శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో శ్రీగిరి క్షేత్రం ఇల కై లాసాన్ని తలపిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
పరి వార దేవతామూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటూ ఉత్సవాన్ని ఆలయం వెలుపలకి తోడ్కొనివచ్చారు. కళాకారుల ప్రదర్శనలు కొనసాగుతుండగా.. మరో వైపు భక్తుల శివన్మామస్మరణతో పరమేశ్వరుడి పరమ భక్తుడైన భృంగి పులకించిపోయారు.


