చందమామ దిశగా.. దూసుకెళ్లిన ఆర్టీమిస్‌–2 | Nasa launched four astronauts on first Moon mission | Sakshi
Sakshi News home page

చందమామ దిశగా.. దూసుకెళ్లిన ఆర్టీమిస్‌–2

Apr 2 2026 7:20 AM | Updated on Apr 2 2026 10:29 AM

Nasa launched four astronauts on first Moon mission

వాషింగ్టన్‌: అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుదూర గ్రహాలను అందుకునేందుకు జాబిల్లిని కేంద్రంగా చేసుకోవాలన్న లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టీమిస్‌–2 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నలుగురు వ్యోమగాములతో కూడిన, 32 అంతస్తుల ఎత్తైన, ‘స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌’తో కూడిన ‘ఓరియన్‌’ రాకెట్‌.. నింగిలోకి దూసుకుపోయింది.

ఇక, ‘ఓరియన్‌’ రాకెట్‌.. చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి, దాన్ని చుట్టి రానుంది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు పది రోజులపాటు రాకెట్‌లోనే ప్రయాణించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో చందమామపైకి మానవులను పంపించే మార్గం సుగమం అవుతుంది. ఈ ఈ ప్రయోగం ద్వారా అమెరికా, కెనడా వ్యోమగాములు రెయిడ్‌ వైస్‌మ్యాన్‌(కమాండర్‌), విక్టర్‌ గ్లోవర్‌(పైలట్‌), క్రిస్టినా కూచ్‌(మహిళా మిషన్‌ స్పెషలిస్ట్‌), జెరిమీ హాన్సెన్‌లు చందమామ సమీప కక్ష్యలోకి వెళ్లి వస్తారు. ఈ మొత్తం యాత్ర 8 అంకె ఆకృతిలో సాగనుంది. మొత్తం 10 రోజుల యాత్ర తర్వాత వీళ్లు ప్రయాణించే క్యాప్సూల్‌ పసిఫిక్‌ మహా సముద్రజలాల్లో పడిపోనుంది. ఈ ప్రయోగంలో చందమామపై వ్యోమగాముల ల్యాండింగ్‌ ఉండబోదు.

రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాక తొలిరోజు వీళ్లు భూకక్ష్యలో తిరిగి తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం మొదలెడతారు. కేవలం చందమామను వ్యోమగాములు దాదాపు 7,600 కిలోమీటర్ల ఎత్తు నుంచి పరిశీలించి తిరిగొస్తారు. ఆర్టీమిస్‌2 ప్రయోగంలో వ్యోమగాములు తమ రక్షణ కోసం ఓరియాన్‌ సంస్థ తయారుచేసిన ‘ఇంటిగ్రిటీ’క్యాప్సూల్‌లో పయనించారు. ఇది వ్యోమగాములు తిరుగుప్రయాణంలో గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచ్చినా వాళ్లకు ఎలాంటి హాని కల్గకుండా రక్షణనిస్తుంది. వాస్తవానికి ఆర్టిమిస్‌–2 ప్రయోగం ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. కానీ రాకెట్‌ నుంచి హైడ్రోజన్‌ ఇంధనం లీకేజీ కారణంగా ప్రయోగం వాయిదాపడింది. తర్వాత సమస్యను పరిష్కరించినా హీలియం పీడనవ్యవస్థ విఫలమవడంతో ప్రయోగం మళ్లీ వాయిదాపడింది. ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement