జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఓ అధికారిపై అమి
హంద్రీ–నీవా సీఈ నాగరాజ రిటైర్డు
● 10 రోజులైనా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పజెప్పని వైనం
● ఆ సీటులో మరికొంతకాలం కొనసాగేందుకు ప్రయత్నాలు
● ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు
● రూ.వందల కోట్ల బిల్లుల మంజూరు కోసమేననే ఆరోపణలు
అనంతపురం సెంట్రల్ : జల వనరుల శాఖలో ఎన్నడూ లేనివిధంగా నయా ట్రెండ్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారినే తిరిగి కొనసాగించాలంటూ పట్టుబడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఆయన తప్ప సమర్థవంతమైన మరో అధికారి లేరా... ఇంత వరకూ ఆయన చేసిన సేవలు ఏమిటి అనే ప్రశ్నలు ఎవరికై నా ఉత్పన్నం కాకమానదు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రమే ఆయన సేవలు కావాలని ఒత్తిడి తెస్తుండడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రధాన కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టింది. కేవలం ఫేజ్–2 పరిధి (అనంతపురం, చిత్తూరు)లోనే రూ.1300 కోట్లు వెచ్చిస్తున్నారు. లైనింగ్ పనుల వల్ల భూగర్భజలాలు అభివృద్ధి చెందవని, నేరుగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకు నీరు తరలించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని రాజకీయపక్షాలే కాకుండా రైతులు సైతం వ్యతిరేకించినా పరిగణనలోకి తీసుకోకుండా ముందుకుపోయారు. రూ.వందల కోట్లు నీళ్ల ప్రాయంగా వెచ్చిస్తున్నారు. ఎక్కడేకానీ డిస్ట్రిబ్యూటరీ పనుల జోలికి వెళ్లకుండా ప్రధాన కాలువకు లైనింగ్ చేశారు. దాదాపు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. త్వరలో నీటి సరఫరా ఆగిపోతే మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు. రెండు నెలల కాలంలోనే రూ.వందల కోట్లు విలువ చేసే పనులు జరిగాయి. అయితే ఈ పనుల పర్యవేక్షణలో చీఫ్ ఇంజినీర్ (సీఈ) విధులు క్రియాశీలకం. ప్రస్తుతం పనిచేస్తున్న హంద్రీ–నీవా సీఈ నాగరాజ పదవీ కాలం జనవరి 30తో ముగిసింది. దాదాపు పది రోజులు కావస్తున్నా తదుపరి సీఈ ఎవరన్నది సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తన పదవీకాలాన్ని పొడిగించుకోవాలని సీఈ నాగరాజ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం ఓ మంత్రితో పాటు ఓ ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
ఓ ఎమ్మెల్యేకే రూ.వందల కోట్లు
హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు లైనింగ్ పనులతో పాటు గతంలో ఆధునికీకరణ పనులు కూడా దక్కించుకున్న ఓ కాంట్రాక్టు సంస్థకు అధిపతి అయిన ఎమ్మెల్యేకు రూ.వందల కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. దీంతో సదరు ఎమ్మెల్యే.. సీఈ పదవీకాలం పొడిగించేందుకు ప్రభుత్వ పెద్దలను ఒప్పిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు మంత్రి అండదండలు కూడా పుష్కలంగానే ఉన్నాయని జోరుగా చర్చించుకుంటున్నారు. ముందు నుంచి ఈ ఇద్దరి ఆశీస్సులతోనే సదరు అధికారి సీఈగా నియమితులయ్యారనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఎస్‌ఈగా ఉన్న ఆయనను అడహాక్ పదోన్నతిపై సీఈగా నియమించారు. తాజాగా పదవీ విరమణ చెందినా కూడా సీఈగా కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అవసరముంటే పొడిగించవచ్చు
ప్రభుత్వ అవసరాన్ని బట్టి అధికారుల పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. ఈఈ, ఎస్‌ఈల పదోన్నతుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ముఖ్యమైన అధికారుల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా సీఈ క్యాడర్ పోస్టుల్లో అధికారులు లేరు. ఈ నేపథ్యంలో నేను పదవీ కాలాన్ని పొడిగించాలని కోరాను. ఇంత వరకూ ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. గతంలో ఇతర జిల్లాల్లో ఈఈ పదవీకాలాన్ని పొడిగించారు. – నాగరాజ, చీఫ్ ఇంజినీర్, హంద్రీ–నీవా
జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఓ అధికారిపై అమి
జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఓ అధికారిపై అమి
జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఓ అధికారిపై అమి
జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఓ అధికారిపై అమి


