తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ దూరం | - | Sakshi
Sakshi News home page

తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ దూరం

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

తొలి

తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ దూరం

పుట్టపర్తి అర్బన్‌: తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజ బేగం పేర్కొన్నారు. బుధవారం జాతీయ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామంలోని వై జంక్షన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. మానవహారం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్యాన్సర్‌ ముందస్తు గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ 18 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్‌ చేశామన్నారు. 3,41,441 మందిని స్క్రీనింగ్‌ చేయగా బీపీ 60,144 మంది, షుగర్‌ 43,008 మంది, నోటి క్యాన్సర్‌ 186 మంది, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ 199 మంది, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ 162 మందిలో గుర్తించినట్లు చెప్పారు. పొగాకు వాడకం నివారించాలని, సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ జయించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా టీకాల అధికారి డాక్టర్‌ సురేష్‌, డీపీఎంఓ డాక్టర్‌ నాగేంద్ర నాయక్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ సునీల్‌, ఎపిడెమియాలజిస్ట్‌ బాలాజీ నాయక్‌, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భవ్య, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, సీహెచ్‌ఓ వన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం ప్రారంభం

అనంతపురం: స్థానిక సప్తగిరి సర్కిల్‌ సమీపంలోని సుభాష్‌రోడ్డులో మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యజమానులు మాట్లాడుతూ రిటైల్‌ ఫార్మాట్‌లు, విస్తృత శ్రేణి కలెక్షన్లు, మెరుగైన కస్టమర్‌ అనుభవం ద్వారా కీలకమైన ప్రాంతీయ మార్కెట్‌లలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నామన్నారు. సంప్రదాయలు, వివాహాభరణాలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నమ్మకం, పారదర్శకత, కస్టమర్ల నమ్మకాన్ని పెంపొందించుకుని రాయలసీమలోనే పెద్ద జ్యువెలరీ మాల్‌గా గుర్తింపు దక్కించుకుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, మలబార్‌ గోల్డ్‌ హెడ్‌ (రిటైల్‌ ఆపరేషన్స్‌,ఇండియా) సిరాజ్‌ పికే, జోనల్‌ హెడ్‌ (సెంట్రల్‌ ఆంధ్ర, రాయలసీమ) నిఖిల్‌ చంద్రన్‌, మహమద్‌ షరీజ్‌ (హైదరాబాద్‌ జోనల్‌ హెడ్‌), షానిబ్‌ (తెలంగాణ జోన్‌ హెడ్‌), హఫీజ్‌ మహమ్మద్‌ (డిప్యూటీ షోరూం హెడ్‌, అనంతపురం), తదితరులు పాల్గొన్నారు.

తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ దూరం1
1/1

తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement