ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 47 మంది డుమ్మా
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 47 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు విద్యాధికారి చెన్నకేశవప్రసాద్ పేర్కొన్నారు. 25 కళాశాలల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ జరగ్గా ఉదయం జరిగిన పరీక్షలో 615 మందికిగాను విద్యార్థులకు 602 మంది, సాయంత్రం జరిగిన పరీక్షల్లో 717 మంది విద్యార్థులకు 683 మంది హాజరయ్యారన్నారు. రెండు విడతల్లోనూ మొత్తం 47 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
ముగ్గురికి షోకాజ్ నోటీసులు
లేపాక్షి: ఉపాధి పథకం కింద పనిచేసే అధికారులు, ఉపాధి సిబ్బందిపై జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడం, సమయపాలన పాటించక పోవడం, రికార్డులను అప్‌డేట్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రికార్డులు సక్రమంగా నమోదు చేయని టెక్నికల్ అసిస్టెంట్లు అయూబ్ అన్సార్, సీవీ రవికుమార్, మల్లికార్జునకు షోకాజ్ నోటీసులు, ఏపీఓ చంద్రశేఖర్, ఈసీ మధుసూదన్‌రెడ్డికి మెమోలిచ్చారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు
● పోలీసుల అదుపులో నలుగురు
బత్తలపల్లి: గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న నలుగురు దుండగులను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్లితే.. బత్తలపల్లి మండలం కట్టకిందపల్లి గ్రామ సమీపంలోని పాడుబడిన కాటమయ్యస్వామి ఆలయం వద్ద మంగళవారం ఉదయం ధర్మవరం పట్టణానికి చెందిన బసినేని సత్యనారాయణ అలియాస్ సత్తి, గాజుల హరికృష్ణ, మీసా శ్రీనివాసులు, బీరే రమేష్ గుప్త నిధుల కోసం ఆలయ సమీపంలో తవ్వకాలు చేపట్టారు. స్థానికులు వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, గడారు, పారను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను మంగళవారం లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 54 రోజులకుగాను హుండీలు లెక్కించగా రూ.91,29,512 నగదు, 4 గ్రాముల బంగారు, 170 గ్రాములు వెండి, విదేశీ కరెన్సీలు కెన్వయా (సిలింగ్)400, కెనడా డాలర్స్ 5, సింగపూర్ డాలర్లు 2 వచ్చాయన్నారు. హుండీల పర్యవేక్షణాధికారి ప్రసాద్, గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
భూ నిర్వాసితుల నిరసన
పెనుకొండ రూరల్: నాసన్, బెల్ కంపెనీలకు భూములుచ్చిన సోమందేపల్లి రైతులు పునరావాసం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు మంగళవారం నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెట్టిన అధికారులు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా పునరావాసం కల్పించడంలో విఫలమయ్యారన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఏఓకు అందజేశారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీఓ ఆనంద్‌కుమార్ ఫోన్ ద్వారా హామీ ఇచ్చారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 47 మంది డుమ్మా
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 47 మంది డుమ్మా


