ఏపీ సూపర్‌ కప్‌ విన్నర్స్‌ గోదావరి లెజెండ్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఏపీ సూపర్‌ కప్‌ విన్నర్స్‌ గోదావరి లెజెండ్స్‌

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

ఏపీ సూపర్‌ కప్‌ విన్నర్స్‌ గోదావరి లెజెండ్స్‌

ఏపీ సూపర్‌ కప్‌ విన్నర్స్‌ గోదావరి లెజెండ్స్‌

అనంతపురం అర్బన్‌: ఆర్‌డీటీ స్టేడియంలో బుధవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో సిటాడెల్‌ గోదావరి లెజెండ్స్‌ విన్నర్‌గా నిలిచి ఎఫ్‌సీ ఏపీసూపర్‌ కప్‌ ఫుట్‌బాల్‌–2026ను సొంతం చేసుకుంది. అదనపు సమయం తరువాత జరిగిన పెనాలిటీ షూటౌట్‌లో కోరమాండల్‌ ఎఫ్‌సీపై 3–0 గోల్స్‌తో విజయం సాధించి టైటిల్‌ను కై వసం చేసుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇరు జట్లు సమానంగా పోటీపడ్డాయి. నిర్ణీత సమయంలోనూ, అదనపు సమయంలోనూ గోల్స్‌ నమోదు కాలేదు. దృఢమైన రక్షణాత్మక ఆటతో ఇరు జట్ల డిఫెండర్లు ప్రత్యర్థులకు స్పష్టమైన గోల్‌ అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో విజేతను నిర్ణయించేందుకు మ్యాచ్‌ పెనాలిటీ షూటౌట్‌కు చేరింది.

గోల్స్‌గా మార్చిన గోదావరి లెజెండ్స్‌

పెనాలిటీ షూటౌట్‌లో గోదావరి లెజెండ్స్‌ ఎఫ్‌సీ ఆటగాళ్లు మూడు పెనాలిటీలను గోల్స్‌గా మార్చారు. రాజా దేబ్‌నాథ్‌, విఘ్నేష్‌ వేలమురగన్‌, రమేశోర్‌ మీతే గోల్స్‌ సాధించారు. గోల్‌ కీపర్‌ సచిన్‌ ఝూ రెండు కీలక పెనాలిటీలను అడ్డుకుని జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. ఈ విజయంతో గోదావరి లెజెండ్స్‌ ఎఫ్‌సీ ప్రతిష్టాత్మక ఏపీ సూపర్‌ కప్‌ను గెలుచుకోవడంతో పాటు రూ.10 లక్షల ప్రైజ్‌ మనీని అందుకుంది. టోర్నమెంట్‌లో కోరమాండల్‌, కొల్లేరు, పెన్నా, గోదావరి, విశాఖ, వంశధార, నల్లమల, తుంగభద్ర జట్లు పాల్గొన్నాయి. ఎనిమిది జట్ల మధ్య రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించి నాకౌట్‌ దశల ద్వారా విజేతను నిర్ణయించారు. ఈ గెలుపు గోదావరి లెజెండ్స్‌ ఎఫ్‌సీ స్టార్‌ ఆటగాడు, సహ యజమాని పృథ్వికి వ్యక్తిగతంగా కూడా మైలురాయిగా మారింది.

కలెక్టర్‌ ఆనంద్‌ అభిందన

ఏపీ సూపర్‌ కప్‌–2026 కైవసం చేసుకున్న గోదావరి లెజెండ్స్‌ జట్టును కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ అభినందించారు. కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో ఆటగాళ్లు పృథ్వి, షాజెబ్‌, రాజేష్‌లు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement