భగవంతుడితో ఆటలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

భగవంతుడితో ఆటలు సరికాదు

Feb 10 2026 8:08 AM | Updated on Feb 10 2026 8:08 AM

భగవంతుడితో  ఆటలు సరికాదు

భగవంతుడితో ఆటలు సరికాదు

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉషశ్రీ చరణ్‌

పెనుకొండ రూరల్‌: తిరుమల లడ్డూ కల్తీ అయ్యిందని తప్పుడు ప్రచారం చేస్తూ కూటమి నేతలు భగవంతుడితో ఆటలాడుతున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ అన్నారు. సోమవారం ఆమె పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. అబద్ధాలతో మేడలు కట్టే కూటమి నేతలు... ఎన్నో వివాదాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదించారన్నారు. దేవుడి లడ్డును కూడా కల్తీ అంటూ రాజకీయం చేస్తున్నారన్నారు. లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ కాలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లడ్డూ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలు తెలుసుకున్నారన్నారు. సీబీఐ ఆధ్వర్యంలో సిట్‌ నివేదికతో కూటమి నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. అందువల్లే ఇప్పుడు టాయిలెట్‌ క్లీనర్లు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. నిజంగా నెయ్యి కల్తీ జరిగి ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ లాంటి సంస్థలు బీజేపీ లాంటి జాతీయ పార్టీ ఊరుకునేవా అని ఆమె ప్రశ్నించారు. ఇది పూర్తిగా చంద్రబాబు కుట్ర మాత్రమేనన్నారు. రాజకీయాల కోసం భగవంతుడితో ఆటలు సరికాదని చంద్రబాబుకు, ఆయనకు వంత పాడుతున్న పవన్‌కళ్యాణ్‌కు హితవు పలికారు. ఇక చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌ పాలు కల్తీ అయినట్లు వార్తలు వస్తున్నాయని, వాటిపైనా టీడీపీ నేతలు స్పందించాలన్నారు. ఇప్పటికై నా అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం మాని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించాలన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేయడంలో చొరవ చూపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement