జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

ప్రశాంతి నిలయం: ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూర, ఎంఎస్‌ రాజు, కందికుంట వెంకట ప్రసాద్‌, కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, ఎస్పీ సతీష్‌కుమార్‌, జేసీ మౌర్య భరద్వాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, విద్య, వైద్య రంగాల్లో సాధించిన ప్రగతి, జిల్లాలో చేపట్టిన రహదారుల నిర్మాణం, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు వివరాలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం మంత్రి సత్యప్రసాద్‌ మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌ హిట్‌ చేశామన్నారు. కరువు ప్రాంతమైన శ్రీసత్యసాయి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతులకు డ్రోన్‌ సాంకేతికతను అందిస్తామన్నారు. జిల్లాకు తగినంత నిధులు కేటాయించామన్నారు. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ... జిల్లాకు సంబంధించి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి రైతులకు నీరు అందిస్తామన్నారు. జిల్లాలో ప్రతి చెరువు నీటితో నింపుతామన్నారు. బీసీ సంక్షేమం, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ... జిల్లాలో మల్బరీ సాగు విస్తీర్ణం మరింత పెంచాలన్నారు. ఈ మేరకు సెరికల్చర్‌ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మామిడికి ఫ్రూట్‌ కవర్ల కట్టే పద్ధతిపై అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

ఇన్‌చార్జ్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement