థులను ఆరా తీశారు. మంగళవారం ఆయన పుట్టపర్తి శివాలయం వీధిలోని ప్రాథమిక పాఠశాలను, చిన్నపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కోసం ప్రభుత్వం పాఠశాలలకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోందని తెలిపారు. జేసీ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వంశీకృష్ణారెడ్డి, తహసీల్దార్ కళ్యాణ్, డీటీ రమేశ్, ఎంఈఓలు ఖాదర్ వలి బాష ,ప్రసాద్, హెచ్ఎంలు వెంకటనారాయణ, రజనీకాంత్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు. ఆకతాయికి దేహశుద్ధి సోమందేపల్లి: మండల కేంద్రంలో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆకతాయిని పట్టకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. వివరాలు.. మంగళవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం రోజులాగే కొందరు మహిళలు వాకింగ్ చేస్తుండగా వైఎస్సార్ సర్కిల్ వద్ద కర్ణాటకలోని చిక్కబళాపురానికి చెందిన వాహన డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళలు పట్టుకుని దేహశుద్ది చేస్తుండడంతో స్థానికులు చుట్టుముట్టి లాక్కెళ్లి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఖైదీ కోసం కదిరి పోలీసుల గాలింపు కదిరి టౌన్: తెలంగాణలోని నిజామాబాదు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ కోసం కదిరి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీసులు తెలిపిన మేరకు జీవన్ అనే ఖైదీ నిజామాబాదు సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే జైలు పరిధిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌లో పనిచేసే అతను గత నెల 29న సెంట్రీ గార్డుల కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు. అదే నెల 30న కదిరి బస్టాండ్‌కి చేరుకున్నట్లుగా గుర్తించిన అక్కడి పోలీసుల సమాచారం మేరకు స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్టాండ్‌కు పోలీసులు చేరుకునేలోపు అక్కడి నుంచి జీవన్ పారిపోయాడు. కదిరి పట్టణం లేదా చుట్టుపక్కల గ్రామాల్లో తలదాచుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చామన ఛాయ రంగు కలిగి, గుండు చేయించుకుని ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 94407 96851, 77026 42541, 99127 78069, 87125 32885కు సమాచారం అందించాలని సీఐ వి.నారాయణరెడ్డి కోరారు. -
యువకుడి ప్రాణాలు బలిగొన్న మీటర్ వడ్డీ
పావగడ: మీటర్ వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పావగడ తాలూకా వైఎన్ హొసకోట పీఎస్ పరిధిలోని నాగలాపురం గ్రామానికి చెందిన వైటీ మంజునాథ్ (38)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ.లక్షల్లో అప్పులు చేశాడు. ఈ క్రమంలో పంట దిగుబడులు సక్రమంగా రాకపోవడంతో అప్పులు తీర్చలేక ఇబ్బంది పడ్డాడు. ఇదే అదనుగా భావించిన వడ్డీ వ్యాపారులు ఒత్తిళ్లు చేస్తూ సాధారణ వడ్డీని కాస్త మీటర్ వడ్డీ కిందకు మార్చుకున్నారు. వడ్డీల కిందనే రూ.లక్షల్లో చెల్లించినా అప్పులు తీరలేదు. వడ్డీలకు వడ్డీలు పెరుగుతూ రూ.15 లక్షలకు పైగా చేరుకుంది. ఈ భారం నుంచి బయటపడేందుకు గ్రామంలో తనకు తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఇందుకు గాను వారానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ వడ్డీలు చెల్లించే దుస్థితికి వడ్డీ వ్యాపారులు తీసుకెళ్లారు. నానాటికీ వడ్డీల భారం పెరగడం, అప్పు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన మంజునాథ్ మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వైఎన్ హొసకోట పీఎస్ ఎస్ఐ మాళప్ప నాయక్కుడి తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా వజ్ర భాస్కరరెడ్డి సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కె.వజ్ర భాస్కర రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి (ఆర్గనైజేషన్ యాక్టివిటీ)గా నియమించారు. ఈ మేరకు మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : డీఎంహెచ్ఓ పుట్టపర్తి టౌన్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్‌బేగం అన్నారు. జాతీయ డెంగీ మాసోత్సవాల పోస్టర్లు, బ్యానర్లను అధికారులతో కలసి తన కార్యాలయంలో మంగళవారం ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ అధికారులను సమన్వయం చేసుకుని అన్ని గ్రామాల్లోనూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు నెల రోజుల పాటు విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి లక్ష్మానాయక్, సిబ్బంది పాల్గొన్నారు. చిరుత దాడి.. గాడిద పిల్ల మృతి వజ్రకరూరు: మండలంలోని కడమలకుంట గ్రామ పరిసరాల్లో చిరుత దాడిలో ఓ గాడిద పిల్ల మృతి చెందింది. యజమాని చాకలి వెంకటేష్ సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం ఫారెస్ట్ బీట్ ధికారి సతీష్‌కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ వెంకటేష్, ప్లాట్ వాచర్ మల్లికార్జున తదితరులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రి చిరుత దాడి చేసినట్లుగా నిర్ధారించారు. చిరుత సంచారాన్ని అరికట్టాలని ఈ సందర్భంగా పలువురు కోరారు. రైలులో ప్రయాణికుడి మృతి గుంతకల్లు: ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ద్వివాంగుల బోగీలో ప్రయాణిస్తున్న అతని వద్ద కనీసం టికెట్ కూడా లేదు. సరైన సంరక్షణ లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండడమే మృతికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. ఎరుపు రంగులో ఉండి.. కాఫీ కలర్ టీ షర్టు ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు. కుక్కపై చిరుత దాడి అగళి: మండలంలోని కురసంగనపల్లి శివారున రైతు రంగరాజు పొలంలో మంగళవారం వేకువజామున కుక్కపై చిరుత దాడి, సగానికి పైగా తినేసింది. అలాగే గిరయప్పకు చెందిన జీవాల మందపై దాడి చేసి నాలుగు గొర్రెలను హతమార్చింది. కాగా, అగళి మండలం గాయత్రీ కాలనీ, పి.బ్యాడిగెరే, కరిదాసన్నపల్లి గ్రామాల్లో చిరుత సంచరిస్తూ గొర్రెలు, మేకలు, ఆవులు, తదితర వాటిపై దాడి చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి వేళలో పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా అటవీ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరారు. -
వద్దొద్దు.. ఇప్పుడే వద్దు!
‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది జిల్లా హెచ్చెల్సీ అధికారుల తీరు. ప్రకృతి కరుణించడంతో నిండుకుండలా మారిన తుంగభద్ర డ్యాం నుంచి జిల్లాకు నీటి విడుదలకు టీబీ బోర్డు సిద్ధమైనా.. హెచ్చెల్సీ అధికారులు మాత్రం ఇప్పుడే వద్దంటూ తిరకాసు పెట్టారు.అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ అధికారుల తాజా నిర్ణయం ఆయకట్టు రైతులకు తీరని నష్టం కలిగించేలా మారింది. జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురిసినా ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేశాడు. కానీ ఎగువన కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి కొద్దిరోజులుగా భారీ స్థాయిలో వరద చేరుకుంటోంది. త్వరలో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10 నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో జిల్లా హెచ్చెల్సీ అధికారులు హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి... ఇప్పుడే అవసరం లేదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ నీటి విడుదల ఇప్పుడే వదంటూ బోర్డుపై ఒత్తిళ్లు తీసుకెళ్లారు. నత్తనడకన పనులు చేపట్టి.. ఉమ్మడి జిల్లాకు వరదాయినిగా తుంగభద్ర జలాశయం నిలిచింది. కొన్నేళ్లుగా చెప్పుకునే స్థాయిలో వర్షాలు వస్తుండడంతో దాదాపు లక్ష ఎకరాలకు పైగా సాగునీరు, ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందిస్తున్నారు. ఇంతటి మహోన్నతమైన ప్రాజెక్ట్‌పై అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. హెచ్చెల్సీ ప్రధాన కాలువపై కల్వర్టులు కూలిపోవడంతో పలు చోట్ల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటరీల మరమ్మతు పనులు కూడా చేపట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి గత జనవరిలో దాదాపు రూ. 30 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. వెనువెంటనే పనులు చేపట్టాల్సింది పోయి ఏప్రిల్ వరకూ పట్టించుకోలేదు. ప్రస్తుతం కూడా నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలోహెచ్చెల్సీకి నీరు విడుదలైతే కాలువకు గండ్లు పడే ప్రమాదముంది. కల్వర్టులు, ఇతర పనులు జరుగుతున్నాయంటూ మరో పదిరోజులు గడువు కావాలని హెచ్చెల్సీ అధికారులు విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది హెచ్చెల్సీ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ నష్టం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని తీసుకునే అవకాశముంది. అయితే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాకు కేటాయించిన నీటి కోటాలో ఈ ఏడాది భారీ కోత పడింది. గతేడాది భారీ వర్షాలకు ఒక గేటు కొట్టుకుపోవడంతో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ ఉంచేందుకు వీలు కాదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేశారు. వాస్తవానికి కొత్త గేటు అమర్చడానికి ఐదారు నెలలకు పైగా సమయం ఉన్నా.. కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చినా గేటు ఏర్పాటు అంశంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో టెండర్లు పిలవడంలో జాప్యం చోటు చేసుకుని తాత్కలికంగా అమర్చిన గేటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో టీబీ డ్యాంలో 80 టీఎంసీలకు మించి నీటి నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. అంతకు మించి నీరు చేరుకుంటే దిగువకు వదిలేయాల్సిందే. ఈ నెల 10న హెచ్చెల్సీకి నీటి విడుదలకు టీబీ బోర్డు సుముఖత వద్దంటూ హెచ్చెల్సీ అధికారుల తిరకాసు అధికారుల నిర్ణయంతో ఆయకట్టు రైతులకు తీరని నష్టం ఇంకా నిర్ణయం తీసుకోలేదు హెచ్చెల్సీకి నీటిని తీసుకోవడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రైతులకు అవసరముందో.. లేదో.. అనే అంశంపై నీటి సంఘాల నాయకులతో చర్చిస్తాం. అవసరముందని చెబితే తప్పకుండా తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటిని తీసుకుంటాం. ఆలస్యమైనా పర్వాలేదని అంటే పనులను వేగవంతంగా పూర్తి చేసి, నీటిని తీసుకుంటాం. – విశ్వనాథరెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ, హెచ్చెల్సీఆయకట్టుకు తీరని నష్టం దామాషా ప్రకారం 140 టీఎంసీల నీటి లభ్యత ఉంటే హెచ్చెల్సీకి 32 టీఎంసీల నికర కేటాయింపులు ఉంటాయి. ఈసారి తుంగభద్ర జలాశయం భద్రత దృష్ట్యా 80 టీఎంసీలకు మించి నిల్వ ఉంచరాదని నిర్ణయించారు. దీంతో హెచ్చెల్సీకి కేవలం 18.396 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. ఇందులో 10 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోను, మిగిలిన 8.396 టీఎంసీల్లో ప్రవాహ నష్టాలు ఉంటాయి. ఇక మిగిలిన నీటిని ఆయకట్టుకు అందించాలి. ఫలితంగా హెచ్చెల్సీ పరిధిలో లక్ష ఎకరాలకు పైగా పంటల సాగు ప్రశ్నార్థకమైంది. ఇది హెచ్చెల్సీ ఆయకట్టు రైతులకు తీరని నష్టాన్ని చేకూరుస్తోంది. తుంగభద్ర నుంచి నీరు విడుదలయ్యే సమయం దగ్గరలోనే ఉందని తెలిసినా పనులు వేగవంతం చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కూటమి ప్రజాప్రతినిధులు కూడా తమకు ఆదాయం సమకూరే పనులపై మాత్రమే శ్రద్ద చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్
గుంతకల్లు: ప్రపంచ చదరంగ సమాఖ్య (ఎఫ్ఐడీఈ), అఖిల భారత చదరంగ సమాఖ్య (ఏఐసీఎఫ్) సంయుక్తంగా మంగళవారం విడుదల చేసిన చదరంగ క్రీడాకారుల రేటింగ్ జాబితాలో గుంతకల్లు చెందిన ఐదుగురు క్రీడాకారులకు అంతర్జాతీయ రేటింగ్ దక్కింది. ఈ మేరకు కోచ్‌లు అనిల్‌కుమార్, రామారావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బాలల విభాగంలో బాలాజీ (1,472), పునీత్‌రెడ్డి (14,712), కార్తీక్ (1,493), రాఘవ (1,478) అంతర్జాతీయ రేటింగ్ దక్కించుకున్నారన్నారు. బాలికల విభాగంలో 1,401 రేటింగ్‌తో గుంతకల్లు చెస్ క్రీడా చరిత్రలో మొట్టమొదటి రేటెడ్ ప్లేయర్‌గా జువైరా రికార్డు నమోదు చేసిందని తెలిపారు. ఈ–స్టాంపుల కుంభకోణంపై అధికారులకు సమాచారమిచ్చా ● టీడీపీ నేత ఉన్నం మారుతి చౌదరి అనంతపురం టవర్‌క్లాక్: కళ్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్త ఎర్రప్ప అలియాస్ బాబు ‘మీసేవ’ కేంద్రంగా సాగిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులకు తానే సమాచారం ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు, టీడీపీ నేత మారుతి చౌదరి తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎర్రప్ప మీసేవ కేంద్రంలో నకిలీ స్టాంపులు సృష్టిస్తున్నట్లు గతంలో అతని కారణంగా మీసేవ కేంద్రాలను మూసేసుకున్న వారు తన దృష్టికి తెచ్చారన్నారు. అందుకు ఆధారంగా ఉన్న పత్రాలను వాట్సాప్‌లో పంపడంతో వాటిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఇతర శాఖల అధికారులకు పంపి విచారణ చేయాల్సిందిగా కోరానన్నారు. ఈ–స్టాంపుల ట్యాంపరింగ్ ద్వారా ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతోనే తాను అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గించిన వారిని వదిలేసి పోలీసులు తనపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళతానన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి బురద జల్లుతున్నారని, ఈ కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. -
పెండింగ్ పనులు వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులకు సంబంధించిన పెండింగ్ పనులు వేగవంతం చేయాలని, వీలైనంత త్వరగా జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలసి ఎన్‌హెచ్ –342, ఎన్‌హెచ్ 716జీ, ఎన్‌హెచ్–455జీ రహదారుల భూసేకరణకు సంబంధించిన పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ.. రహదారి సౌకర్యం మెరుగైతే రవాణాకు ఇబ్బందులు ఉండవని, తద్వారా జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం జిల్లా మీదగా వివిధ రహదారులు నిర్మిస్తోందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, వాటి అభివృద్ధికి అదనంగా చేపడుతున్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రక్రియలో అటవీ, పర్యావరణ, కోర్టు సంబంధిత అంశాలు, అభ్యంతరాలు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ పెండింగ్ పనులను ఆర్డీఓలు మరోసారి పరిశీలించి సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలన్నారు. అనంతరం ఎన్‌హెచ్–342కి సంబంధించి బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి వద్ద భూసేకరణ, పుట్టపర్తి మండలం అమగొండపాళ్యం వద్ద భూసేకరణ బిల్లుల పెండింగ్ అంశాలపై సమీక్షించారు. ముదిగుబ్బ మండలం దొరిగిల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల గోడ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, వీవీఎస్ శర్మ, మహేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట సుబ్బయ్య, ఎన్‌హెచ్ ఏఐ పీడీ అశోక్ కుమార్, మేనేజర్ ముత్యాల రావు, డీఈ గిడ్డయ్య, ఆర్అండ్బీ డీఈ నాగరాజు, ఏఈటీ కుళ్లాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారులను త్వరగా అందుబాటులోకి తేవాలి అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం -
స్కూల్ బస్సుల కండీషన్‌పై ప్రత్యేక దృష్టి
అనంతపురం సెంట్రల్: విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్ బస్సుల కండీషన్‌పై ప్రత్యేక నిఘా ఉంచినట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్ వీర్రాజు పేర్కొన్నారు. స్కూల్ బస్సుల కండీషన్ అంశంపై రవాణాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఆర్టీఓ సురేష్నాయుడుతో కలసి జిల్లాలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో 600 పై చిలుకు స్కూల్, కళాశాలల బస్సులు ఉన్నాయన్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ బస్సులన్నీ కండీషన్లో ఉన్నాయో? లేదో పరిశీలించాని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధిక లోడు, ప్యాసింజర్లతో వెళ్లే గూడ్స్ వాహనాలు, ఇతర వాహనాలపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా తిరిగే వాహనాలను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశించారు. నగర శివారున వాహనాల ఛేజింగ్ నగర శివారున వాహనాల ఛేజింగ్ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారిని బెంబేలెత్తించింది. వివరాలు... జిల్లా రవాణా శాఖకు చెందిన ఏఎంవీఐ కేవీఎల్ఎన్ ప్రసాద్ మంగళవారం నగరంలోని టీవీ టవర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కర్ణాటకకు చెందిన రెండు బొలెరో వాహనాల నిండా చేపల వలలు, ఆపై బోట్లు (పుట్టి) వేసుకుని వాటిపై మనుషులు కూర్చొని ప్రయాణిస్తుండడం గమనించిన ఆయన వాటిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే బొలెరో డ్రైవర్లు ఆపకుండా శరవేగంతో దూసుకెళ్లి పోవడంతో ఏఎంవీఐ తన వాహనంలో వెంబడిస్తూ రాప్తాడు పంగల్ రోడ్డు దాటిన తర్వాత అడ్డుకున్నారు. వాహనాలను ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు. విచారణలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. వాహనాలకు పర్మిట్లు, ట్యాక్స్‌లు లేకపోవడం, ప్రమాదకరంగా ప్రజలను తీసుకెళుతుండడంతో కేసు నమోదు చేసి జరిమానా విధించారు. -
కొనసాగుతున్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరసన
ధర్మవరం: సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో ఆరో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం దీక్షల్లో మున్సిపల్ ఇంజినీరింగ్ సెక్షన్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు బొగ్గు నాగరాజు, జయకృష్ణ, అనిల్, కార్మికులు నల్లబ్యాడ్జీలతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీఓ నంబర్ 36 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, చనిపోయిన కార్మిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ జనాభా ప్రాతిపదికన కార్మికుల సంఖ్యను పెంచాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు దస్తగిరి, యోగి, కాటమయ్య, పెద్దన్న, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు
ఈ రైతు పేరు శివన్న. అమరాపురం మండలం కొర్రేవు గ్రామం. విత్తన కంపెనీల కోరిక మేరకు తన ఐదుఎకరాల వ్యవసాయ భూమిలో విత్తన పత్తి సాగు చేశారు. పంట సాగుకు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు పెట్టారు. దిగుబడి చేతికొచ్చే సమయానికి విత్తన కంపెనీలు ప్లేటు ఫిరాయించాయి. విత్తనాలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పాయి. కడుపు మండిన శివన్న ఎకరా విస్తీర్ణంలోని విత్తన పత్తి మొక్కలను పీకేశారు. బంగారు నగలు తాకట్టు పెట్టి పంట సాగుచేశానని, ఇప్పుడు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యనే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకునేనా? విత్తన పత్తి సాగు చేసిన మడకశిర రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి విత్తన కంపెనీలు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే ప్రభుత్వమే పత్తి విత్తనాలను రైతుల నుంచి కొనుగోలు చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.మడకశిర: విత్తన పత్తి (సీడ్ పత్తి) సాగుకు మడకశిర నియోజకవర్గం పెట్టింది పేరు. కానీ ఈసారి విత్తన పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దిగుబడి తామే కొనుగోలు చేస్తామంటూ హామీ ఇచ్చి సాగును ప్రోత్సహించిన పత్తి విత్తన కంపెనీలు ఇప్పుడు మాటమార్చడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కంపెనీల సహకారం.. పెరిగిన సాగు విస్తీర్ణం మామూలు పత్తితో పోలిస్తే విత్తన పత్తితో ఎక్కువ లాభాలుంటాయి. పెట్టుబడులు పోను ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. దీంతో రైతులు కొన్నేళ్ల నుంచి విత్తన పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని శిర, హిరియూర్, చెళ్లికెర, మధుగిరి, హొసదుర్గ, చిక్కనాయకనహళ్లి నియోజకవర్గాల్లోని రైతులు ఎక్కువగా విత్తన పత్తి సాగు చేసేవారు. వారిని చూసి మడకశిర నియోజకవర్గంలోని రైతులు కూడా విత్తన పత్తి వైపు దృష్టి సారించారు. దీంతో ఆయా విత్తన కంపెనీలు కూడా రైతులకు పూర్తి సహకారం అందిస్తూ వచ్చాయి. ముందుగానే పత్తి విత్తనాలకు ధర నిర్ణయించడంతో పాటు దిగుబడి వారే కొనుగోలు చేసేవారు. అంతేగాక రైతులకు ముందుగానే కొంత నగదును ఆడ్వాన్స్ ఇచ్చేవారు. పంట సాగుకు అవసరమైన మందులు, ఎరువులు, విత్తనాలను కూడా కంపెనీలే సరఫరా చేసేవి. దీంతో మడకశిర నియోజకవర్గంలో ఏటికేడు విత్తన పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. గత ఏడాది ఖరీఫ్‌లో క్వింటాల్ పత్తి విత్తనాలు రూ.50 వేలు పలకగా, రైతులంతా విత్తన పత్తిపై దృష్టి సారించారు. చేతులెత్తేసిన కంపెనీలు ఈ ఏడాది ఖరీఫ్‌లో కూడా విత్తన పత్తి సాగుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని విత్తన కంపెనీల ప్రతినిధులు చెప్పడంతో రైతులు మరోసారి విత్తన పత్తి సాగు చేశారు. విత్తనం, ఎరువులు, మందులు కంపెనీలే అందించాయి. అయితే ప్రస్తుతం విత్తన కంపెనీల ప్రతినిధులు పత్తి విత్తనాలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. ఎకరాకు రెండున్నర క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే కొనుగోలు చేస్తామని తేల్చిచెప్పారు. అయితే ఇప్పటికే రైతులు విత్తన పత్తి పంటపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఆడ, మగ పువ్వులను పంట సాగు ప్రక్రియలో క్రాస్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరగాలి. ఇందుకు కూలీలకు రోజుకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ సవ్యంగా సాగితే ఎకరాకు 9 క్వింటాళ్ల పంట చేతికి అందుతుంది. ప్రస్తుతం క్వింటాల్ పత్తి విత్తనాల ధర రూ.45 వేలు ఉండగా.. రైతుకు సుమారు రూ.4 లక్షలకుపైగా చేతికి అందుతుంది. పెట్టుబడి పోను రూ.3 లక్షలు మిగులుతాయి. అయితే పంట చేతికొచ్చే సమయంలో విత్తన కంపెనీలు చేతులెత్తేశాయి. ఎకరాకు రెండున్నర క్వింటాళ్లే కొంటామని చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిట్టుబాటు కాదని భావిస్తున్న కొందరు రైతులు పంటను పీకేస్తున్నారు. మరికొందరు గొర్రెలు, మేకలను వదిలి మేపుతున్నారు. విత్తన పత్తి సాగుకు కంపెనీల ప్రోత్సాహం పంట తామే కొనుగోలు చేస్తామని మొదట్లో భరోసా దిగుబడి చేతికందే సమయంలో మాటమార్చిన వైనం ఎకరాకు రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని మెలిక మిగిలిన పంటను ఏం చేసుకోవాలని వాపోతున్న రైతాంగంవిత్తనాలన్నీ కొనాలి నేను ఒకటిన్నర ఎకరాలో విత్తన పత్తిని సాగు చేశా. దాదాపు 9 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం విత్తన కంపెనీలు పూర్తి స్థాయిలో విత్తనాలను కొనుగోలు చేయబోమని చెబుతున్నాయి. మిగిలిన విత్తనాలను ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కావడం లేదు. విత్తన కంపెనీలు చెప్పిన మేరకు విత్తనాలన్నీ కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులు పూర్తిగా నష్ట పోవాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, హెచ్‌టీహళ్లి, రొళ్ల మండలం కంపెనీలు మోసం చేశాయి విత్తన కంపెనీలు మోసం చేస్తున్నాయి. మొదట పూర్తి స్థాయిలో విత్తనాలు కొనుగోలు చేస్తామని చెప్పాయి. పంట సాగు చేసిన తర్వాత ఎకరాకు రెండున్నర క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని చెబుతున్నాయి. నేను మూడెకరాల్లో విత్తన పత్తి వేశా. దాదాపు 24 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇందులో ఏడున్నర క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేస్తామని అంటున్నారు. మిగిలిన విత్తనాలను ఎక్కడ అమ్ముకోవాలో తెలియడం లేదు. విత్తన కంపెనీల మోసంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. –ఇంతియాజ్, బసవనపల్లి, అమరాపురం మండలం -
సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం
● పింఛన్ల పంపిణీలో కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రీదేవి, ఎంపీడీఓ నటరాజ్ పాల్గొన్నారు. జిల్లాలో 93.16 శాతం పింఛన్లు పంపిణీ తొలిరోజు మంగళవారం జిల్లాలో 93.16 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య తెలిపారు. తెల్లవారుజాము నుంచే సచివాలయ అధికారులు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. ఫలితంగా తొలి రోజు 2,60,883 పింఛన్లకు గాను 2,44,010 పింఛన్లు పూర్తి చేశారని వివరించారు. మిగిలిన పింఛన్లను బుధవారం పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బాలుర ఫుట్‌బాల్ విజేత ‘శ్రీసత్యసాయి’ మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని వేదా పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు సత్తా చాటి విజేతగా నిలిచింది. మూడు రోజులుగా పోటాపోటీగా జరుగుతున్న పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు ఒక్కో దశను దాటుకుంటూ ఫైనల్స్‌కు చేరింది. మంగళవారం ఫైనల్స్‌లో తిరుపతి జట్టుతో తలపడి విజయం సాధించింది. చివరివరకూ పోరాడిన తిరుపతి జట్టు రన్నరప్‌గా సరిపెట్టుకుంది. తృతీయ స్థానంలో అనంతపురం జట్టు నిలిచింది. ఈ టోర్నమెంటులో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఈనెల మూడో వారంలో అమృతసర్‌లో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు పంపనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌కుమార్, మురళీధర్ తెలిపారు. విజేతలకు వేదా పాఠశాల కరస్పాండెంట్ రామలింగారెడ్డి, పోతబోలు సర్పంచు ఈశ్వరయ్య ట్రోఫీ, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కోచ్‌లు సిరాజ్, చినబాబు, శ్రీనివాస్, మహేంద్ర, కమలేష్, బాలాజీ, నరేంద్ర పాల్గొన్నారు. -
మోసం చంద్రబాబు నైజం
పరిగి: ‘‘మోసం చందబ్రాబు నైజం.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారు. అందుకే ఏడాదిలోపే ప్రజలూ ఆయన మోసాన్ని గుర్తించారు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. మంగళవారం ఆమె పరిగిలో క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ‘చంద్రబాబు ష్యూరిటీ...మోసం గ్యారెంటీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... ఏడాది కాలంలోనే కూటమి సర్కార్ ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలయ్యాయన్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా టీడీపీ అధినాయకత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ప్రజలు ఒత్తిడి తేవడంతో ఆగమేఘాలపై హడావుడిగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేశారని, అయిచే ఎంతోమంది అర్హులకు అన్యాయం చేశారన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెల గడిచినా నేటికీ రైతు భరోసా పథకం సొమ్ము నయా పైసా రైతులకు అందించలేదన్నారు. అందుకే జనమంతా నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను తలచుకుంటున్నారన్నారు. కూటమి సర్కార్ ‘తల్లికి వందనం’ అంటూ గగ్గోలు పెడుతున్నా.. అందరూ ‘అమ్మ ఒడి’ గానే ప్రజలు కీర్తిస్తున్నారన్నారు. మోస పూరిత వాగ్ధా నాలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వైఫల్యాలను గ్రామగ్రామానా వివరించేందుకే ‘చంద్రబాబు ష్యూరిటీ...మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చందబ్రాబు హయాంలో ప్రజలకు జరిగిన అన్యాయం తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పరిగిలో ‘చంద్రబాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ’ పోస్టర్ల ఆవిష్కరణ -
కూటమి పాలనలో పీఆర్ వ్యవస్థ నిర్వీర్యం
ప్రశాంతి నిలయం: కూటమి ప్రభుత్వ అశాసీ్త్రయ నిర్ణయాలతో పంచాయతీ రాజ్ (పీఆర్) వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ టీఎస్ చేతన్‌కు వినతి పత్రం అందించి, మాట్లాడారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,150 కోట్లను కూటమి ప్రభుత్వం దారి మళ్లించడం సిగ్గు చేటన్నారు. వెంటనే ఈ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు దక్కాల్సిన ఉపాధి నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ వారి పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించకుండా చేసి ఆ డబ్బులనూ కూటమి ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. తక్షణం సర్పంచుల పిల్లలకు తల్లికి వందనం పథకం లబ్ధి చేకూర్చాలని కోరారు. బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు అధికారాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 1,320 మంది పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే పోస్టింగ్ ఇచ్చి పెండింగ్‌లో ఉన్న 9 నెలల వేతనం విడుదల చేయాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనం పెంచడంతో పాటు వేతనాలను సకాలంలో చెల్లించాలన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాల వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు కులశేఖరరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, రేగాటిపల్లి ఎంపీటీసీ రవీంద్ర రెడ్డి, మంజునాథరెడ్డి, వైఎస్సార్సీపీ యూత్ విభాగం నాయకులు కొండారెడ్డి, భోగి కొండారెడ్డి, విశ్వనాథరెడ్డి, అశ్వత్థరెడ్డి, రాజారెడ్డి, సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా -
సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ చూపాలి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన.. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పీజీఆర్ఎస్, హౌసింగ్, పౌర సరఫరాలు, నీటి పన్నులు తదితర అంశాలపై ఆర్డీఓలు, పౌరసరఫరాల శాఖ అధికారులు, జిల్లా సర్వే అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలన్నింటికీ సరైన పరిష్కారం చూపాలన్నారు. రైతు భరోసా, తల్లికి వందనం కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జూలై నెలాఖరులోపు రేషన్ కార్డుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంఎల్ఎస్ గోడౌన్లను తనిఖీ చేయాలన్నారు. పురుగు మందు ప్రభావంతో రైతు మృతి చెన్నేకొత్తపల్లి: పొలంలో పురుగుల మందు పిచికారీ చేసి ఇంటికి వచ్చిన రైతు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండల పరిధిలోని న్యామద్దల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు...గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ (53) మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. సోమవారం ఉదయం పంటకు రసాయన మందు పిచికారీ చేసి మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ప్రైవేటు వాహనంలో చికిత్స నిమిత్తం చెన్నేకొత్తపల్లికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. లక్ష్మీనారాయణకు భార్య వరలక్ష్మితో పాటు కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కాగా, పంటలకు రసాయన ఎరువులు పిచికారీ చేసే సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. గూగూడులో కొలువు తీరిన పీర్లు నార్పల: మండల పరిధిలోని గూగూడు మోహర్రం బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఆలయంలో పీర్లు కొలువు తీరాయి. ఈ సందర్భంగా ఆలయంలో కుళ్లాయి స్వామి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శించుకున్నారు. అగ్ని గుండం వద్ద భక్తిశ్రద్ధలు పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం కుళ్లాయి స్వామికి నిత్య పూజ నివేదన నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. -
ఫెన్సింగ్ పోటీల్లో జస్వంత్‌రెడ్డి సత్తా
తలుపుల : రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో తొగటవాండ్లపల్లికి చెందిన బి.రామాంజులురెడ్డి, సరస్వతి దంపతుల కుమారుడు బి.జస్వంత్‌రెడ్డి సత్తా చాటాడు. జూన్ 29న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన అండర్ –10 మినీ స్టేట్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ఇప్పి విభాగంలో సిల్వర్ మెడల్ సాదించాడు. అనంతపురం ఎంకే స్పోర్ట్ అకాడమీలో ఫెన్సింగ్‌లో జస్వంత్‌రెడ్డి శిక్షణ తీసుకున్నాడు. సిల్వర్ మెడల్ పొందినందుకు జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా సెక్రటరీ సరస్వతి, స్పోర్ట్ అకాడమీ కోచ్ రాహుల్ అభినందించారు. జూలై 5, 6, 7 తేదీల్లో జరగనున్న మినీ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో జస్వంత్ పాల్గొననున్నట్లు కోచ్ రాహుల్ తెలిపారు. -
వివాహేతర సంబంధంతోనే హత్య
హిందూపురం: మూడు రోజుల క్రితం లేపాక్షి మండలంలో చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా నిర్ధారిస్తూ ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. హిందూపురంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ మహేష్ వెల్లడించారు. గత నెల 24వ తేదీ రాత్రి 10 గంటల నుంచి లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన రవికుమార్ (36) కనిపించకపోడంతో ఆయన తండ్రి బోయ అశ్వత్థప్ప ఫిర్యాదు మేరకు అదే నెల 25న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఆనంద్, గోవిందరాజుపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అందిన సమాచారం మేరకు గత నెల 25న రాత్రి గ్రామ శివారులోని నీటి కుంటలో బయటపడిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అశ్వత్థప్ప కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం తన భర్తదేనంటూ రవికుమార్ భార్య గీత నిర్ధారించింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త గీత ఫిర్యాదుతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. అనుమానితులైన గోవిందరాజు, ఆనంద్‌ను సోమవారం మధ్యాహ్నం మైదుగోళం సమీపంలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, లేపాక్షి ఎస్ఐ నరేంద్ర అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో తామే హత్య చేసినట్లుగా అంగీకరించారు. ఆనంద్ భార్యతో రవికుమార్ వివాహేతర సంబంధం కొనసాగించేవాడని, ఈ విషయంగా పలుమార్లు మందలించినా అతని తీరు మారకపోవడంతో హతమార్చాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత నెల 24న సాయంకాలం మందు పార్టీ ఏర్పాటు చేసుకుందామని ఆనంద్ తెలపడంతో రవికుమార్ తన ఇంటి నుంచి చికెన్ చేయించుకుని బాక్స్‌లో తీసుకుని ఆనంద్, అతని తమ్ముడు గోవిందరాజుతో కలసి మైదుగోళం శివారులోని కురుబ లింగప్ప బీడు భూమికి చేరుకున్నారు. అక్కడ చాలా సేపటి వరకూ మద్యం తాగుతూనే ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో రవికుమార్ మద్యం మత్తులో జోగుతుండగా ఇదే అదునుగా భావించి అన్నదమ్ములు ముందుగానే సిద్ధం చేసుకున్న వేటకొడవలితో నరికారు. మొండెం నుంచి వేరుపడిన తలను ప్లాస్టిక్ సంచిలో వేసి, మొండెంతో పాటు లింగప్ప పొలంలోనే ఉన్న నీటి కుంటలో పడేసి వెళ్లిపోయారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారి నుంచి హత్యకు ఉపయోగించిన వేటకొడవలి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. యువకుడి హత్యకేసులో వీడిన మిస్టరీ నిందితుల అరెస్ట్ -
నేడు పింఛన్ల పంపిణీ
పుట్టపర్తి టౌన్: అర్హులైన లబ్ధిదారులకు జూలై నెలకు సంబంఽధించి పింఛన్లను మంగళవారం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ పీడీ నరసయ్య సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 2,60,883 మంది లబ్ధిదారులకు రూ 114.09 కోట్లు మంజూరు కాగా, ఇందుకు సంబంఽధించిన నగదును సోమవారం బ్యాంక్‌ల నుంచి విత్‌డ్రా చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 2వ తేదీ కూడా పంపిణీ ప్రక్రియ ఉంటుంది.నేటి నుంచి తూమాటి దోణప్ప శత జయంతి ఉత్సవాలుఉరవకొండ: తెలుగు సాహితీ విజ్ఞాన గని, బహుభాషా పండితుడు ఆచార్య తూమాటి దోణప్ప శత జయంతి వేడుకలు మంగళవారంనుంచి హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్నాయి. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన దోణప్ప 1926, జూలై 1న సంజప్ప, తిమ్మక్క దంపతులకు జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. హైదారాబాదులో ఆవిర్భవించిన తెలుగు విజ్ఞాన పీఠం డైరెక్టరుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సాహితీ సేవలకు గుర్తుగా తెలుగు సాహితీ జగత్తు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు చేసింది.గురుకులాల్లో ఇంటర్మిగులు సీట్లకు కౌన్సెలింగ్అనంతపురం రూరల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయ సమన్వయ అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ నుంచి సమాచారం అందిన విద్యార్థులు మాత్రమే హాజరు కావాలన్నారు. ఈ నెల 2న బీ పప్పూరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురకుల పాఠశాలలో బాలికలకు ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, బాలురకు 2 నుంచి 4 గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.వ్యక్తి దుర్మరణంపెనుకొండ: కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమందేపల్లి మండలం వెలగమాకులపల్లికి చెందిన గంగాధర్(40) తన సోదరుడు భాస్కర్, కుమారుడు ప్రణీత్‌తో కలసి సోమవారం ద్విచక్ర వాహనంపై పెనుకొండకు బయలుదేరాడు. నగర పంచాయతీ పరిధిలోని రబ్బర్ ఫ్యాక్టరీ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొనడంతో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్, ప్రణీత్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.ఇరు పార్టీల కార్యకర్తలపై సుమోటోగా కేసు నమోదుతాడిపత్రి టౌన్: గత నెల 29న పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్న కారణంతో టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన 20 మంది కార్యకర్తలపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. వీరిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రవితేజారెడ్డి, నవీన్ రెడ్డి, హనుమంతరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ప్రణయ్ తదితరులు, అలాగే టీడీపీ కార్యకర్తలు మల్లికార్జున, పరమేష్, సుదర్శన్‌రెడ్డి, ఖాదర్, యాసిన్ తదితరులు ఉన్నారు.అనుమానాస్పద మృతికుందుర్పి: మండలంలోని ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె కుమార్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఉదయం మరో ఇద్దరు కూలీలతో కలసి అదే గ్రామానికి చెందిన జోగప్పగారి హనుమంతు ఇంటి నిర్మాణ పనుల్లో కుమార్ పాల్గొన్నాడు. మధ్యాహ్నం ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన హనుమంతు, తదితరులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక కుమార్ మృతి చెందాడు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుమార్ కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్యాడికి: పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. యాడికిలోని అంకాలమ్మ వీధికి చెందిన వృద్ధుడు బోయ ఆదెప్ప మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదెప్పపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.సజావుగా ఏఎన్ఎంల బదిలీల కౌన్సెలింగ్అనంతపురం మెడికల్: డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ఏఎన్ఎంల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 803 మంది ఏఎన్ఎంలకు జూమ్ వీడియా ద్వారా డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. అర్ధరాత్రి వరకూ ఈ ప్రక్రియ సాగింది. సీనియర్ అసిస్టెంట్ కమలాకర్ రాజు, తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 740 మందికి వారి సీనియారిటీ, ప్రగతి ఆధారంగా పోస్టింగ్ కల్పించారు. -
బదిలీల నరకయాతన
అనంతపురం: ఉమ్మడి జిల్లా సచివాలయ మహిళా పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియ నరక యాతనను మిగిల్చింది. అనంతపురంలోని డీపీఓలో చేపట్టిన ఈ ప్రక్రియకు ఉదయం 8 గంటలకంతా హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలైనా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టలేదు. 12 గంటల తర్వాత తొలుత స్పౌజ్, పీహెచ్సీ, మెడికల్ సర్టిఫికెట్ ఉన్న వారికి కౌన్సెలింగ్ చేపట్టారు. మూడు గంటల వరకు జనరల్ కౌన్సెలింగ్ ప్రారంభించలేదు. తెల్లవారుజామున మూడు గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో నిరీక్షణ తప్పలేదు. దీంతో చంటి పిల్లల తల్లులు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. అవివాహితులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులను లోపలకు అనుమతించకపోవడంతో వారు బయటే నిరీక్షించాల్సి వచ్చింది. మహిళల పట్ల పోలీసు శాఖ నిర్దయగా వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు ఆదోనిలో ఓ మహిళా కానిస్టేబుల్ చనిపోయిన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు స్పందించి ఆగమేఘాలపై పిల్లల తల్లులకు పాలు, జ్యూస్ అందించారు. కౌన్సెలింగ్ కేంద్రంపైన సేద తీరేందుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కోటాలో అభ్యంతరాలు స్పౌజ్ కోటాలో బదిలీలకు సంబంధించి తమ భర్త ఎక్కడ ఉంటాడో ఆ పరిసరాల్లోనే స్థానాన్ని కోరుకోవాలి. అయితే తాడిపత్రి, హిందూపురం పరిసరాల్లో పనిచేస్తున్న కొందరు ఇతర ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వారిని స్పౌజ్ పరిసర ప్రాంతాల్లోని స్థానాలు కేటాయించారు. అర్ధరాత్రి ఆందోళన: గణనీయమైన ర్యాంకు ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పించి వారు కోరుకున్న చోటు కేటాయించాలి. అలాగే రేషనలైజేషన్‌లో పోస్టు కోల్పోయిన వారికి జనరల్ కేటగిరి కింద చివరన పిలవాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా కౌన్సెలింగ్ చేపట్టారు. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యపు సమాధానంతో పరిస్థితి అదుపు తప్పి అర్ధరాత్రి కౌన్సెలింగ్ ఆగిపోయింది. తిరిగి అధికారులు నచ్చచెప్పి కౌన్సెలింగ్‌ను కొనసాగించారు. -
అత్యాచారాలు.. దోపిడీలు
చిలమత్తూరు: హిందూపురం నియోజకవర్గంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, చోరీలు పెచ్చుమీరిపోతున్నాయి. రోజుకో చోట ఘటనలు వెలుగుచూస్తుండటంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. ఏడాదిగా నియోజకవర్గంలో రోజూ ఏదో ఒక ఘటన జరుగుతున్నా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సంఘటన జరిగిన తర్వాత హడావుడి చేసే పోలీసు యంత్రాంగం ముందస్తుగా నేరాలను తగ్గించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అత్తాకోడలిపై అత్యాచారంతో మొదలు.. కూటమి సర్కార్ కొలువుదీరాక హిందూపురం నియోజకవర్గంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. పోలీసులు ఎవరినైనా పట్టుకున్నా.. వెంటనే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ వస్తోంది. దీంతో పోలీసులు తమకెందుకని భావించి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో ఏడాది కాలంలో హిందూపురంలో అకృత్యాలు, దౌర్జన్యాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ● చిలమత్తూరు మండలంలో గతేడాది అక్టోబరులో కొందరు దుండగులు అత్తాకోడలిపై అత్యాచారం చేయడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అప్పుడు ప్రారంభమైన నేరాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. మొన్న చౌళూరులో అత్యాచార యత్నం, నేడు తూముకుంటలో హత్య, కిరికెరలో భారీ దోపిడీ..ఇలా ఏడాదిగా హిందూపురం..నేరస్తుల పరమైంది. ● చిలమత్తూరు మండలంలోని కందుర్పర్తి, చౌళూరు గ్రామాల్లో బాలికలపై జరిగిన అత్యాచార యత్నాలు కూడా కూటమి సర్కార్ హయాంలో చోటుచేసుకున్నవే. ● 2024 జూలైలో హిందూపురం మండలంలోని గొల్లాపురంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సతీష్‌ను టీడీపీ నేతలు దారుణంగా కొట్టి చంపారు. నిందితులను రిమాండ్‌కు పంపి పోలీసులు చేతులు దులుపుకోవడంతో వారు బెయిల్‌పై బయటకు వచ్చి బాధితులను బెదిరిస్తున్నారు. పైగా తమకు ఎవరు అడ్డుచెప్పినా అంతం చేస్తామంటూ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ● తాజాగా ఈనెల 26వ తేదీన లేపాక్షి మండలం మైదుగోళంలో రవికుమార్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గంగోత్రి బార్ వద్ద ఆటోడ్రైవర్ అశోక్‌తో జరిగిన గొడవలో అతను మృత్యువాత పడ్డాడు. ఇక పేకాట, అక్రమ మద్యం, మట్కాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పోలీసుశాఖలోని కొందరి అండతోనే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పెరిగిపోయిన దోపిడీలు, దొంగతనాలు ● హిందూపురం రూరల్ మండలంలోని కిరికెర గ్రామం వెంకటాద్రి లేఅవుట్లో ఈనెల 26వ తేదీ రాత్రి నిత్యానందరెడ్డి ఇంట్లో జరిగిన భారీ దోపిడీ నియోజకవర్గంలో జరిగిన మరో సంచలనం. దుండగులు తుపాకులతో బెదిరించి మరీ 25 తులాల బంగారు నగలను దోపిడీ చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకటాద్రి లేఅవుట్లో ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటన పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతోంది. నిందితులను పట్టుకోవడానికి ఎనిమిది బృందాలు రంగంలోకి దిగినా.. ఇంత వరకూ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ● మరవకొత్తపల్లి బీసీ కాలనీలోనూ పట్టపగలే దుండగులు చోరీ చేసి బంగారం ఎత్తుకెళ్లారు. డ్రోన్లతో నిఘా పెంచుతామని ప్రకటించుకున్న పోలీసులు ఆ దిశగా అడుగులు కూడా వేయలేదు. సీసీ కెమెరాల ఏర్పాటులోనూ అలసత్వం కనిపిస్తోంది. చిలమత్తూరు మండలంలో గతేడాదిగా కొడికొండ చెక్‌పోస్ట్‌తో పాటుగా మండలంలోని పలు చోట్ల బైక్ దొంగతనాలు, ఇళ్లలో చోరీలు కూడా జరిగాయి. అయినా పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. పట్టించుకోని ఎమ్మెల్యే బాలకృష్ణ సినీనటుడు బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఎప్పుడో చుట్టం చూపుగా హిందూపురం వచ్చి వెళ్తుంటారు. పాలన అంతా పీఏల కనుసన్నల్లోనే సాగుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గంపై పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. దీంతో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. ముఖ్యంగా పోలీసు శాఖ అధ్వాన్నంగా తయారైందని స్థానికులే చెబుతున్నారు. డీఎస్పీతో పాటు నలుగురు సీఐలు ఉన్నా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. హిందూపురంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు ఏడాది కాలంలోనే పెచ్చుమీరిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు డీఎస్పీతో పాటు నలుగురు సీఐలున్నా ప్రయోజనం శూన్యం భయాందోళనలో నియోజకవర్గ ప్రజానీకం -
‘మోడల్’ సీట్లు అమ్ముకుంటున్నారు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కనగానపల్లి మోడల్ స్కూల్ ప్రవేశాల వ్యవహారం చర్చనీయాంశమైంది. సాక్షాత్తు ఆ పాఠశాల వైస్ చైర్మన్, టీడీపీ నాయకుడు పోతలయ్య తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యే పరిటాల సునీతకు వివరిస్తూ ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టు నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. ఏం జరిగిందంటే... కనగానపల్లి మోడల్ స్కూల్లో 6 నుంచి ఇంటర్ వరకూ తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతికి 40 సీట్లు ఉంటాయి. వసతి గృహంలో మాత్రం 100 సీట్లే అందుబాటులో ఉన్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కౌన్సెలింగ్ ద్వారా పలువురికి ప్రవేశాలు కల్పించారు. తాజాగా సోమవారం మిగులు సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో పాఠశాల వైస్ చైర్మన్, టీడీపీ నాయకుడు పోతలయ్య పాఠశాల వద్దకు వెళ్లి అర్హులైన విద్యార్థినులకు సీట్లు ఇవ్వాలని కోరారు. అయితే ప్రిన్సిపాల్ రవికిరణ్ సీట్లు లేవని చెప్పడంతో అతను కంగుతిన్నాడు. మిగులుసీట్లు ఎవరికిచ్చారు..ఎలా ఇచ్చారని ప్రశ్నించగా..ప్రిన్సిపాల్ సమాధానం చెప్పలేదు. కాగా, డబ్బులు తీసుకుని సీట్లు కేటాయించారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించడంతో పోతలయ్య వివరాలు సేకరించారు. అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులతో కలిసి కనగానపల్లి మోడల్ స్కూల్లో జరిగిన అడ్మిషన్ల కుంభకోణాన్ని పరిటాల సునీతకు వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ రవికిరణ్ సీట్లు అమ్ముకుంటూ అర్హులైన పేద విద్యార్థినులకు అన్యాయం చేస్తున్నారన్నారు. దీనిపై వెంటనే స్పందించి ప్రిన్సిపాల్‌పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పోస్టు సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. ఆవేదన వ్యక్తం చేస్తూ కనగానపల్లి మోడల్ పాఠశాల వైస్ చైర్మన్ సోషల్ మీడియాలో పోస్ట్ -
ప్రజా ప్రదక్షిణ వేదిక
10,187తన ఇంటిని ఇతరులు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని హిందూపురం డీబీ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఇప్పటి వరకు 14 సార్లు అర్జీలిచ్చారు. అయినా కనీస స్పందన లేదు. దీంతో జిల్లా రిజిస్ట్రార్‌కు.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నిసార్లు తిరిగినా.. ఖర్చులు తప్ప ఉపయోగం లేదని బాధితుడు వాపోయాడు. పాలకులు, అధికారుల తీరుపై నమ్మకం పోయిందంటున్నాడు. రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్లుగా కర్ణాటకలో నివాసం ఉంటోంది. వారి భూమిని మూడు సర్వే నంబర్లలో కలిపి 5 ఎకరాలను పేరూరు గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆన్లైన్లో తమ పేరుపై ఎక్కించుకున్నారు. ఇటీవల ఆన్లైన్లో వన్–బీ చూడగా.. ఆ ఖాతా నంబరుపై మరొకరి పేరు వస్తుండటంతో బాధితులు మండల, డివిజన్ స్థాయిలో అర్జీలిచ్చారు. ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్‌కు వెళ్లి వరుసగా మూడు వారాలు అర్జీలిచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని బాధితులు వాపోయారు. సాక్షి, పుట్టపర్తి ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇస్తే చాలా... ఎంతటి సమస్యనైనా అధికారులే మీ వద్దకు వచ్చి పరిష్కరిస్తారు’’ అంటూ పాలకులు గొప్పలు చెబుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేస్తే.. ఆన్లైన్ ద్వారా నేరుగా సీఎంఓ కు చేరుతుందని, గంటల వ్యవధిలోనే స్పందన వస్తుందంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. నిజమే అనుకున్న జనం కలెక్టరేట్ వరకూ తమ సమస్యపై అర్జీ ఇస్తే అవన్నీ బుట్టదాఖలవుతున్నాయి. దీంతో జనం ఒకే సమస్యపై పదేపదే అర్జీలిస్తున్నారు. అయినా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. పైగా సమస్య పరిష్కారమైనట్లు సెల్ఫోన్లకు మెసేజ్‌లు వస్తుండటంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ సమస్యలే అధికం.. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రతి సోమవారం వివిధ సమస్యలపై ప్రజల నుంచి సగటున 500 వరకు అర్జీలు అందుతుంటాయి. అందులో 400 వరకు (80 శాతం) రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. సాగులో ఒకరుంటే.. ఆన్లైన్లో మరొకరి పేరు ఉంటోంది. భూమి ఒకరి పేరు మీద ఉంటే.. ఇద్దరి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు బయటకు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూటమి నాయకులే భూ కబ్జాలకు పాల్పడుతుండటంతో ఏడాది వ్యవధిలోనే భూ తగాదాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో జనం మండల, డివిజన్ స్థాయి తొలుత ఫిర్యాదు చేస్తున్నారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలిస్తున్నారు. అయితే కలెక్టరేట్లో ఇచ్చిన అర్జీని మళ్లీ డివిజన్ లేదా మండల అధికారులకే పంపుతుండటంతో సమస్యల పరిష్కారం అటకెక్కుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని ప్రదక్షిణ.. జిల్లాలో 32 మండలాలుండగా.. తనకల్లు, నల్లచెరువు, అమడగూరు, అమరాపురం, రొళ్ల, గుడిబండ, అగళి, రామగిరి, కనగానపల్లి, పరిగి మండలాలు జిల్లా కేంద్రానికి చాలా దూరంలో ఉంటాయి. ఓసారి వచ్చి వెళ్లాలంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. పైగా ఒకరోజు పనులు మానుకోవాల్సిందే. దీంతో ఆయా మండలాల వారు తమ సమస్యలపై తొలుత స్థానిక మండల, డివిజన్ స్థాయిలోనే ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ పరిష్కారం కాకపోవడంతో వ్యయ, ప్రయాసల కోర్చి పుట్టపర్తిలోని కలెక్టరేట్ వరకూ వస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పరిష్కార వేదికకు అందిన అర్జీలు (వివరాలన్నీ జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ) 5,9342,313 తూతూ మంత్రంగా ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అర్జీలన్నీ బుట్టదాఖలు.. పరిష్కారమైనట్లు మెసేజ్‌లు ప్రతి వారం కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ ఇచ్చినా ఫలితం శూన్యం కూటమి సర్కారు తీరుపై జనం లబోదిబో 7,3022,885ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు.. నా వ్యవసాయ మోటర్‌కు విద్యుత్ కనెక్షన్ కోసం రూ.1.40 లక్షలు చెల్లించాను. ఏడాది కావస్తున్నా.. ఇప్పటి వరకు మెటీరియల్ ఇవ్వలేదు. కేవలం స్తంభాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నాతో డబ్బులు తీసుకున్న ఏఈ బదిలీపై వెళ్లారు. కొత్తగా వచ్చిన వాళ్లేమో.. మాకు తెలీదంటున్నారు. ఇప్పటికే విద్యుత్ ఎస్ఈ కార్యాలయంతో పాటు కలెక్టరేట్లో ఎనిమిది సార్లు అర్జీలిచ్చినా పట్టించుకున్న వారే లేరు. – రాజా, కొండకమర్ల, ఓడీ చెరువు మండలం నడవలేని స్థితిలోనూ.. వస్తూనే ఉన్నా నా భూమిని మరో వ్యక్తి ఆక్రమించాడు. పట్టా పాసు పుస్తకాలు చేయించుకుని నన్ను రానివ్వడం లేదు. ఇప్పటికే ఆరుసార్లు కలెక్టరేట్లో అర్జీలిచ్చిన.. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అంతకుముందు తనకల్లు తహసీల్దార్, కదిరి ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేశాను. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నడవలేని స్థితిలో పలుమార్లు కలెక్టరేట్‌కు వస్తున్నా.. నా భూమిని నాకు అప్పజెప్పలేకపోతున్నారు. పరిష్కరిస్తామని చెబుతుండటంతో ఆశతో వస్తున్నా. – కొండప్పనాయక్, మల్లిరెడ్డిపల్లి, తనకల్లు మండలంఅర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా ప్రజల నుంచి అందే అర్జీలన్నింటినీ సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 266 అర్జీలు అందగా..వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్తే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామ సుబ్బయ్య, ఆర్డీఓ సువర్ణతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఉన్నత విద్య అభ్యసిస్తున్న 8 మంది విభిన్న ప్రతిభావంతులకు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ సమకూర్చిన ల్యాప్‌టాప్‌లను కలెక్టర్ పంపిణీ చేశారు. -
‘పోలీసు స్పందన’కు 60 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 60 వినతులు అందాయి. వినతులను ఎస్పీ రత్న స్వయంగా స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. మహిళలు, వికలాంగుల వద్దకు నేరుగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, డీఎస్పీ విజయకుమార్, ఎస్బీ సీఐ బాల సుబ్రహ్మణ్యంరెడ్డి పాల్గొన్నారు. ‘108’లో ప్రసవం మడకశిర రూరల్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌లోనే ప్రసవించింది. వివరాలు.. మడకశిర మండలం హెచ్ఆర్ పాళ్యం గ్రామానికి చెందిన గర్భిణి మహాలక్ష్మికి ఆదివారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని గర్భిణిని పావగడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి పైలెట్ తిమ్మప్ప సాయంతో ఈఎంటీ మంజుల ఆమెకు కాన్పు చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆస్పత్రికి చేర్చారు. పరీక్షించిన వైద్యులు తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి ఈ సందర్భంగా బాలింత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆత్మహత్యాయత్నం కాదు.. హత్యాయత్నం!’ ధర్మవరం అర్బన్: స్థానిక గీతానగర్‌కు చెందిన వివాహిత రమాదేవిని ఆదివారం రాత్రి ఫిట్స్ వచ్చాయంటూ కుటుంబ సభ్యులు ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమాదేవిని ఆమె పుట్టింటి తరఫు బంధువులు వెళ్లి పరామర్శించారు. రమాదేవికి ఫిట్స్ రాలేదని ఉరి వేసి హత్య చేయాలని చూశారంటూ అనంతపురంలోని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ స్పందించి ఓ కానిస్టేబుల్‌ను అనంతపురంలోని ఆసుపత్రికి పంపించారు. వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిందా? లేక ఎవరైనా హత్య చేసేందుకు ప్రయత్నించారా? అనేది తేలాల్సి ఉంది. -
పంచాయతీకే పంగనామం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఇది రామగిరి... ఇక్కడ మేం ఏమైనా చేయగలం... అందినకాడికి దోచుకుంటాం ... లేదంటే లాక్కుంటాం.. అంటూ టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలమైన రామగిరి మండలంలోని పేరూరు పంచాయతీలో టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ బాగోతం బయటపడింది. పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ను గత సంవత్సర కాలంగా సొంత పనులకు వాడుకోవడమే కాదు రోజూ చుట్టు పక్కన ఉన్న గ్రామాల రైతులకు బాడుగలకు పంపుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు. అంతేకాదు ఏకంగా ట్రాలీని సమీపంలోని కర్ణాటక ప్రాంతంలోని సోలార్కు లీజ్‌కు ఇచ్చాడంటే ఎంత ఘనుడో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకోని అధికారులు.. గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. అలాగే పంచాయతీ అభివృద్ధికి చెత్త తరలింపునకు ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆయా ట్రాక్టర్లను టీడీపీ నాయకులు తమ ఆధీనంలో ఉంచుకొని సొంత పనులకు వాడుకుంటుండటం గమనార్హం. పేరూరులోనే కాదు మండలంలోని అన్ని పంచాయతీల్లో ఇదే రీతిలో ట్రాక్టర్లను సొంతానికి వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇంత జరుగుతున్నా పంచాయతీరాజ్‌శాఖకు చెందిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం ఇప్పటికై నా డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పవన్‌కల్యాణ్ ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా పంచాయతీల్లో ట్రాక్టర్లను వెనక్కు తీసుకొని పంచాయతీల అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేరూరు పంచాయతీలో టీడీపీ మండల కన్వీనర్ దౌర్జన్యం ఏడాదిగా చెత్త తరలించే ట్రాక్టర్‌ను బాడుగకు పంపుతున్న వైనం మిగతా చోట్లా ఇదే రీతిలో దోచుకుంటున్నారన్న విమర్శలు -
పోలీసుల అదుపులో టీడీపీ నేత
● సొంత పార్టీ నేతపై దాడిలో ప్రమేయం పెనుకొండ/రూరల్: మండలంలోని మునిమడుగు గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ చిన్న వెంకటరాముడిని కొత్తచెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మునిమడుగుకు చెందిన టీడీపీ నాయకుడు ఆంజనేయులు అలియాస్ బేనీషా కొత్తచెరువు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో ముగ్గురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన అనంతపురంలోని ఆస్పత్రికి తరలించి కాపాడుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశాన్ని ఎస్పీ రత్న తీవ్రంగా పరిగణించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడంతో దాడికి కారకులైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో దాడికి తమను ప్రేరేపించింది చిన్న వెంకటరాముడని వారు అంగీకరించినట్లు సమాచారం. దీంతో సోమవారం వేకువజామున చిన్న వెంకటరాముడిని కొత్తచెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన ముగ్గురితో పాటు చిన్న వెంకటరాముడిని సీరియస్‌గా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం చర్చనీయాంశమైంది. ట్రాక్టర్ కింద పడి విద్యార్థి మృతి లేపాక్షి: మండలంలోని ఉప్పరపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు కుమారుడు జశ్వంత్(19) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఫైనలియర్ చదువుతున్న జశ్వంత్ ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయంశ్రీనివాసులు పంటకు నీరు కట్టేందుకు వెళ్లిన సమయంలో జశ్వంత్ తోడు వెళ్లాడు. పంటకు తాను నీరు కడతానని, ఇతర పనులేమైనా ఉంటే చూసుకోవాలని తెలపడంతో పని అప్పగించి తండ్రి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత పక్క పొలం రైతు పొలంలోకి ట్రాక్టర్‌తో మట్టిని తరలిస్తుండడం గమనించిన జశ్వంత్... డ్రైవర్‌ను మాట్లాడించేందుకు వెళ్లాడు. ట్రాక్టర్ ఇంజన్‌కు ట్రాలీకి మధ్యలో నిలబడి మాట్లాడుతూ పొలం వైపుగా వెళుతుండగా అదుపు తప్పి ట్రాలీ చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ వెంటనే ట్రాక్టర్‌ను ఆపి క్షతగాత్రుడిని బయటకు లాగి 108 వాహనంలో చికిత్స నిమిత్తం హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొలువుదీరిన ఖాశీంస్వామి పీరు
బత్తలపల్లి: మొహర్రం ఉత్సవాల్లో భాగంగా బత్తలపల్లిలో ఖాశీంస్వామి పీరును కొలువుదీర్చారు. శనివారం రాత్రి ముజావర్లు మహబూబ్‌బాషా, ఖాశీంపీరా, ఫక్రుద్దీన్, ఖాశీంవలి ఖాశీంస్వామి చావిడిలో ఫాతెహా చేశారు. అర్ధరాత్రి పీరును కొలువుదీర్చారు. ఆదివారం నిత్యపూజ నివేదన నిర్వహించారు. మండలంలోని గంటాపురం, పోట్లమర్రి, వేల్పుమడుగు, ముష్టూరు, మాల్యవంతం, రాఘవంపల్లి, యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, అనంతసాగరం, వెంకటగారిపల్లి తదితర గ్రామాల్లో మొహర్రం వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. మొహర్రం వేడుకలు నిర్వహించే వారు పోలీస్‌స్టేషన్‌లో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తప్పుడు ‘స్పౌజ్’ ఆప్షన్‌తో బదిలీలుధర్మవరం అర్బన్: సచివాలయ ఉద్యోగుల్లో చాలామంది తప్పుడు ‘స్పౌజ్’ ఆప్షన్‌తో బదిలీలు చేయించుకున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా, ప్రధాన కార్యదర్శి పులిబండ్ల నరసింహారావు, గౌరవాధ్యక్షుడు రాఘవరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు వారు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలో శనివారం జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో స్పౌజ్ ఆప్షన్ దుర్వినియోగం చేయడంతో చాలామంది అర్హులు నష్టపోయారని తెలిపారు. ఆర్డీఎంఏ పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులకు న్యాయం చేకూర్చాలని కోరారు. ఏ క్షణంలోనైనా తుంగభద్ర తుళ్లింత● డ్యాంలో ఇప్పటికే 68 టీఎంసీల నీరు నిల్వ ● 65,182 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఏ క్షణంలోనైనా నదికి నీరు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తి డ్యాంలో నీటి మట్టం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం 65,182 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. డ్యాంలో గరిష్ట నీటి నిల్వ 68 టీఎంసీలకు పైగా చేరింది. డ్యాం క్రస్ట్ గేట్లు బలహీనంగా ఉన్న నేపథ్యంలో కేవలం 80 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలని ఇటీవల అధికారులు తీర్మానించారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు నీరు చేరితే ఏ క్షణంలోనైనా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నదీతీర, లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. చిన్నారిని క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులుకదిరి అర్బన్: కేరళలో ఓ కుటుంబం వద్ద పెరుగుతున్న చిన్నారిని ప్రత్యేక పోలీసు బృందం ఆదివారం క్షేమంగా కదిరికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్టేషన్లో డీఎస్పీ శివనారాయణస్వామి మీడియాకు వెల్లడించారు. మరువతండాకు చెందిన రవీంద్రనాయక్, శ్రీవాణి దంపతులు మూడేళ్ల కుమార్తెను కేరళలో ఎందుకు వదిలేసి వచ్చారంటూ వారి బంధువు రామచంద్రనాయక్ ఇటీవల గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది. డబ్బుల కోసం కుమార్తెను అమ్మేశారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేశారు. సంతానం లేని దంపతులకు పెంచుకునేందుకు తమ కూతురును ఇచ్చామని రవీంద్రనాయక్ దంపతులు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేరళకు ప్రత్యేక పోలీసు బృందం వెళ్లి అక్కడ రాజేష్, స్వాతి దంపతుల వద్ద ఉన్న బాలికను తీసుకుని కదిరికి వచ్చారు. సోమవారం సీడబ్ల్యూసీ ముందు చిన్నారిని హాజరుపరుస్తామని, చిన్నారిని విక్రయించారా.. నిజంగా పెంచుకునేందుకు ఇచ్చారా.. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయాలు దర్యాప్తులో తేలుస్తామని డీఎస్పీ చెప్పారు. -
కల్తీల కలవరం
సాక్షి ప్రతినిధి, అనంతపురం:మార్కెట్ నిండా నకిలీ, కల్తీ వస్తువులే. సామాన్యులు, నిరక్షరాస్యులే కాదు బాగా చదువుకున్న ఐటీ ఉద్యోగులు కూడా నకిలీ వస్తువుల విషయంలో బోల్తా పడుతున్నారు. ఏది నకిలీనో, ఏది నిజమైనదో తేల్చుకోలేక వినియోగదారులు ఘోరంగా మోసపోతున్నారు. రోజువారీ వినియోగంలో ఉండే వస్తువుల వ్యాపారం రూ.కోట్లలో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నకిలీ, కల్తీ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా విజిలెన్స్ తనిఖీల్లో నకిలీ వస్తువులు బయటపడటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తరచూ తనిఖీలు లేకపోవడం వల్ల ఇలా నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నట్టు ఆరోపణలున్నాయి. టీపొడిలో కొత్త కోణాలు ఇటీవలి కాలంలో కల్తీ టీపొడి వినియోగం తీవ్రమైంది. పదే పదే వాడిన టీని ఎండపెట్టి చింతపిక్కల పొడి వంటివి కలిపి మళ్లీ అమ్ముతున్నారు. ఇందులో కొన్ని ఆకర్షించే రంగులు, రుచికోసం రసాయనాలు కలుపుతున్నారు. ఒరిజనల్ టీపొడి అయితే ఒక గ్లాసు మంచినీళ్లలో వేస్తే... టీపొడి బాగా నానిన తర్వాత గానీ రంగుమారదు. అదే నకిలీ టీపొడి అయితే నీళ్లలో వేసిన రెప్పపాటులోనే నీళ్లన్నీ టీరంగులోకి మారిపోతాయి. లేబుళ్లు లేకుండా సంచుల కొద్దీ వస్తున్న ఈ టీపొడిలో మసాలాలు కలిపి వినియోగదారులకు అందిస్తున్న తీరు భయాందోళనకు గురి చేస్తోంది. పాలను విషపూరితం చేస్తున్నారు కల్తీపాలు ఇప్పటికీ యథేచ్ఛగా మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని రకాల నూనెలను బాగా మరగకాచి, వాటిలో కొన్ని క్రీములు కలిపి నకిలీ పాలను తయారు చేస్తారు. వీటిని డెయిరీ సంస్థలకు అమ్ముతున్నారు. డెయిరీ సంస్థలు ఫ్యాట్ కంటెంట్ (కొవ్వు శాతం) చూస్తాయి గానీ, ఇవి నకిలీవా, కాదా అనే పరిస్థితి లేదు. కల్తీ మాఫియా గుప్పిట్లోనే.. కుళ్లిపోయిన వెన్నను కాచి నెయ్యిని తయారు చేస్తున్నారు. మంచి సువాసన కోసం కొన్నిరకాల రసాయనాలు కలుపుతున్నారు. కారంపొడిలో రకరకాల రసాయనాలతో పాటు కొన్ని రకాల పొట్టు కలిపి కారంపొడి తయారు చేస్తున్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే గ్లూకోన్డీని కూడా కల్తీమయం చేశారు. కొన్ని రసాయనాల మిశ్రమం, శాక్రిన్లు కలిపి ఇస్తున్నారు. దీనివల్ల చిన్నారుల ఆరోగ్యం గుల్లవుతోంది. పప్పు దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. శనగపిండిలో బియ్యపు పిండి కలిపి అమ్ముతున్నారు. చిరు ధాన్యాల్లో అంటే ధనియాలు, మినప్పప్పు వంటివి బాగా ఆకర్షించేలా ఉండటం కోసం ఓరకమైన నూనెలను కలుపుతున్నారు. ఇవి చాలా ఆకర్షించేలా ఉంటాయి. తాజాగా సర్ఫ్ పౌడర్, సబ్బులు, గుడ్‌నైట్ లిక్విడ్ వంటి నకిలీ సరుకులు విజిలెన్స్ తనిఖీల్లో పట్టుకున్నారు. నకిలీని కనిపెట్టేదెలా..? సబ్బులు, బట్టలకు వాడే సర్ఫ్ వంటివి కనిపెట్టడం సామాన్య వినియోగదారులకు కొంచెం కష్టమే. కానీ కొద్దిగా పరిశీలిస్తే... ఒరిజనల్ కంపెనీ వస్తువుకు, నకిలీ వస్తువుకు లేబుల్ మీద ఉన్న రాత (ఫాంట్)లో తేడా ఉంటుంది. లోగోలో కూడా ఒక అక్షరం తేడాతో ఇమిటేట్ చేస్తుంటారు. అన్నింటికీ మించి బార్కోడ్ అతిముఖ్యమైనది. చిన్న చిన్న కిరాణా షాపుల్లో బార్కోడ్ స్కాన్ చేయరు. ఒకసారి బార్కోడ్ స్కాన్‌తో కొనుకున్న వస్తువును, కిరాణా షాపులో ఉన్న వస్తువును పోల్చి చూస్తే తేడా కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. డిక్లరేషన్ నిబంధనలే చూస్తాం మా పరిధిలో కంపెనీ డిక్లరేషన్‌లో ఇచ్చిన నిబంధనలు మాత్రమే చూస్తాం. అవి కరెక్టుగా ఉన్నాయా లేదా అనేదే పరిశీలిస్తాం. వస్తువు నాణ్యత చూడటం మా పరిధిలో లేదు. డిక్లరేషన్ నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తాం. – సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్, తూనికలు కొలతల శాఖ యాజమాన్యాలే జాగ్రత్తగా ఉండాలి నకిలీ ఏదో ఒరిజనల్ ఏదో సామాన్యులు కనిపెట్టలేరు. ఎన్నో ఏళ్లనుంచి వ్యాపారం చేస్తున్న కిరాణా షాపుల యజమానులకు డూప్లికేట్ ఏదో, మంచిదేదో తెలుసు. ఏజెన్సీలనుంచి తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించి తీసుకోవాలి. లేదంటే నకిలీ ప్రొడక్ట్‌లు దొరికితే నష్టపోయేది కిరాణాషాపుల యాజమాన్యాలే. – జమాల్ బాషా, సీఐ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నీళ్ల నుంచి పాల వరకు అన్నీ కల్తీ తాజాగా గుడ్‌నైట్, ఏరియల్ వస్తువులు నకిలీ గతంలో బ్రూ ప్యాకెట్లు, టైడ్ పౌడర్లు ఫేక్‌గా తేలాయి ఒరిజనల్ ఏదో నకిలీ ఏదో కనిపెట్టలేక మోసపోతున్న జనం విజిలెన్స్ తనిఖీల్లో గుట్టు రట్టుతో వినియోగదారుల్లో ఆందోళన అనంతపురంలోని పాతూరుకు చెందిన మహబూబ్ బాషా దోమలబారినుంచి తప్పించుకునేందుకు ఆలౌట్ లిక్విడ్ బాటిల్ కొన్నారు. దోమలు చావకపోగా ఎన్ని రోజులైనా లిక్విడ్ అయిపోలేదు. అప్పుడు తెలిసింది ఇది నకిలీ ఆలౌట్ అని. గుత్తిలో సుజాత అనే మహిళ అర డజను బట్టల సబ్బులు కొనింది. కానీ ఆ సబ్బుతో ఎంత ఉతికినా మురికి పోలేదు. చివరకు ఆరా తీస్తే అవి నకిలీవని తేలింది. -
కారు దగ్ధం.. ప్రయాణికులు క్షేమం
నల్లమాడ: ప్రయాణిస్తున్న కారులో ఉన్నపళంగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై కిందకు దిగిన వెంటనే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. కదిరి ఫైర్ ఆఫీసర్ సుబహాన్ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లమాడ మండలం చారుపల్లి పంచాయతీ సి.రెడ్డివారిపల్లికి చెందిన వెంకటశివారెడ్డి అనంతపురంలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. బంధువులకు చెందిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం భార్య అనిత (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు), కుటుంబ సభ్యులు కేశవరెడ్డి, వసుంధరతో కలిసి ఏపీ39ఎల్ఎం 4541 నంబరు గల కారులో స్వగ్రామం వచ్చారు. ఆ రాత్రికి అక్కడే ఉండి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెంకటశివారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం బయల్దేరారు. అలా సి.రెడ్డివారిపల్లి నుంచి కిలోమీటరు దూరం వెళ్లగానే కారు బానెట్‌లోంచి మంటలు వచ్చి దట్టమైన పొగలు రావడంతో వెంటనే అందులోని వారంతా కిందకు దిగి దూరంగా వెళ్లారు. కొద్దిసేపటికే కారు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమైంది. సమాచారం అందుకున్న కదిరి ఫైర్ ఆఫీసర్ సుబహాన్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. రూ.10 లక్షలు నష్టం వాటిల్లినట్లు కారు యజమాని వెంకటశివారెడ్డి తెలిపారు. -
గందరగోళంగా సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని సర్వే, భూరికార్డుల శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన గ్రామ సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. అధికారులు విడుదల చేసిన సీనియార్టీ జాబితాపై గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర నాయకులు అడ్డుచెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జాయినింగ్ డేట్ ఆధారంగా సీనియారిటీ జాబితా ఎలా ఇస్తారంటూ సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్తో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేష్‌నాయుడు వాగ్వాదానికి దిగారు. ఇతర శాఖలు, ఇతర జిల్లాల్లో మాదిరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ర్యాంక్ ఆధారంగా సీనియార్టీ జాబితా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాదంటే కౌన్సెలింగ్ బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రక్రియ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. పరిస్థితిని డీఆర్ఓ మలోల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే ఆయన సర్వే శాఖ కార్యాలయానికి చేరుకుని సీనియారిటీ జాబితాపై అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ఏడీలు రూప్లానాయక్, విజయశాంతిబాయి, సూపరింటెండెంట్ అయూబ్‌తో సమీక్షించారు. జాబితాకు సంబంధించి మార్గదర్శకాలు, నిబంధనలను పరిశీలించారు. అనంతరం ఆయన సూచన మేరకు ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ తతంగం కారణంగా ఉదయం 9 గంటలకు మొదలవ్వాల్సిన బదిలీల కౌన్సెలింగ్ ఆరు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. 624 మందికి కౌన్సెలింగ్ ఉమ్మడి జిల్లాలో 828 మంది గ్రామ సర్వేయర్లు ఉన్నారు. వీరిలో అధికారిక నివేదిక ప్రకారం ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు 624 మంది ఉన్నారు. తొలుత మెడికల్ గ్రౌండ్స్, తరువాత స్పౌజ్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం మిగిలిన వారికి చేపట్టారు. సీనియార్టీ జాబితాపై తీవ్ర అభ్యంతరం ఆరు గంటలు ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రారంభం -
బదిలీల తీరుపై ఆర్ఎస్కే అసిస్టెంట్ల అసంతృప్తి
అనంతపురం సెంట్రల్: ఉమ్మడి జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ ఆదివారం ఉద్యాన, పశు సంవర్థకశాఖ కార్యాలయాల్లో కొనసాగింది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ కింద ధరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే కొందరు తాము కోరుకున్న స్థానం కాకుండా మరో స్థానం కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యానశాఖ పరిధిలో చేపట్టిన బదిలీల ప్రక్రియకు 280 మంది విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు హాజరు కాగా, వారి ఎస్‌ఆర్‌లు ఇతర ధ్రువీకరణ పత్రాలను ఉద్యానశాఖ ఉమ్మడి జిల్లాల డీడీలు ఉమాదేవి, చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, ఏడీహెచ్ దేవాందన్, సూపరింటెండెంట్ బాషా తదితరులు పరిశీలించి, పోస్టింగ్ కల్పించారు. అలాగే పశు సంవర్థకశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల జేడీలు వెంకటస్వామి, శుభదాస్, డీడీలు, సూపరింటెండెంట్ల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్‌కు 180 మంది విలేజ్ అనిమిల్ హస్బెండరీ అసిస్టెంట్లు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ జెండా దిమ్మె ధ్వంసం రొద్దం: మండలంలోని బీదానిపల్లిలో ఆరేల్ల క్రితం ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ జెండా దిమ్మె, శిలాఫలకాన్ని శనివారం రాత్రి టీడీపీ కార్యకర్త చంద్రమౌళి ధ్వంసం చేశాడు. విషయాన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రమౌళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గోపాలరెడ్డి, చలపతి, బాబయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
సజావుగా వీఆర్ఓల బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆదివారం చేపట్టిన చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల గ్రేడ్–2 వీఆర్ఓల బదిలీల కౌన్సిలింగ్ సజావుగా జరిగింది. మొత్తం 328 మంది హాజరు కాగా, ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు 121 మంది ఉన్నారు. మరో 53 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ బదిలీ కౌన్సెలింగ్‌ను డీఆర్ఓ ఎ.మలోల, అనంతపురం. శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టరేట్ పరిపాలనాధికారులు అలెగ్జాండర్, వెంకటనారాయణ నిర్వహించారు. ఎస్‌ఆర్‌లు, ఇతర పత్రాలను డిప్యూటీ తహసీల్దార్లు మూర్తి, లీలాకాంత్ పరిశీలించారు. ఇదిలా ఉండగా ఉదయం 11గంటలకు మొదలు కావాల్సిన బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలు కావడంతో చంటిపిల్లలతో వచ్చిన మహిళా వీఆర్ఓలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. పోలీసుల అదుపులో దోపిడీ కేసు నిందితుడు? హిందూపురం: మండలంలోని కిరికెర వద్ద వెంకటాద్రి లే అవుట్లో నివాసముంటున్న సిమెంట్ వ్యాపారి నిత్యానందారెడ్డి ఇంట్లో చోటు చేసుకున్న దోపిడీకి సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసును సీఐ ఆంజనేయులు పర్యవేక్షణలో వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే పాత నేరస్తులను, అనుమానితులను విచారణ చేశారు. సంఘటన జరిగినప్పుడు హిందూపురం, బెంగళూరు ప్రాంతాల్లో ప్రయాణించిన వాహనాలు, సెల్‌ఫోన్ కాల్ డేటాలను సేకరించి దాని ఆధారంగా దొంగలు ఢిల్లీ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
సౌత్‌జోన్ పెంకాక్ సిలాట్ పోటీలకు ఎంపిక
హిందూపురం టౌన్: నంద్యాలలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెంకాక్ సిలాట్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి సౌత్‌జోన్ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల టాండింగ్ సీనియర్ విభాగంలో హిందూపురానికి చెందిన షేక్ నస్రీన్, జూనియర్ విభాగంలో శరణ్య, మదీహ, ప్రణవి, మానస మొదటి స్థానంలో నిలిచి, బంగారు పతకాలు దక్కించుకున్నారు. ఫ్రీ జూనియర్స్ విభాగంలో హిందూపురానికి చెందిన దివ్య, ఫ్రీ టీన్ విభాగంలో తన్వితారెడ్డి, మఖాన్ విభాగంలో మధుర, మీనా, ఆఫిఫా కౌసర్ బంగారు పతకాలను సాధించారు. అలాగే టాండింగ్ బాలుర జూనియర్ విభాగంలో తరుణ్ ఆదిత్య, ఫ్రీ టీన్ విభాగంలో దుర్గా స్మరన్ బంగారు పతకాన్ని, ఈశ్వర్ రజత పతకాన్ని దక్కించుకున్నారు. ప్రతిభ చాటిన వీరిని జూలై 18 నుంచి 20 వరకు తిరుచ్చిలో జరిగే సౌత్‌జోన్ పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను పెంకాక్ సిలాట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మనోజ్ సాయి, రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు రఫీక్ అహమ్మద్; ట్రెజరర్ రియాజ్ భాషా అభినందించారు. -
సిఫారసుకే పెద్దపీట
అనంతపురం సిటీ: ‘మనకు కావాల్సిన పిల్లలు వస్తున్నారు. జర చూసుకోండి. లెటర్ కూడా ఇచ్చి పంపుతున్నాం. వారు కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇవ్వండి. లేదంటే రోడ్డు పాయింట్‌కు వేయండి. ఏ ఒక్కటీ మిస్ కావడానికి వీల్లేదు. అడిగినవన్నీ చేయాల్సిందే’ అంటూ సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్ల మీద ఫోన్లు చేశారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు ఆదివారం అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. ఓ వైపు కౌన్సెలింగ్ ప్రక్రియలో బిజీబిజీగా ఉన్నా.. మరోవైపు ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఫోన్ కాల్‌ను అధికారులు లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హల్చల్ చేశారు. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారు ముందుగా రావాలని, లెటర్లు లేని వారిని పక్కన ఉండాల్సిందిగా సూచించారు. లెటర్లు స్వీకరించి వారు ఎక్కడికి పోస్టింగ్ కోరుకుంటున్నారో మరీ తెలుసుకుని కేటాయించారు. తొలి రోజు అనుభవంతో.. మలి రోజు ప్రశాంతం సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. తొలి రోజు (శనివారం) నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారి.. ఆందోళనలతో ముగిసింది. ఈ అనుభవంతో మలి రోజు (ఆదివారం) అధికారులు తీసుకున్న కొన్ని చర్యలు సాఫీగా సాగేలా దోహదపడ్డాయి. అభ్యర్థులందరినీ బయటే ఉంచి.. కొందరిని మాత్రమే అనుమతిస్తూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టడంతో తొక్కిసలాటకు తావు లేకుండా పోయింది. అయితే అర్ధరాత్రి వరకూ కౌన్సెలింగ్ కొనసాగినా ఇంకా అభ్యర్థులు మిగిలే ఉన్నారు. లెటర్లు ఉన్న వారికే ప్రాధాన్యత.. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారికే అధికారులు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చారా.. అయితే రండి. మీకు కావాల్సిన స్థానం కోరుకోండి అంటూ అడిగి మరీ వారికి సహకరించారు. మరి కొందరి విషయంలో ఎమ్మెల్యేలు నేరుగా ఫోన్లు చేసి పేర్లు సిఫారసు చేయడం గమనార్హం. జెడ్పీ క్యాంపస్‌లోని డీపీఆర్సీ భవన్లో డిజిటల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్ కొనసాగుతుండగా డీపీఓ నాగరాజునాయుడుకు తరచూ ఫోన్ కాల్స్ వచ్చాయి. అయినా ఆయన ఓపిగ్గా మాట్లాడుతూ కనిపించారు. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి ఓ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ర్యాంక్‌లో తొలి స్థానంలో ఉన్నా.. అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణ నుంచి ఓ అమ్మాయి లెటర్ తెచ్చుకున్నారు. ఒకే స్థానం కోసం ఇద్దరూ పోటీపడ్డారు. అయితే అప్పటికే ఆ స్థానం తొలి ర్యాంకర్ అబ్బాయికి కేటాయించగా.. అమ్మాయికి సర్దిచెప్పి మరో చోట అవకాశం కల్పించారు. అయితే ఏమాత్రం పలుకుబడి లేని వారు, ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చుకోలేకపోయిన వారు మదనపడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా పశుసంవర్థక శాఖలో.. పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్కడి అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారని సచివాలయ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. కౌన్సెలింగ్‌కు ముందే అభ్యర్థులు మూడు స్థానాలను ఆప్షన్లగా చూపిస్తూ దరఖాస్తు చేసి ఉన్నారు. ఇందులో ఏదో ఒక స్థానాన్ని కౌన్సెలింగ్‌కు పిలిచినప్పుడు కేటాయించాల్సి ఉంటుంది. అయితే పశుసంవర్ధక శాఖలో మాత్రం మీరు ఏవైనా మూడు మండలాలు కోరుకొని ఆప్షన్లు ఇచ్చి వెళ్లండి. అందులో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తామంటూ’ ఉద్యోగులను వెనక్కి పంపడంపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకూ కొనసాగిన కౌన్సెలింగ్.. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సచివాలయ ఉద్యోగులకు అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో మిగిలి ఉండడంతో అర్ధరాత్రైనా సరే పూర్తి చేయాలన్న పట్టుదలతో అధికారులు పని చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. చాలా చోట్ల కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు. సచివాలయ ఉద్యోగుల కౌన్సెలింగ్‌లో అధికారుల తీరు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు ప్రాధాన్యం ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా అధికారులకు ఫోన్ చేయించినా సరే మంచి ర్యాంకు ఉన్నా సరే దూరంగానే పోస్టింగ్ పలుకుబడి లేని ఉద్యోగుల పరిస్థితి దయనీయం అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల అసహనం -
● నేత్ర దానం
కదిరి టౌన్: ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన సత్రం కోసం కృషి చేసిన శ్రీసత్రశాల సాయిరాం ప్రభాకర్ మృతి అనంతరం ఆయన నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు. శనివారం ఉదయం గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ప్రభాకర్ దేహం నుంచి నేత్రాలను అనంతపురం రెడ్‌క్రాస్ సొసైటీ ఐ బ్యాంక్ సిబ్బంది సేకరించారు. మరణానంతరం నేత్రాలను దానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించాలనే లక్ష్యంతో ముందకు వచ్చిన ప్రభాకర్ భార్య సత్రశాల పద్మ, కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ధర్మవరం: స్థానిక సిద్దయ్యగుట్టకు చెందిన చక్కా వెంకటేష్(62) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని భార్య నాగవేణి, కుమార్తెలు రజిత, పూజిత, అల్లుళ్లు బాలాజీ, బింగి మోహన్‌కుమార్‌ను విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
‘పీఆర్సీని నియమించాలి’
కదిరి అర్బన్: పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటు చేసి, తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్లో ఆదివారం ఉపాధ్యాయులతో ఆయన సమావేశమై మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి పెద్దలు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఐఆర్లను ప్రకటించాలన్నారు. పీఆర్సీని నియమించి నిర్ణీత కాల పరిమితి లోపు నివేదిక తెప్పించుకుని వీలైనంత త్వరగా 12వ పీఆర్సీని అమలు చేయాలన్నారు. పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలను మంజూరు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు జాఫర్,ప్రసాద్, రవినాయక్, ఖలీల్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దంపతులపై హత్యాయత్నం కేసులో కుమారుడి అరెస్ట్ బత్తలపల్లి: దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను బత్తలపల్లి పీఎస్ ఎస్ఐ సోమశేఖర్ వెల్లడించారు. బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు జాంపుల అప్పస్వామి, లక్ష్మీదేవి.. భవిష్యత్తు అవసరాల కోసమని కొద్ది మేర డబ్బు దాచుకున్నారు. వీరి కుమారుడు సురేష్‌బాబు అలియాస్ బాబుల్లా మద్యానికి బానిస. మద్యం తాగేందుకు డబ్బు కోసం తరచూ తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ క్రమంలో 2023, నవంబర్ 22న మద్యం తాగేందుకు తనకు డబ్బు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించాడు. తమ వద్ద లేదని వారు చెప్పడంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో కొడవలితో దాడి చేశాడు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సురేష్‌బాబు.. ఆదివారం గంటాపురం క్రాస్‌లో తచ్చాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరణ?
పుట్టపర్తి/పామిడి: అదనపు కట్నం కోసం తమ కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటూ బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు తెలిపిన మేరకు... పామిడిలోని ఎద్దులపల్లి రోడ్డులో నివాసముంటున్న కమ్మరి రామాచారి, పుష్పవతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కార్పెంటర్ వృత్తితో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో 9 నెలల క్రితం రామాచారి తన పెద్ద కుమార్తె శ్రావణి(25)ని శ్రీసత్యసాయి జిల్లా బుక్క పట్నం మండలం కృష్ణాపురానికి చెందిన గోవిందాచారి, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు నీలకంఠాచారికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద రూ.లక్షలు విలువ చేసే బంగారు, నగదు ఇచ్చారు. పెళ్లి అనంతరం నీలకంఠ కృష్ణాపురంలోనే వేరు కాపురం పెట్టాడు. వ్యవసాయంతో పాటు వేరుశనగ పప్పు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల వ్యాపారానికి సంబంధించి యంత్రాల కొనుగోలుకు డబ్బు అవసరం కావడంతో శ్రావణి తల్లిదండ్రులు నీలకంఠకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం శ్రావణిని నీలకంఠ వేధించడం మొదలు బెట్టాడు. తరచూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీనికి తోడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యసనాలు మానుకోవాలని భార్య పదేపదే చెప్పినా వినేవాడు కాదు. ఈ క్రమంలో తనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నీలకంఠాచారి పథకం ప్రకారం శనివారం రాత్రి నిద్రపోతున్న భార్య గొంతునులిమి హతమార్చి, అనంతరం ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనంతరం పామిడిలోని అత్తామామకు ఫోన్‌చేసి విషయం తెలిపాడు. అక్కడకు చేరుకున్న రామాచారి దంపతులు... తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్యగా నిర్ధారించుకుని నిలదీసేలోపు నీలకంఠాచారి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అందే నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని డీఎస్పీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. బుక్కపట్నం మండలం కృష్ణాపురంలో ఘటన మృతురాలు పామిడి నివాసి కుమార్తె కుటుంబ సభ్యులు నిలదీస్తుండగానే భర్త పరారీ -
మద్యం మత్తునే హత్యకు కారణం!
గతంలో వారి మధ్య ఎలాంటి పరిచయం లేదు. అయినా మద్యం వారి మధ్య మాటలు కలిపింది. అదే రోజే మద్యం మత్తు విచక్షణను కోల్పోయేలా చేసి ఒకరి హత్యకు కారణమైంది. నగరంలోని బళ్లారి బైపాస్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ సమీపంలో ఈ నెల 23న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. అనంతపురం: చిన్నపాటి వాదన కారణంగా ఘర్షణ పడి ఓ యువకుడిని హతమార్చిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం నాల్గో పట్టణ పీఎస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఏం జరిగిందంటే.. ఈ నెల 24న ఉదయం అనంతపురంలోని బళ్లారి బైపాస్ సర్కిల్లో జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఓ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పార్క్‌లో పడుకుని ఉన్న వ్యక్తి తలపై గుర్తు తెలియని వ్యక్తులు ఫుట్‌పాత్ బ్రిక్‌తో కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. హతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి గార్లదిన్నె మండలం, కోటంక గ్రామానికి చెందిన గూడూరు సిదానందగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో బంధువులు వచ్చి నిర్ధారించారు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ ఎన్.జగదీష్ కేసు నమోదు చేసి, పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నేర పరిశోధనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. తొలుత సిదానందను ఆయన భార్య తరఫు వారు హత్య చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం కాగా, ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టి అనుమానాల్లో వాస్తవం లేదని నిర్ధారించారు. నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో నేర పరిశోధనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మద్యం షాపులో ఉన్న సీసీ పుటేజీల ఆధారంగా ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. హత్య జరిగిన అనంతరం ఇద్దరూ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలు మార్గంలో తిరుపతికి చేరుకున్నట్లుగా పసిగట్టారు. అనంతరం పక్కా ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో సిదానందను హత్య చేసినట్లుగా అంగీకరించారు. భార్యను దూషించాడనే... అనంతపురంలోని ఐదో రోడ్డు భవానీ గుడి వద్ద నివాసముంటున్న ఎరికల నాగయ్య కుమారుడు ఎరికల లక్ష్మన్న అలియాస్ అలీ/ చిన్న లింగన్న/ అంజి, కళ్యాణదుర్గం రోడ్డులోని విద్యారణ్య నగర్లో నాగులుకట్ట వద్ద నివాసముంటున్న తుమ్మశెట్టి వెంకటరెడ్డి ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ బొప్పాయి, దోసకాయ లోడింగ్ పనులు చేస్తూ, తాగుడుకు అలవాటు పడ్డారు. ఈ నెల 23న రాత్రి బళ్లారి బైపాస్ సర్కిల్ సమీపంలో మద్యం షాపు వద్ద తాగుతూ అప్పటికే అక్కడున్న సిదానందతో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఎరికల లక్ష్మన్నను సిదానంద బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. లక్ష్మన్న భార్యనుద్ధేశించి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆవేశానికి లోనైన లక్ష్మన్న తన స్నేహితుడు వెంకటరెడ్డితో కలసి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న పార్కులో సేద తీరుతున్న సిదానంద వద్దకు చేరుకుని నుదుటిపై ఫుట్‌బాత్ బ్రిక్‌తో దాడి చేశారు. సిదానంద అక్కడికక్కడే చనిపోవడంతో ఇద్దరూ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలులో తిరుపతికి వెళ్లారు. నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐ ఎన్.జగదీష్, ఎస్ఐలు కె.ప్రసాద్, పి.విజయభాస్కర్ నాయుడు, టెక్నికల్ టీంను ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. సిదానంద హత్య కేసులో వీడిన మిస్టరీ చిన్నపాటి గొడవ కారణంగా హత్య నిందితుల అరెస్ట్ -
అ‘పూర్వ’ కలయిక
తనకల్లు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1975–76లో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత రువాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తరగతి గదులను ఆత్మీయంగా తాకుతూ నాటి అనుభూతులను గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటిగురువులు కుళ్లాయిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, నవనీతమ్మను సత్కరించారు. అనంతరం తమ సీనియర్ విద్యార్థులైన విశ్రాంత ప్రిన్సిపాల్ బయప్పరెడ్డి, దేశాయి భక్తవత్సలరెడ్డి, నాగేంద్రను సన్మానించారు. తమ బ్యాచ్ విద్యార్థులంతా కలసి పాఠశాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విశ్రాంత టీచర్ భాస్కర్‌రెడ్డి, విశ్రాంత ఎస్ఐ మహమ్మద్ రఫీ, రత్నమయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, నారాయణ, కృష్ణమూర్తి, సూర్యప్రకాష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితో నేర నియంత్రణ
● సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు వేగవంతం ● నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: సమష్టి కృషితోనే నేర నియంత్రణ సాధ్యమని, అందువల్ల కేసుల దర్యాప్తులో అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రత్న పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫెరెన్స్ హాలులో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తి, కదిరి, హిందూపురం, పెనుకొండ సబ్ డివిజన్ల పరిధిలో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గత ఆరు నెలల్లో వివిధ కేసుల్లో పురోగతి సాధించిన పోలీసులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ... సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తు వేగవంతమవుతుందని, అందరూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. చోరీల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించాలన్నారు. పోక్సో కేసుల్లో నివేదికలు త్వరగా సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి పూట గస్తీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు తీసుకోవాలన్నారు. వాటిని నేర రికార్డులతో సరిపోల్చి నేరగాళ్లను పట్టుకోవాలన్నారు. నేర సమీక్షలో డీఎస్పీలు విజయకుమార్, శివన్నారాయణ, కేవీ మహేష్, నరసింగప్ప, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సెలవులో రామగిరి సీఐ ●● రాజకీయ ఒత్తిళ్లే కారణమా? చెన్నేకొత్తపల్లి: రామగిరి సీఐ శ్రీధర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ నంబర్‌ను కూడా ఆయన శుక్రవారం స్టేషన్లోనే సరెండర్ చేశారు. దీంతో ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని, తిరిగి ఇక్కడికి వచ్చి విధులు నిర్వర్తించడం అనుమానమేనన్న చర్చ జరుగుతోంది. పది నెలలు కూడా కాకుండానే... రామగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా శ్రీధర్ పదినెలల కిందటే విధుల్లో చేరారు. సర్కిల్లో సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉండటంతో నిరంతరం ఒత్తిళ్లలోనే విధులు నిర్వర్తించినట్లు తెలుస్తోంది. ప్రతి కేసులోనూ టీడీపీ నేతలు కలుగజేసుకోవడం...టీడీపీ ముఖ్యనాయకులు ఆదేశాలు జారీ చేయడంతో విసిగిపోయి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ● రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్ సీపీకి చెందిన కురబ లింగమయ్య హత్య.. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాఫ్టర్‌లో రాగా, హెలీప్యాడ్ వద్దకు భారీగా జనం వచ్చి హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినడం. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో ఓ దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఆయా ఘటనలకు సంబంధించి సీఐ శ్రీధర్‌పై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. స్థానిక ఎస్ఐ సుధాకర్ యాదవ్ తరచూ సెలవులో వెళ్తుండటంతో ఆయా కేసుల దర్యాప్తు చాలా నిదానంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఐ శ్రీధర్ ఆందోళన చెందారని, మరోవైపు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తట్టుకోలేక సీఐ సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. -
తడ‘బడి’న పాఠం
ఇది అగళి మండల పరిధిలోని కంబదపల్లి ప్రాథమిక పాఠశాల. 1 నుంచి 5 వరకు తరగతులు నిర్వహిస్తున్నా... ఇక్కడ ఈ విద్యా సంవత్సరం నాలుగో తరగతిలో వర్షిణి అనే విద్యార్థిని మాత్రమే చేరారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు రవి చిన్నారికి పాఠాలు చెబుతున్నారు. గ్రామంలో 1,2 తరగతుల విద్యార్థులు చాలా మంది ఉన్నా... వారంతా సమీపంలోని మధుడి గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారు. అగళి మండల పరిధిలోని ఐ.తోణసన్నపల్లి గ్రామంలోని పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు వీరు. ఇక్కడ ముగ్గురు విద్యార్థులుండగా.. ఒక ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతున్నారు. అలాగే నందరాజన్నపల్లి గ్రామంలోనూ నలుగురు విద్యార్థులుండగా.. ఒక ఉపాధ్యాయురాలిని ప్రభుత్వం నియమించింది. అగళి: కూటమి సర్కార్‌పై తల్లిదండ్రులకు ఉన్న నమ్మకానికి ఈ రెండు చిత్రాలు అద్దం పడుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగా, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. కానీ కూటమి సర్కార్ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తుండటంతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు కళకళలాడుతుండగా... సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. -
ఆర్థిక స్తోమత లేనివారికి ఉచిత న్యాయ సహాయం
హిందూపురం: వివిధ కేసుల్లో రిమాండ్‌లో ఉంటున్న వారిలో ఆర్థిక స్థోమత లేని వారికి ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. శనివారం హిందూపురం సబ్ జైలును ఆయన తనిఖీ చేశారు. ఏ కేసులో ఎంత కాలంగా రిమాండ్‌లో ఉంటున్నారని ఆరా తీశారు. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోగలరా.. సబ్‌జైలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ బెయిల్ కోసం న్యాయవాదులను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత లేని వారికి అర్హత ఉంటే ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. న్యాయ సహాయం అవసరమైన వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. జైళ్లకు రావడం వల్ల స్వేచ్ఛ, శాంతి కోల్పోతారని, కుటుంబాల గౌరవ మర్యాదలు కూడా దెబ్బతింటాయని తెలిపారు. కనీసం జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. రిమాండ్ ఖైదీలకు ఏమైనా సమస్యలు ఉంటే రాత పూర్వకంగా రాసి జైలు ఆవరణలోని ఫిర్యాదుల పెట్టెలో వేయాలన్నారు. అనంతరం జైలు గదులు, వంటగది పరిశీలించి ఆహార పదార్థాల తయారీ కోసం ఉపయోగించే సరుకుల గురించి సబ్‌జైలర్ హనుమప్పను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వన్నూరప్ప, న్యాయవాదులు శివశంకర్, సుధాకర్, సందీప్, లోక్ అదాలత్ సభ్యులు హేమావతి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్ వజ్రకరూరు: ఢిల్లీలోని డాన్‌బోస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం ప్రారంభమైన ‘షీ రెప్రజెంట్స్–2025’ అనే ప్రతిష్టాత్మక నాయకత్వ అభివృద్ధి– శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం కలిగిన 45 మంది మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా ఒకరు. వీరికి ఏడు రోజులపాటు పాలన, కమ్యూనికేషన్, ప్రజానైతికత, నాయకత్వ నైపుణ్యాలు, సమస్యలు– వాటిపరిష్కార పద్ధతులు, పార్లమెంట్ సందర్శన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. మోనాలిసా మాట్లాడుతూ ఢిల్లీ శిక్షణకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. పశువులను తప్పించబోయి ఢీకొన్న కార్లుపెనుకొండ: పశువులను తప్పించే క్రమంలో రెండు కార్లు అదుపుతప్పి ఢీకొన్నాయి. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం శనివారం కారులో హైదరాబాద్ వెళుతుండగా.. పెనుకొండ సమీపంలోని పులేకమ్మ ఆలయం వద్ద పశువులు అడ్డు రావడంతో డ్రైవర్ స్లో చేశాడు. ఆ సమయంలో ఈ కారును వెనక వేగంగా వచ్చిన మరో కారు ఢీకొంది. ఈ హఠాత్పరిణామంతో కార్లలో ప్రయాణిస్తున్నవారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న పెనుకొండ పోలీసులు నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పడమే కాకుండా కారును రోడ్డు పక్కన నిలిపి.. వారిని మరో వాహనంలో పంపించారు. ఫేక్ కాల్‌తో నగదు మాయం రొద్దం: సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతూనే ఉన్నారు. బ్యాంకు అధికారుల పేరిట బురిడీ కొట్టించి మోసం చేస్తున్నారు. రొద్దం మండలం గౌరాజుపల్లికి చెందిన ఓ యువతికి శనివారం అపరిచిత నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుని ఆధార్ అడిగాడు. ఆ యువతి ఆధార్ నంబర్ చెప్పి ఫోన్ పెట్టేయగానే తన బ్యాంకు ఖాతాలోని రూ.1000 నగదు డ్రా అయిపోయింది. తాను మోసపోయానని ఆ యువతి లబోదిబోమంటోంది. -
అర్ధంతరంగా ఆగిన బదిలీలు
అనంతపురం సిటీ: తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సమర్పించారంటూ ఆందోళనకు దిగడంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీ అర్ధంతరంగా ఆగింది. అనంతపురంలోని పంచాయతీరాజ్ సర్కిల్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.జహీర్ అస్లాం ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి జిల్లా పీఆర్ హెడ్ మురళీమోహన్, ఈఈ ప్రభాకర్‌రెడ్డి, డీఈఈలు కె.లక్ష్మీనారాయణ, రాజేంద్రప్రసాద్, డీఎల్ మురళి, జింకల కృష్ణజ్యోతి, సూపరింటెండెంట్లు ఖాజీ మొహిద్దీన్, రమాదేవి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 5.50 వరకు కౌన్సెలింగ్ సజావుగా సాగింది. సాయంత్రం ఆగిన కౌన్సెలింగ్.. సాయంత్రం 5.50 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. ఆ తరువాత అర్ధంతరంగా ఆగిపోయింది. కౌన్సెలింగ్‌లో కొందరు సచివాలయ ఉద్యోగులు పెళ్లి కాకపోయినా.. తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సృష్టించి సమర్పించారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వాటి సంగతి తేల్చాకే కౌన్సెలింగ్ కొనసాగాలని, అప్పటి వరకు ఆపేయాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌన్సెలింగ్ ఆపేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. విధిలేక అధికారులు కౌన్సెలింగ్ నిలిపివేశారు. కేసులు నమోదు చేయండి.. పెళ్లి కాకపోయినా.. కొందరు తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సమర్పించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. అయితే అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే కౌన్సెలింగ్ హాల్ నుంచి ఇంటి దారి పట్టారు. పీఆర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీలకు కౌన్సెలింగ్ తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సమర్పించారంటూ ఆందోళన సాయంత్రం కౌన్సెలింగ్ నిలిపేసిన అధికారులు -
పంచాయతీ కార్యదర్శుల నిరసన
ప్రశాంతి నిలయం: పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఐవీఆర్ఎస్లో ఫీడ్‌బ్యాంక్ ఆధారంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరును నిర్ణయించడం బాధాకరమన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎక్కువ మజరా గ్రామాలు ఉండడం వల్ల ట్రైసైకిల్స్ ద్వారా ప్రతి గ్రామానికీ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందన్నారు. ,ప్రతి గ్రామానికీ ఒక క్లాప్ మిత్రను నియమించి ఇళ్లను బట్టి వారి వేతనాన్ని ప్రభుత్వమే నిర్ణయించి చెల్లించాలని కోరారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లను శానిటేషన్, పీడబ్ల్యూఎస్ స్కీంలలో పాల్గొనే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని, సచివాలయాల్లో రేషనలైజేషన్‌లో భాగంగా మిగులు ఉద్యోగులను పంచాయతీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులతో సర్వేలు చేయించేందుకు పూర్తి అజమాయిషీ లేకపోవడం వల్ల ఇబ్బదులు పడుతున్నామన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్లో డీఆర్ఓను కలసి అందజేశారు. సమస్యలు పరిష్కరించాలి హిందూపురం టౌన్: గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. పంచాయతీలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని, 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థి బలవన్మరణం బత్తలపల్లి: డిగ్రీ పరీక్షల్లో ఫెయిలైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామాపురం గ్రామానికి చెందిన కప్పల ఆదినారాయణ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు కప్పల నారాయణస్వామి (22) అలియాస్ బిందు డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన నారాయణస్వామి శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే అడు!్డ
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాంప్లేట్‌లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ పేర్లు ముద్రించడాన్ని సహించలేక కక్షసాధింపులకు దిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదేశాలతో నిర్వాహకులకు అధికారులు నోటీసు లిచ్చి కార్యక్రమాన్ని నిలిపివేయించారు. వివరాలు.. రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు 2021 ఏప్రిల్‌లో తీర్మానం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు విగ్రహ ఏర్పాటుకు తహసీల్దార్, ఎంపీడీఓ అనుమతి తీసుకున్నారు. విగ్రహ ప్రతిష్ట కోసం చందాలు వసూలు చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రూ.2 లక్షలు, శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలానికి చెందిన ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ రూ.7 లక్షల విరాళం అందించారు. పలువురి ద్వారా మొత్తం రూ.15 లక్షలు వసూలు చేసిన భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు రాప్తాడులో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆదివారం ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల క్రితమే ఉత్సవానికి సంబంధించి పాంప్లేట్లు కొట్టించి అందరికీ పంచారు. ఆ రెండు పేర్లు తొలగించండి..! విగ్రహావిష్కరణ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహోదగ్రులైనట్లు తెలిసింది. అధికారులకు ఫోన్ చేసి మండిపడినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, సాకే రాజేష్ కుమార్ పేర్లు ఉండకూడదని ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. ఎలాగోలా కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటూ నిర్వాహకులకు పోలీసుల ద్వారా నోటీసులు ఇచ్చారు. పర్మిషన్ తీసుకుని పనులు చేసుకోవాలని, లేని పక్షంలో అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీలకతీతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాం.. నోటీసులపై భీమ్ రావ్ యువజన సంఘం అధ్యక్షుడు కటిక జయరామ్, వైస్ ప్రెసిడెంట్ బాల నాగేంద్ర విలేకరులతో మాట్లాడారు. 2021 నుంచి పనులు జరుగుతున్నా అధికారులు ఏనాడూ అడ్డు చెప్పలేదన్నారు. పార్టీలకతీతంగా చందాలు వసూలు చేశామన్నారు.పాంప్లేట్‌లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్ కుమార్ పేర్లు తొలగించి కార్యక్రమాన్ని చేసుకోవచ్చని సమాచారమిచ్చారన్నారు. సర్పంచు సాకే తిరుపాల్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ కూడా దళితులే అని, అయినా విగ్రహ ప్రతిష్టకు అనుమతి లేదంటూ అడ్డు పడడం దళిత జాతికే సిగ్గు చేటన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్‌కుమార్ పేర్లు ఉండటంతో కక్ష సాధింపు రాప్తాడులో ఆగిపోయిన విగ్రహ ప్రతిష్టాపనోత్సవం -
ఉచిత వైద్యం.. సత్యసాయి లక్ష్యం
ప్రశాంతి నిలయం: నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యం అందించడమే సత్యసాయి లక్ష్యమని, సత్యసాయి వైద్య సంస్థలు ఈ మేరకు పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైట్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్.సుందరేశ్ దబిర్ అన్నారు. శనివారం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, వైద్య సంస్థల ఆధ్వర్యంలో సత్యసాయి ‘ఆదర్శ వైద్యం’ అన్న అంశంపై ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సుందరేశ్ మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సత్యసాయి బాబా 1956లో పుట్టపర్తిలో సత్యసాయి జనరల్ ఆస్పత్రి ప్రారంభించారని, ఆ తరువాత బెంగళూరులో జనరల్ ఆస్పత్రి, ప్రశాంతి గ్రాం, వైట్‌ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను స్థాపించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదైన సేవగా మారిందని, కానీ సత్యసాయి సంస్థలు మాత్రం నేటికీ ఉచితంగానే వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. ఇక్కడి సిబ్బంది సైతం రోగులను ప్రేమతో కూడిన వైద్యం సేవలు అందిస్తూ సాంత్వన కలిగిస్తున్నారన్నారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద మాట్లాడుతూ... పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఏటా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలను సత్యసాయి వైద్య సంస్థల్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నారన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ట్రస్ట్ పని చేస్తోందన్నారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టోక్యో, యూనివర్సిటీ ఆఫ్ చికాగో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేసుకున్న రెండు ఒప్పంద పత్రాలను సత్యసాయి మహాసమాధి చెంత ప్రదర్శించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వైద్య సిబ్బంది సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, డాక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ మెడికల్ సదస్సులో డాక్టర్ సుందరేశ్ దబిర్ -
అంతా మా ఇష్టం
అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ, కౌన్సెలింగ్ గందరగోళంగా తయారైంది. పారదర్శకత కరువైంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ సాగిస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పలుకుబడి, డబ్బు, ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత, సీనియార్టీ పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నారని అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు అసిస్టెంట్లు మండిపడుతున్నారు. ప్రణాళికేదీ...? కలెక్టర్ అనుమతితో ఈనెల 30లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో శనివారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ)కు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. రెండు జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, సూపరింటెండెంట్ల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పద్ధతి, ప్రణాళిక లేకుండా చేపట్టడంతో ఏం జరుగుతుందనే వీఏఏలు ఆందోళనతో ఎగబడ్డారు. ర్యాంకులు, మెరిట్ ప్రకారం వీఏఏలు పట్టుబట్టగా, అధికారులు మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రకారం కొనసాగిస్తామని చెప్పారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ గంట పాటు నిలిపేశారు. చివరకు ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌కు అధికారులు అంగీకరించారు. సోమవారం ఉత్తర్వులు.. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం పోస్టులు 282 ఉండగా... అందులో పనిచేస్తున్న వారు 248 మంది ఉన్నారు. అందులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వీఏఏలు 229 మంది బదిలీకి అర్హత ఉన్నట్లు తెలిపారు. మరో 19 మంది రిక్వెస్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. అటు ఉద్యానశాఖ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 323 మంది వీహెచ్‌ఏలు ఉండగా అందులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు 280 మందికి బదిలీలు చేపట్టారు. మరికొందరు రిక్వెస్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. శనివారం రెండు జిల్లాల నుంచి తరలివచ్చిన వీహెచ్‌ఏలు ఆప్షన్లు ఇచ్చేశారు. సోమవారం సాయంత్రానికి బదిలీ ఉత్తర్వులు ఇస్తామని అధికారులు తెలిపారు. ఖాళీల వివరాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆప్షన్లు ఇవ్వడానికి వీహెచ్‌ఏలు కూడా ఇబ్బంది పడ్డారు. పట్టుపరిశ్రమశాఖ అసిస్టెంట్ల బదిలీలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్ఎస్కే అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియలో పారదర్శకత కరువు నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ సర్వత్రా విమర్శలు -
కార్యకర్తలకు తోడుగా ఉంటా
మహిళలకు రక్షణ కరువు బుక్కరాయసముద్రం/శింగనమల: చంద్రబాబు ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజలకు చేసిన మోసాలను లెక్కలతో సహా వివరిద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెడ్‌బుక్ మాటున సాగిస్తున్న అరాచకాలకు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. శింగనమల నియోజకవర్గానికి సంబంధించి బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఇదే వేదిక నుంచి ‘రీ కాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిఽథున్‌రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య, ఈరలక్కప్ప, దీపిక, మక్బుల్ అహ్మద్, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అధికార ప్రతినిధి ఎంపీ గోరంట్ల మాధవ్, పీఏసీ సభ్యులు మాలగుండ్ల శంకరనారాయణ, మహాలక్ష్మి శ్రీనివాస్, అనంతపురం మేయర్ వసీం, టాస్క్‌ఫోర్స్ సభ్యుడు రమేష్ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల నాయక్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు పెన్నోబిలేసు, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కృష్ణవేణి, పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథులకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నాయకులు స్వాగతం పలికారు. అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండా అవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి సిద్దరాంపురం రోడ్డు మీదుగా వైఎస్సార్సీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ప్రజలను మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలందరికీ గుర్తు చేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. 2019–24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. 5 ఏళ్ల పాలనతో జగనన్న రాష్ట్రాన్ని పదేళ్లు ముందుకు తీసుకెళితే చంద్రబాబు ప్రస్తుత ఏడాది పాలనలో రాష్ట్రాన్ని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీలు భాస్కర్, భోగాతి ప్రతాప్‌రెడ్డి, నాయకులు నరేష్, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, నందినేని మల్లికార్జున, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నారాయణరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, తరిమెల వంశీ గోకుల్‌రెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, రఘనాథరెడ్డి, ముత్యాల శీనా, పురుషోత్తం, పెద్ద కొండయ్య, చికెన్ నారాయణస్వామి, శ్రీనివాస రెడ్డి, ఆది, తదితరులు పాల్గొన్నారు. అరాచకాలను తిప్పికొట్టాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలామంది బాలికలు మిస్సింగ్ అవుతున్నా మహిళా పక్షపాతి అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం నోరుమెదపరన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలికలపై అత్యాచారాలు జరిగితే సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం కానీ పరామర్శించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టకపోయినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. హామీల అమలులో ఘోరంగా విఫలం బెదిరింపులు, కేసులకు భయపడేది లేదు వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల వైఎస్సార్సీపీ కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికార పార్టీ నాయకులు రెడ్‌బుక్ మాటున అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ వారు ఇసుక, ఎర్రమట్టి, రేషన్ బియ్యం దందా కోసం కొట్టుకుచస్తున్నారన్నారు. నాణ్యమైన చదువు, నాణ్యమైన మందులు, నాణ్యమైన భోజనం ఇస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రులను చూశాం కానీ.. నేడు నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడడం పిరికిపంద చర్య అని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఖండించారు. అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటిని ఏమాత్రం పట్టించు కోకుండా చంద్రబాబు నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు అవినీతి అక్రమాల్లో మునిగిపోయారన్నారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. -
పీఆర్లో నేడు బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు శనివారం అనంతపురంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి సంఖ్యను కుదించింది. దీంతో 534 సచివాలయాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఈ లెక్కన ఐదేళ్లు పూర్తయిన వారు 315 మంది, ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు కలిగిన వారు 147 మంది ఉన్నారు. ఖాళీలు 72 ఉన్నట్లు తేల్చారు. యువకుడి దుర్మరణం కనగానపల్లి: కారు టైర్ పేలడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. కేరళలోని ఎంబీబీఎస్ కళాశాలలో సీటు దక్కిన తన కుమారుడు హెయాన్స్ నాయక్ (20)ను ఆ కళాశాల చేర్పించేందుకు మహారాష్ట్రలోని అమరావతికి చెందిన మనీషాబాయి తన సమీప బంధువుతో కలసి కారులో వెళ్లారు. అడ్మిషన్ ప్రక్రియ ముగించుకున్న అనంతరం శుక్రవారం ఉదయం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై కారు ముందు చక్రానికి అమర్చిన టైరు పేలి రహదారి పక్కన ఉన్న గుంతలోకి బోల్తా పడింది. హెయన్స్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనీషాబాయి, బంధువు సందీప్ నాయక్, డ్రైవర్ సమీర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా అనంతపురం తరలించారు. ఘటనపై కనగానపల్లి పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దాం
ప్రశాంతి నిలయం: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటంతో పాటు జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని హిందూపురం పార్లమెంట్ సభ్యుడు, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్ బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్, ఎంపీ బీకే పార్థసారథి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మెంబర్ సెక్రెటరీ, కలెక్టర్ టీఎస్ చేతన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీకే పార్థసారథి మాట్లాడుతూ.. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రాష్ట్రంలోని 67 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని, సాంకేతిక లోపాలవల్ల కొందరు పథకం పొందలేకపోయారన్నారు. ‘పీఎం కిసాన్ సన్మాన్’ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి రూ.6 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద అదనంగా రూ.14 వేలు ఆర్థిక లబ్ధి కలుగుతుందన్నారు. అర్హులు ఉంటే వెంటనే గుర్తించాలన్నారు. వార్షిక ప్రీమియం రూ.456 చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షల బీమా లబ్ధి కలుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరై పూర్తయిన పనులను గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని డ్వామా పీడీని ఆదేశించారు. జిల్లాలో రూ.3 వేల కోట్లతో చేపట్టిన జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలన్నారు. పింఛన్లపై విచారణ చేయించండి.. గతంలో మంజూరైన పింఛన్లపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు మాత్రమే పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల స్థానంలో వెంటనే మరొకరిని నియమించాలన్నారు. మూడు నెలలకోసారి సమావేశం.. కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ... ప్రతి మూడు నెలలకు ఒకసారి ‘దిశ’ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. కేంద్రం నిధులతో చేపట్టిన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, వాటి లోపాలను దిశ కమిటీ సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకొని కేంద్రానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో పుట్టపర్తి, కదిరి, మడకశిర ఎమ్మెల్యేలు పల్లె సింధూరా రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, ఎంఎస్ రాజు, ఎస్పీ వి.రత్న, డీఆర్డీఏ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటనారాయణ, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి వంశీకృష్ణారెడ్డితోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘దిశ’ సమావేశంలో చైర్మన్ బీకే పార్థసారధి -
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు పి.నారాయణస్వామితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు.అగ్రిగోల్ బాధితులను ఆదుకునే అంశాన్ని టీడీపీ తన ఎన్నికల మేనిఫేస్టోలో ఉంచిందని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం ద్వారా విక్రయించి బాధితులకు న్యాయం చేస్తామని అప్పట్లో చంద్రబాబు చెప్పి ఏడాదవుతున్నా అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సంస్థ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. హామీని అమలు చేయకపోతే బాధితులతో కలిసి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధేశ్వర్, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, సభ్యులు కుళ్లాయప్ప, ధనుంజయ, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. -
కంటైనర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● ఆరుగురు ప్రయాణికులకు గాయాలు చిలమత్తూరు: రోడ్డు పక్కన ఆపిన కంటైనర్‌ను వేగంగా దూసుకొచ్చిన ఓల్వో బస్సు ఢీకొంది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని రాయచూరు నుంచి బెంగళూరుకు 33 మంది ప్రయాణికులతో వీఆర్ఎల్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున చిలమత్తూరు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కోడూరు తోపు సమీపంలో ఉన్న గార్మెంట్స్ పరిశ్రమ వద్దకు చేరుకోగానే అప్పటికే రోడ్డు పక్కన ఆపిన కంటైనర్ ఆలస్యంగా గమనించిన ఓల్వో డ్రైవర్ వేగాన్ని నియంత్రించేలోపు నేరుగా వెళ్లి ఢీకొంది. ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా తొలుత కర్ణాటకలోని బాగేపల్లిలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరుకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్ నుంచి బస్సును వేరు పరిచి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు చిలమత్తూరు పీఎస్ ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. చెరువుల్లో మట్టిని తరలించుకోండి : మంత్రి సవిత పెనుకొండ: అవసరాన్ని బట్టి చెరువుల్లోని మట్టిని తరలించుకోవాలని రైతులకు మంత్రి సవిత సూచించారు. ఈ విషయంగా అధికారులు ఎవరూ అడ్డు చెప్పరని అన్నారు. స్థానిక తన కార్యాలయంలో నియోజకవర్గ సాగునీటి సంఘం అధ్యక్షులతో శుక్రవారం ఆమె సమావేశమై మాట్లాడారు. రైతులు మట్టి తోలుకునేందుకు ట్రాక్టర్‌కు రూ.3 చెల్లిస్తే చాలన్నారు. నియోజకవర్గంలోని సాగునీటి కాలువల్లో జంగిల్ క్లియరెన్స్, మట్టి తవ్వకాలకు రూ. 3.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రూ.50 కోట్లతో నియోజకవర్గంలోని 26 చెరువులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జంగిల్ క్లియరెన్స్‌కు మంజూరైన రూ.50 లక్షల నిధులతో కాలువల్లో ముళ్ల పొదల తొలగింపు, పూడిక తీత పనులు చేపట్టనున్నామన్నారు. అయితే ఈ నిధుల వినియోగానికి జీఎస్టీ సమస్య వుందని త్వరలో పరిష్కరించి పనులు ప్రారంభిస్తామన్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన పుట్టపర్తి టౌన్: ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జూలై 5వ తేదీన కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వి. విజయరామరాజు కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డితో కలిసి కొత్తచెరువులో పర్యటించారు. జూనియన్ కళాశాల, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరిసర ప్రాంతాలు, గదులను పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల గురించి సంబంఽధిత అధికారులకు సూచనలిచ్చారు. అనంతరం సత్యసాయి విమానాశ్రయాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే విమానాశ్రయంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. మట్కా రాస్తున్న మహిళల అరెస్ట్ తాడిపత్రి టౌన్: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మట్కా రాస్తున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. అందిన సమాచారం మేరకు శుక్రవారం తనిఖీలు చేపట్టి పక్కా ఆధారాలతో సరస్వతి, కుళ్లాయమ్మ, జ్యోతిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1.30 లక్షల నగదు, సెల్ఫోన్లు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
కుళ్లాయిస్వామి గోవిందా
● ప్రథమ దర్శనంతో పులకించిన భక్తులు నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయిస్వామి పీరును భద్రపరిచే పెట్టెను కిందకు దింపి.. సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేశారు. కుళ్లాయిస్వామి ప్రతిమకు, అగ్ని గుండానికి ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి దివిటీల వెలుగులో, సన్నాయి వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, బంగారు గొలుసుల నడుమ కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం భక్తులకు కల్పించారు. -
శ్రీచైతన్యలో ఎల్కేజీ, యూకేజీ తరగతుల సీజ్
హిందూపురం టౌన్: పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఎంఈఓ గంగప్ప శుక్రవారం ఆయా తరగతులను సీజ్ చేశారు. కాగా, శుక్రవారం ఉదయం ఆ పాఠశాలను వైఎస్సార్ ఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు కదిరీష్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తుండడంతో ఎంఈఓకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విద్యార్ధి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. శ్రీచైతన్య పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి రూ.22వేల నుంచి రూ25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలోనే పుస్తకాలు, యూనిఫాం, టై, షూ, బ్యాగులను శ్రీచైతన్య పాఠశాల పేరుతో ముద్రించి ఇక్కడే కొనాలని నిబంధన పెట్టి దాదాపు రూ.8500ల వరకు వసూలు చేశారన్నారు. ఎంఈఓ గంగప్ప మాట్లాడుతూ.. శ్రీచైతన్య పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు అనుమతులు లేవని, ఇకపై నిర్వహించకూడదని అన్నారు. కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు చంద్రశేఖర్, భరత్, సాయిరాం, అనుదీప్, ఫణి, నాజీర్, శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రిపై తనయుడి కొడవలితో దాడి
పరిగి: తాను అడిగిన డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో తండ్రిపై తనయుడు కొడవలితో దాడి చేసి, గాయపరిచాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం ఎర్రగుంటలో నివాసముంటున్న వృద్ధుడు మోదప్పగారి క్రిష్టప్పకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. కొన్నేళ్లుగా సోరియాసిస్‌తో బాధపడుతున్న రెండో కుమారుడు శంకర.. చికిత్స నిమిత్తం తరచూ తండ్రితో డబ్బులు అడిగేవాడు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లేందుకు డబ్బు కావాలని తండ్రిని అడిగాడు. తన వద్ద డబ్బు లేదని తండ్రి తెలపడంతో శంకర ఘర్షణ పడి కొడవలితో దాడి చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దాడిని అడ్డుకుని క్షతగాత్రుడిని హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు. క్రిష్టప్ప భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపారు. -
మొహర్రం ఉత్సవాలు ప్రారంభం
బత్తలపల్లి: మత సామరస్యానికి, హిందూ– ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచే మొహర్రం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గూగూడు తర్వాత ఆ స్థాయిలో మొహర్రం ఉత్సవాలు జరిగే బత్తలపల్లి ఆధ్యాత్మిక శోభను నింపుకుంది. మండల వ్యాప్తంగా వైభవంగా నిర్వహించే మొహర్రం ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. బత్తలపల్లిలోనూ ఖాసీంస్వామి(మొహర్రం) ఉత్సవాలను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఉదయం గ్రామ పెద్దల సమక్షంలో పీర్లను భద్రపరిచే పెట్టెను కిందకు దించి ముజావర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుండం తీసి వేడుకలకు అంకురార్పణ చేశారు. రాత్రి ఖాశీంస్వామి ప్రథమ దర్శనంతో భక్తులు పులకించారు. పదిరోజుల పాటు ఉత్సవాలుఉత్సవాలు పదిరోజుల పాటు వైభవంగా జరుగుతాయని ముజావర్లు(పూజారులు) తెలిపారు. జూలై 2నఐదవ సరిగెత్తు, 4న చిన్నసరిగెత్తు(పానకాలు), 5వ తేదీ ఉదయం గ్రామోత్సవం, 6న పెద్ద సరిగెత్తు, 7నఅగ్నిగుండ ప్రవేశం... జలధికి ఉత్సవం ఉంటుందన్నారు. భక్తులకు కాశీంస్వామి తొలిదర్శనం -
అరటి సాగులో ఆదర్శం
పెనుకొండ: అరటి సాగులో పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని మంగాపురం గ్రామానికి చెందిన గోపాలరెడ్డి వైవిధ్యాన్ని కనబరుస్తూ పలువురిని ఆకర్షిస్తున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయన కుటుంబసభ్యులతో కలసి మహానగరంలోనే నివాసముంటున్నారు. అయితే వ్యవసాయంపై మక్కువ ఉన్న ఆయన తరచూ అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తూ గ్రామంలో తనకున్న 3.75 ఎకరాల్లో యాలక్కి రకం అరటి సాగు చేపట్టారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న అరటి గెలలను బెంగళూరుకు చెందిన వ్యాపారులకు టన్ను రూ. 50 వేల చొప్పున విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. రూ. 26 లక్షల ఖర్చు.. తన తమ్ముడి సహకారంతో యాలక్కి అరటి సాగులో అంతర్పంటగా వక్క, టెంకాయ చెట్లను గోపాలరెడ్డి పెంచుతున్నారు. ఈ క్రమంలో పొలం చుట్టూ ఫెన్సింగ్, బోరు వేయించడం, డ్రిప్ ఏర్పాటు, షెడ్ నిర్మాణం, వీడర్ కొనుగోలు, పొలం చదును, కూలీలు, ఇతర ఖర్చులు కలిపి దాదాపు రూ.26 లక్షల వరకూ వెచ్చించారు. కర్ణాటకలోని నెలమంగల సమీపంలో ఉన్న ఫ్రీన్లీ బనానా కంపెనీ నుంచి టిష్యూ కల్చర్ అరటి ఒక్కో మొక్కను రూ.30 చొప్పున, శివమొగ్గ సమీపంలోని తీర్థహళ్లి నుంచి వక్క మొక్కలు, చెళ్లకెర నుంచి ఒక్కో టెంకాయ మొక్కను రూ.380తో కొనుగోలు చేశారు. మొత్తం 2,500 అరటి మొక్కలు, 1,800 వక్క, 110 టెంకాయ మొక్కలను ఒకేసారి పొలంలో నాటి సాగు చేపట్టారు. ప్రస్తుతం చేతికి అందివచ్చిన తొలిదశ అరటి పంటను విక్రయించగా రూ.3.50 లక్షల ఆదాయం సమకూరింది. మరో రెండు కోతల పంట చేతికి వచ్చే అవకాశముంది. అరటి పిలకలను విక్రయిస్తుంటారు. ఒక్కో పిలకను రూ.20 నుంచి రూ.25 చొప్పున కొనుగోలు చేసుకుని వెళుతుంటారు. అరటి ఆకులను బెంగళూరుకు తరలించి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం అరటి మొక్క బోద నుంచి లభ్యమయ్యే గడ్డను ఇతర రైతులు తీసుకెళ్లి తమ పొలాల్లో పంట పెట్టుకుంటున్నారు. ఒక్కో గడ్డను రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. అంతర్ పంటలుగా వక్క, టెంకాయ బెంగళూరులో నివాసముంటూ సొంతూరిలో వ్యవసాయం సాగును భారంగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ ఉద్యోగి పంటల సాగుపై మక్కువ పెంచుకున్నాడు. వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడినా... సొంతూరులోని పొలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అవగాహనతోనే పంటల సాగు పంటల సాగుపై అనుభవం ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం బెంగళూరులో నివాసముంటూ భార్యతో కలసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా. గ్రామంలో పెద్దల నుంచి సంక్రమించిన 3.75 ఎకరాల పొలాన్ని బీడుగా మార్చడం ఇష్టం లేక అరటి సాగు చేపట్టాను. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంతర్ పంటగా వక్క, టెంకాయ చెట్లను పోషిస్తున్నా. వృద్ధురాలైన తల్లి, వికలాంగుడైన తమ్ముడు తోడుగా ఉంటున్నారు. పంట సాగులో రైతులెవరైనా నా సహకారం కావాలనుకుంటే 974047 1698కు ఫోన్ చేసి సలహాలు తీసుకోవచ్చు. – గోపాలరెడ్డి, రైతు -
సిఫార్సులకే పెద్దపీట
ప్రశాంతి నిలయం/అనంతపురం కార్పొరేషన్: పాలనలో కీలకమైన సచివాలయ వ్యవస్థను తమ అదుపులో పెట్టుకోవాలని, తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు కూటమి నేతలు బదిలీలను వేదికగా మార్చుకున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంలో ఈనెల 25 నుంచి వివిధ విభాగాల్లో పని చేస్తున్న గ్రామ/వార్డు ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కూటమి నాయకులు తమ పరిధిలోని సచివాలయాల్లో తమకు కావాల్సిన ఉద్యోగులను తెచ్చుకునేందుకు ప్లాన్ చేశారు. సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వండి.. సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖ ఉంటేనే కోరుకున్న చోటకు బదిలీ సాధ్యమని భావించిన ఉద్యోగులు లేఖల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనితీరు, నిబంధనలన్నీ పక్కనపెట్టి ప్రజాప్రతినిధి సూచన మేరకు ఉద్యోగి కోరుకున్న స్థానానికి బదిలీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేయడంతో అర్హులు తమకు కావాల్సిన స్థానాలను పొందేందుకు వీలులేకుండా పోయిందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రిక్వెస్టుతో కోరుకున్న చోటుకు.. 544 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా.. 4,373 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 2020 అక్టోబర్‌లో కొందరు, తరువాత నెల రోజుల వ్యవధిలో మరికొందరు ఉద్యోగులు విధుల్లో చేరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే బదిలీ చేయాల్సి ఉంది. అలాగే మ్యూచువల్, స్పౌజ్, హెల్త్ తదితర కారణాలతో ఉద్యోగులు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా రిక్వెస్టు అంశాలను సాకుగా చూపి చాలా మంది తాము కోరుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో ‘రాజకీయం’ సిఫార్సు లేఖల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లచుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు శుక్రవారం జరిగిన వార్డు అడ్మిన్ బదిలీల్లో గందరగోళం కౌన్సెలింగ్ శనివారానికి వాయిదా -
వ్యవస్థలు నాశనం
పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను కూటమి సర్కారు నాశనం చేసిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్ష నేతలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేసులు పెడతామని, భూములను లాక్కుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. అధికారులు, పోలీసులుకు భారత రాజ్యాంగం ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారని, దానికి లోబడే పని చేయాలని హితవు పలికారు. రెడ్‌బుక్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తించి విమర్శలపాలు కావొద్దని పోలీసు అధికారులకు సూచించారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఎరువుల దుకాణం దగ్ధం
బత్తలపల్లి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో ఓ ఎరువుల దుకాణం దగ్ధమైంది. బాధితుడు తెలిపిన మేరకు.. బత్తలపల్లికి చెందిన మోహన్‌రెడ్డి స్థానిక కదిరి మార్గంలో 30 ఏళ్లుగా ఎరువుల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం లావాదేవీలు ముగించుకున్న అనంతరం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో దుకాణంలో నుంచి పొగలు వస్తుండడంతో గమనించిన గస్తీ పోలీసులు సమాచారం అందివ్వడంతో వెంటనే యజమాని అక్కడు చేరుకుని షట్టర్ తెరిచాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న రైతులు రెండు ట్రాక్టర్ ట్యాంకర్ల నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ధర్మవరంలోని అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో దాదాపు రూ.3 కోట్ల విలువ చేసే ఎరువులు, పురుగు మందులు, వివిధ రకాల విత్తనాలు, ఇతర సామగ్రి కాలి బూడిదైనట్లు బాధిత యజమాని వాపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల నాయకులు తరలివచ్చి మోహన్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. కోలుకునేందుకు అవసరమైన సాయం చేస్తామని భరోసానిచ్చారు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
సబ్సిడీ బియ్యం పట్టివేత
రాప్తాడు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి గ్రామానికి చెందిన నరేష్ 42 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కర్ణాటకలోని పావగడకు బొలెరో వాహనంలో తరలిస్తూ శుక్రవారం రాప్తాడులోని వైఎస్సార్ సర్కిల్లో పట్టుపడ్డాడన్నారు. వాహనాన్ని సీజ్ చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్టాక్ పాయింట్‌కు తరలించినట్లు వివరించారు. తనిఖీల్లో సీఐ శ్రీహర్ష, సీఎస్‌డీటీ జ్యోతి పాల్గొన్నారు. క్షుద్ర పూజల కలకలం నల్లచెరువు: స్థానిక పూలకుంట రోడ్డులోని తాటిచెర్ల బ్రదర్స్ క్రికెట్ మైదానంలో ముగ్గులు, కోడిగుడ్లు వేసి క్షుద్ర పూజలు నిర్వహించారు. క్రికెట్ మైదానంలో క్షుద్ర పూజలు నిర్వహించడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో గెలుపు కోసమా? లేదా, క్రీడాకారులపై క్షుద్ర పూజలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, మండల కేంద్రంలోని ఓ మొబైల్ షాప్ వద్దనూ ఇలాగే పూజలు చేశారు. బుధవారం అమావాస్య సందర్భంగా ఈ పూజలు నిర్వహించినట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూదరుల అరెస్ట్ తలుపుల: మండలంలోని భూపతివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. అందిన సమాచారంతో శుక్రవారం తనిఖీలు చేపట్టి 13 మందిని అరెస్ట్ చేసి, రూ. 68,200 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
రైళ్లల్లో కొరవడిన భద్రత
గుంతకల్లు: రైలు ప్రయాణమంటనే ప్రయాణికులు హడలెత్తిపోయే రోజులు వచ్చాయి. ముఖ్యంగా దుండగులు ఆర్ధరాత్రి సమయాల్లో సిగ్నల్ కోసం వేచి చూస్తూ రైల్వేస్టేషన్ ఔటర్ ప్రాంతాల్లో నిలిపిన రైళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెరలేపడమే ఇందుకు కారణం. ఇంత జరుగుతున్న రైల్వే ఎస్కార్ట్, నిఘా వ్యవస్థలు నిద్రావస్థలో ఉండిపోయాయి. రైళ్లల్లో గస్తీ నిర్వహించే పోలీసులు ఏసీ బోగీల్లో నిద్రపోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రైళ్లలో జరిగిన చోరీలు.. ● ఈ ఏడాది ఏప్రిల్ 29న నిజాముద్దీన్–తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు గుత్తి జంక్షన్ సమీపంలో ఔటర్లో సిగ్నిల్ ఇవ్వకపోవడంతో నిలిచిపోయింది. ఇదే అదనుగా భావించిన దుండగులు ముందస్తు పథకం ప్రకారం దాదాపు నాలుగు స్లీపర్ బోగీల్లోకి చొరబడి మారణాయుధలతో ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ 10 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించారు. ● మూడేళ్ల కిత్రం వరురసగా హంపి, రాయలసీమ, చైన్నె ఎక్స్‌ప్రెస్ రైళ్లు అదే ఔటర్లో సిగ్నల్ కోసం నిలిపిన సమయంలో దుండగులు చొరబడి దాదాపు 30 తులాలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. ● గుత్తి–అనంతపురం రైలు మార్గంలోని తురకపల్లి రైల్వేస్టేషన్, గుత్తి–తాడిపత్రి రైలు మార్గంలోని జక్కలచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ వైర్లును కట్ చేయడంతో రైలు ముందుకు పోవడానికి అవకాశం లేకుండా చేసి, ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణలు ఎత్తుకెళ్లారు. ● తాజాగా (గడిచిన సోమవారం వేకువజాము) తాడిపత్రి రైల్వేస్టేషన్ ఔటర్లో సిగ్నల్ వైర్లను కట్ చేసి కోమలి రైల్వేస్టేషన్ ఔటర్లో నిలిచిన ముంబై–చైన్నె ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికురాలు విశాలక్ష్మి మెడలోని 2.7 తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు. అదే రోజు రాత్రి పాండిచ్చేరి–కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికురాలు దివ్వభారతి మెడలోని 3.5 తులాల బంగారు చైన్‌ను లాక్కొని ఉడాయించారు. గుత్తి రైల్వేస్టేషన్లో ఆగిన రైలు కిటికి వద్ద కూర్చొన్న ఓ ప్రయాణికుడి చేతిలోని ఖరీదైన సెల్‌ఫోన్‌ను అపహరించారు. వేధిస్తున్న సిబ్బంది కొరత గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధి 12 జిల్లాలకు విస్తరించి ఉంది. ఇందులో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు. కడప, నంద్యాల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని ఆర్పీఎఫ్, జీఆర్పీలతోపాటు కర్ణాటకలోని రాయచూర్, బళ్లారి జిల్లాలకూ గుంతకల్లు రైల్వే పోలీస్ కేంద్రంగా ఉంది. గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా 900 మంది పోలీసులు అవసరం కాగా, ప్రసుత్తం 550 మంది మాత్రమే ఉన్నారు. 350కి పైగా ఖాళీలు ఉన్నాయి. డివిజన్ వ్యాప్తంగా రోజూ 300కు పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే గుంతకల్లు, గుత్తి రైల్వేజంక్షన్ల మీదుగా రాత్రి పూట దాదాపు 50కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగాడుతున్నాయి. ఈ రైళ్లకు 20 నుంచి 24 బోగీలు ఉంటాయి. రాత్రి పూట తిరిగే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే ఎస్కార్ట్‌గా కేటాయిస్తున్నారు. స్టాఫ్ తక్కువగా ఉండటంతో ఉన్న సిబ్బందితోనే 24 గంటలు విధులు నిర్వహిస్తుండటంతో విశ్రాంతి లేక జీఆర్పీ, ఆర్పీఎఫ్లు ఒత్తిడికి లోనువుతున్నారు. ప్రయాణికుల రక్షణే ధ్యేయం ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ఉన్న కొద్ది పాటి సిబ్బందితో ర్యాండమ్‌గా రైళ్లలో బందోబస్తు చేపడుతున్నాం. జీఆర్పీ సిబ్బంది ఇద్దరితో పాటు ఆర్పీఎఫ్కు చెందిన మరో కానిస్టేబుల్‌కు రైళ్లలో ఎస్కార్టు విధులు కేటాయిస్తున్నాం. సమస్యాత్మక రైలు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరిస్తున్నాం. – హర్షిత, జీఆర్పీ ఇన్చార్జ్ డీఎస్పీ, గుంతకల్లు రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు ప్రయాణికుల సొమ్ముకు రక్షణ కరువు నిద్రావస్థలో రైల్వే పోలీసులు -
మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: జిల్లాను మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని యువతకు కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా దినం సందర్భంగా పుట్టపర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి గణేష్ కూడలి వరకూ గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతం మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారిపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేలా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని హెచ్చరించారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, పెడదారిన పడి జీవితాలు నాశనం చేసుకోకూడదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, ఎక్పైజ్ శాఖ అధికారి నాగముద్దయ్య, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే జిల్లా బహిష్కరణ
అనంతపురం: గంజాయి సాగు, వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల సాగు, వినియోగం, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిని జిల్లా నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాల నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల వినియోగంతో వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని, వినియోగదారులు విచక్షణ కోల్పోయి నేర ప్రవృత్తిని అలవర్చుకుంటారని అన్నారు. గంజాయి పొగ రూపంలో తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు, దీర్ఘకాలంలో ప్రాణాప్రాయం తలెత్తుతుందన్నారు. గంజాయి, డ్రగ్స్ వాడకం వల్ల కుటుంబాల అభివృద్ధి దెబ్బతింటుందన్నారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
మత్తుకు బానిస కావొద్దు
● మంత్రి సవిత పెనుకొండ: మత్తుకు బానిసలు కాకూడదని యువతకు మంత్రి సవిత పిలుపునిచ్చారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గురువారం పెనుకొండలో మంత్రి ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన చాలా మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. సమాజానికి చెడు చేయాలని చూసే ఏ వ్యక్తినీ ఉపేక్షించబోమన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్డీఓ ఆనంద్‌కుమార్, డీఎస్పీ నర్శింగప్ప, మున్సిపల్ కమిషనర్ సతీష్‌కుమార్, ఎకై ్సజ్ సీఐ సృజన్‌బాబు, పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి తనకల్లు: సంగం డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పాడి రైతులకు డెయిరీ కార్య నిర్వాహణాధికారి పర్వతనేని అనిల్‌కుమార్ సూచించారు. మండలంలోని పరాకువాండ్లపల్లిలో గురువారం పాడి రైతులకు పశు పోషణ, పాల ఉత్పత్తిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు సబ్సిడీపై పశుదాణా, మినరల్ మిక్చర్ పశుగ్రాస విత్తనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జోనల్ మేనేజర్ రావి బాలాజీ, ఆనంద్, మేనేజర్ పూజారి నాగరాజు, సిబ్బంది శ్రీధర్‌రెడ్డి, బాదుల్లా, శివయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇరువర్గాల పరస్పర దాడులు కదిరి అర్బన్: మండలంలోని మరువతండా గ్రామంలో బంధువుల మధ్య గొడవ చోటుచేసుకుని పరస్పరం దాడులు చేసుకున్నారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. వివరాలు.. కదిరి మండలానికి చెందిన శ్రీవాణి, రవీంద్రనాయక్ దంపతులు బతుకు తెరువు కోసం కొన్ని నెలల క్రితం కేరళకు వలస వెళ్లి ఇటీవల వచ్చారు. ఈ క్రమంలో వారితో పాటు వారి మూడేళ్ల వయసున్న కుమార్తె కనిపించకపోవడంతో బంధువు రామచంద్రనాయక్ గురువారం నిలదీశాడు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో కుమార్తెను కేరళలో విక్రయించి వచ్చారంటూ రామచంద్రనాయక్ మండిపడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుని పరస్పరం కొట్టుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రామచంద్రనాయక్ ఆరోపించినట్లుగా బిడ్డను విక్రయించిన అంశంపై సమగ్ర విచారణ చేపడతామని కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. డీపీటీఓకు ప్రశంసాపత్రం పుట్టపర్తి టౌన్: గత ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజ్‌కు ఇచ్చి సంస్థకు అధిక ఆదాయం సమకూర్చిన జిల్లా ప్రజా రవాణాధికారి మధుసూదన్‌ను అభినందిస్తూ గురువారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రశంసాపత్రాన్ని అందుకున్న డీపీటీఓను ఆర్టీసీ ఉద్యోగులు అభినందించారు. ఎకై ్సజ్ స్టేషన్ తనిఖీ ధర్మవరం అర్బన్: స్థానిక ప్రొహిబిషన్ ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను గురువారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, పుట్టపర్తి అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నరసింహులు తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో నాటుసారా తయారీ చేయకుండా తరచూ తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం ఎకై ్సజ్ సీఐ చంద్రమణి, ఎస్ఐలు చాంద్‌బాషా, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య గుంతకల్లు టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ పార్సిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్క్‌లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం అటుగా వెళ్లిన ప్రయాణికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. చొక్కా జేబులో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు కర్నాటకలోని రాయచూర్ జిల్లా గుడెదనాల్కు చెందిన శరణప్ప(39)గా గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. -
జిల్లాలో వరుస హత్యలు
లేపాక్షి: భార్యపై అనుమానంతో ఓ యువకుడిని వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన ఘటన గురువారం లేపాక్షి మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన రవికుమార్ (37)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి అశ్వత్థప్పతో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో తన ఇంటికి సమీపంలో నివాసముంటున్న బంధువు ఆనంద్ కుటుంబంతో రవికుమార్ చనువుగా ఉండేవాడు. తరచూ ఇంటికి రాకపోకలు సాగిస్తుండడంతో తన భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న ఆనంద్ ఎలాగైనా రవికుమార్‌ను హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంతో తన సోదరుడు గోవిందప్పతో కలసి పథకం రచించాడు. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి స్థానిక రైతు లింగప్ప తోటలో మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపి రవికుమార్‌ను రప్పించుకున్నారు. ముగ్గురూ కలసి మద్యం సేవించారు. అదే సమయంలో మత్తులో జోగుతున్న రవికుమార్‌పై వేటకొడవలితో దాడి చేయడంతో మొండెం నుంచి తల వేరుపడింది. అనంతరం మృతదేహాన్ని నీటి గుంతలో గొయ్యి తీసి పాతిపెట్టారు. బుధవారం తెల్లవారినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో అశ్వత్థప్ప ఆరా తీయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆనంద్, గోవిందప్ప ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడడంతో నీటి గుంతలో పాతిపెట్టిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. ఘటనపై మరింత లోతైన విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్ర తెలిపారు. భార్యపై అనుమానంతో లేపాక్షి మండలంలో ఓ యువకుడి హత్య మంగళవారం రాత్రి వేటకొడవళ్లతో నరికి హతమార్చిన వైనం పోలీసుల అదుపులో నిందితులు జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలో గురువారం తూముకుంట వాసి హత్య జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. భార్యపై అనుమానంతో ఓ యువకుడిని మరొకరితో కలసి రెండు రోజుల క్రితం భర్త మట్టుబెట్టగా గురువారం వెలుగు చూసింది. మరో ఘటనలో జిల్లా సరిహద్దున కర్ణాటక ప్రాంతంలో మద్యం మత్తులో చోటు చేసుకున్న గొడవలో హిందూపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి హతమయ్యాడు. మద్యం మత్తులో... హిందూపురం/గౌరిబిదనూరు: మండల పరిధిలోని తూముకుంట చెక్‌పోస్టు ప్రాంతంలో నివాసముటున్న రవికుమార్ (37) జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలో దారుణ హత్యకు గురయ్యాడు. వెల్డర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న అతనికి భార్య అనుపమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిస కావడంతో అతనిలో మార్పు తీసుకువచ్చేందుకు భార్య విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా మార్పు రాకపోవడంతో 4 ఏళ్ల క్రితం భర్తను వదిలేసి పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె రాలేదు. దీంతో ఒంటరిగా మారిన రవికుమార్ ఎప్పుడూ మద్యం మత్తులో జోగుతూ జులాయిగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలోని గంగోత్రి బార్ వద్దకు గురువారం వెళ్లిన అతను సాయంత్రం మద్యం మత్తులో జోగసాగాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న హిందూపురంలోని బాపూజీనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ అశోక్‌తో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరూ పరస్పరం కొట్టుకున్నారు. గొడవ తారస్థాయికి చేరుకోవడంతో ఆటో డ్రైవర్ బీరు బాటిల్ ముక్క తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. వరుస పోట్లకు గురి కావడంతో రవికుమార్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న కర్ణాటకలోని గౌరిబిదనూర్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీలను సేకరించారు. ఘటనపై గౌరిబిదనూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు
పుట్టపర్తి టౌన్: మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు శాఖ తరుఫున అండగా ఉంటామని ఎస్పీ రత్న భరోసానిచ్చారు. జిల్లా అటాచ్‌మెంట్‌తో పనిచేస్తున్న అనంతపురం డీటీసీ సీఐ పవన్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రత్న... అనంతపురంలోని మృతుడి స్వగృహానికి చేరుకుని పవన్‌కుమార్ మృతదేహానికి నివాళులర్పించారు. తక్షణ సాయం కింద రూ.75 వేలను కుటుంబ సభ్యులకు అందజేసి, పరామర్శించారు. అధైర్య పడరాదని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌలభ్యాలను త్వరలో అందేలా చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, 1998లో ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరిన పవనర్కుమార్... శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని రొద్దం, సోమందేపల్లి, మండలాల్లో పనిచేశారు. అనంతరం పదోన్నతిపై సీఐగా పుట్టపర్తి అటాచ్‌మెంట్‌తో అనంతపురం డీటీసీలో పనిచేస్తున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు బార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఏడీఏల బదిలీ జాబితా విడుదల
● అనంతపురం, హిందూపురం పెండింగ్ అనంతపురం అగ్రికల్చర్: బదిలీల ప్రక్రియలో భాగంగా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ)ల జాబితా ఎట్టకేలకు వెల్లడైంది. బదిలీల చివరి రోజైన ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 133 మందితో జాబితా విడుదల చేశారు. అయితే వెనువెంటనే జాబితాను వెనక్కి తీసుకున్నారు. 17 రోజుల తర్వాత తాజాగా బుధవారం అర్ధరాత్రి రెండో సారి 110 మందితో జాబితా విడుదల చేశారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది పరిస్థితి తేలలేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ చేపట్టడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలుకుబడి, ప్రజాప్రతినిధుల సిఫారసులు, పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొదటి జాబితాలో 9 మంది ఏడీఏలను బదిలీ చేస్తూ జాబితా ఇచ్చారు. తాజాగా విడుదలైన జాబితాలో ఏడుగురు ఏడీఏలను బదిలీ చేశారు. అత్యంత కీలకమైన అనంతపురం డివిజన్‌తో పాటు హిందూపురం డివిజన్లకు ఏడీఏలను కేటాయించకపోవడం గమనార్హం. బదిలీలు ఇలా... ఎస్.సత్యనారాయణ కదిరి నుంచి ఉరవకొండకు, ఎం.చెంకలరాయుడు తాడిపత్రి నుంచి కర్నూలు జిల్లా ఆలూరు, బి.క్రిష్ణమీనన్ మడకశిర నుంచి పెనుకొండ, జే.సనావుల్లా పుట్టపర్తి డీఆర్సీ నుంచి కదిరి, ఎల్.లక్ష్మానాయక్ రాయదుర్గం నుంచి ధర్మవరం, ఎస్.పద్మజ ఉరవకొండ నుంచి రాయదుర్గం, ఎం.రవి అనంతపురం నుంచి తాడిపత్రి బదిలీ అయ్యారు. అనంతపురం నుంచి రవి బదిలీ కాగా ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. హిందూపురంలో ఉన్న అల్తాఫ్ అలీఖాన్‌ను ఎక్కడకు బదిలీ అయ్యారనే విషయం అనేది కూడా తేలలేదు. ధర్మవరం ఏడీఏ క్రిష్ణయ్యను కూడా ఎక్కడకు బదిలీ చేశారనేది తేలాల్సివుంది. అనంతపురం ఏడీఏ స్థానానికి అల్తాఫ్ అలీఖాన్, క్రిష్ణయ్యల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదెక్కడి టోల్ బాదుడు?! చిలమత్తూరు: టోల్ ప్లాజాల వద్ద ఒకే ఎంట్రీకి రెండేసి సార్లు బిల్లులు డెబిట్ అవుతుండడంతో పలువురు వాహనదారులు మండిపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంది పుచ్చుకున్న ప్రస్తుత రోజుల్లో టోల్‌ప్లాజాల వద్ద వాహనాల ఎంట్రీని సులభ తరం చేసేందుకు ఫాస్ట్టాగ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాహనాలు టోల్ గేట్లోకి ప్రవేశించగానే ఫాస్ట్‌టాగ్ స్కాన్ అయి దాని ద్వారా ఎంట్రీకి సంబంధించిన రుసుం సదరు వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. ఈ క్రమంలో గురువారం హిందూపురానికి చెందిన అయూబ్ తన వాహనంలో వెళుతూ చోళసముద్రం టోల్‌ప్లాజా దాటారు. రెండు నిముషాల వ్యవధిలో రెండు సార్లు అతని బ్యాంక్ ఖాతా నుంచి టోల్‌ప్లాజా రుసుం డెబిట్ కావడంతో కంగుతిన్న అయూబ్ వెంటనే టోల్‌ప్లాజా సిబ్బందిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో జరిగిన మోసాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నెల 19న బాగేపల్లి టోల్‌ప్లాజా వద్ద కూడా ఇలాగే తన బ్యాంక్ ఖాతా నుంచి రెండు సార్లు నగదు డెబిట్ అయిందని వివరించారు. జరిగిన మోసంపై తాను సోషల్ మీడియా వేదికగా వాహనదారులను చైతన్య పరుస్తూ పోస్టు చేసినట్లు వివరించారు. టోల్‌ప్లాజా యాజమాన్యం దోపిడీపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. -
‘ఉద్యాన’ పథకాలు వినియోగించుకోండి
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెండు జిల్లాల ఉద్యానశాఖ డీడీలు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తోటల పెంపకంలో భాగంగా హెక్టారుకు మామిడి తోటలకు రెండు సంవత్సరాల్లో రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. జామకు రూ.80 వేలు, చీనీ రూ.50 వేలు, దానిమ్మ రూ.50 వేలు, సీతాఫలం రూ.30 వేలు, సపోటా రూ.30 వేలు, రేగు రూ.30 వేలు, ద్రాక్ష రూ.1.20 లక్షలు, టిష్యూకల్చర్ అరటి రూ.70 వేలు, బొప్పాయి రూ.30 వేలు, డ్రాగన్ ఫ్రూట్ రూ.2.70 లక్షలు, అవకాడో రూ.50 వేలు, అంజూర రూ.50 వేలు, ప్యాషన్ ఫ్రూట్ రూ.2.75 లక్షలు, ఉసిరి రూ.75 వేలు, నేరేడు రూ.75 వేలు, చింత రూ.75 వేలు, ఫల్సాఫ్రూట్ రూ.75 వేలు, విడిపూల సాగుకు రూ.50 వేలు, హైబ్రీడ్ కూరగాయల సాగు రూ.60 వేల మేర రెండేళ్లలో రాయితీ వర్తిస్తుందని తెలిపారు. పుట్టగొడుగుల పెంపకానికి రూ.2 లక్షలు రాయితీ ఉంటుందన్నారు. ముదురుతోటల పెంపకంలో భాగంగా 10 సంవత్సరాల పైబడి వయసున్న మామిడి, 8 సంవత్సరాల పైబడి కలిగిన చీనీ తోటలకు హెక్టారుకు రూ.24 వేలు రాయితీ ఇస్తామన్నారు. వ్యక్తిగత ఫారంపాండ్ల నిర్మాణానికి రూ.75 వేలు, పాలీహౌస్‌ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, షేడ్‌నెట్ హౌస్‌లకు రూ. 8.87 లక్షలు, మామిడి, అరటి ఫ్రూట్ కవర్స్‌కు రూ.25 వేలు, ప్లాస్టిక్ మల్చింగ్‌కు రూ.20 వేలు, ప్యాక్‌హౌస్‌లకు రూ.2 లక్షలు, మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్‌కు రూ.12.85 లక్షలు, మినీట్రాక్టర్కు 1.96 లక్షలు, పవర్ టిల్లర్‌కు రూ.లక్ష, తైవాన్ స్ప్రేయర్‌కు రూ.10 వేలు, టమాటా ట్రెల్లీస్కు రూ.18,750, హైబ్రీడ్ కూరగాయల విత్తనాలకు రూ.3 వేలు, శాశ్వత పందిళ్లుకు రూ.2.50 లక్షలు మేర రాయితీ వర్తిస్తుందని వివరించారు. అలాగే సోలార్కోల్డ్ రూంలు, సోలార్ క్రాప్ డయ్యర్లు, కోల్డ్‌స్టోరేజీల్లో కండెన్సర్ల మార్పు, రిఫర్వాన్, ప్లాస్టిక్ క్రేట్స్కు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన పండ్లతోటల రైతులు ఆర్ఎస్కే అసిస్టెంట్లు, హెచ్ఓలు, ఉద్యానశాఖ కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. రెండు జిల్లాల డీడీలు ఉమాదేవి, చంద్రశేఖర్ -
లుక్ పేరుతో బుక్ చేసేశారు!
అనంతపురం: రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేల ఆదాయం వస్తుందని నమ్మించారు. రూ.20,300 చెల్లిస్తే.. నిత్యం రూ.700 ఆదాయం వస్తుందని గాలం వేశారు. చివరికి రూ.కోట్లలో డిపాజిట్ చేయించుకుని బుక్ చేసేశారు. వివరాలు.. అమెరికన్ కంపెనీ ‘లుక్’ పేరుతో యాప్‌ను ప్రవేశపెట్టారు. పుస్తకాలు, గ్రంథాలు ఆన్లైన్లో చదివే ‘లుక్’ యాప్‌లో చందాదారుల పేరుతో దోపిడీ ప్రారంభించారు. రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేలు ఆదాయం వస్తుందని నమ్మించారు. ప్రతి బుధవారం నగదు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. రూ.20,300 చెల్లిస్తే.. రోజూ రూ.700 ఆదాయం వస్తుంది. ప్రతి రోజూ యాప్‌లో 25 టాస్క్‌లు ఉంటాయి. వీటిపై క్లిక్ చేస్తే ఒక్కో టాస్క్‌కు రూ.28లు నగదు క్రెడిట్ అవుతుంది. ఇలా ప్రతి బుధవారం నగదు డ్రా చేసుకోవచ్చు. కొత్త ఖాతాదారులను చేర్పిస్తే 30 శాతం వెంటనే నగదు ఖాతాలోకి జమ అవుతుంది. ఇలా ప్రారంభంలో అత్యంత నమ్మకంగా, కచ్చితంగా మొత్తాలను చెల్లించారు. అనంతపురం నగరంలోనే రూ.20 వేల చందాదారులు వేలల్లో ఉన్నారు. రూ.2.50 లక్షల చందాదారులు వందల్లో ఉన్నారు. బుధవారం డ్రా చేసుకునేందుకు క్లిక్ చేయగా, తక్షణమే 30 శాతం చెల్లిస్తే.. ఈ 30 శాతం ఖాతాలో ఉన్న మొత్తం అంతా డ్రా చేసుకోవచ్చని యాప్‌లో మెసేజ్ చేశారు. దీంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పోటీ పడి నగదు డిపాజిట్ చేశారు. అప్పులు చేసి మరీ డిపాజిట్ చేశారు. బుధవారం రాత్రి రూ.2.50 లక్షలు చెల్లించిన వారే అధికంగా ఉన్నారు. రూ.20 వేలు చెల్లించిన చందాదారులు తక్షణమే రూ.6,090 చెల్లించాలి. లేదంటే ఖాతా క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఉన్న ఫలంగా రూ.6,090 చెల్లించారు. ఇలా ఖాతాదారులకు అత్యాశ చూపించి బుధవారం రాత్రే అధికంగా మొత్తాలను కట్టించుకున్నారు. డబ్బు డ్రా చేయడంతో బ్యాంకు ప్రాసెస్‌లో ఉందంటూ గురువారం రాత్రి యాప్‌లో డేటాను తొలగించేశారు. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ‘లుక్’ పేరుతో కోట్లాది రూపాయలు దోచేశారని ఆందోళన చెందుతున్నారు. సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు ఫోన్లు చేస్తున్నారు. రూ.వందల కోట్లు డిపాజిట్ చేయించుకుని మోసం చేసిన వైనం రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేల ఆదాయం అంటూ గాలం అపరిమితంగా ఖాతాదారులను పెంచుకుని బురిడీ -
అధికారులందరూ సమన్వయంతో పనిచేయండి
ప్రశాంతి నిలయం/పుట్టపర్తి టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 5వ తేదీన కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉందని, అధికారులు సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతంచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. గురువారం కొత్తచెరువులోని జెడ్పీ బాలుర, బాలికల పాఠశాలలు, సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఎస్పీ వి.రత్న ,జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్లతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కొత్తచెరువులో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడతారన్నారు. సభా స్థలం, పార్కింగ్ స్థలాల్లో పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. -
అలా ముగించేశారు!
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. ‘తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు’ అన్న చందంగా మొండివైఖరితో ముందుకెళ్లింది. ఫలితంగా తక్కువ వేతనంతో పని చేస్తున్న వీరందరూ జిల్లా సరిహద్దు మండలాలకు వెళ్లాల్సి వచ్చింది. మొత్తం మీద వారిగోడును ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అలా ముగించేశారు. తొలిరోజు 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తికాగా, రెండోరోజు గురువారం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ ఉంటుందంటూ ఉదయం అందరికీ మెసేజ్‌లు పెట్టారు. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఖాళీల అంశంపై మాట్లాడే ప్రయత్నం చేసినా...డీఈఓ ప్రసాద్‌బాబు అంగీకరించలేదు. తన పరిధిలో లేని అంశం అని... కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఎవరైనా కౌన్సెలింగ్‌కు అటెండ్ కామని చెబితే మాత్రం అలాంటి వారికి నేరుగా కమిషనర్ కార్యాలయం నుంచే స్కూళ్లు అలాట్ చేస్తారని, అవి ఎక్కడొస్తాయో కూడా తెలీదంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండుమార్లు కౌన్సెలింగ్‌ను బాయ్‌కాట్ చేసినా ప్రభుత్వం కరుణించలేదని ఎంటీఎస్ టీచర్లు వాపోయారు. తక్కువ వేతనంతో పని చేస్తున్న తమపై ఇంత కక్షసాధింపుగా వ్యవహరించడం సరికాదని వాపోయారు. ఎట్టకేలకు అందరూ అంగీకరించడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అర్ధరాత్రి దాకా కొనసాగింది. 404 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ముందురోజు 190 మందికి 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. నిబంధనల మేరకే ఉన్న ఖాళీలను చూపించామని డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. ఏదిఏమైనా కౌన్సెలింగ్‌కు సహకరించి ప్రశాంతంగా జరిగేలా చేసిన ఎంటీఎస్ టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వానికి పట్టని ఎంటీఎస్ టీచర్ల గోడు బలవంతంగా బదిలీల కౌన్సెలింగ్ 1998 ఎంటీఎస్ టీచర్లకూ పూర్తయిన బదిలీలు దాదాపు సరిహద్దు మండలాలకు ఎక్కువగా కేటాయింపు -
అమ్మలపై అలసత్వం
4,085శ్రీసత్యసాయి జిల్లాలో హెచ్‌ఎంఐఎస్‌లో నమోదైన ప్రసవాలు5,280 సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అమ్మా పెట్టదు అడుక్కూ తిననివ్వదు’ అన్న చందమిది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం జేఎస్వై (జననీ సురక్ష యోజన) ప్రవేశపెట్టింది. ఈ పథకం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత ఘోరంగా అమలవుతున్నట్టు తేలింది. ఆస్పత్రిలో చేరిన గర్భిణి ప్రసవమై డిశ్చార్జ్ అయ్యేలోగా తల్లి వివరాలన్నీ యాప్‌లో నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. వివరాలన్నీ సరిగా పంపితే తల్లి ఖాతాలోకి రూ.1,500 వేస్తారు. కానీ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కనీసం 55 శాతం మందికి కూడా ఈ పథకం వర్తిచడం లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అంచనా వేయొచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపం.. అనంతపురంతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ‘జేఎస్వై’ పనితీరు దారుణంగా ఉంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 84 శాతం మంది తల్లులకు ‘జేఎస్వై’ కింద సొమ్ము అందగా, అనంతపురం జిల్లాలో కేవలం 56 శాతం మందికి మాత్రమే అందింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 64 శాతం మందికి మాత్రమే వర్తించింది. ప్రసవం జరిగిన ఆస్పత్రిలో దరఖాస్తు చేయకపోవడం వల్లే వేలాదిమంది బాలింతలు ఇలా తమకు వచ్చే కొద్దపాటి సొమ్మునూ కోల్పోతున్నారు. ఆస్పత్రులకు గర్భిణి రాగానే వివరాలు సేకరించి ఎంఎస్ఎస్ (మాతా శిశు సురక్ష) వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. భర్త పేరు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు అన్నీ పంపించాలి. కానీ ఈ వివరాలు పీహెచ్‌సీలు, సీహెచ్సీల్లోనూ అప్లోడ్ చేయడానికి సిబ్బంది లేరు. ఉన్నా చాలా చోట్ల వాళ్ల వివరాలు నమోదు చేయడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నమోదు లేకపోతే ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో అసలే కానరావడం లేదు. దీంతో వేలాది మంది బాలింతలకు లబ్ధి చేకూరడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 2024–25 సంవత్సరంలో 3 లక్షల మంది బాలింతలకు అందలేదు. అంటే ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున రూ.45 కోట్లు కోల్పోయారు. అంతేకాదు ‘జేఎస్వై’ సరిగా నమోదు కాకపోవడంతో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద రూ.6 వేలు కూడా చాలామంది కోల్పోతున్నారు. ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్ష్యంతో కేంద్రమిచ్చే నిధులకు పేద బాలింతలు నోచుకోవడం లేదు. ఎంఎస్ఎస్ (మాతా శిశు సురక్షలో నమోదు)బాలింతలకు కరువైన ‘జేఎస్వై’ భాగ్యం ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేకూరని లబ్ధి వేలమంది బాలింతలకు పైసా అందని వైనం ‘అనంతపురం’లో 56 శాతం, ‘శ్రీ సత్యసాయి’ 64 శాతం మందే దరఖాస్తు 3,42764.91 -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో ఆరుగురికి చోటు
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల నియామకంలో జిల్లాకు చెందిన ఆరుగురికి అవకాశం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర రైతు సంఘం విభాగం సెక్రటరీగా పీవీ భాస్కర్‌రెడ్డి (పుట్టపర్తి నియోజవర్గం) జాయింట్ సెక్రటరీలుగా ఎన్ రంగారెడ్డి, ఎం.వెంకటరెడ్డి (పుట్టపర్తి నియోజవర్గం), రాష్ట్ర ఐటీ విభాగం జనరల్ సెక్రటరీగా నల్లపరెడ్డి (రాప్తాడు), ఐటీ విభాగం సెక్రటరీలుగా రోహిత్‌రెడ్డి, (రాప్తాడు) సి.జయపాల్‌రెడ్డి (పుట్టపర్తి)లను నియమించారు. కృషి విజ్ఞాన కేంద్రం స్థాపనకు చర్యలు బత్తలపల్లి: మండల పరిధిలోని అప్పరాచెరువు గ్రామం వద్ద కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) స్థాపనకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ తోటగతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీలో డాక్టర్ సి.మధుమతి(అసోసియేట్ డైరెక్టర్, రాయలసీమ జోన్) అధ్యక్షత వహిస్తుండగా, సభ్యులుగా డాక్టర్ కె.సుబ్రమణ్యం, డాక్టర్ ఎం.శివప్రసాద్, డాక్టర్ ఎం.బాలకృష్ణ ఉన్నారు. గురువారం నిపుణుల బృందం అప్పరాచెరువు సమీపంలోని సర్వే నంబర్లు 96, 97, 63లో కలిపి కేటాయించిన 68 ఎకరాల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మట్టి నమూనాలు సేకరించి శాసీ్త్రయ పరీక్షల కోసం ల్యాబ్‌కి పంపారు. భూసేకరణపై గ్రామ సభలు ప్రశాంతి నిలయం: సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకై భూసేకరణపై గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ టి.ఎస్.చేతన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియలో భాగంగా సంబంధిత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను పొందిన తర్వాత సమగ్ర నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ మడకశిర: మండలంలోని గుండుమల గ్రామానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త దళిత మంజునాథ్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మడకశిర పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టణ టీడీపీ కార్యకర్త ఈశ్వరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ నగేష్ తెలిపారు. మంజునాథ్‌ని మడకశిర కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంజునాథ్ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, కుంచిటి వక్కలిగ వైఎస్సార్సీపీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంగేగౌడ్, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నాయకుడు అశ్వత్థనారాయణ, ఎస్సీ సెల్ కార్యదర్శి మంజునాథ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. పనస కాయల వాహనం బోల్తా కనగానపల్లి: బెంగళూరు నుంచి అనంతపురానికి పనస కాయల లోడ్‌తో వెళుతున్న బొలెరో వాహనం కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై బోల్తాపడింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మామిళ్ల పల్లి సమీపంలోని గ్లాస్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే వాహనం ముందరి టైర్లు రెండూ ఒక్కసారిగా పేలాయి. దీంతో రోడ్డుకు అడ్డంగా వాహనం బోల్తాపడింది. పనస కాయలన్నీ రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. ఘటనతో రూ.30 వేల మేర నష్టం వాటిల్లినట్లు అనంతపురానికి చెందిన వ్యాపారి పోతులయ్య వాపోయాడు. కాగా, ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. -
పారిశ్రామిక ప్రగతితోనే అభివృద్ధి
ప్రశాంతి నిలయం: ‘‘పరిశ్రమల స్థాపనతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. అందువల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ...జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి విస్తృత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. నూతన పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా వ్యవహరిస్తూ జిల్లా ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహం అందివ్వనున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే వారికి అవసరమైతే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులపై సమీక్షించారు. అనంతరం వివిధ పరిశ్రమలకు సంబంధించిన రాయితీలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడి రాయితీ కింద 3 యూనిట్లకు రూ.46.69 లక్షలు, వడ్డీ రాయితీ కింద 3 యూనిట్లకు రూ.1.70 లక్షలు మంజూరు చేశారు. అలాగే వివిధ దశల్లో ఉన్న భారీ, పెద్ద తరహా పరిశ్రమల ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, ఎల్డీఎం రమణకుమార్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి రాధాకృష్ణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ జిల్లా అధికారి కృష్ణకుమారి, ఏపీఎస్ఎఫ్సీ బ్రాంచ్ మేనేజర్ అన్సారీ తదితరలు పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం -
మా వాహనాలకు క్లియరెన్స్ ఇప్పించండి
● పౌరసరఫరాల కమిషనర్‌ను కోరిన ఎండీయూ ఆపరేటర్లు ధర్మవరం: రేషన్ బియ్యం పంపిణీ నుంచి తమను తప్పించినందున వెంటనే తమ వాహనాలకు క్లియరెన్స్ ఇప్పించాలని ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కోరారు. ఈ మేరకు వారు విజయవాడలోని సెక్రటేరియట్లో పౌరసరఫరాల కమిషనర్ సౌరబ్గౌర్ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిశోర్, సూర్యనారాయణ, రవికుమార్, సతీష్, దేవసహాయం, సుధాకర్‌రెడ్డి, సాంబశివరావు, రామంజనేయులు, సునీల్, వెంకట్, కేశవ, అక్బర్, హరి, కమలాకర్, ప్రతాప్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ...ప్రజలకు ఉపయోగపడే ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో వాహనాలపై ఆధారపడిన ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చాలా మంది జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఎండీయూ వ్యవస్థను ఎలాగూ రద్దు చేసినందున తమ వాహనాలకు క్లియరెన్స్ ఇప్పించడంతో పాటు బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరారు. అలాగే తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలని కోరారు. తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఆర్ఎస్కే సిబ్బంది బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ అనంతపురం సెంట్రల్: రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐదేళ్లు పూర్తయిన వారికి ఆఫ్‌లైన్‌లో, ఐదేళ్లలోపు సిబ్బంది రిక్వెస్ట్ బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రిక్వెస్ట్ బదిలీ ఉద్యోగులను వారి సొంత మండలంలో కాకుండా ఇతర మండలాల్లో పోస్టింగ్ కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేసే పనిలో ఆయా శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో 867 రైతు సేవా కేంద్రాలున్నాయి. అనంతపురం జిల్లాలో 126 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 124 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. వీరిలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు ‘అనంత’లో 101 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 102 మంది ఉన్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్లు ‘అనంత’లో 180 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 143 మంది ఉండగా అందరికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇక.. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సెరికల్చర్ అసిస్టెంట్లు ‘అనంత’లో 12 మంది, శ్రీ సత్యసాయిలో 73 మంది ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పశు సంవర్ధక శాఖకు సంబంధించి 666 మంది వెటర్నరీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. సీఎం పర్యటనకు స్థల పరిశీలన పుట్టపర్తి టౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 5వ తేదీన కొత్తచెరువుకు రానున్నట్లు జిల్లా అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ రత్న అధికారులతో కలిసి కొత్తచెరువులో పర్యటించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ జూలై 5వ తేదీన కొత్తచెరువుకు రానున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి సమావేశంతో పాటు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీంతో బహిరంగ సభ కోసం కొత్తచెరువు జూనియర్ కళాశాల మైదానాన్ని ఎస్పీ రత్న పరిశీలించారు. మైదానాన్ని త్వరితగతిన చదును చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ విజయకుమార్, సీఐలు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, నరేష్ మారుతీ శంకర్, తహసీల్దార్ బాలాంజనేయులు, ఎంఈఓ జయచంద్ర ఉన్నారు. -
సర్దుకుంటున్న రెడ్డెప్పశెట్టి
చిలమత్తూరు: నదిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మించడం...ఈడీ అటాచ్ చేసిన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను స్వాధీనం చేసుకోవడం... ఉద్యానశాఖ ద్వారా అక్రమంగా పాలీహౌస్, ఫారంపాండ్లను మంజూరు చేయించుకోవడం... విద్యుత్ చౌర్యం.. ఇలా..రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమ బాగోతాలు అన్నీఇన్నీ కావు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆయన చేసిన అవినీతి, అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తేగా అధికారులూ చర్యలకు సిద్ధమయ్యారు. కేసులన్నీ ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటుండటంతో భూములన్నీ విక్రయించి పలాయనం చిత్తగించేందుకు రెడ్డెప్పశెట్టి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ బడా రియల్టర్‌తో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. అయితే ప్రభుత్వ భూములను కలుపుకొని ధర చెప్పడంతో ఆ రియల్టర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవిక్షన్్ నోటీసు ఇవ్వగానే కోర్టుకు... అక్రమాల్లో ఆరితేరిన రియల్టర్ రెడ్డెప్పశెట్టి.. ఏదైనా ఇబ్బంది కలిగినా తప్పించుకునేందుకు సైతం ముందే దారులు వెదికి ఉంచుకున్నారు. అందువల్లే అతనిపై అన్ని కేసులు నమోదైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ● చిత్రావతి నదిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మించడంతో ఇరిగేషన్ అధికారులు చిలమత్తూరు పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అనంతరం ఎవిక్షన్ నోటీసు ఇవ్వగా..రెడ్డెప్పశెట్టి వెంటనే కోర్టును ఆశ్రయించారు. తాను రైతుల కోసం బ్రిడ్జి నిర్మించానని... దాన్ని తొలగిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందంటూ కోర్టు ఎదుట వాదన వినిపించారు. అయినా ఆరు నెలలు గడువు కావాలంటూ సమయం కోరారు. ● విద్యుత్ చౌర్యానికి సంబంధించి రూ.13 లక్షలు చెల్లించాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు నోటీసు ఇవ్వగా..దీనిపైనా రెడ్డెప్పశెట్టి కోర్టుకు వెళ్లాడు. అంత చెల్లించలేనని, నామమాత్రం ఇస్తానంటూ కోర్టుకు తెలిపాడు. ఇక తన పొలానికి దారి ఇవ్వలేదని ఓ రైతు చిలమత్తూరు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులోనూ ఆయనపై ఇప్పటి వరకూ చర్యలు లేవు. అలాగే రైతులను మోసం చేసి వారి పేరిట డ్రిప్ ఇరిగేషన్ కింద పథకాలు తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి సరిపెట్టారు. ఈడీ అటాచ్ చేసిన లేపాక్షి హబ్ భూములను స్వాధీనం చేసుకుని దర్జాగా అనుభవిస్తున్నా... ఇప్పటివరకూ చర్యలు లేవు. అధికారుల అంగీకారం వెనుక భారీ డీల్! భూములు విక్రయించాలని నిర్ణయించుకున్న రెడ్డెప్పశెట్టి...తన అక్రమాలపై ఇప్పటికే నోటీసులిచ్చిన అధికారులకు ఆరునెలలు గడువు ఇవ్వాలని లేఖ రాశారు. అందుకు అధికారులు సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. దీంతో ఆలోపు భూములన్నీ విక్రయించి బయటపడదామని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉంటున్న రెడ్డప్పశెట్టి ఇక్కడి అధికారులను పిలిపించుకుని డీల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా...రెవెన్యూశాఖ కనీసం కోర్టుకు స్థాయి అధికారి సహకరిస్తున్నట్లు ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. తప్పులు మెడకు చుట్టుకోవడంతో తప్పించుకునే ప్రయత్నం భూములన్నీ అమ్మకానికి పెట్టిన వైనం! లేపాక్షి హబ్ భూములు, ప్రభుత్వ భూములనూ విక్రయించేలా ప్లాన్ -
మద్యం రాసిన మరణ శాసనం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా సీఎం చంద్రబాబు మార్చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల నిర్వహణను దక్కించుకున్న ‘పచ్ఛ’ నేతలు నిబంధనలు తుంగలో తొక్కి వేళాపాళా లేకుండా విక్రయాలు చేపడుతున్నారు. దీంతో యువత మత్తులో జోగుతోంది. తాగుడు మానేయమని ఇంట్లో వారు ఒత్తిడి చేస్తే మందుబాబులు ఆత్మహత్యలకు వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనలు తరచూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో ఈ పరిస్థితి లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు సాగిస్తుండడంతో తమ పిల్లలు మత్తుకు బానిసలవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మద్యం రాసిన మరణ శాసనం. ఈ శాసనానికి బుధవారం ఇద్దరు యువకులు బలయ్యారు. ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమయపాలనలేని మద్యం విక్రయాలు ● మద్యానికి బానిసవుతున్న యువత ● తాగుడు మానేయమంటే ఆత్మహత్యలే ధర్మవరం అర్బన్: మద్యం తాగొద్దని భార్య చెప్పినందుకు మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మార్కెట్వీధిలో జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... మార్కెట్‌వీధికి చెందిన డ్రైవర్ రాజేంద్రప్రసాద్(30)కు భార్య చంద్రకళ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజూ మద్యం తాగి ఇంటికి వస్తుండేవాడు. తాగుడు మానేయాలని భార్య బతిమాలినా వినేవాడు కాదు. మద్యం మానేయమంటే తాను చనిపోతానంటూ తరచూ బెదిరించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఉన్న రూ.200 నగదు తీసుకుని మద్యం తాగి రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు. ఈ విషయంపై భార్య ప్రశ్నించడంతో ఏదో ఒకటి చేసుకుని చనిపోతానంటూ బెదిరించి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి హాల్లో నిద్రించాడు. రోజూ బెదిరించేది మామూలే కదా అనుకుని ఆమె కూడా పిల్లల పక్కన పడుకుని నిద్రపోయింది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో భార్యకు మెలకువ వచ్చి చూడగా హాల్లో నిద్రపోతున్న భర్త కనిపించలేదు. వంట గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్ హుక్కుకు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ● గుమ్మఘట్ట: తాగుడు మానేయమన్నందుకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజన్న, లక్ష్మక్క దంపతులకు నలుగురు కుమారులు కాగా, వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. కుమారుల్లో చివరి వాడైన శశికుమార్ (28)కు పెళ్లి కాలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానేయాలని కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఈ నేపథ్యంలో మంగళవారం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కుమారుడికి తల్లిదండ్రులు మరోసారి నచ్చచెప్పారు. తాగుడు మానేస్తే ఎవరైనా పిల్లనిచ్చేందుకు ముందుకు వస్తారని ఇప్పటికై నా మద్యం సేవించడం మానేయాలని హితవు పలికారు. దీంతో మనస్తాపం చెందిన శశికుమార్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు విషయాన్ని గుర్తించి బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అనుకున్నట్టే కానిచ్చేశారు!
● 2008, 1998 ఎంటీఎస్ టీచర్లకు వేర్వేరుగా బదిలీల కౌన్సెలింగ్ ● 2008 టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి అనంతపురం ఎడ్యుకేషన్: ఇప్పటికే రెండుమార్లు వాయిదా పడ్డ ఎంటీఎస్ టీచర్ల బదిలీల అంశంలో అధికారులు కొత్త పంథా ఎంచుకుని అనుకున్నట్టే చేశారు. సీనియార్టీ జాబితాలో 2008 ఎంటీఎస్ టీచర్లు ముందున్నారు. వీరి తర్వాతనే 1998 ఎంటీఎస్ టీచర్లు మొదలవుతారు. ఖాళీలన్నీ దూర ప్రాంతాల్లో ఉండడం.. ఉన్న వాటిలో 2008 ఎంటీఎస్ టీచర్లకు కాస్తా మంచివి దక్కుతాయి. రెండుసార్లు వాయిదా పడడంలో 1998 ఎంటీఎస్ టీచర్ల పాత్ర ఎక్కువగా ఉందని నిర్ణయానికి వచ్చిన విద్యాశాఖ... ఎంటీఎస్ టీచర్ల మధ్య ‘విభజించు–పాలించు’ సూత్రాన్ని అమలు చేసింది. 2008, 1998 వారికి వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో డీఈఓ పేరుతో మెసేజ్ పంపారు. ‘2008 ఎంటీఎస్ టీచర్లకు మాత్రమే సాయంత్రం 5 గంటలకు కౌన్సెలింగ్’ ఉంటుందని పేర్కొన్నారు. గొడవతో ఉద్రిక్తత.. సాయంత్రం 5 గంటలకు వచ్చిన 2008 ఎంటీఎస్ టీచర్లు..జాబితాలోని 50 మందికి మాత్రమే మంచి స్కూళ్లు వస్తాయని, తక్కిన 147 మంది దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని వాపోయారు. ఇలా రెండు గ్రూపులు విడిపోయి వాదించుకున్నారు. ఇక ‘కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జనరేట్ అవుతాయి.. ఎవరికి ఎక్కడొస్తాయో మీ ఇష్టం’ అంటూ విద్యాశాఖ సిబ్బంది బెదిరింపులకు దిగడంతో ఎంటీఎస్ టీచర్లు ఇరకాటంలో పడ్డారు. జాబితాలో ముందున్న వారు తాము కౌన్సెలింగ్‌లో పాల్గొంటామని చెప్పడంతో మరికొందరు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ సజావుగా ముగిసింది. ఇక.. నేడో, రేపో 1998 ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. -
జీతాలు ఇప్పించండి మహాప్రభో
● విద్యుత్ మీటర్ రీడర్ల వేడుకోలు పుట్టపర్తి టౌన్: మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్‌కుమార్‌ను ఆ శాఖ మీటర్ రీడర్లు వేడుకున్నారు. ఈ మేరకు బుధవారం పుట్టపర్తిలోని ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ సంపత్‌కుమార్‌ను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 20 ఏళ్లుగా మీటర్ రీడర్లుగా తాము పనిచేస్తున్నామని వివరించారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబపోషణ భారమైందన్నారు. కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకుపోయినా న్యాయం జరగలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఎస్కో అకౌంట్ ఓపెన్ చేసి జీతాలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. డిమాండ్ సాధనలో భాగంగా జూలై 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కిరణ్‌కుమార్, రవి, వినోద్, నరేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
మామిడి తోటల పరిశీలన
తలుపుల: జిల్లా వ్యాప్తంగా మామిడి తోటల రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై ‘చేదు మిగిల్చిన మామిడి’ శీర్షికన ‘సాక్షి’లో వెలుడిన కథనంపై ఉద్యాన శాఖ అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానిక వ్యవసాయాధి హరితతో కలసి ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్‌రెడ్డి బుధవారం తలుపుల మండలం టి.రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు వెంకటరమణ సాగు చేసిన మామిడి తోటను పరిశీలించారు. రైతులకు నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనని నిర్ధారించారు. బీమా, నష్ట పరిహారాల విషయం ప్రభుత్వ బీమా సంస్థల పరిధిలో ఉందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం ● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం సిటీ: గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సర్పంచులకు అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్‌లో గల డీపీఆర్సీ భవన్లో మూడ్రోజులుగా నిర్వహించిన డివిజనల్ స్థాయి శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ముగింపు సభకు జెడ్పీ సీఈఓ శివశంకర్ అధ్యక్షత వహించగా, చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక ప్రధాన భాగమన్నారు. ఇలాంటి తరుణంలో కేవలం ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై నంత మాత్రాన లక్ష్యం నెరవేరదన్నారు. పాలనలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకున్నప్పుడే రాజకీయాల్లో రాణించగలరన్నారు. ఇందుకు సరైన పరిజ్ఞానం, నైపుణ్యత, ఆత్మ విశ్వాసం అవసరమని పేర్కొన్నారు. మహిళా సర్పంచులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకొని, గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై అవగాహన పెంచుకోగలిగితే పాలనారంగంలోనూ మహిళలు తీసిపోరని నిరూపించినట్లు అవుతుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణను పూర్తి చేసుకున్న మహిళా సర్పంచులకు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య అభినందనలు తెలిపారు. అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి● రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మిక యూనియన్ అధ్యక్షుడు నాగభూషణ పుట్టపర్తి టౌన్: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మిక యూనియన్ అధ్యక్షుడు నాగభూషణ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగభూషణ మాట్లాడారు. జీఓ 36 ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. హెల్త్ అలవెన్స్‌లు, రిస్క్ అలవెన్సులు అమలు చేయాలని, ఆప్కాస్ కార్మికులందనీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి మల్లికార్జున, సీఐటీయూ మండల కార్యదర్శి పైపల్లి గంగాధర్, యూనియన్ నాయకులు రామయ్య, నరసింహులు, కేశవ, రమణ, రామదాస్, బెస్త గంగాధర్, గణేష్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.