10 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

10 మందికి గాయాలు

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

10 మం

10 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..

పెనుకొండ రూరల్‌: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పది మంది గాయపడ్డారు. పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకొంది. వివరాలు.. ఆదివారం హిందూపురం డిపో నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ అద్దె బస్సు ధర్మవరం బయలుదేరింది. మార్గమధ్యంలో పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని వై జంక్షన్‌ వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ క్రమంలో బస్సు కండక్టర్‌ చాంద్‌ బాషా, డ్రైవర్‌ వెంకటరమణ నాయక్‌తో పాటు ప్రయాణికులు భాస్కర్‌, చిన్న నరసప్ప, లక్ష్మమ్మ, సుజాత, కల్పన, వెంకటమ్మ, చెన్నకేశవ, శ్రీనాథ్‌ గాయపడ్డారు. సమాచారం అందుకున్న కియా స్టేషన్‌ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కండక్టర్‌ చాంద్‌ బాషా, చిన్న అంజనప్ప, కల్పనను ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన కియా పోలీసులు విచారణ చేస్తున్నారు.

10 మందికి గాయాలు 1
1/3

10 మందికి గాయాలు

10 మందికి గాయాలు 2
2/3

10 మందికి గాయాలు

10 మందికి గాయాలు 3
3/3

10 మందికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement